శామీర్‌పేట్: సత్యవాణి మృతదేహాన్ని గురువారం అధికారులు కుటుంబీకులకు అప్పగించారు. సత్యవాణి(25) బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద ఉండగా భారీ వర్షానికి నాలాలో పడి గల్లంతై మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రేంరాజ్ ఏడేళ్ల క్రితం అలియాబాద్‌కు చెందిన సత్యవాణిని వివాహం చేసుకున్నాడు. ప్రేంరాజ్ స్థానిక బిన్నీ మిల్లులో పనిచేస్తున్నాడు.
దంపతులు కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. బుధవారం దంపతులు బంధువులతో కలిసి నగరంలోని ఓ శుభకార్యానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద భారీ వర్షానికి సత్యవాణి నాలాలో గల్లంతై మృతిచెందింది. విషయం తెలుసుకున్న అలియాబాద్ గ్రామస్తులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు.
జీహెచ్‌ఎంసీ నిర్లక్షంతోనే వివాహిత మృత్యువాత పడిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్‌ఎంసీ అధికారులు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం అధికారులు సత్యవాణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో గుంటూరు జిల్లా ఈపూర్‌కు తీసుకెళ్లారు.
సత్యవాణి మృతదేహం కుటుంబీకులకు అప్పగింత
Published Fri, Nov 14 2014 12:02 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement