
‘మిషన్ భగీరథ’ పనుల్లో అపశ్రుతి
క్రేన్ కింద పడి
కార్మికుడి మృతి
మృతుడుగుంటూరు జిల్లా వాసి
కీసర : మిషన్ భగీరథ పథకంలో భాగం గా మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో అపశుత్రి చోటు చేసుకుంది. శనివారం ప్రమాదవశాత్తు క్రేన్ కిందపడి ఓ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ గురువారెడ్డి కథనం మేరకు.. గుం టూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కొండల్ (38) మిషన్ భగీరథ పథకంలో భాగంగా మండలంలోని యాద్గార్‌పల్లి గ్రామ సమీపంలో చేపడుతున్న పైప్‌లైన్ పనులను చేసేందుకు శుక్రవారం వచ్చా డు. కాగా శనివారం ఉదయం యాద్గార్‌పల్లి చౌర స్తా నుంచి కీసర వరకు చేపడుతున్న పైప్‌లైన్ పనుల్లో భాగంగా జైభారత్ హుడ్ ఇండస్ట్రీ సమీపంలో రోడ్డుపక్కన జేసీబీలతో తవ్విన గుంతల్లో క్రేన్ సాయంతో పెద్ద సైజ్ పైప్‌లను దించే పనులు చేపట్టారు. కొండల్.. క్రేన్ డ్రైవర్‌కు సాయంగా ఉంటూ పైప్‌లను దించేందుకు సైడ్ చూపించ సాగాడు. ప్రమాదవశాత్తు డ్రైవర్ కొండల్‌ను గమనించకుండా క్రేన్‌ను ముందుకు నడిపాడు. దీంతో వాహనం ఒక్కసారిగా కొండల్‌పైకి దూసుకుపోవడం అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కొండల్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారెడ్డి తెలిపారు. కాగా.. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.