The government
-
ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్
-
ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్
రేవంత్‌పై టీఆర్ఎస్ నేతల ఫైర్ సాక్షి, హైదరాబాద్: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ నిప్పులాంటి మనిషి, ముట్టుకుంటే కాలిపోతారని టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, ఇప్పుడు ఆర్థికమంత్రిగా సమర్థంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హాస్టల్లో చదువుకున్న ఈటల కోరిక మేరకే తెలంగాణలోని హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఆ విజిలెన్స్ నివేదికను పట్టుకుని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని రేవంత్ కలలు కంటున్నారని, కనీసం పోటీ చేసే అవకాశం కూడా వారికి ఉండదని వినోద్‌కుమార్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీనేత రేవంత్‌లు ఉన్మాదులుగా మారుతున్నారని కర్నె ప్రభాకర్ విమర్శించారు. అవినీతికి పాల్పడిన వాళ్లే మంత్రులపై ఆరోపణలు చేయడం.. ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉందన్నారు. నోటికొచ్చింది వాగడం తప్ప రేవంత్ దగ్గర విషయమేం లేదని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాలు విడిపోయాక కూడా టీడీపీ నేతల కుట్రలు ఆగట్లేదని, తెలంగాణను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు. -
‘ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి’
కదిరి టౌన్ : కార్మికుల పొట్టలు కొడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వేమయ్య యాదవ్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరసింహులు అన్నారు. కదిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులతో మంగళవారం ఆందోళనకు దిగారు. ముందుగా ఎర్రజెండాలు చేతబూని స్థానిక సీపీఐ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీగా బయలుదేరారు. అంబేడ్కర్ కూడలి, ఇందిరాగాంధీ కూడలి మీదుగా ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంది. కార్యాలయాన్ని ముట్టిడించి అక్కడే బైఠాయించారు. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి నూకలు చెల్లాయని వక్తలు పేర్కొన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కార్మికులను ఆదుకోవాల్సిన సర్కారు అధికారంలోకి రాగానే వారి గురించే పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. 279 జీఓను రద్దు చేయాలని, 200 మంది దాకా ఉన్న పారిశు«ధ్ధ్యం, మున్సిపల్ కార్మికులకు రావాల్సిన పీఎఫ్ రూ.కోటి దాకా బకాయి పేరుకుపోయిందన్నారు. బకాయినంతా పీఎఫ్ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ నాయకులు ఇసాక్, ముస్తాక్ అలీఖాన్, రాజేంద్ర పాల్గొన్నారు. -
రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి
ప్రొద్దుటూరు క్రైం: రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ, జమ్మలమడుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లాలోని బార్ అసోసియేషన్ అధ్యక్షుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తున్న దృష్ట్యా, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం ఉద్యమం చేసే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలవాల్సిన అవసరం ఉందన్నారు. వారి అభిప్రాయం తెలుసుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళితే బాగుంటుందని చెప్పారు. ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వి.భాస్కర్‌రావు మాట్లాడుతూ త్వరలో ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలన్నారు. అమరావతిలో నిర్మాణాలు మొదలు పెడితే తర్వాత ఎన్ని ఉద్యమాలు చేసినా ఉపయోగం ఉండదని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి పేర్కొన్నారు. పులివెందుల న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కరుణాకర్, ఇవి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ దసరా అయిపోయిన వెంటనే సీఎంను కలిసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ఉద్యమంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని బార్ అసోసియేషన్ నాయకులు ముక్తకంఠంతో నినదించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ముడిమెల కొండారెడ్డి, గొర్రె శ్రీనివాసులు, జిలాని బాషా, దాదాపీర్, మల్లేల లక్ష్మీప్రసన్న, ఓబులేసు, కమలాపురం, మైదుకూరు బార్ అసోసియేషన్ల అధ్యక్షుడు నారాయణరెడ్డి, ఇస్మాయిల్, సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతులను పట్టించుకోని ప్రభుత్వం
ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి న్యూశాయంపేట : రాష్ట్రంలో వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటి వేసిన పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్రవ్యాప్తంగా 230 మం డలాల్లో కరువుఛాయలు నెలకొన్నాయని అభిల భారత కిసాన్‌సభ జాతీయ ఉపాధ్యక్షుడు సా రంపెల్లి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆది వారం తెలంగాణ రైతు సంఘం జిల్లా స్థాయి సమావేశం జిల్లా ఉపాధ్యక్షుడు శెట్టి వెంకన్న అధ్య„ý తన రాంనగర్లో జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసమే మిషన్ కాకతీయ,మిషన్ భగీర ధ సాగునీటి ప్రాజెక్టులంటూ వేలాది కోట్లు ఖర్చు చేస్తూ ఇంత వరకు ఒక్క ఎకరానికి సాగునీటి సౌకర్యం కల్పించలేదని విమర్శించా రు. కాంట్రాక్టర్లు అవినీతి పరులకు వత్తాసు పలుకుతూ పబ్బం గడుపుతున్నారన్నారు. కరువుతో అల్లాడుతున్న గత సంవత్సరం ఒక్కపైసా కూడా ఖర్చుచేసి ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకోలేదన్నారు. సమావేశంలో నాయకులు బి. రాంచంద్రారెడ్డి, పి.రమేష్, కనాకారెడ్డి, వెంకట్‌రెడ్డి, రాజమౌళి, రాజన్న పాల్గొన్నారు. -
మానవతావాదానికి నిదర్శనం లవణం
జోగిని దురాచారాన్ని నిర్మూలించారు వర్ని : సమాజంలో నెలకొన్న మూఢ నమ్మకాలు, జోగిని దురాచారాన్ని రూపుమాపడానికి జీవితాన్ని త్యాగం చేసిన లవణం, హేమలతలు మానవతావాదులని, వారు చేపట్టిన సేవా కార్యక్రమాలు అభినందనీయమని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. సంఘ సంస్కర్త లవణం ప్రథమ వర్ధంతిని ఆదివారం అంబం శివారులోని సంస్కార్ సమావేశ మందిరంలో నిర్వహించారు. కార్యక్రమంలో సుమారు రూ. 6 కోట్ల విలువ చేసే సంస్కార్ ప్లాన్ స్థిరాస్తులను మంత్రి సమక్షంలో బోధన్ ఆర్డీవో సుధాకర్‌రెడ్డికి సంస్కార్ ప్రతినిధులు సుందరం, సుబ్రహ్మణ్యం అందచేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన లవణం– హేమలత స్మారక సభలో మంత్రి పోచారం మాట్లాడారు. నాడు సమాజంలో సవాలుగా మారిన జోగిని దురాచారాన్ని లవణం, హేమలత దంపతులు రూపుమాపారన్నారు. ప్రభుత్వ సహకారం ఆశించకుండానే ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేపట్టారంటూ కొనియాడారు. ప్రజల్లో సామాజిక స్పృహ కలిగించడానికి, సంస్కరించడానికి, పేదలకు అండగా నిలువడానికి కృషి చేశారన్నారు. గ్రామాలను దత్తత తీసుకుని విద్య ప్రాధాన్యతను తెలియ చేసి, పాఠశాలలు ఏర్పాటు చేశారని, ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో అడిషనల్ టీచర్లను ఇచ్చారని, వైద్య సేవలు అందించారని, సాగు నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలకు సహకారాన్ని అందించారని గుర్తు చేశారు. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి ఈ ప్రాంత ప్రజల అభ్యున్నతికి సంస్కార్ ప్లాన్ ద్వారా కృషి చేశారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంస్కార్ ప్లాన్ స్వచ్ఛంద సంస్థ అందించిన కోట్ల రూపాయల విలువ చేసే ప్రాంతానికి హేమలత, లవణం నామకరణం చేస్తామని, వారి విగ్రహాలను ఏర్పాటు చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో పేదల సంక్షేమం కోసం కార్యక్రమాలు నిర్వహిస్తామని, పేద పిల్లల కోసం విద్యా సంస్థలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. లవణం చేపట్టిన సంస్కార కార్యక్రమాల గురించి సంస్కార్ ప్లాన్ ప్రతినిధులు సుందర్, సుబ్రహ్మణ్యం వివరించారు. స్టువర్టుపురం దొంగల్లో మార్పు తెచ్చారని, జోగిని వ్యవస్థ నిర్మూలనకు, మూఢనమ్మకాల నివారణకు కృషి చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సంస్కార్ ప్లాన్ ప్రతినిధులు సుందర్, సుబ్రహ్మణ్యంలను పోచారం శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. సంస్థ ఆధ్వర్యంలో జోగినులకు తొలి దశ సేవా కార్యక్రమాల్లో సహకారాన్ని అందించిన రామ్మోహన్‌రావ్, జయని నెహ్రూ, వీవీ ప్రసాద్ రావ్, పట్టాభిరామ్, జేవీ సుబ్బారావ్, మార్ని రామకృష్ణారావ్, వర లక్ష్మి, సీతారత్నంలను సంస్కార్ప్లాన్ ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చింగ్లీ బజ్యానాయక్, ఏఎంసీ చైర్మన్ నారోజీ గంగారాం, వైస్ చైర్మన్ మేక వీర్రాజు, ఎస్‌ఎన్‌పురం సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, సంస్కార్ కార్యకర్తలు గణపతి, నవీన్, ఆనంద్, మురళి, రమేశ్, మక్కయ్య, దత్తు తదితరులు పాల్గొన్నారు. -
అలీసాగర్, గుత్ప వైఎస్ చలువే
మల్లన్నసాగర్ నిర్మాణం ఆచరణలో అసాధ్యం ప్రభుత్వం భేషజాలకు పోవద్దు భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి బోధన్ : వైఎస్ హయాంలోనే అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పనులు చేపట్టడం జరిగిందని, నా ఆలోచనతోనే అలీసాగర్ బ్యాక్‌వాటర్ పథకాన్ని రూపకల్పన చేశానని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బోధన్ ప్రజలకు తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా నివారించాలని గోదావరి జలాలను బెల్లాల్ చెరువుకు మళ్లించే పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. శనివారం మండలంలోని అమ్దాపూర్ శివారులో నిజాంసాగర్ ప్రాజెక్టు డి–40, చింతకుంట వద్ద నిజాంసాగర్ ప్రాజెక్టు మెయిన్ కాలువ వద్ద డి–40 కాలువ నీటి మళ్లింపు పాయింట్లను మాజీ మంత్రి, కాంగ్రెస్ నేతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితి వల్ల గోదావరి నదిలో నీళ్ల లేక ఈ పథకం ద్వారా నీటి సరఫరా జరగలేదన్నారు. ప్రసుత్తం వర్షాలు కురిసి గోదావరి నదిలో నీళ్లు పుష్కలంగా ప్రవహించడంతో ఎత్తిపోసిన నీటిని అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా బెల్లాల్ చెరువుకు తొలిసారిగా నీటి సరఫరా ఐదు రోజులుగా కొనసాగుతోందన్నారు. అలీసాగర్బ్యాక్వాటర్ ద్వారా బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలీసాగర్ రిజర్వాయర్ ద్వారా నిజామాబాద్ నగర ప్రజల తాగునీటి అవసరాలకు సరఫరా అవుతున్నాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల పథకాలు చేపట్టడం జరిగిందని, అలీసాగర్ కింద 53 వేల ఎకరాలు, గుత్ప పథకం కింద 38 వేల ఎకరాలకు సాగునీరందుతోందన్నారు. వైఎస్ఆర్ హయాంలోనే నిజాంసాగర్ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు మంజూరు కాగా పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఒంటెద్దు పోకడలకు పోవద్దు బోధన్ : మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ అంశంలో ప్రభుత్వం భేషజాలకు, ఒంటెద్దు పోకడలకు వెళ్లొదని మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సూచించారు. ప్రాజెక్టు పనుల్లో రాజకీయాలొద్దన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు పేరుతో జిల్లా రైతాంగాన్ని మోసం చేయాలని ప్రయత్నిస్తే ప్రజలు తిరగబడతారని హెచ్చరించారు. గోదావరి జలాల వినియోగంలో నీటి నిపుణులు, మేధావుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టును నింపుతామనే ప్రభుత్వ ఆలోచన సరైంది కాదన్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 112 కిలో మీటర్ల దూరంలో ఎత్తు ప్రాంతంలో ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా కడెం ప్రాజెక్టుకు సుమారు 40 టీఎంసీ నీళ్లు వెళ్తున్నాయని, కడెం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని మళ్లిస్తే అతి తక్కువ ఖర్చుతో సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. -
కాంట్రాక్టు వైద్య ఉద్యోగుల ఆవేదన
ప్రభుత్వం నిధులు విడుదల చేసినా జీతాలు ఇవ్వని అధికారులు, మోర్తాడ్: దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేడు అన్న చందంగా తయారైంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల పరిస్థితి. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ఆంశం పరిశీలనలో ఉండగా 2016–17 ఆర్థిక సంవత్సరానికి గాను ఉద్యోగుల కాంట్రాక్టును పొడగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. వేతనాలకు సంబంధించిన కొంత గ్రాంటును విడుదల చేసింది. కాంట్రాక్టు ఉద్యోగులకు మాత్రం వేతనాలు నెలల తరబడి అందకపోవడంతో అవస్థలపాలవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల చెల్లింపులకు సంబంధించి ఉన్నతాధికారి సుముఖంగా ఉన్నా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల వైఫల్యం కారణంగానే వేతనాలు అందడం లేదని తెలుస్తోంది. జిల్లాలోని వివిధ సబ్ సెంటర్ల పరిధిలో 77 మంది యంపీహెచ్‌ఏ(మేల్వర్కర్), తొమ్మిది మంది ఫార్మసిస్టులు, ముగ్గురు ల్యాబ్ టెక్నీషియన్లు, 11 మంది ఓపీ ఏఎన్ఎంలు కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్నారు. వీరితో పాటు 369 మంది రెండో ఏఎన్ఎంలు, 58 మంది యూరోపియన్ పథకం కింద ఎంపికైన ఏఎన్ఎంలు పని చేస్తున్నారు. వీరి వేతనాల కోసం ప్రభుత్వం జిల్లాకు రూ.1.16 కోట్ల గ్రాంటును విడుదల చేసింది. ప్రతి నెలా వేతనాల చెల్లింపుల కోసం ఉద్యోగులతో బ్యాంకు ఖాతాలను తెరిపించింది. గడచిన మార్చితో కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు పూర్తి కావడంతో మళ్లీ ఏప్రిల్ నుంచి కాంట్రాక్టును పొడగిస్తు ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఉద్యోగులు తమ కాంట్రాక్టు ఒప్పందం బాండ్‌ను అందచేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల కాల పరిమితి 2017 మార్చి 31వరకు పొడిగించారు. ప్రతినెలా వేతనాలను చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలు అవుతున్నా ఉద్యోగులకు మాత్రం వేతనాలు అందడం లేదు.దీంతో ఉద్యోగులు ఇంటి అద్దె, పిల్లల చదువు, కుటుంబ పోషణ తదితర భారాలను మోస్తూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. దయనీయ స్థితిలో యూరోపియన్ ఏఎన్ఎంలు జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో యూరోపియన్ పథకం కింద పని చేస్తున్న ఏఎన్ఎంల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. వీరికి 11 నెలల నుంచి వేతనం అందడం లేదు. వారు ఆందోళన చేస్తామని హెచ్చరించడంతో ఇటీవల మూడు నెలల వేతనం అధికారులు మంజూరు చేశారు. జిల్లాలో యూరోపియన్ పథకం కింద పని చేస్తున్న ఏఎన్ఎంలు 58 మంది ఉన్నారు. కాంట్రాక్టు బాండ్ అందరివి అందకపోవడంతోనే ఆలస్యం డాక్టర్ వెంకట్, జిల్లా వైద్య ఆర్యోగ శాఖ అధికారి కాంట్రాక్టు ఉద్యోగుల కాంట్రాక్టు బాండ్ అందకపోవడం వల్లనే వేతనాల చెల్లింపులో ఆలస్యం అవుతుంది. జిల్లాలోని సాలూర పీహెచ్సీ నుంచి ఆరుగురు ఉద్యోగుల కాంట్రాక్టు బాండ్ అందాల్సి ఉంది. వారి నుంచి స్పందన లేదు. అందువల్లనే ఇతర ఉద్యోగులకు ఇబ్బంది ఏర్పడింది. సమ్మె నోటీసు ఇస్తున్నాం అశోక్, పారామెడికల్ కాంట్రాక్టు ఎంప్లాయీస్ అసోషియేషన్ అధ్యక్షుడు కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం వేతనాల గ్రాంటను విడుదల చేసినా జిల్లా అధికారులు వేతనాలు చెల్లించక పోవడం వల్ల ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. ఎక్కడో లోపం జరిగిందని అందరు ఉద్యోగులకు వేతనాలు చెల్లిం^è కుండా నిలపివేయడం సరైంది కాదు. సమ్మె నోటీసును అందచేస్తున్నాం. -
మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యతాలోపం
► అధికారుల నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా పనులు ► ఎంపీపీ ఆకుల శోభారాణి ఖానాపూర్ : అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం కారణంగా మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపించిందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఎంపీపీ ఆకుల శోభారాణి ఆరోపించారు. శనివారం ఆమె మండల కేంద్రంలోని బొడ్డొనికుంట, కప్పలకుంటతోపాటు మండలంలోని గంగాయిపేట ఆరె చెరువు, సుర్జాపూర్లోని మేడంపల్లి చెరువు, ఎక్బాల్‌పూర్ చెరువు, ఈర్లకుంట, ఎర్వచింతల్ల్లోని మరో రెండు చెరువుల పనులను పరిశీలించారు. నిబంధనలు పాటించడం లేదని, చెరువుల్లో గుంతలు ఎక్కడివక్కడే ఉన్నాయని, చెరువు కట్టపై నల్లమట్టి పోసి పై నుంచి ఎర్రమట్టి పోసి పనులు పూర్తయ్యూరుు అనిపిస్తున్నారని విమర్శించారు. రోడ్డు రోలర్‌తో తొక్కించలేదని, పలు చోట్ల తూములకు పూతలు పూసి కొత్త వాటిగా చూపిస్తున్నారని తెలిపారు. సిబ్బంది కొరత పేరుతో పూడిక తీయకున్నా కాంట్రాక్టర్లు చెప్పిందే అధికారులు రికార్డు చేస్తూ బిల్లులు చెల్లిస్తున్నారని అన్నారు. కప్పలకుంట చెరువులో ఒక జేసీబీ సాయంతో ఐదు ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలించి విక్రరుుంచారని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేశారు. మండలంలో మొదటి విడతలో 7 చెరువులు, రెండో విడతలో 12 చెరువుల పనులను సుమారు రూ.పది కోట్ల వరకు వెచ్చించి చేస్తున్నా నాణ్యత లేక కోట్లు దుర్వినియోగం అవుతున్నాయని తెలిపారు. స్టేట్ మానిటరింగ్ కమిటీతోపాటు విజిలెన్స్ అదికారులు, సీఎం, మంత్రులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల శ్రీనివాస్, గుగ్లావత్ లక్ష్మణ్, మగ్గిడి సురేశ్, దాసరి భీమన్న, రాజేశ్వర్, లక్ష్మణ్, రత్నం, వెంకట్రాములు, రాజన్న, అశోక్, జీవన్ పాల్గొన్నారు. -
ఆర్ అండ్ బీకి కొత్త ఇంజనీర్లు
♦ 82 మందికి నియామక పత్రాలు అందజేసిన మంత్రి తుమ్మల ♦ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా కేటాయింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా రోడ్లు భవనాల శాఖకు ప్రభుత్వం కొత్త ఇంజనీర్లను కేటాయించింది. వీరిలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) స్థాయిలో 82 మంది ఉన్నారు. శనివారం ఆర్అండ్ బీ శాఖ ప్రధాన కార్యాలయంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీరికి నియామక ఉత్తర్వులు అందజేశారు. 2012 తర్వాత ఈ శాఖకు కొత్త ఇంజనీర్లు రావటం ఇదే తొలిసారి. అప్పటి నుంచి చాలా పోస్టులు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేయాల్సిందిగా ఆ శాఖ, సీఎం దృష్టికి తీసుకెళ్లింది. తెలంగాణ పబ్లిక్ సర్వీ స్ కమిషన్ ద్వారా పరీక్షలు నిర్వహించి 82 మంది అభ్యర్థులను ఏఈఈ పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, వీరందరిని వివిధ జిల్లాలకు కేటాయించారు. ఇక 42 అసిస్టెంట్ ఇంజనీర్ల పోస్టుల భర్తీకి మరో పరీక్ష నిర్వహించారు. వాటి వివరాలు ఇంకా అందాల్సి ఉంది. శనివారం కేటాయించిన పోస్టుల్లో ఎస్సీలు 12 మంది, ఎస్టీలు నలుగురు, బీసీలు 33 మంది, వికలాంగుల కోటాలో ఒకరు, ఓసీలు 27 మంది ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, నియామకాలు పూర్తి పారదర్శకంగా జరిగాయని ఆ శాఖ పరిపాలన వి భాగం ఈఎన్సీ భిక్షపతి పేర్కొన్నారు. కొత్త గా నియమితులైన ఇంజనీర్లకు వచ్చేనెల 4 నుంచి 3 నెలల పాటు న్యాక్‌లో శిక్షణ ఇస్తామన్నారు. -
స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఫలించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి కృషి నెల్లూరు(అగ్రికల్చర్): నెల్లూరులోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో ఖాళీగా ఉన్న 362 స్టాఫ్ నర్స్‌ల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఆసుపత్రిలోని ఖాళీలు భర్తీ చేయాలని జిల్లాలో నిర్వహించిన ఆందోళనకు ప్రభుత్వం స్పందించిందన్నారు. ఈ మేరకు 362 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి జీఓ ఎంఎస్ విడుదల చేసినట్లు తెలిపారు. పోస్టుల భర్తీలో ఎమ్మెల్యే చేసిన కృషిని జిల్లా ప్రజలు కొనియాడారు. సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించాలి నెల్లూరు నగరం నుంచే కాకుండా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది పేదలు వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నందున, హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ వసతులు కల్పించి, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేశారు. -
కాపు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ కొరిటెపాడు (గుంటూరు) : కాపుల అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమశెట్టి రామానుజయ స్పష్టం చేశారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. 22 ఏళ్ల నుంచి కాపుల గురించి ఏనాడు మాట్లాడని ముద్రగడ పద్మనాభం రెండు నెలలుగా కాపులపై కపట కన్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడు పనుల కోసం కాపులు నా వద్దకు రావద్దన్న ముద్రగడ నేడు కాపులపై ప్రేమ ఎందుకు చూపుతున్నారో అర్థం కావటంలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్యకు సీఎంను విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. సమావేశంలో టీడీపీ కాపు నాయకులు బొబ్బిలి రామారావు, యర్రగోపు నాగేశ్వరరావు, పోతురాజు ఉమాదేవి, అడపా బాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ జలసిరికి నిబంధనల కొర్రీ
దరఖాస్తునకు రోజుకో నిబంధన అమలు జాబ్‌కార్డు, సన్నకారు సర్టిఫికెట్ల కోసం నిరీక్షణ ఉపాధి, మీసేవ కార్యాలయాల వద్ద పడిగాపులు ఈ నెల 25తో ముగియనున్న దరఖాస్తు గడువు తెరుచుకోని జలసిరి ఆన్లైన్ ఆందోళనలో రైతులు రాపూరు/సైదాపురం: బంజరు భూములకు సాగునీటిని అందించి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో విడత ఎన్టీఆర్ జలసిరి పథకం లక్ష్యం నెరవేరేలా లేదు. జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం రోజుకో నిబంధన అమలు చేస్తుండడంతో రైతులు తలలుపట్టుకుంటున్నారు. దర ఖాస్తునకు సన్న,చిన్నకారు రైతుగా గుర్తింపు సర్టిఫికెట్, ఉపాధి జాబ్‌కార్డు తప్పనిసరి చేయడంతో వాటి కోసం రైతులు ఉపాధి, మీసేవ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. అన్ని సర్టిఫికెట్లు తీసుకున్నా దరఖాస్తు చేసుకునేందుకు జలసిరి సైట్ తెరుచుకోకపోతుండంతో రైతులు నిరాశ చెందుతున్నారు. పథకం లక్ష్యం ఇదీ.. ఎస్సీ,ఎస్టీలతో పాటు సన్న, చిన్నకారు రైతులకు చెందిన బంజరు భూములకు సాగునీటిని అందించే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు ప్రభుత్వం బోర్లతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పిస్తుంది. ఇందుకు సంబంధించి యూనిట్‌కు రూ.1.27,000 కేటాయించింది. 300 మీటర్ల లోతు వరకు బోర్ వేసుకునేందుకు అడుగుకు రూ.80 వంతున రూ.24వేలు, కేసింగ్‌పైపు 20 మీటర్లు అడుగుకు రూ.400 వంతున రూ.8వేలు, పిట్టింగ్కు రూ.5వేలు, మోటారుకు రూ.40వేలు, విద్యుత్ కనెక్షన్‌కు రూ.50 వేలు వంతున విడుదల చేసింది. ఈ పథకం కింద ఎంపికైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు తమ వాటాగా 5శాతం అంటే రూ.4,500, ఇతర రైతులు 20 శాతం అంటే రూ.18వేలు చెల్లించాల్సి ఉంటుంది. 5 ఎకరాలలోపు భూములున్న ఎస్సీ, ఎస్టీ, సన్న, చిన్నకారు రైతులు మాత్రమే పథకానికి అర్హులు. దరఖాస్తు చేసుకునేందుకు పాసుపుస్తకం, 1బీ, ఆదార్‌కార్డు, జాబ్‌కార్డు, సన్న, చిన్నకారు సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందుపర్చాలి. అన్నదాతలకు దరఖాస్తు కష్టాలు ప్రభుత్వం విధించిన నిబంధనలతో ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు.ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ముందుగా సన్న, చిన్నకారు రైతు సర్టిఫికెట్ కోసం రైతులు మీసేవలో నమోదు చేసుకోవాలి. ఇందుకోసం పాసుపుస్తకం జెరాక్స్, 1బీ, రేషన్‌కార్డు, ఆదార్‌కార్డు, దరఖాస్తు ఫారంతో పాటు 45 రూపాయలు ఫీజుగా చెల్లించాలి. అక్కడి నుంచి సంబంధిత వీఆర్వోకు దరఖాస్తు వెళ్తుంది. వీఆర్వో చేతులు తడిపితే తప్ప తహశీల్దార్ నుంచి సన్న,చిన్నకారు సర్టిఫికెట్ అందడం లేదని రైతులు తెలిపారు. లేకపోతే పనులు మానుకుని రెండు, మూడు రోజుల పాటు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందేనని చెబుతున్నారు. అలాగే ఉపాధి జాబ్ కార్డు కోసం ఉపాధి కార్యాలయం చుట్టూ ప్రదక్షణలు చేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెరుచుకోని జలసిరి సైట్ ప్రభుత్వం తొలుత ఎన్టీఆర్ జలసిరి దరఖాస్తుల సేకరణ బాధ్యతలను ఎంపీడీఓ, ఏపీఓలకు అప్పగించింది. ఈ మేరకు రైతులు ఎంపీడీఓ, ఏపీఓలకు దరఖాస్తులు అందజేశారు. అనంతరం ప్రభుత్వం మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు రైతులను పిలిచి ఆ విధంగా చేసుకోవాలని సూచించారు. ఈ నెల 10తోనే దరఖాస్తు గడువు ముగిసినప్పటికీ మళ్లీ 25వతేదీ వరకు గడువు పెంచారు. మీసేవలో దరఖాస్తు చేసుకునేందుకు సైట్ ఓపెన్ కాకపోతుండడంతో రైతులు మీసేవ కేంద్రాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. మీసేవ కేంద్రం చుట్టూ తిరుగుతున్నాం ఎన్టీఆర్ జలసిరి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు మీసేవ కేంద్రం చుట్టూ రెండు రోజులుగా తిరుగుతున్నా. జలసిరి సైట్ ఓపెన్ కావడం లేదని మీసేవ సిబ్బంది చెబుతున్నారు. మరో మూడు రోజుల్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలే తెలియడం లేదు. ఉన్నతాధికారులు స్పందించి సైట్ ఓపెన్ అయ్యేలా చూడాలి. -గోపిదేశి రామయ్య (తురిమెర్ల, సైదాపురం మండలం) సర్టిఫికెట్ల కోసం తిరగ డానికే సరిపోతోంది ఎన్టీఆర్ జలసిరికి దరఖాస్తు చేసుకునేందుకు సన్న,చిన్నకారు సర్టిఫికెట్ కావాలన్నారు. మూడు రోజులుగా సర్టిఫికెట్ కోసం రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. జాబ్‌కార్డు కోసం ఇంకెన్ని రోజులు తిరగాల్సి వస్తుందో. ప్రభుత్వం స్పందించి దరఖాస్తు గడువును పెంచాలి. -నాగా ప్రకాష్‌రెడ్డి(రాపూరు) -
ఇసుక తోడేళ్లు
అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తున్న ఇసుకసంఘాల ముసుగులో రూ.కోట్లు దండుకుంటున్న వైనం ఇప్పటికే రూ.182.5 కోట్లఅక్రమార్జనజిల్లాలో ఇసుక రీచ్‌లన్నీ ఖాళీ ధర్మవరం: జిల్లాలో ఇసుక రీచ్‌లు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చతమ్ముళ్లు సహజ సంపదను కొల్లగొట్టారు. తద్వారా కోట్లాది రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నారు. జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లలో 16.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని భూగర్భ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఇసుకను విక్రయించేందుకు అక్టోబర్, 2014 లో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి 2016 జనవరి ఆఖరు నాటికి 35 రీచ్‌ల పరిధిలో 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించారు. రూ.19.98 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది. తెర వెనుక ఇలా.. ప్రతి రోజూ జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లనుంచి నుంచి సగటున 100 నుంచి 120 లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. పేరు డ్వాక్రా సంఘాలదే అయినా పెత్తనం మొత్తం అధికార పార్టీనేతల చేతిలో ఉండటంతో వారు అందినకాటికి అమ్మేసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. ఇసుక రీచ్‌లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోతానే అనధికాధికారులు ఇసుక రీచ్‌లలోకి వెళ్లి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇసుకను యధేచ్చగా తరలించేవారు. ఈ ఇసుకరీచ్లపై ఎటువంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ తాత్సారం వెరసి జిల్లాలోని రీచ్‌లన్నింటినీ అక్రమార్కులు కొల్లకొట్టేశారు. ప్రతి రోజు జిల్లా నుంచి 100 నుంచి 120 దాకా లారీల ఇసుక జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఒక్కో లారీకి 10 క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపితే 100 లారీలకు 1200 క్యూబిక్ మీటర్ల ఇసుక బయటి ప్రాంతాలకు తరలిపోయింది. ఈ ప్రకారం ఒక్క ఏడాదిలోనే 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు జిల్లా దాటించి సొమ్ముచేసుకున్నారు. అనధికారికంగా జిల్లా దాటిపోయిన ఇసుకను బెంగళూరు, చిక్‌బళాపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో విక్రయించగా అక్రమార్కులకు చే కూరిన ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మకపోవు. సీపీరేవు రీచ్నుంచే వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రోజుకు 30 నుంచి 40 దాకా ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటించారు. తాడిమర్రి మండలం చిన్నచిగుళ్ల రేవు ఇసుక రీచ్ వద్దనుంచే ఈ ఏడాది వ్యవధిలో 12,000 లారీల ఇసుక అక్రమంగా తరలిపోయింది. ఆ ఇసుకను విక్రయించగా వారికి దాదాపు 60కోట్లు లాభం చేకూరింది. ఇసుక విక్రయాలు ఆపేసిన తరువాత ఈ అక్రమ తరలింపు రోజుకు 50నుంచి 60 లారీల మేర జరిగినట్లు సమాచారం. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 1,000 లారీల ఇసుకను తరలించినట్లు రీచ్‌కు సమీపంలోని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు. అధికారులపై ఆరోపణలు అధికారుల అండతోనే ఇసుక వ్యాపారం మూడు డంపులు.. ఆరు లారీలుగా కొనసాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురుల కనుసన్నల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్లనే ప్రజాదనం అక్రమార్కుల పాలైందని పలువు నేతలు వ్యాఖ్యానిస్తున్నార -
‘రైతుల భూములు లాక్కుంటే ఊరుకోం..’
గద్వాలన్యూటౌన్: గట్టు మండలంలో సోలార్ ప్రాజెక్టు కోసం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుం టే ఆందోళన ఉద్ధృతం చేస్తామని సీఎంసీ రాష్ట్ర కోశాధికారి జ్యోతి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భూములు సేకరించకూదని డిమాండ్ చేస్తూ.. సోమవారం తెలంగాణ ప్రజా ఫ్రంట్ ఆధ్వర్యంలో రైతులు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు సంఘీబావం తెలిపి మాట్లాడారు. దాదాపు 50 ఏళ్లక్రితం సాగుకు నోచుకోని, ఫారెస్ట్ ప్రాంత ప్రభుత్వ భూమిని అప్పటి ప్రభుత్వం కుటుంబానికి ఉచితంగా ఐదెకరాల చొప్పున ఇచ్చి పట్టాలు జారీచేసిందని చెప్పారు. 5,528 ఎకరాల భూమిని అప్పటినుంచి రైతులు సాగు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారన్నారు. రైతుల నుంచి భూములు తీసుకునేందకు తేదీ వేయకుండా నోటీసులు జారీచేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. సాగు భూములను బీడు భూములుగా చూపించిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర ఉపాద్యక్షుడు గోపాల్‌రావు, డీటీఎఫ్ నాయకుడు ప్రభాకర్, టీపీఎఫ్, సీఎంసీ నాయకులు చిట్టెం కిష్టన్న, దరేష్‌బీ, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు. -
మూడు ఇసుక రీచ్‌లకు మళ్లీ టెండర్లు
జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు తక్కువ రేటు దాఖలు చేసిన వ్యాపారులు ఈ టెండర్ల రద్దుకు మైనింగ్ శాఖ అధికారుల ప్రతిపాదనలు సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలోని జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం ఇసుక రీచ్‌లకు మళ్ళీ టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 11న జిల్లాలోని ఏడు రీచ్‌లకు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు కంటే ఎక్కువగా టెండర్లు దాఖలైనా, అలాగే తక్కు వగా దాఖలైనా వాటిని రద్దు చేయాలనే ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని అధికారులు మళ్లీ టెండర్లు ఆహ్వానించడానికి చర్యలు తీసుకుంటున్నారు. క్యూబిక్ మీటరుకు రూ.150 నుంచి రూ.500 లోపు రేటు వేయాల్సి ఉంటే జువ్వలపాలెం, వల్లభాపురం, ఉద్దండ్రాయునిపాలెం రీచ్‌లకు వరుసగా రూ.138, రూ.142, రూ.116 ల రేటును దాఖలు చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన రేటు రూ.150 కంటే తక్కువగా ఉండడంతో వీటిని రద్దు చేయాలని మైనింగ్‌శాఖ అధికారులు జిల్లా యంత్రాంగానికి ప్రతిపాదనలు అందించారు. జిల్లా యంత్రాంగం వీటిని పరిశీలించాల్సి ఉంది. ఒకటి రెండు రోజుల్లో వీటిపై నిర్ణయం తీసుకున్న తరువాత రెండోసారి టెండర్లు ఆహ్వానిస్తారు. మిగిలిన నాలుగు రీచ్‌లకు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన విధంగానే టెండర్లు దాఖలు చేసినా, వాటిని ఇంకా అధికారులు ఖరారు చేయలేదు. వ్యాపారులతో అగ్రిమెంట్ కుదుర్చుకుని రీచ్‌లను అప్పగించాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి ఈ రీచ్‌ల ఖరారుపై ఇంకా ఎటువంటి నిర్ణయం రాకపోవడంతో టెండర్లు ఖరారు చేయలేదు. నదీ పరివాహక భూములపై సన్నగిల్లిన ఆశలు ... ఇసుక రీచ్‌ల తరువాత జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనతో నదికి సమీపంలోని సొంత రైతుల్లో ఆశలు చిగు రించాయి. అయితే ప్రభుత్వం రూపొందించిన నిబంధనలు నదీ పరివాహక ప్రాంతాల్లోని రైతులకు అను కూలంగా లేకపోవడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవల జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో వ్యాపారులు ఏ రీచ్‌కు ఎక్కువ రేటు వేస్తారో ఆ రేటును పట్టా భూములు కలిగిన రైతులు చెల్లించాలనే నిబంధనల ఉండడంతో ఆ రైతులకు ఆశలు సన్నగిల్లాయి. ఈ నెల 11న జరిగిన ఇసుక రీచ్‌ల టెండర్లలో క్యూబిక్ మీటరుకు రూ.356లను చెల్లించేందుకు కస్తల, కోనూరు వ్యాపారులు ముందుకు వచ్చారు. దీని ప్రకారం ఈ రేటు చెల్లించడానికి ముందుకు వచ్చిన వారికే నదీ పరివాహక ప్రాంతాల్లోని భూముల్లో ఇసుక తవ్వడానికి అధికారులు అనుమతి ఇస్తారు. అంత మొత్తం ప్రభుత్వానికి చెల్లించి, అధికారులకు మామూళ్లు చెల్లిస్తే మిగిలేది పెద్దగా ఉండదనే ఉద్దేశంతో రైతులు దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. కనీసం అధికారులను ఈ భూములకు సంబంధించిన నిబంధనలు కూడా అడగడం లేదు. -
పార్టీని బలోపేతం చేద్దాం: పురందేశ్వరి
కర్నూలు (హాస్పిటల్) : కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి భారతీయ జనతాపార్టీ శ్రేణులకు పురందేశ్వరి పిలుపునిచ్చారు. స్థానిక నంద్యాల రోడ్డులోని శకుంతలా కల్యాణ మంటపంలో ఆదివారం ఏర్పాటుచేసిన పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీలో విభేదాలు బట్టబయలు సమావేశం ప్రారంభమైన గంట వ్యవధిలోనే పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు నాగరాజు పార్టీ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయని, ఇవి తీవ్రనష్టదాయకమని పేర్కొన్నారు. ఇందుకు స్పందించిన హరీష్‌బాబు పార్టీలో అందరూ సమానమేనని, సర్ధుకుపోవాలని కోరారు. మిత్రపక్షం టీడీపీ వైఖరితో ఇబ్బందులు పడుతున్నామని కల్లూరు మండల మాజీ అధ్యక్షులు రమణారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయగా పొత్తు అనేది కేంద్ర నిర్ణయమని, పాటించాలని కపిలేశ్వరయ్య కోరారు. ఇదే సందర్భంగా కపిలేశ్వరయ్య మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత సమావేశానికి ఎవరినీ పిలువలేదని, అందరూ వెళ్లిపోవాలని సూచించారు. అయితే 12.30 గంటలకు బీజేపీ సమావేశం ఉంది రావాలంటూ జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాకు మెసేజ్‌లు పంపడం గమనార్హం. -
గుర్తింపు దక్కేదెవరికో?
నేడే ఆర్టీసీ కార్మిక సంఘ ఎన్నికలు రాత్రికే ఫలితాలు ప్రకటన ఎనిమిది యూనియన్ల పోటాపోటీ ప్రభుత్వంలో విలీనమే ప్రధాన ఎజెండా సంస్థ, కార్మికుల రక్షణా ముఖ్యమే సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఆర్టీసీ గుర్తింపు సంఘ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఇప్పటికే నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్న సంస్థను గట్టెక్కించడమే ప్రధాన ఎజెండా. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ హామీతోనే వైఎస్సార్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ నేడు జరిగే గుర్తింపు ఎన్నికల బరిలో నిలిచింది. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని సాధించడమే లక్ష్యమని ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్ కూడా ప్రకటించాయి. ఈ మూడు యూనియన్లతో పాటు స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్, యునెటైడ్ వర్కర్స్ యూనియన్, కార్మిక సంఘ్, బహుజన వర్కర్స్ యూనియన్, కార్మిక పరిషత్ పోటీలో ఉన్నాయి.జిల్లాలో రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, రావులపాలెం, రాజోలు, రామచంద్రపురం, ఏలేశ్వరం, గోకవరం, తునిలలో ఆర్టీసీ డిపోలున్నాయి. అన్ని రకాల బస్సులు కలసి 673 ఉండగా సుమారు 4 వేల మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. రోజూ దాదాపు మూడు లక్షల మంది జిల్లావాసుల ప్రయాణానికి ఉపయోగపడుతున్న ఆర్టీసీ బస్సు క్రమేపీ నష్టాల ఊబిలోకి కూరుకుపోయింది. ఈ సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే.. ప్రభుత్వంలో విలీనం ఒక్కటే మార్గం అనే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. వైఎస్సార్ సీపీ కూడా ఇదే హామీని ఇచ్చింది. వాస్తవానికి పదో షెడ్యూల్లో ఉన్న ఆర్టీసీ వంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు నష్టాల్లోకి వెళితే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ టీడీపీ సర్కారు ఈ విషయంలో మాటలకే పరిమితమవుతోంది తప్ప ఆచరణలో చూపించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అక్కడ ఆర్టీసీని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఆర్టీసీకి రూ.200 కోట్లు, మిగతా జిల్లాల్లో రూ.75 కోట్ల ప్రత్యేక గ్రాంటు ప్రకటించింది. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఆ నష్టాల సమస్యను ఆర్టీసీనే పరిష్కరించుకోవాలన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి గ్రాంట్లూ రాకపోవడంతో ఆర్టీసీకి జిల్లాలో ఉన్న విలువైన స్థలాలు బీవోటీ పద్ధతిలో దీర్ఘకాల లీజుకు వెళ్లిపోతున్నాయి. ప్రైవేటు రవాణా సంస్థలతో పోటీపడి ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలంటే పూర్తిస్థాయి ప్రభుత్వ సంస్థగా మార్పు చేయడం ఒక్కటే మార్గమని కార్మికులంతా ముక్తకంఠంతో ఘోషిస్తున్నారు. సిబ్బందిపై ఒత్తిడి.. ఆర్టీసీ ప్రజాసేవా సంస్థ నుంచి లాభనష్టాలు బేరీజు వేసుకొనే ప్రైవేట్ సంస్థలా మారిపోతున్న ప్రభావం సిబ్బందిపై పడుతోంది. రోజురోజుకూ పనిఒత్తిడి పెరిగిపోతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్, కండక్టర్ రెండు పనులూ ఒక్కరే చేస్తున్న సర్వీసుల సంఖ్య ఏటా పెరుగుతోంది. తమ విధులను లాభనష్టాల కోణంలో చూస్తుండటంతో సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిపోల్లో మెకానిక్‌లు తదితర నిర్వహణ సిబ్బంది పరిస్థితి కూడా అంతే. నిబంధనల ప్రకారం 13 లక్షల కిలోమీటర్ల ప్రయాణం పూర్తిచేసిన బస్సులను నిలిపేయాలి. కానీ ఆ లక్ష్యం పూర్తిచేసుకున్న వాటికీ మరమ్మతులు చేసి రోడ్డు ఎక్కిస్తున్నారు. అవి మధ్యలోనే ఆగిపోతున్నాయి. ఇలాంటి బ్రేక్డౌన్లు ఇటీవల ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలోనే సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించడమనేదీ ఇప్పుడు ఎన్నికల ఎజెండాగా మారింది. సంక్షేమంపై దృష్టి.. విధి నిర్వహణలో ఎవరైనా ఆర్టీసీ సిబ్బంది మృతి చెందితే వారి కుటుంబానికి కేవలం రూ.లక్ష మాత్రమే ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నారు. దీన్ని కనీసం రూ.10 లక్షలు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్. ఉద్యోగ విరమణ చేసినవారికి పింఛను రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకే ఉంటోంది. దీన్ని కనీసం రూ.10 వేలు చేయాలనేది మరో డిమాండ్. వాటన్నింటినీ సాధిస్తామని ఎన్నికల బరిలో ఉన్న యూనియన్లన్నీ కార్మికులకు హామీ ఇస్తున్నాయి. పోలింగ్‌కు ఏర్పాట్లు జిల్లాలోని డిపోల్లో 3,446 మంది ఓటర్లుండగా వారంతా ఓటేందుకు డిపోలవారీగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటలకే పోలింగ్ మొదలై సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. ఆరు గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ప్రతి కార్మికుడూ క్లాజ్-3 (తెల్లరంగు) బ్యాలట్ పేపరుపై రాష్ట్ర గుర్తింపు సంఘానికి, క్లాజ్-6 (గులాబీ రంగు) బ్యాల ట్ పేపరుపై ప్రాంతీయ గుర్తింపు సంఘానికి రెండు ఓట్లు వేయాలి. ఏ యూనియన్కైనా 1,724 ఓట్లు వస్తేనే జిల్లా గుర్తింపు సంఘం హోదా వస్తుంది. -
అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం
పీఎన్ కాలనీ (శ్రీకాకుళం): పట్టణంలో ఇళ్లు, ఇళ్ల స్థలాలు లేని అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని సాధన కమిటీ నాయకులు టి.తిరుపతిరావు అన్నారు. స్థానిక ఎన్జీఓ హోం కూడలి నుంచి బుధవారం పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చారనితెలిపారు. ఆ ఎన్నికల హామీని 20 నెలలు గడుస్తున్నా అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమాధిపతుల కోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంక్‌ను ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి పేదవాడి ఇంటి కోసం రెండు సెంట్ల స్థలం కేటాయించకపోవడం బాధాకరమన్నారు. శ్రీకాకుళం అర్బన్ ప్రాంతంలో వేలాది మంది ఇప్పటికీ సొంత ఇళ్లు లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రారంభమైన సిద్ధిపేట, కంపోస్టు యార్డుల్లో నిజమైన, అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో జరిగిన భూపోరాటాల మాదిరిగానే మళ్లీ భూ పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పాదయాత్ర మేరద వీధి, గొల్కొండ రేవు, దమ్మల రెల్లివీధి, గొడగల వీధి, దమ్మలవీధిల మీదుగా సాగింది. కార్యక్రమంలో ఎం.ప్రభాకరరావు, వై.చలపతిరావు, , సూరమ్మ, లలిత, శంకరరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
వేలంపై పితలాటకం
జిల్లాలో కొలిక్కిరాని ఇసుక ర్యాంపుల వేలం అధిక ధరలకు బిడ్ల దాఖలు.. ర్యాంపులు రద్దయ్యే అవకాశం ప్రభుత్వానికి నివేదిక పంపిన అధికారులు నూతన ఇసుక పాలసీపై సర్వత్రా విమర్శలు కొవ్వూరు :జిల్లాలో ఇసుక ర్యాంపుల వేలం పితలాటకంగా మారింది. ప్రభుత్వం రూపొందించిన నూతన ఇసుక పాలసీ విధానం లోపభూయిష్టంగా ఉండడంతో ఇటు అధికారులు, అటు వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 6 ఇసుక ర్యాంపులకు నాలుగు రోజుల కిందట నిర్వహించిన వేలంలో ప్రభుత్వం పేర్కొన్న ధర కంటే అదనపు రేట్లకు కాంట్రాక్టర్లు కోడ్ చేయడంతో వేలం ఖరారు సందిగ్ధంలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో విజయవాడలో సమావేశమైన మంత్రివర్గ ఉప సంఘం ఇసుక వేలం ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఉపసంఘం సభ్యులైన మంత్రులు ప్రకటించారు. వేలం రద్దు యోచనలో ప్రభుత్వం ప్రభుత్వం క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.500గా నిర్ణయించింది. జిల్లాలో వేలం నిర్వహించిన ఆరు ర్యాంపుల్లో రామయ్యపేట మినహా మిగిలిన ర్యాంపులన్నీ అదనపు ధరలకు కోడ్ చేశారు. సిద్ధాంతం ర్యాంపులో రూ.720, పెండ్యాల-కానూరు ర్యాంపులో రూ.646, తీపర్రులో రూ.580, పందలపర్రులో రూ.522 చొప్పున పాడి కాంట్రాక్టర్లు వేలాన్ని దక్కించుకున్నారు. రామయ్యపేటలో మాత్రం రూ.476 పలికింది. ప్రభుత్వ ధర కంటే ఎక్కువగా కోట్ చేయడంతో జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో వేలంపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక పంపించామని గనుల శాఖ ఏడీ సి.మోహనరావు చెబుతున్నారు. రామయ్యపేట ర్యాంపు పోలవరం ప్రాజెక్టు పరిధిలో ఉండడంతో నీటిపారుదల శాఖ ఎస్ఈ అభ్యంతరం వ్యక్తం చేస్తూ జాయింట్ కలెక్టర్‌కి లేఖ రాశారు. దీనిపై జిల్లా స్టాండ్ మైనింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో ఈ ర్యాంపు నిర్వహణ ఇబ్బందులు తలెత్తె అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లోపభూయిష్టమైన విధానం ప్రభుత్వం నూతన ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది. ప్రభుత్వం క్యూబిక్ ఇసుక ధరను రూ.500కి విక్రయించాలని నిబంధన విధించింది. వేలంలో కనిష్ట ధర రూ.110గా నిర్ణయించింది. దీనిపై అదనంగా పాడుకున్నవారికి వేలం కట్టబెడతారు. ఇసుక తవ్వకం, సీనరేజి, వాణిజ్య పన్ను, ఆదాయ పన్ను, జిల్లా మినరల్ ఫండ్, ర్యాంపుల ఏర్పాట్లు, నిర్వహణ తదితర ఖర్చులన్నీ కలిపి క్యూబిక్ మీటర్ ఇసుక తవ్వకానికి రూ.200 నుంచి రూ.250 వరకు కాంట్రాక్టర్‌కి ఖర్చవుతుంది. ఉదాహరణకు క్యూబిక్ మీటర్ ఇసుక ధర రూ.200 నుంచి రూ.250 లోపు వేలంలో దక్కించుకుంటేనే ఆ కాంట్రాక్టర్ క్యూబిక్ మీటర్ రూ.500కు విక్రయించగలడు. అయితే వేలంలో రూ.500 పైబడి బిడ్లు దాఖలు చేశారు. వేలం దక్కించుకున్నవారంతా అధికారపార్టీ ప్రజాప్రతినిధులకు బినామీలేనన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయా ర్యాంప్‌లలో ప్రభుత్వం నిర్ణయించిన ఇసుక పరిమాణంతో సంబంధం లేకుండా అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాత్రింబవళ్లు తవ్వుకునే కుట్రలో భాగంగానే బిడ్లను అధిక ధరలకు కోడ్ చేశారు. నూతన విధానంపైనా విమర్శలు ఇసుక అక్రమ తవ్వకాలతో ఇప్పటికే అప్రదిష్టను మూటగట్టుకున్న టీడీపీ ప్రభుత్వం.. కొత్తగా రూపొందించిన పాలసీపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట ధర వద్ద బిడ్ లాక్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అలాచేయకపోవడంతో బిడ్లు హెచ్చు ధరకు వెళ్లాయి. ప్రభుత్వం క్యూబిక్ మీటర్‌కు రూ.500కు గరిష్ట ధర నిర్ణయించింది. క్యూబిక్ మీటర్ ఇసుకను రూ.500కు విక్రయించాలని పేర్కొంది. అయితే వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లు క్యూబిక్ మీటర్‌కు దాదాపు రూ.200 వరకు ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంది. అలాంటి పరిస్థితుల్లో క్యూబిక్ మీటర్‌కు రూ.350లోపే గరిష్ట ధర నిర్ణయించాలని అధికారులే చెబుతున్నారు. జిల్లాలో కరుగోరుమిల్లు ర్యాంపులో క్యూబిక్ మీటర్ ఇసుక ధర ఏకంగా రూ.820 పలికింది. దీనికి ఇతర ఖర్చులు రూ.230 కలిపితే కాంట్రాక్టర్‌కి క్యూబిక్ మీటర్ ఇసుక రూ.1,050 గిట్టుబాటు అవుతుంది. దీనిపై కాంట్రాక్టర్ లాభం వేసుకోవాలి. అంటే ప్రభుత్వం నిర్ణయించిన ధరకు దాదాపు రెండు రెట్లు వేసుకుంటే గాని కాంట్రాక్టర్‌కు గిట్టుబాటు కాదు. ప్రభుత్వమే ఇసుక దోపిడీని పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. -
ప్రత్తిపాటి దిష్టిబొమ్మ దహనం
తెనాలిరూరల్ : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ పిలుపుమేరకు కార్యకర్తలు కొలకలూరులో సోమవారం రాస్తారోకో నిర్వహించారు. సమితి డివిజన్ అధ్యక్షుడు చిలకా కిరణ్‌మాదిగ మాట్లాడుతూ మాదిగలు కృష్ణమాదిగ వెంట లేరన్న ప్రత్తిపాటి పుల్లారావు మాటలు ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమన్నారు. వైఎస్సార్ సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుద్దపల్లి నాగరాజు (కిరణ్‌బాబు) మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేక అన్ని వర్గాల వ్యతిరేకతను చవిచూస్తోందన్నారు. కాపుల ఉద్యమం, మాదిగల నిరసనల వెనుక వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హస్తం ఉందన్న మంత్రులు, టీడీపీ నాయకుల ఆరోపణలు రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐకు స్వల్ప గాయాలు.. నిరసన కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా అడ్డుపడ్డారు. రాస్తారోకో విరమించాలని ఆదేశించారు. మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా తాలూకా ఎస్ఐ శివరామకృష్ణ అడ్డుకున్నారు. అరుునా కార్యకర్తలు బొమ్మపై పెట్రోలు పోసి నిప్పంటించారు. దీంతో మంటల సెగకు ఎస్ఐ కనుబొమలు, నొసలు కంతమేర కమురుకుపోయాయి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పొన్నెకంటి రమేష్ చొక్కాపై పెట్రోలు పడి మంటలు అంటుకోగా కార్యకర్తలు ఆర్పి వేశారు. ఎస్ఐకు తెనాలి జిల్లా వైద్యశాలలో చికిత్స చేయించారు. కార్యకర్తలు గ్రామ కూడలిలోని అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రాం విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదు... సత్తెనపల్లి: ఎస్సీ వర్గీకరణకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయడం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. తాలుకా సెంటర్లో మంత్రి పుల్లారావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి గరికపాటి రవికుమార్ మాదిగ, వీహెచ్పీఎస్ నియోజకవర్గ నాయకుడు మంగళగిరి రాజశేఖర్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి రాము తదితరులు పాల్గొన్నారు. -
రేషన్‌కు నిబంద్‌నలు!
ప్రభుత్వం విధించిన నిబంధనలు చాలామందికి రేషన్ సరుకులు అందకుండా చేశాయి. ప్రతి నెల 15వ తేదీలోగా రేషన్ కార్డుదారులకు సరుకులు అందజేయాలనే నిబంధన ఈ నెల నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పని చేయకపోవడం, వేలిముద్రలు పడకపోవడం, సర్వర్ ఇబ్బందులు పెట్టడం వంటి కారణాలతో సుమారు 16 శాతం మంది తిండి గింజలకు నోచుకోలేదు. సోమవారంతో గడువు ముగియడంతో కార్డుదారులు, డీలర్లు ఆందోళన చెందుతున్నారు. రేషన్ సరుకులపంపిణీకి ముగిసిన గడువు 16 శాతం మందికి అందని తిండిగింజలు ఆందోళన చెందుతున్న కార్డుదారులు, డీలర్లు వీరఘట్టం: జిల్లాలో 2,001 రేషన్ షాపులు ఉండగా 8,25,094 కార్డుదారులకు 13,530.730 మెట్రిక్‌టన్నుల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ నెల ఇంతవరకు 6,93,078 మంది కార్డుదారులకు(84 శాతం మందికి) బియ్యం పంపిణీ చేశారు. ఆర్థిక సమస్యలు, ఇతర కారణాలతో మరో 16 మంది సరుకులు నోచుకోలేదు. అలాంటి వారంతా గడువు ముగియడంతో ఆందోళన చెందుతున్నారు. డీలర్ల ఇబ్బందులు మరోపక్క మరుసటి నెల సరుకుల కోసం ప్రతి నెల 16వ తేదీనే డీడీలు తీయాలనే నిబంధనను ప్రభుత్వం విధించడంతో డీలర్లలో కలవరం మొదలైంది. దీనికితోడు ఒకటో తేదీ నుంచి 15వ తేదీ లోపు రోజూ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచిరాత్రి 8 గంటల వరకు తప్పనిసరిగా రేషన్ షాపులు తెరవాలని నిబంధన సైతంతో వారిలో ఆందోళన కలిగిస్తోంది. రెండు రోజులు గడువు కోరాం సుమారు 16 మందికి సరుకులు అందని విషయాన్ని పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి సుబ్రహ్మణ్యం వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సోమవారంతో రేషన్ బియ్యం పంపిణీకి గడువు ముగిసిందన్నారు. మరో రెండు రోజులు గడువు పెంచాలని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. -
‘పక్కా’ రాజకీయం
నెల్లూరు: పక్కా ఇళ్ల మంజూరులోనే అధికారపార్టీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. నిరుపేదలైన లబ్ధిదారులను పక్కనపెట్టి తనవారికే కట్టబెట్టేందుకు జాబితా సిద్ధం చేస్తున్నారు. అందులోనూ చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు తెలిసింది. వివరాల్లో కెళితే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించాక పక్కా గృహాల మంజూరుకు ఏ ప్రభుత్వం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. చాలా కాలం తరువాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా గృహాలను మంజూరు చేసినట్లు ప్రకటిం చాయి. కేంద్రప్రభుత్వం ‘అందరికీ ఇల్లు’ పేరుతో పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని పేదల కోసం జిల్లాకు 20,681 పక్కాగృహాలను మంజూరు చేసింది. ఒక యూ నిట్ విలువ రూ.4.80 లక్షలు నిర్ణయించింది. అందులో లబ్ధిదారుడు రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. రూ.2 లక్షలు ప్రభుత్వం బ్యాంకు నుంచి రుణం ఇప్పిస్తుంది. రూ.1.80 లక్షలు కేంద్రం, మరో రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది. ఇందులో 5,240 గృహా లను గతంలో రాజీవ్ అవాస్‌యోజన కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కేటాయించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకం కింద జిల్లా మొత్తానికి 10,500 ఇల్లు మంజూరు చేసింది. అవి కూడా కేవలం 8 నియోజకవర్గాలకు మాత్రమే. ఒక్కో నియోజకవర్గానికి 1250, నెల్లూరు రూరల్‌కి కేవలం 500 మాత్రం మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒక ఇంటికి రూ.2.75 లక్షలుగా నిర్ణయించారు. అందులో రూ.1.25 లక్షలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.1.50 లక్షలను బ్యాంకు నుంచి రుణం పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.1.75 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మరో రూ.లక్ష బ్యాంకు ద్వారా రుణం పొందాలి. ఇచ్చిన కొన్నింటికీ పైరవీలు సముద్రంలో ఇంగువ కలిపినట్లు లక్షలాది మంది సొంత ఇళ్లు లేని వారు ఉంటే... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 31,181 పక్కా గృహాలు మంజూరు చేశాయి. ఇవైనా నేరుగా లబ్ధిదారులకు చేరుతాయా? అనుకుంటే పొరబాటే. వీటినీ జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన వాటిని బీజేపీ నేతలు గుప్పెట్లో పెట్టుకుని నిజమైన పేదలకు దక్కకుండా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పక్కా గృహాలు కావాలంటే ఆ నేతల ఆశీర్వాదం ఉండాలి. ఆ పార్టీ నాయకులకు కొద్దో గొప్పో సమర్పించుకోవాలి. లబ్ధిదారుడు ముందుగా ఇంటి కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ డబ్బు చెల్లిస్తేనే అప్లికేషన్. ఆ తరువాత దరఖాస్తు పూర్తి చేసి ఇస్తే దానికీ కొంత మొత్తం సమర్పించుకోవాలి. అలా ఆ నేతలను సంతృప్తి పరిస్తేగానే పక్కాగృహాల జాబితాలో చోటు దక్కడం లేదని నెల్లూరుకు చెందిన లక్ష్మీదేవి, సుభద్రమ్మ, రమణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన ఆఖరుతేది ఈనెల 14 అని అధికారులు తెలిపారు. అయితే వెబ్సైట్ ఇంకా ఓపెన్కాలేదని, గడువు పెంచుతామని అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే ఆ జాబితాను టీడీపీ, బీజేపీ నేతలు ఓకే చేసి ఎంపీడీఓ కార్యాలయానికి చేర్చుతారు. చివరగా ఎంపీడీఓ ఆ జాబితాను హౌసింగ్ అధికారులకు పంపుతారు. దరఖాస్తు చేసుకునేవారు ఆధార్, రేషన్, ఓటరు కార్డు, బ్యాంకు పాసుపుస్తకం, కులధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. -
తమిళంలోనే రివిజన్ టెస్ట్
హైకోర్టు ఉత్తర్వులు అమలుచేయని ప్రభుత్వం మైనార్టీ భాషల విద్యార్థులకు తప్పని తిప్పలు హొసూరు: తమిళనాడు రాష్ట్రంలో వేలాది మంది మైనార్టీ భాషలు చదువుతున్న విద్యార్థులు వీధుల్లోకి వచ్చి తమ మాతృభాషలో చదువుకొనే అవకాశం కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్నివేడుకున్నారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమ మాతృభాషలోనే రాసే అవకాశం కల్పించమని ప్రాధేయపడ్డారు. తమిళనాడు ప్రభుత్వం కనికరించలేదు. విద్యార్థులు రాష్ర్ట హైకోర్టు తలుపులు తట్టారు. హైకోర్టు 2015 నవంబర్ 23వ తేదీ ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలు వారి మాతృభాషలోనే రాసేందుకు అవకాశం కల్పిచమని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి, విద్యార్థులు సంబంధిత అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేస్తూ గడువిచ్చింది. వేలాది మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకొన్నారు. కానీ విద్యాశాఖ కార్యదర్శి దరఖాస్తులు చేసుకొన్న ప్రతి విద్యార్థికి లెటర్ అందజేసి తమిళం బోధించాము, తమిళంలో పరీక్షరాయాలని సూచించడంతో ఈ లెటర్‌ను సవాల్ చేస్తూ మాచినాయకనపల్లి ప్రభుత్వ హయ్యర్సెకెండరీ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని గౌతమి హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఈ కేసును విచారించి రెండవ సారి కూడా విద్యాశాఖకు 25.01.2016న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కానీ విద్యాశాఖ కోర్టు సూచనలను పెడచెవిన పెట్టి 10వ తరగతి చదుతున్న మైనార్టీ భాషా విద్యార్థులకు నిర్బంధంగా తమిళ పాఠాలు బోధిస్తోంది. వారి మాతృభాషలైన తెలుగు, కన్నడం, ఉర్దూ, మళయాళం భాషలను బోధించకపోవడంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనయ్యారు. మంగళవారం 10వ తరగతి విద్యార్థులకు ప్రారంభమైన రివిజన్ టెస్టులో మైనార్టీ విద్యార్థులకు తమిళంలో ప్రశ్నాపత్రాలు అందజేసింది. తమ మాతృభాషలోపరీక్షలు రాయమని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా తమకు రివిజన్ టెస్టులో తమిళ ప్రశ్నాపత్రం ఇవ్వడమేమిటని కోర్టుకెళ్లిన గౌతమి ప్రశ్నిం చింది. తనకు తమిళం రాదని, తాను తమిళ ప్రశ్నాపత్రానికి జవాబులు రాయలేదని గౌతమి సాయంత్రం భోరున విలపించింది. దీనిపై విద్యార్థులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ప్రభుత్వం పట్టిం చుకోకపోతే భావిభారత పౌరులమైన తమకు కోర్టులపై, తీర్పులపై, భారత రాజ్యాంగంపై ఉన్న గౌరవం ప్రశ్నార్థకంగా మారుతుందని విద్యార్థులు అనుకుంటున్నారు. మైనార్టీ విద్యార్థుల సమస్యలపై నేడు సమావేశం రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తమిళంలో నిర్వహించడంపై ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు హొసూరు ఎమ్మెల్యే కే. గోపీనాథ్ అధ్యక్షతన బుధవారం ఉదయం 10 గంటలకు ఆంధ్రసాంస్కృతిక సమితిలో మైనార్టీ భాషా సంఘాల సమావేశం ఏర్పాటు చేశారు. తెలుగు, కన్నడ భాషాభిమానులు, సంఘాలు, పిల్లల తల్లితండ్రులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఎమ్మెల్యే ఒక ప్రకటనలో సూచించారు. రాష్ట్రంలో మైనార్టీ విద్యార్థులకు వారివారి మాతృభాషల్లో విద్యనభ్యసించేందుకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంపై తదుపరి కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసేందుకు సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. -
పక్కాగా బయోమెట్రిక్!
