the encounter
-
ఏ క్షణమైనా మెరుపుదాడి!
- ఏజెన్సీలో ఉండొద్దు.. మైదాన ప్రాంతాలకు వచ్చేయండి - అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలకు పోలీసుల హెచ్చరిక విశాఖపట్నం: భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతల్లో వణుకు మొదలైంది. ముఖ్యంగా ఏజెన్సీ సహా పరిసర మండలాల్లోని టీడీపీ నేతలు కంటిమీద కనుకు లేకుండా ఉన్నారు. కీలక నేతలు సహా ఒకేసారి 30 మంది సహచరులను కోల్పోరుున మావోరుుస్టులు ప్రతీకారంతో రగిలిపోతున్నారు. ఏ క్షణమైనా మెరుపుదాడి చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని పోలీసు శాఖ ఉన్నతాధికారుల నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఏజెన్సీ, ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లోని ప్రజాప్రతినిధులు మైదానప్రాంతాలకు వెళ్లాలని కేంద్ర ఇంటిలిజెన్స శాఖ నుంచి ఇప్పటికే ఆదేశాలొచ్చారుు. ఈ నేపథ్యంలో విశాఖ ఏజెన్సీలో ఉంటున్న టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజాప్రతినిధులు కొంత కాలంపాటు స్వగ్రామాలకు దూరంగా ఉండాలని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఏజెన్సీలో పర్యటించాల్సి వచ్చినప్పటికీ జిల్లా పోలీస్ శాఖతోపాటు స్థానిక పోలీస్ అధికారులకు కూడా సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. మీ ఆనుపానులు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని, ప్రతి ఒక్కరికి భద్రత కల్పించడం సాధ్యమయ్యే పనికాదని హెచ్చరించినట్టు చెబుతున్నారు. దీంతో ఏ క్షణాన్న ఏ రూపంలో మావోలు విరుచుకుపడతారోననే ఆందోళన అధికార పార్టీ నేతల్లో నెలకొంది. మావోల నుంచి ముప్పు ఉన్న జిల్లామంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడితోపాటు ఏజెన్సీకి చెందిన పలువురు టీడీపీ నేతలకు భద్రత పెంచారు. ఇటీవలే టీడీపీలో చేరిన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనకు భద్రత పెంచాల్సిందిగా కోరినట్టు సమాచారం. బాక్సైట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందనే ఆందోళనతో మంత్రి అయ్యన్నపాత్రుడితో సహా ఏజెన్సీ ప్రాంత ప్రజాప్రతినిధులు పలువురు పూర్తిగా విశాఖకే పరిమితయ్యారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడైతే ఆయన టూర్ షెడ్యూల్ కూడా ఒక దశలో మీడియాకు విడుదల చేయడం కూడా ఆపేశారు. ఇటీవలే మళ్లీ టూర్ షెడ్యూల్ ఇస్తున్నప్పటికీ పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో టూర్ షెడ్యూల్ విషయంలో పోలీసుల అనుమతితోనే విడుదల చేసే పరిస్థితి నెలకొంది. పోలీస్ హెచ్చరికల నేపథ్యంలో ఈయనొక్కరే కాదు.. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన టీడీపీ నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది. -
గిరిసీమలు గజగజ
మరో నాలుగు మృతదేహాలు లభ్యం ఎన్కౌంటర్ మృతుల సంఖ్య 28 ఎన్‌కౌంటర్‌కు ముందు.. ఆ తర్వాత తీవ్ర నిర్బంధం వారం రోజుల నుంచి విద్యుత్ బంద్ సెల్ సిగ్నళ్లను జామ్ చేసిన అధికారులు క్షతగాత్రుల కోసం గ్రామాల్లో జల్లెడ ఆర్ఎంపీలు, ఇతర అనుమానితుల అరెస్టులు బిక్కుబిక్కుమంటున్న గిరిజనులు కూంబింగ్ దళాల కరకు బూట్ల చప్పుళ్లు.. గత కొద్దిరోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేత.. సోమవారంనాటి ఎన్కౌంటర్ అనంతరం మరింత పెరిగిన నిర్బంధం మధ్య గిరిసీమలు బిక్కుబిక్కుమంటున్నాయి.. దీనికి తోడు మంగళవారం మరో ఎన్కౌంటర్ జరిగిందని.. నలుగురు మావోలు మృతి చెందారని విస్తృతంగా జరిగిన ప్రచారం ఏజెన్సీని తీవ్ర భయాందోళనకు గురి చేసింది.. అయితే మరో ఎన్కౌంటర్ జరగలేదని.. సోమవారంనాటి ఎన్కౌంటర్లో మృతి చెందిన మరో నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని తర్వాత తేలింది. దీంతో భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 28కి పెరిగింది. మృతులు, క్షతగాత్రులు ఇంకా ఉంటారన్న అనుమానంతో గ్రేహౌండ్స్ బలగాలు కటాఫ్ ఏరియాతోపాటు ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. క్షతగాత్రులు చికిత్స కోసం గ్రామాలకు వెళతారన్న ఉద్దేశంతో గ్రామాల్లోని ఆర్ఎంపీ డాక్టర్లను, ఇతర అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఎన్‌కౌంటర్‌కు ప్రణాళిక వేసిన నాటి నుంచి గత వారం రోజులుగా గిరిపల్లెల్లో నిర్బంధం పెరిగింది. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సెల్ ఫోన్ సిగ్నళ్లను జామ్ చేశారు. ఫలితంగా గత కొన్ని రోజులుగా స్థానికులు భయాందోళనతోనే కాలం వెళ్లదీస్తున్నారు. మరోవైపు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు మరింత బలపడుతున్నాయి. మావోల శిబిరంపై దాడి చేసి ఏకపక్షంగా కాల్చి చంపారన్న ఆరోపణలను పోలీసుల చర్యలే బలపరుస్తుండటం విశేషం. ఏవోబీ నుంచి సాక్షి బృందం : ఆంధ్ర- ఒడిశా సరిహద్దు(ఏవోబీ) బలిమెల రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున మావోరుుస్టులు, పోలీసులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో అంతటా భీతావహ వాతావరణం చోటు చేసుకుంది. ఎప్పుడేమి జరుగుతుందోనని మారుమూల గూడేల్లోని వారు హడలిపోతున్నారు. ఆదివాసీలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు. పొలం పనులకు వెళ్లడానికి జంకుతున్నారు. గ్రామాల్లో నిశ్శబ్ద వాతావరణం చోటుచేసుకుంది. ప్రధాన రహదారులు జనసంచారంలేక వెలవెలబోతున్నారుు. యువకులు, యువతులు, పిల్లలు రోడ్లపైకి వచ్చేందుకు భయపడుతున్నారు. తప్పించుకున్న వారి కోసం ముమ్మర గాలింపు.. ఎన్కౌంటర్ నుంచి తప్పించుకున్న ఆర్కేతో సహా ఇతర మావోరుుస్టు అగ్రనేతల ఆచూకీ కోసం అడవులను జల్లెడ పడుతున్నారు. వేలాదిమంది గ్రే హౌండ్‌స దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు కూంబింగ్ ముమ్మరం చేశారు. కటాఫ్ ఏరియాలోతాజా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏవోబీలోని ప్రధాన సరిహద్దులతో పాటు గ్రామాలను పోలీసు బలగాలు చుట్టు ముట్టారుు. గ్రామాల్లోకి ఇంటింటికి వెళ్లి ఆరా తీస్తున్నాయి. మల్కన్‌గిరి పరిసర గ్రామాలన్నీ పోలీసుల గుప్పెట్లో ఉన్నారుు. పోలీసుల బూట్ల చప్పుళ్లతో దద్ధరిల్లిపోతున్నారుు. అదుపులో ఆర్ఎంపీలు.. ఎన్కౌంటర్లో చిన్నపాటి గాయాలతో బయటపడి ఎక్కడైనా చికిత్స పొందుతున్నారేమోననే అనుమానంతో గిరిజన గ్రామాల్లోని ఆర్ఎంపీ, పీఎంపీ డాక్టర్లను అదుపులోకి తీసుకొని పోలీసులు ఆరా తీస్తున్నారు. సానుభూతిపరుల ఇళ్లల్లో సోదాలు చేస్తున్నారు. సరిహద్దు ప్రాంతంలో వాహనాల తనిఖీ ముమ్మరమైంది. కొత్తవారిని ఆరా తీసి విడిచిపెడుతున్నారు. చెక్‌పోస్టుల్లో భధ్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల ఆంక్షలతో గిరిజనులు బిక్కుబిక్కమంటున్నారు. సంఘటన స్థలానికి మృతుల కుటుంబాలు.... పోలీస్ కాల్పుల్లో మృతి చెందిన మున్నా తల్లి శిరీష(ఆర్కే భార్య), లత తనయుడు మహేందర్, గాజర్ల రవి కుటుంబ సభ్యులు విశాఖకు చేరుకుని అక్కడ నుంచి సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. అదే విధంగా విరసం నాయకులు వరవరరావు, కళ్యాణరావు, ఏపీసీఎల్సీ రాష్ట్రాధ్యక్షుడు వి.చిట్టిబాబు, రాజకీయ ఖైదీల విడుదల కమిటీ కార్యదర్శి రామకష్ణ తదితరులు విశాఖకు చేరుకుని ఎన్‌కౌంటర్‌ను తీవ్రంగా ఖండించారు. ముమ్మాటికి బూటకపు ఎన్కౌంటర్లేనని..అర్ధరాత్రి నిద్రిస్తున్న వారిని మట్టుపెట్టి ఎన్కౌంటర్ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి బయల్దేరి వెళ్లారు. పరిస్థితి అదుపులోనే ఉందిః డీజీపీ సంఘటన ప్రాంతంలో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విశాఖలో డీజీపీ సాంబశివరావు ప్రకటించారు. పరిస్థితి అదుపులో ఉన్నప్పటికీ ఏ క్షణాన్నా ఏం జరుగుతుందో చెప్పలేమని చెప్పుకొచ్చారు. మంగళవారం నాటి కాల్పుల ఘటన అనంతరం తాను స్వయంగా వెళ్లి పరిస్థితులను పరిశీలించి నట్టు డీజీపీ వెల్లడించారు. మరో పక్క నిన్నటి ఘటనలో అసువులు బాసిన కడప 11వ బెటాలియన్ సీనియర్ కమాండో అబుబారక్ కుటుం బానికి రూ.40లక్షల చెక్కును డీజీపీ సాంబశివరావు అందజేశారు. సోమవారం విశాఖ చేరుకున్న డీజీపీ మంగళవారం ఉదయం మల్కన్‌గిరి వెళ్లి సంఘటన స్థలాన్ని, పోస్టుమార్టం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి మధ్యాహ్నానికి ప్రత్యేక హెలికాప్టర్లో విశాఖకు చేరుకున్నారు. అధికారులతో సమీక్షించి సాయంత్రానికి తిరిగి విజయవాడ పయనమయ్యారు. కొలుకోలేని స్థితిలో ఉద్యమం... ఏవోబీలో ఏడాదిగా అగ్రనేతలను కోల్పోరుు ఉద్యమం బలహీన పడుతున్న తరుణంలో తాజా ఎన్‌కౌంటర్‌తో కోలుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఐతే ఈ ప్రాంతానికి కీలకనేతలైన ఆర్కే, రవి, చలపతులను కూడా ఎలాగైనా మట్టుబెట్టాలని పోలీసు బలగాలు అడవుల్లోకి దూసుకువెళుతుంటే.. పోలీసుల దాడులను అడ్డుకునేందుకు మిగిలివున్న దళసభ్యులు ఏ క్షణమైనా దాడి చేస్తారన్న అనుమానాలు కూడా పోలీసులకు ఉంది. తాజా ఎన్‌కౌంటర్‌తో ఈ ప్రాంత పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేస్తూ అధికార పార్టీ, మావోరుుస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న నేతలకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూంబింగ్‌కు వెళ్లిన బలగాలు ఇంకా తిరిగిరాకపోవడం, తప్పించుకున్న మావోరుుస్టుల కోసం వేటసాగిస్తుండటం తదితర పరిణామాలు ఈ ప్రాంత గిరిజనులను మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారుు. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న గిరిజనులు ఈ ఎన్‌కౌంటర్‌తో ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. -
అప్రమత్తమైన పోలీసులు
మంత్రులు, నేతలకు భద్రత పెంపు విశాఖపట్నం : ఏవోబీలో ఎన్‌కౌంటర్‌తో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమ య్యారు. ముఖ్య రాజకీయనాయకులు, అధికారులకు భద్రత పెంచారు. ఎన్కౌంటర్లో 24 మంది మృతి చెందడంతో మావోలు ఏ క్షణమైనా ఎదురుదాడికి తెగపడే అవకాశాలుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే బాకై ్సట్ ఉద్యమ నేపథ్యంలో మావోల నుంచి ముప్పు ఉందన్న భావనతో మంత్రి అయ్యన్నపాత్రుడు, ఏజెన్సీలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నేతలకు భద్రత కల్పించారు. తాజా ఘటన నేపథ్యంలో వీరికి భధ్రతను మరింత పెంచారు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు, అరకు ఎంపీ గీత, ఇటీవల టీడీపీలోకి చేరిన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులతోపాటు ఇతర టీడీపీ నేతలకు భద్రతను పెంచుతున్నట్టు పోలీస్ వర్గాలు ప్రకటించారుు. నర్సీపట్నంలోని మంత్రి అయ్యన్న అతని బంధువుల ఇళ్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అలాగే విశాఖలో మంత్రి అయ్యన్నతో పాటు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇతర ప్రజా ప్రతినిధుల ఇళ్ల వద్ద కూడా భద్రతను పెంచారు. ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ కార్యాలయాలకు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐటీడీఏ పీవో, ఓఎస్డీ తదితర ఏజెన్సీ ప్రాంత అధికారులతో పాటు కలెక్టర్, ఎస్పీలకు కూడా భద్రతను సమీక్షిస్తున్నారు. జిల్లాలో ప్రజాప్రతినిధులు, అధికారుల భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిం చేలా చర్యలు చేపట్టారు. ఎన్కౌంటర్ నేపథ్యంలో సోమవారం నగరానికి వచ్చిన డీజీపీ సాంబశివరావు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షలో ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. -
ముగిసిన పాంపోర్ ఎన్కౌంటర్
ఇద్దరు ఉగ్రవాదులు హతం శ్రీనగర్: శ్రీనగర్, జమ్మూ జాతీయ రహదారిలో ఉన్న పంపోర్ ప్రాంతంలోని ఈడీఐ భవనంలో దాగిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. దీంతో 56 గంటల సుదీర్ఘ ఎన్‌కౌంటర్‌కు బుధవారం తెరపడింది. ఈడీఐ భవనంలో గాలింపు చర్యలు పూర్తయ్యాయని, ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలు లభ్యమయ్యాయని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. సోమవారం ఉగ్రవాదులు ఈ భవనంలోకి చొరబడిన విషయం తెలిసిందే. ఆరోజు జరిగిన కాల్పుల్లో ఒక జవాను గాయపడ్డాడు. అప్పటి నుంచి భద్రతా దళాలు చాకచక్యంగా వ్యవహరించాయి. ఆ భవనంలో 60 గదులు ఉండటం వల్ల, ఒక్కో గదిని స్వాధీనం చేసుకోవాల్సి రావడం వల్ల ఎన్‌కౌంటర్‌కు ఎక్కువ సమయం పట్టిందని మేజర్ జనరల్ అశోక్ నౌరులా తెలిపారు. కాగా, ఉగ్రవాదులు ఈ భవనంలో చొరబడటం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. గతంలో ఫిబ్రవరి నెలలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు జవాన్లు, ముగ్గురు ఉగ్రవాదులు, మరో పౌరుడు చనిపోయారు. కశ్మీరీ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న ఇలాంటి భవంతిపై ఉగ్ర మూకలు తరచూ దాడి చేయడం బాధ కలిగిస్తోందని అశోక్ నౌరులా అన్నారు. -
నయూమ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి యాదగిరిగుట్ట/వలిగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత రాజకీయ పార్టీల నాయకులు, పలు శాఖల అధికారుల చరిత్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలని ఎమ్మెల్సీ రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట, వలిగొండ మండలం నాతాళ్లగూడెంలో వేర్వేరుగా విలేకరులతో మాట్లాడారు. 20 ఏళ్లలో గ్యాంగ్‌స్టర్ సంపాదించిన అక్రమ ఆస్తులను బయటపెట్టాలని, ఆయనకు సహకరించిన ప్రజాప్రతినిధులను, అధికారులను కఠినంగా శిక్షించాలన్నారు. తెలంగాణ, ఏపీలోనే కాక మరో ఐదు రాష్ట్రాల్లో ఆయన కార్యకలాపాలు విస్తరించాయని, ఎంతోమంది అమాయక ప్రజల ఆస్తులను లాగేసుకొని రోడ్డుపాలు చేశారన్నారు. జిల్లాలో 99 శాతం మంది అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు నయీమ్‌తో సంబంధాలు కలిగి ఉన్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భువనగిరికి చెందిన కౌన్సిలర్లను నయీమ్‌తో బెదిరింపజేసి అధికారపార్టీలో చేర్పించుకున్నారన్నారు. నయీమ్ చనిపోయిన తర్వాత ఆయన ఇంట్లో లభించిన డైరీలో ఎంతోమంది రాజకీయ నాయకుల చరిత్రలు ఉన్నాయని, వాటిని సీఎం కేసీఆర్ బయట పెట్టాలన్నారు. సిట్ విచారణ లో వెల్లడైన విషయాలను గోప్యంగా ఉంచి అధికార పార్టీకి చెందిన నాయకులను కేసు నుంచి తప్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. నయూమ్ మొత్తం ఆస్తులను చూపెట్టకుండా రూ. 2.80 కోట్లు మాత్రమే చూపెట్టడం విడ్డూరమన్నారు. ఆ ఆస్తులను పేదలకు పంచాలని, కేసును నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
నయీమ్ ఆస్తులకు లెక్కేలేదు..
పోలీసులకు సైతం అంతుపట్టని నయీమ్ ‘ఖజానా’ రాష్ట్రంలోని ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల్లో వెంచర్లు మరో లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, కాంప్లెక్సులు ఈ మొత్తం ఆస్తుల విలువ రూ.వేల కోట్లలో.. ఇక ఇతర రాష్ట్రాల్లో ఎన్నున్నాయో..! హైదరాబాద్: ఆస్తుల చిట్టా విప్పే కొద్దీ బయటకొస్తోంది.. ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో అధికారులు సైతం ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ఇప్పటివరకు సిట్ గుర్తించిన ఆస్తులే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న వందలాది డాక్యుమెంట్లను సిట్ క్షుణ్నంగా పరిశీలిస్తోంది. ఒక్క రాష్ట్రంలోనే నయీమ్ చెరలో ఖరీదైన ప్రాంతాల్లో 1,015 ఎకరాల భూమిలో వెంచర్లు ఉన్నట్లు నిర్ధారణకు వచ్చిన సిట్.. రెవెన్యూ అధికారులతో కలసి ఈ స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలి స్తోంది. వీటితోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లోనూ లక్షన్నర గజాలకు పైగా విస్తీర్ణంలో ఇళ్లు, షాపింగ్ కాంప్లెక్స్, ఓపెన్ ఫ్లాట్లు ఉన్నట్లు ఆధారాలు దొరికాయి. ఈ ఆస్తుల విలువను ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువ ప్రకా రం కేవలం రూ.14.39 కోట్లుగా లెక్కగడుతున్నారు. అయితే మార్కెట్లో వీటి విలువ రూ.1,500 కోట్లకు పైగా ఉంటుందని అంచ నా. హైదరాబాద్ పరిసరాల్లోని కొండాపూర్ ఏరియాలో నయీమ్ చెరలో ఉన్న 9 ఎకరాల స్థలమే దాదాపు రూ.200 కోట్లు ధర పలుకుతోంది. నయీమ్ ఆస్తులన్నీ హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఎక్కువగా ఉండటం తో వాటి విలువ వేలాది కోట్లలో ఉంటుందని స్పష్టమవుతోంది. ఇక మిగతా రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఇంకెన్ని ఆస్తులు ఉన్నాయనే విషయాలు పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. సిటీలో షాపింగ్ కాంప్లెక్స్‌లు..? నయీమ్ ఇంటి వద్ద లభించిన పత్రాల్లో సిటీల్లోనూ షాపింగ్ కాంప్లెక్స్‌లు, ఇళ్లు, ఫ్లాట్ల రూపంలో 1,67,117 గజాల భూమి ఉందని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. హైదరాబాద్‌లో మూడు షాపింగ్ కాంప్లెక్స్‌లు ఉన్నాయని గుర్తించిన సిట్ అధికారులు ఇప్పటికే అక్కడ తనిఖీలు చేసినట్లు సమాచారం. వీటితోపాటు ఓపెన్ ప్లాట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించారు. పుప్పాలగూడ పరిధిలోని నెక్నాంపూర్ గ్రామపంచాయతీ అల్కాపురి టౌన్‌షిప్‌లోని నయీమ్ ఇంటితోపాటు అతడి వంట మనిషి ఫర్హానా పేరిట ఉన్న అంజలీ గార్డెన్, తిరుమల గార్డెన్‌లోని ఇళ్లను కూడా పోలీసులు ఇప్పటికే సీజ్ చేశారు. మిగతా ఐదు రాష్ట్రాల్లో ఆస్తులెన్నో..! రాష్ట్రంలోనే వేల కోట్ల ఆస్తులుంటే నయీమ్ దందా సాగిన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలలో ఎన్ని ఆస్తులు ఉంటాయన్న దానిపై పోలీసులు దృష్టి సారించారు. ఇప్పటికే సైబరాబాద్ వెస్ట్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించిన నయీమ్ వంట మనిషి ఫర్హానా, అతడి డ్రైవర్ భార్య ఆఫ్సాలు వెల్లడించిన ప్రకారం ఆ ఐదు రాష్ట్రాల్లో ఆస్తులున్నట్టుగా తెలిసింది. వీటిని గుర్తించేందుకు న్యాయస్థానం ఆ ఇద్దరినీ బుధవారం నుంచి ఆరు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వడంతో ఏపీతోపాటు మహారాష్ట్ర, గోవా, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలకు తీసుకెళుతున్నారు. అలాగే మహబూబ్‌నగర్‌లోని షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసిన నయీమ్ భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, షాద్‌నగర్ ఇంటికి చెందిన వాచ్‌మన్ మతీన్, అతని భార్య ఖలీమా బేగంలను వారంరోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. వీరి విచారణలో కూడా మరిన్ని ఆస్తుల వివరాలు పూర్తిస్థాయిలో తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. కన్ను పడిందంటే వదలడు.. దైనా భూమిపై నయీమ్ కన్ను పడిందంటే అది అతడి చేతికి చిక్కాల్సిందే. నగరం, పట్టణం, గ్రామం అనే తేడా ఉండదు. ఆ భూమి ఎవరిదైనా వశం కావల్సిందేనన్నది నయీమ్ సిద్ధాంతం. ఇలా రంగారెడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లో పట్టణాలకు దగ్గరగా ఉండే వ్యవసాయ భూములను అనుచరగణంతో కలసి కబ్జా చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. వ్యవసాయ భూములను ఓపెన్ ప్లాట్లుగా చేసి రియల్ ఎస్టేట్ దందా సాగించాలనుకున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే కొంత మంది అనుచరులను ఈ దిశగా రంగంలోకి దింపాడని తెలుస్తోంది. అలాగే హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో 20 ఇళ్ల ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించారు. -
ఎస్పీని రక్షణ కోరిన గంగాధర్
సుభాష్‌నగర్ :మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో ఎన్కౌంటర్ అయిన నయీమ్ అనుచరుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ డిచ్పల్లి జడ్పీటీసీ అరుణ భర్త అమృతాపూర్ గంగాధర్ మంగళవారం ఎస్పీ విశ్వప్రసాద్‌ను ఆశ్రయించారు. గ్యాంగ్‌స్టర్ నయీమ్ అనుచరులు గత నెలలో గంగాధర్‌కు ఫోన్ చేసి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గంగాధర్ తనకు వచ్చిన ఫోన్ నంబర్‌ను పోలీసులకు తెలియజేశారు. ఆ నంబర్ ఆధారంగా నయీమ్ షాద్‌నగర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సోమవారం ఎన్కౌంటర్లో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈక్రమంలో నయీమ్ అనుచరుల నుంచి తనకు రక్షణ కల్పించాలని అమృతాపూర్ గంగాధర్ ఎస్పీని కలిసి కోరారు. అనంతరం గంగాధర్ మీడియా ముందుకు వచ్చేందుకు నిరాకరించి ఎవరికీ కన్పించకుండా వెళ్లిపోయాడు. -
రాలిన తారలు
ఎన్కౌంటర్ మృతుల్లో ఇద్దరు జిల్లా వాసులు మడగూడెంలో సారక్క అంత్యక్రియలు నేడు పైడిపల్లికి చేరనున్న సృజన మృతదేహం వరంగల్/ కొత్తగూడ : తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మంగళవారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మావోరుుస్టులు మృతిచెందారు. వీరిని కొత్తగూడ మండలం మడగూడేనికి చెందిన దనసరి సారక్క అలియూస్ అనిత, హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజనగా గుర్తించారు. మావోరుుస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియూస్ హరిభూషణ్ స్వగ్రామం మడగూడెంకు చెందిన సారక్క యేడాది క్రితమే దళంలో చేరింది. కొద్దిరోజులు కొత్తగూడ ఏరియా దళ కమాండర్ భద్రు దళంలో పనిచేసి, ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి బదిలీ అయింది. ఉద్యమంలో ఓనమాలు నేర్చుకునే క్రమంలోనే రాష్ట్ర సరిహద్దులో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. మృతదేహాన్ని భద్రాచలం ఆస్పత్రి మార్చురీ నుంచి మడగూడెం గ్రామానికి తరలించి బుధవారం అంత్యక్రియలు పూర్తి చేశారు. బంధుమిత్రుల సంఘం నాయకులు అంజమ్మ, పద్మకుమారి, శాంతమ్మ, సత్యజ్యోతి, భారతి, విమల, డప్పు రమేష్, న్యూడెమోక్రసీ నాయకులు ప్రభాకరన్న, బూర్క చిన్నవెంకటయ్య, ములుగు మాజీ ఎమ్మెల్యే దనసరి సీతక్క తదితరులు సారక్క మృతదేహం వద్ద నివాళులర్పించారు. ఇంటర్ చదువుతూనే ఉద్యమంలోకి.. హన్మకొండ మండలం పైడిపల్లికి చెందిన కొత్తకొండ సృజన(26) 2006 లో సీకేఎం కాలేజీలో ఇంటర్ చదువుతున్నప్పుడే మావోయిస్టు పార్టీ పట్ల ఆకర్షితురాలై ఏపీసీఎల్సీలో చేరింది. అదే సంవత్సరం డిసెంబర్లో ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అరెస్టు అయి కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. ఆ తర్వాత 2007లో అజ్ఞాతంలోకి వెళ్లిన సృజన అప్పటి నుంచి ఇంటికి రాలేదని తల్లిదండ్రులు కొత్తకొండ భీమయ్య, శాంత తెలిపారు. సృజన తల్లి శాంత మావోయిస్టు బంధుమిత్రుల కమిటీలో సభ్యురాలు. మావోయిస్టు పార్టీ ఉత్తర తెలంగాణ జిల్లా కమిటీలో సభ్యురాలైన సృజన అలియాస్ కుమెన్ అలియాస్ రాగో అలియాస్ నవత పేర్లతో పని చేసినట్లు తెలిసింది. ఆమెపై ప్రభుత్వం రూ.4 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. గురువారం తెల్లవారుజామున సృజన మృతదేహం పైడిపల్లికి వస్తుందని భావిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మేనమామ బాటలోనే.. జిల్లాలో నక్సల్స్ ఉద్యమానికి పురిటిగడ్డ అరుున పైడిపల్లికి చెందిన పీపుల్స్‌వార్ నేత, దివంగత జున్ను చిన్నాలుకు కొత్తకొండ సృజన స్వయూనా మేనకోడలు. పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పీపుల్స్‌వార్‌లో చేరిన చిన్నాలు 1979లో మృతిచెందారు. ఆయన చెల్లెలు శాంత రెండవ కూతరు సృజన విప్లవ భావాలు పుణికి పుచ్చుకుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపి నిషేధం ఎత్తివేయడంతో పౌరహక్కుల సంఘం నేతలతో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆమె ఏపీసీఎల్సీ నేతలతో 2006 డిసెంబర్లో కొత్తగూడెంలో అరెస్టు అరుు కొన్ని నెలలు జైలు జీవితం గడిపింది. విడుదలయ్యూక సుమారు ఆరు నెలల పాటు ఇంటి వద్దనే ఉంది. 2007లో అజ్ఞాతంలోకి వెళ్లి ఇక తిరిగి రాలేదు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన సృజన మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందింది. -
ఎదురుదెబ్బలు
మావోయిస్టులకు కలసి రాని కాలం తూర్పులో భారీ డంప్ స్వాధీనం దండకారణ్యం ఎన్కౌంటర్లో ముగ్గురు మృతిల కొయ్యూరు: మావోయిస్టులకు పీఎల్జీఏ వారోత్సవాల కాలం కలిసిరావడం లేదు. వరుసగా ఎదురుదెబ్బలు త గులుతున్నాయి. దళసభ్యుల వ్యూహాలను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారోత్సవాలకు సిద్ధమయ్యే ప్రాం తాల్లో పెద్ద ఎత్తున మొహరిస్తున్నారు. వారోత్సవాల రెం డో రోజునే విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉపయోగించే ఆయుధాల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే మావోయిస్టుల అగ్రనేతలు కూడా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)తోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈనేథ్యంలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారంనాటి ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు అనుకున్నవి చేయలేకపోతున్నారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారం ముందు నుంచి ప్రచారం చేశారు. దానిని తిప్పి కొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అంతటా భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు లక్ష ్యంగా మందుపాతర పేల్చాలన్న దళసభ్యుల వ్యూహాన్ని పోలీసులు వమ్ము చేశారు.తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డులంక సమీపంలో గొర్లోడు వద్ద భారీడంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విలువైన రాకెట్ లాంచర్లు, జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు అమోనియం, పొటాషియం నైట్రేట్లను గు ర్తించారు. అదే దారిలో కూంబింగ్‌కు వస్తారని ఊహించి మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. తాజగా శుక్రవారం ఏవోబీని అనుకుని ఉన్న దండకారణ్యంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు దళసభ్యులు మరణించినట్టుగా చెబుతున్నారు. మావోయిస్టులకు అడ్డా అయిన జీకేవీధి మండలం కుంకుంపూడిని రెండు రోజుల కిందట నర్సీపట్నం ఓఎస్డీ విశాల్‌గున్నీ సందర్శించారు. వారోత్సవాలప్పుడు ఓఎస్డీ స్థాయి అధికారి ఆ ప్రాంతానికి వెళ్లడం విశేషం. అంటే పరోక్షంగా మావోయిస్టులకు సవాల్ విసిరారు. జీకేవీధి, కొయ్యూరు,చింతపల్లి, జీ మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టులు స్తూపాలను ఆవిష్కరిస్తారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరిస్తున్నారు. కిందటి ఏడాది నుంచి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీరవరం ఘటన లో గిరిజనుల చేతిలో సహచరులను కోల్పోవలసి వచ్చిం ది. అనంతరం ఆ ప్రాంతంలో లొంగుబాట్లు పెరిగాయి. జూన్ 20న రంగబయలు పంచాయతీలో జరిగిన ఎన్కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. ఇలా మావోయిస్టులకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు నంబళ్ల కేశవరావు మన్యానికి వచ్చినప్పటి నుంచి పోలీసులు అప్పమత్తమయ్యారు. మావోయిస్టుల కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. -
'అది బూటకపు ఎన్కౌంటర్'
-
'అది బూటకపు ఎన్కౌంటర్'
సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో ఎలాంటి సంబంధాలు లేవని ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లో మరణించిన వివేక్ తండ్రి యోగానందాచార్యులు స్పష్టం చేశారు. అది బూటకపు ఎన్కౌంటర్, కావాలనే పోలీసులు వివేక్ని చంపారని తల్లిదండ్రులు ఆరోపించారు. తమ కుటుంబం ఆది నుంచి సమాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని చెప్పారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు. వివరాలు..బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి పోస్టుమార్టం నిర్వహించారు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25) ఉన్నారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు.ఏడు నెలల కాలంగా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఎన్కౌంటర్ మృతులకు భద్రాద్రిలో పోస్టుమార్టం
{పత్యేక హెలికాప్టర్ ద్వారా ఆసుపత్రికి తరలింపు పోలీసు బందోబస్తు నడుమ శవపరీక్షలు భద్రాచలం: ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన ముగ్గురు మావోయిస్టులకు పోలీసు బందోబస్తు మధ్య శనివారం భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. బీజాపూర్ జిల్లా ఎలిమేడు పోలీసుస్టేషన్ పరిధిలోని లంకపల్లి అటవీప్రాంతంలో శుక్రవారం సాయంత్రం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. శనివారం మృతదేహాలను ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చా రు. మృతిచెందిన వారిలో నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన వివేక్ అలియాస్ రఘు(25), ఏపీలోని చింతూరు మండలం లంకపల్లికి చెందిన కూరం జోగి అలియాస్ సోనీ(22), ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా చిన్నతర్రంకి చెందిన మడకం దేవి అలియాస్ కమల(23)గా పోలీసులు గుర్తిం చారు. వివేక్ హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీలో న్యాయ విద్యనభ్యసిస్తూ మధ్యలోనే మానేశాడు. పోలవ రం నిర్మాణానికి వ్యతిరేకంగా సాగిన తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఏడు నెలల కాలం గా మావోయిస్టు కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్న వివేక్ దళంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నా రు. కూరం జోగి ఏరియా కమిటీ మెం బర్గా కొనసాగుతుండ గా, మడకం దేవి మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌కు ప్రొటెక్షన్సెల్లో పనిచేస్తున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ‘వివేక్‌కు మావోలతో సంబంధాలు లేవు’ సూర్యాపేట: తన కుమారుడికి మావోయిస్టులతో సం బంధాలు లేవని వివేక్ తండ్రి యోగానందాచార్యు లు స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆది నుంచి స మాజ సేవకే పరితపించిందని పేర్కొన్నారు. వివేక్ సూర్యాపేటలో ఇంటర్ వరకు చదివాడని తెలిపారు. అనంతరం న్యాయశాస్త్రం చదివేందుకు యూనివర్సిటీకి వెళ్లాడని పేర్కొన్నారు. తన కుమారుడిని ప్రాణాలతో పట్టుకుని చట్టపరిధిలో శిక్షించకుండా, ఎన్కౌంటర్ చేయడం బాధ కల్గించిందన్నారు. -
శేషాచలంలోనే ‘ఎర్ర’దొంగల పాగా
భారీగా పెరుగుతున్న చొరబాట్లు పట్టపగలే టన్నుల కొద్దీ ఎర్రచందనం అక్రమ రవాణా ఎర్రచందనాన్ని వేలం వేసే ప్రభుత్వం ఇక్కడి సంపదను కాపాడడం లేదు సాక్షి,తిరుమల: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వం దలాది మంది ‘ఎర్ర’ దొంగలు శేషాచలంలో పాగా వేశారు. శేషాచల అటవీప్రాంతానికే తలమానికమైన ఎర్రచందనం పట్టపగలే అక్రమ మా ర్గాల్లో తరలుతున్నా దీని నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం, శేషాచలంలో ఎర్రదొంగల చొరబాట్లను ఆ పడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదు. తూర్పు, పడమరలో చొరబాట్లు శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధి లో తిరుమల శేషాచల అటవీ ప్రాం తం ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతోపాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఉంది. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. తిరుమలకు పశ్చిమదిశలోని ఛామల రేంజ్ తలకోన నుంచి తిరుపతి వరకు విస్తరించింది. తూర్పుదిశలోని మామండూరు నుంచి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మీదుగా కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ మార్గం వరకు ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక్కడ విలువైన ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నా యి. పశ్చిమ దిశలో తలకోన, భాకరాపేట, రంగంపేట మార్గాల నుంచి దుండగులు నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్నారు. ఇక తూర్పున మంగళం, కరకంబాడి, మామాం డూరు, రాజంపేట, సమీప అటవీ గ్రామాల నుంచి ఎర్రదొంగలు అడవిలోకి రాకపోకలు సాగిస్తున్నారు. గత 15 రోజులుగా పట్టపగలే అక్రమంగా రవాణా అవుతున్న వందల టన్నుల ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది. ఇందులో ఒకటి రెండు కేసుల్లో మినహా స్మగ్లర్లు కాని, కూ లీలు కాని పట్టుబడకపోవడం గమనార్హం. భక్తుల ముసుగులో.. తిరుమల నుంచి నాలుగు వైపులా అడవిలోకి వెళ్లే మార్గాలున్నాయి. ఇ ది ‘ఎర్ర’దొంగలకు కలసి వస్తోంది. ప్రధానంగా శ్రీవారిమెట్టు మార్గం నుంచి పశ్చిమదిశలో చాలా సులువు గా అడవిలోకి వెళ్లేందుకు వీలుంది. అలాగే, అలిపిరి కాలిబాట నుంచి కూడా భక్తుల ముసుగులో దుండగు లు అడవిలోకి చొరబడుతున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన తంబీ లే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రదొంగలు హత్య చేసిన తర్వాత ఫారె స్ట్ విభాగం, ఎస్టీఎఫ్ బలగాలతో నిత్యం కూంబింగ్ చేశారు. ఆరు నె లల కాలంలో వేర్వేరు ఘటనల్లో న లుగురు ఎర్రకూలీలు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అయినప్పటికీ ఎర్రకూలీల చొరబాట్లు మాత్రం ఆ గ టం లేదు. ఇటీవల కాలంలో ఎస్టీఎఫ్ బలగాలతోపాటు ఫారెస్ట్ అధికారుల కూంబింగ్, గాలింపు చర్యలు తగ్గిననట్టు కనిపిస్తోంది. అందువల్లే గడిచిన 15 రోజులుగా ఎర్రచంద నం అక్రమ రవాణా ఎక్కువగా సా గుతోంది. దీనిని బట్టి చూస్తే శేషాచలంలో వందల సంఖ్యలో ఎర్రదొంగలు తిష్టవేసినట్టు తెలుస్తోంది. సీఎంగారు .. శేషాచలంలో ఇంకా దొంగలున్నారు ? సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా క తిరుమల పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎర్రదొం గలు ఇంకా ఉన్నారా? ఉంటే ఏరిపారేస్తాం’ అన్నారు. అయినప్పటికీ ఇక్కడి శేషాచలంలో మా త్రం ఎలాంటి మార్పు కనిపిం చడం లేదు. శేషాచల అడవుల్లో ఎర్రదొంగలు వందల సంఖ్యలో తిష్టవేసినట్టు నిత్యం పట్టుబడుతున్న దుంగలే తెలుపుతున్నా యి. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వేలం వేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని రాష్ర్ట ప్రభుత్వం భా విస్తోంది. అయితే, తిరుమలేశుని క్షేత్రంలో అరుదైన వృక్షసంపద ను కాపాడేందుకు ప్రభుత్వ పె ద్దలు ఏ మాత్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వినిపిస్తు న్నాయి.