Trader
-
అనంతపురం: టీడీపీ నేతల బరితెగింపు.. ఆడియో వైరల్
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో టీడీపీ నేతల ఆగడాలు ఆగడం లేదు. కప్పం కట్టాలంటూ కోళ్ల వ్యాపారిని బెదిరిస్తూ.. యథేచ్ఛగా బరితెగించారు. తెలంగాణ కేంద్రంగా కోళ్ల వ్యాపారం చేస్తున్న స్నేహ కంపెనీపై టీడీపీ నేత గణేష్ నాయుడు బెదిరింపులకు దిగారు. బెదిరింపులకు దిగారు. తనతో సెటిల్ చేసుకోకపోతే అనంతపురం, తాడిపత్రి ప్రాంతాల్లో కోళ్ల క్రయవిక్రయాలు జరగనివ్వనంటూ హుకుం జారీ చేశారు. టీడీపీ నేతల వార్నింగ్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వైఎస్సార్సీపీ నాయకుడి ఇల్లు కూల్చివేతకు కుట్రతూర్పుగోదావరి జిల్లా: గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, మండల సేవాదళ్ అధ్యక్షుడు ముచ్చికర్ల రవి ఇంటిని కూల్చేందుకు టీడీపీ నాయకులు కుట్ర పన్నారు. ఇంటిని కూల్చివేసేందుకు శుక్రవారం సుమారు 100 మంది పోలీసులు, జేసీబీతో టీడీపీ నాయకులు అతడి ఇంటిని చుట్టుముట్టారు. రవి కుటుంబ సభ్యులు 40 ఏళ్లపాటు పంచాయతీ పోరంబోకు భూమిలో పూరిగుడిసెలో ఉన్నారు.పదేళ్ల క్రితం రెవెన్యూ అధికారులు పట్టా మంజూరు చేశారు. గత ఏడాది రేకుల షెడ్డు నిర్మించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో రవి చిట్యాలలో బలమైన నాయకుడిగా పనిచేశాడని టీడీపీ నాయకులు అతనిపై కక్ష పెట్టుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రవి ఇంటిని తొలగించాలంటూ గ్రామ కార్యదర్శితో నోటీసులు జారీ చేయించారు. రవి హైకోర్టునుంచి స్టే తెచ్చుకున్నాడు.టీడీపీ నాయకులు స్టే ఆర్డర్‌ను ఎత్తివేయించి మళ్లీ పంచాయతీ ద్వారా నోటీసులు పంపారు. టీడీపీ నాయకులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు కలసి రవి ఉంటున్న రేకుల షెడ్డును తొలగించడానికి పూనుకున్నారు. అప్పటికే రవి హైకోర్టు నుంచి మరో స్టే ఆర్డర్ తీసుకున్నాడు. అయినా ఇబ్బందిపెట్టడంతో హైకోర్టు ప్రభుత్వ లాయర్‌తో ఫోన్లో మాట్లాడించాడు. దీంతో చేసేదేమీలేక వెనుదిరిగారు. ఒక్కసారిగా పోలీసులు ఇంటిని చుట్టుముట్టడంతో రవి తలి వరలక్ష్మి గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆమెను వెంటనే 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. -
మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!
Debt-Hit UP Trader Attempts Assassination In Live FacebooK: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో బూట్ల వ్యాపారం చేసే రాజీవ్ తోమర్ అప్పుల బాధలతో భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పైగా ఆ ఘటనకు సంబంధించిన వీడియోని కూడా ఆ వ్యాపారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద కలకలం రేపింది. అంతేకాదు ఆ వీడియోలో అతని భార్యతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది. పైగా ఆ వీడియోలో వ్యాపారి భార్య చనిపోవడానికి ముందు తన భర్తని పాయిజన్ తీసుకోకుండా ఆపడానికి యత్నిస్తున్నట్లు ఉంటుంది. అయితే ఈ ఘటనలో ఆ వ్యాపారి భార్య మరణించింది. కానీ రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు నిమిషాల నిడివి గల ఫేస్బుక్ లైవ్ వీడియోలో తోమర్ మాట్లాడుతూ..."నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. నేను చనిపోయినా అప్పులు తీరుస్తాను. అయితే నేను ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు దేశం పై నమ్మకం ఉంది. నేను దేశ వ్యతిరేకిని కాను. ప్రదాని నరేంద్ర మోదీజీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ముమ్మాటికి చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషులు కాదు. మీ విధానాలను మార్చుకోండి. జీఎస్టీ వల్ల నా వ్యాపారం దెబ్బతింది” అని తోమర్ కన్నీటిపర్యంతమయ్యాడు. అయితే ఈ వీడియోని వీక్షించిన కొంత మంది నెటిజన్లు పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ భార్య భర్తలని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్లో " బాగ్పత్లోవ్యాపారవేత్త అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాజీవ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు యూపీ అంతటా చిన్న వ్యాపారులు ఈ రకమైన బాధలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పైగా నోట్ల రద్దు, జీఎస్టీ లాక్డౌన్ సామాన్య జనాన్ని చాలా బాధించాయి అని కూడా వ్యాఖ్యానించారు. (చదవండి: విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ) -
8 కిలోల బంగారంతో వ్యాపారి అదృశ్యం
మంగళగిరి : సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన 8కిలోల బంగారంతో ఓ వ్యాపారి ఉడాయించి.. పలువురిని నిండా ముంచిన ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బంగారం వ్యాపారి పి.దిలీప్‌కుమార్ గత కొన్నేళ్లుగా బంగారు వ్యాపారుల వద్ద బంగారం తీసుకుని వస్తువులు చేసి ఇవ్వడం, చేసిన వస్తువులను ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి విక్రయించి నగదు తెచ్చి ఇస్తూ నమ్మకంగా వ్యవహరించేవాడు. శ్రావణమాసం కావడంతో గత 15 రోజుల నుంచి పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు దిలీప్‌కి సుమారు ఎనిమిది కిలోల బంగారం ఇచ్చి వస్తువులు చేయాలని కోరారు. పట్టణానికి చెందిన జి.రమేష్ 180 గ్రాములు, దీపాల బుజ్జి 609, అందె వెంకటసత్యనారాయణ 5000, బిట్రా సుబ్బారావు 1000, మునగాల సురేష్ 180, బేతు సత్యనారాయణ 411, జి.సురేష్ 308, ఎం. చంద్రశేఖర్ 388, దామర్ల వెంకటేశ్వర్లు 200 గ్రాములు.. ఇలా మొత్తం 8కిలోల 276 గ్రాముల బంగారం ఇచ్చారు. అయితే బంగారంతో ఉన్న బ్యాగు విజయవాడలో తాను బాత్రూమ్కు వెళ్లి వచ్చేసరికి మాయమైందని ఓ లేఖ రాసి ఇంటిలో ఉంచిన దిలీప్ శనివారం నుంచి అదృశ్యమయ్యాడు. సదరు వ్యాపారులకు బంగారం తిరిగి ఇచ్చే స్థోమత తనకు లేదని, బంగారం పోయిన విషయంలో బాధ్యతంతా తనదేనని.. తన తల్లిదండ్రులకు, భార్యకు ఎలాంటి సంబంధం లేదని లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సుమారు రూ.4కోట్ల విలువైన బంగారంతో దిలీప్ ఉడాయించడంతో అవాక్కయిన బాధితులు సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరోనా వేళ.. పాడి వ్యాపారి వినూత్న ఆలోచన
మదనపల్లె సిటీ (చిత్తూరు జిల్లా): కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఆ కోవలోనే మదనపల్లె పట్టణ సమీపంలోని సుధాకర్ అనే పాడి వ్యాపారి కాస్త వినూత్నంగా ఆలోచించి సురక్షిత పద్ధతిలో పాల కొనుగోలు, అమ్మకాలను సాగిస్తున్నారు. ఇంటి ముందు ప్రధాన గేటు వద్దనే రెండు పెద్ద పైపులు ఏర్పాటు చేశారు. అందులో ఒకటి పాడి రైతులు తనకు పాలు పోయడానికి, మరో పైపు కొనుగోలుదారులకు తాను పాలు పోయడానికి ఏర్పాటు చేసుకున్నారు. కొనుగోలుదారులు డబ్బులు గేటు వద్ద పెడితే ఎన్ని లీటర్లు కావాలంటే అన్ని పైపు ద్వారా పంపుతున్నారు. పాడి రైతులు తీసుకొచ్చే పాలు పైపులో పోస్తే లోపల క్యానులో పడుతున్నాయి. పాలు కొలత కోసం వేబ్రిడ్జి కూడా ఏర్పాటు చేశారు. కరోనా ప్రబలకుండా భౌతికదూరం పాటించేందుకు సుధాకర్ చేసిన ఈ సరికొత్త ఆలోచన పలువురిని ఆకర్షిస్తోంది. చదవండి: కుట్రలు బయటపడతాయని బాబు గగ్గోలు కరోనాతో మాజీ మంత్రి నాగిరెడ్డి కన్నుమూత -
తోపుడుబండి వ్యాపారి.. మునిసిపల్ చైర్మన్
కళ్యాణదుర్గం రూరల్: తోపుడు బండిపై బొప్పాయి, మామిడి, కర్బూజ తదితర పండ్లు విక్రయించే ఓ చిరు వ్యాపారిని మునిసిపల్ చైర్మన్ పీఠం వరించింది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్‌గా తలారి రాజ్‌కుమార్ ఎన్నికయ్యారు. ఇంటర్ చదివిన రాజ్‌కుమార్‌కు భార్య విజయలక్ష్మి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషణకు తోపుడుబండిపై పండ్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వైఎస్సార్సీపీపై అభిమానంతో కార్యకర్తగా సేవలందిస్తున్నారు. మునిసిపల్ ఎన్నికల్లో 10వ వార్డు బీసీ జనరల్‌కు రిజర్వు కాగా.. వైఎస్సార్సీపీ టికెట్ రాజ్‌కుమార్‌కు లభించింది. ఎన్నికల్లో పోటీకైతే దిగాడు కానీ కనీస ఖర్చు కూడా పెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోయింది. దీంతో ఇంటింటికీ తిరుగుతూ పేదోడిని ఆదరించాలంటూ ఓటర్లను వేడుకున్నారు. సీఎం వైఎస్ జగన్‌పై ప్రజలకున్న అభిమానం రాజ్‌కుమార్‌కు ఓట్ల వర్షం కురిపించి కార్పొరేటర్‌గా గెలిపించింది. ఇప్పుడు ఏకంగా మునిసిపల్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. చదవండి: నాడు కట్టెలు కొట్టిన మహిళ.. నేడు చిత్తూరు మేయర్ మామ అటెండర్‌గా పనిచేసిన చోట..నేడు కోడలు మేయర్ -
ప్రభుత్వ కళ్లు గప్పి రూ.110 కోట్లకు టోకరా
పుణె: లొసుగులను ఆసరాగా చేసుకుని ప్రభుత్వానికి ఏకంగా వందల కోట్ల మేర టోకరా వేసేందుకు ప్రయత్నించిన వ్యాపారవేత్తను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో జరిగింది. వస్తు సేవల (జీఎస్టీ) అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. రూ.110 కోట్ల విలువైన బోగస్ ఇన్వాయిస్లు జారీ చేసిన పుణేకు చెందిన వ్యాపారవేత్త బాబుషా శ్రణప్ప కస్బేను మహారాష్ట్ర వస్తు సేవల అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడిని ఈనెల 25వ తేదీ వరకూ జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. కస్బే రూ 16.86 కోట్ల ఇన్పుట్ ట్యాక్స్‌ను ఎలాంటి సరుకు, సేవలను డెలివరీ చేయకుండానే గుర్తింపు పొందిన సంస్థల ఖాతాలకు మళ్లించాడు. ఇది గుర్తించిన మహారాష్ట్ర వస్తు, సేవల చట్టం, కేంద్ర వస్తు సేవల చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా అతడి కదలికలను గమనించి మంగళవారం కస్బేను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అనంతరం పుణేలోని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా జ్యుడిషియల్ కస్టడీకి తరలించాలని న్యాయమూర్తి ఆదేశించారు. -
రూ. కోట్ల వ్యాపారం వదిలి..సొంతూరుకు కదిలి..
సాక్షి, న్యూఢిల్లీ : కల్లోల కశ్మీర్లో ఉద్రిక్తతల నడుమ బతకలేక 29 ఏళ్ల పాటు అజ్ఞాతంగా గడిపిన కశ్మీరీ పండిట్ వ్యాపారవేత్త రోషన్ లాల్ మవా తిరిగి స్వస్ధలం శ్రీనగర్ డౌన్టౌన్లో తన వ్యాపారాన్ని పునరుద్ధరించేందుకు అడుగుపెట్టాడు. పుట్టిన చోటే కన్నుమూయాలనే కోరికతో రూ 500 కోట్ల వ్యాపారాన్నీ వదులుకుని పోయిన చోటే వెతుక్కోవాలంటూ సొంతూరికి చేరుకున్న 75 ఏళ్ల మవాకు శ్రీనగర్‌లో ముస్లింలు, హిందువులు ఏకమై స్వాగతించారు. వేర్పాటువాదుల ప్రాబల్యం కలిగిన శ్రీనగర్ పాతబస్తీలో ఉగ్ర మూకలు 1990లో జరిపిన కాల్పుల్లో గాయపడ్డ మవా ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుని అక్కడే స్ధిరపడ్డా తన చివరి రోజుల్లో స్వస్ధలంలో గడపాలన్న ఆయన కల మాత్రం ఇప్పటికి నెరవేరింది. 29 ఏళ్ల తర్వాత తన పూర్వీకుల నుంచి సంక్రమించిన వ్యాపారాన్ని బుధవారం తిరిగి ప్రారంభించారు. మవా తిరిగి తన షాప్‌ను ప్రారంభించే సమయంలో పెద్దసంఖ్యలో స్ధానిక ముస్లింలు చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు. మవాను స్వాగతిస్తూ ఆయనకు సంప్రదాయ తలపాగా అమర్చి ఆయన కుటుంబ సభ్యులను సాదరంగా ఆహ్వానించారు. ఇరు మతాలకు చెందిన ప్రజలు స్వీట్లు పంచుకుని వేడుక చేసుకున్నారు. 1990, అక్టోబర్ 13న కొందరు తనపై కాల్పులకు తెగబడంతో తన పొత్తికడుపులోకి నాలుగు బుల్లెట్లు చొచ్చుకుపోయాయని, ఘర్షణల ప్రభావంతో తాము ఢిల్లీకి వలస వెళ్లి అక్కడ స్ధిరపడ్డామని మవా చెప్పుకొచ్చారు. దేశ రాజధానిలో వ్యాపారం వేళ్లూనుకున్నా తన హృదయం, ఆత్మ కశ్మీర్ కోసమే పరితపించేవని చెప్పారు. ఢిల్లీలో తమ వ్యాపారం అద్భుతంగా రాణించినా తనకు ప్రశాంతత లేదని అన్నారు. చివరి రోజులు కశ్మీర్లో గడపాలన్న చిరకాల వాంఛ ఇప్పటికి తీరిందని చెప్పారు. కాగా, చావైనా..బతుకైనా కశ్మీర్లోనేనని తన తండ్రి తరచూ చెబుతుండేవాడని, ఆయన కొడుకుగా ఇప్పుడు తాను ఆయన కోరికను నెరవేర్చానని మవా కుమారుడు డాక్టర్ సందీప్ అన్నారు. రూ 500 కోట్ల వ్యాపార సామ్రాజ్యం ఉన్నా గతంలో తాము అనుభవించిన వాతావరణం కోసం కశ్మీర్లో సుగంధ ద్రవ్యాలు, డ్రైఫ్రూట్స్ వ్యాపారాన్ని మవా కుటుంబం చిన్నస్ధాయిలో ఆరంభించడం విశేషం. మరోవైపు తమ ఊరి బిడ్డ తిరిగి జన్మభూమిలో అడుగుపెట్టడం ఆనందంగా ఉందని స్ధానిక ముస్లింలు సంతోషం వ్యక్తం చేశారు. కశ్మీరీ పండిట్లు అందరూ తిరిగి రావాలని కోరుకుంటున్నామని, ఇక్కడ ఎలాంటి భయాందోళనలు లేవని స్ధానిక ముస్లిం ముఖ్తార్ అహ్మద్ చెప్పుకొచ్చారు. -
యువతిని స్నేహం పేరుతో నమ్మించి...
