ఎదురుదెబ్బలు
మావోయిస్టులకు కలసి రాని కాలం
తూర్పులో భారీ డంప్ స్వాధీనం
దండకారణ్యం ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మృతిల
కొయ్యూరు: మావోయిస్టులకు పీఎల్‌జీఏ వారోత్సవాల కాలం కలిసిరావడం లేదు. వరుసగా ఎదురుదెబ్బలు త గులుతున్నాయి. దళసభ్యుల వ్యూహాలను ముందుగానే పసిగట్టిన పోలీసులు వారోత్సవాలకు సిద్ధమయ్యే ప్రాం తాల్లో పెద్ద ఎత్తున మొహరిస్తున్నారు. వారోత్సవాల రెం డో రోజునే విశాఖ- తూర్పుగోదావరి జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉపయోగించే ఆయుధాల భారీ డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలోనే మావోయిస్టుల అగ్రనేతలు కూడా ఉన్నారన్న పక్కా సమాచారంతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)తోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను బలగాలు జల్లెడపడుతున్నాయి. ఈనేథ్యంలో ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో శుక్రవారంనాటి ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టులు అనుకున్నవి చేయలేకపోతున్నారు. వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని వారం ముందు నుంచి ప్రచారం చేశారు. దానిని తిప్పి కొట్టేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అంతటా భారీగా బలగాలను మోహరించారు. పోలీసులు లక్ష ్యంగా మందుపాతర పేల్చాలన్న దళసభ్యుల వ్యూహాన్ని పోలీసులు వమ్ము చేశారు.తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మండలం బొడ్డులంక సమీపంలో గొర్లోడు వద్ద భారీడంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో విలువైన రాకెట్ లాంచర్లు, జిలెటిన్ స్టిక్స్ ఉన్నాయి. పేలుడు పదార్థాలు అమోనియం, పొటాషియం నైట్రేట్‌లను గు ర్తించారు. అదే దారిలో కూంబింగ్‌కు వస్తారని ఊహించి మావోయిస్టులు అమర్చిన మందుపాతరలను పోలీసులు గుర్తించడంతో పెద్ద ముప్పు తప్పింది. తాజగా శుక్రవారం ఏవోబీని అనుకుని ఉన్న దండకారణ్యంలో కూడా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ముగ్గురు దళసభ్యులు మరణించినట్టుగా చెబుతున్నారు. మావోయిస్టులకు అడ్డా అయిన జీకేవీధి మండలం కుంకుంపూడిని రెండు రోజుల కిందట నర్సీపట్నం ఓఎస్‌డీ విశాల్‌గున్నీ సందర్శించారు. వారోత్సవాలప్పుడు ఓఎస్‌డీ స్థాయి అధికారి ఆ ప్రాంతానికి వెళ్లడం విశేషం. అంటే పరోక్షంగా మావోయిస్టులకు సవాల్ విసిరారు. జీకేవీధి, కొయ్యూరు,చింతపల్లి, జీ మాడుగుల, ముంచంగిపుట్టు మండలాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కూంబింగ్ చేపడుతున్నారు. మావోయిస్టులు స్తూపాలను ఆవిష్కరిస్తారనే అనుమానం ఉన్న ప్రాంతాల్లో పోలీసులు మొహరిస్తున్నారు.
కిందటి ఏడాది నుంచి మావోయిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. వీరవరం ఘటన లో గిరిజనుల చేతిలో సహచరులను కోల్పోవలసి వచ్చిం ది. అనంతరం ఆ ప్రాంతంలో లొంగుబాట్లు పెరిగాయి. జూన్ 20న రంగబయలు పంచాయతీలో జరిగిన ఎన్‌కౌంటర్లో సూర్యం అనే మావోయిస్టు మరణించాడు. ఇలా మావోయిస్టులకు వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. కేంద్ర కమిటీ సభ్యులు నంబళ్ల కేశవరావు మన్యానికి వచ్చినప్పటి నుంచి పోలీసులు అప్పమత్తమయ్యారు. మావోయిస్టుల కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.