జిల్లాలో పింఛన్ల పంపిణీకి పక్కాగా బయోమెట్రిక్ అమలు చేయూలని ప్రభుత్వం భావిస్తుంది. దీని వల్ల పింఛన్ల మిగులు సొమ్ము ప్రభుత్వ ఖాతాలో జమవుతుంది. జిల్లాలో ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, గీత కార్మికులు అన్నీ కలిపి 2,70,805 పింఛన్లు అందజేస్తున్నారు. వీరి కోసం నెలకు రూ.29.66 కోట్లు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం 79 శాతం బయోమెట్రిక్ పద్ధతిపై అందజేస్తుండగా, 21 శాతం పింఛన్లను గ్రామ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఇతర పంపిణీ అధికారులు స్వీయ ధృవీకరణపై అందజేస్తున్నారు. స్వీయ ధృవీకరణను పూర్తిగా నిలిపేసి బయోమెట్రిక్ అమలు చేయూలని భావిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బయోమెట్రిక్ అమలు మెరుగ్గానే ఉన్నా.. మరికొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా లేదు. గత రెండు నెలలు పరిశీలిస్తే జిల్లాలో బయోమెట్రిక్ పనిచేయక పోవటం వల్ల డిసెంబర్లో 44,390 మందికి, జనవరిలో 55,093 మందికి స్వీయ ధృవీకరణతో అందజేశారు. ముఖ్యంగా బయోమెట్రిక్‌లో వేలి ముద్రలు పడక పోవటం, ఆధార్ అనుసంధానం లోపం, సర్వర్లు పని చేయక పోవటం, ఇంటర్నెట్ సమస్య, బయోమెట్రిక్‌లో ఆధార్ నంబర్ తప్పిపోవటం, మరో పక్క పలాస ప్రాంతంలో జీడి పరిశ్రమల్లో పని చేసే వారి వేలిముద్రలు పక్కాగా పడక పోవటం వంటి అనేక సమస్యలు వల్ల పింఛన్లు పంపిణీలో జాప్యం అవుతుంది. అయితే అధికారులు పాస్వర్డ్, లాగెన్ ఐడీ తెలిస్తే ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు సైతం స్వీయ ధృవీకరణతో పింఛన్లు సొమ్ము స్వాహా చేయవచ్చున్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. సిబ్బంది కొరత... పింఛన్లు 1 నుంచి 10వ తేదీలోపు అందజేయాలి. అయితే ఒకటి నాటికి పింఛన్లు సొమ్ము బ్యాంకుల్లో జమ కావటం లేదు. కొన్నిసార్లు నాలుగో తేదీ సైతం అవుతుంది. మరో పక్క పింఛన్లు పంపిణీ సిబ్బంది కొరత సైతం వెంటాడుతుంది. జిల్లాలో 1097 పంచాయతీలు ఉన్నాయి. 515 మంది కార్యదర్శులు మాత్రమే ఉన్నారు. ఆరు మున్సిపాలిటీల్లో 147 వార్డులు ఉండగా, 92 మంది మాత్రమే పింఛన్ పంపిణీ అధికారులు ఉన్నారు. ఈ నేపధ్యంలో ప్రత్యామ్నాయంగా వీఆర్వోలకు పింఛన్లు పంపిణీ బాధ్యత అప్పగించాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రతి నెలా 10లోపు పింఛన్లు మంజూరు పూర్తి, మిగులు డబ్బులు అకౌంట్లో జమ చేయటం, రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థకు 15లోపు వివరాలు అందజేసే చర్యలు పక్కాగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బయోమెట్రిక్ పక్కాగా అమలు సాధ్యం అవుతుందో? లేదో? వేచి చూడాల్సిందే! -
ఒకేసారి మాఫీ చేసుంటే ఆత్మహత్యలుండేవి కావు
-
ఇంటింటికీ గ్యాస్
- పైపులైన్ గ్యాస్‌తో నిరంతర సరఫరా - మీటర్ల ఏర్పాటు - వాడకం తర్వాతే బిల్లుల చెల్లింపు - 200 కనెక్షన్లకు ఇప్పటికే సరఫరా విజయవాడ : పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో మళ్లీ కదలిక వచ్చింది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ లైన్లను నగరంలో ఇప్పటికే 40 కిలోమీటర్ల మేర విస్తరించారు. మరో 200 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీనిద్వారా నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వటానికి దోహదపడుతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు భాగ్యనగర్ గ్యాస్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. కనెక్టివిటీ ఇలా... నగరంలో ఇంటింటికి పైపుల ద్వారా పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) సరఫరా చేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు మెయిన్ లైన్‌ను సత్యనారాయణపురం బస్టాండ్, ఐదో నంబర్ రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో 10 కిలోమీటర్లు, సత్యనారాయణపురంలో 30 కిలోమీటర్ల మేర వీటిని తాజాగా విస్తరించింది. నగరంలో సింగ్‌నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, బావాజీపేట, లక్ష్మీనగర్, హనుమాన్‌పేట, పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంతం, దేవీనగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పైపులైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పైపులైన్ ద్వారా 200 గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేశారు. ఎల్పీజీ కంటే ధర తక్కువ... పీఎన్ జీ గ్యాస్ ధర కిలో రూ.24.90. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలెండర్ బరువు 14.2 కిలోలు. దానికి సరిపోయే పీఎన్జీ గ్యాస్ ధర సుమారు రూ.350 అవుతుంది. ఎల్పీజీ సిలెండర్‌కు సబ్సిడీతో కలిపి చెల్లిస్తున్నది రూ.450. సబ్సిడీ లేకుంటే చెల్లించాల్సింది రూ.668. ఈ క్రమంలో పీఎన్జీ గ్యాస్ వాడితే మనం రూ.100 ఆదా చేసుకోవచ్చు. సిలెండర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కుళాయి నుంచి నీరు వచ్చినట్లు పైపులైన్ నుంచి నిరంతరం గ్యాస్ సరఫరా అవుతుంది. మీటరు ద్వారా లెక్కింపు... విద్యుత్ మీటర్ల మాదిరిగానే గ్యాస్ వాడకానికి సంబంధించి కూడా మీటర్లు ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం బిల్లులు ఇస్తారు. వినియోగదారుడు ప్రతి రోజూ తాము వాడిన గ్యాస్ వివరాలు మీటరులో తెలుసుకోవచ్చు. పీఎన్జీ గ్యాస్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎల్పీజీ గ్యాస్ బరువు అధికంగా ఉండటంతో లీక్ అయిన వెంటనే అది భూమి మీద పేరుకు పోయి ఉంటుంది. సీజీఎన్జీ గాలి కంటే తేలిక కావటంతో లీకైన వెంటనే అది బయటకు, పైకి వ్యాపించి వాతావరణంలో కలిసిపోతుంది. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదని కంపెనీ అధికారులు చెపుతున్నారు. పీఎన్జీ గ్యాస్‌ను 24 గంటలు సరఫరా చేస్తారు. గ్యాస్ కనెక్షన్ అవసరమైన వారు 7036518964, 0866 -6515986, 0866-2572522 నంబర్లలో సంప్రదించాలని కంపెనీ అధికారులు సూచిస్తున్నారు. కనెక్షన్ ఇలా పొందాలి... - కనెక్షన్ కావలసినవారు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. - కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. - డీడీ అందిన వెంటనే కంపెనీ నిపుణులు దరఖాస్తుదారుని ఇంటిని పరిశీలిస్తారు. - కనెక్షన్‌కు అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పీఎన్జీ గ్యాస్ విధానం అమలుకు అందరూ సహకరించాలని, స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛందంగా తరలిరావాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ కోరారు. ఇటీవల ఆయన సత్యనారాయణపురంలో అల్లూరు సీతారామరాజు వీధిలో ఓ ఇంటి వద్ద పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పైపులైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సిహెచ్.శివ, మహాలక్ష్మి దంపతులను కలెక్టర్ అభినందించారు. పైపులైన్ గ్యాస్ ఎంతో సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మూడు నెలలకు రూ.840 బిల్లు వచ్చింది మాకు కనెక్షన్ ఇచ్చి మూడు నెలలైంది. మొత్తంగా రూ.840 బిల్లు వచ్చింది. అంటే నెలకు రూ.300 కూడా కాలేదు. అంతేగాక ఇది సురక్షితమైనది. గ్యాస్ అయిపోయిన వెంటనే సిలెండర్ వచ్చేవరకు పడిగాపులు కాయాల్సిన పనిలేదు. లీకేజీ సమస్య లేకపోవటంతో ధైర్యంగా ఉండొచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సరఫరా అవుతోంది. - డి.వెంకటేశ్వరరావు, జీఆర్పీ సూపరింటెండెంట్, రైల్వేస్టేషన్ -
ఆన్‌టైడ్ ఫండ్స్‘నిలిపివేత’
విజయనగరంఆరోగ్యం: అసలే అంతంత మాత్రంగా ఉన్న సబ్‌సెంటర్స్ మరింత కునారిల్లే పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే సబ్ సెంటర్స్ అభివృద్ధికి ప్రభుత్వం ఏటా విడుదల చేసే నిధులను రెండేళ్లుగా విడుదల చేయడం లేదు. దీంతో సబ్ సెంటర్స్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. 2013 -14 సంవత్సరం వరకు నిధులను విడుదల చేసిన ప్రభుత్వం 2014-15, 2015-16 సంవత్సరాలకు విడుదల కాలేదు. ఆన్‌టైడ్‌ఫండ్స్‌తో ఈపనులు చేపట్టాలి సబ్ సెంటర్‌కు విడుదల చేసే ఆన్‌టైడ్ ఫండ్స్‌తో సబ్ సెంటర్స్ ఆధునికీకరణ, సబ్ సెంటర్స్‌లో ఉండే ఏఎన్ఎంకు స్టేషనరీ, బీపీ ఆపరేటర్లు, వేయింగ్ మిషన్లు, డోర్ కర్టెన్లు, టేబుళ్లు, హిమోగ్లోబిన్ శాతాన్ని నిర్ధారించే పరికరాలు, రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రవాణా సౌకర్యం, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణ వంటి పనులు చేపట్టవచ్చు. ఏడాదికి ప్రభుత్వం ఒక్కో సబ్ సెంటర్‌కు రూ. 50 వేలు చొప్పున నిధుల విడుదలయ్యేవి. జిల్లాలో 436 సబ్ సెంటర్స్ ఉన్నాయి. ఏడాదికి రూ.2.18 కోట్లు చొప్పన నిధులు విడుదల కావాల్సి ఉంది. అసలే సబ్‌సెంటర్స్ ఆధ్వాన స్థితిలో ఉన్న నేపథ్యంలో నిధులు నిలిపివేయడం వల్ల వాటి పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే ఆస్కారం ఉంది. ఇదేవిషయాన్ని ఎన్ఆర్హెచ్ఎం డీపీఓ రామనుజులనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా సబ్‌సెంటర్స్‌కు ఆన్‌టైడ్ ఫండ్స్ విడుదలను ప్రభుత్వం నిలిపివేసిన మాట వాస్తవమేనని అన్నారు. -
అభివృద్ధి ఎలా
జిల్లా పరిషత్‌కు ప్రభుత్వ గ్రాంట్లు తగ్గిపోతున్నాయి. అభివృద్ధిపై ఆప్రభావం పడుతోంది. ప్రభుత్వం నుంచి తలసరి ఆదాయం గ్రాంటు తప్ప మరొకటి రావడం లేదు. స్థానికంగా వచ్చే సీనరేజి, సర్‌చార్జి ఆదాయంపైనే జెడ్పీ ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వీటి ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరిపోదు. ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉండడం లేదు. దీంతో ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధులపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: గతంలో కేంద్రప్రభుత్వం నుంచి బీఆర్జీఎఫ్ గ్రాంట్లు వచ్చేవి. ఏటా రూ.26 కోట్లు నిధులు విడుదలయ్యేవి. వాటి ద్వారా జిల్లాలో కొత్త నిర్మాణాలతో పాటు అసంపూర్తిగా ఉండిపోయిన నిర్మాణ పనుల్ని చేసేందుకు అవకాశం ఉండేది.ఇప్పుడా గ్రాంటు నిలిచిపోయింది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడంతో దాని పరిధిలో గల బీఆర్జీఎఫ్ కూడా ఆగిపోయింది. దీంతో ఏటా రూ.26కోట్ల మేర జెడ్పీ కోల్పోవలసి వస్తోంది. ఆగిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు జిల్లా పరిషత్‌కు ఆర్థిక సంఘం నిధులు కూడా భారీగా వచ్చేవి. 13వ ఆర్థిక సంఘం అమలైనంతవరకు నిధులొచ్చాయి. కానీ 14వ ఆర్థిక సంఘం వచ్చేసరికి నిధుల విడుదలకు కేంద్రం బ్రేకులేసింది. ఏటా రూ.25నుంచి 30కోట్లు వరకు విడుదలయ్యేవి. వీటితో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణతో పాటు సీసీ రోడ్లు, అగ్రి, ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ల ఏర్పాటు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేవారు. అయితే, ఈసారి పంచాయతీలకు సుమారు రూ.25కోట్లు విడుదల చేసి కేంద్రం, జెడ్పీకి ఇప్పటికి ఒక్క పైసా విడుదల చేయలేదు. విడుదల చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతవరకు జెడ్పీకి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. దీంతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల నిర్వహణపై జెడ్పీ సందిగ్ధంలో పడింది. ఇక, మౌలిక సదుపాయాల కల్పన, ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాల పరిస్థితి అగమ్యగోచరమే.మానవ వనరుల్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాజీవ్ గాంధీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం కింద జెడ్పీకి సరాసరి రూ.2కోట్లు విడుదలయ్యేవి. అలాగే, మండల పరిషత్‌లకు రూ.10 లక్షల చొప్పున విడుదలయ్యేది. ఇప్పుడా పథకానికి కూడా కేంద్రం మంగళం పాడేసింది. ముఖ్యంగా శిక్షణా కార్యక్రమాలకు దోహదపడే కేంద్రాల నిర్మాణాలకు బ్రేక్ పడింది. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులూ అనుమానమే స్టేట్ ఫైనాన్స్ కమిషన్(ఎస్ఎఫ్సీ) కింద ప్రతి ఏడాది రూ.2కోట్ల వరకు నిధులొచ్చేవి. వీటిని కొత్తగా నిర్మాణాలు చేపట్టేందుకు, పాత నిర్మాణాల నిర్వహణను వినియోగించే వారు. గత ఏడాదిగా ఎస్ఎఫ్సీ గ్రాంటు రాలేదు. దానిపై ఇంతవరకు ఎటువంటి సమాచారం లేదు. దాదాపు ఆగిపోయినట్టేనని తెలుస్తోంది. దీంతో జెడ్పీకి పాత నిర్మాణాల నిర్వహణ సమస్యగా మారనుంది. జనరల్ నిధులే ఆధారం నాలుగు రకాల గ్రాంట్లు నిలిచిపోవడంతో జెడ్పీ ఆదాయం భారీగా తగ్గిపోయింది. ప్రభుత్వం నుంచి ప్రస్తుతం తలసరి ఆదాయం గ్రాంటు మాత్రమే వస్తోంది. ఒక వ్యక్తికి రూ.4 చొప్పున సుమారు రూ.93 లక్షలు వస్తోంది. సర్‌చార్జీ ద్వారా సుమారు రూ.50 లక్షల నుంచి 70 లక్షల వరకు, సీనరేజీ ద్వారా దాదాపు రూ.కోటి వరకు వస్తోంది. ఇవన్నీ జనరల్ ఫండ్స్ కిందకొస్తాయి. ఈ ఆదాయం రూ.3 కోట్ల లోపే ఉంటుంది. ఈ మొత్తంతో జిల్లా వ్యాప్తంగా ఎంత మేర అభివృద్ధి చేయవచ్చన్నది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దీంతో అభివృద్ధికి కల్ప తరువుగా ఉపాధి హామీ పథకమే కన్పిస్తోంది. గ్రామీణాభివృద్ధి శాఖ పథకమైనప్పటికీ జెడ్పీ తీర్మానం ద్వారా ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనుల్ని ప్రతిపాదిస్తుండటంతో అదే జెడ్పీ గొప్పతనంగా చెప్పుకోవల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడా పనుల కోసమే అధికార పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. విపక్షాల పంచాయతీలకు కేటాయింపులు చేయకుండా ఏకపక్షంగా మంజూరు చేయించుకుంటున్నారు. -
‘డిండి’ భూసేకరణ వేగవంతం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న డిండి ఎత్తిపోతల పథకానికి సంబంధించి అవసరమయ్యే భూమిని ఈ నెలాఖరులోగా కొనుగోలు చేయాలని జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సాగునీటి పారుదల అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి తన చాంబర్లో డిండి ఎత్తిపోతల పథకంపై జిల్లా ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ నిపుణులు, సాగునీటి పారుదల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ మొత్తం ప్రాజెక్టు నిర్మాణానికి 26 వేల ఎకరాలు అవసరం కాగా.. దీంట్లో నల్లగొండ జిల్లాలో 16 వేలు, మహబూబ్‌నగర్ జిల్లాలో పదివేల ఎకరాలు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ మొత్తం భూమిని రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు మొదట విడత రూ.100 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఐదు రిజర్వాయర్లు నిర్మించాల్సి ఉంది. దీంట్లో మొదటి రిజర్వాయర్ సింగరాయపల్లి, రెండోది గొట్టిముక్కల, మూడో రిజర్వాయర్ అర్కపల్లి, నాలుగైదు రిజర్వాయర్లు కిష్టరాంపల్లి, సువర్ణగూడెంలో నిర్మిస్తారు. ఈ ఐదు రిజర్వాయర్ల నిర్మాణానికి 15 వే ల ఎకరాల భూమి అవసరం. దీంతో పాటు డిండి ఎత్తిపోతల నుంచి చౌటుప్పుల్ వరకు ప్రధాన కాల్వ 90 కి.మీ మేర తవ్వుతారు. దీనికి 11 వేల ఎకరాలు కావాల్సి ఉంది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ.6,190 కోట్లు కాగా...పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తిఅయితే 3.50 లక్షల ఎకరాలు ఆయకట్టు సాగులోకి వస్తుంది. దీంట్లో నల్లగొండ జిల్లాలో మూడు లక్షలు ఎకరాలు కాగా..మహబూబ్‌నగర్ జిల్లాలో 50 వేల ఎకరాలు ఉంది. మంత్రి నిర్వహించిన ఈ స మావేశంలో ఇరిగేషన్ నిపుణుడు, రిటైర్డ్ ఇంజినీర్ శ్యామ్‌ప్రసాద్ రెడ్డి, ఎమ్మార్పీ ఎస్ఈ పురుషోత్తం రాజు, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రవీంద్రకుమార్, ఎమ్మెల్సీలు పూల రవీందర్, పల్లా రాజేశ్వరరెడ్డి, కర్నె ప్రభాకర్, జిల్లా నీటి పారుదల అధికారులు, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. -
ఆత్మరక్షణలో అమ్మ ప్రభుత్వం
టాస్మాక్ దుకాణాలపై రాష్ట్ర వ్యాప్తంగా పెల్లుబుకిన వ్యతిరేకత, అన్ని ప్రతిపక్షాలతోపాటు ప్రజలు, విద్యార్థి, ప్రజా సంఘాలు ఏకం కావడం అమ్మ ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని సమీక్షించేందుకు సీఎం జయలలిత సోమవారం అత్యవసరంగా సమావేశమయ్యారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత కొంతకాలంగా చాపకింద నీరులా ఉండిన సంపూర్ణ మద్య నిషేధం డిమాండ్ గాంధేయవాది శశిపెరుమాళ్ ఆకస్మిక మరణంతో ఒక్కసారి భగ్గున లేచింది. కాంగ్రెస్, డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకే, వామపక్షాలు, బీజేపీ ఇలా అన్ని పార్టీలు మద్యం అమ్మకాలపై సమరశంఖం పూరించాయి. విపక్షాలు చేసే ఆందోళనలను తిప్పికొట్టగల సమర్దత గలిగిన ముఖ్యమంత్రి జయలలిత ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని దుయ్యబట్టడంతో ఆమె ఇరుకునపడ్డారు. మద్యం దుకాణాల కారణంగా ప్రజాగ్రహానికి గురైతే రాబోయే ఎన్నికల్లో ఫలితాలు తారుమారు కాగలవనే ఆందోళన ఆమెలో నెలకొంది. శశిపెరుమాళ్ మరణం తరువాత రోజు రోజుకూ టాస్మాక్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు పెరిగిపోతున్న పరిస్థితులను సమీక్షించేందుకు సోమవారం సచివాలయంలో జయ సమావేశం అయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జ్ఞానదేశికన్, డీజీపీ అశోక్‌కుమార్, శాంతి భద్రతల విభాగం ఏడీజీపీ రాజేంద్రన్ తదితరులతో పరిస్థితిని సమీక్షించారు. వైగోపై 12 కేసులు: ఇదిలా ఉండగా, మద్యంపై పోరుకు పెద్ద దిక్కుగా నిలిచిన ఎండీఎంకే ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోపై ప్రభుత్వం 12 కేసులు బనాయించింది. శంకరన్‌కోవిల్ కలింగపట్టిలో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆందోళన చేసిన వైగో సహా 52 మందిపై ప్రభుత్వం కేసులు బనాయించింది. వైగో సొంతూరైన తిరునెల్వేలీ కలింగపట్టిలో టాస్మాక్‌దుకాణాలపై ఆయన యుద్దం ప్రకటించారు. ఈ సందర్భంగా టాస్మాక్ అధికారులపై వైగో దాడిచేశారని ఆరోపిస్తూ ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శశిపెరుమాళ్ చనిపోయిన నాటి నుండి ఆందోళనలు సాగిస్తున్నారు. ప్రజా పోరాటాన్ని అన్నాడీఎంకే ప్రభుత్వం అడ్డుకోవడమేగాక కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి విరుద్దమని వైగో విమర్శించారు. అక్రమ కేసులను బనాయించడమేగాక తనను శాశ్వతంగా అంతం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆయన ఆరోపించారు. వైగో తదితరులపై 12 కేసులు బనాయించడంతో నెల్లై జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నేడు రాష్ట్రబంద్: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం విధించాలని కోరుతూ ముందుగానే ఇచ్చిన పిలుపుమేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ పాటిస్తున్నారు. ఎండీఎంకే, వీసీకే, మనిదనేయ మక్కల్ కట్చి పార్టీలు ఈనెల 4వ తేదీన బంద్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. 10న డీఎంకే ఆందోళన: కరుణ మద్య నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 10 వ తేదీన రాష్ట్రవ్యాప్త అందోళన చేపడుతున్నట్లు డీఎంకే అధ్యక్షులు కరుణానిధి సోమవారం ప్రకటించారు. డీఎంకే అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధం విధిస్తామని తానిచ్చిన మాటకు కట్టుబడివ ఉన్నానని ఆయన అన్నారు. మద్యనిషేధం కోరుతూ ప్రజలు జరుపుతున్న పోరాటాన్ని పోలీసులు అణిచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. -
నక్సలిజంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధం
ముంబై: రాష్ట్రంలో పెరుగుతున్న నక్సలిజాన్ని అరికట్టడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం ముఖ్యమంత్రి సారథ్యంలో ఓ ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయనున్నారు. సీఎం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కమిటీలో హోం, ఆర్థిక, పీడ బ్ల్యూడీ, రాష్ట్ర, జాతీయ నిఘా విభాగం, రక్షణ విభాగం అధికారులు సభ్యులుగా ఉంటారు. మావోయిస్టులను ఎదుర్కోడానికి వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను ఈ బృందం అధ్యయనం చేస్తుంది. నక్సలిజాన్ని అదుపుచేయడానికి అవలంభించాల్సిన విధానాలు, వ్యూహాలపై కమిటీ అధ్యయనం చేస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి కమిటీ సమావేశమవుతుందని, రాష్ట్రంలో నక్సలిజాన్ని అదుపు చేయడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఓ అధికారి తెలిపారు. నక్సలిజాన్ని అణిచివేయడానికి ఇతర రాష్ట్రాలు, కేంద్రంతో కలసి పనిచేస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కమిటీ అభివృద్ధి పథకాలు అమలు చేస్తుందని, అందుకు కావలసిన సామాగ్రిని కూడా సమకూరుస్తుందని చెప్పారు. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసుకోవాల్సిందిగా 2010లో అప్పటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. ఇందులో భాగంగా చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసుకున్నాయి. అసోం, జమ్మూ-కశ్మీర్ రాష్ట్రాలు సీఎం నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాయి. -
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాల పంపణీ
-
పేదలకు ‘పట్టా’భిషేకం
- నేడు ప్రారంభించనున్న సీఎం - జంట జిల్లాల్లో 81,777 మందికి - పట్టాల పంపిణీ - ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లోని పేద ప్రజల చిరకాల వాంఛ నేరవేరబోతోంది. వారి సొంతింటి కల సాకారం కాబోతోంది. వారందరికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రభుత్వం ఎట్టకేలకు ముహుర్తం ఖరారు చేసింది. సీఎం కేసీఆర్ శుక్రవారం ఖైరతాబాద్ నియోజకవర్గంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఎన్బీటీ నగర్లో 7 వేలకు పైగా కుటుంబాలు, మల్కాజిగిరి నియోజకవర్గంలోని 3,300 మందికి పట్టాలు అందజేస్తారు. పాతబస్తీలోని వివిధ మండలాల పరిధిలో గుర్తించిన పట్టాదారులకు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మహ్మద్ మహమూద్ అలీ పట్టాలను పంపిణీ చేస్తారు. అంబర్‌పేట్‌లోని అలీ కేఫ్ ఏకే ప్లాజా ఫంక్షన్ హాల్లో మలక్‌పేట్ నియోజకవర్గానికి చెందిన 114 మందికి... అంబర్పేట్ నియోజకవర్గంలోని 503 మందికి, చార్మినార్‌లోని 112 మందికి మహమూద్ అలీ పట్టాలు అందిస్తారు. కంచన్‌బాగ్ డీఆర్డీఎల్ చౌరస్తాలోని న్యూ నేషనల్ ఫంక్షన్ హాల్లో చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని 393 మందికి... యాకత్‌పురలోని 161 మందికి, బహదుర్‌పురాలోని 26 మందికి, రహీంపురలోని ఎస్కే ఫంక్షన్ హాలులో నాంపల్లి నియోజకవర్గంలోని 381 మందికి, కార్వాన్‌లోని 793 మందికి, గోషా మహల్‌లోని 174 మందికి ఆయన పట్టాలు అందజేస్తారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని 1186 మందికి లోయర్ ట్యాంక్ బండ్‌లోని తెలగ, బలిజ, కాపు భవన్లో హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టాలు అందజేస్తారు. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని 7,817 మందికి స్థానిక ఎన్బీటీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో... జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 5,314 మందికి యూసుఫ్‌గూడ చౌరస్తాలోని సవేరా ఫంక్షన్ హాలులో మంత్రి నాయిని పట్టాలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్‌లోని తహశీల్దార్ కార్యాలయంలో సనత్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని 495 మందికి వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఇళ్ల పట్టాలు అందజేస్తారు. మారేడుపల్లి తహశీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 1910 మందికి ఎక్సైజ్‌శాఖ మంత్రి పద్మారావు పట్టాలుఅందజేయనున్నారు. తిరుమలగిరిలోని గాంధీ కమ్యూనిటీ హాలులో కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 646 మందికి పట్టాలు పంపిణీ చేయనున్నారు. జంట జిల్లాల్లో 81,777 పట్టాలు నగరంలో భూ క్రమబద్ధీకరణ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా భావించిన సర్కారు.. 125 చదరపు గజాలలోపు ప్రభుత్వ ఆక్రమిత స్థలాల్లోని కట్టడాలను క్రమబద్ధీకరించింది. జంట జిల్లాల్లో మొత్తం 81,777 పట్టాలు పంపిణీ చేయనుంది. హైదరాబాద్ జిల్లాలో జీవో 58 కింద 61,461 ఉచిత దరఖాస్తులను యంత్రాంగం స్వీకరించింది. అర్జీల వడపోత, క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం 20,025 మందిని అర్హులుగా గుర్తించి... పట్టాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ స్థలాలు, కోర్టు కేసులు, ఖాళీ స్థలాలు, రక్షణ, అటవీ శాఖ, వక్ఫ్ భూముల్లో వెలసిన ఇళ్లకు సంబంధించి 36,945 దరఖాస్తులను పక్కన పెట్టింది. రంగారెడ్డి జిల్లాలో 1,49,471 దర ఖాస్తులను పరిశీలించిన యంత్రాంగం 73,284 ఇళ్లు క్రమబద్ధీకరణకు అర్హమైనవిగా తేల్చింది. ప్రస్తుతం 61,752 మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. అసైన్డ్ పట్టాలే.. 125 గజాలలోపు ఇళ్లకు ఉచితంగా యాజమాన్య హక్కులు కల్పిస్తున్న సర్కారు... వీటిని అనుభవించుకోవడానికే తప్ప అమ్ముకోవడానికి వీల్లేదని నిషేధం విధించింది. ఉచిత కేటగిరీలోని ఇళ్లకు అసైన్డ్ పట్టాలను జారీ చేస్తోంది. దీంతో విక్రయానికి చట్టం అనుమతించదు. ఒకవేళ జీఓ 59 కింద చెల్లింపు కేటగిరీలోకి మారినా/వర్తించినా వాటి క్రయ విక్రయాలకు ఇబ్బంది ఉండదు. -
