The post-mortem
-
పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది
చెట్టంత కొడుకు.. అందివస్తాడను కున్నంతలోనే గర్భశోకం.. ఆ తల్లిదండ్రుల కన్నీటికి అంతు లేదు.. మనసున్న మిత్రుడు..జీవితాంతం తోడుంటాడని నమ్మిన స్నేహితులకు తీరని దుఃఖం..ప్రేమిస్తే చంపేస్తారా.. ఇష్టం లేకుంటే మందలిస్తే సరిపోతుందిగా..ఎందుకంత రాక్షసత్వం.. ఇది బంధుమిత్రుల ఆవేదన..పోలీసుల నిర్లక్ష్యమే బలిగొంది.. సకాలంలో స్పందిస్తే ప్రాణాలతో మిగిలేవాడు.. రాజకీయ జోక్యంతో నిందితులుతప్పించుకుంటున్నారు.. న్యాయాన్ని ఖూనీ చేస్తున్నారు.. ఇది సర్వత్రా వినిపిస్తున్న విమర్శ బుధవారం కేజీహెచ్‌లో ఇంజినీరింగ్ విద్యార్థి ప్రదీప్ మృతదేహానికి పోస్టుమార్టం జరిగింది. అనంతరం అశ్రునయనాల మధ్య అగనంపూడిలో అంత్యక్రియలు జరిగారుు. అగనంపూడి : పోలీసుల నిర్లక్ష్యమే మా కుమారుడిని బలిగొంది.. వారు సకాలంలో స్పందించి ఉంటే మా కొడుకు బతికి ఉండేవాడు.. హంతకులకు పోలీసులు అండగా నిలవడం వల్లే ఇంత దారుణం జరిగిపోరుుంది.. అని ప్రదీప్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్న దానబాల ప్రదీప్ కంశికోటలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య విశాఖ నగరంతోపాటు జిల్లాలోనూ తీవ్ర సంచలనం రేపింది. నిర్వాసిత కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు మృతుని నివాసానికి తరలివచ్చారు. అంతిమ వీడ్కోలుకు భారీ ఎత్తున మృతుని బంధువులు, స్థానికులు, విద్యార్థులు తరలివచ్చారు. ప్రదీప్‌ను చివరిసారిగా చూసి కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో అగనంపూడి శోకసంద్రలో మునిగిపోరుుంది. పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు పోలీసుల నిర్లక్ష్యం వల్లే ప్రదీప్ హత్యకు గురయ్యాడని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నారుు. బుదిరెడ్డి చిన్న, అతని అనుచరులు ప్రదీప్‌ని హింసించి అపహరించుకుపోయారని గత నెల 28న కశింకోట పోలీసులకు హతుని బంధువులు, స్నేహితులు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే దారుణం జరిగిపోరుుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదుదారులను స్టేషన్లోనే హంతకులు బెదిరిస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మృతిని బంధువులు ఆరోపిస్తున్నారు. దీపావళి నాడు చిన్న, మరికొంత మంది ప్రదీప్మెడలోని బంగారు గొలుసు, సెల్‌ఫోన్ తెచ్చి ఎస్ఐకి ఇస్తే... అసలు వ్యక్తి లేకుండా గొలుసు, సెల్‌ఫోన్ ఎక్కడివని కనీసం అడగకుండా వారిని వదిలేయడం వెనుక ఎస్ఐ, పోలీసుల పాత్ర ఉందని బంధువులు, సహచర విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
పూడ్చిన శవం వెలికితీసి పోస్టుమార్టం
లాలాపేట(కొందుర్గు): నెల రోజుల క్రితం పూడ్చిపెట్టిన శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించిన సంఘటన మండలంలోని ఉమ్మెంత్యాల గ్రామపంచాయతీ లాలాపేట గ్రామంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మక్తల చెన్నమ్మ(39) జూన్ 15న ఇంట్లో వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం హైద్రాబాద్ ఉస్మానియాస్పత్రికి తరలించగా, చికిత్స పొంది ఇంటికి వచ్చింది. కాగా పరిస్థితి విషమించి సెప్టెంబర్ రెండవ వారంలో ఆమె మృతి చెందడంతో కుటుంబ సభ్యులు మృతదేహన్ని ఖననం చేశారు. అయితే పోలీసులు శుక్రవారం తహసీల్దార్ పాండు, షాద్‌నగర్ రూరల్ సీఐ మదుసూధన్ సమక్షంలో మృతదేహన్ని వెలికితీసి, డాక్టర్ తకియోద్దీన్ ఆధ్వర్యంలో పోస్టుమార్టం చేయించారు. -
భయంతో 16వ అంతస్తు నుంచి దూకి..
► యజమానికి తెలిస్తే...? ► ప్రాణం తీసిన ‘భయం’ ► యువతి ఆత్మహత్య మాదాపూర్: బెడ్‌పై మూత్రవిసర్జన చేసిన ఓ యువతి విషయం యజమానికి తెలిస్తే ఏమౌతుందోననే భయంతో 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మాదాపూర్ ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... పశ్చిమగోదావరిజిల్లా భీమవరం మండలం, గునుపూడి గ్రామానికి చెందిన వెన్నెల(19) ఖానామెట్‌లోని మినాక్షీ స్కైలాంచ్ ఫోలరీస్ ఫ్లాట్ నెంబర్ 1606 లో అదే ప్రాంతానికి చెందిన మోహన్ కృష్ణరాజు ఇంట్లో నెల రోజులుగా పని చేస్తోంది. ఈమెకు నిద్రలో మూత్ర విసర్జన చేసే అలవాటు ఉంది. మంగళవారం రాత్రి తాను పడుకున్న బెడ్‌పై మూత్ర విసర్జన చేసింది. ఈ విషయం యజమానికి ఎక్కడ తెలిసిపోతుందోననే భయంతో వెన్నెల బుధవారం తెల్లవారుజామున 16వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. -
డిగ్రీ విద్యార్థి దుర్మరణం
గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం గిద్దలూరు మండలం పాతపాడు సమీపంలో ఘటన.. కొనకనమిట్ల : గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థి దుర్మరణం పాలయ్యూడు. ఈ సంఘటన ఒంగోలు- గిద్దలూరు రహదారిలోని పాతపాడు సమీపంలో గురువారం ఉదయం జరిగింది. వివరాలు.. కొనకనమిట్ల మండలం చినమనగుండం ఎస్సీ కాలనీకి చెందిన పాపాబత్తిన బాబు కుమారుడు ప్రవీణ్‌కుమార్ (20) పొదిలి ఎస్ఎస్ఎన్ కాలేజీలో బీఎస్సీ (కంప్యూటర్స్) మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతుండటంతో పొదిలిలో తన బాబాయి ఇంట్లో ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రవీణ్‌కుమార్ బుధవారం సాయంత్రం గొట్లగట్టు వచ్చి తన మిత్రునికి చెందిన బైకుపై మళ్లీ పొదిలి వెళ్లాడు. రాత్రి పొదిలిలో ఉండి గురువారం ఉదయాన్నే పొదిలి నుంచి స్వగ్రామం చినమనగుండం వస్తున్నాడు. పాతపాడు సమీపంలో ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రవీణ్‌కుమార్ ఎగిరి రోడ్డుపై పడటంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన వాహనం ఆగకుండా వెళ్లింది. ప్రవీణ్‌కుమార్ తల్లిదండ్రులు సంఘటన స్థలానికి వచ్చి కన్నీటిపర్యంతమయ్యూడు. కాలేజీ ప్రిన్సిపాల్ కేవీఆర్ కృష్ణారెడ్డి, విద్యార్థులు సంఘటన స్థలానికి చేరుకొని విచారం వ్యక్తం చేశారు. ఎస్సై బ్రహ్మనాయుడు వచ్చి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు. -
అదృశ్యమైన మహిళ.. శవమై లభించింది
పూడ్చిపెట్టిన దుండగులు కుక్కలు లాగటంతో వెలుగులోకి... మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం తిమ్మాజిపేట (జడ్చర్ల టౌన్) : ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ మహిళ శవమై లభించింది. ఈ సంఘటన మండలంలోని ఎదిరేపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. తిమ్మాజిపేట ఎస్ఐ గురుస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నేరెళ్లపల్లి గ్రామ శివారులో మహిళ తలకాయ పుర్రె, చీరను కుక్కలు లాగుతున్నాయని అటుగా వెళ్లిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం తహసీల్దార్ నర్సింగ్‌రావుతో కలసి ఘటనాస్థలానికి వెళ్లాం. మహిళనును హత్య చేసి పూడ్చి పెట్టారు. సక్రమంగా పూడ్చకపోవటంతో కుక్కలు చీర, పుర్రెను బయటకు లాగేందుకు యత్నించాయి. పూడ్చిన చోట తవ్వి చూడగా చేతి ఎముకలు, పుర్రెమాత్రమే లభించాయి. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులను పిలిపించి అక్కడే ఉన్న బాగాలకు పోస్టుమార్టం చేయించాం. పుర్రె, వెంట్రుకలు, లభించిన చీరను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపించాం. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఎదిరేపల్లికి చెందిన చింతకింది భీమమ్మ కనిపించకుండా పోయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. ఆ మహిళే అయ్యి ఉంటుందని భావించి భీమమ్మ పిల్లలు శ్రీకాంత్ (13), అఖిల (8)తోపాటు వారి బంధువులను పిలిపించి చీరను, పుర్రెను చూయించాం. వారు ఇంట్లోనుంచి కనిపించకుండా పోయిన సమయంలో భీమమ్మ కట్టుకున్న చీరగానే గుర్తించారు. భీమమ్మ భర్త వెంకటయ్య ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. ఇపుడు ఆమెకూడా లేకపోవడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. ఘటనా స్థలాన్ని జడ్చర్ల సీఐ గిరిబాబు సైతం సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్ఐ తెలిపారు. చింతకింది భీమమ్మను ఎవరో హత్యచేసి పూడ్చివేసినట్లుగా అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు. -
అటు వియోగం.. ఇటు వేధింపులు
మూన్నెల్ల కిందట రోడ్డు ప్రమాదంలో ప్రాణం కోల్పోయిన ఇంటి పెద్ద అత్తింటి ఆరళ్లతో పెద్ద కుమార్తె జీవితం నరకం జీవితంపై విరక్తితో ఒకే కుటుంబంలో ఐదుగురి బలవన్మరణం ఆ దంపతులిద్దరూ ఉపాధ్యాయులు. వారికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. హాయిగా సాగిపోతున్న జీవితాలు. మూడు నెలల కిందట జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయారు. అతని జ్ఞాపకాల నుంచి ఇంకా వారు పూర్తిగా కోలుకోలేదు. వీరు పుట్టెడు దుఃఖంలో ఉండగా..మరో వైపు పెద్ద కుమార్తెను భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో జీవితంపై విరక్తి పెరిగింది. ఇక తమకు చావే శరణ్యమనుకున్న తల్లీబిడ్డలు ఇంట్లోని పైకప్పునకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. మండ్య : మండ్య జిల్లా, నాగమంగళ తాలూకా, మారదేనహళ్లి గ్రామానికి చెందిన రామేగౌడ భార్య మీనాక్షమ్మ (55) దంపతులకు సుచిత్ర (26), పద్మశ్రీ(22), యోగశ్రీ(20), కుమారుడు యోగానందగౌడ(16) ఉన్నారు. మూడు నెలల క్రితం బేళూరు రొడ్డు క్రాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రామేగౌడ అకాల మృత్యుపాలయ్యాడు. మీనాక్షమ్మ ప్రస్తుతం ఆళిసంద్ర గ్రామంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. రెండు సంవత్సరాల క్రితం పెద్దకుమార్తె సుచిత్రను తుమకూరు చెందిన యువకుని ఇచ్చి వివాహం చేశారు. అయితే సుచిత్రను భర్త, అత్తమామలు వేధించసాగారు. దీంతో ఆమె పుటింటికిచేరింది. అప్పటికే భర్త మృతితో మనో వేదనకు గురవుతున్న మీనాక్షమ్మకు కుమార్తె కుటుంబంలోని కలహాలు నిద్రాహారాలే లేకుండా చేశాయి. ఈ సమస్యలతో తీవ్రంగా మదనపడేది. మరో వైపు ఆర్థిక ఇబ్బందులు ఆ కుటుంబాన్ని వెంటాడాయి. ఈ పరిస్థితుల్లో దెర్యం చెప్పేవారు కూడా లేకపోయారు. దీంతో కుటుంబం మొత్తం జీవితంపై విరక్తి పెంచుకుంది. ఆత్మహత్యే ఈ సమస్యలకు పరిష్కారమని భావించింది. సోమవారం రాత్రి మీనాక్షమ్మ, సుచిత్ర, పద్మశ్రీ, యోగశ్రీ, యోగానంద ఇంటి పైకప్పునకు ఉరి వేసుకొని బలవన్మరణం చెందారు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాక పోవడం, ఇంటి తలుపు తెరుచుకోక పోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు కిటికిలో నుంచి లోపలకు చూడగా సామూహిక ఆత్మహత్యల ఉదంతం వెలుగు చూసింది. డీవైఎస్పీతోపాటు ఇతర పోలీసు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను కిందకు దింపి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
మరణంలోనూ వీడని స్నేహం
కాలువలోకి దూసుకెళ్లిన బైక్ ఇద్దరు యువకుల దుర్మరణం రెండు కుటుంబాల్లో విషాదం బసంత్‌నగర్ : రామగుండం మండలం బసంత్‌నగర్ విమానశ్రయం సమీపంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ప్రమాదంలో ఇద్దరు ప్రాణస్నేహితులు దుర్మరణం చెందారు. గంగిరెద్దులకాలనీ వద్ద బైక్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మిట్ట రాజ్‌కుమార్(23), పల్లికొండ మల్లేశ్(23) మృతిచెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎన్టీపీసీలోని సుభాష్‌నగర్‌కు చెందిన మిట్టపల్లి రాజమౌళి- శారద కుమారుడు రాజ్‌కుమార్, అన్నపూర్ణ కాలనీకి పల్లికొండ పోచం- ముత్తమ్మ కుమారుడు మల్లేశ్ స్నేహితులు. ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ద్విచక్రవాహనంపై ఎన్టీపీసీ నుం చి పుట్నూర్‌లో ఉంటున్న రాజ్‌కుమార్ అత్తమ్మ కొడిపెల్లి రాజేశ్వరి వద్దకు వచ్చారు. అయితే రాజేశ్వరి కుటుంబ సభ్యులతో కలిసి అప్పటికే సమీపంలోని ఈసాలతక్కళ్లపల్లి జాతరకు వెళ్లడంతో వారిని కలిసిన రాజ్‌కుమార్, మల్లేశ్ అక్కడే భోజనాలు చేశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఎన్టీపీసీకి బయల్దేరారు. మార్గమధ్యంలో విమానాశ్రయం వద్ద మూలమలుపును గమనించక నేరుగా దూసుకెళ్లడంతో సమీపంలోని ఎస్సారె స్పీ కెనాల్లో బైక్‌తో సహా పడ్డారు. తీవ్రంగా గాయాలు కావడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. గురువారం వేకువజామున ఓదెల మండలం కొలనూర్‌లో జరిగే జాతరకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న రాజ్‌కుమార్ కుటుంబసభ్యులు అతడి మొబైల్‌కు ఫోన్ చేయ గా స్పందించలేదు. ఉదయం 6 గంటల ప్రాంతంలో మృతదేహాలను గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో వారు వచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న బసంత్‌నగర్ ఎస్సై విజయేందర్ మృతుల సెల్‌ఫోన్ ద్వారా వారి కుటుం బసభ్యులకు సమాచారం తెలియజేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాజ్‌కుమార్ తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఇద్దరూ ప్రాణస్నేహితులు.. నిరుపేద కుటుంబాలకు చెందిన రాజ్‌కుమార్, మల్లేశ్ ప్రాణస్నేహితులు. రాజ్‌కుమార్ హైదరాబాద్‌లోని విమానశ్రయంలో ఆరు నెలలుగా సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. మల్లేశ్ గతంలో సెల్‌ఫోన్ షాపులో పని చేసి ఇటీవలే స్థానికంగా క్యాజ్వల్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. రామగుండంలో జరిగే వారి మిత్రుడి వివాహంతోపాటు సమ్మక్క- సారలమ్మ జాతర కోసం రాజ్‌కుమార్ రెండు రోజుల క్రితమే ఎన్టీపీసీకి వచ్చాడు. ఎప్పుడూ కలిసి తిరిగే వీరిద్దరు స్థానికంగా అందరితో కలివిడిగా ఉందేవారు. మరణంలో వీరి స్నేహబంధం వీడకపోవడంతో అందరినీ కలిచివేసింది. ఎన్టీపీసీలో విషాదం రాజ్‌కుమార్, మల్లేశ్ మరణంతో ఎన్టీపీసీ ప్రాంతంలో విషాదం అలుముకుంది. రాజ్‌కుమార్ తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కుమారుడు. చేతికందివచ్చిన కుమారుడు అకాల మరణంతో చెంద డంతో అతని తల్లిదండ్రులతోపాటు తోడుగా ఉంటాడనుకున్న చెల్లి స్వర్ణ కన్నీరుమున్నీరవుతున్నారు. మల్లేశ్ అన్న ఇటీవల ఓ కేసు విషయంలో జైల్లో ఉన్నాడు. ఆసరాగా ఉండే మల్లేశ్ మృతి ఆ కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. -
మందు తాగవద్దన్నందుకు.. పురుగు మందు తాగాడు!
క్షణికావేశంలో వ్యక్తి ఆత్యహత్య కురుపాం : మద్యానికి బానిసైన భర్తను మారుద్దామని భావించిన ఆ ఇల్లాలు.. కాస్త మందలిస్తే దారిలోకి వస్తాడని అనుకుంది. కానీ ఆ మందలింపే అతనిని బలి తీసుకుంటుందని ఊహించలేకపోయింది. భార్య మందలించిందన్న క్షణికావేశంలో పురుగుమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని కొండవాడ గ్రామానికి చెందిన కుంబిరిక రాజు (35) మద్యానికి బానిసయ్యాడు. రోజూ పూటుగా తాగి ఇంటికి వస్తుంటాడు. ఆదివారం రాత్రి కూడా ఇలానే వచ్చిన భర్తను.. భార్య సులోచన మందలించింది. ఇక మీదట మందు తాగి వస్తే సహించేది లేదని హెచ్చరించింది. దీంతో క్షణికావేశానికి గురైన రాజు ఇంట్లో ఉన్న పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన అతనిని ఆటోలో భద్రగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యాధికారి నిర్ధారించారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపరం ఏరియా ఆస్పత్రికి తరలించి, గుమ్మలక్ష్మీపురం ఎస్సై ఎస్.రాజు కేసు నమోదు చేశారు. అనాథలైన కుటుంబ సభ్యులు మృతి చెందిన కుంబిరిక రాజుకు సులోచన, రాజేశ్వరి అనే ఇద్దరు భార్యలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు జగదీష్, చంద్రకళ, నందిని ఉన్నారు. అతని మృతితో వీరంతా దిక్కులేని వారయ్యారు. -
‘మిషన్ భగీరథ’ పనుల్లో అపశ్రుతి
క్రేన్ కింద పడి కార్మికుడి మృతి మృతుడుగుంటూరు జిల్లా వాసి కీసర : మిషన్ భగీరథ పథకంలో భాగం గా మండలంలోని యాద్గార్పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో అపశుత్రి చోటు చేసుకుంది. శనివారం ప్రమాదవశాత్తు క్రేన్ కిందపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ గురువారెడ్డి కథనం మేరకు.. గుం టూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కొండల్ (38) మిషన్ భగీరథ పథకంలో భాగంగా మండలంలోని యాద్గార్పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనులను చేసేందుకు శుక్రవారం వచ్చా డు. కాగా శనివారం ఉదయం యాద్గార్పల్లి చౌర స్తా నుంచి కీసర వరకు చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో భాగంగా జైభారత్ హుడ్ ఇండస్ట్రీ సమీపంలో రోడ్డుపక్కన జేసీబీలతో తవ్విన గుంతల్లో క్రేన్ సాయంతో పెద్ద సైజ్ పైప్‌లను దించే పనులు చేపట్టారు. కొండల్.. క్రేన్ డ్రైవర్‌కు సాయంగా ఉంటూ పైప్‌లను దించేందుకు సైడ్ చూపించ సాగాడు. ప్రమాదవశాత్తు డ్రైవర్ కొండల్‌ను గమనించకుండా క్రేన్‌ను ముందుకు నడిపాడు. దీంతో వాహనం ఒక్కసారిగా కొండల్‌పైకి దూసుకుపోవడం అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొండల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
బైక్ బోల్తాపడి ఇద్దరు మృతి
చివ్వెంల : అతివేగంగా వెళ్తున్న బైక్ అదుపుతప్పి బో ల్తా కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందా రు. ఈ ఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండల పరిధిలో శనివారం వెలుగుచూసింది. స్థానికుల కథ నం ప్రకారం... ఖమ్మం జిల్లా ముదిగొండ మం డలం పండ్రేగుపల్లి గ్రామానికి చెందిన గరిపాకుల సత్యం (40), సూర రాము(26) శుక్రవారం రాత్రి బైక్‌పై ఆత్మకూర్(ఎస్) మండలం రామన్నగూడెం గ్రామంలోని బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. మార్గమధ్యలో మండల పరిధిలోని వట్టిఖమ్మంపహాడ్ గ్రా మ శివారులో బైక్ అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ వెనుక కూర్చున్న సత్యం ఎగిరి చెట్లపొదల్లో పడటంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాలతో రోడ్డుపై పడి ఉ న్న రామును స్థానికులు గమనించి పోలీసులకు స మాచారం అందించారు. ఎస్సై ఎ.శ్రీనివాస్ సిబ్బం దితో సంఘటనా స్థలానికి చేరుకుని రామును 108 అంబులెన్స్‌లో సూర్యాపేట ఏరియా వైద్యశాలకు తరలించిన అనంతరం మృతి చెందాడు. సత్యానికి భార్య, పిల్లలు ఉండగా, రాము అవివాహితుడు. అదే వైద్యశాలలో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. రాము సోదరుడు శేఖర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
మార్చురీ ముడుపులపై విచారణకు ఆదేశం
విశాఖ మెడికల్: శవ పరీక్షల (పోస్టుమార్టం) కోసం ప్రభుత్వ వైద్యులు ముడుపులు తీసుకుంటున్నారని వచ్చిన ఆరోపణపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు విచారణకు ఆదేశించారు. కేజీహెచ్‌లో నెలలోపు పిల్లల సంరక్షణ కోసం రూ.38 లక్షల వ్యయంతో ఎన్ఐసీయూ మొదటి అంతస్తులో నూతనంగా నిర్మించిన నవజాత శిశువుల ప్రత్యేక వైద్య విభాగం (ఎన్‌ఎస్‌ఐసీయూ)ను మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసూతి వార్డును ఎంపీ హరిబాబు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌తో కలసి సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవల గురించి ప్రసూతి మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జననీ సురక్ష పథకం కింద చికిత్స పొందుతున్న తల్లులకు మంత్రి భోజన పథకాన్ని ప్రారంభించారు. ‘మనుషులేనా వీళ్లు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకువెళ్లి.. కేజీహెచ్ ఫోరెన్సిక్ విభాగం వైద్యులు పోస్టుమార్టం కోసం రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారని చెప్పడంతో ఆయన తీవ్రంగా స్పందించారు. ముడుపులు తీసుకొనే వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అవినీతి వ్యవహారంపై 24 గంటల్లోగా సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్, వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. రాష్ట్రంలో త్వరలో వెయ్యి నర్సు పోస్టుల భర్తీ చేస్తామని, అందులో విశాఖ కింగ్‌జార్జి ఆస్పత్రికి కూడా కొందరిని కేటాయిస్తామన్నారు. కేజీహెచ్‌లో నర్సు పోస్టులు తీవ్ర కొరత ఉండడం వాస్తవమేనని, ఆర్థిక శాఖ ఆమోదం లభించిన వెంటనే ఈ కొరతను త్వరలో తీరుస్తామన్నారు. కేజీహెచ్‌లో రూ.85 కోట్లతో నిర్మించనున్న సర్జికల్ అంకాలజీ స్పెషాల్టీ బ్లాక్ (సీఎస్ఆర్) నిర్మాణానికి సంబంధించి టెండర్లను గురువారం తెరిచినట్లు తెలిపారు. విమ్స్ ఆస్పత్రిని త్వరలో ప్రారంభిస్తామన్నారు. వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు పిలిచామని, సిబ్బంది నియామకానికి సంబంధించి రెండు రోజుల క్రితమే వివిధ వైద్య విభాగాల నుంచి డెప్యుటేషన్లపై వచ్చేందుకు జీవోను విడుదల చేశామన్నారు. వైద్యులు లేని ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ ఏటీఎం పేరుతో గిరిజనులకు మందుల పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్మధుసూదనబాబు, ఏఎంసీ ప్రిన్సిపాల్ ఎస్.వి.కుమార్, విమ్స్ ఓఎస్డీ డాక్టర్ పి.వి.సుధాకర్, డెప్యూటీ సూపరింటెండెంట్లు ఉదయ్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరెడ్డి, ప్రసూతి,పిల్లల వార్డుల విభాగాధిపతులు శారదాబాయ్, పద్మలత ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ తదితరులు పాల్గొన్నారు. -
ఏమయ్యిందో ఏమో ..
దంపతులు బలవన్మరణం కుటుంబ కలహాలే కారణమన్న బంధువులు అనాథగా మిగిలిన కుమారుడు చిత్తూరు (అర్బన్): ఏమయ్యిందో ఏమో గానీ... మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ‘ నా భార్య ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. రండి నాన్న..’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి అతను కూడా నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. మూడేళ్ల కుమారుడు వచ్చీరానీ మాటలతో ‘మా అమ్మానాన్న చనిపోయారు..’ అంటూ వచ్చిన వాళ్లకందరికీ చెబుతుండటం కన్నీరు తెప్పించింది. చిత్తూరు నగరంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. చిత్తూరు నగరంలోని గిరింపేటకు చెందిన గోపి(36)కి, తిరుపతి ఇంద్రానగర్‌కు చెందిన ఉమామహేశ్వరి(22)కి 2011లో వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు బాలు ఉన్నాడు. గోపి నరహరిపేటలో మోటారు వాహన తనిఖీ అధికారి జగదీష్ వద్ద వ్యక్తిగత డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులు మిట్టూరులోని మెసానికల్ మైదానం సమీపంలో ఓ అద్దె ఇల్లు తీసుకుని కాపురముంటున్నారు. అయితే భార్యాభర్త చిన్న విషయాలకే గొడవ పడేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి గోపి, అతని భార్య ఉమామహేశ్వరి మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. క్షణికావేశంలో ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. కొద్ది సేపు తరువాత గీపి తలుపు తీసి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. జరిగిన విషయాన్ని గోపి తన తండ్రికి ఫోన్లో చెప్పాడు. కంగారుతో వచ్చిన గోపి తండ్రి ఇంట్లో తలుపు తెరచి చూడగా.. ఓ వైపు కోడలు ఫ్యాన్‌కు ఉరివేసుకుని వేలాడుతోంది. మరోవైపు కన్న కొడుకు మరో గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవమై కనిపించాడు. కాగా మనవడు బాలు నిద్రపోతున్నాడు. చిన్నపాటి సమస్యకే ఆత్మహత్య చేసుకుంటారా అంటూ రోదిం చారు. సమాచారాన్ని పోలీసులకు చెప్పడంతో వన్‌టౌన్ ఎస్ఐ తేజోమూర్తి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బుధవారం ఉదయం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. పోలీసుల విచారణ అనంతరం ఆత్మహత్యకు గల కారణాలు వెలుగులోకి రానున్నాయి. -
