శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో నలుగురు సైనికులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు ప్రమాదం జరిగిన కాసేపటికే చికిత్స పొందుతూ కన్నుమూయగా, చికిత్స పొందుతున్న మరో ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. దాంతో చనిపోయిన సైనికుల సంఖ్య 4కు చేరింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు.
శనివారం ఉదయం బాందీపుర(Bandipore) జిల్లా సదర్ కూట్ పయెన్ ప్రాంతంలో సైనికులతో ఓ ట్రక్కు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మొత్తంగా నలుగురు సైనికులు చనిపోయినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.
#WATCH | Bandipora, Jammu and Kashmir: Dr Masarat Iqbal Wani, Medical Superintendent of District Hospital Bandipora says, "5 injured were brought here, out of which 2 were brought dead, 3 injured who were in critical condition have been referred to Srinagar for further… https://t.co/8RBwynIEvt pic.twitter.com/UVYr8vTiVk
— ANI (@ANI) January 4, 2025
ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్‌లో ఈ తరహా ప్రమాదాలు కొత్తేం కాదు. గతేడాది డిసెంబర్‌లో ఫూంచ్ జిల్లాలో ఇదే తరహాలో ఆర్మీ వాహనం పడిపోయి ఐదుగురు సైనికులు మృతి చెందారు. అంతకు ముందు.. నవంబర్ నెల 4వ తేదీన రాజౌరీ(Rajaouri)లో జరిగిన యాక్సిడెంట్‌లో ఓ జవాన్ చనిపోయాడు. అదే నెల 2వ తేదీన ఓ కారు రెయిసి జిల్లాలో లోయలో పడిపోయి నెలల పసికందు, తల్లి సహా ముగ్గురు మృతిచెందారు.
Comments
Please login to add a commentAdd a comment