సాక్షి, అనంతపురం: అనంతపురంలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి మధ్య నువ్వా నేనా అన్నట్టుగా రాజకీయ పోరు పీక్ స్టేజ్‌కు చేరుకుంది. ఓ స్థలం విషయంలో వీరి మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. జిల్లాలో ప్రభుత్వ భూమి విషయంలో టీడీపీ నేతల ఆధిపత్య పోరు నడుస్తోంది. టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. అయితే, అనంతపురం అర్బన్ నియోజకవర్గం రాజీవ్ కాలనీలో మూడు ఎకరాల వంకపోరంబోకు స్థలాన్ని టీడీపీ నేతలు ఆక్రమించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు.. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై దాడి చేసి స్థలం ఖాళీ చేయించారు.
అనంతరం, ప్రభుత్వ వంకపోరంబోకు స్థలంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వర్గీయులు పాగా వేశారు. దీంతో, టీడీపీలోని ఇరువర్గాల మధ్య ఘర్షణ, పరస్పరం దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో దగ్గుపాటి ప్రసాద్ మోసం చేశారంటూ మరో వర్గం నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కల్పించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, ఈ విషయంపై స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment