'నా భర్తకు ఏదైనా జరిగితే అనితదే బాధ్యత: కల్యాణి | Varra Ravindra Reddy Wife Comments On Home Minister Anita, More Details Inside | Sakshi
Sakshi News home page

'నా భర్తకు ఏదైనా జరిగితే అనితదే బాధ్యత: కల్యాణి

Nov 6 2024 9:11 PM | Updated on Nov 7 2024 10:52 AM

Varra Ravindra Reddy Wife Comments On Home Minister Anita

సీకే దిన్నె పోలీసు స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు.

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సీకే దిన్నె పోలీసు స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విడుదల చేశారు. రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులను జిల్లా పార్టీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌ బాబు పరామర్శించారు.

అక్రమంగా తమను నిర్బంధించారని రవీంద్రారెడ్డి భార్య కల్యాణి ఆరోపించారు. తన భర్త ఆచూకీ తెలుపమంటే పోలీసులు నోటికొచ్చినట్లు మాట్లాడారన్న కల్యాణి.. తన ఆరోగ్యం బాగా లేక పడిపోతే కనీసం డాక్టర్‌ను కూడా పిలవలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ఏదైనా అయితే హోం మంత్రి అనితదే బాధ్యత అని కల్యాణి అన్నారు.

వైఎస్సార్‌ జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్‌ చేసిన పోలీసులు..  ఆయన కుటుంబ సభ్యులను కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(బుధవారం) ఉదయం రవీంద్రారెడ్డి భార్య కల్యాణి, సోదరుడు మల్లికార్జున రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులను తీసుకెళ్లిన పోలీసులు.. వారిని తొలుత వేముల పోలీస్‌ స్టేషన్‌కి తరలించగా, అనంతరం చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. ఎస్పీ మాట్లాడాలి.. తీసుకురమ్మని చెప్తే తెచ్చామంటూ పోలీసులు తెలిపారు. చివరికి స్టేషన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వస్తున్నారని తెలియడంతో వారిని వదిలేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement