Shamirpet
-
హైదరాబాద్ నార్త్ సిటీ మెట్రో రైల్.. రెండు రూట్లలో డబుల్ డెక్కర్!
సాక్షి, హైదరాబాద్: నార్త్‌సిటీ మెట్రో కారిడార్లపై హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రోరైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఆర్‌ఎల్) దృష్టి సారించింది. మార్చి నాటికి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)ను రూపొందించే దిశగా అధికారులు కార్యాచరణ చేపట్టారు. ఈమేరకు రెండు కారిడార్లలో క్షేత్రస్థాయిలో అధ్యయనం మొదలైంది. కారిడార్ల నిర్మాణానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, ఎదురు కానున్న సమస్యలు తదితర అంశాల ఆధారంగా అధికారులు సర్వే చేపట్టారు. ఈ రెండు రూట్లలో ఇప్పటికే హెచ్ఎండీఏ (HMDA) ఆధ్వర్యంలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సన్నాహాలు చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ మార్గాల్లోనే మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో డబుల్ డెక్కర్ కారిడార్ల కోసం పియర్స్ ఎత్తును ఏమేరకు పెంచాల్సి ఉంటుంది, ఈ క్రమంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందనే అంశాలను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెండు కారిడార్లు సైతం డబుల్ డెక్కర్ (Double Deccar) పద్ధతిలో చేపట్టనున్న దృష్ట్యా ఇతర ఎలివేటెడ్ మెట్రోల కంటే నార్త్‌సిటీ మెట్రో (North City Metro) భిన్నంగా ఉండనుంది. ఇందుకనుగుణంగా డీపీఆర్ సిద్ధం చేయనున్నారు. 3 నెలల్లో డీపీఆర్ రెడీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆదేశించిన నేపథ్యంలో అధికారులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రాజెక్టు నివేదిక కోసం కసరత్తు చేపట్టారు.హెచ్ఎండీఏతో సమన్వయం.. రెండు రూట్లలో ఎలివేటెడ్ కారిడార్ల కోసం నిర్మించే పియర్స్పైనే మెట్రో కారిడార్ రానుంది. దీంతో నార్త్‌సిటీ మెట్రోకు పియర్స్ ఎత్తు, మెట్రో స్టేషన్ల నిర్మాణం కీలకం కానున్నాయి. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫామ్‌కు, శామీర్‌పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్లకు హెచ్ఎండీఏ కార్యాచరణ చేపట్టింది. దీంతో మెట్రో నిర్మాణంపై హెచ్‌ఏఎంఆర్‌ఎల్ సంస్థ హెచ్ఎండీఏతో కలిసి పని చేయనుంది. పియర్స్, కారిడార్ల నిర్మాణం తదితర అంశాల్లో రెండు సంస్థల భాగస్వామ్యం తప్పనిసరి. డబుల్ డెక్కర్ వల్ల నిర్మాణ వ్యయం తగ్గడంతో పాటు నగర వాసులకు ఒకే రూట్లో రోడ్డు, మెట్రో సదుపాయం అందుబాటులోకి రానుంది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కి.మీ. మెట్రో కారిడార్‌లో డెయిరీఫామ్ వరకు అంటే 5.32 కి.మీ డబుల్‌డెక్కర్ ఉంటుంది. మిగతా 17.68 కి.మీ ఎలివేటెడ్ పద్ధతిలోనే నిర్మించనున్నారు. మరోవైపు జేబీఎస్ (JBS) నుంచి శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. మార్గంలో ఇంచుమించు పూర్తిగా డబుల్‌డెక్కర్ నిర్మాణమే. ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్‌కు దాదాపు 23 కి.మీ, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, అల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూంకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్ వరకు 22 కి.మీ. పొడవుతో మెట్రో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ రెండు కారిడార్లను మెట్రో రెండో దశ ‘బి’ విభాగం కింద చేర్చనున్నారు.ఇదీ చదవండి: చర్లపల్లి తరహాలో మరిన్ని రైల్వే స్టేషన్లుడబుల్డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ల వల్ల సికింద్రాబాద్ నుంచి ఉత్తరం వైపు వివిధ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రయాణ కష్టాలు తీరనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, విద్యార్ధులు, వివిధ రంగాల్లో పని చేసే అసంఘటిత కారి్మక వర్గాలు సిటీ బస్సులు, సెవెన్ సీటర్ ఆటోలు, సొంత వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది. దీంతో వాహనాల రద్దీ, గంటల తరబడి ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు.అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలుమెట్రో రెండో దశపై కేంద్రం ఆమోదం లభించిన వెంటనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మెట్రో నిర్మాణానికి నిధుల కొరత ఏ మాత్రం సమస్య కాదని, కేంద్రం నుంచి సావరిన్ గ్యారంటీ లభిస్తే అంతర్జాతీయ సంస్థల నుంచి రుణాలు పొందవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెన్నై, బెంగళూర్లలో మెట్రో విస్తరణకు గత బడ్జెట్లలో నిధులు కేటాయించినట్లుగానే హైదరాబాద్ మెట్రోకు కూడా ఈసారి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. -
ప్రాణం తీసిన చీర గొడవ
శామీర్‌పేట్: చీర కారణంగా చెలరేగిన వివాదం తల్లి, కుమార్తె మధ్య ఘర్షణకు దారితీయగా అడ్డు వచ్చిన తండ్రిని కుమారుడు హత్య చేసిన సంఘటన మంగళవారం రాత్రి శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మేడ్చల్ జిల్లా, శామీర్‌పేట, పెద్దమ్మ కాలనీలో హన్మంతు (50), పెద్దమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బుధవారం తల్లి, కుమార్తెకు చీర విషయమై గొడవ జరిగింది. ఈ విషయంలో తండ్రి హన్మంతు, పెద్దకొడుకు నర్సింహ జోక్యం చేసుకోవడంతో వారి మధ్య ఘర్షకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న నర్సింహ తండ్రిపై రోకలిబండతో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న శామీర్‌పేట పోలీసులు పంచనామా నిర్వహించారు. నిందితుడి రిమాండ్... శామీర్‌పేట సీఐ శ్రీనాథ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. నిందితుడు నర్సింహను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
హైదరాబాద్ మెట్రో రెండో దశ.. కొత్త కారిడార్లలో మెగా జంక్షన్లు
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ కారిడార్లలో మెగా జంక్షన్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండో దశలోని పార్ట్ ‘బి ’ప్రతిపాదిత జేబీఎస్– శామీర్‌పేట్ (22 కి.మీ.), ప్యారడైజ్ – మేడ్చల్ (23 కి.మీ.) మార్గాలకు ఉమ్మడిగా ఒక మెగా జంక్షన్ (Mega Junction) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Revanth Reddy) సూచనల మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. రెండో దశలోని పార్ట్ ‘ఏ’లో ఉన్న 5 కారిడార్ల డీపీఆర్‌లకు కేంద్రం నుంచి త్వరలో ఆమెదం లభించే అవకాశాలు ఉన్నాయన్నారు. కేంద్రం అనుమతి లభించిన వెంటనే పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. అప్పటివరకు పాతబస్తీలో భూసేకరణ, రోడ్ల విస్తరణలో భాగంగా కూల్చివేతలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.సంక్రాంతి సందర్భంగా ఎల్అండ్ టీ మెట్రో, హైదరాబాద్ మెట్రో రైల్ (Hyderabad Metro Rail) సంస్థలు ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ప్రారంభించిన ‘మి టైం ఆన్ మెట్రో’ (Me Time On My Metro) మూడు రోజుల వినూత్న ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎల్అండ్ టీ హైదరాబాద్ మెట్రో ఎండీ కేవీబీరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.మెట్రో సృజనాత్మక వేదిక.. ప్రయాణికులు సృజనాత్మక నైపుణ్యాలను ప్రదర్శించుకొనేందుకు మెట్రోస్టేషన్లు చక్కటి వేదికలుగా నిలుస్తాయని ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఎంజీబీఎస్ స్టేషన్‌తోపాటు అన్ని ప్రధాన స్టేషన్లలో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నిత్యం లక్షలాది మందికి ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న మెట్రో ఇప్పుడు ప్రయాణికులకు సరికొత్త అనుభూతులను అందజేయనుందని తెలిపారు. కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగాల పట్ల అభిరుచి ఉన్న ప్రయాణికులు మెట్రో స్టేషన్లలో తమ సృజనాత్మక కళా రూపాలను ఆవిష్కరించుకోవచ్చని అన్నారు.‘మెట్రో అంటే కేవలం కాంక్రీట్, గోడల నిర్మాణాలతో కూడిన ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు. అది హైదరాబాద్ జనజీవితాలతో ముడిపడి ఉన్న ఆత్మ వంటిది’అని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా మెట్రో ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా కొన్ని ముఖ్యమైన స్టేషన్ల జంక్షన్లను, విశాలమైన స్థలాలను ప్రత్యేక హబ్‌లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. చదవండి: కూల్చి'వెతలు' లేని హైవే!ఎల్ అండ్‌టీ మెట్రోరైల్ ఎండీ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్డర్ ఇచ్చిన తరువాత 18 నెలల్లో కొత్త రైళ్లు రానున్నట్లు పేర్కొన్నారు. అనంతరం ‘మి టైం ఆన్ మెట్రో’ప్రచారంలో భాగంగా లఘు చిత్రాలను, నృత్యాలను పలువురు ప్రదర్శించారు. ‘సంక్రాంతి సంబురాలు’గా చేపట్టిన ఈ ప్రచార కార్యక్రమం రూపొందించిన మెట్రో రైలును ఎన్వీఎస్ రెడ్డి, కేవీబీరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించారు. -
హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. మేడ్చల్, శామీర్‌పేట్‌కు మెట్రో పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: నగర నార్త్ సిటీ వాసులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. మేడ్చల్, శామీర్‌పేట్‌లకు మెట్రో(Metro) పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీపీఆర్ సిద్ధం చేయాలని హెచ్ఎంఆర్ఎల్ అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కిలోమీటర్లు), జేబీఎస్-శామీర్‌పేట్ (22 కిలోమీటర్లు) మెట్రో కారిడార్ల డీపీఆర్‌ల తయారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ప్యారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి తాడ్‌బండ్, బోయిన్పల్లి, సుచిత్ర సర్కిల్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, ఆర్ఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా మేడ్చల్ వరకు 23 కిలోమీటర్ల కారిడార్.. జేబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి విక్రమ్‌పురి, కార్ఖానా, తిరుమలగిరి, లోతుకుంట, ఆల్వాల్, బొల్లారం, హకీంపేట్, తూముకుంట, ఓఆర్ఆర్ ఎగ్జిట్ మీదుగా శామీర్‌పేట్‌కు 22 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ విస్తరించి ఉంటుందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. డీపీఆర్ తయారీని మూడు నెలల్లో పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని సీఎం తెలిపారని మెట్రో ఎండీ మీడియాకు వెల్లడించారు. డీపీఆర్, ఇతర అనుబంధ డాక్యుమెంట్ల తయారీ చేపడుతున్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: TSRTC: సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు -
రూ.10 లక్షల డిమాండ్.. ఏసీబీ వలలో శామీర్‌పేట తహసీల్దార్
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ మల్కాజీగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ మంగళవారం తహసీల్దార్ సత్యనారాయణ ఏబీసీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ వ్యక్తికి సంబంధిచిన భూమికి పట్టాదారు పాసుబుక్ జారీ చేసేందుకు సదరు తహసీల్దార్ రూ.10 లక్ష లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా.. పక్కా ప్రణాళికతో సత్యనారాయణ డ్రైవర్ డబ్బులు తీసుకునే క్రమంలో రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. అయితే తహసీల్దార్ సత్యనారాయణ తీసుకోమని చెబితేనే తాను లంచం డబ్బు తీసుకున్నానని డ్రైవర్ తెలిపారు. దీంతో ఏసీబీ అధికారులు.. తహసీల్దార్ సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు. -
Mallareddy: మల్లారెడ్డిపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. గిరిజనుల భూములు కబ్జా చేశారని ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్‌లో మల్లారెడ్డిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. శామీర్‌పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపిన వివరాల ప్రకారం.. మేడ్చల్ మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని సర్వేనెంబర్ 33, 34, 35లో గల 47 ఎకరాల 18 గుటల ఎస్టీ (లంబాడీల) వారసత్వ భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, అతని బినామీ అనుచరులు 9 మంది అక్రమంగా కబ్జా చేసి, కుట్రతో మోసగించి భూమిని కాజేశారు. దీనికి సంబంధించి శామీర్‌పేట పోలీస్టేషన్లో ఫిర్యాదు నమోదు అయ్యింది. మొత్తం 47 ఎకరాలు కబ్జా చేశారని ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్ రెడ్డి, కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ భర్త గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా సహకార సంఘం వైస్ చైర్మన్ శామీర్‌పేట్ మండల వ్యవసాయ సహకార సేవా సంఘం చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిలపై శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు 420 చీటీంగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శామీర్‌పేట్ ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్పై వేగంగా వచ్చిన ఇనోవా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లారీని వెనుకను నుంచి ఢీ కొట్టింది. కీసర నుంచి మేడ్చల్ వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఇనోవా వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న శామీర్ పేట పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులను కుత్బుల్లాపూర్‌కు చెందిన డ్రైవర్ మారుతి, ప్రయాణికుడు రాజుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు శామీర్ పేట పోలీసులు పేర్కొన్నారు. బిజినెస్‌లో భాగస్వామ్యులు అయిన నలుగురు కలిసి తిరుపతిలో శ్రీవారిని దర్శించుకొని ఇన్నోవా కారులో తిరి ప్రయాణమయ్యారు. కాసేపట్లో ఇంటికి చేరుకుంటామనేలోపే ఈ ప్రమాదం సంభవించింది. వీళ్లు ప్రయాణిస్తున్న కారు షామీర్పేట్ ఓఆర్ఆర్పై అశోక్ లేలాండ్ గూడ్స్ వాహనాన్ని వెనక నుంచి గుద్దుకుంది. దైవ దర్శనానికి వెళ్లి ఇద్దరు మృత్యువాత పడటంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. -
భూముల కొనుగోళ్లకు టాప్–5 కారిడార్లు
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట, మహారాష్ట్రలోని నేరల్–మాతేరన్, గుజరాత్ లోని సనంద్–నల్సరోవర్ భూములపై పెట్టుబడులకు టాప్–5 కారిడార్లుగా కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. వచ్చే పదేళ్లలో వీటి నుంచి పెట్టుబడులపై ఐదు రెట్ల వరకు రాబడులు రావచ్చ ని పేర్కొంది. ఈ ప్రాంతాల్లో భూములను కొనుగో లు చేసే ఇన్వెస్టర్లు.. వాటిని వీకెండ్ హోమ్స్, హాలీడే హోమ్స్, రిటైర్మెట్ హోమ్స్‌గా అభివృద్ధి చేయడం ద్వారా స్థిరమైన అద్దె ఆదాయం పొందొచ్చని పేర్కొంది. దీనికితోడు పెట్టుబడి సైతం వృద్ధి చెందుతుందని, తద్వారా మంచి రాబడులు సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ‘‘భూమి పై పెట్టుబడి పెట్టడం రాబోయే రోజుల్లో బంగారం గనిని వెలికి తీసినట్టే అవుతుంది. మెరుగైన రాబడులకు వీలుగా ఆ భూమిని వినయోగించుకోవడం తెలిస్తే పెట్టుబడి కలిసొస్తుంది’’అని కొలియర్స్ ఇండియా పేర్కొంది. మూడు రెట్లు హైదరాబాద్ శివార్లలోని కొంపల్లి–మేడ్చల్–శామీర్‌పేట కారిడార్‌లో భూములపై రాబడులు వచ్చే పదేళ్లలో మూడు రెట్లు ఉంటాయని కొలియర్స్ ఇండియా నివేదిక అంచనా వేసింది. పెట్టుబడిని భూమి ఎన్నో రెట్లు పెంచగలదని, సరైన రీతిలో వినియోగిస్తే స్థిరమైన ఆదాయానికి వనరుగా మారుతుందని సూచించింది. అద్దె ఆదాయం, పెట్టుబడి వృద్ధి, వ్యాపార కార్యకలాపాల ద్వారా ఇలా ఎన్నో రూపాల్లో ఆదాయం పొందొచ్చని వివరించింది. దేశవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లోని ఆర్థిక, పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో వచ్చే సూక్ష్మ మార్కెట్లకు రానున్న సంవత్సరాల్లో మంచి డిమాండ్ ఏర్పడుతుందని, స్మార్ట్ ఇన్వెస్టర్లకు ఇవి మంచి రాబడులు ఇస్తాయని అంచనా వేసింది. -
శామీర్‌పేట్ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్ నటుడు
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దార్థ్‌పై నటుడు మనోజ్ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు నటుడు మనోజ్. గన్ ఫైర్ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పులు జరిపిన మనోజ్ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు. అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్ అనే ఓ వ్యక్తి గన్ ఫైర్ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్ క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్‌పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల మనోజ్.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్‌కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar) చదవండి: శామీర్‌పేట్ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్ ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్ను అందరిముందే అవమానించిన స్టార్ హీరో -
Shamirpet: పిల్లల కోసం కాల్పులు.. ఇదొక హైప్రొఫైల్ ట్విస్టుల స్టోరీ
సాక్షి, రంగారెడ్డి: శామీర్‌పేట కాల్పుల వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది. భర్త సిద్దార్థ్‌తో(42) విడిపోయిన స్మిత గ్రంథి.. మనోజ్‌తో సహజీవనం చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్, స్మితలకు ఒక కొడుకు కూతురు ఉండగా.. పిల్లలను తనకు అప్పగించాలని కొంతకాలంగా సిద్ధార్థ్ పోరాటం చేస్తున్నాడు. పిల్లలపై మనోజ్ దాడి చేశారంటూ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మనోజ్‌పై స్మిత కొడుకు ఫిర్యాదు మనోజ్‌పై స్మిత కొడుకు సైతం సంచలన ఆరోపణలు చేశాడు. మనోజ్ చిత్రహింసలు పెట్టాడని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. స్మిత కొడుకు కూకట్‌పల్లిలోని ఫిడ్జ్ కళాశాలలో 12వ తరగతి చదువుతుండగా, కుమార్తె శామీర్‌పేటలోని శాంతినికేతన్ రెడిసెన్షియల్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. ప్రస్తుతం పిల్లలిద్దరూ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సంరక్షణలో ఉన్నారు. పిల్లల కోసం రావడంతో ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్‌లోని సెలబ్రిటీ క్లబ్లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి ఆగ్రహించిన మనోజ్.. ఎయిర్ గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మనోజ్ మౌన పోరాటం, కార్తీక దీపం వంటి పలు సీరియల్లో నటించాడు. సిద్ధార్థ్, స్మిత మధ్య విడాకుల కేసు సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్‌లో హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్‌తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్‌తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. నేడు సిద్ధార్థ్ తన పిల్లలను చూడటానికి రిసార్ట్‌కు రాగా మనోజ్ ఎయిర్ గన్‌తో కాల్పులు జరిపాడని తెలిపారు. చదవండి: పెళ్లైన 15 నెలలకే విషాదం.. గుండెపోటుతో లహరి మృతి -
శామీర్‌పేటలో కాల్పుల కలకలం..
సాక్షి, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట సెలబ్రిటీ క్లబ్లో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. సిద్ధార్ధ్ దాస్ అనే వ్యక్తిపై మనోజ్ కుమార్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో సిద్దార్థ్‌కు గాయాలవ్వగా ఆసుపత్రికి తరలించారు. బాధితుడు ఫిర్యాదుతో శామీర్‌పేట పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వివాహేతర సంబంధం నేపథ్యంలో మనోజ్ ఈ కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్మిత, సిద్ధార్థ్ లకు గతంలో వివాహమయింది. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే బేధాభిప్రాయాలతో ఇద్దరు విడివిడిగా ఉంటున్నారు. స్మిత ప్రస్తుతం మనోజ్ తో కలిసి శామీర్ పేటలో ఓ విల్లాలో ఉంటోంది. ఈ క్రమంలో తన పిల్లల కోసం సిద్ధార్థ్ విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చాడు. శంషాబాద్‌లోని సెలబ్రిటీ క్లబ్లో ఉంటున్న స్మిత దగ్గకు వెళ్లాడు. ఈ క్రమంలో సిద్ధార్థ్‌ను చూసి ఆగ్రహించిన మనోజ్.. ఎయిర్ గన్‌తో అతనిపై కాల్పులు జరిపాడు. మనోజ్ కాల్పుల నుంచి తప్పించుకున్న సిద్ధార్థ్..ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సిద్ధార్థ్ అతని భార్య స్మితకు 2019 నుంచి విభేదాలు ఏర్పడ్డాయని మేడ్చల్ డీసీపీ సందీప్ తెలిపారు. దీంతో సిద్ధార్థ్ నుంచి విడాకులు కావాలని అదే ఏడాది కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో స్మిత విడాకులు ధరఖాస్తు చేసిందని పేర్కొన్నారు. సిద్ధార్థ్ వైజాగ్‌లో హిందూజా థర్మల్ పవర్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడని చెప్పారు. సిద్ధార్థ్‌తో విడిపోయిన తర్వాత స్మిత మనోజ్‌తో ఉంటుందని, గత మూడేళ్ళుగా సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో కలిసి ఉంటున్నారని చెప్పారు. -
Writers Meet 2022: కొత్త రచయితల గట్టి వాగ్దానం
‘తెలుగులో ఇంత వరకూ బెస్తవారి మీద మంచి నవల లేదు. ఆ నవల బెస్త సమూహంలోని రచయిత నుంచే రావాలి. నేను ఆ వెలితిని పూడ్చాలనుకుంటున్నాను’ అన్నాడు ప్రసాద్ సూరి. ఇతను హైదరాబాద్‌లో ఫైన్ ఆర్ట్స్ చదువుతున్నాడు. ఇప్పటికే రెండు నవలలు రాశాడు. ‘మా చిత్తూరులోని బహుదా నది ఎండిపోతే ఏడుస్తాను. ప్రవహిస్తే నవ్వుతాను. దాని చుట్టుపక్కల జీవితాలను కథలుగా రాస్తాను’ అన్నాడు సుదర్శన్. ఇతనికి డిజిటల్ మార్కెటింగ్ ఉంది. ‘బహుదా కథలు’ అనే పుస్తకం వెలువరించాడు. ‘మా పార్వతీపురంలో నా వయసు రచయితలు ఎవరూ లేరు. ఇప్పటి కాలంలో నాతోనే మా ప్రాంతంలో మళ్లీ కథలు మొదలయ్యాయి’ అంటాడు భోగాపురం చంద్రశేఖర్. ‘రాయలసీమ అంటే ఫ్యాక్షనిజం, కరువు అనుకోవద్దు. ఆకాశం ఉంది. ప్రేమ ఉంది. ఆప్యాయతలు ఉన్నాయి. అవి నేను రాస్తు న్నాను’ అన్నాడు సురేంద్ర శీలం. రెండు రోజుల ‘శీతాకాల కథా ఉత్సవం’లో యువ రచయితల మాటలు ఇవి. ప్రతి ఏటా జరుగుతున్న ట్టుగానే ఈ సంవత్సరం ‘రైటర్స్ మీట్’ ఆధ్వర్వంలో హైదరాబాద్ సమీపాన శామీర్‌పేటలో ‘ల్యాండ్ ఆఫ్ లవ్’ సౌందర్య క్షేత్రంలో నవంబర్ 26, 27 తేదీలలో 50 మంది రచయితలు, విమర్శకులు, పాఠకులు ‘శీతాకాల కథాఉత్సవం’లో పాల్గొన్నారు. వీరిలో అందరినీ ఆకట్టున్నది యువ రచయితలే. ఐటీ రంగంలో పని చేస్తూ కథలు రాస్తున్న శ్రీ ఊహ, అంట్రప్రెన్యూర్‌గా ఉంటూ కథను ప్రేమించే రుబీనా పర్వీన్, స్త్రీల సమస్యలను ప్రస్తావించే నస్రీన్ ఖాన్, విజయవాడ కథకుడు అనిల్ డ్యాని, తెలంగాణ కథను పరిశోధించిన దేవేంద్ర... ఇక కుల వివక్షను, పేదరికాన్ని అధిగమించి రచయితగా ఎదిగిన యాకమ్మ ప్రయాణం అందరి చేత కంటతడి పెట్టించింది. స్పార్క్ ఉన్న వర్ధమాన రచయితలను వెతికి ఆహ్వానాలు పంపడం రైటర్స్ మీట్ ప్రత్యేకత. వారిలో ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేయటంతో పాటు సీనియర్ రచయితలచే కథారచనలో మెళకువలను నేర్పుతారు ఈ శిబిరంలో. రచయితల మధ్య స్నేహపూరిత వాతావరణాన్ని కల్పించి ఒకరికి ఒకరు దోహదపడేలా చేయడం కూడా రైటర్స్ మీట్ ఉద్దేశాలలో ఒకటి. ఈ సంవత్సరం జరిగిన రైటర్స్ మీట్లో ప్రముఖ రచయితలు వి.రాజా రామమోహనరావు, వాడ్రేవు చినవీరభద్రుడు, అయోధ్యా రెడ్డి కథా రచనలో తమ అనుభవాలను పంచారు. ఖాన్ యజ్దానీ, జి.వెంకట కృష్ణ, రమణమూర్తి, ఆదిత్య కొర్రపాటి కథావిమర్శ చేశారు. మలయాళ భాష రచయితలు బుకర్ ప్రైజ్ వరకూ ఎదుగుతుంటే తెలుగులో ఎవరూ అంతవరకు ఎందుకు పోవడం లేదన్న ప్రశ్న వచ్చింది. ‘కథను ఏ రచయితైనా చదివిస్తాడు. కానీ రెండోసారి పాఠకుడు ఆ కథను చదవాలంటే అందులో ఏం ఉండాలి’ అనే ప్రశ్న ఆలోచనల్లో పడేసింది. కథకులకు ఉండాల్సిన దృక్పథం గురించి ఖాన్ యజ్దానీ మాట్లాడితే, ‘కథలు రాయండి. ప్రవక్తలుగా మారకండి. రాస్తూ వెళ్లడమే మీ పని’ అన్నారు అయోధ్యా రెడ్డి. వి.రాజా రామమోహనరావు యువతరాన్ని భయపడవద్దనీ, నచ్చినట్టు రాయమనీ సలహా ఇచ్చారు. పాల్గొన్న ప్రతివారు తమ రచనల నేపథ్యాన్నో, రాయవలసిన కథాంశాలనో స్పృశించారు. కరుణ కుమార్, మహి బెజవాడ, సాయి వంశీ తదితరులు తాము ఎలాంటి హోమ్ వర్క్ చేస్తారో తెలియ చేశారు. చాలా ఆలస్యంగా కథా రచన ఆరంభించిన మారుతి పౌరోహిత్యం, చిలు కూరు రామశర్మ తమ రచనలను చెప్పిన తీరు ఆకర్షణీయమే. పాఠకులుగా విచ్చేసిన శుభశ్రీ, దేవిరెడ్డి రాజేశ్వరి లోతు తక్కువ కథలు రావడానికి రచయితలు తగినంతగా చదవకపోవడమే కారణమని అభిప్రాయపడ్డారు. (చదవండి: ఆత్మ గలవాడి కథ.. ఆయన మరణం కూడా చడీ చప్పుడు లేకుండా..) శీతాకాల కథా ఉత్సవాన్ని ఒక ఉత్సవంగా నిర్వహించడంలో భాగంగా ఈసారి రఘు మందాటి ఫొటో ఎగ్జిబిషన్ ‘థండర్ డ్రాగన్’, శ్రీపాల్ సామా దర్శకత్వం వహించిన ‘హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే’ సినిమా ప్రదర్శన, రచయిత్రి ఝాన్సీ పాపుదేశి కథల పుస్తకం ‘దేవుడమ్మ’ ఆవిష్కరణ ఆకర్షణలుగా నిలిచాయి. కథా రచన పట్ల కొత్త కమిట్మెంట్ను, కథకుల మధ్య కొత్త బాండింగ్‌ను ఏర్పరచిన ఈ రైటర్స్ మీట్ సమావేశాలు కొత్త తరానికి నూతనోత్సాహాన్ని పంచే కాంతిపుంజాలు. (చదవండి: రా.రా. ఓ నఖరేఖా చిత్రం!) - సి.ఎస్. రాంబాబు ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి, రచయిత -
దేశ నిర్మాణంలో మానవ వనరుల పాత్ర కీలకం
శామీర్‌పేట్: దేశ నిర్మాణంలో మానవ వనరుల పాత్ర కీలకమైందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శామీర్‌పేట్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో నల్సార్ డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్(డీవోఎంఎస్), సొసైటీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ హైదరాబాద్(ఎస్‌హెచ్‌ఆర్‌డీ) సంయుక్తంగా లీగల్ ఆక్యూమెన్ ఫర్ హెచ్ఆర్ లీడర్స్ పేరుతో నిర్వహించిన సదస్సులో గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నవారికి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తమిళిసై మాట్లాడుతూ సమాజం మొత్తం ఆనందంగా ఉండాలంటే సానుకూల మనసు, ఆరోగ్యం అవసరమని అన్నారు. ప్రపంచానికి నిరంతర అభ్యాసం, అభివృద్ధి అవసరమని, అందుకు మానవ వనరులే ముఖ్యమని పేర్కొన్నారు. ఈ క్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేయడంలో హెచ్ఆర్ లీడర్లు ముఖ్యపాత్ర పోషిస్తారని అన్నారు. నల్సార్ వైస్ చాన్స్‌లర్, రిజిస్ట్రార్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్క్‌షాప్‌లో 200 మంది హెచ్ఆర్ లీడర్లు పాల్గొన్నారని చెప్పారు. ఈ సందర్భంగా హెచ్ఆర్ లీడర్లు నిర్వహించే పని గురించి వివరించారు. కార్యక్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అధిపతి విద్యాలతారెడ్డి, ఎస్‌హెచ్‌ఆర్‌డీ కో ఫౌండర్ రమేశ్ మంతన, హిందు మాధవి, హెచ్ఆర్ లీడర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. -
నల్సార్ సాహసోపేతమైన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఎల్జీబీటీక్యూ+ (లెస్బియన్, గే, ద్విలింగ, ట్రాన్స్‌జెండర్, క్వీర్ ప్లస్ ) విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఒకడుగు ముందుండే నేషనల్ అకాడమీ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ (నల్సార్) మరో సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. లింగ గుర్తింపు లేనివారి కోసం హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. లేడీస్ హాస్టల్–6లో ఏర్పాట్లు.. నల్సార్‌లో బాలికల హాస్టల్–6 భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌ను పూర్తిగా లింగ గుర్తింపు లేని (జెండర్ న్యూట్రల్)వారికోసం కేటాయించారు. అకడమిక్ బ్లాక్‌లో గ్రౌండ్ ఫ్లోర్లో లింగ గుర్తింపు లేనివారి కోసం వాష్‌రూమ్స్‌ను ఏర్పాటు చేశామని నల్సార్ వైస్ చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఇక ‘జెండర్, సెక్సువల్ మైనారిటీ’అంశాలపై సమగ్ర విద్యా విధానం కోసం యూనివర్సిటీ ట్రాన్స్ పాలసీ కమిటీ ముసాయిదా విధానాన్ని త్వరలో అమలు చేయనుంది. 2015 జూన్‌లో నల్సార్‌లోని ఓ 22 ఏళ్ల బీఏ ఎల్ఎల్బీ విద్యార్థి తన గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ గుర్తింపు వద్దని వర్సిటీ ప్రతినిధులను అభ్యర్థించగా.. ఆ అభ్యర్థనను ఆమోదించి.. సదరు స్టూడెంట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లో జెండర్ కాలమ్‌లో మిస్టర్, మిస్కి బదులుగా ‘ఎంఎక్స్’గా పేర్కొంటూ సర్టిఫికెట్‌ను జారీ చేసింది. నల్సార్ వర్సిటీకి రూ.1.50 కోట్ల విరాళం శామీర్‌పేట్: నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆండ్ బిజినెస్ లా(జేఆర్‌సీఐటీబీఎల్) అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపార న్యాయ కేంద్రం ఏర్పాటుకు దాత జస్టిస్ బీపీ. జీవన్‌రెడ్డి రూ. కోటి 50 లక్షల చెక్కును నగరంలోని ఆయన నివాసంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అంతర్జాతీయ వాణిజ్య, వ్యాపారకేంద్రం ఏర్పాటుతో చట్టాల్లో సమకాలిన సమస్యలకు సంబంధించిన బోధన, పరిశోధన చేపట్టే లక్ష్యాలు అయిన సెమినార్లు, ఉపన్యాసాలు, స్వల్పకాలిక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. నల్సార్ అండర్ గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, డాక్టోరల్ స్థాయిలో కోర్సులను ప్రారంభించడం, బలోపేతం చేయడం, పరిశోధన, ప్రచురించడానికి విధాన రూపకర్తలతో సహకరించడానికి ఐఎంఎఫ్, ఐబీఆర్‌వో, డబ్ల్యూటీవీ. సీఐఐ, ఎఫ్ఐసీసీఐ మొదలైన వివిధ అంతర్జాతీయ, జాతీయ సంస్థలతో ఇంటర్నషిప్‌లను పొందడంలో సహాయం చేయడానికి అధ్యాపక బృందం కృషిచేసిందన్నారు. సుప్రీంకోర్డు మాజీ న్యాయమూర్తి పివి రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ఎం కాద్రీ, జస్టిస్ బి. సుదర్శన్‌రెడ్డి, సుప్రీకోర్డు న్యాయమూర్తి సుభాష్‌రెడ్డి, పాట్నా హై కోర్డు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్. నర్సింహారెడ్డి, తెంలగాణ హై కోర్డు న్యాయమూర్తులు ఉజ్వల్‌భూయాన్, రాజశేఖర్‌రెడ్డి, పి.నవీన్‌రావు, బార్ కౌన్సిల్ చైర్మెన్ జస్టిస్ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఒచ్చిర్రు.. కూసుర్రు.. పోయిర్రు..
సాక్షి, శామీర్‌పేట్: ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే మండల సాధారణ సర్వసభ్య సమావేశం సోమవారం తూతూమంత్రంగా జరిగింది. సభలో సమస్యల గురించి చర్చించి.. ఆ సమస్యల సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యతా రాహిత్యంగా కనిపించారు. వీరి తీరుపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేయడంతో సభ రసాబాసగా మారింది. పదవి అంటే అనుభవించడం కాదు అది ఒక బాధ్యత (దేశ సేవ) అని తెలుసుకున్న నాడే గ్రామాల అభివృద్ధి సాధ్యం అవుతుందనేది గమనించాలి. సభా దృష్టికి వచ్చిన విషయాలు.. మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు దాసరి యెళ్ళుబాయి అధ్యక్షతన సోమవారం శామీర్‌పేట మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు పలు సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చారు. చదవండి: నాడు డెల్టా.. నేడు ఒమిక్రాన్.. వెంటాడుతున్న కరోనా వైరస్ గుబులు ♦ మజీద్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో రెండ్డు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిని వెంటనే భర్తీ చేయాలని సర్పంచ్ మోహన్‌రెడ్డి సభా దృష్టికి తీసుకొచ్చారు. ♦ ప్రజయ్‌హోమ్స్‌లో మురుగుతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎంపీటీసీ అశోక్‌రెడ్డి ఆరోపించారు. ♦ కరోనా రెండో డోస్ వేసుకోని వారు ముందుకొచ్చి వ్యాక్సిన్ తీసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలని మండల వైద్యాధికారులు కోరారు. ♦ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని సభ్యులు అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ♦ ప్రజల ఓటేస్తే గెలిచిన తాను ప్రజా సమస్యలు పరిష్కరించలేనప్పుడు ఈ ఎంపీటీసీ పదవి ఎందుకని అలియాబాద్ ఎంపీటీసీ కోడూరి అశోక్ సభలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, సర్పంచ్ల గైర్హాజరు... సోమవారం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సభ అధికారులు, పలువురు సభ్యులు ఆలస్యంగా రావడంతో సుమారు 35 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమయ్యింది. కొందరు మండల స్థాయి అధికారుల గైర్హాజరు అయ్యారు. శామీర్‌పేట మండలంలోని 10 మంది సర్పంచ్‌లలో నలుగురు సర్పంచ్‌లే హాజరవడం గమనార్హం. చదవండి:హైదరాబాద్: ఆరేళ్లలో కొట్టేసిన మొత్తం అక్షరాలా రూ.4,611 కోట్లు సెల్ఫోన్లతో అధికారుల కాలక్షేపం... సభ్యులు సభా దృష్టికి తీసుకొచ్చే సమస్యలను నోట్ చేసుకొని వాటి పరిష్కారానికి కృషి చే యాల్సిన అధికారులు సెల్ఫోన్లతో కాలక్షేపం చేశారు. బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై ఉన్నతస్థాయి అధికారులు క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని పలువురు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. పదవీ అంటే పదవీ అంటే అనుభవించడమా.? దీనిని బట్టి ప్రజాసమస్యల పరిష్కారానికి వీళ్లు ఎంత మేరా కృషి చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సర్పంచ్ పదవి అంటే అనుభవించడమని వారు అనుకోవడం దురదృష్టకరం అని పలువురు సభ్యులు పేర్కొంటున్నారు. ప్రజా సమస్యలను సభా దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలనే సోయ ప్రజాప్రతినిధులకు లేనప్పుడు గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నిస్తున్నారు. -
ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి ఆత్మహత్య
సాక్షి, శామీర్‌పేట్: ప్రేమించిన యువకుడు పెళ్లి చేసుకోవడం లేదని యువతి మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తుమ్మ జ్యోతి(34) తన కుటుంబ సభ్యులతో కలిసి మండలకేంద్రమైన శామీర్‌పేటలో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా ఓ యువకుడిని ప్రేమిస్తున్నానని.. పెళ్లి చేసుకుంటానని తన అక్కచెల్లెళ్లతో చెప్పింది. ఇటీవల జ్యోతిని ప్రేమించిన వ్యక్తి పెళ్లి విషయం రాగానే మాట దాటవేస్తున్నాడని బాధపడుతోంది. ఈ క్రమంలో గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని జ్యోతి ఆత్మహత్య చేసుకుంది. తన చెల్లి వేదవతి ఇంటికి వచ్చే సరికి ఉరివేసుకున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట పోలీసులు తెలిపారు. చదవండి: వివాహేతర సంబంధం: మైనర్ బాలుడే నిందితుడు వివాహేతర సంబంధం.. యువకుడిపై హత్యాయత్నం ఘట్కేసర్: వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ యువకుడిపై గురువారం హత్యాయత్నం జరిగింది. ఇన్స్పెక్టర్ చంద్రబాబు తెలిపిన వివరాల ప్రకారం... అంబేడ్కర్‌నగర్ జవహర్‌నగర్‌కు చెందిన ఎడ్ల దేవ(30) కూలీ. చక్రిపురం కుషాయిగూడకు చెందిన ఇద్దరు పిల్లలున్న ఓ వివాహితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీని గురించి తెలుసుకున్న వివాహిత సోదరుడు నవీన్ అతడిని చంపాలని రాంపల్లికి తీసుకొచ్చి మద్యం సేవించారు. చదవండి: చావైనా..బతుకైనా.. అమ్మతోనే అన్నీ అనంతరం ఘట్కేసర్–ఘనాపూర్ సర్వీస్ రోడ్డు చెట్లపొదల్లో మరొక వ్యక్తితో కలిసి కత్తితో గొంతు కోశారు. వెంటనే దేవ వారి నుంచి తప్పించుకొని రోడ్డుపైకి పరుగెత్తగా ప్రయాణికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు అతడిని స్థానిక ప్రభుత్వ ఆస్సత్రికి తరలించి చికిత్స చేయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
కేశవాపూర్ ప్రాజెక్టుకు ‘అసైన్డ్’ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సిగలో భారీ జల భాండాగారం ఏర్పాటు చేసే పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. శామీర్‌పేట్ మండలం కేశవాపూర్ లో 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు అసైన్డ్ భూములు, అటవీ భూముల సేకరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా అసైన్డ్ భూములకు.. ఎకరాకు రూ.37 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఎకరానికి రూ. కోటి పరిహారంగా అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ విషయమై రెవెన్యూ అధికారులు పలుమార్లు నిర్వాసితులయ్యే రైతులతో చర్చించినప్పటికీ వారు మెట్టుదిగడంలేదని సమాచారం. తాము కోరిన పరిహారాన్ని చెల్లించకుండా బలవంతంగా తమ భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. కాగా.. సుమారు అరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు 200 మంది యజమానులు ఉన్నారు. వీరంతా తమకు న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. అటవీ భూములు సైతం.. కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 1245 ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు అంతే మొత్తంలో భూములను కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం జగిత్యాల్, సూర్యాపేట్, భూపాలపల్లి తదితర జిల్లాల్లో అటవీశాఖ సూచనల మేరకు ఫారెస్ట్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖను కోరింది. ఇక ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలు సైతం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినా.. తుది అనుమతులు జారీచేయాల్సి ఉంది. (చదవండి: మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు) -
బీజేపీలో చేరడం గర్వంగా ఫీలవుతున్నాను: ఈటల రాజేందర్
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో ఆత్మగౌరవం కోసం మరో ఉద్యమం మొదలైందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకనని పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లాలోని షామీర్‌పేట్‌లోని తన నివాసంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డితో కలిసి బుధవారం ఈటల రాజేందర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నికను ప్రజలు తమ సొంత ఎన్నికగా భావిస్తున్నారన్నారు. ప్రతి వ్యక్తి తామే ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ఎన్నిక ఉండబోతోందన్నారు. ఉద్యమంలో హుజూరాబాద్ నియోజకవర్గం స్పూర్తిని నింపిందని తెలిపారు. బీజేపీలో చేరటం గర్వంగా ఫీలవుతున్నానని, 2024లో తెలంగాణలో ఎగిరే జండా కాషాయం జెండా అని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమంలో తాము లేకుంటే కెప్టెన్ ఎక్కడుండేవాడని ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఆదేశాలను తాము సమర్థవంతంగా అమలు చేయకుంటే.. పేరు, గుర్తింపు కెప్టెన్ వచ్చేవి కావని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై ప్రజలు అసహ్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. కొత్త రాష్ట్రంలో ఇన్ని బాధలు ఉంటాయని తెలంగాణ సమాజం ఊహించి ఉండదని తెలిపారు. గడ్డిపోస కూడా ఇప్పుడు అవసరపడుతుందని, ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలందరి తోడ్పాటుకు ధన్యవాదాలు తెలిపారు. తను ఉద్యమంలో ప్రజల కాళ్ళ మధ్యలో తిరిగిన వ్యక్తిని అని, సుష్మా స్వరాజ్, విద్యాసాగరరావు లాంటి నేతలతో ఉద్యమంలో కలసి పనిచేశానని వెల్లడించారు. ‘నా డీఎన్ఏను పక్కన పెడితే.. మరో ఆత్మగౌరవ పోరాటానికి సిద్ధం కావాలి. చరిత్ర మెదలు వావటానికి ఏదొక పార్టీ తోడు ఉండాలి కాబట్టే టీఆర్ఎస్లో పనిచేశాను. నా ఇల్లు మేడ్చల్‌లోనే ఉంది. వాళ్ల కళ్ళలో మెదిలిన బిడ్డను నేను. మీకు నిత్యం అందుబాటులో ఉంటాను. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను. భూమి గుంజుకున్న లోంగిపోలేదు. కానీ ఇప్పుడు చట్టం కొంతమందికే పని చేస్తుంది. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దు అని సమాజం అంతా అనుకుంటుంది. గుణపాఠం చెప్పాలి. అహంకారానికి ఘోరీ కట్టాలి’ అని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. అనంతరం మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి మాట్లాడుతూ.. నయా నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి చేయడమే మనందరి లక్ష్యమని పేర్కొన్నారు. ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉంటామని, హుజూరాబాద్‌లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు. చదవండి: బీజేపీలోకి ఈటల: మావోయిస్టు పార్టీ ఘాటు లేఖ కమ్యూనిజం నుంచి కాషాయానికి.. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం..
సాక్షి,శామీర్‌పేట్/ఉప్పల్: ఔటర్ రింగు రోడ్డుపై శామీర్‌పేట వద్ద ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఉప్పల్ చిలుకానగర్‌కు చెందిన కరుణాకర్‌రెడ్డి (46), భార్య సరళ (38), ఆమె చెల్లెలు సంధ్య(30)తో కలిసి కారులో గజ్వేల్‌లోని ఓ శుభకార్యానికి హాజరై తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో శామీర్‌పేట ఓఆర్ఆర్ గుండా ఉప్పల్‌కు వెళ్తుండగా లియోనియా సమీపంలో ముందుగా వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కరుణాకర్‌రెడ్డి, సరళ, సంధ్యలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కరుణాకర్‌రెడ్డి, భార్య సరళ, సంధ్య (ఫైల్) చిలుకానగర్‌లో విషాదం మృతుల్లో స్థానిక టీఆర్ఎస్ నాయకుడు ఈరెల్లి రవీందర్‌రెడ్డి భార్య సంధ్య ఉన్నారు. ఆమె మృతిచెందిన వార్త తెలియడంతో చిలుకానగర్‌లో విషాదం నెలకొంది. కాగా కరుణాకర్‌రెడ్డి స్థానికంగా బియ్యం వ్యాపారం చేసుకుంటూ ఆదర్శ్‌నగర్ కాలనీ సాయిబాబా దేవాలయం కార్యదర్శిగా సేవలు అందిస్తున్నాడు. అందరితో కలివిడిగా ఉండే వీరు మృతిచెందడం కాలనీ వాసుల్ని కలచివేసింది. చదవండి: బైక్ టైర్లో చీర కొంగు చుట్టుకొని.. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు సజీవ దహనం
సాక్షి, మేడ్చల్: మేడ్చల్ జిల్లా శామీర్‌పేట రాజీవ్ రహదారిపై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీలు ఒకదానికొకటి ఢీకొట్టిన ఘటనలో మంటలు చెలరేగి ఒక వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నగరం నుండి తమిళనాడు సేలం కు వెళ్తున్న కంటైనర్ ను లారీ ఓవర్టేక్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రెండు లారీల మధ్య రాపిడి జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. ఒక వ్యక్తి సజీవదహనమయ్యాడు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఫైర్ ఇంజిన్ లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. -
పెళ్లి చేసుకుందాం రమ్మని..
సాక్షి, వర్గల్ (గజ్వేల్): ప్రేమికుడి మాటలు నమ్మింది..పెళ్లి చేసుకుందాం అనగానే ఒంటరిగా గడప దాటింది.. గుడి వద్ద ప్రియుడి కోసం ఉదయం నుంచి రాత్రి వరకు ఎదురుచూసినా అతను రాలేదు. దీంతో ఆందోళనకు గురైన ఆ యువతి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసుల సాయంతో సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేరడంతో కథ సుఖాంతమైంది. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల్‌కు చెందిన యువతి (18) అదే జిల్లాలోని మేడ్చల్ సమీప గ్రామానికి చెందిన బాలకృష్ణ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ నెల 14న ఉదయం 10 గంటలకు సిద్దిపేట జిల్లా నాచారం గుట్ట దేవాలయంలో పెళ్లి చేసుకుందాం రమ్మని ప్రేమికుడు చెప్పిన మాటలను నమ్మింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా నాచారం గుట్టకు చేరుకుంది. చదవండి: భార్య అశ్లీల చిత్రాలు ఫేస్బుక్లో పోస్ట్ రాత్రి 9 గంటలు దాటుతున్నా ప్రేమికుడు రాలేదు. అతడు మొహం చాటేశాడని అర్థమైంది. దీంతో తీవ్ర ఆందోళనకు గురై డయల్ 100కు ఫోన్ చేసి పరిస్థితిని వివరించింది. దీంతో వర్గల్ మండలంలో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న గౌరారం ఏఎస్సై మధుసూదన్‌రావు, బ్లూ కోల్ట్ సిబ్బంది కానిస్టేబుల్ శ్రీనివాస్, హోంగార్డు దయాకర్, యాదగిరి వెంటనే గుడి వద్దకు చేరుకున్నారు. యువతితో మాట్లాడి వివరాలు తెలుసుకొని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. సకాలంలో స్పందించి తమ కూతురును అప్పగించినందుకు యువతి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి : క్లాసులంటూ పిలిచి.. పసిమొగ్గలపై అఘాయిత్యం -
తిడతారనే భయంతో బాలుడి హత్య..
సాక్షి, హైదరాబాద్ : శామీర్ పేట్ బాలుడు అదియాన్ మృతి కేసు కొలిక్కి వచ్చింది. అదియాన్‌తో కలిసి షేర్‌చాట్‌లో వీడియోలు చేసే ఓ మైనర్ ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ నర్సింగ్ రావు సోమవారం మీడియాకు తెలియజేశారు. ‘‘చనిపోయిన 5 ఏళ్ల బాబుతో నిందితుడు షేర్ చాట్‌లో వీడియోలు చేస్తుండేవాడు. బాలుడు జంప్ చేస్తుండగా అతడి తలకు గాయాలు అయ్యాయి. గాయాలు చూస్తే అదియాన్ తల్లిదండ్రులు తిడతారనే భయంతో బాబు గొంతు నులిమి చంపేశాడు. ( కిలాడీ లేడీ.. 30 ఏళ్లుగా.. ) చంపిన తర్వాత శవాన్ని గోనెసంచిలో కుక్కి, అర్ధరాత్రి వేళ నడుచుకుంటూ వచ్చి ఓఆర్ఆర్ పక్కన పొదల్లో పడేశాడు. రెండు రోజుల తర్వాత బాబు తల్లిదండ్రులకు కాల్ చేసి 15 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇదే విషయాన్ని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొబైల్ నెంబర్, సీసీ కెమెరా ఆధారంగా కేసును ఛేదించాం. డబ్బులు ఇవ్వగానే బిహార్ పారిపోదామని నిందితుడు ప్లాన్ చేశాడు. నిందితుడు మైనర్, 20 రోజుల క్రితమే ఇంట్లో అద్దెకు వచ్చాడ’’ని అన్నారు. -
శామీర్‌పేట్‌లో దారుణం; పిల్లలకు విషమిచ్చి..
సాక్షి, హైదరాబాద్ : మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట్‌లో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో సహ విషమిచ్చి తల్లి ఆత్మహత్యయత్నం చేసింది. దురదృష్టవశాత్తు ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, తల్లి ప్రీతి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా అనాధ అయిన ప్రీతి వరంగల్ అనాధాశ్రయంలో పెరిగింది. ఆరు సంవత్సరాల క్రితం గోపినాధ్ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. గోపీనాథ్ ప్రీతి దంపతులు షామీర్ పేటలోని మజీద్ పూర్లో గత కొంత కాలంగా జీవనం కొనసాగిస్తున్నారు. పెళ్ళైన కొంత కాలం నుంచి భార్య భర్తల మధ్య గొడవలు రావడంతో ఆమె తరచు అనాధ ఆశ్రమానికి వెళ్ళేది. (వివాహేతర సంబంధం ఇంట్లో తెలియడంతో..! ) అనంతరం పెద్దలు నచ్చజెప్పడంతో గోపినాథ్ వద్దకు ప్రీతి తిరిగి వచ్చింది. అయినప్పటికీ ప్రీతికి వేధింపులు ఎక్కువవడంతో గత్యంతరం లేక పిల్లలకు విషమిచ్చి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దీనితో తల్లి బిడ్డలను చికిత్సా నిమిత్తం మేడ్చల్‌లోని లీలా ఆసుపత్రిలోచేర్చగా..చికిత్సా పొందుతూ ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి ప్రీతి పరిస్థితి విషమంగా ఉంందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (అర్థరాత్రి నుంచి ఓఆర్ఆర్పై రాకపోకలు) -
అతడికి ఆ అలవాటు ఉన్నందుకే..
సాక్షి, హైదరాబాద్ : బుధవారం అద్రాస్ పల్లిలో హత్యకు గురైన ఆంజనేయులుకు తిన్న తరువాత బైటకు వెళ్లే అలవాటు ఉందని, అలవాటు ప్రకారం అతను 8.30 సమయంలో శ్మశానం వైపు వెళ్లాడని అతడి బంధువులు చెప్పినట్లు బాలానగర్ డీసీపీ పద్మజా రెడ్డి పేర్కొన్నారు. శామీర్‌పేట యువకుడి హత్య ఘటనపై గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘‘లక్ష్మి గత 5 సంవత్సరాల నుంచి అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఆంజనేయుల్ని లక్ష్మి బంధువులు చితిలో దహనం చేసినట్లు అతడి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. నిన్న ఆంజనేయులు కనపడటం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. నిన్న రాత్రి 10.30కు మాకు ఆంజనేయులు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. లక్ష్మీ బావ బలరాంపైన ఆంజనేయులు కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. సంఘటనా స్థలంలో లభించిన రక్తం ఎములను స్వాధీనం చేసుకుని గాంధీ ఆసుపత్రికి నిర్ధారణ కోసం తరలించాం. గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉంది. ముందు జాగ్రత్తగా పికెటింగ్ ఏర్పాటు చేసా’’మని ఆమె తెలిపారు. చదవండి : మహిళ చితిపైనే యువకుడి శవాన్ని.. -
శామీర్‌పేటలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : శామీర్‌పేట ఎమ్మార్వో కార్యాలయం ఎదుట సోమవారం సాయంత్రం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. అనంతరం అవతలవైపు వెళుతున్న కారుపైకి దూసుకువెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ నాగోల్‌కు చెందిన కోసూరి కిషోర్ చారి, ఆయన భార్య భారతి, పెద్ద కుమారుడు సుధాన్ష్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. మరో కుమారుడు తనీష్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదంలో చనిపోయిన కిషోర్ చారి నాగోల్ డివిజన్ బీజేపీ ఓబీసీ మోర్చ అధ్యక్షుడి గా చేస్తున్నాడు. కిషోరి చారి ఆయన భార్య ఇద్దరు కుమారులతో కలిసి కరీంనగర్‌లోని ఓ పుణ్య క్షేత్రానికి వెళ్లి ఈకో స్పోర్ట్స్ కారులో తిరిగి హైదరాబాద్ వస్తుండగా శామీర్‌పేట్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కిషోర్ చారి అతి వేగంగా కారు నడపడంతో అదుపు తప్పి డివైడర్‌కు ఢీకొట్టి ఎదురు రోడ్డులో వస్తున్న ఎర్టిగా కారు మీద ఎగిరి పడింది. ప్రమాదంలో ఈకో స్పోర్ట్స్ కారులో ప్రయాణిస్తున్న కిషోర్ చారి కుటుంబంలో ముగ్గురు మరణించారు. మరో కుమారుడు తనీష్ ప్రాణాపాయ స్థితిలో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ప్రమాదంలో ఎర్టిగా కారులో ఉన్న రాజు, మహేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగంతో పాటు ముందు వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇక ప్రమాద తీవ్రతతో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు కారులోనే చిక్కుకుపోయాయి. పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించారు. మరోవైపు ఈ ప్రమాదంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సాయంతో ప్రమాదానికి గురైన కారును అక్కడ నుంచి తరలించి, ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. -
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో భారీ అగ్ని ప్రమాదం
-
భర్తను చంపి.. ఇంటిముందే పూడ్చింది
శామీర్‌పేట్: భర్తను హత్య చేయడమేగాక ఈ విషయం బయటికి పొక్కకుండా ఇంటి ఆవరణలోనే గోయ్యితీసి పూడ్చి పెట్టిన ఘటన శామీర్‌పేట మండలం కేశవరంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ భాస్కర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేశవరం గ్రామంలో ఈ నెల 3న గుర్తుతెలియని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా మామిండ్ల మల్లేష్‌గా గుర్తించారు. దీంతో మల్లేష్ భార్య జ్యోతిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది వెలుగులోకి వచ్చింది. కేశవరం గ్రామానికి చెందిన మల్లేష్ ,జ్యోతి దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. గత కొంత కాలంగా వారి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గత నెల 3న మద్యం మత్తులో ఉన్న మల్లేష్, భార్యతో గొడవపడ్డాడు. దీంతో జ్యోతి అతడిని తోసివేయడంతో కిందపడిన మల్లేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఎంతకూ లేవకపోవడంతో భర్త మృతిచెందాడని గుర్తించి ఆందోళనకు గురైన ఆమె శవాన్ని ఇంటి ఆవరణలోనే గోయ్యి తీసి పూడ్చిపెట్టింది. వర్షం కురవడంతో మృతదేహం కుళ్లి దుర్వాసన రావడంతో ఆమె ఈ నెల 2న అర్ధరాత్రి శవాన్ని బయటకుతీసి గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్ల గోతిలో పారవేసింది. స్ధానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు జ్యోతిని నిందితురాలిగా గుర్తించి మంగళవారం రిమాండ్‌కు తరలించారు. -
ఫ్రెండ్‌కి సెండాఫ్.. విషాద ఘటన
సాక్షి, హైదరాబాద్: మిత్రుడికి వీడ్కోలు పలికేందుకు వెళ్లిన ఇద్దరు స్నేహితురాళ్లను రోడ్డు ప్రమాదం పొట్టన పెట్టుకుంది. లారీ రూపంలో మృత్యువు దూసుకొచ్చింది. వీడ్కోలు చెప్పేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థినులు విగతజీవులుగా మారిన విషాద ఘటన శుక్రవారం అర్ధరాత్రి శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద జరిగింది. శామీర్‌పేట్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపిన మేరకు.. రాజస్థాన్‌కు చెందిన పల్లవి గుప్త(22), చెన్నైకి చెందిన ఇందిరా వీణా(23), మహారాష్ట్రకు చెందిన కుశాల్ మండలంలోని జగన్‌గూడ గ్రామ పరిధిలోని నిక్మార్ (నేషనల్ ఇన్స్ట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ మేనేజ్మెంట్ రీసెర్చ్) కళాశాలలో పీజీ మొదటి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్నారు. శుక్రవారం రాత్రి తమ మిత్రుడు చిరంజీవి మహరాజ్‌ను కొంపల్లిలో నాగ్‌పూర్ బస్సు ఎక్కించి పల్లవి గుప్త, వీణాలు ఒక వాహనంపై కుశాల్ మరో వాహనంపై తిరిగి హాస్టల్‌కు వస్తున్నారు. శామీర్‌పేట్ మండల పరిధిలోని అలియాబాద్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై యూటర్న్ తీసుకునేందుకు యత్నిస్తుండగా వెనుక నుండి అతివేగంతో వస్తున్న లారీ విద్యార్థుల రెండువాహనాలను వెనుక నుండి డీకొట్టింది. దీంతో పల్లవిగుప్త, వీణాలు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. మరో వాహనంపై ఉన్న కుశాల్కుస్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న 108 సిబ్బంది కుశాల్‌ను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న శామీర్‌పేట్ ఎస్ఐ నవీన్‌రెడ్డి, పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతిచెందిన పల్లవిగుప్త, వీణ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు లారీ వివరాలు తెలుసుకునేందుకు అలియాబాద్ చౌరస్తా వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు శామీర్‌పేట్ సీఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. విమానాల్లో మృతదేహాల తరలింపు శామీర్‌పేట్: పల్లవిగుప్త, ఇందిరా వాణి మృతదేహాలకు గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబాలకు సమాచారం ఇవ్వగా వారు రాలేని పరిస్ధితి ఉందని తెలపడంతో కళాశాల అడ్మినిస్ట్రేషన్ మేనేజర్ సుబ్రమణ్యం, యాజమాన్యం వారి మృతదేహాలను విమానాల్లో వారి సోంత ప్రదేశాలకు తరలించారు. ఫ్రెండ్‌కి సెండాఫ్.. విషాద ఘటన -
శామీర్‌పేట పెద్దచెరువులో శవం
శామీర్‌పేట్ పెద్దచెరువులో బుధవారం గుర్తుతెలియని మృతదేహం కనిపించింది. స్థానికులు గమనించి ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికితీయించి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
డీసీఎం,టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి
శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాసిరేగిడి వద్ద గురువారం వేకువజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గండిమైసమ్మ నుంచి మేడ్చల్ వైపు వెళ్తోన్న డీసీఎం మేడ్చల్ నుంచి దుండిగల్ వైపు వెళ్తోన్న టిప్పర్ ఢీకొన్నాయి.ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ రాజు, టిప్పర్ డ్రైవర్ రితులాల్ మహతో(జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవాడు) అక్కడికక్కడే మృతిచెందగా..డీసీఎం క్లీనర్ మైబు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అలియాబాద్‌లో చోరీ
శామీర్‌పేట : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి రూ.40 వేల నగదు, 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు మధుకు సమాచారం ఇచ్చిరు. మధు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.... దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు దుండగులు చోరీ చేసిన తీరును పరిశీలించారు. -
అనుమానంతో భార్యను చంపేశాడు
శామీర్‌పేట్: భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్న ఓ భర్త ఆమెను కడతేర్చాడు. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలంలో సోమవారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. బాలాజీనగర్‌లోని చుక్కమ్మ బస్తీకి చెందిన రాజేష్, గౌతమి(25) దంపతులకు ఐదేళ్ల కూతురు ఉంది. దంపతుల మధ్య సోమవారం రాత్రి గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహంతో ఉన్న రాజేష్ బెల్టుతో భార్యను మెడ నులిమి చంపేశాడు. ఆమెపై అనుమానంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టాడని చుట్టుపక్కల వారు అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
ప్రేమ జంటకు పోలీసుల రక్షణ
శామీర్‌పేట్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన యువతి, యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో గ్రామంలో శనివారం అర్ధరాత్రి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రామానికి చెందిన బాల మహేష్, ప్రియాంకలు ప్రేమించుకుని ఈ నెల 18న ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకున్నారు. అనంతరం లక్ష్మాపూర్‌లో ఉంటున్నారు. కాగా అల్వాల్‌లో ఉంటున్న ప్రియాంక తల్లిదండ్రులకు విషయం తెలియడంతో.. వారు బంధువులతో కలసి శనివారం రాత్రి లక్ష్మాపూర్‌కు వెళ్లి మహేష్, అతడి తండ్రిపై దాడి చేశారు. దీనిపై మహేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం దాడి చేసిన వారిని పోలీసులు పిలిపించారు. పెళ్లి చేసుకున్న వారిద్దరూ మేజర్లు కావడంతో వారికి తాము రక్షణ కల్పిస్తామని సీఐ సత్తయ్య స్పష్టం చేశారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి పంపించేశారు. -
ట్యాంకర్ ఢీకొని వ్యక్తి మృతి
రంగారెడ్డి జిల్లా షామీర్పేట్ మండలం మాజిద్పూర్ వద్ద బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్యనారాయణ (35) అనే వ్యక్తి బైక్‌పై వెళుతుండగా... వాటర్ ట్యాంకర్ లారీ ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. -
చేపల వేటకు వెళ్లి బాలుడు గల్లంతు
శామీర్‌పేట్ (రంగారెడ్డి) : చేపల వేటకు వెళ్లిన బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి గల్లంతయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం మలక్‌పేట్ చెరువు వద్ద సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మధు(17) అనే బాలుడు చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గ్రామస్థులు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఆర్టీసీ బస్సు ఢీకొని 40 గొర్రెలు మృతి
శామీర్‌పేట్ (రంగారెడ్డి) : వేగంగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టింది. దీంతో 40 గొర్రెలు మృతిచెందాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం తుర్కపల్లి గ్రామ శివారులోని రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గజ్వేల్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు రోడ్డు పై వెళ్తున్న గొర్రెలను ఢీకొట్టడంతో.. 40 గొర్రెలు మృతిచెందాయి. -
పాలవ్యాన్ బీభత్సం : ముగ్గురు మృతి
హైదరాబాద్ : శామీర్‌పేటలోని జవహర్‌నగర్‌లో శనివారం పాలవ్యాన్ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న వ్యాన్ అదుపు తప్పి బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లింది. బస్సు కోసం వేచిన ఉన్న వారిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మట్టివాసనే కట్టిపడేసింది
శామీర్‌పేట్: కాస్త ఉన్నత చదువులు చదవగానే ఉద్యోగ నిమిత్తం విదేశాలవైపు మళ్లే వారిని చూస్తుంటాం.. వీసాల కోసం నిత్యం పాకులాడే వారెందరినో గమనిస్తుంటాం.. స్వదేశంలో ఏముంది అక్కడే స్థిరపడి కాస్తాకూస్తో వెనకేసుకుందాం అని ఆరాటపడేవాళ్లు ఎందరో.. చిన్న ఉద్యోగమైనా సరే ఛాన్స్ దొరికితే విమానం ఎక్కేద్దాం.. విదేశాల్లో వాలిపోదాం అని ఉవ్విళ్లూరుతుంటారు. ఆయన మాత్రం అలా కాదు.. నెలకు లక్షా 75 వేల వేతనం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని స్వదేశానికి పయనమయ్యారు. విదేశం కన్నా ఇక్కడి మట్టివాసన మిన్న అంటూ సొంత ఊరికి వచ్చేశాడు. వ్యవసాయమంటేనే ఆమడ దూరం నిలుస్తున్న యువతకు దాన్నే ఎంచుకొని అందులోనే సరికొత్త పోకడలతో లాభాల సిరులు పండిస్తూ మార్గదర్శకమయ్యారు.. ఇష్టంతో కష్టపడి ముందుకు ‘సాగు’తున్నారు. అటు కుటుంబానికి ఆసరాగా మారి.. ఇటు ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. ఆయనే వంగ కిరణ్‌కుమార్‌రెడ్డి.. ఆయన స్ఫూర్తిదాయక కథనమే ఈ ఆదివారం ప్రత్యేక కథనం.. రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం పోతారం గ్రామానికి చెందిన వంగ బుచ్చిరెడ్డి, మల్లమ్మ దంపతులు. వ్యవసాయం వీరి జీవనాధారం. వీరికి ముగ్గురు సంతానం. కిరణ్‌కుమార్‌రెడ్డి, అరుణ్‌కుమార్‌రెడ్డి (ప్రస్తుతం మార్కెటింగ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు), పవన్‌కుమార్‌రెడ్డి (చదువు పూర్తయింది). పెద్ద కుమారుడు కిరణ్‌కుమార్‌రెడ్డి చిన్ననాటి నుంచి చదువులో చురుగ్గా ఉండేవాడు. కష్టపడి చదువుతున్న కుమారుడిని ఉన్నత చదువులు చదివించాలని ఆ తల్లిదండ్రులు కలలు కన్నారు. తాము పస్తులుం డైనా ఉన్న పొలంలో వచ్చిన ప్రతి పైసా అతని చదువులకు దార పోశారు. అలా కిరణ్‌కుమార్ రెడ్డి ఎంఎస్సీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో లండన్‌లో ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దీంతో తల్లిదండ్రులు, గ్రామస్తులు ఎంతో ఆనందించారు. 2009లో కిరణ్‌కుమార్‌రెడ్డి అలా లండన్ బయలు దేరాడు. అక్కడ నెలకు దాదాపు రూ.లక్ష 75వేలు వేతనం లభించినప్పటికీ ఏదో తెలియని వెలితి.. అసంతృప్తి. స్వదేశం.. పుట్టిపెరిగిన ఊరు.. కన్నతల్లిదండ్రులవైపే మనసు మళ్లేది. ఆ తలపులతోనే మూడేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో 2012 నవంబర్‌లో తండ్రి అస్వస్థతకు గురయ్యాడన్న విషయం తెలిసింది. అంతే ఇక ఉండబట్టలేక ఆఘమేఘాల మీద స్వదేశానికి తిరుగు పయనమయ్యాడు. అలా ముందుకు ‘సాగు’తూ.. కిరణ్‌కుమార్‌రెడ్డి ఊరికి వచ్చినప్పుడు నీళ్లు లేక పొలం మొత్తం బీడుగా తయారైంది. ఈ తరుణంలో ఏ పంటలు వేస్తే అనతికాలంలో లాభాలబాట పట్టొచ్చు అని ఆలోచిం చాడు. డ్రిప్ ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించొచ్చని నిర్ణయించుకున్నాడు. ఉన్న 40 ఎకరాల్లో డ్రిప్ సాయంతో 20 ఎకరాల్లో దానిమ్మ, పది ఎకరాల్లో వివిధ రకాల తీగజాతి పంటలు, మరోపది ఎకరాల్లో వరి, మొక్కజొన్న తదితర సీజనల్ పంటలు పండిస్తున్నాడు. బ్యాంక్ రుణం, ఉద్యాన శాఖ ప్రోత్సాహంతో తీగజాతి, ఇతర పంటలతో అనుకున్నది సాధిం చాడు. లాభాల బాటలో పయనమవుతున్నాడు. నెలకు దాదాపు రూ.45వేల నుంచి రూ.60వేల వరకు సంపాదిస్తున్నాడు. శాస్త్రవేత్తలు, నాయకులు, అధికారులు, ఇలా ప్రతి ఒక్కరినీ ఆక ర్షించేలా త న పొలాన్ని తయారుచేశాడు. పాలీహౌస్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాడు. మరోపదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. ఇప్పుడు మండలంతో పాటు వివిధ మండలాలకు చెందిన ఎందరో రైతులు కిరణ్‌కుమార్‌రెడ్డి వద్దకు వచ్చి సూచనలు, సలహాలు అడిగి తెలుసుకుంటున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి భార్య, పాప ఉన్నారు. మనసు అంగీకరించక.. తిరిగి వెళ్లలేక.. స్వదేశానికి వచ్చాక తిరిగి వెళ్లాలంటే మనసు అంగీకరించలేదు. కష్టపడి పెంచి, విద్యాబుద్ధులు చెప్పిచ్చిన కన్నవారిని వదిలి వెళ్లడానికి అడుగులు ముందుకుపడలేదు. ఇక ఇక్కడే ఉండి వారికి ఆసరాగా నిలవాలని నిశ్చయించుకున్నాడు. తండ్రికి వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉంటూ.. తనకున్న పరిజ్ఞానంతో వివిధ రకాలు పంటలు పండించాలని భావించాడు. దీంతో ఇటు తల్లిదండ్రులు, అటు గ్రామస్తులు ఆశ్చర్యానికి లోనయ్యారు. అసలే నీళ్లు లేక వ్యవసాయం అంతంతమాత్రంగా మారింది.. అందులోనూ విదేశాల్లో ఉండొచ్చిన నువ్వు వ్యవసాయం ఏం చేస్తావులే అని ప్రశ్నించారు. ఆ మాటలు అతనిలో మరింత కసిని పెంచాయి. గ్రామానికి సమీపంలో తమకున్న 40 ఎకరాల బంజరు భూమిని సాగు చేయడం మొదలుపెట్టాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే.. స్వదేశంపై మమకారంతో ఇక్కడికి వచ్చేశాను. చిన్న ఆలోచన పెద్ద విజయాన్ని అందిస్తుంది. కావాల్సిందిల్లా పట్టుదల, ఏకాగ్రత. కుటుంబసభ్యులు, గ్రామస్తుల సహకారంతో ఇప్పుడు లాభాల సిరులు పండిస్తున్నాను. రైతులు సాగులో కాస్త మెలకువలు పాటి స్తే అనతి కాలంలోనే మంచి లాభాలు గడించే అవకాశం ఉంది. - కిరణ్‌కుమార్‌రెడ్డి సంతోషంగా ఉంది.. పిల్లలను మంచి హోదాలో చూడాలని ఆశపడ్డాం. కుమారుడు విదేశాల్లో స్థిరపడ్డాడని ఒకవైపు సంతోషంగా ఉన్నా మరోవైపు మా దగ్గరలేడని బాధపడేవాళ్లం. ఇంటికి వచ్చేస్తానన్నప్పుడు ఒకింత సంబరపడ్డా, ఇక్కడేం చేస్తాడని ఆందోళనకు గురయ్యాం. ప్రస్తుతం ఆ బాధ తీరిపోయింది. తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉంది. - బుచ్చిరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అతని విజయం ఆదర్శం.. కిరణ్ చిన్ననాటి నుంచి చురుగ్గా ఉండే వాడు. అతని తెలివితేటలతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించాడు. మంచి ఉద్యోగం మానుకోవడం, ఇక్కడే స్థిరపడాలనుకోవడం అతనికి తల్లిదండ్రుల మీద, దేశం మీద ఉన్న మమకారానికి అద్దం పడుతోంది. వ్యవసాయమంటే కష్టంగా భావిస్తున్న తరుణంలో అందులో అతను విజయం సాధించిన తీరు ఆదర్శంగా నిలుస్తుంది. - దేవందర్‌రెడ్డి, పొన్నాల్ రైతు -
వడదెబ్బతో వ్యక్తి మృతి
శామీర్‌పేట (రంగారెడ్డి) : వడదెబ్బతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్ పేట మండలంలోని తుర్కపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... కానుగుల జ్ఞానేశ్వర్(50) అనే వ్యక్తి ఓ సెలూన్లో రోజు కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఎండ తీవ్రతకు వారం రోజుల కిందట అస్వస్థతకు గురయ్యాడు. కాగా పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందాడు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన కోవూరి సుదర్శన్(35), అనిత దంపతులు. సుదర్శన్ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా దంపతులు గొడవపడుతున్నారు. ఈక్రమంలో ఈ నెల 23న భర్తతో గొడవపడిన అనిత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో సుదర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా అదే రోజున సుదర్శన్ కూడా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా శామీర్‌పేట్ పరిధిలోని సెయింట్ పాల్స్ స్కూల్ సమీపంలోని ఓ పాడుబడిన గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా ఓ వ్యక్తి గదిలో ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడిని శామీర్‌పేట్‌కు చెందిన కోవూరి సుదర్శన్‌గా గుర్తించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన అతడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న కేసీఆర్
శామీర్‌పేట్ రూరల్: మోసపూరిత వాగ్దానాలతో కేసీఆర్ గద్దెనెక్కి, ఇప్పుడు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు ఉద్దమర్రి నర్సింహారెడ్డి విమర్శించారు. గురువారం మండల కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఐదునెలలు గడిచినా ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఆచరణలో పెట్టలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి ఇప్పటివరకు 500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు 8గంటలు విద్యుత్ అందజేస్తానని చెప్పిన కేసీఆర్ ప్రస్తుతం 5 గంటలు సక్రమంగా ఇవ్వడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో 2006లో భూపాలపల్లిలో కాకతీయ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేసి నిర్మాణా పనులను ప్రారంభించామన్నారు. జూరాల, పులిచింతల, భూపాలపల్లిలో 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రణాలికలు రూపొందించి పనులు చేపట్టిన వాటిని టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పింఛన్ లబ్ధిదారుల్లో భారీగా కోతలుపెట్టడం తగదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చురుకగా జరుగుతోందని సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 20లక్షల మంది, జిల్లాలో 2.50 లక్షల సభ్యత్వాలను నమోదు చేయడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు సుదర్శన్, కాంగ్రెస్ నాయకులు వేణుగోపాల్‌రెడ్డి, మహేందర్‌యాదవ్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, మల్లేశ్, రాజయ్య, రాజనర్సయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. -
సత్యవాణి మృతదేహం కుటుంబీకులకు అప్పగింత
శామీర్‌పేట్: సత్యవాణి మృతదేహాన్ని గురువారం అధికారులు కుటుంబీకులకు అప్పగించారు. సత్యవాణి(25) బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద ఉండగా భారీ వర్షానికి నాలాలో పడి గల్లంతై మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రేంరాజ్ ఏడేళ్ల క్రితం అలియాబాద్‌కు చెందిన సత్యవాణిని వివాహం చేసుకున్నాడు. ప్రేంరాజ్ స్థానిక బిన్నీ మిల్లులో పనిచేస్తున్నాడు. దంపతులు కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. బుధవారం దంపతులు బంధువులతో కలిసి నగరంలోని ఓ శుభకార్యానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద భారీ వర్షానికి సత్యవాణి నాలాలో గల్లంతై మృతిచెందింది. విషయం తెలుసుకున్న అలియాబాద్ గ్రామస్తులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు. జీహెచ్ఎంసీ నిర్లక్షంతోనే వివాహిత మృత్యువాత పడిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం అధికారులు సత్యవాణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో గుంటూరు జిల్లా ఈపూర్‌కు తీసుకెళ్లారు. -
నాలాలో కొట్టుకుపోయిన మహిళ
శామీర్‌పేట్ : బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్న క్రమంలో శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌కు చెందిన ఓ మహిళ ఉప్పల్ బస్టాండ్ వద్ద గల నాలాలో పడి కొట్టుకుపోయింది. ఈ ఘటన బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన భాగ్యరావు అలియాస్ భాస్కర్, లక్ష్మిలు దంపతులు. వీరు 20 ఏళ్ల క్రితం బతుకుదెరువుకోసం అలియాబాద్ గ్రామానికి వచ్చి ఉంటున్నారు. భాస్కర్ మేస్త్రీ పని చేస్తుంటాడు. వీరికి కూతురు సత్యవాణి(25)కు ఏడేళ్ల క్రితం నాగార్జునసాగర్‌కు చెందిన ప్రేమ్‌రాజ్‌తో వివాహమైంది. ప్రేమ్‌రాజ్ స్థానికంగా ఉన్న సూర్యవంశీ స్పిన్నింగ్ మిల్ కంపెనీలో మెకానికల్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సత్యవాణి తన కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్‌లో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. తిరిగి రాత్రి అలియాబాద్‌కు వచ్చే క్రమంలో ఉప్పల్ బస్టాండ్ వద్దకు రాగానే అప్పటికే కురుస్తున్న భారీ వర్షం కారణంగా వచ్చిన నీటి ఉధృతికి బస్టాండ్ వద్ద నాలాలో చిక్కుకుపోయింది. స్థానికులు ఆమెను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. నాలాలో పడి కొట్టుకుపోయిన మహిళను సత్యవాణిగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శామీర్‌పేట్ రిసార్ట్‌లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలోని ఓ రిసార్ట్‌పై పోలీసులు శుక్రవారం దాడి చేశారు. ఈ సందర్భంగా రూ.24 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మెదక్ ఉప ఎన్నికల్లో ఈ డబ్బును పంచేందుకు దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై సమాచారం అందటంతో పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓ రాజకీయ నేతకు సంబంధించిందిగా పోలీసులు భావిస్తున్నారు. -
'ఆత్మరక్షణార్థమే కాల్పులు జరిపా'
హైదరాబాద్: నకిలీనోట్ల ముఠా చేతిలో గాయపడి చికిత్స అనంతరం కోలుకున్న ఎస్.ఐ.వెంకటరెడ్డి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శామీర్‌పేటలో ఎల్లంగౌడ్ గ్యాంగ్ చేతిలో వెంకటరెడ్డి గాయపడ్డారు. సిద్ధిపేట కేంద్రంగా నకిలీనోట్లు చెలమణి అవుతున్నాయని, దీనికి ఎల్లంగౌడ్ ప్రధాన సుత్రధారి అని వెంకటరెడ్డి తెలిపారు. శామీర్‌పేట ఘటనలో తప్పనిసరి పరిస్థితుల్లోనే కాల్పులు జరపాల్సి వచ్చిందని చెప్పారు. తమ ప్రాణాలు కాపాడుకునేందుకే కాల్పులు జరిపామని వెల్లడించారు. మొదటిగా రఘు, నరేష్‌లను అదుపులోకి తీసుకున్నామని, వారిని విడిపించేందుకు శ్రీకాంత్, ఎల్లంగౌడ్, ముస్తాఫాలు శామీర్‌పేటకు వచ్చారని చెప్పారు. వస్తూనే ముస్తాఫా మాపై దాడి చేశాడని, కానిస్టేబుల్ ఈశ్వరరావును దారుణంగా హత్యచేశారని తెలిపారు. ఎల్లంగౌడ్‌ను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించామని, మేం పోలీసులమని గ్రహించి ఎల్లంగౌడ్, శ్రీకాంత్‌లు అక్కడి నుంచి పరారయ్యారని వివరించారు. -
కనులపండువ..
- ఘనంగా నల్సార్ స్నాతకోత్సవం - రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఘన స్వాగతం - 649మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం శామీర్‌పేట్ : మండలపరిధిలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి ముఖ్యఅతిథిగా హజరై స్నాతకోత్సవ ఉపన్యాసం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావులు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. హైదరాబాద్ హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి ,నల్సార్ లా యూనివర్సిటీ చాన్స్‌లర్ క ళ్యాణ్ జ్యోతిసేన్ గుప్త సభాధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో 649 మంది విద్యార్థులకు పట్టాల ప్రదానం చేశారు. వీరిలో పలువురికి ప్రశంసాపత్రాలతో పాటు బంగారు పతకాలను అందజేశారు. మొత్తం 48 బంగారు పతకాలకుగానూ బీఏఎల్ ఎల్బీ ఆనర్స్ పూర్తి చేసిన విద్యార్థిని కుమారి ప్రియంవదా దాస్ 11 బంగారు పతకాలు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. యూనివర్సిటీ వైస్‌చాన్స్‌లర్ ఫైజాన్ ముస్తఫా యూనివర్సిటీలో విద్యార్థులు, ఉపాధ్యాయులు సాధించిన విజయాలను, విద్యా విషయాలను వివరించారు. నల్సార్‌లో ఇటీవల ఆరంభించిన చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం ద్వారా విద్యార్థులు భిన్నమైన కేసుల వివరాలను తెలుసుకునే వీలు కలిగిందన్నారు. తొలుత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి హెలీకాప్టర్ సాయంత్రం 4 గంటలకు నల్సార్ లా యూనివర్సిటీలో ప్రత్యేకంగాఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌లో దిగగా అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో స్నాతకోత్సవ ప్రాంగణానికి ఆయనను తీసుకువచ్చారు. శామీర్‌పేట్ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు గవర్నర్ నరసింహాన్‌తో పాటు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, హైకోర్డు ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్‌గుప్తలు వచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేక వాహనాలలో వారిని స్నాతకోత్సవ ప్రాంగణానికి తీసుకువచ్చారు. -
ఒక ఎస్సైకి గాయాలు...నగర శివార్లలో ఘటన
-
ఉడుత తెచ్చిన తంటా!
స్తంభంపై విద్యుత్ తీగలపైకి ఎక్కిన ఉడుత షార్ట్ సర్క్యూట్‌తో తెగిపడిన తీగ విద్యుదాఘాతంతో కింద ఉన్న పాకల్లోని 91 జీవాల మృత్యువాత శామీర్‌పేట్ మండలం కేశవరంలో ఘటన శామీర్‌పేట్, న్యూస్‌లైన్: ఓ ఉడుత 91 జీవాల మృతికి కారణమైంది. విద్యుత్ స్తంభంపై రెండు తీగలపైకి వెళ్లడంతో షార్ట్ సర్క్యూట్ జరిగింది. కింద ఉన్న పాకలపై కరెంట్ తీగ పడడంతో షార్ట్‌సర్క్యూట్ ఏర్పడి 91 జీవాలు(మేకలు, గొర్రెలు) మృత్యువాత పడ్డాయి. ఈ సంఘటన మండల పరిధిలోని కేశవరంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దాయాదులు బొమ్మలపల్లి శ్రీశైలం, యాదయ్య, ఐలయ్యలు జీవాలను సాకుతూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. వీరు గ్రామ సమీపంలోని బండారిగుట్ట వద్ద పక్కపక్కనే మూడు పాకలు ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఉదయం కేశవరం- లక్ష్మాపూర్ మధ్య ఉన్న 33/11 కేవీ కెపాసిటీ విద్యుత్ తీగలపై ఓ ఉడుత ఎక్కింది. రెండు(ఎర్త్, ఫేజ్) తీగలను అది తాకడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో కరెంట్ తీగ తెగి బొమ్మలపల్లి శ్రీశైలం పాకపై పడిపోయింది. మంటలు చెలరేగడంతో గొర్రెలు, మేకలు పరుగెత్తి ఇనుప ఫెన్సింగ్‌ను తాకాయి. దీంతో పాకల్లో ఉన్న బొమ్మలపల్లి శ్రీశైలానికి చెందిన 61, బొమ్మలపల్లి యాదయ్యకు చెందిన 24, ఐలయ్యకు చెందిన మూడు 6.. మొత్తం 91 జీవాలు మృత్యువాతపడ్డాయి. కాగా ప్రమాదంలో మరో 30 జీవాలు క్షేమంగా బయటపడ్డాయి. స్థానికుల సమాచారంతో విద్యుత్ అధికారులు కరెంట్ సరఫరా నిలిపి వేశారు. కష్టపడి పోషించుకుంటున్న జీవాలు మృతిచెందడంతో వాటి యజమానులు కన్నీటిపర్యంతమయ్యారు. ట్రాన్స్‌కో అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఒక్కోజీవానికి తమ శాఖ తరఫున రూ. 2 వేలు ఇచ్చేవిధంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. పరామర్శించిన ఎమ్మెల్యే.. జీవాల మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేఎల్లార్, పలు పార్టీల నాయకులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు. అనంతరం కేఎల్లార్ విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ తీగలు ఉన్నచోట్ల కాపరులు పాకలు ఏర్పాటు చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు ైధె ర్యం కోల్పోవద్దని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన ఉడుత కూడా మృతిచెందింది. -
41మందికి 'రేవ్' పెట్టిన పోలీసులు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు చేస్తూనే ఉన్నా .. నగర శివార్లలో మాత్రం రేవ్ పార్టీల విష సంస్కృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా శామీర్‌పేట లియోనియా రిసార్ట్ పక్కనే ఉన్న విల్లాలో అర్థరాత్రి రేవ్ పార్టీ జరిగింది. పక్కా సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ సందర్భంగా 31మంది యువకులు, పదిమంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. రేవ్ పార్టీ నిర్వహిస్తున్న రాఖీతో పాటు సూర్య, కరీం, రమేష్‌లను అరెస్ట్ చేసి, బషీర్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరి నుంచి నాలుగున్నర లక్షల నగదు, రెండు ల్యాప్ టాప్స్, 32 సెల్‌ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల అదుపులో ఉన్న యువతీయువకుల్లో రాష్ట్రవాసులేకాక, మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటకకు చెందినవారు ఉన్నారు. కాగా ఇప్పటివరకూ ముంబై, ఢిల్లీలాంటి మహానగరాలకే అలవాటైన రేవ్ పార్టీ సంస్కృతి హైదరాబాద్‌లో కూడా చిన్నచిన్నగా విస్తరిస్తోంది. వీకెండ్ వస్తే చాలు ఢిఫరెంట్ ఎంజాయ్ కోసం యూత్ రేవ్ పార్టీలను ఆశ్రయిస్తోంది. హైదరాబాద్ నగర శివార్లలో ప్రతి వీకెండ్లో ఎక్కడో ఓ చోట రేవ్ పార్టీలు జరుగుతున్నా.. బయటపడేవి కొన్ని మాత్రమే. రేవ్ పార్టీ అంటే... పురుషులు, మహిళలు కలిసి ఒకే చోట మద్యం, డ్రగ్స్ తీసుకుంటూ డ్యాన్స్ చేయడాన్ని క్లుప్తంగా రేవ్ పార్టీ అంటారు. 1950 సంవత్సరం ఇంగ్లండ్‌లో ఈ పార్టీలు మొదలయ్యాయి. క్రమంగా యూరోప్, అమెరికా అంతటా విస్తరించి భారత్‌కూ చేరాయి. ఈ పార్టీలు నిర్వహించడం, వాటిల్లో పాల్గొనడం చట్ట వ్యతిరేకం. కారణం.. రేవ్ పార్టీల్లో డ్రగ్స్ వాడుతుంటారు. సాధారణంగా ఇలాంటి పార్టీలకు బాగా తెలిసిన వారికి మాత్రమే ఆహ్వానం ఉంటుంది. లోపల మందు, డ్రగ్స్, పెద్దగా సంగీతం ఉంటాయి. -
రెండు నెలల్లో తెలంగాణకు కొత్త సీఎం
శామీర్‌పేట్, న్యూస్‌లైన్ : రెండు నెలల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు తెలంగాణకు కొత్త ముఖ్యమంత్రిని కూడా ప్రకటించే అవకాశం ఉందని మేడ్చల్ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి (కేఎల్లార్) పేర్కొన్నారు. శుక్రవారం ఆయన శామీర్‌పేట మండలం తూంకుంటలో గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ సమైక్యాంధ్ర, తెలంగాణ ఉద్యమాల నేపథ్యంలో ప్రభుత్వం ఇరు ప్రాంతాల్లోనూ సమస్యలను పరిష్కరించలేకపోతోందన్నారు. విభజన జరిగిపోయిందని, ఇరు ప్రాంతాల నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని అన్నారు. సబ్‌స్టేషన్ స్థలంపై వివాదం.. గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపనతోపాటు స్థానికంగా సబ్‌స్టేషన్ నిర్మాణానికి కూడా ఎమ్మెల్యే శంకుస్థాపన చేయాల్సి ఉంది. కానీ అందుకు కేటాయించిన స్థలంపై కొందరు గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగారు. అందరికీ ఎమ్మెల్యేలా వ్యవహరించాలి.. గ్రామానికి చెందిన కొందరు వార్డు సభ్యులు ఎమ్మెల్యే తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలను సమానంగా చూడాల్సిన ఎమ్మెల్యే.. కొందరికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన సందర్భంగా కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యేకు అనుకూలంగా నినాదాలు చేయడంతో కొత్తగా ఎన్నికైన ఇతర పార్టీల వార్డు సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎద్దు నగేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, నాయకులు దయాసాగర్ యాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, అశోక్, సురేశ్, క్రిష్ణారెడ్డి, మహేందర్‌రెడ్డి, హన్మంతరెడ్డి, వెంకట్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే దుర్భాషలాడారు: లక్ష్మణ్ పింఛన్ ఇప్పించాలని కోరితే వికలాంగుడినని కూడా చూడకుండా ఎమ్మెల్యే తనను దుర్భాషలాడారని గ్రామానికి చెందిన లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొన్నాళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిందని, పింఛన్ కోసం అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని చెప్పాడు. ఎమ్మెల్యే గ్రామానికి రావడంతో పింఛన్ ఇప్పించాలని వేడుకున్నానని, అయితే ఎమ్మెల్యే తన సమస్యకు పరిష్కారం చూపకపోగా దుర్భాషలాడారని ఆరోపించాడు. -
శ్రీహరి మృతితో ‘అక్షర’ గ్రామాల్లో విషాదం
శామీర్‌పేట్, న్యూస్‌లైన్: పేదల జీవితాల్లో వెలుగు నింపి.. చిరునవ్వులు కురిపించిన ‘అక్షర’ ఫౌండేషన్ అధినేత, సినీనటుడు శ్రీహరి ఇక లేరన్న వార్త మండలంలోని లక్ష్మాపూర్, అనంతారం గ్రామాల్లో విషాదాన్ని నింపింది. సినీనటుడుగా, మంచి వక్తగా, రియల్ హీరోగా ఆయనకు మంచి పేరుంది. తన కూతురు అక్షర పేరిట అక్షర ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు తనవంతుగా సహాయాన్ని అందించి నిజ జీవితంలోనూ రియల్ హీరో అనిపించుకున్నారు. గుక్కెడు నీరు దొరక్క ఉక్కిరిబిక్కిరి అవుతున్న నిరుపేదలకు అక్షర ఫౌండేషన్ ద్వారా దాహార్తిని తీర్చి వారిలో చిరునవ్వుల వెలుగులు చిందించారు. గత నాలుగేళ్ల క్రితం ఆయన మండలంలోని అనంతారం, లక్ష్మాపూర్ గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిన్నారులకు, పేదవారికి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలుసేవా కార్యక్రమాలు అందిస్తున్నారు. ఫ్లోరైడ్ బాధితులకు ఆసరాగా.. మండలంలోని అనంతారం, లక్ష్మాపూర్, లక్ష్మాపూర్ తండాల్లో ఫ్లోరైడ్‌తో ఎంతోమంది బాధపడుతుండేవారు. ఈ విషయం శ్రీహరి దృష్టికి వచ్చింది. దీంతో తన కూతురు అక్షర పేరుతో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సంస్థతో ఫ్లోరైడ్ బాధితులకు ఆసరాగా నిలవాలనిసంకల్పంచారు. అనుకున్నదే తడవుగా మండలంలోని లక్ష్మాపూర్, అనంతారం, లక్ష్మాపూర్ తండాతోపాటు నారాయణపూర్ గ్రామాలను సందర్శించి ఫ్లోరైడ్ భూతాన్ని తరిమేందుకు పరిష్కార మార్గాన్ని కనుగొన్నారు. లక్ష్మాపూర్, అనంతారం గ్రామాలను శ్రీహరి దత్తత తీసుకున్నారు. 2009 జూన్ 15న లక్ష్మాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. నాటి నుంచి ప్లాంట్‌లో పేదలకు కేవలం రూ.2కే 20 నుంచి 40 లీటర్ల శుద్ధి చేసిన నీరు అందిస్తున్నారు. శుద్ధి చేసిన నీరు తీసుకెళ్లేందుకు 40లీటర్ల వాటర్ డబ్బాలను, పేద విద్యార్థులకు యూనిఫాంలు, మధ్యాహ్న భోజనాలకు ప్లేట్లు, అందజేశారు. తన జీవిత కాలమంతా లక్ష్మాపూర్, అనంతారం గ్రామాలలో తాగునీరుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అప్పటి నుంచి లక్ష్మాపూర్, అనంతారం గ్రామంలో తాగునీటికి కొరత లేదు. ఈ రెండుగ్రామాలను దత్తత తీసుకుని నాలుగేళ్లుగా చేయూతనిస్తూ వస్తున్న అక్షర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీహరికి ఇక లేరన్న వార్త మండలంలో విషాదాన్ని నింపింది. ఘన నివాళి పేదల జీవితాల్లో చిరునవ్వులు నింపిన సినీనటుడు శ్రీహరి మృతి తీరని లోటని లక్ష్మాపూర్, అనంతారం గ్రామస్తులు పేర్కొన్నారు. ముంబైలోని లీలావతి ఆస్పత్రిలో కాలేయ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందిన శ్రీహరికి లక్ష్మాపూర్, అనంతారం గ్రామస్తులు తీవ్ర సంతాపాన్ని తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. శ్రీహరి మృతికి సంతాపంగా గురువారం గ్రామంలో బైక్‌ర్యాలీతో పాటు ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తామని లక్ష్మాపూర్ గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్ గుప్తా, క్యాతం రవి, శంకర్, స్వామి, రవి, భాస్కర్, వీరేష్, నర్సయ్య, బండి జగన్నాథం, అనంతారం మాజీ సర్పంచ్ గౌస్‌పాషా, లక్ష్మాపూర్ మాజీ సర్పంచ్ పావని, మజీద్ పూర్ గ్రామస్తుడు తుంకిమల్లేష్ తదితరులు శ్రీహరి మృతిపైసంతాపం వ్యక్తంచేశారు.