కేసీఆర్‌కు క్యారికేచర్‌ను బహూకరిస్తున్న బీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీతోపాటు ఇటీవల కేబినెట్ తీసుకున్న పలు నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలుపుతూ సీఎం కేసీఆర్‌ను పలువురు మంత్రులు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం శాసనసభకు వచ్చి న కేసీఆర్‌ను కలిసేందుకు సీఎం చాంబర్ వద్ద ఎమ్మెల్యేలు బారులు తీరడంతో సందడి నెలకొంది. రూ.19 వేల కోట్ల మేర రైతు రుణమాఫీ చేస్తూ, సీఎం చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని ధన్యవాదాలు తెలిపారు.అలాగే హైదరాబాద్‌లో మెట్రోరైలు విస్తరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది విలీనంతోపాటు నోటరీ ఆస్తుల క్రమబద్దికరణ వంటి నిర్ణయాలపట్ల కృతజ్ఞతలు తెలిపారు.
కేసీఆర్‌ను రైతుబాంధవుడిగా పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా రైతుల కుటుంబాలు సంబురాలు చేసుకుంటున్నాయని పలువురు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, కొప్పుల, గంగుల, ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్ అలీ, తలసాని, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉన్నారు.
ఉమ్మడి జిల్లాలవారీగా సంబంధిత జిల్లా మంత్రులతో కలిసి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందజేసి రైతు రుణమాఫీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, కార్పొరేషన్ల చైర్మన్లు వేణుగోపాలాచారి, ఆంజనేయ గౌడ్ ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్, రైతన్నల మధ్య వాత్సల్యానికి అద్దంపట్టే క్యారికేచర్‌ను ఈ సందర్భంగా సీఎంకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment