అదరగొట్టిన రింకూ సింగ్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌ | Rinku Singh, Dhruv Jurel come Uttar Pradeshs aid in Ranji Trophy game | Sakshi
Sakshi News home page

Ranji Trophy: అదరగొట్టిన రింకూ సింగ్‌.. సెంచరీ జస్ట్‌ మిస్‌

Published Sat, Jan 6 2024 1:53 PM | Last Updated on Sat, Jan 6 2024 4:01 PM

Rinku Singh, Dhruv Jurel come Uttar Pradeshs aid in Ranji Trophy game - Sakshi

రంజీట్రోఫీ-2024 సీజన్‌లో భాగంగా కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరప్రదేశ్‌ ఆటగాడు, టీమిండియా నయా ఫినిషర్‌ రింకూ సింగ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. రింకూ తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 136 బంతులు ఎదుర్కొన్న రింకూ.. 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92 పరుగులు చేశాడు. అతడితో పాటు దృవ్‌ జురల్‌(63) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 

124 పరుగులకు సగం వికెట్లు కోల్పోయిన దశలో దృవ్‌ జురెల్‌తో జతకట్టిన రింకూ 100 పరుగుల  భాగస్వామ్యాన్ని జోడించి జట్టుకు మెరుగైన స్కోర్‌ను అందించాడు. తొలి  ఇన్నింగ్స్‌లో యూపీ 302 పరుగులకు ఆలౌటైంది. కేరళ బౌలర్లలో నిదేష్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. బసిల్‌ థంపీ,సక్సేనా తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కేరళ 43 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
చదవండిPAK vs AUS: కెరీర్‌లో చివరి మ్యాచ్‌.. కన్నీరు పెట్టుకున్న డేవిడ్‌ వార్నర్‌! వీడియో వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement