సాక్షి, హైదరాబాద్: నగర నార్త్ సిటీ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మెట్రో(Metro) పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేయాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్‌పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్‌ఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల కారిడార్.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం తెలిపారని మెట్రో ఎండీ మీడియాకు వెల్లడించారు. డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: TSRTC: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment