బందీపూర్ లో కూలిన ఆర్మీ హెలికాప్టర్
బందీపూర్: సైనిక దళానికి చెందిన హెలికాప్టర్ ఒకటి బుధవారం సాయంత్రం జమ్మూకశ్మీర్ లోని బందీపూర్ లో కూలిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించివుంటారని ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాదానికి కారణాలు వెంటనే తెలియలేదు. ఆకాశం నుంచి ఏదో కిందకు పడడం చూశానని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు.