loan waiver farmers
-
రైతు రుణమాఫీపై కేసీఆర్‌కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు. ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, ఆంజనేయ గౌడ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్‌ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు. -
రైతుబంధు, రుణమాఫీ యథాతథం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం రైతుబంధు, రుణమాఫీ పథకాలపై పడదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న కార్యక్రమమే అని, రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించినందున దానికీ అభ్యంతరం ఉండబోదని చెబుతున్నాయి. ఈ రెండు పథకాలకు రూ.18 వేల కోట్లు.. రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు, రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. రైతుబంధుకింద ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేయనుంది. ఇక రబీ సమయంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో పెట్టుబడి చెక్కులు ఇవ్వకూడదని, రైతులకు నేరు గానే వారి బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో చెక్కుల ముద్రణను నిలిపివేసి రైతులకు బ్యాంకుల్లోనే నగదు జమ చేశారు. ఈసారి కూడా అదే జరగనుందని అంటు న్నారు. ఏప్రిల్ 11న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. మే 23న ఫలితాలు విడుదల వుతాయి. కాబట్టి ఫలితాల వెల్లడివరకూ ఎన్నికల కోడ్ ప్రభావం ఉంటుంది. ఈలోగా రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సొమ్ము ఇవ్వాలి కాబట్టి ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రుణమాఫీ లబ్ధిదారుల నిర్ధారణపై బ్యాంకులు, వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నాయి. వారిని గుర్తించి చెక్కులు ఇస్తారా? నగదు బ్యాంకులకు అందజేస్తా రా తెలియాల్సి ఉంది. రుణమాఫీకి సంబంధించి రైతు ఖాతాలకు సొమ్ము వేస్తే బ్యాంకులు తమ అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని, కాబట్టి చెక్కులు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడిం చిన నేపథ్యంలో ఎలా చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. కోడ్ పూర్తయిన తర్వాతే చెక్కుల కింద ఇస్తారన్న ప్రచారమూ ఉంది. -
రైతులు తీసుకున్న రూ. లక్ష రుణమాఫీ
సాక్షి, హైదరాబాద్ : లక్ష రూపాయల వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2018 డిసెంబర్ 11లోపు రైతులు తీసుకున్న లక్ష రుపాయల రుణాలును మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రైతుల్లో భరోసా పెంచామన్న ముఖ్యమంత్రి అన్నదాతలను అన్నవిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ బడ్జెట్లో రైతన్నలకు కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. వ్యవసాయ శాఖకు రూ.20,107 కేటాయించిన సర్కార్... రైతుబంధ పధకం కింద ఎకరానికి ఏడాదికి అందించే మొత్తాన్ని రూ.8 వేల నుంచి రూ.10వేలకు పెంచింది. అలాగే రైతు బీమాకు రూ.650 కోట్లు కేటాయించింది. (రూ.1,82,017 కోట్లతో తెలంగాణ బడ్జెట్) -
రైతుల అప్పులు తీర్చనున్న బిగ్‌బీ
నటనతోనే కాకుండా గొప్ప మనసుతోనూ ఎంతో మంది హృదయాలు గెలుచుకున్నారు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్. అనేక స్వచ్చంద కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ, అనేక అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో చైతన్యం కలిగించేలా ఆయన ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం మహారాష్ట్రకి చెందిన 350 మంది రైతుల రుణాలు కట్టి రీల్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ అమితాబ్ ప్రశంసలు పొందారు. తాజాగా బిగ్ బి మరోసారి మానవత్వంతో కూడిన గొప్ప నిర్ణయం తీసుకోవడంతో అందరి మన్నలను పొందుతున్నారు. (ప్లీజ్.. నన్ను పిలవొద్దు!) ఈ సారి ఉత్తర్ ప్రదేశ్.. దేశంలో రైతులు రుణాలు తీర్చలేక ఆత్మహత్యలకు పాల్పడడం తనను ఎంతో బాధకు గురిచేస్తోందని.. అందుకే తన సంపాదనలో కొంతభాగంతో వారి రుణాలను తీర్చాలని భావిస్తున్నానని గతంలో ఆయన తెలిపారు. అందులో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన 1398 మంది రైతుల రుణాలను కట్టాలని బిగ్ బి నిశ్చయించుకున్నారు. తొలుత అర్హులైన 70 మంది రైతులను ప్రత్యేకంగా తన సొంత ఖర్చులతో ముంబైకి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నెల 26న తన ఆఫీస్‌లో వారి రుణాలకు సంబంధించిన సెటిల్మెంట్ పేపర్స్‌ను బిగ్ బి అందివ్వనున్నారు. రైతుల రుణాలు కట్టడం కోసం అమితాబ్ 4.05 కోట్ల రూపాయలు కేటాయించనట్టు తెలుస్తోంది. (బిగ్‌బీ ఇంట్లో తారల వెలుగులు) -
బాబు బావకే మాఫీ కాలేదు..!
♦ రుణమాఫీ అంతా మాయ ♦ దుమ్మెత్తి పోసిన చంద్రబాబు బంధువు నాగరాజునాయుడు ♦ ఆయన ఇచ్చిన పత్రాలు నాలుక గీసుకోవడానికే.. ♦ నమ్మి ఓట్లేసి మోసపోయామని ఆవేదన ♦ నారావారిపల్లె జన్మభూమి సభలో ఆందోళన చంద్రగిరి : ‘మిమ్మల్ని నమ్మి ఓట్లేసి మోసపోయాం. రుణమాఫీ ఓ మాయ. మాఫీ చేశామని ముఖ్యమంత్రి ప్రకటిస్తున్నారు. పత్రాలు పంపారు. కానీ రుణం మొత్తం కట్టాలని బ్యాంకర్లు వేధిస్తున్నారు. ముఖ్యమంత్రి పంపిన పత్రాలు నాలుక గీసుకోవడానికే పనికొస్తాయి.. అసలు రుణమాఫీ చేశారా..?’ ఈ మాటలన్నది ఎవరో కాదు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దగ్గరి బంధువు కొత్తపల్లి నాగరాజునాయుడు. ముఖ్యమంత్రికి వరసకు బావ అవుతారు. ఆయనది కూడా నారావారి స్వగ్రామం నారావారిపల్లె. చంద్రబాబు ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న రుణమాఫీలోని డొల్లతనాన్ని ఆయన ఉతికి ఆరేశారు. దీంతో ఆదివారంనాడు నారావారిపల్లెలో జరిగిన జన్మభూమి సభలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు, అధికారుల దిమ్మతిరిగేలా దుమ్ముదులిపేశారు. బ్యాంకు అధికారులు ఇచ్చిన నోటీసులు, రుణమాఫీ పత్రాలను చిరాకొచ్చి గతంలోనే బ్యాంకు అధికారుల ఎదుటే చించేసినట్లు ఆయన తెలిపారు. వివరాల్లోకి వెళితే.. నారా, కొత్తపల్లి కుటుంబాలకు చాలా దగ్గరి బంధుత్వం ఉంది. నాగరాజునాయుడు తన 1.14 ఎకరాల భూమికి సంబంధించి పాస్‌పుస్తకాలను చిత్తూరు జిల్లా రంగంపేట బ్యాంక్‌లో 2012లో తనఖాపెట్టి 40వేల రూపాయల వ్యవసాయ రుణం తీసుకున్నాడు. రుణమాఫీ కింద తన రుణం కూడా రద్దయిందని ఆయన భావించాడు. అనుకున్నట్లే ప్రభుత్వం నుంచి పత్రాలు కూడా ఆయనకు అందాయి. కానీ బ్యాంకు ఖాతాలో ఒక పైసా కూడా జమ కాలేదు. తీసుకున్న అప్పు మొత్తం చెల్లించాలని, లేకపోతే పొలాన్ని జప్తు చేస్తామని పలుమార్లు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ముఖ్యమంత్రి సమీప బంధువుని అని మొత్తుకున్నా బ్యాంకు వారు వినలేదు. ప్రభుత్వం నుంచి డబ్బు రాలేదని, తాము మాత్రం ఏం చేస్తామని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తూనే వచ్చారు. ఈనేపథ్యంలో ఆదివారం ముఖ్యమంత్రి సొంత గ్రామం నారావారిపల్లెలో జన్మభూమి-మా ఊరు గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు నాగరాజు నాయుడు కుటుంబ సభ్యులతో కలసి వచ్చి టీడీపీ నాయకులు, అధికారులను నిలదీశారు. అంతకు ముందు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల రుణ మాఫీని పూర్తిస్థాయిలో చేయలేదని విమర్శించారు. రైతులకు ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. -
రుణమాఫీ ప్రహసనంగా చేసి ఇప్పుడు యాత్రలా?
ప్రశ్నించిన లోక్‌సత్తా నాయకులు శ్రీకాకుళం అర్బన్ : రైతుల రుణమాఫీని ఎన్నో అడ్డంకులతో, అవకతవకలతో ఒక ప్రహసనంలా చేసి ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టనున్న ‘రైతు కోసం చంద్రన్న యాత్రలు’ వారికి భరోసానిస్తాయా అని లోక్‌సత్తా పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తకోట పోలినాయుడు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంచాది రాంబాబు ప్రశ్నించారు. శ్రీకాకుళంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. హుద్‌హుద్ తుఫాన్ వల్ల కుదేలైన రైతులకు కనీసం బీమా అందజేయలేదన్నారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలన్న చంద్రబాబు ఇప్పుడెందుకు వాటి గురించి ప్రస్తావించడంలేదని ప్రశ్నించారు. రైతుల ఉత్పత్తులు ఎక్కడైనా విక్రయించేలా వీటిపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ ప్రకటన చేయాలన్నారు. దళారీ వ్యవస్థను రద్దు చేసి కౌలు రైతులకు ప్రభుత్వ రాయితీలు అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ యాత్రకు అర్థం ఉండదన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా కోశాధికారి ఎ. మల్లేశ్వరరావు, వి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
రుణమాఫీపై షరతులు సరికాదు
జగ్గంపేట :అధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చంద్రబాబునాయుడు ఇప్పుడు రుణమాఫీపై షరతులు విధించడం సమంజసం కాదని అసెంబ్లీలో వైఎస్సార్ సీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. పార్టీ పిలుపు మేరకు జగ్గంపేటలో ఆదివారం నరకాసుర వధ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న నెహ్రూ మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు రూ. 1 లక్షా 2వేల కోట్ల రుణాలున్నాయని వీటిలో రూ. 87వేల కోట్లు రైతులవి కాగా రూ. 14 వేల కోట్లు డ్వాక్రా సంఘాల వారివన్నారు. ఈ రుణాలన్నింటిని మాఫీ చేస్తానని నమ్మబలికి గద్దెనెక్కిన చంద్రబాబు ఇప్పుడు మాటమార్చారని ఆరోపించారు. రైతులను దొంగలుగా చిత్రీకరించి మాట్లాడడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. పూర్తి స్థాయిలో రుణమాఫీని ప్రకటించాలని, లేని పక్షంలో ైవె ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందన్నారు. అనంతరం చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్‌కుమార్, వైస్ ఎంపీపీ, పార్టీ మండల కన్వీనర్ మారిశెట్టి భద్రం, ఒమ్మి రఘురామ్, నాలుగు మండలాల పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.