ఆర్టీసీ బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
భువనగిరి అర్బన్ : అత్తగారింటికి వెళ్లి తిరిగి వస్తున్న ఓ యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీ కొనగా దుర్మరణం పొందాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి నాగిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీనగర్ మండలం గూడూర్‌కు చెందిన బింగి ప్రేమ్‌కుమార్(28) వలిగొండలోని తన అత్తగారి ఇంటికి బైకుపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోకి రాగానే భువనగిరి నుంచి నల్లగొండకు వెళ్తున్న యాదగిరిగుట్టడిపో బస్సు ఎదురుగా వస్తున్న బైకును ఢీ కొట్టింది. ఎగిరిపడ్డ ప్రేమ్‌కుమార్ అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రేమ్‌కుమార్ బీబీనగర్‌లోని ఎంఎస్ కంపెనీలో పనిచేస్తుండేవాడని ఎస్ఐ భిక్షపతి తెలిపారు. మృతునికి భార్య సబిత ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. -
శ్వాసకోశ వ్యాధితోనే బన్నప్ప మృతి!
పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వెల్లడి విస్రా నివేదిక వస్తేనే.. పూర్తి వివరాలు పోలీసు బలగాల నడుమ బన్నప్ప అంత్యక్రియలు బస్తీలోనే మకాం వేసిన మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బాధిత కుటుంబానికి జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ హైదరాబాద్: మారేడ్‌పల్లి ఠాణాపై దాడి ఘటనకు సంబంధించిన కేసులో మృతుడు బన్నప్ప(35) శ్వాసకోశ సమస్యతోనే మృతి చెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. బన్నప్ప మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో ప్రొఫెసర్ రమణమూర్తి ఆధ్వర్యంలో మారేడుపల్లి ఎమ్మార్వో సైదులు సమక్షంలో మంగళవారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం స్థానిక శ్మశాన వాటికలో పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు జరిపారు. మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే సాయన్న బస్తీలోనే మకాం వేసి ఉద్రిక్తతలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన వెంటనే బన్నప్ప మృతదేహాన్ని వాల్మీకినగర్‌కు తీసుకురాగా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలని బన్నప్ప కుటుంబ సభ్యు లు నేతలను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శ్వాసకోశ సమస్యతోనే..: శ్వాసకోశ సమస్యతోనే బన్నప్ప మృతిచెందినట్లు వైద్యులు ప్రాథమిక నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మృతుని ఒంటిపై, అంతర్గతంగా ఎటువంటి గాయాలు లేవని, ఎడమకాలుకు గీరుకున్న గాయమే ఉందని నివేదికలో పేర్కొన్నట్లు తెలి సింది. మృతుని కడుపులో మద్యం ఆనవాళ్లు ఉన్నాయని, పడుకున్నప్పుడు వాంతులు కావడంతో, ఆహారం శ్వాసకోశ నాళానికి అడ్డుపడి ఉండొచ్చని, దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి బన్నప్ప మృతిచెంది ఉండవచ్చని వైద్యులు భావిస్తున్నారు. విస్రా నివేదిక ఆధారంగా పూర్తి వివరాలు వెల్లడి కావచ్చన్నారు. ఇద్దరు ఎస్సైలపై వేటు: బన్నప్ప మృతికి కారణమైన ఇద్దరు ఎస్ఐలపై ఉన్నతాధికారులు వేటువేశారు. ఆదివారం రాత్రి బన్నప్పను అదుపులోకి తీసుకున్న ఎస్సైలు బాధ్యతారహితంగా వ్యవహరించారని పేర్కొంటూ ఎస్సై రవికుమార్, మధులను హెడ్‌క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. సోమవారం రాత్రి ఠాణాపై బన్నప్ప బంధువుల దాడి అనంతరం నగర పోలీస్ కమి షనర్ మహేందర్‌రెడ్డి పరిస్థితిని సమీక్షించారు. దాడి ఘటనపై 4 ఎఫ్ఐఆర్లు నమోదు మారేడుపల్లి పోలీస్‌స్టేషన్‌పై సోమవారం రాత్రి దాడికి పాల్పడి కీలకమైన ఫైళ్లతోపాటు పోలీస్‌స్టేషన్ ధ్వంసానికి పాల్పడిన వారిపై మొత్తం 4 ఎఫ్ఐఆర్లను పోలీసులు నమోదు చేశారు. పోలీస్‌స్టేషన్‌పై దాడి, విధ్వంసంలో సుమారు 100 మంది పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ దగ్గరున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులపై కేసులు నమోదు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా దాడి ఘటనపై సీసీఎస్ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం సీసీఎస్ ఇన్స్పెక్టర్ శ్యామ్‌బాబు పోలీస్‌స్టేషన్ లోపల ధ్వంసమైన కంప్యూటర్లు, రికార్డులను పరిశీలించారు. జస్టిస్ చంద్రకుమార్ పరామర్శ బన్నప్ప కుటుంబ సభ్యులను మంగళవారం జస్టిస్ చంద్రకుమార్ పరామర్శించి మృతికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. మనుషులను కొట్టడం చట్ట వ్యతిరేకమని, ప్రజలు కూడా దాడులకు పాల్పడటం తగదన్నారు. ఆలిండియా లాయర్ల సంఘం విచారణ బన్నప్ప మృతి, స్టేషన్‌పై దాడికి సంబంధించిన వివరాల్ని ఆలిండియా న్యాయవాదుల సంఘం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమం లో పార్థసారథి, శివకుమార్, పాశం యాదగిరి, మాధవరెడ్డి, ప్రవీణ్ పాల్గొన్నారు. -
'అది బూటకపు ఎన్కౌంటర్'
-
'అది బూటకపు ఎన్కౌంటర్'
సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లో మరణించిన వివేక్ తండ్రి యోగానందాచార్యులు స్పష్టం చేశారు. అది బూటకపు ఎన్కౌంటర్, కావాలనే పోలీసులు వివేక్ని చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబం ఆది నుంచి సమాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు. వివరాలు..బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25) ఉన్నారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు.ఏడు నెలల కాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఎన్కౌంటర్ మృతులకు భద్రాద్రిలో పోస్టుమార్టం
{పత్యేక హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలింపు పోలీసు బందోబస్తు నడుమ శవపరీక్షలు భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులకు పోలీసు బందోబస్తు మధ్య శనివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చా రు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25), ఏపీలోని చింతూరు మండలం లంకపల్లికి చెందిన కూరం జోగి అలియాస్ సోనీ(22), ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా చిన్నతర్రంకి చెందిన మడకం దేవి అలియాస్ కమల(23)గా పోలీసులు గుర్తిం చారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు. పోలవ రం నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడు నెలల కాలం గా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. కూరం జోగి ఏరియా కమిటీ మెం బర్గా కొనసాగుతుండ గా, మడకం దేవి మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు ప్రొటెక్షన్సెల్లో పనిచేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ‘వివేక్‌కు మావోలతో సంబంధాలు లేవు’ సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో సం బంధాలు లేవని వివేక్ తండ్రి యోగానందాచార్యు లు స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆది నుంచి స మాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు. -
సత్యవాణి మృతదేహం కుటుంబీకులకు అప్పగింత
శామీర్‌పేట్: సత్యవాణి మృతదేహాన్ని గురువారం అధికారులు కుటుంబీకులకు అప్పగించారు. సత్యవాణి(25) బుధవారం రాత్రి కుటుంబీకులతో కలిసి సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద ఉండగా భారీ వర్షానికి నాలాలో పడి గల్లంతై మృతిచెందిన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా ఈపూర్ మండల కేంద్రానికి చెందిన ప్రేంరాజ్ ఏడేళ్ల క్రితం అలియాబాద్‌కు చెందిన సత్యవాణిని వివాహం చేసుకున్నాడు. ప్రేంరాజ్ స్థానిక బిన్నీ మిల్లులో పనిచేస్తున్నాడు. దంపతులు కంపెనీ క్వార్టర్స్‌లో ఉంటున్నారు. బుధవారం దంపతులు బంధువులతో కలిసి నగరంలోని ఓ శుభకార్యానికి వెళ్లారు. రాత్రి తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్ రేతిఫైల్ సమీపంలోని ఉప్పల్ బస్టాప్ వద్ద భారీ వర్షానికి సత్యవాణి నాలాలో గల్లంతై మృతిచెందింది. విషయం తెలుసుకున్న అలియాబాద్ గ్రామస్తులు గురువారం ఉదయం పెద్ద ఎత్తున నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలివెళ్లారు. జీహెచ్ఎంసీ నిర్లక్షంతోనే వివాహిత మృత్యువాత పడిందని మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసీ అధికారులు రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించారు. పోస్టుమార్టం అనంతరం అధికారులు సత్యవాణి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించడంతో గుంటూరు జిల్లా ఈపూర్‌కు తీసుకెళ్లారు.