న్యూఢిల్లీ : డబ్బుకోసం ఓ యువతిని స్నేహమంటూ నమ్మించి ఆపై విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన శుక్రవారం న్యూఢిల్లీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు... న్యూఢిల్లీకి చెందిన 28ఏళ్ల వస్త్రాల వ్యాపారి జూదం కారణంగా దాదాపు రూ.50లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు. అప్పులకు తోడు ఓ ఖరీదైన కారును లోన్‌లో తీసుకున్నాడు. దీంతో ఎలాగైనా అప్పులు మొత్తం తీర్చేయ్యాలన్న కసితో ఓ పన్నాగం పన్నాడు. అదే ప్రాంతానికి చెందిన 21ఏళ్ల సంపన్న యువతితో స్నేహం పెంచుకున్నాడు. యువతి ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నట్లు తెలుసుకున్నాడు. అదే అదునుగా భావించిన ఆ వ్యాపారి.. ఆ ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్నపుడు వెళ్లి ఆమెను చంపి డబ్బుతో చెక్కేయాలనుకున్నాడు. పథకం ప్రకారం బ్యాగులో కత్తి, సుత్తె, పెనాయిల్తో వేలి ముద్రలు పడకుండా ఉండటానికి చేతులకు సాక్సులు ధరించి స్కూటర్లో యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటి తలుపులు కొట్టగానే యువతి బయటకు వచ్చింది. అతడు వెంట తెచ్చుకున్న కత్తితో యువతిని మూడు సార్లు పొడిచాడు. అయితే ఆ సమయంలో ఇంట్లో వేరే వ్యక్తులు ఉన్నారని గ్రహించి అక్కడినుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించగా ఆమెకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. యువతి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అవ్వటంతో నిందితున్ని తొందరగానే పట్టుకోగలిగారు. -
450 కిలోల వెండి ఆభరణాలతో పరార్
హైదరాబాద్: నగరంలోని ఓ మహిళా వ్యాపారిని రాజస్తాన్ వాసి నమ్మించి మోసం చేసి సుమారు రూ.1.80 కోట్ల విలువ చేసే 450 కిలోల వెండి ఆభరణాలతో పరారయ్యాడు. హైదరాబాద్ యూసుఫ్‌గూడ సమీపంలోని శ్రీ కృష్ణనగర్‌లో మహిళా వ్యాపారి ధర్మిష్ట జైన్ (34) మూడేళ్లుగా శ్రీ నకోడా సిల్వర్ పేరుతో వెండి ఆభరణాల షాప్ నడుపుతున్నారు. బులియన్ మార్కెట్లో కొన్న వెండి బిస్కెట్లతో ఆభరణాలు తయారు చేసి క్రెడిట్ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు. ఆమెకు రాజస్తాన్‌లోని నర్పత్ పట్టణానికి చెందిన జాలారామ్ అలియాస్ బాగ్దారామ్ అలియాస్ భరత్ ఆభరణాల వ్యాపారిగా పరిచయమయ్యాడు. తనకు వెండి ఆభరణాలు ఇస్తే వాటిని విక్రయించి ఎప్పటికప్పుడు డబ్బులు చెల్లిస్తానని నమ్మించి 10 నెలలుగా ఆమెతో వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాడు. జూన్‌లో 450 కిలోల వెండి ఆభరణాలు కావాలని.. వాటిని అమ్మి డబ్బులు చెల్లిస్తానంటూ ఆమెతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆభరణాలు తీసుకున్న తర్వాత డబ్బులు చెల్లించకపోగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దీంతో మోసపోయానని తెలుసుకున్న ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల భాదతో వ్యాపారి ఆత్మహత్య
-
మహబూబాబాద్‌లో వ్యాపారి కిడ్నాప్
వరంగల్: ఇంట్లో ఉన్న వ్యాపారిని ఎవరో పిలుస్తున్నారని చెప్పి..బయటకు వచ్చాక కొందరు గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం ఉదయం జరిగింది. పట్టణానికి చెందిన వెంశెట్టి సోమయ్య(56) ఎరువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు సంతానం అమెరికాలో స్థిరపడటంతో ఇంటి వద్ద భార్య భర్తలు మాత్రమే ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం కొందరు వ్యక్తులు వచ్చి ఇంట్లో ఉన్న సోమయ్యను బయటకు పిలిచి వ్యానులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బయటకు వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. గతంలో వెంశెట్టి సోమయ్య, వెంశెట్టి కృష్ణ ల మధ్య కోల్డ్‌స్టోరేజ్‌కు సంబంధించిన గొడవలు ఉండటంతో.. ఆ కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
టెండర్ !
రిమ్స్ క్యాంటీన్ కాంట్రాక్టుకు ఇస్తున్నారట కదా.. మీరేం చేస్తారో.. ఎలా చేస్తారో నాకు తెలీదు.. ఆ కాంట్రాక్టు మావాడికే రావాలి.. అంతే.. అని జిల్లాకు చెందిన ఒక టీడీపీ అగ్రనేత రిమ్స్ అధికారులకు హుకుం జారీ చేశారు. దాంతో వారు తమ బుర్రలకు పదునుపెట్టారు. జీవోను అడ్డుపెట్టుకొని అడ్డగోలు వడ్డింపునకు సిద్ధమయ్యారు. పేరుకు పత్రికలో టెండరు ప్రకటన ఇచ్చినా.. జీవోలోని అంశాలను అందులో పేర్కొనకుండా టెండరు ఖరారు సమయంలో ఆ నిబంధనలనే సాకుగా చూపి రిమ్స్ క్యాంటీన్‌కు పసుపు రంగు పులిమారు. రిమ్స్ క్యాంపస్: జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్స్(రిమ్స్) ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన క్యాంటీన్‌ను లీజుకు ఇచ్చేందుకు సంస్థ అధికారులు సిద్ధమయ్యారు. గార మండలం అంపోలు గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు దానిపై కన్నేశాడు. టీడీపీ అగ్రనేత వద్దకు వెళ్లి ఎలాగైనా క్యాంటీన్ కాంట్రాక్టు తనకు ఇప్పించాలని కోరాడు. సదరు అగ్రనేత రిమ్స్ అధికారులకు వెంటనే ఫోన్ చేసి తమ వాడికే క్యాంటీన్ కట్టబెట్టాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయిలో పలుకుబడి ఉన్న ఆ నేత ఆదేశాలతో అధికారులు అడ్డదారులు వెతికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆ మేరకు గత డిసెంబరు 23న ఒక పత్రికలో టెండర్ నోటీసు ఇచ్చారు. ఏదైనా ప్రభుత్వ సంస్థ పరిధిలో కనీసం రెండేళ్ల అనుభవం ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. ఆ ప్రకటన మేరకు చాలా మంది టెండర్లు దాఖలు చేశారు. కాగా టీడీపీ అగ్రనేత ప్రాపకం పొందిన ఆ పార్టీ ఛోటా నేత తెలివిగా తనకు తెలిసిన ఓ వికలాంగుడి చేత టెండర్ వేయించారు. జనవరి 5వ తేదీన టెండర్లు తెరిచారు. రూ. 