
శేషాచలంలోనే ‘ఎర్ర’దొంగల పాగా
- భారీగా పెరుగుతున్న చొరబాట్లు
- పట్టపగలే టన్నుల కొద్దీ ఎర్రచందనం అక్రమ రవాణా
- ఎర్రచందనాన్ని వేలం వేసే ప్రభుత్వం ఇక్కడి సంపదను కాపాడడం లేదు
సాక్షి,తిరుమల: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వం దలాది మంది ‘ఎర్ర’ దొంగలు శేషాచలంలో పాగా వేశారు. శేషాచల అటవీప్రాంతానికే తలమానికమైన ఎర్రచందనం పట్టపగలే అక్రమ మా ర్గాల్లో తరలుతున్నా దీని నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం, శేషాచలంలో ఎర్రదొంగల చొరబాట్లను ఆ పడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదు.
తూర్పు, పడమరలో చొరబాట్లు
శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధి లో తిరుమల శేషాచల అటవీ ప్రాం తం ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతోపాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఉంది. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. తిరుమలకు పశ్చిమదిశలోని ఛామల రేంజ్ తలకోన నుంచి తిరుపతి వరకు విస్తరించింది. తూర్పుదిశలోని మామండూరు నుంచి వైఎస్‌ఆర్ జిల్లా రాజంపేట మీదుగా కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ మార్గం వరకు ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక్కడ విలువైన ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నా యి.
పశ్చిమ దిశలో తలకోన, భాకరాపేట, రంగంపేట మార్గాల నుంచి దుండగులు నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్నారు. ఇక తూర్పున మంగళం, కరకంబాడి, మామాం డూరు, రాజంపేట, సమీప అటవీ గ్రామాల నుంచి ఎర్రదొంగలు అడవిలోకి రాకపోకలు సాగిస్తున్నారు. గత 15 రోజులుగా పట్టపగలే అక్రమంగా రవాణా అవుతున్న వందల టన్నుల ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది. ఇందులో ఒకటి రెండు కేసుల్లో మినహా స్మగ్లర్లు కాని, కూ లీలు కాని పట్టుబడకపోవడం గమనార్హం.
భక్తుల ముసుగులో..
తిరుమల నుంచి నాలుగు వైపులా అడవిలోకి వెళ్లే మార్గాలున్నాయి. ఇ ది ‘ఎర్ర’దొంగలకు కలసి వస్తోంది. ప్రధానంగా శ్రీవారిమెట్టు మార్గం నుంచి పశ్చిమదిశలో చాలా సులువు గా అడవిలోకి వెళ్లేందుకు వీలుంది. అలాగే, అలిపిరి కాలిబాట నుంచి కూడా భక్తుల ముసుగులో దుండగు లు అడవిలోకి చొరబడుతున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన తంబీ లే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రదొంగలు హత్య చేసిన తర్వాత ఫారె స్ట్ విభాగం, ఎస్‌టీఎఫ్ బలగాలతో నిత్యం కూంబింగ్ చేశారు.
ఆరు నె లల కాలంలో వేర్వేరు ఘటనల్లో న లుగురు ఎర్రకూలీలు ఎన్‌కౌంటర్ లో మృతి చెందారు. అయినప్పటికీ ఎర్రకూలీల చొరబాట్లు మాత్రం ఆ గ టం లేదు. ఇటీవల కాలంలో ఎస్‌టీఎఫ్ బలగాలతోపాటు ఫారెస్ట్ అధికారుల కూంబింగ్, గాలింపు చర్యలు తగ్గిననట్టు కనిపిస్తోంది. అందువల్లే గడిచిన 15 రోజులుగా ఎర్రచంద నం అక్రమ రవాణా ఎక్కువగా సా గుతోంది. దీనిని బట్టి చూస్తే శేషాచలంలో వందల సంఖ్యలో ఎర్రదొంగలు తిష్టవేసినట్టు తెలుస్తోంది.
సీఎంగారు .. శేషాచలంలో ఇంకా దొంగలున్నారు ?
సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా క తిరుమల పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎర్రదొం గలు ఇంకా ఉన్నారా? ఉంటే ఏరిపారేస్తాం’ అన్నారు. అయినప్పటికీ ఇక్కడి శేషాచలంలో మా త్రం ఎలాంటి మార్పు కనిపిం చడం లేదు. శేషాచల అడవుల్లో ఎర్రదొంగలు వందల సంఖ్యలో తిష్టవేసినట్టు నిత్యం పట్టుబడుతున్న దుంగలే తెలుపుతున్నా యి. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వేలం వేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని రాష్ర్ట ప్రభుత్వం భా విస్తోంది. అయితే, తిరుమలేశుని క్షేత్రంలో అరుదైన వృక్షసంపద ను కాపాడేందుకు ప్రభుత్వ పె ద్దలు ఏ మాత్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వినిపిస్తు న్నాయి.