సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. కప్పం కట్టాలంటూ కోళ్ల వ్యాపారిని బెదిరిస్తూ.. యథేచ్ఛగా బరితెగించారు. తెలంగాణ కేంద్రంగా కోళ్ల వ్యాపారం చేస్తున్న స్నేహ కంపెనీపై టీడీపీ నేత గణేష్ నాయుడు బెదిరింపులకు దిగారు. బెదిరింపులకు దిగారు. తనతో సెటిల్ చేసుకోకపోతే అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కోళ్ల క్రయవిక్రయాలు జరగనివ్వనంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్ర
తూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు.
పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు.
టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్‌లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment