
స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు చాలా కీలకమని.. వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వండంటూ మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఆయన నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. ‘‘మీ ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు నా దగ్గర ఉన్నాయి. నేను మారాను.. మీరూ మారండి’’ అంటూ సీఎం సూచించారు.
కొందరు ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం చూపిస్తున్నారు. అతి చేస్తే సహించేది లేదని రేవంత్ స్పష్టం చేశారు. ప్రతి పక్షాలకు ధీటుగా కౌంటర్ ఇవ్వండి. కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృత ప్రచారం జరగాలి’’ అని రేవంత్ చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి బృందం జనవరి 21 నుంచి 23 వరకూ స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో పర్యటించనున్నారు. దావోస్‌లో 20 నుంచి 24వ తేదీ వరకూ ఐదు రోజుల పాటు ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ వార్షిక సదస్సు జరగనుంది. ప్రస్తుత పర్యటనలోనూ మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్..