
సాక్షి, అనకాపల్లి: కూటమి పాలనలో తనకు న్యాయం జరగలేదంటూ పెట్రోల్ బాటిలతో కలెక్టర్ కార్యాలయం ముందు ఓ టీడీపీ కార్యకర్త నిరసనకు దిగాడు. తన భూమిని కొంతమంది ఆక్రమించుకున్నారని.. న్యాయం జరగకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు కుటుంబంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ టీడీపీ కార్యకర్త బుద్ధా శ్రీను హెచ్చరించాడు.
అధికార పార్టీకి చెందిన తనకే న్యాయం జరగలేదని.. ఇక సామాన్యులకు ఏం న్యాయం జరుగుతుందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. లోకేష్‌ను కలిసిన న్యాయం జరగలేదన్నారు. రికార్డులు తారుమారు వెనక రాజకీయ నాయకుల ప్రమేయం ఉందన్న బుద్ధా శ్రీను.. న్యాయం జరగకపోతే కుటుంబంతో ఆత్మహత్యే గతి అంటూ వాపోయాడు.