ఢిల్లీ రోడ్డు ప్రమాదం.. మాది తప్పే | Dwarka car accident minor's father's response | Sakshi
Sakshi News home page

ఢిల్లీ రోడ్డు ప్రమాదం.. మాది తప్పే

Feb 18 2026 8:21 AM | Updated on Feb 18 2026 9:25 AM

Dwarka car accident minor's father's response

కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో 17 ఏళ్ల టీనేజర్‌ నిర్లక్ష పూరితంగా కారు నడిపిన ఉదంతంలో 23 ఏళ్ల యువకుడు సాహిల్‌ ధనేశ్ర ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఘటనలో ‘రీల్స్‌’ కోణం లోనే అని బహిర్గతమైంది. దీంతో  ఆయువకుడి తల్లి తీవ్ర ఆవేదనకు గురైంది. సంపన్నుల పిల్లలు సరదాగా చేసే ‘రీల్స్‌’కు తన ఒక్కగానొక్క కుమారుడు బలయ్యాడని మృతుని తల్లి ఇనా మాకెన్‌ కన్నీటిపర్యంతమైంది. అయితే ఈ ఘటనపై నిందితుడి తండ్రి క్షమాపణలు తెలిపాడు.

టీనేజర్ తండ్రి  మాట్లాడుతూ.. "ఇది చాలా తప్పు  ఆరోజు నా భార్యకు ఉదయం 11 గంటల ప్రాంతంలో ఫోన్ వచ్చింది. నా కుమారుడికి యాక్సిడెంట్ జరిగినట్లు తెలిసింది. దీంతో ఎంతో భయానికి గురయ్యా. నా భార్యను అడిగా ఇది ఎలా జరిగిందని, అప్పుడు తను చెప్పింది. కారుతో ప్రమాదం జరిదిందని చెప్పింది. దీంతో వెంటనే అక్కడికి వెళ్లాను."  అని  ఆయన అన్నారు.

మైనర్ బాలుడికి కారు ఇవ్వడం కరెక్టేనా?

ఆ సమయంలో నేను అక్కడ లేను. ఆయనకు కారు ఇవ్వడం తప్పే

కారుపై 13 చలాన్లు ఉన్నాయిగా?

అది బిజినెస్ కోసం తిరిగే కారు దానిపై చలాన్లు ఉండడం సహజం

మీరు మీ మైనర్ కుమారున్ని డ్రైవింగ్ చేయకుండా ఆపలేదా?

అసలు అతను డ్రైవ్ చేస్తున్నట్లు నాకు తెలియదు. అతను నన్ను చూసి చాలా భయపడేవారు. 

ఆ కారులో మీ కూతురు  రీల్స్ చేస్తున్నారుగా?

లేదు వారు రీల్స్ చేయడం లేదు ఫోటోలతో పాటు వీడియోలు తీసుకుంటున్నారు. అని ఆయన బదులిచ్చారు.

అయితే డబ్బున్న వాళ్లు చేేసే సరదాలకు తన కుటుంబం రోడ్డుపాలయిందని  ప్రమాదంలో మృతిచెందిన సాహిల్‌ ధనేశ్ర తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కారుతో ఢీకొట్టాక కనీసం వారు బ్రేకులు కూడా వేయలేదని అంత నిర్లక్షంగా ఉన్నారని తెలిపింది.. ‘‘మాకున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మా అబ్బాయి ఎంతో కష్టపడుతుంటాడు. చిన్న చిన్న పనులు కూడా చేస్తుంటాడు. స్పోర్ట్స్‌లో ఎన్నో మెడల్స్‌ తెచ్చుకున్నాడు. నైనిటాల్‌లో సెయింట్‌ జోసెఫ్‌ కాలేజీలో బీబీఏ ఫైనల్‌ సెమిస్టర్‌ చదువుతున్నాడు. మాంచెస్టర్‌లో లగ్జరీ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్‌ చేసేందుకు త్వరలో బ్రిటన్‌కు వెళ్లాల్సినవాడు ఇలా ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు’’అని తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. అయితే ప్రస్తుతం ఆ టీనేజర్ బెయిల్ పై ఉన్నాడు. పదో తరగతి బోర్డ్‌ పరీక్షలు రాయల్సి ఉన్నందున అతనికి జువెనైల్‌ జస్టిస్‌ బోర్డ్‌ మధ్యంతర బెయిల్‌ మంజూరుచేసింది.

ఇప్పటికే ఒంటరిగా జీవిస్తున్న తల్లి జీవితం కుమారుడి మరణంతో ఏకాకిగా మారిందని పొరుగింటి వాళ్లు చెప్పారు. మరోవైపు లాల్‌ బహదూర్‌ శాస్త్రి కాలేజ్‌ సమీపంలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో సమీపంలో కారును పార్క్‌చేసిన డ్రైవర్‌ అజిత్‌ సింగ్‌ జీవితం సైతం కష్టాల కడలిలో పడింది. టీనేజర్‌ ఆ యువకుడి బైక్‌ను ఢీకొట్టాక నేరుగా వచ్చి అజిత్‌కు చెందిన క్యాబ్‌నూ ఢీకొట్టాడు. దీంతో అజిత్‌ తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిపాలయ్యాడు. ‘‘కాళ్లు, చేతులు, తల, వెన్నుపూసకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తీసుకోవాలి వైద్యులు సూచించారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement