
సాక్షి, అనకాపల్లి: ఏపీలో హోం మినిస్టర్ వంగలపూడి అనిత పేషీలో అవినీతి దందా కొనసాగుతోంది. మంత్రి అనిత అండతో పీఏ జగదీష్ అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడనే ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఫిర్యాదులు కూడా అందాయి. దీంతో, జగదీష్ అంశం చర్చనీయాంశంగా మారింది.
ఏపీ హోం మంత్రి అనిత పీఏ జగదీష్ అవినీతి దందా బయటపడింది. అనిత అండతో జగదీష్ అక్రమాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. బదిలీలు, పోస్టింగులు, సిఫార్సుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, సెటిల్‌మెంట్లు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆయన వ్యవహార శైలి, ప్రవర్తన దురుసుగా ఉందంటూ టీడీపీ నేతలే ఫిర్యాదులు చేయడం గమనార్హం. చివరికి టీటీడీ సిఫార్సు లేఖలను కూడా జగదీష్ అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి.
అలాగే, పేకాట శిబిరాల వద్ద వసూళ్లు, మద్యం దుకాణాల్లో వాటాల కోసం ఒత్తిడి తేవడం. ఉద్యోగుల బదిలీల్లో లక్షల వసూలు చేశారని విమర్శలు ఉన్నాయి. టీడీపీ నేతలనే తప్పుడు కేసుల్లో జగదీష్ ఇరికించినట్టు తెలుస్తోంది. మంత్రి తర్వాత తానే అన్నట్లు వ్యవహరించేవారని సమాచారం. ఎన్ని విమర్శలొచ్చినా అనిత ఆయన్ను పీఏగా తొలగించలేదు. దీంతో ఆమె అండదండలతోనే ఆయన ఈ అరాచకాలు, అక్రమ వసూళ్లు కొనసాగిస్తున్నారని విస్తృత ప్రచారం సాగింది. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
