Debt-Hit UP Trader Attempts Assassination In Live FacebooK: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో బూట్ల వ్యాపారం చేసే రాజీవ్ తోమర్ అప్పుల బాధలతో భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పైగా ఆ ఘటనకు సంబంధించిన వీడియోని కూడా ఆ వ్యాపారి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద కలకలం రేపింది. అంతేకాదు ఆ వీడియోలో అతని భార్యతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది. పైగా ఆ వీడియోలో వ్యాపారి భార్య చనిపోవడానికి ముందు తన భర్తని పాయిజన్ తీసుకోకుండా ఆపడానికి యత్నిస్తున్నట్లు ఉంటుంది. అయితే ఈ ఘటనలో ఆ వ్యాపారి భార్య మరణించింది. కానీ రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉంది.
ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు నిమిషాల నిడివి గల ఫేస్‌బుక్ లైవ్ వీడియోలో తోమర్ మాట్లాడుతూ..."నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. నేను చనిపోయినా అప్పులు తీరుస్తాను. అయితే నేను ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు దేశం పై నమ్మకం ఉంది. నేను దేశ వ్యతిరేకిని కాను. ప్రదాని నరేంద్ర మోదీజీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ముమ్మాటికి చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషులు కాదు. మీ విధానాలను మార్చుకోండి. జీఎస్టీ వల్ల నా వ్యాపారం దెబ్బతింది” అని తోమర్ కన్నీటిపర్యంతమయ్యాడు.
అయితే ఈ వీడియోని వీక్షించిన కొంత మంది నెటిజన్లు పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ భార్య భర్తలని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో " బాగ్‌పత్‌లోవ్యాపారవేత్త అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాజీవ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు యూపీ అంతటా చిన్న వ్యాపారులు ఈ రకమైన బాధలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పైగా నోట్ల రద్దు, జీఎస్‌టీ లాక్‌డౌన్ సామాన్య జనాన్ని చాలా బాధించాయి అని కూడా వ్యాఖ్యానించారు.
(చదవండి: విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ)
Comments
Please login to add a commentAdd a comment