తమను దూషించాడని ఓ వ్యక్తిపై తెలుగు తమ్ముళ్ల దాష్టీకం
తాళ్లతో కట్టేసి అమానవీయంగా ఈడ్చుకెళ్లిన టీడీపీ శ్రేణులు
నూజివీడు: టీడీపీ అరాచకాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. అధికార జులుంతో కన్నూమిన్నూ కానకుండా ప్రవర్తిస్తున్నారు. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరుకు చెందిన అచ్చి నాగరాజు సోమవారం మద్యం తాగి అదే గ్రామ టీడీపీ అధ్యక్షుడు అన్నే సురేష్‌కు ఫోన్ చేసి దూషించాడు. దీంతో సురేష్.. మరో ముగ్గురు టీడీపీ కార్యకర్తలు పోలవరపు శివరామకృష్ణ, కారుమంచి రాజు, కారుమంచి కిరణ్‌లతో కలిసి నాగరాజుపై దాడికి పాల్పడ్డాడు.
అంతటితో ఆగకుండా నాగరాజును తాళ్లతో బంధించి.. తీవ్రంగా దుర్భాషలాడుతూ ఈడ్చుకెళుతూ కారులో వేసుకుని రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అయితే నాగరాజును తాళ్లతో నిర్బంధించి ఈడ్చూకెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాపశివకిషోర్ దృష్టికెళ్లింది.
అమానవీయంగా ప్రవర్తించిన నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేయాలని ఎస్పీ ఆదేశించారు. ఈ మేరకు రూరల్ సీఐ రామకృష్ణ, రూరల్ ఎస్ఐ లక్ష్మణ్బాబులు నలుగురినీ అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment