సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లో మరణించిన వివేక్ తండ్రి యోగానందాచార్యులు స్పష్టం చేశారు. అది బూటకపు ఎన్కౌంటర్, కావాలనే పోలీసులు వివేక్ని చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబం ఆది నుంచి సమాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్‌కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు.
వివరాలు..బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25) ఉన్నారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు.ఏడు నెలల కాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
'అది బూటకపు ఎన్కౌంటర్'
Published Sun, Jun 14 2015 8:31 AM | Last Updated on Tue, Oct 9 2018 2:47 PM
Advertisement
Advertisement