2 లక్షల అడ్వాన్స్‌తోపాటు రూ.16వేలకుపైగా నెలవారీ అద్దె చెల్లిస్తామంటూ పలువురు కొటేషన్లు దాఖలు చేశారు. అయితే వారెవరినీ కాదని వికలాంగ కోటా అని చెబుతూ టీడీపీ నేత తరఫున టెండరు వేసిన వికలాంగుడికే లీజు ఖరారు చేసేశారు. ఇంతకూ ఆయన ఆఫర్ చేసిన నెల అద్దె రూ. 6 వేలే. దీంతో మిగిలిన టెండర్‌దారులు అభ్యంతరం చెప్పారు. వికలాంగ రిజర్వేషన్ ఉంటుందని ముందు చెప్పకుండా టెండర్లు తెరిచేటప్పుడు చెప్పడమేమిటని మిగిలిన దరఖాస్తుదారులు నిలదీశారు. మరోవైపు తమకు కూడా రిజర్వేషన్ వర్తింపజేయాలంటూ టెండర్లు వెసిన మహిళా సంఘాల ప్రతినిధులు కూడా వివాదం రేపారు. దాంతో అప్పటికి టెండరు ఖరారు చేయకుండా పెండింగ్‌లో పెట్టారు. కానీ గుట్టుచప్పుడు కాకుండా ఇటీవల ఆ టీడీపీ నేత అనుచరుడికే క్యాంటీన్‌ను కట్టబెట్టారు. ఆ మేరకు ఉత్తర్వులు కూడా సిద్ధం చేశారు. అధికారుల భరోసాతో సదరు వ్యక్తి సోమవారం క్యాంటీన్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. జీవోతో మాయాజాలం టీడీపీ ఆగ్రనేత ఆదేశాలకు తలొగ్గిన రిమ్స్ అధికారులు జీవో పేరుతో మాయ చేశారు. పత్రికలో ప్రచురించిన టెండర్ నోటీసులోగానీ, టెండరు దరఖాస్తులో గానీ వికలాంగులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొనలేదు. ఆ విషయం ముందే ప్రకటించి ఉంటే జిల్లాలో ఉన్న ఎంతో మంది వికలాంగులు ప్రయత్నించేవారు. అదే జరిగితే ఆగ్రనేత చెప్పిన వ్యక్తికి కాంట్రాక్టు దక్కదన్న ఉద్దేశంతోనే రిజర్వేషన్ విషయాన్ని బయటపెట్టని అధికారులు.. తమను నిలదీస్తున్న వారికి జీవో నెంబరు 874ను చూపుతున్నారు. ఆ జీవో ప్రకారమే టెండరు ఖరారు చేశామంటున్నారు. గతంలోనూ ఈ క్యాంటీన్‌ను అడ్డదారిలో కేటాయించేందుకు జరిగిన ప్రయత్నాలను ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో ఆ ప్రక్రియను నిలిపివేసిన అధికారులు ఇప్పుడు మరో అడ్డదారి తొక్కారు. ఆ జీవో ఏం చెబుతోందంటే.. టీస్టాల్స్, క్యాంటీన్స్, సైకిల్ స్టాండ్స్, రిటైల్ మెడికల్ షాపులు, టెలిఫోన్ బూత్‌లు, స్కూటర్, కార్ స్టాండ్లు మొదలైన వాటిని లీజుకు ఇచ్చేటప్పుడు జీవో ఎం.ఎస్. నెంబరు 604 ప్రకారం వికలాంగులకు, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదల ప్రాతినిధ్యంలోని సంస్థలకు, వెల్ఫేర్ కార్పొరేషన్లకు, జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చుకున్నవారికి ప్రాధాన్యత కల్పించాలని జీవో నెంబరు 874 చెబుతుంది. అయితే వీటిని టెండరు నోటీసులో పొందుపరచలేదు. టెండర్లు దాఖలు చేసిన వారిలో మహిళా సంఘల వారు ూడా ఉన్నా.. వారిని పరిగణనలోకి తీసుకోలేదు. క్యాంటీన్ లీజు విషయంలో జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని మళ్లీ టెండర్లు పిలవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. -
విశాఖలో వ్యాపారిపై హత్యాయత్నం
విశాఖపట్నం గాజువాకలో వ్యాపారి నూకరాజుపై హత్యాయత్నం జరిగింది. బుధవారం మధ్యాహ్నం మద్యం మత్తులో ఉన్న ఆరుగురు దుండగులు జీపులో వచ్చి నడిరోడ్డుపై నూకరాజుపై దాడి చేశారు. ఆయనను కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నూకరాజు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆయనను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. -
వారు కట్టరు..వీరికి పట్టదు
అధికారుల నిర్లక్ష్యం వ్యాపారులకు కలిసొస్తోంది. స్వతహాగా వ్యాపారులు ట్రేడ్ లెసైన్స్ ఫీజును చెల్లిద్దామని ముందుకు రారు. అధికారులు కూడా గట్టిగా అడగరు. ఫలితంగా మున్సిపల్ ఆదాయానికి గండి పడుతోంది. ప్రతి మునిసిపాలిటీల్లో 70శాతం ఇళ్లుంటే 30శాతం దుకాణాలే ఉంటాయి. కానీ వ్యాపారాలకు సంబంధించిన లెసైన్సులు కొందరికే ఉన్నాయి. ఏటా దుకాణాలు పెరుగుతున్నా మున్సిపల్ ఆదాయం మాత్రం పెరగడం లేదు. ఉన్నవారు కూడా ఏళ్ల తరబడి నుంచి ఫీజు చెల్లించడానికి మొండికేస్తుండటంతో ట్రేడ్ లెసైన్సు రుసుము కోట్లల్లో పేరుకపోయింది. గద్వాల మున్సిపల్ పరిధిలో.. గద్వాల ప్రధాన రహదారిపై లెక్కలేనన్ని దుకాణాలు వెలిశాయి. ఇక్కడ గతంలో ఉన్న దుకాణ దారులు మినహా కొత్తగా పెట్టుకున్న దుకాణదారులు లెసైన్సు ఫీజు చెల్లించడం లేదు. ఏటా రూ.10 లక్షలు ట్రేడ్ లెసైన్సు ఫీజు లక్ష్యానికి గాను, ఏటా మార్చి ముగింపులో కేవలం లక్షకు మించి వసూలు చేయడంలేదు. మున్సిపల్ రికార్డుల ప్రకారం 1200 మంది మాత్రమే ట్రేడ్ లెసైన్సు పొందినట్లు సమాచారం. అనధికారికంగా సుమారు 3 వేల మందికి పైగా దుకాణ దారులు లెసైన్సు లేకుండా వ్యాపారులు కొనసాగిస్తున్నారు. వీరు కొన్నేళ్లుగా వ్యాపారాలు కొనసాగిస్తూ రూ.లక్షల్లో ఫీజు ఎగ్గొడుతున్నారు. అలాగే ఆస్తిపన్నులు సైతం పెద్ద మొత్తంలో పేరుకపోయాయి. ఎన్నికల నేపథ్యంలో పన్నుల వసూళ్లు మందగించాయి. ప్రస్తుత ఆస్తిపన్ను డిమాండ్ రూ.1.70 కోట్లుతో పాటు గత ఏడాది బకాయిలు సుమారు కోటి వరకు ఉన్నాయి. దుకాణాల అద్దెలు సుమారు రూ.10 లక్షలు, నీటి పన్ను బకాయిలు రూ.4 లక్షల వరకు పేరుకపోయి ఉన్నాయి.