Utterapradesh
-
అదరగొట్టిన రింకూ సింగ్.. సెంచరీ జస్ట్ మిస్
రంజీట్రోఫీ-2024 సీజన్లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్ ఆటగాడు, టీమిండియా నయా ఫినిషర్ రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రింకూ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. అతడితో పాటు దృవ్ జురల్(63) హాఫ్ సెంచరీతో రాణించాడు. 124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్ జురెల్‌తో జతకట్టిన రింకూ 100 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందించాడు. తొలి ఇన్నింగ్స్‌లో యూపీ 302 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో నిదేష్ మూడు వికెట్లు పడగొట్టగా.. బసిల్ థంపీ,సక్సేనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేరళ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. చదవండి: PAK vs AUS: కెరీర్లో చివరి మ్యాచ్.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్ వార్నర్! వీడియో వైరల్ -
దేశంలో మంకీపాక్స్ కలవరం.. మరో అనుమానిత కేసు నమోదు!
లక్నో: దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నలుగురికి నిర్ధారణ కాగా.. తాజాగా మరో అనుమానిత కేసు బయటపడింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాకు చెందిన ఓ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ మహిళలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. నమూనాలు సేకరించి లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీకి పంపించారు. అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం.. రాష్ట్రంలో అనుమానిత మంకీపాక్స్ కేసు బయటపడిన క్రమంలో యూపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోవిడ్ ఆసుపత్రుల్లో మంకీపాక్స్ కోసం ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అన్ని ఆసుపత్రులు కట్టుబడి ఉండాలని పేర్కొంది. మరోవైపు.. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం మంకీపాక్స్‌పై నిఘా పెంచాలని అధికారులకు సూచించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్.. ఇప్పటి వరకు దేశంలో నమోదైన నాలుగు కేసుల్లో మూడు కేరళలోనే వెలుగు చూశాయి. ఢిల్లీలో ఒక కేసు వచ్చింది. కేరళ, ఢిల్లీలలో కేసులు వచ్చిన క్రమంలో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాయి. మంకీపాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్టులు, నౌకాశ్రయాల గుండా దేశంలోకి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులకు ఆరోగ్య పరీక్షలపై జులై 18న కీలక సూచనలు చేసింది కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ. ఇదీ చదవండి: Toxic Liquor: కల్తీ మద్యం తాగి 21 మంది కూలీలు మృతి -
ఘోర ప్రమాదం.. డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొని 8 మంది మృతి
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఘోర ప్రమాదం జరిగింది. రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక సీహెచ్‌సీ హైదర్‌గఢ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషయమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని లక్నోలోని ట్రూమా సెంటర్‌కు తరలించామని వెల్లడించారు. ప్రమాదానికి గురైన రెండు బస్సులు బిహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు అధికారులు చెప్పారు. లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో బారబంకి జిల్లాలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ‘లోనికాత్రా పోలీస్ స్టేషన్ పరిధిలోని నరేంద్రపుర్ మద్రాహా గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సులు బిహార్‌లోని సీతామర్హి, సుపాల్ ప్రాంతాల నుంచి ఢిల్లీకి వెళ్తున్నాయి. పోలీసులు, రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ’ అని ఓ అధికారి వెల్లడించారు. #WATCH | Accident at Purvanchal expressway near Barabanki in UP leaves 6 persons dead & 18 injured after a speeding double-decker bus collided with a stationary one. 3, reported to be critical, referred to trauma centre in Lucknow. Buses were en route from Bihar to Delhi pic.twitter.com/RUELIchJh9 — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 25, 2022 ఇదీ చదవండి: Teacher recruitment scam: ‘ఆ మంత్రి డాన్‌లా ప్రవర్తిస్తున్నారు’ -
మోదీజీ మీ విధానాన్ని మార్చుకోండి!....అప్పుల బాధలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ వ్యాపారి!
Debt-Hit UP Trader Attempts Assassination In Live FacebooK: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో బూట్ల వ్యాపారం చేసే రాజీవ్ తోమర్ అప్పుల బాధలతో భార్యతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పైగా ఆ ఘటనకు సంబంధించిన వీడియోని కూడా ఆ వ్యాపారి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ వీడియో పెద్ద కలకలం రేపింది. అంతేకాదు ఆ వీడియోలో అతని భార్యతో కలిసి ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నట్లు కనిపిస్తుంది. పైగా ఆ వీడియోలో వ్యాపారి భార్య చనిపోవడానికి ముందు తన భర్తని పాయిజన్ తీసుకోకుండా ఆపడానికి యత్నిస్తున్నట్లు ఉంటుంది. అయితే ఈ ఘటనలో ఆ వ్యాపారి భార్య మరణించింది. కానీ రాజీవ్ తోమర్ పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రెండు నిమిషాల నిడివి గల ఫేస్బుక్ లైవ్ వీడియోలో తోమర్ మాట్లాడుతూ..."నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉందని నేను అనుకుంటున్నాను. నేను చనిపోయినా అప్పులు తీరుస్తాను. అయితే నేను ఈ వీడియోను వీలైనంత ఎక్కువగా షేర్ చేయమని ప్రతి ఒక్కరినీ అభ్యర్థిస్తున్నాను. నాకు దేశం పై నమ్మకం ఉంది. నేను దేశ వ్యతిరేకిని కాను. ప్రదాని నరేంద్ర మోదీజీ నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మీరు ముమ్మాటికి చిన్న వ్యాపారులు, రైతుల శ్రేయోభిలాషులు కాదు. మీ విధానాలను మార్చుకోండి. జీఎస్టీ వల్ల నా వ్యాపారం దెబ్బతింది” అని తోమర్ కన్నీటిపర్యంతమయ్యాడు. అయితే ఈ వీడియోని వీక్షించిన కొంత మంది నెటిజన్లు పోలీసులకు సమాచారం అందించారు ఈ మేరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ భార్య భర్తలని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్లో " బాగ్పత్లోవ్యాపారవేత్త అతని భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాజీవ్ జీ త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను" అని ఆమె ట్వీట్ చేశారు. అంతేకాదు యూపీ అంతటా చిన్న వ్యాపారులు ఈ రకమైన బాధలను ఎదుర్కొంటున్నారని అన్నారు. పైగా నోట్ల రద్దు, జీఎస్టీ లాక్డౌన్ సామాన్య జనాన్ని చాలా బాధించాయి అని కూడా వ్యాఖ్యానించారు. (చదవండి: విద్యార్థిని కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేసి రూ.5 లక్షలు ఇచ్చినప్పటికీ) -
అయోధ్య విమానాశ్రయం పేరు మార్పు
ఉత్తర ప్రదేశ్: అయోధ్య విమానాశ్రయం పేరు మారనుంది. విమానాశ్రయం పేరు మార్పుకు ఉత్తరప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అయోధ్య విమానాశ్రం ఇక నుంచి మర్యాద పురోషత్తం శ్రీరామ్ విమానాశ్రయంగా పిలవనున్నారు. దీనికి రాష్ట్ర అసెంబ్లీ నుంచి కూడా మద్దతు లభించింది. మంత్రి మండలి ఆమోదించిన ఈ తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ నుంచి భారత ప్రభుత్వ పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యా ట్వీట్ చేశారు. . @UPGovt की कैबिनेट में #अयोध्या स्थित एयरपोर्ट का नाम मर्यादा पुरुषोत्तम भगवान #श्रीराम जी के नाम पर किए जाने के प्रस्ताव को मंजूरी दे दी। आपकी प्रदेश सरकार #श्रीराम_लला की नगरी अयोध्या को विश्व के धार्मिक स्थलों में अग्रणी स्थान दिलाने के लिए संकल्पित है। pic.twitter.com/7NbXLvurpN — Keshav Prasad Maurya (@kpmaurya1) November 24, 2020 -
లైంగిక వేధింపులకు అడ్డుకట్ట
లక్నో: లైంగిక వేధింపులకు గురైన ఆమె జీవితం మీద ఆశను కోల్పోయింది. తనను తాను నిలదొక్కుకొని ఇప్పుడు బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్‌కు చారిత్రాత్మక నగరమైన రాజధాని లక్నోలో నివాసముంటుంది ఉష. మురికివాడల పిల్లలకు విజ్ఞానాన్ని పంచాలనే ఉద్దేశ్యంతో 2010లో టీచర్‌గా వెళ్లింది. తన సొంత ఖర్చులతో ఆ వాడలో ఒక షెడ్ నిర్మించింది. అందులోనే పిల్లలకు తరగతులు నిర్వహించేది. ఒకనాడు ఆ తరగతి గదిలోనే ఓ వ్యక్తి చేతిలో లైంగికదాడికి లోనయ్యింది. ఈ సంఘటన ఉష మనస్సుపై తీవ్ర ప్రభావం చూపింది. దాదాపు ఆర్నెల్ల పాటు చీకటిలోనే కాలం గడిపింది. ఆ తర్వాత తేరుకొని ఇప్పటివరకు 75,000 మంది బాలికలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చి ఆత్మరక్షణలో మహిళలకు ఒక ఉదాహరణగా మారింది ఉషా విశ్వకర్మ. ఉష స్థాపించిన ‘రెడ్ బ్రిగేడ్’ ట్రస్ట్ ఇప్పుడు అక్కడ చట్టం కింద నమోదు చేయబడింది. ఏర్పాటు చేసిన ‘రెడ్ బ్రిగేడ్’ ప్రపంచ ఉనికి మహిళల చేతిలో ఉందని నిరూపించింది ఉష. తన బాల్యాన్ని పేదరికంలో గడపడంతో మురికివాడల పిల్లలకు విద్యను అందించడానికి వెళ్ళింది. ఆ సమయంలో జరిగిన సంఘటనను ఉష చెబుతూ –‘ఆ వ్యక్తి నాకు దగ్గరగా వచ్చినప్పుడు, అతనిని ఎదిరించే ధైర్యం కూడా నాకు లేదు. అతని చేష్టలను చూసి, కొట్టి అక్కడ నుండి తప్పించుకున్నాను. కానీ, కొన్నాళ్లపాటు ఆ ఘటన నన్ను వెంటాడింది. ‘ఎంతో కొంత ధైర్యం ఉన్న నాకే ఇలా జరిగితే మిగతా అమ్మాయిల పరిస్థితి ఏంటి?’ అని ఆలోచించాను. సమాజ శ్రేయస్సు కోసం ఏదైనా చేయాలనుకున్నాను. ఈ ఆలోచనతోనే 2011లో ’రెడ్ బ్రిగేడ్’ సంస్థను స్థాపించాను. నా లాగే లైంగిక వేధింపులకు గురైన 15 మంది అమ్మాయిలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చాను’ అని వివరించింది. ఆయుధాలు లేని టెక్నిక్స్ ఉష తన మిషన్ ద్వారా మహిళలు సమాజంలో నిర్భయంగా జీవించగల వాతావరణాన్ని సృష్టించాలని కోరుకుంటోంది. ఆమె తన మిషన్‌కు ఎక్కువమంది అమ్మాయిలను కనెక్ట్ చేయాలనుకుంటుంది. ఈ బ్రిగేడ్‌కు అనుబంధంగా ఉన్న బాలికలు ఎరుపు కుర్తా, నల్ల సల్వార్ ధరిస్తారు. ప్రస్తుతం అలాంటి 100 మంది బాలికలు రెడ్ బ్రిగేడ్‌కు జతచేయబడ్డారు. ఈ బ్రిగేడ్ ద్వారా ఎలాంటి ఆయుధాలు లేకుండా 15–20 ‘నిరాయుధీకరణ’ మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్‌ను అభివృద్ధి చేసింది. తన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ బాలికల పట్ల దుష్టులు ఎలా ప్రవర్తిస్తారో దృష్టిలో ఉంచుకుని ఈ పద్ధతిని సవరించింది. ఆల్ ఇన్ వన్ ప్రభుత్వ ‘కవాచ్ మిషన్’ కింద 56,000 మంది మహిళలకు ఉష మార్షల్ ఆర్ట్స్ శిక్షణ ఇచ్చింది. ఇది కాకుండా, విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, రైల్వేలు, బ్యాంకులు, పోలీసులు, ఇతర వృత్తులు, మార్షల్ ఆర్ట్స్ వంటి 50 ప్రసిద్ధ సంస్థల మహిళలకు వారి ఆత్మరక్షణ కోసం నైపుణ్యాలను నేర్పిస్తోంది. ఈ విధంగా అన్ని వృత్తులు, అన్ని శాఖలలో పనిచేసే మహిళలకు శిక్షణ ఇవ్వడంలో బిజీగా ఉంటోంది. నాటకాల ద్వారా అవగాహన బాలికలకు, మహిళలకు ఆత్మరక్షణ ఎంత అవసరమో అవగాహన చేసే దిశగా ఆలోచించింది. ఇందుకు మంచి సన్నివేశాలను ఎంచుకొని లైంగిక దోపిడీకి వ్యతిరేకంగా స్వరం పెంచిన ఉష ఇప్పటివరకు 700 వీధి నాటకాలను నిర్వహించింది. 225 సెమినార్ల ద్వారా మహిళలకు ఆత్మరక్షణ పద్ధతుల గురించి తెలియజేసింది. తనలాగా మరొక్కరు కూడా బాధపడకూడదు. జీవితం మీద నిరాశను పెంచుకోకూడదు. స్త్రీ–పురుషులిద్దరికీ జీవించే హక్కు ఉన్న ఈ సమాజంలో బలం కారణంగా మగవాడు చూపించే దౌర్జన్యాలకు ఆడది బలి కావద్దు. అకృత్యాలను అడ్డుకునే శక్తిని స్త్రీ పెంచుకోవాలని స్వరం పెంచి మరీ నినదిస్తోంది ఉషా విశ్వకర్మ. -
అతను కాస్తా.. ఆవిడగా మారడమే...
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని రైల్వే ఉన్నతాధికారులకు వింత అనుభవం ఎదురైంది. నివాసం మారినప్పుడు, మరేదైనా కారణాలతో కార్యాలయ రికార్డుల్లో మార్పులు చేయాలని మాత్రమే తెలిసిన వాళ్లకు.. తాజాగా జెండర్ మార్చాలని విజ్ఞప్తి వచ్చింది. అతను కాస్తా.. ఆవిడగా మారడమే దీనికి కారణం. వివరాలు.. రాజేష్ పాండే (35) తండ్రి రైల్వే ఉద్యోగి. తండ్రి 2003లో చనిపోవడంతో కారుణ్య నియామకం కింద రాజేష్ రైల్వేలో ఉద్యోగం పొందాడు. రైల్వే వర్క్ షాప్‌లో గ్రేడ్-1 టెక్నీషియన్‌గా చేరాడు. నలుగురు అక్కాచెల్లెళ్లకు ఒక్కడే సోదరుడైన రాజేష్‌కు చిన్నప్పటి నుంచి స్త్రీగా ఉండటమే ఇష్టం. దాంతో 2017లో రాజేష్ లింగమార్పిడి చేయించుకుని, సోనియా పాండేగా పేరు మార్చుకోవడం జరిగింది. అందరూ సోనియా అని పిలుస్తున్నా.. ఆఫీస్ రికార్డుల్లో మాత్రం ఇంకా రాజేష్ పాండే అనే ఉంది. దీంతో రికార్డుల్లో జెండర్ పేరు మార్చాలని గోరఖ్‌పూర్‌లోని ఈశాన్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్‌ను రాజేష్ అలియాస్ సోనియా కలిసింది. ఆ దరఖాస్తును హుండ్లీలోని రైల్వే బ్రాంచ్‌కు పంపించారు. రికార్డుల్లో పేరు, లింగం మార్చాలని కోరతూ దరఖాస్తు రావడం ఇదే మొదటిసారి అని వారు పేర్కొన్నారు. ఇదిలాఉండగా.. లింగ మార్పిడి చేసుకోవడానికి ముందే రాజేష్‌కు స్థానికంగా ఉండే ఓ యువతితో పెళ్లైంది. కానీ, అసలు విషయం బయటపడటంతో విడాకులు తప్పలేదు. భార్యకు తన శరీర స్వభావం గురించి చెప్పి విడాకులు తీసుకున్నానని, లింగ మార్పిడి అనంతరం అమ్మాయిగా జీవించడం సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది సోనియా పాండే. -
యూపీలో భారీ వర్షాలు; కూలిన 133 భవనాలు
లక్నో: గత మూడు రోజులుగా భారీ వర్షాలు ఉత్తరప్రదేశ్‌ను ముంచెత్తుతున్నాయి. వర్షం ధాటికి జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. సుమారు 14 జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడి కుండపోతగా కురిసిన వర్షాలకు 15 మంది చనిపోయారని అధికారులు తెలిపారు. అదే విధంగా 133 భవనాలు కూలిపోయినట్లు పేర్కొన్నారు. వాన బీభత్సంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు వెల్లడించారు. కాగా లక్నోలో శనివారం నుంచి మరో ఐదు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, , జార్ఖండ్, నుంచి మధ్య మహారాష్ట్ర, గోవా ప్రాంతాలతో పాటు.. ఈశాన్య రాష్ట్రాలైన అరణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజొరాంలలో అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు పేర్కొంది. ఇక మరోవైపు అసోంను వరదలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. -
రైతుల అప్పులు తీర్చనున్న బిగ్‌బీ
నటనతోనే కాకుండా గొప్ప మనసుతోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఆయన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల రుణాలు కట్టి రీల్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ అమితాబ్ ప్రశంసలు పొందారు. తాజాగా బిగ్ బి మరోసారి మానవత్వంతో కూడిన గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అందరి మన్నలను పొందుతున్నారు. (ప్లీజ్.. నన్ను పిలవొద్దు!) ఈ సారి ఉత్తర్ ప్రదేశ్.. దేశంలో రైతులు రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని.. అందుకే తన సంపాదనలో కొంతభాగంతో వారి రుణాలను తీర్చాలని భావిస్తున్నానని గతంలో ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 1398 మంది రైతుల రుణాలను కట్టాలని బిగ్ బి నిశ్చయించుకున్నారు. తొలుత అర్హులైన 70 మంది రైతులను ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ముంబైకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 26న తన ఆఫీస్‌లో వారి రుణాలకు సంబంధించిన సెటిల్మెంట్ పేపర్స్‌ను బిగ్ బి అందివ్వనున్నారు. రైతుల రుణాలు కట్టడం కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయలు కేటాయించనట్టు తెలుస్తోంది. (బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు) -
దొంగల ముఠా సభ్యుల అరెస్ట్
నిజామాబాద్: ఢిల్లీ, యూపీకి చెందిన ఇద్దరు దొంగల ముఠా సభ్యులను గురువారం నిజామాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి ఒక చైన్, తుఫాకీ, డీసీఎం వ్యాన్, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ,ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ ముఠా సభ్యులు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు ఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. కాగా, నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో తుపాకీతో బెదిరించి పారిపోయింది కూడా ఈ ఇద్దరు దొంగలేనని పోలీసులు వెల్లడించారు.