
నటనతోనే కాకుండా గొప్ప మనసుతోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఆయన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల రుణాలు కట్టి రీల్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ అమితాబ్ ప్రశంసలు పొందారు. తాజాగా బిగ్ బి మరోసారి మానవత్వంతో కూడిన గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అందరి మన్నలను పొందుతున్నారు. (ప్లీజ్.. నన్ను పిలవొద్దు!)
ఈ సారి ఉత్తర్ ప్రదేశ్..
దేశంలో రైతులు రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని.. అందుకే తన సంపాదనలో కొంతభాగంతో వారి రుణాలను తీర్చాలని భావిస్తున్నానని గతంలో ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 1398 మంది రైతుల రుణాలను కట్టాలని బిగ్ బి నిశ్చయించుకున్నారు. తొలుత అర్హులైన 70 మంది రైతులను ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ముంబైకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 26న తన ఆఫీస్‌లో వారి రుణాలకు సంబంధించిన సెటిల్‌మెంట్ పేపర్స్‌ను బిగ్ బి అందివ్వనున్నారు. రైతుల రుణాలు కట్టడం కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయలు కేటాయించనట్టు తెలుస్తోంది. (బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు)
Comments
Please login to add a commentAdd a comment