హతవిధీ..! | jurala project | Sakshi
Sakshi News home page

హతవిధీ..!

Published Thu, Sep 4 2014 3:30 AM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

jurala project

కొల్లాపూర్ రూరల్: దిగువ జూరాల జెన్‌కో జలవిద్యుదుత్పత్తి కేంద్రం నీట మునిగిన సంఘటన మరిచిపోకముందే.. జిల్లాలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. జిల్లా వరప్రదాయిని, ఆరు నియోజకవర్గాల్లోని కరువు నేలలకు సాగునీరందించే అతిముఖ్యమైన ప్రాజెక్టుగా భావించే మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకం(ఎంజీఎల్‌ఐ)లోని ఐదు మోటార్లు బుధవారం పూర్తిగా నీట మునిగాయి.
 
  ప్రస్తుతం ఖరీఫ్‌కు నీరు విడుదల చేసే సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం రైతులకు మింగుడుపడని అంశమే. వివరాల్లోకెళ్తే.. కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని కృష్ణానది బ్యాక్‌వాటర్‌పై రూ.2995 కోట్ల వ్యయంతో ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇందులో భాగంగానే రూ.490 కోట్లతో ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్ నిర్మించారు. ఈ పనులు గతేడాది పూర్తయి.. ఇటీవలే ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఏర్పాటుచేసిన ఒకదాని తరువాత మరొకటి(స్టాండ్‌బైగా) ఐదు మోటార్లు విజయవంతంగా నడుస్తున్నాయి. కాగా, ఇటీవల కృష్ణానదికి భారీస్థాయిలో వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ప్రాజెక్టు అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు నాలుగో మోటార్‌ను ట్రయల్న్ ్రచేయాలని భావించారు. ఇదివరకే విజయవంతంగా పనిచేసిన నాలుగో మోటార్‌ను కంప్యూటర్ బటన్ ద్వారా మరోసారి ప్రారంభించారు. ఆ తర్వాత రెండు నిమిషాలకే పంపుహౌస్‌లోకి నీరు వస్తుండటాన్ని గమనించిన కార్మికులు ఇంజనీరింగ్ నిపుణులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే మోటార్ ట్రయల్న్‌న్రు నిలిపివేశారు. సర్టిపూల్ నుంచి భారీస్థాయిలో వరదనీరు వస్తుండడంతో చేసేది లేక కార్మికులు, నిపుణులు పైకి చేరుకున్నారు. సర్జిపూల్ వద్ద నాలుగో గేట్‌ను పూర్తిగా కిందికి దించినా కూడా లీకేజీ ఆగలేదు. దీంతో ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. పంప్‌హౌజ్‌లోకి నీరు చేరిన విషయం అధికారులు గోప్యంగా ఉంచారు.
 
  60 మీటర్లున్న సర్జిపూల్‌లో 43 మీటర్లమేర నీరు చేరింది. పంప్‌హౌస్‌లో 18మీటర్ల మేర నీరు చేరింది. రాత్రి 9గంటల వరకు పంపుహౌస్‌లో 18మీటర్ల వరకు నీరు చేరింది. నీటిని ఎత్తిపోసేందుకు జూరాల ప్రాజెక్టు నుంచి భారీ మోటార్లు, గజ ఈతగాళ్లను రప్పిస్తున్నారు. విషయం తెలిసిన ప్రాజెక్టు ఈఈ సురేష్ అధికారులతో ప్రాజెక్టు వద్ద వివరాలు సేకరిస్తున్నారు.
 
 భారీస్థాయిలో నష్టం
 ఐదుమోటార్లు నీటిలో మునిగిపోవడంతో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ప్రాజెక్టు నుంచి రెండు మోటార్ల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని ఎల్లూరు రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి సింగోటం రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. తద్వారా ఆయకట్టు రైతులకు సాగునీరు అందుతుం ది. ఈ సమయంలో మోటార్లు నీట మునగడంతో నీటి పంపింగ్ నిలిచిపోయింది. మరమ్మతులు శరవేగంగా కొనసాగితేనే పంపింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. నష్టంపై పూర్తిస్థాయిలో అంచనా వేయలేకపోతున్నామని ప్రాజెక్టు అధికారులు  తెలిపారు.  
 
 నిర్లక్ష్యమే నిండా ముంచింది
 ఎంజీఎల్‌ఐ ప్రాజెక్టుపై అధికారుల నిర్లక్ష్యం రైతులపాలిట శాపంగా మారింది. కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, జడ్చర్ల, వనపర్తి నియోజకవర్గాల్లోని 3.40లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు నిర్మించారు. ప్రాజెక్టు వద్ద ఐదు మోటార్లను ఏర్పాటుచేసి నీటిని ఎత్తిపోసేవిధంగా రూపొందించారు. పనులను పటేల్ కంపెనీ ఈపీసీ పద్ధతిలో పనులు చేస్తోంది.
 
 కాంట్రక్టర్లు ఆరునెలల తరువాత మోటార్లను తిరిగి ఏర్పాటుచేసి నీటివిడుదలను ఆరంభించారు. అయితే కృష్ణానది బ్యాక్‌వాటర్‌నుంచి సర్జిపూల్‌కు నీరు వచ్చే అప్రోచ్‌కెనాల్ సొరంగం వద్ద గేటు ఏర్పాటు చేయలేదు. దీంతో బ్యాక్‌వాటర్ వచ్చినప్పుడు నేరుగా నీరు సర్టిపూల్‌లోకి వస్తోంది. ఇక్కడి నుంచి పంప్‌హౌస్‌కు మధ్యలో ఉన్న గేట్లద్వారా మోటార్‌ను ప్రారంభించి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పంప్‌హౌస్‌లోకి తరుచుగా నీరు లీకేజీ అవుతుంది. 2010లో కూడా మొదటి మోటార్ ట్రయల్న్ ్రనిర్వహించినప్పుడు బ్రెస్టువాల్ పగిలి పంప్‌హౌస్‌లోకి నీరు వచ్చి చేరింది. అయితే ఎప్పటినుంచో అప్రోచ్ కెనాల్‌వద్ద గేట్‌ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement