
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి(Virat Kohli) దాదాపు 12 ఏళ్ల తర్వాత తిరిగి రంజీల్లో ఆడేందుకు సిద్దమయ్యాడు. జనవరి 30 నుంచి అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా రైల్వేస్‌తో ప్రారంభం కానున్న మ్యాచ్‌లో ఢిల్లీ తరపున కింగ్ కోహ్లి బరిలోకి దిగనున్నాడు. ఈ విషయాన్ని ఢిల్లీ జట్టు హెడ్ కోచ్ శరణ్‌దీప్ సింగ్ ధ్రువీకరించాడు. విరాట్ మంగళవారం(జనవరి 28) ఢిల్లీ జట్టులో చేరి, ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనున్నట్లు ఆయన తెలిపారు.
రెడ్ బాల్ క్రికెట్‌లో కోహ్లి గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో విరాట్ కోహ్లి నిరాశపరిచాడు. తొలి టెస్టులో సెంచరీ మినహా మిగితా మ్యాచ్‌ల్లో కోహ్లి దారుణంగా విఫలమయ్యాడు. కోహ్లితో పాటు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లు కూడా నిరాశపరిచాడు.
ఈ క్రమంలో సీనియర్ ఆటగాళ్లు సైతం దేశవాళీ క్రికెట్‌లో ఆడాలని భారత క్రికెట్ బోర్డు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఒక్కొక్కరుగా రంజీ బాటపడుతున్నారు. ప్రస్తుత రంజీ సీజన్‌లో ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజాలు తమ రాష్ట్రాలకు ప్రాతినిథ్యం వహించగా.. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సైతం ఆడేందుకు సిద్దమయ్యారు. స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా హైదరాబాద్ తరపున ఆడనున్నట్లు తెలుస్తోంది.
కాగా కోహ్లికి రంజీల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి.. 50.77 సగటుతో 1574 పరుగులు చేశాడు. అతడి ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 5 సెంచరీలు ఉన్నాయి. అయితే కోహ్లి కేవలం 19 ఏళ్ల వయస్సులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కువగా ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడే అవకాశం లభిచించలేదు. ఇక 12 ఏళ్ల తర్వాత కోహ్లి రంజీల్లో ఆడుతుండడంతో మ్యాచ్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను ఢిల్లీ క్రికెట్ అసోషియేషన్ ఉచితంగా అనుమతించనుంది. కోహ్లి చివరగా రంజీల్లో 2012-13 సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడాడు.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టీ20.. భారత జట్టులోకి ఇద్దరు స్టార్ ప్లేయర్లు?
Comments
Please login to add a commentAdd a comment