జీవీఎంసీ ఆదాయానికి బీపీ‘ఎస్’
- అనధికారిక భవనాల క్రమబద్ధీకరణ - 10 వేల దరఖాస్తులొస్తాయని అంచనా - రెండు మాసాల గడువు విశాఖపట్నం సిటీ : గ్రేటర్ విశాఖ పరిధిలో అక్రమ నిర్మాణాలను అపరాధ రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. 2014 డిసెంబర్ 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించింది. ఆలోగా నిర్మించుకున్న భవనాల అతిక్రమణలను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించింది. వాణిజ్య భవనాలు, నివాస భవనాలు, నివాసేతర భవన యజమానులకు ఇది ఉపశమనమి చ్చే సమాచారం. ఇందుకు రెండు మాసాల గడువు ఇచ్చింది. బుధవారం నుంచీ బీపీఎస్.ఏపీ.జీవోవి.ఇన్ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. దరఖాస్తులు జీవీఎంసీకి వచ్చిపడుతున్నాయి. రెండు రోజుల్లోనే సుమారు 50 మంది దరఖాస్తు చేసుకున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జీవీఎంసీలో ఈసారి 10 వేల భవనాలకు సంబంధించి దరఖాస్తులు వస్తాయని పట్టణ ప్రణాళిక విభాగ అధికారులు భావిస్తున్నారు. గతంలో 23 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో17 వేల దరఖాస్తులను పరిష్కరించారు. అయిదారు వేల భవనాలుండిపోయాయి. గెడ్డలు ఆక్రమించి కట్టేయడం, ప్రభుత్వ భూముల్లో నిర్మించేయడం, రోడ్లు లేకుండా నిర్మాణాలు చేసేయడం వంటి సమస్యలతోపాటు సాంకేతిక అడ్డంకులున్న భవనాలకు అనుమతి ఇవ్వలేదు. ఆ భవనాలను క్రమబద్ధీకరించలేదు. ఈ సారి కొత్తగా 10 వేల ద రఖాస్తులు మాత్రమే వస్తాయని అంచనా. వీటి వల్ల జీవీఎంసీకి రూ. 50 కోట్ల ఆదాయం సమకూరే అవకాశముందని భావిస్తున్నారు. దరఖాస్తు ఇలా: - ఆన్లైన్లో దరఖాస్తుతో పాటు రూ.10 వేల ఫీజును సౌకర్యంలో గానీ, మీ-సేవలో గానీ చెల్లించాలి. లేదా నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ ద్వారా చెల్లించవచ్చు. - నిబంధనలు అతిక్రమించిన నిర్మించిన మొత్తం స్థలానికి అపరాధ రుసుం లెక్కిస్తారు. 30 రోజుల్లో దీనిని చెల్లించవచ్చు. లేదా దరఖాస్తుతో బాటు చెల్లించవచ్చు - దర ఖాస్తు తిరస్కరిస్తే జరిమానాలో 10 శాతాన్ని మినహాయించుకుని మిగిలింది వాపసు చేస్తారు. - మురికివాడల్లోని భవనాలకు 50 శాతం అపరాధ రుసుం మినహాయింపు అమల్లో ఉంది. - దరఖాస్తుతోపాటు రూ. 10 వేలు చెల్లించిన రశీదు, దస్తావేజులు, ప్లాన్ కాపీ,తాజా పన్ను కాపీ, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఉంటే ఇలవవ్వచ్చు లేదా అగ్నిమాపక శాఖ జారీ చేసిన సర్టిఫికెట్, స్ట్రక్చరల్ ఇంజనీర్ భవన ధృఢత్వం తెలిపే సర్టిఫికెట్ వంటి వన్నీ జతచేయాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి అనుమతి పత్రం కూడా జత చేయాలి. -
వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్
లబ్బీపేట : వైద్య ఉద్యోగుల్లో బదిలీల టెన్షన్ నెలకొంది. వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీచేయడంతో ఎంతో కాలంగా నగరంలోనే తిష్టవేసిన ఉద్యోగుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఐదేళ్లు నిండిన వారందరినీ కచ్చితంగా బదిలీ చేయాలని, రెం డేళ్లు నిండిన వారిని రిక్వెస్ట్‌పై బదిలీ చేయవచ్చని పేర్కొనడంతో ఎవరు బదిలీ అవుతారనే ఆందోళన మొదలైంది. ఇక్కడ పనిచేస్తున్న వారిలో జోనల్ కేడర్‌లో మూడింట రెండొం తుల మంది ఐదేళ్లకుపైగా సర్వీసు పూర్తి చేసిన వారుండగా, పదేళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న వారు సగంమంది ఉన్నారు. వారందరికీ బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆన్లైన్ కౌన్సెలింగ్ ఈ బదిలీల కౌన్సెలింగ్‌ను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించనున్నారు. ఒకేచోట ఐదేళ్లు పైగా పనిచేస్తున్నవారు ఎక్కడికి కోరుకుంటున్నారో ఆప్షన్స్ ఇస్తే వాటికనుగుణంగా బదిలీ చేస్తారు. రాజకీయ సిఫార్సులు చెల్లుబాటయ్యే అవకాశాలు లేవని తెలిసింది. ఇప్పటికే పలువురు సిఫార్సుల కోసం రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ైవె ద్య, ఆరోగ్యశాఖ బదిలీ కమిటీ చైర్మన్‌గా పూనం మాలకొండయ్య ఉండడంతో సిఫార్సులు పట్టించుకోరని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాస్పత్రిలో 109 మంది స్టాఫ్ నర్సులుండగా.. వారిలో మూడో వంతు మంది బదిలీ అయ్యే అవకాశముంది. సీనియారిటీ ఆధారంగా దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది నగరంలో ఉన్నారు. హెడ్‌నర్సులు ప్రస్తుతం 25 మంది పనిచేస్తుండగా, వారిలో ఆరుగురు బదిలీ అయ్యే అవకాశం ఉంది. సీనియర్అసిస్టెంట్లు పదేళ్లుగా పనిచేస్తుండడంతో వారు కూడా బదిలీ అయ్యే అవకాశం ఉంది. హెచ్‌వీలు, ల్యాబ్‌టెక్నీషియన్స్, హెల్త్ అసిస్టెంట్లపై కూడా బదిలీ వేటు పడే అవకాశం ఉంది. -
ఇక సమరమే
మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆధ్వర్యంలో మంగళవారం పాడేరులో నిర్వహించిన తొలి అఖిలపక్ష సమావేశంలో విపక్షాలన్నీ ముక్తకంఠంతో ఖనిజ తవ్వకాలను వ్యతిరేకించాయి. ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించాయి. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించాయి. ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించాయి. - బాక్సైట్‌కు వ్యతిరేకంగా ప్రత్యక్షపోరుకు విపక్షాలు సిద్ధం - సంఘటితంగా అడ్డుకోవాలని నిర్ణయం - 3న మండల కేంద్రాల్లో ఆందోళన - అఖిలపక్ష సమావేశంలో తీర్మానం పాడేరు: మన్యంలో బాక్సైట్ ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని పలువురు ప్రజా ప్రతినిధులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆరోపించారు. బాక్సైట్ మాట ఎత్తనివ్వకుండా ఆది వాసీలు, గిరిజన సంఘాలను పోలీసులు నిర్బంధానికి గురి చేస్తున్నారని వాపోయారు. స్థానిక గిరిజన భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సారథ్యంలో మంగళవారం నిర్వహించారు. బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఏజెన్సీలోని అన్ని మండల కేంద్రాల్లో అధికార పార్టీల నాయకుల ఇళ్ల ముందు వచ్చే నెల మూడో తేదీన ఆందోళనకు తీర్మానించారు. అలాగే చింతపల్లిలో భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. ఈ సమావేశానికి పర్యావరణ నిపుణులను రప్పించాలని తీర్మానించారు. ఆదివాసీలకు ఎరవేసి విలువైన ఖనిజాన్ని తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విపక్షాల నేతలు ధ్వజమెత్తారు. ఐక్య ఉద్యమాలతో అడ్డుకోవాలని, దీనికి అఖిలపక్షాలు సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, సీపీఎం, గిరిజన సంఘం, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఉద్యమాలకు సిద్ధమని ప్రకటించారు. గత ఎన్నికల ముందు బాక్సైట్‌ను వ్యతిరేకించిన బీజేపీ, తెలుగుదేశం పార్టీలే ఇప్పుడు తవ్వకాలకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. ఆ రెండు పార్టీల నేతలు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకమంటూ గిరిజనులను మభ్యపెడుతున్నారని దుయ్యబ ట్టారు. ఇటీవల జర్రెలలో ప్రజలు ఏర్పాటు చేసిన సమావేశానికి తనను వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. బాక్సైట్ తవ్వకాలు చేపట్టకుంటే పోలీసుల నుంచి ఇటువంటి నిర్బంధ చర్యలు ఎందుకని నిలదీశారు. గిరిజనులకు జీవన్మరణ సమస్య అయిన ఈ ఉద్యమానికి అందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. సీపీఎం నాయకుడు శంకురాజు మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి పేరుతో బాక్సైట్ తవ్వకాలు అవసరం లేదని, కాఫీతో మన్యానికి మంచి భవిష్యత్ ఉందన్నారు. బాక్సైట్ తవ్వితే పర్యావరణానికి ముప్పు తప్పదన్నారు. వ్యవసాయం, అడవులు నాశనమవుతాయని అన్నారు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి శంకరరావు, ఏపీ గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎంఎం శ్రీను మాట్లాడుతూ బాక్సైట్ వెలికితీస్తే గిరిజనులకు ఒరిగేదేమీ లేదన్నారు. ఆదివాసీలకు వంద ఉద్యోగాలు రావని, 200 పై చిలుకు గ్రామాలు ధ్వంసమవుతాయన్నారు. ఏపీ గిరిజన సంఘం బాక్సైట్ ప్రభావిత 200 గ్రామాల్లో రెండు వారాలపాటు పాదయాత్రతో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళుతుందని, ఐక్య ఉద్యమాలకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. జి.మాడుగుల ఎంపీపీ ఎం.వి.గంగరాజు మాట్లాడుతూ బాక్సైట్ వ్యవహారంపై చంద్రబాబు మొండి వైఖరి అవలంభిస్తున్నారని, ప్రజాభీష్టానికి విరుద్ధంగా బాక్సైట్ తవ్వకాలు జరిగితే ఉద్యమం తప్పదని, తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు. సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పాంగి సత్తిబాబు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. -
పోడు కోసం ‘ప్రత్యేక’ పోరు..
- ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమమే ధ్యేయం - మహాధర్నాలో న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా దోమలగూడ: ప్రభుత్వం పోడు భూములను స్వాధీనం చేసుకునే చర్యలను విరమించుకోవాలని, లేకుంటే ఆదివాసీలకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడాల్సి వస్తుందని సీపీఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు టాన్యా హెచ్చరించారు. పోడు భూములను లాక్కునే చర్యలను విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ జల్, జమీన్, జంగిల్‌పై ఆదివాసీలదే హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించడం లేదని ఆరోపించారు. ఆదివాసీలను న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పుడు వారికి అన్యాయం చేసే చర్యలు తీసుకుంటున్నారని విమర్శించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెచ్చిన భూ ఆర్డినెన్స్ ద్వారా లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ.. అడవిపై ఫారెస్టు సిబ్బంది పోలీసులు, పెట్టుబడిదారుల పెత్తనం ఎమిటని ప్రశ్నించారు. పొట్ట కోసం చెట్లను నరికేందుకు వచ్చిన కూలీలను చంద్రబాబు ప్రభుత్వం బూటకపు ఎన్కౌంటర్లో చంపిందని, రూ. వందల కోట్ల రుణాలు ఎగవేసిన సుజనాచౌదరిని ఎన్కౌంటర్ చేయగలదా అని నిలదీశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోవర్ధన్ మాట్లాడుతూ కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేయడం లేదని ఆరోపించారు. న్యూడెమోక్రసీ నాయకులు ముక్తార్ పాషా, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు వి.సంధ్య, ఏఐకేఎంఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అచ్యుతరామారావు, మండల వెంకన్న, ఎ. నరేందర్, అనురాధ, భూక్యా, అరుణోదయ రాష్ట్ర కార్యదర్శి నిర్మల, గౌని ఐలయ్య, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలకు రెడీ!
- జూన్ నెలాఖరులో డీలిమిటేషన్ జాబితా - ఎన్నికల నిర్వహణకు రూ.36 కోట్లు - విధులకు 50 వేల మంది సిబ్బంది - వెబ్సైట్లో రిజర్వేషన్ల వివరాలు సాక్షి,సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల దిశగా ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 15లోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. ఆమేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల నిర్వహణక య్యే వ్యయం... అవసరమైన సిబ్బంది... రిజర్వేషన్ల ప్రక్రియ ఎప్పుడు పూర్తి కానుందనే అంశాలపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.నాగిరెడ్డి సోమవారం తన కార్యాలయంలో జీహెచ్ంఎసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 15లోగా ఎన్నికలు పూర్తి కావాలంటే... అంతకంటే 45 రోజుల ముందు... అంటే అక్టోబర్ నెలాఖరులోగా వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉందన్నారు. వార్డుల (డివిజన్ల) విభజన, ఇతరత్రా పనులు ఏ మేరకు వచ్చిందీ అధికారులను ఆరా తీశారు. దీనిపై జీహెచ్ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ సోమేశ్ కుమార్ బదులిస్తూ ఎన్నికల నిర్వహణ .. వార్డుల విభజనకు సంబంధించి క్షేత్ర స్థాయి పనులు పూర్తయ్యాయని తెలిపారు. కార్యాలయ పనులు మాత్రం మిగిలి ఉన్నాయని చెప్పారు. జూన్ చివరి వారంలో ప్రభుత్వ ఆదేశాలు అందగానే వార్డుల డీలిమిటేషన్ తుది జాబితాను ప్రకటిస్తామన్నారు. వార్డుల సంఖ్య 150 నుంచి 200కు పెరగనున్నాయని చెప్పారు. వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాలు, ఓటర్ల జాబితాలు రూపొందిస్తామన్నారు. బీసీ ఓటర్ల గుర్తింపునకు ఇంటింటి సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అక్టోబర్ 31లోగా ఎట్టి పరిస్థితుల్లోనూ వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా నాగిరెడ్డి ఆదేశించారు. వార్డుల విభజన, రిజర్వేషన్లు పూర్తి కాగానే వివరాలను వెబ్సైట్లో ఉంచాల్సిందిగా సూచిం చారు. ఎన్నికలకుఅవసరమైన సిబ్బంది నియామకం, నిధులు, మౌలిక సదుపాయాలు, ఈవీఎంల సేకరణ, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు, రిటర్నింగ్ అధికారుల నియామకం, తదితర అంశాలపైనా చర్చించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు తమకు 50 వేల మంది సిబ్బంది అవసరమని, దాదాపు రూ.36 కోట్లు ఖర్చు కాగలవని సోమేశ్ కుమార్ వివరించారు. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోందని చెప్పారు. ఈ అం శాల్లో ప్రాథమిక పనులు ఇప్పటికే పూర్తయ్యాయని వివరించారు. కొత్తగా ఏర్పాటు చేసే వార్డులు మొత్తం ఒకే నియోజకవర్గ పరిధిలో ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమీక్ష సమావేశంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎమ్జీ గోపాల్, కమిషనర్ డాక్టర్ బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ నవీన్ మిట్టల్, అడిషనల్ కమిషనర్ (ఎన్నికలు) రామకృష్ణారావు, సీసీపీ ఎస్.దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాసుల గలగలలే..
- బీపీఎస్‌కు ప్రభుత్వం పచ్చజెండా - కార్పొరేషన్‌కు రూ.100కోట్లు ఆదాయం వచ్చే అవకాశం - ఆశల పల్లకీలో పాలకులు విజయవాడ సెంట్రల్ : బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్)కు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విధివిధానాలను విడుదల చేసింది. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు ఈనెల 27 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుదారులు తొలివిడతగా రూ.10వేలు, రెండు నెలల్లో మిగిలిన అపరాధ రుసుం చెల్లించాలి. బీపీఎస్ ద్వారా నగరపాలక సంస్థకు రూ.100 కోట్లపైనే ఆదాయం వస్తుందని అధికారుల అంచనా. భవన నిర్మాణాలను క్రమబద్దీకరిచేందుకు 2007లో నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మునిసిపాల్టీలు, నగరపాలక సంస్థల్లో బీపీఎస్ స్కీమ్ అమలు చేశారు. ఈ పథకం ద్వారా గృహ నిర్మాణ యజమానులు అక్రమాలను సరిదిద్దుకున్నారు. అప్పట్లో బీపీఎస్ కింద నగరపాలక సంస్థకు 15,826 దరఖాస్తులు అందాయి. 11,287 దరఖాస్తులకు సంబంధించిన గృహాలను క్రమబద్దీకరించారు. తద్వారా రూ.68.3 కోట్ల ఆదాయం ఖజానాకు జమ అయింది. కోర్టు కేసులు, డబ్బు సకాలంలో చెల్లించకపోవడం వంటి కారణాలతో 4,539 దరఖాస్తులను తిరస్కరించారు. బీపీఎస్ మళ్లీ తెరపైకి రావడంతో వీరికి చాన్స్ దక్కే అవకాశం ఉంది. దండిగా ఆదాయం నగరంలో భవన నిర్మాణాలకు సంబంధించి టౌన్‌ప్లానింగ్ విభాగం ఏడాదికి 2,500 ప్లాన్లు మంజూరు చేస్తుంది. ఇందులో 200 గజాల లోపు రెండో అంతస్తుకు అనుమతికి నిరాకరిస్తున్నారు. మార్ట్గేజ్ చేసేందుకు ఇష్టపడని గృహ నిర్మాణదారులు ఆమ్యామ్యాలు సమర్పించుకుని అడ్డదారిలో రెండు, మూడు అంతస్తులు ని ర్మాణం చేపడుతున్నారు. టౌన్‌ప్లానింగ్ మం జూరుచేసే 75 శాతం ప్లాన్లలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందన్నది బహిరంగ రహస్యం. 1985 జనవరి ఒకటో తేదీ తరువాత నుంచి 2014 డిసెంబర్ 31 వరకు నిర్మాణమైన భవనా ల క్రమబద్దీకరణకు అవకాశమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈక్రమంలో నగరంలో 12వేల నుంచి 15వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని టౌన్‌ప్లానింగ్ అధికారులు లె క్కలేస్తున్నారు. తద్వారా రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వ అవకాశం ఉంది. స్పెషల్ డ్రైవ్ బీపీఎస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం ద్వారా స్థానిక సంస్థల్లో ఆర్థికలోటును పూడ్చుకోవాలనే యోచనలో సర్కార్ ఉంది. సాధ్యమైనన్ని ఎక్కువ దరఖాస్తులు వచ్చేలా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. భవన నిర్మాణాల్లో అక్రమాలకు క్రమబద్దీకరించుకోకుంటే నీటి, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడంతో పాటు ఆస్తిపన్నును నూరుశాతం పెంచే అవకాశం ఉంది. ఈ విషయమై గృహ నిర్మాణదారుల్లో అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీపీఎస్ పథకం కింద గతంలో అందిన దరఖాస్తుల్ని పరిగణనలోకి తీసుకుంటామని అసిస్టెంట్ సిటీప్లానర్ (ఏసీపీ-2) మధుకుమార్ ‘సాక్షి’కి చెప్పారు. రెనిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్, కమర్షియల్ కేటగిరిల్లో ఈ పథకాన్ని అమలు చేస్తారు. -
పాఠ్యాంశంగా ‘అరుణ’ జీవితం..?
సాక్షి, ముంబై: 42 ఏళ్లపాటు కోమాలో ఉండి ఇటీవలే మృతి చెందిన కేఈఎం ఆస్పత్రి మాజీ నర్సు అరుణా షాన్‌బాగ్ జీవిత కథను పాఠ్యాంశంగా చేర్చే విషయంపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. నాలుగు దశాబ్దాలపాటు మృత్యువుతో పోరాటం, కేఈఎం ఆసుపత్రి నర్సుల నిస్వార్థ సేవ తదితర విషయాలను నేటి తరానికి ఆదర్శంగా చూపించేందుకు పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి తుది నిర్ణయం తీసుకోకున్నా ఇందుకు సంబంధించిన ప్రయత్నాలైతే జరగుతున్నాయి. 2015-16 విద్యా సంవత్సరం పాఠ్యపుస్తకాలు ఇప్పటికే వెలువడటంతో 2016-17లో చేర్చే అవకాశాలున్నాయి. ఈ విషయంపై ‘శిక్షణ మండలి’ అంగీకరిస్తే ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే ఈ సందర్భంగా స్పష్టం చేశారు. -
బడి బస్సులపై నిఘా కట్టుదిట్టం
- ప్రారంభమైన ఆన్లైన్ నమోదు ప్రక్రియ - జూన్ నెలాఖరు వరకు రవాణావెబ్సైట్లో నిక్షిప్తం - నిబంధనలు ఉల్లంఘిస్తే బస్సుల స్వాధీనం సాక్షి, సిటీబ్యూరో: బడి పిల్లల భద్రతపై ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. డ్రైవర్ల అనుభవరాహిత్యం, సామర్థ్యం ఉన్న వాహనాలను ఏర్పాటు చేయడంలో విద్యాసంస్థల నిర్లక్ష్యం..ఫలితంగా తరచు ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించే దిశగా రవాణాశాఖ కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని 10,052 బస్సుల పూర్తి వివరాలను రవాణాశాఖ వెబ్సైట్లో నిక్షిప్తం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఇలా ఆర్టీఏ వెబ్సైట్ లో నమోదయ్యే వివరాల ఆధారంగా బస్సుల నిర్వహణ, పనితీరుపై ఆర్టీఏ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తుంది. మెదక్ జిల్లా మాసాయిపేట దుర్ఘటన నేపథ్యంలో తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల డ్రైవర్లు, విద్యార్థులు, సహాయకుల వివరాలు, ఫొటోలు కూడా ఆర్టీఏ వద్ద నమోదై ఉంటాయి. అంతేకాకుండా విద్యా సంస్థ పేరు, విద్యాశాఖ నుంచి పొందిన అనుమతి కూడా నమోదు చేస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా ఉపరవాణా కమిషనర్ ప్రవీణ్‌రావు ‘సాక్షి’కి చెప్పారు. తమ వద్ద నమోదైన వాహనాలకు మాత్రమే ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి, పిల్లల కోసం వినియోగించేందుకు అనుమతినిస్తున్నామన్నారు. ఆన్లైన్లో నమోదు చేసుకోకుండా తిరిగే బస్సులను స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ నిబంధనలూ తప్పనిసరి... బస్సు పసుపు రంగులో ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు స్పష్టంగా కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. - బస్సు ఇంజిన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఏర్పాటు చేయాలి. - పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందు భాగంలో స్పష్టంగా రాయాలి. - నాలుగు వైపులా గాఢ పసుపు పచ్చని రంగుగల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేటప్పుడు, ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. - ఫుట్‌బోర్డుపై మొదటి మెట్టు 325 ఎం.ఎం.ల ఎత్తుకు మించకుండా ఉండాలి. అన్ని మెట్లు జారకుండా ఉండే లోహంతో అమర్చాలి. - లోపలికి ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకొనేందుకు వీలుగా ముందరి తలుపు మెట్లకు సమాంతరంగా రైలింగ్ ఉండాలి. - బస్సులో ప్రయాణించే విద్యార్థుల పేర్లు, తరగతులు, ఇళ్ల చిరునామాలు, ఎక్కాల్సిన, దిగాల్సిన వివరాలు బస్సులో ఉండాలి. డ్రైవర్ల అర్హతలు ... - డైవర్‌కు బస్సు డ్రైవింగ్‌లో కనీసం 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. - వయస్సు 60 ఏళ్లకు మించకూడదు. పాఠశాల యాజమాన్యం ప్రతి డ్రైవర్ ఆరోగ్య పట్టికను విధిగా నిర్వహించాలి. - యాజమాన్యం తమ సొంత ఖర్చుతో డ్రైవర్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తపోటు, షుగరు, కంటి పరీక్షలు నిర్వహించాలి. -
కానరాని ‘స్వచ్ఛ'
- రోడ్లపై కుప్పలుగా సీజ్ చేసిన వాహనాలు - దారి లేక ఇబ్బంది పడుతున్న జనం - పట్టించుకోని కూకట్పల్లి పోలీసులు కూకట్పల్లి: ‘స్వచ్ఛ హైదరాబాద్’ అంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం... ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకం నిర్వహించింది. అయితే, కూకట్పల్లి పోలీసులు మాత్రం తమ స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను గాలికొదిలేసి.. కేవలం జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని దత్తత తీసుకొని పారిశుద్ధ్య పనులు చేపట్టడం విమర్శలకు దారితీస్తోంది. పోలీసులు సీజ్ చేసిన వాహనాలను స్టేషన్‌కు నాలుగువైపులా రోడ్లపక్కన కుప్పలు కుప్పలుగా పడేసి ఈ మార్గంలో వెళ్లేవారికి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. స్టేషన్‌కు ఒక వైపు ప్రభుత్వ పాఠశాల, ఎంఈఓ కార్యాలయం, మరోవైపు జీహెచ్ఎంసీ కూకట్పల్లి సర్కిల్ వార్డుకార్యాలయం, ఈసేవ భవనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేవారు రోడ్డుపై వెళ్లేందుకు దారిలేక ఇబ్బంది పడతున్నారు. అలాగే, పోలీసుస్టేషన్ వద్ద రోడ్లపై పార్క్ చేసిన వాహనాల కారణంగా తమకు ఇబ్బందిగా ఉందని స్థానిక వ్యాపారులు, గ్రామంలోకి వెళ్లేందుకు దారిలేదని కూకట్పల్లి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టేషన్ వల్ల తమకు ఇబ్బందిగా ఉందని, వెంటనే ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించాలని తాజాగా కూకట్పల్లి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు స్వచ్ఛ హైదరాబాద్ ప్యాట్రన్‌గా వచ్చిన ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌కు వినతిపత్రం ఇవ్వడం గమనార్హం. -
మేమొచ్చాక నేరాలు తగ్గాయి..
సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడి - ప్రభుత్వం ఏర్పాటయ్యి 6 నెలలు పూర్తయిన సందర్భంగా చర్చా గోష్టి సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు తగ్గాయని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొన్నారు. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పాటయ్యి ఆరు నెలలు పూర్తయిన సందర్భంగా మంత్రాలయలో విలేకరులతో బుధవారం చర్చా గోష్టి నిర్వహించారు. ఫడ్నవీస్ మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరాలు తగ్గాయని, నేరస్థులకు శిక్ష పడడం పెరిగిందని అన్నారు. ఈ విషయాన్ని గణాంకాలే చెబుతున్నాయని ఆయన తెలిపారు. తమ ప్రజాస్వామ్య కూటమి అధికారంలో ఎనిమిది శాతం మాత్రమే శిక్షలు పడేవన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌పై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోందని, దీనిపై ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ జలవనరుల కుంభకోణం గురించిన మూలాల వరకు వెళ్తామన్న ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాల్ సెంట ర్లలో మహిళలు రాత్రి పూట కూడా డ్యూటీ చేస్తున్నారని, ఇతర కార్ఖానాల్లో కూడా మహిళలకు రాత్రి డ్యూటీలు నిర్వహించేందుకు అవకాశం కల్పించాలనే విషయంపై అవసరమైన చట్టాన్ని క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. -
వైద్యం.. పోతోంది !
- అందని సర్కార్ వైద్యం - చిన్నపాటి రోగాలకు సైతం అందుబాటులో లేని మందులు - పట్టించుకోని ప్రభుత్వం - అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్న రోగులు సాక్షి, బెంగళూరు : రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను అందించడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఫలితంగా విద్య ఏనాడో వ్యాపారంగా మారిపోయింది. ప్రస్తుతం వైద్యం కూడా అదే దారిలో పయనిస్తోంది. పేదల పాలిట సంజీవినిగా ఉన్న సర్కార్ ఆస్పత్రులు కనీస వైద్యం అందించడంలో విఫలమవుతున్నాయి. సర్జరీలు పక్కన పెడితే కనీసం చిన్నపాటి జబ్బులకు సైతం ప్రభుత్వాస్పత్రుల్లో చికిత్సలు అందడం లేదు. దీంతో ‘సర్కారీ ఆస్పత్రిలో వైద్యం, యమపురికి ప్రవేశ ద్వారం’ అనే భావన ప్రజల్లో నాటుకుపోయింది. దీంతో జబ్బు నయం చేయించుకునేందుకు రోగులు అప్పు చేసి ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళుతున్నారు. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో మరింత జఠిలంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కొరత, నైపుణ్యం కొరవడిన మానవ వనరుల కారణంగా అక్కడ చికిత్స పొందేందుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నట్లు అధ్యాయనాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో 2,366 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8,891 ఉపకేంద్రాలు, 190 సముదాయ ఆరోగ్య కేంద్రాలు, 86 ఆయుర్వేద, యునానీతో పాటు 30 జిల్లా ఆస్పత్రులు ఉన్నాయి. అయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ జబ్బులకు అవసరమైన పారాసిట్మాల్ వంటి టాబ్లెట్లు కూడా అందుబాటులో ఉండడం లేదు. చిన్నచిన్న గాయాలకు అవసరమైన డ్రసింగ్ క్లాత్ కూడా ‘బయట కొనుక్కురా’ అన్న డిమాండ్ వైద్యుల నుంచి వినిపిస్తోంది. దీంతో అప్పులు చేసి మరీ పేద రోగులు ప్రైైవేటు ఆస్పత్రుల వైపు మొగ్గు చూపిస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి ప్రస్తుతం 1,452 మహిళాశిశు సంబంధ (గైనిక్, పిడియాట్రిక్) వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో స్త్రీ, శిశు సంబంధ వ్యాధుల చికిత్స కోసం గ్రామీణులు ఖర్చు ఎక్కువైనా విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ గణాంకాల ప్ర కారం 2010-11 ఏడాదిలో 13 లక్షల మంది ప్రజలు సర్కారు ఆసుపత్రుల్లో చికిత్స పొందగా అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినవారి సంఖ్య 1.20 కోట్లుగా ఉంది. 2011-12 ఏడాదిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 22.36 లక్షల మంది వైద్యం చేయించుకోగా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లినవారి సం ఖ్య 1.5 కోట్లుగా గణాంకాలు పేర్కొంటున్నాయి. 2012-13 ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందిన వారి సంఖ్య వరుసగా 25 లక్షలు, 1.73 కోట్లుగా ఉంది. ఇక 2013-14లో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లిన రోగుల సంఖ్య 29.35 లక్షలు కాగా, అదే సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో 1.96 కోట్ల మంది చికిత్స పొందారు. 2014-15లో ఈ సంఖ్య వరుసగా 35 లక్షలు(ప్రభుత్వ), 2.60 కోట్లు(ప్రైవేట్)గా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాలు చూసిన తర్వాత వైద్య రంగం నుంచి ప్రభుత్వం తప్పుకుంటున్నట్లు స్పష్టమవుతోందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస మౌలిక సదుపాయాలను, అవసరమైన మందులను అందుబాటులోకి తెస్తుందేమో వేచి చూడాలి. -
108 ఉద్యోగుల రాస్తారోకో
హన్మకొండ చౌరస్తా: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 108 కాంట్రాక్ట్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తెలంగాణ యునెటైడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు యాదానాయక్ డిమాండ్ చేశారు. బాల సముద్రంలోని ఏకశిలపార్కు వద్ద 108 ఉద్యోగులు మంగళ వారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా యాదానాయక్ మాట్లాడారు. పదేళ్లుగా అత్యవసర అంబులెన్స్ సర్వీసుల్లో పని చేస్తున్నా.. తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గతంలో రెండుసార్లు చేసిన సమ్మె సందర్భంగా జరిగిన ఒప్పందాలను విస్మరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే 108 సర్వీసులను నిర్వహించాలని, తొలగించిన కార్మికులను తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీహెచ్. రమేష్, పి. వెంకన్న, ఏఎస్రావు, ప్రవీణ్, ఆర్ కే కొమురయ్య, బాలాజీ, సాంబయ్య, రాజేందర్, ప్రేమ్ సాగర్, నాగరాజు, స్వాతి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
భవన కార్మికులకు భరోసా
పరిహారాలు రెట్టింపు చేసిన ప్రభుత్వం ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు శాశ్వత అంగవైకల్యానికి రూ.3 లక్షలు హైదరాబాద్: గుర్తింపు పొందిన భవన, పరిశ్రమల కార్మికులపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు వర్తించే పథకాలకు పరిహారాన్ని దాదాపు రెట్టింపు చేసింది. పెళ్లి నుంచి అంత్యక్రియల వరకు అన్ని అవసరాల్లోనూ ఆదుకోవాలని నిర్ణయం తీసుకుంది. కార్మిక శాఖ కార్యదర్శి హరిప్రీత్‌సింగ్ సోమవారం ఈ మేరకు పలు ఉత్తర్వులు జారీ చేశారు. అవి 2015 మే 1వ తేదీ నుంచే వర్తిస్తాయని పేర్కొన్నారు. వివరాలివీ... ప్రమాదంలో చనిపోతే: కార్మికుని కుటుంబీకులకు ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 లక్షలిచ్చేవారు. దాన్నిప్పుడు రూ.5 లక్షలకు పెంచారు. దహన సంస్కారానికి రూ.20 వేలిస్తారు. పెళ్లికానుక: 18 ఏళ్లు నిండిన అవివాహితలకు పెళ్లి కానుకగా రూ.10 వేలు. కార్మికురాలి కూతుళ్ల పెళ్లిళ్లకు కూడా (ఇద్దరికి) పదేసి వేలిస్తారు. ప్రసవానికి: రూ.20 వేలు (రెండు ప్రసవాల వరకు) ఇస్తారు. ఇది కార్మికుడి భార్యకూ వర్తిస్తుంది. సహజ మరణానికి: కుటుంబ సభ్యులకు రూ.60 వేలు ఇస్తారు. దహన సంస్కారానికి మరో రూ.20 వేలిస్తారు. శాశ్వత అంగవైకల్యానికి: జీవనోపాధి కోసం ఉమ్మడి రాష్ట్రంలో రూ.2 లక్షలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.3 లక్షలకు పెంచారు. పాక్షిక వైకల్యానికి: జీవనోపాధికి నెలకు రూ.3 వేలు ఇస్తారు. గుండెపోటు, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ బాధితులకూ ఇది వర్తిస్తుంది. -
కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
- కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం డిమాండ్ - సంఘాల మధ్య ప్రభుత్వం చీలికలు తెస్తోందని ఆరోపణ - సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు - సవరించిన వేతనాలు చెల్లించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడి షోలాపూర్: తమ సమస్యల పరిష్యారం కోసం మరమగ్గాల కార్మికులు పక్షం రోజులుగా చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం ఆరోపించారు. సమస్య పరిష్యారం కోసం దృష్టి సారించాల్సిన పాలకులు కార్మిక సంఘాలను చీల్చి ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్న చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఎం.ఐ.డి.సి.లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆయన.. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా కనీస వేతనాలు అమలు జరిగే వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. కార్మికులతో పాటే ఉంటానని, కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. మరమగ్గాల కార్మికులకు సవరించిన వేతనాలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేది నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో పట్టణంలో, ఎం.ఐ.డి.సి., గాంధీ నగర్, చించోలి ప్రాంతాల్లోని సంచాల చప్పుడు మూగబోయింది. మరమగ్గాల కార్మికుల కోసం ఎం.ఎన్.ఎస్, సి.ఐ.టి.యు., ఎం.ఐ.ఎం, కామగార్ సేన వంటి 8 సంఘటనలు పనిచేస్తున్నాయి. సంఘటనలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం, విష్ణు కారంపూరి కార్మిక సంయుక్త కృతి సమితి స్థాపించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎం.ఎన్.ఎస్ సంఘటన ద్వారా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. అయితే కార్మిక మంత్రి విజయ్ దేశ్‌ముఖ్ వేతనాలు కొంత పెంచి ఇస్తామనటంతో ఎం.ఎన్.ఎస్. కార్మిక సంఘటన సమ్మె నుంచి నిష్ర్కమించింది. దీనిపై తీవ్రంగా మండిపడిన నర్సయ్య.. సమస్య పరిష్కరించడం పోయి కార్మిక సంఘటనల్లో మంత్రి చీలికలు తెస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ శాంతియుంతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం అమానుషమన్నారు. 20వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరమగ్గాల కార్మికులతో ముంబైలో నిర్వహించే ఆందోళనకు ప్రభుత్వం దిగి రావల్సిందేనన్నారు. పోలీసుల చర్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇది కూడా సదరు మంత్రి పనే అయి ఉంటుందని ఆరోపించారు. ఆందోళనలకు అడ్డుతగిలితే మం త్రిని పట్టణంలో సంచరివ్వబోమని హెచ్చరిం చారు. కార్యక్రమంలో పాల్గొన్న కృతి సమితి పదాధికారులు, కార్మికులు.. సవరించిన కనీస వేతనాలు చెల్లించేంతవరకుఆందోళన విరమించేది లేదని ప్రతిజ్ఞ చేశారు. -
ఆగని రవాణా
- దర్జాగా ఇసుక తరలింపు - ప్రభుత్వ పనుల పేరిట అనుమతి - ప్రరువేటు పనులకు సరఫరా - ఇసుక మాఫియా కొత్త దారి - అధికారుల తీరు ‘మామూలే’ బాన్సువాడ : ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. మంజీరా తీర ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్య లో లారీలు, టిప్పర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం వరకు పట్టాభూముల నుంచి ఇసుక రవాణా సాగింది. ఈ విషయమై దుమారం రేగడంతో ఇసుక తరలింపును నిలిపివేసిన విషయం విదితమే. దీంతో ఇసుక తరలింపునకు కాంట్రాక్టర్లు కొత్త వ్యూహం పన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ కు ఇసుక కావాలని అనుమతి తీసుకుని హైదరాబాద్కుతరలిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ వాహనాలు,టిప్పర్లపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే ఫ్లె క్సీ లు, కరపత్రాలు పెట్టుకొని ఇసుకను తరలి స్తున్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ సమీపంలో ఉన్న మంజీరా నదీ తీరం నుంచి ఇసుకను జేసీబీల ద్వారా తోడుతున్నారు. నిజానికి నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు దశలవారీగా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో వెయ్యి లారీల ఇసుకను తరలించిన కాంట్రాక్టర్, ప్రస్తు తం వారంలో మూడుసార్లు తహశీల్దార్ ద్వారా వేబిల్లు పొంది, యథేచ్ఛగా ప్రరుువేటు పనుల కు తరలిస్తున్నారు. ఆయూ గ్రామాలలో వీఆర్ఓ లు ఇసుక ట్రిప్పులను నమోదు చేయాల్సి ఉండగా, వారు అమ్యామ్యాలకు లొంగి, కాందార్ల ను క్వారీ పాయింట్ల వద్ద ఉంచి, వారి చేత లారీల నంబర్లను నమోదు చేరుుస్తున్నారనే ఆ రోపణలు వినిపిస్తున్నారుు. వారు కొన్ని లారీల నంబర్లు నమోదు చేసి, మరి కొన్నింటిని వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి లారీలను బా న్సువాడ శివారు వరకు తీసుకెళ్లి, లారీకు ఉన్న ఫ్లెక్సీని తొలగించి నేరుగా హైదరాబాద్‌కు పం పుతున్నట్టు సమాచారం. కొన్ని రహస్య ప్రాం తాలలోనూ ఇసుకను డంప్ చేసి, టిప్పర్ల ద్వారా భవన నిర్మాణదారులకు విచ్చలవిడిగా విక్రయించుకొంటున్నారు. కొత్త విధానంతోనూ ప్రయోజనం శూన్యం అక్రమార్కులపై కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక రవాణాలో నెల రోజుల క్రితం ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా సైతం ఎ లాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మంజీరా తీర ప్రాంతాలైన బాన్సువాడ మండలం చింతల్‌నాగారం, బీర్కూర్ మండలం దామరంచ, కిష్టా పూర్, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మం డలం హంగర్గ, పొతంగల్, బిచ్కుంద మం డలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్గాం, శెట్లూర్, పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీరా నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లలకు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క కోటగిరి మండలం పొతంగల్ నుంచే కొందరు అక్రమార్కులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తూ, వర్నీలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్‌కు రూ. 2500, టిప్పర్‌కు రూ. 8వేల వరకు వసూలు చేస్తున్నా రు. ప్రభుత్వ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోంది. -
భూతం
నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూసేకరణ - ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం - ప్రతిఘటించి తీరతామంటున్న రైతులు,కౌలు రైతులు, కూలీలు, విపక్షాలు - నేడు ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్కే పిలుపు - అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి మంగళగిరి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాలపై భూ భూతం విరుచుకుపడుతోంది. ప్రభుత్వం ఆయా గ్రామాల్లో శుక్రవారం నుంచి భూసేకరణ చట్టం అమలుల్లోకి తెచ్చింది. రాజధాని భూ సమీకరణను వ్యతిరేకించిన రైతులపై కక్షకట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల సహా విపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. భూసేకరణకు ఒప్పుకోబోమని అవసరమైతే ఆత్మహత్యలకైనా సిద్ధమని మండిపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యక్షపోరాటానికి నడుం బిగించారు. దీనిపై ఆందోళన చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగేవరకు అండగా వుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, కూలీలు, కౌలురైతులతో పాటు రైతు, కార్మిక సంఘాలు విపక్షాలు తరలిరావాలని ఆర్కే పిలుపునిచ్చారు. కలెక్టర్‌కు సర్వాధికారాలు నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభం కానుంది. భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 33,800 ఎకరాలను సమీకరించింది. దీనికితోడు రాజధాని నిర్మాణానికి అదనంగా భూములు కావాలని పట్టణాభివృద్ధి సంస్థ రెవెన్యూ శాఖను కోరడంతో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక మంది రైతులు నష్టపరిహారం పెంచాలని, రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు సాగుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు భూ సేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడంతోపాటు కోర్టులో కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు భూ సేకరణ చట్టం-2013 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇచ్చింది. శుక్రవారం నుంచి భూమిని సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, యర్రపాలెం, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని వెయ్యి ఎకరాల్లోపు భూములను భూ సేకరణ విధానంలో సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను సీఆర్డిఏ కమిషనర్ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించనున్నారు. మూడు వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూములను గుర్తించినప్పటికీ గ్రామ కంఠాలు, డొంకలు, దారులు పోనూ రైతుల నుంచి నికరంగా వెయ్యి ఎకరాలను సేకరించే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం సాయంత్రం ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తీవ్రస్థాయిలో వ్యతిరేకత ... రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని రాజధాని గ్రామాల్లోని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. భూ సమీకరణ విధానంలో తీసుకున్న భూములకు ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిన ప్రభుత్వం భూ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టి మరింత నష్టాన్ని కలిగించనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
అవే అవస్థలు
- కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె - ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజూ కొనసాగింది. సోమవారం యథావిధిగా నగరవాసులు ఇబ్బందులు - ఎదుర్కొన్నారు. బస్సులు లేక... - ప్రైవేట్ వాహనాలు దొరక్క నానాపాట్లు పడ్డారు. ప్రయాణికుల అవసరాలను ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు దోపిడీ పర్వం కొనసాగించారు. అర్ధనగ్న ప్రదర్శనలతోఆర్టీసీ కార్మికులు అన్ని డిపోల ఎదుట నిరసన తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో : ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరో రోజు సోమవారం కూడా ఉధృతంగా కొనసాగింది. ఒకవైపు ప్రభుత్వంతో కార్మిక సంఘాల చర్చలు, మరోవైపు కార్మికుల ఆందోళనలు, ప్రదర్శనలు, ధర్నాలు, అధికారులకు వినతి పత్రాలు అందజేయడం వంటి కార్యకలాపాలు కొనసాగించారు. మరోవైపు ప్రైవేట్ డ్రైవర్లు, కండక్టర్ల సహాయంతో ఆర్టీసీ అధికారులు గ్రేటర్లో 671 బస్సులు నడిపారు. అయినా ప్రయాణికులకు పాట్లు తప్పలేదు. సోమవారం పనిదినం కావడంతో విధులకు వెళ్లవలసిన ఉద్యోగులు, వివిధ రంగాలకు చెందిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లు కిటకిటలాడాయి. 121 సర్వీసులతో పాటు మరో ఎనిమిది ఎంఎంటీఎస్ సర్వీసులను అధికారులు అదన ంగా నడిపారు. దూరప్రాంతాలకు రాకపోకలు సాగించే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వేషన్ బోగీలు, జనరల్ బోగీలు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు ఆటోవాలాలు, ప్రైవేట్ ఆపరేటర్ల యథావిధిగా దోపిడీ పర్వాన్ని కొనసాగించారు. దూరప్రాంతాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు, కార్లు, వివిధ రకాల రవాణా వాహనాల యజమానులు రెట్టింపు చార్జీలు వసూలు చేశారు. ఇక ఆటోడ్రైవర్లు ప్రయాణికుల జేబులు లూటీ చేశారు. మరోవైపు తార్నాకలో ఒక ఆర్టీసీ అద్దె బస్సు ఢీ కొనడంతో స్నేహ (19) అనే విద్యార్ధిని దుర్మరణం పాలైంది. ఎక్కువ బస్సులు నడుపాలనే అధికారుల పట్టుదల, ఎక్కువ ట్రిప్పులు తిప్పేందుకు డ్రైవర్లపై పెరుగుతున్న ఒత్తిడి రోడ్డు ప్రమాదాలకు దారితీస్తోందని విమర్శలు వచ్చాయి. అన్ని డిపోల్లో సమ్మె ఉధృతం... నగరంలోని 28 డిపోలు, బస్స్టేషన్లలో కార్మికుల సమ్మె కొనసాగింది. కార్మికులంతా విధులను బహిష్కరించి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బర్కత్‌పురా, కాచిగూడ, కంటోన్మెంట్, పికెట్, హయత్‌నగర్, మియాపూర్, రాణీగంజ్, దిల్‌షుఖ్‌నగర్, ఉప్పల్, బండ్లగూడ, తదితర డిపోలలో ధర్నాలు, ప్రదర్శనలు, బైక్ ర్యాలీలు చేపట్టారు. అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసన వ్యక్తం చేశారు. మహిళా కండక్టర్లు బతుకమ్మ ఆడారు. పలు డిపోల నుంచి కార్మికులంతా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌కు ప్రదర్శనగా తరలి వెళ్లారు. పలు కార్మిక సంఘాలు ఎంజీబీఎస్‌లో సభ నిర్వహించి ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపాయి. 43 శాతం ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని పేర్కొన్నారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు తెలిపారు. మరోవైపు వివిధ ప్రాంతాల్లో కార్మిక సంఘాల నాయకులు ఎమ్మార్వోలను, కార్మికశాఖ అధికారులను కలిసి వినతి పత్రాలు అందజేశారు. ఎంసెట్‌కు ఆర్టీఏ సన్నద్ధం... కార్మికుల సమ్మె కొనసాగితే చేపట్టవలసిన చర్యలపై సోమవారం సంయుక్త రవాణా కమిషనర్ రఘునాథ్ నేతృత్వంలో ఆర్టీసీ, ఆర్టీఏ ఉన్నతాధికారులు మరోసారి సమావేశమయ్యారు. సమ్మె దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యార్ధుల కోసం 1000 బస్సులను నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థలు, స్కూళ్లు, కాలేజీలు, ఆర్టీసీ అద్దె బస్సులు కలిపి ఇప్పటి వరకు 450పైగా సిద్ధం చేసినట్లు జేటీసీ చెప్పారు. మరో 2 రోజుల గడువు ఉన్నందువల్ల బస్సుల సేకరణకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని పేర్కొన్నారు. -
తెలుగుతమ్ముళ్లు.. ఇసుకాసురులు
- యథేచ్ఛగా తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా - అధికారులు అడ్డుకుంటే బదిలీ వేటు హెచ్చరికలు - ప్రభుత్వ లక్ష్యం 16.20 లక్షల క్యూబిక్ మీటర్ల అమ్మకం - అమ్మింది 2.7లక్షల క్యూబిక్ మీటర్లే - మిగిలిందంతా తమ్ముళ్ల జేబుల్లోకి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఇసుక స్మగ్లింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పేరుకు ఇసుక రీచ్‌ల బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మహిళాసంఘాలు అమ్మినట్లు చూపిస్తున్న ఇసుక పదిహేను శాతానికి మించిలేదు. పచ్చచొక్కాల నేతలే 85 శాతం ఇసుకను అమ్మేసుకుంటూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. అయినా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సాహసించడంలేదు. కాదు కూడదని మాట్లాడితే సెలవుపెట్టి వెళ్లిపోమంటూ బెదిరిస్తున్నారు. ‘తమ్ముళ్లు’ ఇచ్చిన కాకిలెక్కలనే అధికారులు ‘ఇసుక అమ్మకాల లెక్కలు..’ అంటూ చూపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు: జిల్లావ్యాప్తంగా 31 మం డలాల పరిధిలో 58 ఇసుక రీచ్‌లను గుర్తించారు. వీటి ద్వారా 16,19,878 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మాలన్నది లక్ష్యం. ఇప్పటివరకూ కేవలం 2,70,271 క్యూబిక్ మీటర్ల ఇసుక మా త్రమే అమ్మారు. ప్రభుత్వానికి వచ్చిన రాబడి .*8.44 కోట్లు మాత్రమే. గణాం కాల ప్రకారం ప్రభుత్వంపరంగా 15 శాతం మాత్రమే ఇసుక అమ్మకాలు జరి గినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు రెట్ల ఇసుకను అధికారపార్టీ నేతలు అమ్మేసుకుని కోట్లు దండుకున్నారు. నేతలకు భయపడి అధికారులు ఇసుక అధికంగా,అందుబాటులో ఉన్న పలు రీచ్‌లలో ప్రభుత్వ అమ్మకాలను దాదాపు నిలిపి వేశారు. ఏర్పేడు మండలం ముసలిపేడు రీచ్‌లో లక్షా ఒక్కవేయి క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మాల్సి ఉండగా, 11 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే ప్రభుత్వం అమ్మింది. కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద రీచ్‌లో లక్షా 71 వేల క్యూబి క్ మీటర్లకు గాను, 16వేలు, పెద్దతిప్ప సముద్రం రాపూరివాండ్లపల్లె రీచ్‌లో లక్షా 39 వేల క్యూబిక్ మీటర్లకు గానూ, 738, కలికిరి పరపట్లలో 56,444కు గానూ, 4 వేలు, అడ్డంవారిపల్లె రీచ్‌లో 55,044కుగానూ 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే అమ్మినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. ఇక తమ్ము ళ్ల దెబ్బ తాళలేక ఇసుక అధికంగా ఉన్న తొట్టంబేడు మండలం పెద్దకనపర్తి, విరూపాక్షపురం, నగరి సత్రవాడ, చిత్తూరు అనగల్లు, ముత్తుకూరు, జీడీ నెల్లూరులోని నందనూరు,పెద్దపంజాణి మండలంలోని శంకరరాయలుపేట ఇసుక రీచ్‌లను సైతం ఏకంగా వారికే వదిలేశారు. ఈ రీచ్‌లలో దేశం నేతలే ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. నాగలాపురం మండలం సురుటపల్లి, శ్రీకాళహస్తి మండలంలోని రామలింగాపురం, పూతలపట్టు మండలం ముత్తిరేవులు, నిమ్మనపల్లెలో మాత్రం నూరు శాతం అమ్మకాలు పూర్తిచేసి రీచ్ లను నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నా, మరోవైపు అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. డీఆర్డీఏ, మైనింగ్, రవాణా, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ తదితర విభాగాలకు అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలు అప్పగించినా ‘తమ్ముళ్ల’ బెదిరింపులతో మౌనంగా ఉంటున్నారు. కాదూ కూడదని ఎవరైనా అడ్డుకుంటే బదిలీ చేసుకుని వెళ్లండి అంటూ తమ్ముళ్లు హెచ్చరికలు చేస్తున్నారు. -
బదిలీలు ఎప్పుడో..
- ఉద్యోగుల్లో టెన్షన్.. టెన్షన్ - ఇంకా ప్రకటించని ప్రభుత్వం - నెల రోజుల్లో పూర్తరుుతే మేలు - విద్యా సంవత్సరం ప్రారంభమైతే కష్టం.. - డిప్యూటేషన్లపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు అవసరం అనుకున్న చోటకు అధికారుల బదిలీలు జరుగుతూనే ఉంటారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు. సాధారణ బదిలీల కోసం సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఎప్పుడిస్తుందా అని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా బదిలీలు నిలిచిపోరుున విషయం విదితమే. ఏప్రిల్ ఆఖరు లేదా మే నెల మొదట్లో సాధారణ బదిలీ విషయమై ప్రభుత్వం ప్రకటన చేయడం ఆనవారుతీ. ఈ తతంగమంతా నెల రోజుల్లో పూర్తరుుతే ఉద్యోగులు వారి పిల్లలను బదిలీ అరుున చోట విద్యా సంస్థల్లో చేర్చుకోవడానికి, ఇతర ప్రత్యామ్నాయూలు చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. హన్మకొండ అర్బన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సివిల్ సర్వీసు అధికారులు మినహా ఇతర స్థాయి అధికారుల పంపకాలు పూర్తి కాలేదు. దీనికి ప్రభుత్వం గడువు పొడిగించడంతో లెక్కలు ఇప్పట్లో తేలేట్టు లేవు. ఒకవేళ ఇదే కారణంతో సాధారణ బదిలీలపై ప్రభుత్వం నిషేధం ఎత్తివేయకుండా ఉంటుందా అన్న ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే.. సాధారణ బదిలీల విషయంలో ప్రభుత్వం నిషేధం ఉన్నా అత్యవసరాలు.. పరిపాలనా సౌల భ్యం పేరుతో సర్దుబాట్లకు అవకాశం కల్పించింది. దీంతో అవసరం అనుకున్న చోటకు అధికారుల బది లీలు జరుగుతూనే ఉన్నారుు. ఎటొచ్చీ ఉద్యోగులు బదిలీ కావాలని కోరుకుంటే మాత్రం కుదరదు.. ఇతర సమస్యలు చెప్పి బదిలీ కావడానికి చట్టం ఒప్పుకోదు. దీంతో వందల మంది ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరికే ‘సౌలభ్యం’ బదిలీలపై నిషేధం ఉన్నప్పుడు ఉన్నతాధికారులు పరిపాలనా సౌలభ్యం పేరుతో చేసే బదిలీల్లో కొం దరు ఉద్యోగులకు మాత్రమే న్యాయం జరుగుతోం ది. మారుమూల, ప్రాధాన్యం లేని ప్రాంతంలో పని చేసేవారికి బయటపడే మార్గం ఉండటం లేదు. జిల్లాలో ఇదే విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్ఐ పోస్టుల కోసం.. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించి ఆర్ఐ పోస్టు విషయంలో తీవ్ర పోటీ నెలకొంది. నిబంధనల ప్రకారం సీనియర్ అసిస్టెంట్ నుంచి డీటీగా పదోన్నతి పొందడానికి సదరు ఉద్యోగి రెండేళ్ల ఆర్ఐ పీరియడ్ పూర్తి చేసి ఉండాలి. అయితే జిల్లాలోని కొన్ని మండలాల్లో ఆర్ఐ పోస్టుల్లో ఉన్నవారు ఏళ్ల తరబడి పాతుకుపోయి ఉన్నారు. మరికొందరు మండలం మారినా ఐదేళ్లకుపైగా ఆర్ఐలుగా కొనసాగుతున్న వారున్నారు. ఉదాహరణకు.. ఆర్ఐ పీరియడ్ పూర్తయిన వారు.. దీర్ఘకాలంగా కొనసాగుతున్న వారిని మండలాలవారీగా పరిశీలిస్తే.. వరంగల్, పర్వతగిరి, జఫర్‌గఢ్, మంగపేట, పరకాల, రేగొండ, గణపురం, భూపాలపల్లి, తాడ్వాయి, ములుగు, వెంకటాపుర్, నర్సంపేట, దుగ్గొండి, గూడూరు, కొత్తగూడ, చెన్నారావుపేట, ఖానాపురం, మహబూబాబాద్ డివిజన్లో దాదాపు మొత్తం మండలాలు, జనగామ, లింగాలగణపురం, రఘునాథపల్లి, చేర్యాల, నర్మెట, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో ఉన్న కొందరు ఏఆర్‌ఐలు, కొందరు ఎమ్మారైలు ఈ జాబితాలో ఉన్నారు. సాధారణ బదిలీలు లేకపోవడంతో అధికారులు వీరిని కదిలించడంలేదు. అయితే 2013 సాధారణ బదిలీల సమయంలో చాలామంది పైరవీల వల్ల ఆర్ఐ పోస్టుల్లో కొనసాగుతున్నారనే ఆరోపణలున్నారు. ప్రస్తుతం రెవెన్యూ శాఖలో దీనిపై తీవ్ర చర్చ నడుస్తోంది. బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సమయంలో స్థానిక నేతలతో ఉన్నతాధికారులకు చెప్పించడం, లేదా అర్డీఓలతో సిఫార్సు లేఖలు ఇవ్వడం షరా మామూలుగా మారుతోంది. వెరసి నిజాయితీగా ఆర్ఐ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం రావడం లేదు. పదోన్నతుల విషయానికి వచ్చేసరికి తప్పనిసరి కావడంతో నిబంధనలు పక్కన పెట్టి వారిని ఆర్ఐ పోస్టుకు పంపాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీఆర్వోలదీ అదే తీరు.. ఇక వీఆర్వోల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హ న్మకొండ లాంటి మండలాలకు 2009లో వచ్చిన వీ ఆర్వోలు ఇప్పటివరకు కదల్లేదు. ఇంకా చెప్పాలం టే కాస్త ‘రెవెన్యూ’ ఉన్న గ్రామాల్లో వీఆర్వోలు కదలిక లేకుండా ఉన్నారు. ఏళ్ల తరబడి ఒకేచోట పని చే య డం వల్ల కూడా కొన్నిచోట్ల వీఆర్వోల పరిస్థితి ఉన్నతాధికారులకు ఇబ్బందిగా మారుతోంది. ఇలాంటి వారిలోనే కొందరు అక్రమ వసూళ్లు, ఏసీబీ దాడు లు, భూముల అన్యాక్రాంతం, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారి జాబితాలో చేరుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మారుమూల ప్రాంతాల్లో పనిచేసే వారికి మంచి ప్రదేశాలకు వచ్చే అవకాశం తగ్గుతుంది కూడా. త్వరలో ఉత్తర్వులు బదిలీలపై విధి విధానాలను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసినట్లు సమాచారం. ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ నెలాఖరు వరకు సాధారణ బది లీలకు అవకాశాలు ఉంటాయని సమాచారం. -
మండుటెండలో ఉపాధి
- సుర్రుమంటున్న ఎండలో కూలీల విలవిల - పని స్థలాల్లో కానరాని ప్రత్యేక వసతులు - పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో బెంబేలు - షామియానాలు, హెల్త్కిట్లు మాయం - ఏప్రిల్ బకాయిలు చెల్లించని ప్రభుత్వం ముకరంపుర : పొట్టకూటి కోసం మండుటెండల్లో ఉపాధిహామీ పనులకు వెళ్తున్న కూలీలకు ఎండవేడిమి శాపంలా మారింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కూలీలు విలవిల్లాడుతుంటే కనీస సౌకర్యాలు కల్పించాల్సిన యంత్రాంగం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోంది. ఇప్పటికే జిల్లాలో గరిష్ట ఉష్ణోగత్రలు 43 డిగ్రీలకు చేరగా.. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశముందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తీవ్రమైన ఎండవేడిమితో వడదెబ్బలు తగిలే ప్రమాదాలు పొంచి ఉన్నా అధికార యంత్రాంగం అప్రమత్తం కావడం లేదు. వేసవిలో ఉపాధి పనులు జరిగే చోట ప్రత్యేక వసతుల కల్పించాల్సి ఉండగా అధికార యంత్రాంగం కేవలం సమీక్ష సమావేశాలకే పరిమితమవుతోంది. జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద 6,08,934 జాబ్ కార్డులు ఉన్నాయి. మొత్తం 25,154 శ్రమశక్తి సంఘాల కింద 4,54,713 మంది నమోదై ఉన్నారు. ప్రస్తుతం ప్రతిరోజు 1,20,000 కూలీలు పనులకు వెళ్తున్నారు. 57 మండలాల్లోని 1050 గ్రామాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. ఎండకు చెరువు మట్టి గట్టిగా ఉండడంతో మిషన్ కాకతీయలో ఎంపిక కాని చెరువులలో ఉపాధిహామీ కింద పూడికతీత పనులు కూడా చేపడుతున్నారు. ఇందులో 635 చెరువులను ఎంపిక చేసుకోగా ప్రస్తుతం 135 చెరువులలో పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఏటా జనవరి నుంచి జూన్ వరకు ఉపాధి పనులు కొనసాగుతాయి. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎక్కువ మంది ఉపాధి పనులకు హాజరవుతారు. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో ఉపాధిపై దృష్టి సారిస్తున్నారు. పనులలో భాగంగా ఉదయం 7 గంటలకే హాజరవుతున్న కూలీలకు కొలతల ప్రామాణికంగా కేటాయించిన పనులు దాదాపు మధ్యాహ్నం 2గంటల వరకు పూర్తి చేస్తున్నారు. ఉదయం 10 దాటితేనే ఎండ తీవ్రతకు తాళలేకపోతున్నారు. వేసవి కాలంలో ఉపాధిహామీ కూలీలకు మౌలిక సదుపాయాల కల్పన అందని దాక్ష్రగానే మారింది. ఏటా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలు జారీ చేసి నిధులు కేటాయిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. వసతుల కల్పనకు అవసరమైన మెటీరియల్ కొనుగోళ్ల వ్యవహారంలో నిధుల దుర్వినియోగం జరుగుతూనే ఉంది. ఉపాధి పనులకు వెళ్లే వారు పనులు చేసి కొంత సమయం సేద తీర్చుకోవడానికి, ఎండ నుంచి ఉపశమనం పొందడానికి జిల్లాలో 2010లో దాదాపు 20 వేలకు పైగా షామియానాలు అందజేశారు. గతేడాది వరకు వీటిని ఇచ్చారు. ప్రస్తుతం అవి ఎక్కడా కనిపించిన దాఖలాలు లేవు. అనేక మంది వాటిని సొంత పనులకు వినియోగించడం, ఎండకు అవి చిరిగిపోవడం తదితర కారణాలతో ఇప్పుడు అవి లేకుండా పోయాయి. దీంతో కూలీలు దిక్కులేక ఎండలోనే పనిచేస్తున్నారు. వాటిని కొనుగోలు చేయకుండానే నిధులు భోం చేశారనే ఆరోపణల కూడా లేకపోలేదు. ఎండ తీవ్రతకు భయపడి అనేక మంది కూలీలు పనులకు హాజరు కావడం లేదు. వచ్చిన వారికి నిలువ నీడ లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లు ఏవీ..? ఉపాధి పనులు చేసేటప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరిగినా, అత్యవసర పరిస్థితులు వచ్చినా తక్షణమే వారికి ప్రథమ చికిత్స చేసి సమీపంలో ఉన్న ఆసుపత్రికి పంపించడానికి ప్రభుత్వం ఆరోగ్య కిట్లను పంపిణీ చేసేది. రెండేళ్ల నుంచి ఈ కిట్ల జాడే లేదు. ప్రతి సంవత్సరం కిట్లు కొనుగోలు చేయూలని ఆదేశాలు జారీ కావడంతో పాటు నిధులు కూడా డ్రా అవుతూనే ఉంటాయి. కానీ అవి మచ్చుకైనా లేకపోవడంతో కూలీలు నానా అవస్థలు పడుతున్నారు. హెల్త్ కిట్లలో అయోడిన్, కాటన్, ఆయింట్మెంట్, ఇతర ట్యాబ్లెట్లు ఉంటాయి. ప్రత్యేకంగా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూడా అందుబాటులో ఉంచాల్సినప్పటికీ ఇవేమీ కూలీలకు అందడం లేదు. కూలీలకు తాగునీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నప్పటికీ వారినే ఇంటి వద్ద నుంచి తెచ్చుకోవాలని నిబంధన వి ధించారు. ఎండకు తగినంత నీరు లేకపోతే వడదెబ్బ బారిన పడే అవకాశాలున్నాయి. ఉపాధి కూలీలు పనిచేస్తూ తనువు చాలిస్తే ఫీల్డ్ అసిస్టెంట్ ఫిర్యాదు, రెవెన్యూ అధికారుల నివేదిక ఆధారంగానే సంబంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వానికి సిపార్సు చేస్తారు. అన్ని సక్రమంగా ఉంటేనే పరిహారం అందజేస్తారు. పనిచేసి వెళ్లి ఇంటి వద్ద మృతిచెందితే మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఏప్రిల్‌లో పని చేసిన కూలీల వేతనం రూ.8కోట్ల వరకు బకాయి పడింది. ఇప్పటివరకు ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించిన వేతనాలనే ఇస్తున్నారు. ఏప్రిల్‌కు సంబంధించిన నిధుల విడుదలలో కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుండడంతో కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
కార్పొరేషన్‌పై విద్యుత్ భారం
- ఏటా రూ.150 కోట్లకు పైగా చెల్లింపు - నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా రూ. 100 కోట్లు పింప్రి: విద్యుత్ ఆదా చేయడంలో పుణే కార్పొరేషన్ విఫలమవుతోంది. బిల్లుల రూపంలో ఏటా సుమారు రూ.150 కోట్లకు పైగా చెల్లిస్తోంది. సౌర విద్యుత్ కిట్లను అమర్చుకుంటే 5 శాతం సబ్సిడీ ఇస్తామన్న కార్పొరేషన్ సొంతంగా ఆ ఏర్పాటు చేసుకునే దిశగా ఆలోచించడం లేదు. కార్పొరేషన్ ప్రజలకు నీటి శుద్ధి, సరఫరాకు అత్యధికంగా 95 నుంచి 100 కోట్లు, వీధి దీపాల ఖర్చు, కార్పొరేషన్ కార్యాలయాలకు 50 కోట్లు కార్పొరేషన్ చెల్లిస్తోంది. మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకే కార్పొరేషన్‌కు విద్యుత్‌ను మహావితరన్ అందింస్తోంది. అయినా బిల్లు మాత్రం పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం, పాలకుల ఉదాసీనతే కారణం దేశంలో ఎనమిదో పెద్ద నగరంగా పేరుగాంచిన పుణే మిగిలిన ఏడు నగరాల మాదిరి సౌర విద్యుత్‌పై దృష్టి సారించలేకపోతోంది. ప్రభుత్వం, పాలనా యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ఉదాసీనతే ఇందుకు కారణమని తెలుస్తోంది. నగరంలోని కార్పొరేషన్ కార్యాలయాలలో అధికారులు లేకున్నప్పటికీ విద్యుత్ దీపాలు, ఏసీలు, ఫ్యాన్లు రోజంతా దుబారాగా తిరుగుతున్నాయి. వీధి దీపాలు, వీధుల్లో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇప్పటికైనా నగరంలోని మూడు లక్షలకు పైగా ఉన్న విద్యుత్ దీపాలను సోలార్‌గా మార్చి, దశలవారిగా అన్ని అవసరాలకు సోలార్‌ను వినియోగించుకుంటే కార్పొరేషన్‌కు విద్యుత్ భారం తగ్గుతుంది. -
విద్యుత్ రంగంలో స్వావలంబనే ధ్యేయం
- కోల్ఇండియాలో భాగస్వామ్యంపై ఆప్ సర్కార్ చర్చలు - ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుతో ప్రభుత్వంపై భారం - 2017 నాటికి డిమాండ్ 8,700 మెగావాట్లకు చేరుతుందని అంచనా సాక్షి, న్యూఢిల్లీ: విద్యుత్ రంగంలో ఢిల్లీ నగరం ఇతరులపై ఆధారపడకుండా తన కాళ్లపై నిలబడేలా ఆప్ సర్కార్ చేయాలనుకుంటోంది. ఇందులో భాగంగా కోల్ ఇండియా లిమిటెడ్ ఒడిశాలోని సుందర్‌గడ్ జిల్లాలో ఏర్పాటుచేయనున్న థర్మల్‌పవర్ ప్లాంటులో భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఈ 1,600 మెగావాట్ల ప్లాంటులో భాగస్వామిగా మారడం వల్ల విద్యుత్తు కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం తగ్గుతుందని ఆప్ భావిస్తోంది. ఈ విషయమై ఆప్ సర్కారు కోల్ ఇండియా లిమిటెడ్ అధికారులతో చర్చలు జరుపుతోంది. అయితే ఈ విషయంపై ఇంతవరకు నిర్ణయం వెలువడలేదు. విద్యుత్ రంగంలో ఢిల్లీకి స్వావలంబన కల్పిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సి రావడం వల్ల ఢిల్లీ ప్రభుత్వంపై అధిక భారం పడుతోంది. సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే నగర వాసులకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేయవచ్చని ఆప్ సర్కారు భావిస్తోంది. ఇందుకోసం బొగ్గు బ్లాక్‌ను సొంతం చేసుకోవడంతో పాటు ఇతరులతో కలిసి విద్యుదుత్పాదన ప్లాంట్లు ఏర్పాటుచేయడానికి ఆసక్తి చూపుతోంది. కోల్‌బ్లాక్‌ను మంజూరుచేయాలని కోరుతూ ఢిల్లీ సర్కారు కేంద్రానికి ఇప్పటికే లేఖలు రాసింది. దీంతో పాటు కోల్ ఇండియా లిమిటెడ్‌తో కలిసి సుందర్‌గడ్ జిల్లాలో థర్మల్ పవర్ ప్లాంటు ఏర్పాటు చేయాలనుకుంటోంది. రాజధానిలో విద్యుత్ డిమాండ్ 2017 నాటికి 8,700 మెగావాట్లకు చేరుతుందని కేంద్ర విద్యుత్ అథారిటీ అంచనా. గతేడాది నమోదైన పీక్ విద్యుత్ డిమాండ్ 5,925 మెగావాట్లు కాగా ఈ సంవత్సరం అది 6,500 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని విద్యుతుత్పాదన కేంద్రాల ద్వారా 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. నగరానికి సరఫరా అయ్యే విద్యుత్‌లో దాదాపు 70 శాతం బయటి నుంచి కొనుగోలు చేస్తున్నారు. -
రైతు గజేంద్ర సింగ్‌కు స్మారకం
- నిర్ణయించిన ఆప్ ప్రభుత్వం - రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను ఆలోచింపజేశారు - ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం - ప్రకటించిన సీఎం కేజ్రీవాల్ - పంట నష్ట పరిహారం ఎకరాకు రూ. 20 వేలు చెల్లింపు న్యూఢిల్లీ: గత నెలలో జంతర్ మంతర్ వద్ద ఆమ్ఆద్మీ పార్టీ నిర్వహించిన ర్యాలీలో ఆత్మహత్య చేసుకున్న రైతు గజేంద్ర సింగ్ జ్ఞాపకార్థం స్మారకం నిర్మించాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం వెల్లడించారు. ఔటర్ ఢిల్లీలోని బవానా ప్రాంతంలో అకాల వర్షాల కారణంగా పంటలను నష్టపోయిన రైతులకు ఆయన పరిహార చెక్కులను అందించారు. అనంతరం మాట్లాడుతూ రైతుల సమస్యలపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచించేలా చేసేందుకు గజేంద్ర తన జీవితాన్ని త్యాగం చేశారన్నారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం త్వరలో మెమోరియల్ నిర్మిస్తామని తెలిపారు. ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఆ రోజు ఘటనలో తమ తప్పేమీలేదని పునరుద్ఘాటించారు. ‘సభా వేదికకు చెట్టు చాలా దూరంలో ఉంది. అక్కడ ఏం జరుగుతుందో చూసేందుకు వీలు లేదు’ అని తెలిపారు. ఢిల్లీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే పరిహార పథకానికి ‘గజేంద్ర సింగ్ కిసాన్ సహాయతా యోజనా’గా పేరు నిర్ణయించినట్లు చెప్పారు. ప్రకృతి విపత్తుల కారణంగా పంట నష్టం జరిగే రైతులకు సహాయం చేయడానికి చొరవ చూపాలని కేంద్ర, అన్ని రాష్ర్ట ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. గరిష్ట నష్ట పరిహారం రూ. 20 వేలు: అకాల వర్షాల కారణంగా 70 శాతానికి పైగా పంట నష్టం జరిగిన వారికి ఎకరాకు రూ. 20 వేలు, అంతకంటే తక్కువ నష్టం జరిగిన వారికి రూ. 14 వేలు పరిహారం ఇస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. పరిహారం విషయంలో అధికారులకు, రైతులకు ఏమైనా వివాదాలు వస్తే దగ్గరలోని గ్రామ సభలో పరిష్కారం చేసుకోవాలని ఓ ప్రభుత్వాధికారి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న పరిహారం చాలా ఎక్కువని కేజ్రీవాల్ తెలిపారు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు రూ. 100 చెక్కులను ఇచ్చాయని, ఆప్ ప్రభుత్వం అత్యధికంగా రూ. 20వేలు చెల్లించిందన్నారు. -
వివాదం రేపుతున్న జీవో 25
- ఆహ్వానిస్తున్న రెల్లి కులస్తులు - వ్యతిరేకిస్తున్న మాలలు ఏయూ క్యాంపస్ : ప్రభుత్వం విడుదల చేసిన జీవో 25 వివాదానికి కారణమవుతోంది. దళితుల మధ్య చిచ్చురేపుతోంది. ఇప్పటికే వర్సిటీలో ఈ జీఓపై నిరసనలు పెరుగుతున్నాయి. రెల్లి హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు ఈ జీవో విడుదలపై హర్షం వ్యక్తం చేయగా, మాల విద్యార్థి ఫెడరేషన్ ప్రతినిధులు నిరాహార దీక్ష ప్రారంభించారు. రావెలను పదవి నుంచి తొలగించాలి దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీసే విధంగా జీవో విడుదల చేసిన మంత్రి రావెల కిషోర్‌బాబును వెంటనే బర్తరఫ్ చేయాలని మాల విద్యార్థి ఫెడరేషన్ డిమాండ్ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ఈ జీవోను వెంటనే వెనక్కితీసుకోవాలని కోరుతూ ఏయూ ప్రధాన ద్వారం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. కన్వీనర్ కె.వీర కృష్ణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించే విధగా మంత్రి పనితీరు ఉందన్నారు. ఎస్సీ ఉప కులాలపై తప్పుడు గణాకాలు చూపుతున్నారని ఆరోపించారు. జీవోను రద్దు చేయకుంటే ఆమరణ దీక్షలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జి.సతీష్, ఐ.వి.కృష్ణ, ఇ.సుబ్బయ్య, వి.రామస్వామి, ఎం.స్వరూప, జె.త్రిమూర్తులు, సిహెచ్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే రెల్లీలకు న్యాయం షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిపితేనే రెల్లి కులస్తులకు తగిన న్యాయం జరుగుతుందని రెల్లి హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ డి.ఆడమ్స్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం సబ్‌ప్లాన్ నిధులను అన్ని కులాలకు చెందే విధంగా విడుదల చేసిన జీవో 25పై హర్షం వ్యక్తం చేశారు. ఏయూ అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ నిర్ణయానికి స్వాగతం పలికారు. ఎస్సీలలో మాల, మాదిగలకు ఇస్తున్న ప్రాధాన్యత మూడో కులమైన రెల్లికి ఎందుకు కల్పించడం లేద ని ప్రశ్నించారు. ఎస్సీ ఉపకులాల జనాభా నిష్పత్తి ఆధారంగా సంక్షేమ పథకాలను అందిస్తామని మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రకటించడం పట్ల హర్షం ప్రకటించారు. జిల్లా రెల్లి మేధో ఫోరం అధ్యక్షుడు ఇసుకపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం తమను గుర్తించిందన్నారు. ఈ జీవో ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వడ్డాది మధు, చెన్నా తిరుమల రావు, మల్లిపూడి నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
రుణమాఫీ కష్టాలు
కమలనాథనాయుడు, గోవిందయ్య, శ్రీనివాసులు నాయుడు, రామచంద్రనాయుడు, బాలాజీ...ఇలా చెప్పుకుంటూపోతే జిల్లాలో వేలాది మంది అన్నదాతలు రుణమాఫీ కోసం ఇంకా బ్యాంకులు, తహశీల్దారు కార్యాలయాలు, మీసేవ కేంద్రాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో రుణమాఫీ ఫిర్యాదుల విభాగానికి వెల్లువలా వస్తున్నారు. - వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు - ఆరు రోజుల్లో 900 వినతులు - జిల్లా నలుమూలల నుంచి తరలి వస్తున్న రైతులు సాక్షి, చిత్తూరు: రుణమాఫీపై ప్రభుత్వం ఏప్రిల్ 27 నుంచి మే నెల 15 వరకూ ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆరు రోజుల్లో వెయ్యి ఫిర్యాదులు అందినట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో చిత్తూరు,తిరుపతి,మదనపల్లె రెవిన్యూ డివిజన్ల పరిధిలో 66 మండలాలున్నాయి. కానీ ప్రభుత్వం జిల్లా కేంద్రంలో మాత్రమే ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఒకవైపు ఎండలు మండుతున్నాయి. అయినా మారుమూల ప్రాంతాల నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి రోజుకు రెండు వందల మంది అన్నదాతలు జిల్లా కేంద్రానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మండల కేంద్రాల్లో ఫిర్యాదుల విభాగం పెడితే రుణమాఫీకి సంబంధించి వేల సంఖ్యలో ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. దాని నుంచి తప్పించుకునేందుకు అధికారులు ఈ విభాగాన్ని జిల్లా కేంద్రానికే పరిమితం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు రైతుల ఫిర్యాదుల నమోదుకు అధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. తొలిరోజు వినతిపత్రం తీసుకుని మరుసటి రోజు రమ్మంటూ వాయిదాలు వేస్తున్నారని పలువురు రైతులు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటిదాకా మాఫీ అయిన తీరు ఇదీ ... జిల్లాలో మొత్తం 8,70,321 మంది రైతులు 2013 డిసెంబర్ 31నాటికి వివిధ బ్యాంకుల్లో * 11,180.25 కోట్ల రుణాలు తీసుకున్నారు. బ్యాంకులు నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా 5.63 లక్షల మంది రుణమాఫీకి అర్హులంటూ ప్రభుత్వానికి నివేదించారు. మొదటి విడతలో 3,06,544 మంది,రెండో విడత 1,42,229 మంది మొత్తం 4,48,773 మందిని మాత్రమే అర్హులుగా తేల్చారు. అయితే చివరకు 4 లక్షల మందికి కూడా రుణమాఫీ వర్తించకపోగా వారిలో కూడా దాదాపు 20 శాతం మంది రైతుల రుణమాఫీ సైతం వివిధ సాంకేతిక కారణాల పుణ్యమాని పెండింగ్‌లో పడింది. -
ప్రజలకు అండగా వైఎస్ఆర్సీపీ
తిరుపతి మంగళం : ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టి ప్రజలకు అండగా నిలుస్తుందని తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం భూమన కరుణాకరరెడ్డి నివాసంలో పోతిరెడ్డి వెంకటరెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పోతిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ మృతి చెందిన ఎమ్మెల్యే కుటుంబంలో నుంచి ఎవరైనా పోటీ చేస్తే వారికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయకూడదన్న నిబంధనలను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టడం అభినందనీయమన్నారు. తాను పార్టీలో ఉంటూ అందుకు బిన్నంగా తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అరాచకాలను చూడలేకే పోటీ చేశానన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబంధనలను ఉల్లంఘించి పోటీ చేయడం తప్పని తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్సీపీలో చేరానన్నారు. పార్టీ కట్టుబాట్లకు కట్టుబడి ఉంటానని, పార్టీ అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తానన్నారు. మాజీ ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ప్రజా సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని అధికార పార్టీని ఎండగట్టేందుకు పార్టీ నాయకులు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు పాలగిరి ప్రతాప్‌రెడ్డి, దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి, టి. రాజేంద్ర, ఎస్కె. ఇమామ్‌సాహెబ్, రామస్వామి వెంకటేశ్వర్లు, కొండారెడ్డి, పోతిరెడ్డి సాయిరెడ్డి పాల్గొన్నారు. -
రోల్‌బ్యాక్ పింఛన్లలో కోత
- ఏడు నెలల బకాయిలు - ఒక నెలతో సరిపెట్టేసిన అధికారులు - ఉసూరుమంటున్న 2వేలమంది లబ్ధిదారులు విజయవాడ సెంట్రల్ : రోల్‌బ్యాక్ (వివిధ కారణాల వల్ల ఆపేసిన పెన్షన్‌దారులకు తిరిగి పింఛన్ ఇవ్వడం) పింఛన్లలో ప్రభుత్వం కోతపెట్టింది. ఏడు నెలలుగా పింఛన్ల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్న లబ్ధిదారులకు ఒకనెల పింఛన్ చేతిలో పెట్టి పొమ్మంది. దీంతో పెన్షన్‌పైనే ఆశలు పెట్టుకున్నవారు లబోదిబోమంటున్నారు. 2,081 మందికి రోల్‌బ్యాక్ పింఛన్లు రావాల్సి ఉండగా 1,999 మందికి శనివారం మంజూరు చేశారు. నగరపాలక సంస్థ పరిధిలోని 59 డివిజన్లలో గత ఏడాది అక్టోబర్ వరకు 35,550 మంది సామాజిక పింఛన్లు అందుకునేవారు. ఐదు రెట్లు భరోసా పేరుతో పింఛన్లను పెంచుతూ సర్కార్ సవాలక్ష ఆంక్షలు విధించింది. పరిశీలన పేరుతో డివిజన్ కార్పొరేటర్ అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని ఏర్పాటుచేసింది. పింఛన్లు అందుకునేందుకు ని‘బంధన ’ల పేరుతో సుమారు ఏడువేల పింఛన్లను ఏరిపారేసింది. దీనిపై విపక్షాల ఆందోళనతో పాటు స్వపక్ష కార్పొరేటర్ల నుంచి ఒత్తిడి రావడంతో ఐదువేల మందికి పింఛన్లు మంజూరు చేసేందుకు పచ్చజెండా ఊపింది. కమిటీ ముందు హాజరై తమ అర్హతను నిరూపించుకోలేదనే సాకుతో 2,081 మంది పింఛన్లను నిలుపుదల చేశారు. చేతులెత్తేశారు..! అన్ని అర్హతలు ఉన్నా పింఛన్లు అందకపోవడంతో లబ్ధిదారుల్లో ఆందోళన మొదలైంది. మొదట్లో రోజూ తెల్లవారేసరికి సంబంధిత కార్పొరేటర్ల ఇళ్ల ముందు వాలిపోయేవారు. పింఛన్లు ఇప్పించమంటూ వేడుకోలు మొదలుపెట్టేవారు. ఈ నేపథ్యంలో పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఫిబ్రవరి 9న జరిగిన కౌన్సిల్ సమావేశంలో అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అధికారులను గట్టిగా నిలదీశారు. ప్రభుత్వం వద్దే పెండింగ్ ఉందని చెప్పిన అధికారులు బకాయిలతో సహా పింఛన్లు చెల్లిస్తామని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని కార్పొరేటర్లు లబ్ధిదారులకు వివరించారు. తాజాగా ప్రభుత్వం ఒక నెల మాత్రమే రోల్‌బ్యాక్ పింఛన్లు మంజూరుచేసి చేతులు దులుపుకొంది. రాష్ట్రవ్యాప్తంగా 83వేల రోల్‌బ్యాక్ పింఛన్లు చెల్లించాల్సి ఉండటంతో పాత బకాయిల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంతా గందరగోళమే.. పింఛన్ల పంపిణీపై ప్రభుత్వం ఆది నుంచి గందరగోళం సృష్టిస్తోంది. సామాజిక పింఛన్లు రూ.200 ఇచ్చే సమయంలో 35,550 మంది లబ్ధిదారులు ఉండగా, రూ.1000, రూ.1,500 చేసిన సందర్భంలోనూ అంతమందే ఉన్నారు. అంటే లబ్ధిదారులందరూ అర్హులేనని లెక్కతేలింది. నిబంధనల సాకుతో ఐదువేల మందికి మూడు నెలలు, రెండువేల మందికి ఏడు నెలల చొప్పున కొర్రీ పెట్టారు. ప్రభుత్వం చేసిన తప్పుకు లబ్ధిదారులు పింఛన్లు కోల్పోయారన్న విషయం నిర్ధారణ అయింది. పంపిణీకి సంబంధించి పోస్టాఫీసులు, బ్యాంక్‌ల చుట్టూ తిప్పిన ప్రభుత్వం తాజాగా మాన్యువల్ పద్ధతిలో ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. ఇంతటి దానికి ఇంత హంగామా అవసరమా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. -
శ్రమ దోపిడీపై పోరాడుదాం..
- టఫ్ కో కన్వీనర్ విమలక్క జవహర్‌నగర్ : కార్మికుల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ (టఫ్) కో కన్వీనర్ విమలక్క అన్నారు. బాలాజీనగర్‌లో శుక్రవారం రాత్రి ఏఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్ర రాష్ర్ట, ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వారి శ్రమను దోచుకుంటున్నాయని విమర్శించారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం సమగ్ర చట్టం తీసుకువచ్చేవరకు రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శ్రమదోపిడీకి గురవుతున్న కష్టజీవుల్ని ఐక్యం చేసి, వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. అవుట్ సోర్సింగ్ విధానాలతో పాలకులు ముందుకు వెళ్తున్నారని, ఫలితంగా ఉద్యోగ కార్మికులకు భద్రత లేకుండా పోయిందన్నారు. ఏఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు విఠల్‌రాజ్ మాట్లాడుతూ.. కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికులకు రక్షణ కరువైందన్నారు. ఆకాశాన్నంటిన ధరలతో పేద ప్రజలు బతికేందుకు కష్టమైపోయిందన్నారు. కార్మికుల హక్కులకోసం ఏఐఎఫ్టీయూ పనిచేస్తోందని, పోరాటాలతోనే హక్కులను సాధించుకుంటామన్నారు. అనంతరం అరుణోదయ కళాకారుల బృందం ఆట పాటలతో హుషారెత్తించారు. కార్యక్రమంలో జవహర్‌నగర్ సర్పంచ్ గడ్డమీది మల్లేష్, టఫ్ రాష్ట్ర నాయకుడు హనుమాన్లు, ఏఐఎఫ్టీయూ జంటనగరాల ప్రధాన కార్యదర్శి శివబాబు, రాష్ట్ర నాయకుడు నాగేశ్వరావు, అసంఘటిత భవన నిర్మాణరంగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.మల్లేష్ , ఏఐఎఫ్టీయూ జవహర్‌నగర్ అధ్యక్షుడు మల్లారెడ్డి, నాయకులు బిర్రు యాకస్వామి, డాక్టర్ రవి, చెన్నాపురం యాదయ్య, సత్యనారాయణ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. -
బీసీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
చిత్తూరు (సెంట్రల్) : రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శాసనసభ బీసీ సంక్షేమ కమిటీ చైర్మన్ జి.తిప్పేస్వామి తెలిపారు. మూడురోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం కమిటీ చిత్తూరుకు వచ్చింది. జెడ్పీ సమావేశ మం దిరంలో వివిధ బీసీ సంఘాలు, ప్రజల నుంచి కమిటీ వినతులు స్వీకరించింది. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించింది. వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగాల భర్తీలో బీసీలకు కల్పించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, అభివృద్ధి కార్యక్రమాల అమలును సమీక్షించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ స్కాలర్‌షిప్పు లు, సంక్షేమ హాస్టళ్లలో సీట్ల కేటాయింపు, మౌలిక వసతుల కల్పన తదితరాలను సక్రమంగా అమలు చేయాలని తెలిపారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఎన్ఎంఆర్ల భర్తీల్లో బీసీల రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌కు సూచించారు. ఐరాల, పాకాల, సోమల తది తర మం డలాల్లో పెరికబలిజ కులస్తులకు సర్టిఫికెట్లు మంజూరులో తహశీల్దార్లు సహకరించడం లేదని, దీనిపై మానవతా ధృక్ఫథంతో స హకరించాలని కోరారు. కమిటీ సభ్యులు రమణమూ ర్తి, రామానాయుడు, అశోక్, జయరాములు మాట్లాడుతూ బీసీలకు సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పా టించడంలో నిబద్ధతతో పని చేయాలన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ రిజర్వేషన్ల అమలులో గతం లో ఏవైనా పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిదిద్దుకుంటామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ కావడం లేదు తిరుమల తిరుపతి దేవస్థానం కళాశాలల్లో చదువుతున్న బీసీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయిం బర్స్మెంట్ చేయడం లేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాసనసభ కమిటీ దృష్టికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తీసుకువచ్చారు. సమావేశంలో చెవిరెడ్డి మాట్లాడుతూ టీడీడీ ఆధ్వర్యంలో కళాశాలల విద్యార్థులకు ఫీజు రియింబర్స్‌మెంట్ అమలు చేయాలన్నారు. అలా గే బీసీ హాస్టళ్లల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు రూ.500 నెలవేతనం ఇస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ల్లో పనిచేస్తున్న ట్యూటర్లకు ఇచ్చే విధంగా నెలకు రూ.1500 వం తున ఇవ్వాలని కమిటీ దృష్టికి తెచ్చారు. హాస్టల్ విద్యార్థుల వైద్య పరీక్షల కోసం, అవసరమైన మందుల సరఫరాకు 104 వాహనాలను పంపాలని సూచించారు. జీవో నెంబర్ 64 మేరకు హాస్టల్ నిర్వహణ కోసం రూ.1000 ప్రతినెలా ఇవ్వాల్సి ఉండగా, సంవత్సరాల తరబడి నిధులు విడుదల చేయడం లేదని, విద్యార్థులకు కాస్మోటిక్ చార్జీలను పెంచాలని కోరారు. తన మండలంలో బీసీలు అధికంగా ఉన్నారని, బీసీ హా స్టల్ మంజూరు చేయాలన్నారు. వీటిపట్ల చైర్మన్ సానుకూలంగా స్పందించారు. సమావేశంలో కమిటీ సభ్యు లు ఎమ్మెల్యేలు వెంకటరామారావు, ముత్యాలనాయు డు, మండలి సభ్యులు విశ్వప్రసాద్‌రావు, చిత్తూరు, తిరుపతి ఎస్పీలు శ్రీనివాస్, గోపీనాథ్‌జెట్టి, తిరుపతి నగర పాలక కమిషనర్ వినయ్‌చంద్, బీసీ వెల్ఫేర్ అధికారి రామచంద్రరాజు, ఎస్వీ, పద్మావతి,పశువైద్య విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
నేలరాలిన మామిడి ఆశలు
- వందల ఎకరాల్లో నష్టం - పలు చోట్ల విరిగిపడిన మామిడి చెట్లు - ఆందోళనలో కౌలు రైతులు జైపూర్/తాండూర్/చెన్నూర్‌రూరల్/నెన్నెల : జిల్లాలో ఆదివారం రాత్రి గాలి దుమా రం, వాన బీభత్సం సృష్టించింది. మామిడి చెట్లపై ఉన్న కాయలన్నీ నేలరాల్చింది. కాయలన్నీ రాలిపోవడంతో రైతుల ఆశలు నేలరాలారుు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. జైపూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలారుు. మండలంలోని ఇందారం, టేకుమట్ల, రసూల్‌పల్లి, మిట్టపల్లి, దుబ్బపల్లి, జైపూర్, భీమారం, బూరుగుపల్లి, నర్సింగాపూర్, ఖాజిపల్లి, దాంపూర్, రెడ్డిపల్లి, ధర్మారం, మద్దికల్, ఆరేపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో మామిడి కాయలు నేలరాలిపోయాయి. వేలాది రూపాయాలు ఖర్చు చేసి తోటలు కౌలుకు తీసుకున్న కౌలు రైతులు రాలిన కాయలను చూసి కన్నీరుమున్నీరు అవుతున్నారు. తాండూర్ మండలం అచ్చలాపూర్, బోయపల్లి, తాండూర్, రేపల్లెవాడ, చౌటపల్లి మదారం తదితర గ్రామాల్లోని 800 ఎకరాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. ఆదివారం రాత్రి గాలివానకు మామిడికాయలు నేలరాలారుు. కొద్ది రోజుల్లో కాయలు కోసి మార్కెట్‌కు తరలించాలని అనుకుంటున్న రైతుల ఆశలకు గండికొట్టింది. చెన్నూర్ మండలంలో ఆదివారం రాత్రి వీచిన గాలి దుమారానికి సుద్దాల, సంకారం, కొమ్మెర, ఎర్రగుంటపల్లి, నాగాపూర్, కన్నెపల్లి, కిష్టంపేట, లింగంపల్లి గ్రామాల్లోని మామిడి తోటల్లో కాయలు నేలరాలారుు. అకాల వర్షాలు, గాలిదుమారంతో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కౌలు డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదని కౌలు రైతులు వాపోతున్నారు. నెన్నెల మండలంలోని నెన్నెల, ఆవడం, చిత్తాపూర్, మెట్పల్లి, నందులపల్లి, ఘన్పూర్, గొళ్లపల్లి, మైలారం, కొత్తూర్, దుబ్బపల్లి, జంగాల్‌పేట, గుండ్లసోమారం, జోగాపూర్, కోనంపేట గ్రామాల్లో చెట్లపై ఉన్న కాయల్లో 90శాతం నేలరాలారుు. మూడు వేల ఎకరాల్లోని తోటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గంట సమయంలో గాలివాన బీభత్సం సృష్టించింది. -
బహుళ అంతస్తులతో భవిష్యత్ ప్రమాదకరం
- నిర్మాణానికి అనుమతులిస్తే భారీ నష్టం జరిగే అవకాశం - ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న నిపుణులు - భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ముంబై కూడా ఉందని వెల్లడి సాక్షి, ముంబై: బహుళ అంతస్తుల భవనాలకు విచ్చలవిడిగా అనుమతులిస్తే భవిష్యత్ ప్రమాదకర స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వ సలహాదారుల కమిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూకంపం వచ్చే ప్రాంతాల జాబితాలో ముంబై నగరం ఉందని, బహుళ అంతస్తుల భవనాలకు అనుమతి ఇవ్వకూడదని గతంలోనే హెచ్చరించినా పరిపాలనా విభాగ ం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సలహాదారుల కమిటీ నిపుణుడు, ఐఐటీ ముంబై విశ్రాంత అధ్యాపకుడు వి. సుబ్రమణ్యం తెలిపారు. ‘నేపాల్‌లో శనివారం సంభవించిన భూకంపానికి ఆ దేశ రాజధాని ఖాఠ్మాండు నగరంలోని ఆకాశహర్మ్యాలు నేల కూలాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దక్షిణ ముంబై ప్రాంతంలో ఎక్కడ చూసిన 30 అంతస్తులకుపైగా నిర్మించిన భవనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ 60 అంతస్తులకు పైగా ఉన్న 10-15 భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ముంబైలో స్థలాలు లేవని భవనాలను వెడల్పుగా నిర్మించేందుకు వీలు లేదు. దీంతో ఎత్తుగా నిర్మించేందుకు అనుమతినిస్తున్నారు. ముంబై భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మూడో స్థానంలో ఉంది. ఇంతకు ముందెన్నడూ ముంబైపై భూకంప ప్రభావం పడకపోయినా.. భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉంది’ అని సుబ్రమణ్యం హెచ్చరించారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆకాశహర్మ్యాలకు అనుమతివ్వకూడదని ఆయన అన్నారు. తాజా భూకంపం తీవ్రత ఠాణే సముద్ర తీరం అవతల రిక్టర్‌స్కేల్‌పై నాలుగుగా నమోదైంది. అదే ముంబైలో భూకంపం వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గత ఎనిమిదేళ్ల నుంచి అప్పుడప్పుడు ఠాణే, కల్యాణ్ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు వస్తున్నాయని, అవి ముంబైకి అతి దగ్గరలో ఉండటం వల్ల భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందని ఆయన హెచ్చరించారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతివ్వకూడదని సుబ్రమణ్యం సలహా ఇచ్చారు. నగరంలో లోయర్‌పరేల్, పరేల్, మహాలక్ష్మి తదితర ప్రాంతాల్లో మూతపడిన మిల్లు స్థలాల్లో వరల్డ్ టవర్, బహుళ అంతస్తుల భవనాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. అవి ఎప్పుడైనా ప్రమాదమేనని ఆయన తెలిపారు. -
మిషన్ కాకతీయలో అక్రమాలు
హన్మకొండ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెపుతున్న మిషన్ కాకతీయలో అక్రమాలు చోటుచేసుకున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం హన్మకొండ ఎన్జీవోస్‌కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ అనుయాయులకు దక్కని టెండర్లను అధికార యంత్రాంగం రద్దు చేసిందని, తిరిగి రెండోసారి టెండర్లు పిలిచి ఈ టెండర్లలో ఎవరు పాల్గొనవద్దని నీటిపారుదల శాఖ ఎస్ఈ స్వ యంగా ఫోన్ చేసి కాంట్రాక్టర్లను బెదిరించారన్నారు. బెదిరింపులకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ వాకాటి కరుణను కలెక్టర్ చాంబర్లో కలిసి వినతి పత్రం అందించారు. కాగా మే 2న మేధావులు, వివిధ రంగాలకు చెందిన నిపుణులచే రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నాయకులు దిలీప్‌నాయక్, మల్లాడి తిరుపతిరెడ్డి, కొత్త దశరథం, జన్నె మొగిళి, కుమారస్వామి, త్రిలోకేశ్వర్, కాసర్ల రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
‘మహా’ పర్యాటకులకు సాయం..
- నేపాల్‌లోని రాష్ట్ర పర్యాటకులు అందరూ సురక్షితమన్న ప్రభుత్వం - సత్వర సహాయం అందించాలని అధికారులకు సీఎం ఆదేశం ముంబై: నేపాల్‌లోని హిమాలయన్ రాష్ట్రంలో సంభవించిన భూకంపంలో మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు గాయపడలేదని, అందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. అక్కడికి వెళ్లిన పర్యాటకుల వివరాలు పూర్తిగా తెలియరాలేదని, దాదాపు 50-60 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం చెబుతోంది. నేపాల్‌లోని రాష్ట్ర పర్యాటకులకు సత్వర సహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. భారత్, నేపాల్‌లో భూకంపం సంభవించిన వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం అన్నారు. నేపాల్, భారత్‌లో సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖను కూడా అప్రమత్తం చేశారు. అక్కడి మహా పర్యాటకులకు సహాయం అందించాలని, వారికి అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించినట్లు శనివారం ట్వీట్ చేశారు. పరిస్థితిని ప్రతిక్షణం సమీక్షిస్తున్నానని, తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అధికారులను కోరానని చెప్పారు. నేపాల్‌లో సంభవించిన భూకంపం తూర్పు, ఉత్తర భారతదేశాన్ని కూడా కుదిపేసింది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత కనబడింది. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో నేపాల్‌లోని రాష్ట్ర ప్రజల సహాయార్థం రాష్ట్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సీఎం సూచనమేరకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశామని, నేపాల్‌లోని రాష్ట్ర ప్రజలను గుర్తించడానికి ఈ విభాగం అవసరమైన చర్యలు తీసుకుంటుందని సీఎం కార్యాలయం తెలిపింది. వివరాల కోసం న్యూఢిల్లీలోని మహారాష్ట్ర సదన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ సమీర్ సహాయ్ ఆధ్వర్యంలో 011-23380325 నంబర్ ఏర్పాటు చేసింది. బంధువులు, కుటుంబీకుల వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం 022-22027990 నంబర్‌ను ఏర్పాటుచేసింది. -
ఏలేరు ఆధునికీకరణకు రూ.295.82 కోట్లు
- జీఓ నం : 241 విడుదల - నెరవేరనున్న రైతుల కల పిఠాపురం : కొన్నేళ్లుగా ఏటా కోట్ల విలువైన పంటలు కోల్పోతున్న ఏలేరు రైతాంగం కష్టాలు తీరనున్నాయి. ఏలేరు ఆధునికీకరణకు ప్రభుత్వం రూ.295.82 కోట్లు విడుదల చేస్తూ జీఓ నం: 241ని శుక్రవారం విడుదల చేసింది. ఆరు మండలాల్లో సాగునీటికి ఆధారమైన ఏలేరు ఆధునికీకరణకు నోచుకోక గత కొన్నేళ్లుగా రైతాంగం తీవ్ర నష్టాల పాలవుతోంది. కాలువలు పూర్తి శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఆక్రమణలకు గురికావడం, గట్లు బలహీనపడి కోతకు గురవడం వ ంటి సమస్యలు పీడిస్తున్నారు. నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏలేరు కాలువల నిర్మాణం జరిగింది. ఏలేరు పరీవాహక ప్రాంతం 2,232 చదరపు కిలోమీటర్లు (862చదరపు మైళ్లు) ఉండగా, 128 కిలోమీటర్ల పొడవు, 27,325 హెక్టార్ల ఆయకట్టు (67,614 ఎకరాలు) కలిగి ఉంది. పెద్దాపురం, ప్రత్తిపాడు, కిర్లంపూడి, గొల్లప్రోలు, కొత్తపల్లి మండలాల ఆయకట్టు సాగునీటికి ఆధారంగా ఏలేరు కాలువలు నిర్మించారు. ఏలేరు కాలువ ప్రాజెక్టు నుంచి ఏలేరు, నక్కలఖండి, గొర్రిఖండి, పెద ఏరు, చిప్పలేరు, తదితర పేర్లతో పిలువబడుతోంది. సాగునీటితో పాటు ఏలేరు అదనపు జలాలను సముద్రంలోకి తరలించడానికి ఏలేరు ప్రాజెక్టు నుంచి కొత్తపల్లి మండలం సముద్ర తీరం వరకు దీనిని నిర్మించారు. అన్నదాతల వెతలకు స్పందించిన వైఎస్ అయితే నిర్మించిన నాటి నుంచి పూర్తి స్థాయిలో ఆధునికీకరణ పనులు జరగక పోవడంతో ప్రాజెక్టుతో పాటు కాలువలు అధ్వానస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా సాగునీరు అందకపోవడంతో పాటు వరదలు వచ్చినపుడు పంటలు మునిగి పోవడం నిత్యకృత్యంగా మారింది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటనకు వచ్చినపుడు రైతాంగం సమస్యను ఆయన దృష్టికి తీసుకు వెళ్లారు. స్పందించిన ఆయన ఏలేరు ఆధునికీకరణకు రూ.138 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పనులకు శంకుస్థాపనసైతం చేశారు. అయితే ఆయన అకాల మృతితో ఆ పనులు ఆగిపోయాయి. అనంతరం ప్రభుత్వాలు పట్టించుకోపోవడంతో ఏలేరు మరింత శిథిలావస్థకు చేరుకుంది. ఇటీవల ఏలేరు ప్రాజెక్టుతో పాటు తిమ్మరాజు చెరువు, ఏలేరు కాలువల అభివృద్ధి, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలతో కలిపి మొత్తం ఏలేరు పూర్తి ఆధునికీకరణకు రూ.308 కోట్ల వ్యయం కాగలదని నీటిపారుదల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం ఎట్టకేలకు రూ.295.82 కోట్లను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అరుుతే ప్రతిపాదించిన మొత్తంలో కొన్ని పనులు అవసరం లేదంటూ రూ.13 కోట్లకు కోత విధించింది. ఆధునికీకరణ పనుల్లో భాగంగా నిర్మించ తలపెట్టిన పెద్దాపురం ఇరిగేషన్ సెక్షన్ కార్యాలయం, పెద్దాపురం, పిడిమిదొడ్డి, కాండ్రకోట, దివిలి, నాగులాపల్లిలలో లస్కర్ క్వార్టర్ల నిర్మాణాలు అవసరం లేదని ఉత్తర్వులలో పేర్కొంది. -
విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత
- విద్యుత్ లోటును పూడ్చగలిగాం - రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సుజాత జంగారెడ్డిగూడెం రూరల్ : విద్యుత్ పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గనులశాఖ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు. విద్యుత్ పొదుపు చర్యల్లో భాగంగా ప్రతి ఇంటికీ ఎల్ఈడీ బల్బులను పంపిణీ చేస్తుందని చెప్పారు. జంగారెడ్డిగూడెం విద్యుత్ శాఖ డీఈ కార్యాలయంలో శుక్రవారం ఇంటింటా ఎల్ఈడీ బల్పుల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మాట్లాడుతూ గత ప్రభుత్వం దశాబ్ధ కాలంలో 22 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటును చూపించిందని, తమ ప్రభుత్వం నిరంతరాయంగా కృషి చేసి లోటును పూడ్చగలిగిందన్నారు. విద్యుత్ పొదుపు చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.22 కోట్ల విలువైన 15.22 లక్షల ఎల్ఈడీ బల్బులను ప్రజలకు అందిస్తుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి నాలుగు రోజుల్లో వినియోగదారులకు రెండు ఎల్ఈడీ బల్బులు చొప్పున పంపిణీ చేయనున్నామని తెలిపారు. జంగారెడ్డిగూడెంలో 75 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడానికి వినియోగదారుడు విద్యుత్ బిల్లు, ఆధార్ కార్డు లేదా ఏదైనా ఇతర ఫొటో గుర్తింపు కార్డు ఇచ్చి రెండు ఎల్ఈడీ బల్బులు పొందవచ్చన్నారు. ఈ ఎల్ఈడీ బల్బులు పొందడం వల్ల విద్యుత్ వినియోగం సంవత్సరానికి 55 యూనిట్లు ఆదా అవుతుందన్నారు. చింతలపూడి, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలో అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు ఏర్పాటు చేస్తామని వీటి ఏర్పాటుకు అర ఎకరం స్థలం కేటాయించాల్సి ఉందని ఇందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలన్నారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీ ముత్యాల రాజు మాట్లాడుతూ ఎల్ఈడీ బల్బుల వినియోగం వల్ల ప్రతి ఇంటా విద్యుత్ పొదుపు జరుగుతుందని, దానివల్ల ఏటా వినియోగదారునకు రూ.800 ఆదా అవుతుందన్నారు. రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవో ఎ.చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 49 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయడం జరుగుతుందని దానివల్ల 24 శాతం విద్యుత్ పొదుపు చేయగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ వెంకట రమణ, నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, ట్రాన్స్‌కో ఎస్ఈ సత్యనారాయణ రెడ్డి, డీఈ సాల్మన్ రాజు, ఎంపీపీ కొడవటి మాణిక్యాంబ, జెడ్పీటీసీ శీలం రామచంద్రరావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు దల్లి కృష్ణారెడ్డి, నాయకులు రాజాన సత్యనారాయణ (పండు), కొడవటి సత్తిరాజు, మండవ లక్ష్మణరావు, పెనుమర్తి రామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. - పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన జంగారెడ్డిగూడెం శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో రూ. 10.40 లక్షలతో నిర్మిం చనున్న తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల టూరిజం సర్క్యూట్ పర్యాటకుల సదుపాయాల సమాచార భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డీఈ కార్యాలయ భవనాలను మంత్రి ప్రారంభించారు. -
రెతులను ఆదుకోవాలి: వైఎస్సార్సీపీ
హుజూర్నగర్ : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అయిల వెంకన్నగౌడ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వేముల శేఖర్‌రెడ్డిలు కోరారు. గురువారం స్థానికంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి వేలాది రూపాయల పెట్టుబడులు పెట్టి వరి సాగు చేసిన రైతులకు తీరా పంట చేతికి అంది వచ్చిన దశలో అకాల వర్షం తీరని నష్టం మిగిల్చిందన్నారు. ఈదురు గాలులు, వడగండ్ల వానతో వరి చేలు నేలకొరిగాయన్నారు. ధాన్యం రాలిపోవడంతో పాటు వేలాది బస్తాల ధాన్యం తడిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా తోటలలో మామిడి కాయలు కూడా రాలిపోవడమేగాక చెట్లు విరిగిపోయాయన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. వెంటనే రెవెన్యూ అధికారులచే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ కార్యదర్శి మంద వెంకటేశ్వర్లు, నాయకులు గుర్రం వెంకటరెడ్డి, పులిచింతల వెంకటరెడ్డి, కాల్వపల్లి బ్రహ్మారెడ్డి, జడరామకృష్ణ, పిల్లి మరియదాసు, మర్రి రవీందర్‌రెడ్డి, దేవరకొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో రెండు ఈకో పార్కులు
- జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్‌రెడ్డి వనపర్తిరూరల్: మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు ఈకో పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశం మేరకు ప్రతిపాదనలు పంపిస్తున్నామని జిల్లా ఫారెస్టు అధికారి నరేందర్‌రెడ్డి చెప్పారు. గురువారం వనపర్తి మండలంలోని రిజర్వు ఫారెస్టు స్థలాన్ని ఆయన ఇక్కడి ఫారెస్టు రేంజర్ అధికారి మహెందర్‌రెడ్డి, అసిస్టెంట్ రేంజర్ అధికారి శ్యాంకుమార్‌తో కలిసి పరిశీలించారు. జిల్లాలోని మహబూబ్‌నగర్ అప్పనపల్లి వద్ద ఒకటి, వనపర్తి మండలం పెద్దగూడెం శివారులోని రిజర్వు ఫారెస్టులో మరొకటి ఏర్పాటు చేయటానికి స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. ఒక్కో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం రూ. 2 కోట్ల చొప్పున నిధులు కేటాయించనుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన హరితహారం పథకంలో భాగంగా ఈ పార్కుల నిర్మాణం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పార్కులలో వాకింగ్ ట్రాక్, రన్నింగ్, బైస్కలింగ్ట్రాక్లతో పాటు, వృక్షశాస్త్ర అధ్యయన కోసం ప్రత్యేక సెల్ నిర్మాణం చేస్తామన్నారు. కాలగర్భంలో కలిసిపోతున్న ఔషద మొక్కలను పెంచటానికి ఈ పార్కులను ఉపయోగించు కుంటామన్నారు. ఇప్పటికే హైదరాబాద్ నాచారంలో నిర్మాణం చేసిన ఈకో పార్కుల తరహాలో వీటిని నిర్మాణం చేస్తామన్నారు. ఒక్కో పార్కు సుమారు 300 ఎకరాల విస్తీర్ణంలో ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆయనతో పాటు వనపర్తి, మహబూబ్‌నగర్ ఫారెస్టు శాఖ అధికారులు ఉన్నారు. -
ప్రతి రైతును ఆదుకుంటాం
- సీఎం కేసీఆర్ కూడా హామీ ఇచ్చారు - ఇది మన ప్రభుత్వం. న్యాయం చేస్తాం - బాధితులకు మంత్రి హరీష్‌రావు హామీ నంగునూరు: అకాల వర్షం వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని ఎవరూ అధైర్యపడొద్దని నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు. నంగునూరు మండలం సిద్దన్నపేట, బద్దిపడగ గ్రామాల్లో గురువారం మంత్రి పర్యటించి వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతుల మామిడి తోటలు, వరి పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ గ్రామాల్లో ఎంత మేరకు నష్టం వాటిల్లిందో వ్యవసాయశాఖ, ఉద్యానశాఖ, రెవెన్యూశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మగ్ధుంపూర్, నంగునూరుతో పాటు కరీంనగర్ జిల్లా సరిహద్దులోని తమ తోటలకు నష్టం వాటిల్లిందని, తమను ఆదుకోవాలని రైతులు మంత్రికి మొరపెట్టుకున్నారు. బుధవారం అర్ధరాత్రి కురిసిన వానలతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రూ. లక్షలు ఖర్చు చేసి మామిడి తోటలు, వరి పొలాలు కౌలుకు తీసుకున్నామని తమను ఆదుకోవాలని కౌలు రైతులు మంత్రిని కోరడంతో జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెరి సగం అందజేయాలని అధికారులను ఆదేశించారు. మాది రైతు ప్రభుత్వం గత ప్రభుత్వాలు యాభై శాతం నష్టం జరిగితేనే పరిహారం అందజేసేవని, తాము అధికారంలోకి రాగానే 33 శాతం నష్టపోయినా ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తున్నామని మంత్రి హరీష్‌రావు అన్నారు. బద్దిపడగలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు నష్టం జరగకుండా చూడాలని సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. రైతులు అధైర్యపడొద్దని రెండు రోజుల్లో నష్టం వివరాలను సేకరించి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాకముందే ఎకరా వరికి రూ. 5,400, మామిడి తోటలకు ఎకరాకు రూ. 6,800 పరిహారం అందజేస్తామన్నారు. అధికారులు పారదర్శకంగా సర్వే చేపట్టి జాబితాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో అతికించి ఒక్క రైతుకు కూడా నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. అనంతరం వ్యవసాయశాఖ కమిషన్ ప్రియదర్శిని, ఇన్సూరెన్స్ కమిషనర్ రాజేశ్వరితో ఫోనులో మాట్లాడి తెలంగాణలో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌కు ఎరువుల కొరత రానివ్వం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల కొరత ఉన్నప్పటికీ ఖరీఫ్ సీజన్లో ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేటలో ఎస్ఎఫ్ కొనుగోళు కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ నిల్వ ఉంచేందుకు గిడ్డంగులు లేక కొనుగోళ్లు నిలిచిపోయాయన్నారు. గిడ్డంగుల్లో ఉన్న పత్తి నిల్వలను తరలించి పొద్దుతిరుగుడు పంటను హుజురాబాద్‌లోని గిడ్డంగిలో నిల్వ ఉంచేలా చూడాలని కమిషనర్ ఆదేశించామన్నారు. ఖరీఫ్ సీజన్‌లోగా ఎరువులు తెప్పించి రైతులకు అందుబాటులో ఉంచుతామన్నారు. ఆయన వెంట వ్యవసాయశాఖ జూయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, ఏడీఏ వెంకటేశ్వర్లు, ఓఎస్డీ బాల్‌రాజు, జెడ్పీవైస్ చైర్మన్ రాగుల సారయ్య, ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు కోల రమేశ్‌గౌడ్, ఎడ్ల సోమిరెడ్డి, సర్పంచ్ గిరిజ, మంజుల, నాయకులు దువ్వల మల్లయ్య, పురేందర్, వెంకట్‌రెడ్డి, తిరుపతి, జయపాల్‌రెడ్డి, వెంకట్రాజం, బి కృష్ణారెడ్డి, అధికారులు ప్రభాకర్, శ్రీహరి, మోహన్, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంట నష్టంపై ప్రభుత్వం నిర్లక్ష్యం
- కేంద్రం నివేదిక కోరినా పట్టించుకోవడం లేదు - ప్లీనరీకి వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు - బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి హన్మకొండ: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంట నష్టాన్ని నిర్ధారించకుండా రాష్ర్ట ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి అన్నా రు. బుధవారం హన్మకొండ ఎన్జీవోస్ కాలనీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్రం పంట నష్టం వివరాలకు సంబంధించిన నివేదిక పంపితే, కేంద్ర బృందం వచ్చి పరిశీలిస్తుందని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రకృతి వైపరిత్యాలతో రైతు లు మరణిస్తే ఇచ్చే పరిహారాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచిందన్నారు. 30 శాతం పంట నష్టపోతే పరిహారాన్ని ఇవ్వడంతో పాటు దీన్ని 50 శాతానికి పెంచిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదర్శ రైతులను నియమిస్తే విమర్శించిన టీఆర్ఎస్, అధికారంలోకి రాగానే ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులను చేసిందని ధ్వజమెత్తారు. విదేశంలో జరుగనున్న రైతు సదస్సుకు ఎమ్మెల్యే కుమారుడు, ఎమ్మెల్యేలను ఆదర్శ రైతులుగా ఎం పిక చేసి పంపడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పింఛన్ రాని వికలాంగుడు తన బాధ చెప్పుకోవడానికి హైదరాబాద్ వెళ్లితే ఇక్కడికి కూడా వస్తారా అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డి వికలాంగుని గెంటి వేసి దుర్మార్గంగా వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ జనాభాలో సగభాగమైన మహిళల్లో ఒక్కరిని కూడా మంత్రి వర్గంలోకి తీసుకోలేదని విమర్శించారు. -
పింఛన్ డబ్బు కోసం నిరసన
- రోడ్డెక్కిన వృద్ధులు - రెండు గంటల పాటు రాస్తారోకో - నచ్చజెప్పి ఆందోళన విరమింప జేసిన ఎస్ఐ జిన్నారం: ప్రభుత్వం తమకు పింఛన్లు మంజూరు చేసినా స్థానిక పోస్టుమన్, పంచాయతీ సిబ్బంది డబ్బులు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ సోమవారం పలువురు వృద్ధులు రోడ్డెక్కారు. ఈ ఘటన జిన్నారం మండలం దోమడుగు ప్రధాన రహదారి పై చోటు చేసుకుంది. దోమడుగు పంచాయతీ పరిధిలో సుమారు 300 వరకు పింఛను లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం డబ్బు మంజూరు చేసిం ది. అయితే రెండు నెలలుగా పోస్టు మన్ వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు డబ్బులు ఇవ్వడం లేదు. పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. దీంతో విసుగు చెందిన వృద్ధులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. స్థానిక వార్డు సభ్యులు గోవర్దన్ గౌడ్, యాదగిరి వృద్ధులకు మద్దతుగా రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిన్నారం ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యను స్వయంగా తెలుసుకున్నారు. ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, స్థానిక పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, పోస్టు మన్లతో ఎస్ఐ లాలూనాయక్ ఫోన్లో మాట్లాడి ఇక్కడి సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లారు. గంటలోపు అర్హులకు పిం ఛను డబ్బు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఈ విషయాన్ని ఎస్ఐ లాలూనాయక్ ఆందోళన కారులకు చెప్పి వారి ని ఎంపీడీఓ కార్యాలయానికి పంపారు. -
తెలంగాణ.. అమరుల త్యాగఫలమే..
- ఇప్పుడైనా అందరి బతుకులు బాగుపడాలి - అందుకోసం ప్రభుత్వం కృషి చేయాలి - వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - రంగథాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి - ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు సిద్దిపేట జోన్: దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట మ ండలం రంగథాంపల్లి వద్ద ఆగి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని తెలంగాణలోని ప్రతి బిడ్డా ఎదురు చూశారన్నారు. వారి బంగారు భవిష్యత్తు ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిల్లా అధ్యక్షుడు ప్ర భుగౌడ్, నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్మ రవీందర్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పట్లోల్ల సిద్ధార్థ్‌రెడ్డి, పార్టీ క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు వీఎల్ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్‌గౌడ్, బాలన్న గౌడ్, పర్శరాంరెడ్డి, తడక జగదీశ్వర్, క్రీస్తు దాస్, సంజీవరావు, రాం రాజు, శ్రీశాంక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. పొంగులేటికి ఘన స్వాగతం.. కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్న పొంగులేటికి సిద్దిపేట మండలం రంగథాంపల్లి వద్ద పార్టీ శ్రేణులు ఆదివారం ఘన స్వాగతం పలికాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుగౌడ్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జి తడక జగదీశ్వర్ నేతృత్వంలో పార్టీ నేతలు పూలమాలలు వేసి, బొకేలు అందజేశారు. సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు -
కళాభారతికి కొత్త హంగులు
టవర్‌సర్కిల్: కరీంనగర్‌లోని కళాభారతిని అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆధునికీకరణకు యుద్ధప్రాతిపదికన ప్రతిపాదనలు పంపించాలని మున్సిపల్ కమిషనర్‌కు ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు అధికారులు హడావుడిగా ప్రతిపాదనలు తయారు చేసే పనిలో పడ్డారు. రూ.10 కోట్లతో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి పంపించేందుకు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఆధునిక సౌకర్యాలు కళాభారతికి సకల హంగులు కల్పించి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని తలపించే విధంగా చేయాలనేది ప్రభుత్వ యోచనగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న కళాభారతి రూపురేఖలను పూర్తిగా మార్చేయనున్నారు. సెంట్రల్ ఏసీ, అత్యాధునిక సౌండ్ సిస్టం, లైటింగ్, లగ్జరీ సీటింగ్, ఉడెన్ ఫ్లోర్ విత్ కార్పెట్, డోర్స్ మార్పు, శాటిలైట్ కనెక్షన్‌తో ప్రొజెక్టర్, థియేటర్ స్క్రీన్, ముందుభాగం ఎలివేషన్, మ్యూజికల్ ఫౌంటేన్, సీలింగ్ మార్పు, ఉడెన్ ప్యానల్‌తో సైడ్‌వాల్స్, అందమైన వేదిక, రెండు డ్రెస్సింగ్ రూమ్‌లు, సెన్సార్ సౌకర్యంతో టాయిలెట్స్, ఫైర్ పరికరాలు కల్పించేందుకు అధికారులు అంచనాలు రూపొందించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రేట్లతో రూపొందించిన ప్రాథమిక అంచనాల జాబితాను సిద్ధం చేస్తున్నారు. అయితే అనుభవం ఉన్న కన్సెల్టెన్సీలతో మరోమారు పూర్తిస్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు. హంగులతో ఆదరణ ప్రస్తుతం కళాభారతి సౌకర్యాల లేమితో సతమతమవుతోంది. కార్యక్రమాలకు ప్రతికూలంగా మారింది. కేవలం ఒక్క టాయిలెట్, ఒకే ఒక్క డ్రెస్సింగ్‌రూమ్, విరిగిన చైర్లు, తిరగని ఫ్యాన్లు, వెలగని లైట్లు, ఎప్పుడు విరుగుతాయో తెలి యని స్టేజీ చెక్కలు.. ఇన్ని అసౌకర్యాల మధ్య సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కళాకారులకు కత్తిమీద సాముగా మారింది. దీంతో ఎవరూ కళాభారతి లో కార్యక్రమాలకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం కళాభారతి ఆధునికీకరణకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో కళాకారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కార్యక్రమాల నిర్వహణ అంగరంగ వైభవంగా చేసుకోవచ్చనే ధీమా కనబరుస్తున్నా రు. కార్యక్రమాలు పెరిగితే కళాభారతికి ఆదాయం గణనీయంగా పెరగనుంది. -
భూసేకరణం!
సాక్షి ప్రతినిధి, కర్నూలు : జిల్లాలో భారీగా భూసేకరణ చేయడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. జిల్లాలో నెలకొల్పేందుకు ముందుకు వస్తున్న వివిధ ప్రైవేటు కంపెనీల కోసం భూమిని కేటాయించేందుకు భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు అవసరమయ్యే భూమి కోసం ఏకంగా 28 వేల ఎకరాలకుపైగా సేకరించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వీలుగా భారీ భూ బ్యాంకును సిద్ధంగా ఉంచాలనేది జిల్లా యంత్రాంగం ఆలోచనగా ఉంది. ఇందుకోసం సుమారు 40 వేల ఎకరాలను సేకరించి సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 12 వేల ఎకరాల మేరకు సేకరించి సిద్ధం చేసింది. మిగిలిన 28 వేల ఎకరాలకుపైగా భూమిని సేకరించేందుకు ఈ నెలాఖరులోగా అన్ని భూసేకరణ నోటిఫికేషన్లను జారీచేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ ఇప్పటికే ఆదేశించినట్టు తెలిసింది. ఆ మూడు మండలాల్లోనే! జిల్లాలో యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వివిధ కంపెనీల కోసం జిల్లావ్యాప్తంగా 28,236 ఎకరాల మేరకు భూమిని ఇంకా సేకరించాల్సి ఉందని ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం గుర్తించింది. అయితే, ఇందులో ప్రధానంగా ఓర్వకల్లు, గడివేముల, పాణ్యం మండలాల్లోనే అధిక భూమిని సేకరించాల్సి ఉండటం గమనార్హం. ఫ్రధానంగా అటు ప్రాంతీయ విమానాశ్రయంతో పాటు సౌర విద్యుత్ పార్కు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ యూనిట్, వివిధ సిమెంటు ప్లాంట్ల కోసం ఈ భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం 40 వేల ఎకరాల భూ బ్యాంకును ఏర్పాటు చేయడంలో ఈ భూసేకరణ ప్రక్రియ కీలకంగా మారనుంది. ప్రధానమైన పరిశ్రమలన్నీ కేవలం ఈ మూడు మండలాల్లోనే ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తున్నాయి. వీటితో పాటు కొలిమిగుండ్ల, జూపాడుబంగ్లా, వెల్దుర్తి తదితర మండలాల్లో కూడా వివిధ యూనిట్ల కోసం భూమిని సేకరించాల్సి ఉంది. మొత్తం మీద 28 వేల ఎకరాలకుపైగా భూ సేకరణ ప్రక్రియను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ప్రారంభించింది. అయితే, ఈ ప్రక్రియకు ఈ భూముల్లో ఉన్న రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుండటం జిల్లా యంత్రాంగాన్ని కలవరానికి గురిచేస్తోంది. మా భూములు ఇవ్వం...! భారీ భూ సేకరణ ప్రక్రియకు ఒకవైపు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం భూసేకరణ నోటిఫికేషన్ల జారీకి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే, భూసేకరణకు రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. తమ భూములు ఇవ్వమని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు పాణ్యంతో పాటు ఇటు ఓర్వకల్లు, గడివేముల మండలాల్లోని పలు గ్రామాల రైతులు కర్నూలు, నంద్యాల ఆర్డీవో కార్యాలయాల ముం దు ఆందోళనకు కూడా దిగుతున్నారు. ఒకవైపు భూములు ఇవ్వాల్సిందేనని రెవెన్యూ యంత్రాం గం.. ఇవ్వబోమని రైతుల ఆందోళనల నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యమాలు జరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లావ్యాప్తంగా భూ సేకరణ వివరాలు ఇవే...! రిక్విజిషన్ డిపార్ట్మెంట్/ఏజెన్సీ మండలం పేరు గ్రామం పేరు మొత్తం ఎకరాలు న్యూక్లియర్ ఫ్యూయెల్ కాంప్లెక్స్ ఓర్వకల్లు మీదివేముల 859.87 గుట్టపాడు 23.40 ఉన్నతవిద్య ఓర్వకల్లు నన్నూరు 147.74 డీఆర్డీఓ ఓర్వకల్లు కాల్వ 89.47 ఎన్.కొంతలపాడు 17.01 పాలకొలను 1266.84 ఉప్పలపాడు 555.53 ఉయ్యాలవాడ 368.19 వెల్దుర్తి బుక్కాపురం 424.85 ఎనర్జీ డిపార్ట్మెంట్ గడివేముల గని 1648.92 ఓర్వకల్లు శకునాల 1509.87 న్యూ అండ్ రెన్యువల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పాణ్యం పిన్నాపురం 3794.06 ఏపీఐఐసీ ఓర్వకల్లు బ్రాహ్మణపల్లి 441.95 గుట్టపాడు 1194.36 కన్నమడకల 244.18 కేతవరం 2869.02 కొమరోలు 1712.94 లొద్దిపల్లె 1024.49 మీదివేముల 1849.90 ఎన్.కొంతలపాడు 95.98 ఓర్వకల్లు 904.93 పాలకొలను 261.85 పూడిచెర్ల 438.76 సోమయాజులపల్లె 1225.77 ఉప్పలపాడు 1043.26 ఏఐసీసీ జూపాడుబంగ్లా తంగడంచ 211.10 రామ్‌కో సిమెంట్స్ కొలిమిగుండ్ల ఇటిక్యాల 543.76 కలవట్ల 51.24 నందిపాడు 155.00 జైన్ ఇరిగేషన్ సిస్టమ్స్ జూపాడుబంగ్లా తంగడంచ 313.37 ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కార్పొరేషన్ ఓర్వకల్లు ఓర్వకల్లు 1324.80 కన్నమడకల 754.89 పూడిచెర్ల 833.93 మొత్తం 28,236.43ఎకరాలు -
గడువు 2 రోజులే..
మహబూబ్‌నగర్ టౌన్: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే ఇళ్లస్థలాల క్రమబద్ధీకరణ (సంబంధిత వ్యక్తుల పేర చేయించుకోవడం)ప్రక్రియ జిల్లాలో ఆశించిన ఫలితాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యంగా గ్రామీణస్థాయిలో చాలామందికి అవగాహన లేకపోవడంతో దరఖాస్తులు చేసుకునేందుకు ముందుకురావడం లేదు. అధికారులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం ఒకటైతే.. ప్రచారం చేయకపోవడంతో నామమాత్రపు స్పందన లభించిందని తేటతెల్లమైంది. ఈ క్రమంలో ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 31వ తేదీతో ముగియనుంది. ఇళ్లస్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం 58,59 జీఓలను జారీచేసింది. దీనికి సంబంధించి ముందుగా ఈనెల 19వ తేదీ వరకు గడువు విధించినప్పటికీ జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్ల పరిధిలో కేవలం 244దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. గడువును మరింత పెంచడంతో బుధవారం నాటికి 2604 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో జీఓ నెం.58 కింద క్రమబద్ధీక రణ కోసం 2549, జీఓ నెం.59 కింద 55 దరఖాస్తులు వచ్చాయి. తద్వారా ప్రభుత్వానికి రూ.39.42లక్షల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మహబూబ్‌నగర్ రెవెన్యూ డివిజన్ పరిధిలోనే 1224 దరఖాస్తులు నమోదయ్యాయి. దీంతోపాటు జీఓ నెం.59కి 17దరఖాస్తులు రాగా వీటికి సంబంధించి రూ.31,83,675 ఆదాయం వచ్చింది. అత్యల్పంగా నాగర్‌కర్నూల్‌లో వచ్చాయి. క్రమబద్ధీకరణతో మేలు ఇళ్లు ఉన్నా ఇంకా క్రమబద్ధీకరించుకోలేని కుటుంబాలు జిల్లాలో 10వేల పైగా ఉన్నట్లు సంబంధిత అధికారుల అంచనా. జీఓ నెం.58ప్రకారం 125 గజాల లోపు స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరిస్తారు. 125 నుంచి 250గజాల వరకు అయితే మార్కెట్ ధరలో 30శాతం ప్రభుత్వానికి ఫీజు రూపేణా చెల్లించాలి. 250 నుంచి 500గజాల వరకు ఉన్న వారంతా ధరలో 75శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయితే వారి స్థలాలను ఇతరులకు విక్రయించుకునే సౌలభ్యం ఉంటుంది. ఉచితంగా క్రమబద్ధీకరించుకునేవారు విక్రయించుకునేందుకు వీలుండదు. ఒకవేళ వారు విక్రయించాల్సి వస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర కచ్చితంగా చెల్లించాలి. అవగాహన లేని కారణంగానే కొందరే దరఖాస్తులు చేసుకుంటున్నారు. క్రమబద్ధీకరణకు గడువు రెండురోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అర్హులంతా దరఖాస్తు చేసుకుంటారా? లేదా? అనేది తేలాల్సి ఉంది. డివిజన్ల వారీగా దరఖాస్తులు డివిజన్ పేరు జీఓ జీఓ ఆదాయం నెం. 58 నెం.59 1, మహబూబ్‌నగర్ 1224 17 రూ.31,83,675 2. గద్వాల 591 18 రూ.2,85,875 3. వనపర్తి 402 2 రూ.1.20లక్షలు 4. నాగర్‌కర్నూల్ 47 10 రూ.87వేలు 5. నారాయణపేట 285 8 రూ.2,65,750 మొత్తం: 2549 55 రూ.39,42,300 -
ఇసుకే బంగారమాయె!
దర్మవరం : ఇసుకను ప్రభుత్వం బంగారంగా మార్చేస్తోంది. నిర్మాణదారులను దోపిడీ చేసి ఖజానా నింపుకోవాలని చూస్తోంది. రీచుల నుంచి ఇసుక రవాణాకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వులు అటు సామాన్య వినియోగదారులను, ఇటు ఇసుక రవాణాపైనే ఆధారపడిన వాహనదారులను షాక్‌కు గురి చేస్తున్నాయి. ఈ ఉత్తర్వులు అమల్లోకి రావడంతో ఇసుక రీచ్‌లలో అమ్మకాలు, రవాణా దాదాపు నిలిచిపోయాయి. సొంత వాహనాలు చెల్లవు కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం రీచుల నుంచి ఇసుకను తరలించేందుకు వినియోగదారులు ఇంతకు ముందులా సొంత లేదా తమకు నచ్చిన వాహనాలను అద్దెకు వినియోగించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లోనే.. అదీ ఇసుక ధరతోపాటు రవాణా ఖర్చులను ముందుగానే చెల్లించి ఇసుకను తీసుకెళ్లాలని ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో ఆదేశించింది. దీంతో జిల్లాలోని అన్ని రీచ్‌లలో ప్రభుత్వం అనుమంతి పొందిన వాహనాల్లోనే ఇసుకను రవాణా చేస్తున్నారు. ఇసుక రీచ్‌ల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు కట్టబెట్టిన ప్రభుత్వం ఇప్పుడు రవాణాను కూడా వారికే కట్టబెట్టింది. ఇసుక రవాణా చేయదలచిన వారు సంబంధిత వెలుగు కార్యాలయాల్లో తమ వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను నమోదు చేసుకోవాలి. ఇసుక కొనుగోలుదారుల సొంత వాహనాలతో సహా ఇతరత్రా ఏ వాహనాలను అనుమతించరు. ఇసుక కావాల్సిన వారు ఇసుక ధరతోపాటు వాహనం బాడుగను ముందుగానే మీ సేవా కేంద్రంలో చెల్లించి రసీదు తీసుకొస్తేనే సంబంధిత రీచ్‌ల నిర్వహకులు ఇసుక లోడింగ్ అనుమతిస్తారు. దూరాన్ని బట్టి రవాణా చార్జీలను ప్రభుత్వమే నిర్ణయిందింది. దాని ప్రకారం కిలోమీటర్ దూరానికి ట్రాక్టర్లకైతే రూ.28, లారీలకు రూ. 44 చొప్పున వసూలు చేస్తారు. కొనుగోలుదారులకు భారం : ఈ విధానం ఇసుక కొనుగోలు దారులకు భారంగా మారుతోంది. దీనికి తోడు ఇసుక రవాణాను ఉపాధిగా చేసుకున్న వందలాది ట్రాక్టర్లు, లారీల యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటి వరకు ఇసుక రవాణాకు వాహనదారులతో బేరమాడి నచ్చిన చార్జీలు చెల్లించే వెసులు బాటును వినియోగదారుడు కోల్పోయాడు. తాజా ఉత్తర్వుల ప్రకారం తప్పని సరిగా నిర్ణీత ధరను వెచ్చించి వినియోగదారుడు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి. ఫలితంగా వినియోగదారుడు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితి. ఉదాహరణకు ఒక ట్రాక్టర్ ఇసుకను ధర్మవరం పట్టణ వాసులు తాడిమర్రి వద్దనున్న ఇసుక రీచ్‌లో కొనుగోలు చేస్తే లోడ్ (మూడు క్యూబిక్ మీటర్లు) రూ. 2025, రవాణా చార్జీలు రూ. 1.000 కలుపుకుని రూ. 3025 లభించేది. కానీ ప్రభుత్వ నూతన విధానం వల్ల రవాణా చార్జీలే రూ.2240 చెల్లించాలి. ఇసుక, రవాణా చార్జీలు, మీసేవా రుసుము రూ.25 కలిపితే రూ.4290 పడుతుంది. అంటే వినియోగదారునిపై రూ.1265 అదనంగా భారం కానుంది. -
కొత్త సంవత్సరం...కొత్త రేషన్
ఆహార భద్రత పథకాన్ని నేడు ప్రారంభించనున్న మంత్రి తుమ్మల సూపర్ ఫైన్ బియ్యంతో పాఠశాలలు, హాస్టళ్లలో మధ్యాహ్న భోజనం ఆహార భద్రత కార్డులకు 7,00,260 కుటుంబాల అర్హత ‘అమ్మ హస్తం’ పథకానికి మంగళం ఖమ్మం జెడ్పీసెంటర్: కొత్త పథకమైన ‘ఆహార భద్రత’ను కొత్త సంవత్సరాదిన అమలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి కొత్త రేషన్ విధానం (ఆ హార భద్రత పథకం) అమలవుతుంది. ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇచ్చేందుకు ఆహారభద్రత కార్డులు ఇస్తోం ది. సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాల ల్లో సూపర్ ఫైన్ బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేందుకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఈ పథకాన్ని రాష్ట్ర రోడ్లు-భవనాలు, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఉదయం 11 గంటలకు ఏన్కూరులోని సాంఘిక సంక్షేమ భవన్లో ప్రా రంభిస్తారు. ఆ తరువాత, అక్కడే విద్యార్థులతో కలిసి భో జనం చేస్తారు. జిల్లావ్యాప్తంగా ఈ పథకానికి 7,93,694 మంది దరఖాస్తు చేశారు. వీటిలో 7,75,689 దరఖాస్తుల ను అధికారులు పరిశీలించారు. 7,00,260 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 16,000దరఖాస్తులను విచారిం చాల్సుంది. జిల్లాలోని సంక్షేమహాస్టళ్లకు 1155.726 టన్ను లు, మధ్యాహ్న భోజనానికి 583.749 మెట్రిక్ టన్నుల సూఫర్ ఫైన్ బియ్యాన్ని పంపిణీ చేస్తారు. ‘ఆహార భద్రత పథకం అమలుతో.. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘అమ్మ హస్తం’కు మంగళవారం పాడినట్టరుంది. 13,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ ఏన్కూరు: జిల్లాలో జనవరి 1 నుంచి చౌక దుకాణాల ద్వారా 13,000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్టు జాయింట్ కలెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు. ఆయన బుధవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో చౌక దుకాణాల ద్వారా 9000 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్టు తెలిపారు. కుటుంబంలో ఒక వ్యక్తికి ఆరు కిలోల బియ్యం పంపిణీ చేయనుండడంతో అదనంగా 4000 మెట్రిక్ టన్నుల బియ్యం పెరిగిందన్నారు. జిల్లాలో 2,75,000 మంది విద్యార్థులకు జనవరి 1 నుంచి సన్న బియ్యంతో భోజనం అందించనున్నట్టు చెప్పారు. నెలకు 1700 మెట్రిక్ టన్నుల సన్న బియ్యం అవసరమవుతుందన్నారు. సన్న బియ్యం పంపిణీతో అదనంగా 15కోట్ల రూపాయల భారం పడుతుందన్నారు. -
నమ్మిన రైతుకు వెన్నుపోటు!
రైతుల్ని ఎన్ని విధాలా రుణభారం నుండి తప్పించవచ్చన్నది పక్కనబెట్టి, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుండి తప్పించవచ్చని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. రుణమాఫీతో విముక్తి ప్రసాదించకపోగా, రైతు ప్రపంచంలో కొత్త కల్లోలాన్ని సృష్టించింది. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద ఏ కాస్త అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. రైతు రుణమాఫీ చేసి తీరుతానని గత ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దా నం చేశారు. అది సాధ్యం కాదని తన రాజకీయ ప్రత్యర్ధి జగన్మో హన్‌రెడ్డి అన్నప్పుడు బాబు ఎద్దే వా చేశారు. అసాధ్యాన్ని సాధ్యం చేసే చరిత్ర తమకు ఉన్నదన్నారు. టీడీపీ ఎన్నికల ప్రణాళికలోను రై తు రుణమాఫీ హామీని ప్రముఖంగా ప్రచురించారు. ఐదు కోట్ల మంది జనాభా గల రాష్ర్టంలో ఉన్న దాదాపు 85 లక్షల మంది రైతులు తమ రుణవిముక్తి ప్రదాత చంద్ర బాబు రూపంలో వచ్చాడని నమ్మారు. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదమూడు జిల్లాల్లో టీడీపీకి పడిన ఓట్లలో అత్యధికం రైతు కుటుంబాల నుండి వచ్చినవే. ఈ ఎన్నికల్లో టీడీపీ, వైయస్సార్ సీపీల మధ్య ఓట్ల తేడా వెంట్రుకవాసి మాత్రమే. ఏపీ రైతుల్లో చంద్రబాబు మీద వెంట్రుకవాసి అనుమానం వచ్చినా కొత్త ప్రభుత్వం రూపు రేఖలే మారిపోయి ఉండేవి. వ్యవసాయాన్ని వృత్తిగా కొనసాగించడం వేరు. వ్యవ సాయ భూమిని కలిగి ఉండటం వేరు. వ్యవసాయాన్ని వృత్తిగా సాగించేవాళ్లలో కౌలు రైతులు, వ్యవసాయ కూలీ లు ఉంటారు. వాళ్లిద్దరూ చంద్రబాబు రుణమాఫీ ఖాతా లో లేరు. బాబు ఖాతాలో ఉన్నది వ్యవసాయ భూమిని కలిగి ఉన్న రైతులు మాత్రమే. తొలి అడుగులోనే వారు వ్యవసాయ జనాభాని సగానికి పైగా నరికేశారు. రైతు రుణాల్లో పంటరుణం, వ్యవసాయరుణం, కుటుంబ రుణం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని వ్యవ సాయార్థిక అంశంపై పరిశోధనా వ్యాసం రాసిన చంద్ర బాబుకు మరింత లోతుగా తెలుసు. ఎన్నికల ప్రచారం లోనూ, ఎన్నికల ప్రణాళికలోనూ బాబు రైతు రుణం మాఫీ చేస్తానని చెప్పారే గానీ పంటరుణం మాత్రమే మా ఫీ చేస్తానని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. పంట రుణం సాధారణంగా ఎకరాకు 20 - 25 వేల రూపాయల మేర మాత్రమే ఉంటుంది. రెండెకరాల రైతుగా జీవితాన్ని మొదలు పెట్టిన చంద్రబాబుకు పంటరుణం వేల రూపాయల్లోనూ, రైతు రుణం లక్షల రూపాయల్లోనూ ఉంటుందని అనుభవపూర్వకంగా తెలుసు. ఎన్నికల ముందు రైతు రుణాలన్నీ వ్యవసాయ రుణాలన్న చంద్రబాబు, వారి ప్రచారకర్తలు వాటిని ఇప్పు డు తుంగలో తొక్కారు. ఇప్పుడు పంటరుణాన్ని సహితం పక్కన పెట్టడానికి వాళ్లంతా పడరానిపాట్లు పడుతు న్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే కొత్త ఆయుధాన్ని కనిపె ట్టింది వీళ్లే. రైతులు పంటరుణం ఎంత తీసుకున్నారు? అనేదాన్ని పక్కనపెట్టి, పంటరుణం ఎంత తీసుకోవడా నికి అర్హులు? అనేదాన్ని స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రాతిపదికగా తీసుకుంటుంది. అంటే రైతులకున్న పంటరుణంలో కూ డా వీరు భారీ కోత పెట్టారన్నమాట. అనేక వ్యవసాయ పరపతి సొసైటీలతో పాటూ కొన్ని బ్యాంకు ల్లో కూడా టైటిల్ డీడ్, పాస్ పుస్తకాలను తాకట్టు పెట్టుకోకుండానే పంటరుణం ఇవ్వడం అనేది చాలా కాలంగా సాంప్రదాయంగా వస్తోంది. దానికి విరుద్ధంగా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం డాక్యుమెంట్లు తాకట్టు పెట్టని పంట రుణాల్ని అండర్ ప్రాసెస్‌గా ఆన్లైన్లో పెడుతున్నా రు. అలాంటి రుణాలు ఎప్పటికీ మాఫీ కావని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సిహెచ్ కుటుంబరావు తేల్చేశారు. ఆస్తులు, పొలాలు పంచుకున్న తరువాత కూడా అన్నద మ్ములు ఒకే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉండ టం గ్రామీణ ప్రాంతంలో సాధారణ విషయం. అనేక సందర్భాల్లో అన్నదమ్ముల పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉం టాయి. అలాంటి అన్నదమ్ములు చెరో కొంత భూమి మీద చెరో కొంత పంటరుణాన్ని తీసుకుని ఉంటే, ఇద్దరి లో ఒక్కరికి మాత్రమే పంటరుణం మాఫీ అవుతుంది. ఒక రేషన్ కార్డుపై ఒకరికే రుణ మాఫీ అనేది కొత్త నిబంధన. అంటే, చంద్రబాబు పంటరుణం పథకం గ్రామీణ ఉమ్మడి కుటుంబాల్లో కొత్త చిచ్చు రగుల్చుతోంది. రుణమాఫీకి సంబంధిత పత్రాలు పోయిన సంద ర్భాల్లో వాటి ట్రూ- కాపీల కోసం బ్యాంకుల, పాలక మండళ్లు, రెవెన్యూ అధికారులను కలవాల్సి ఉంటుంది. వ్యవసాయదారుల్లో అత్యధికులు నిరక్షరాస్యులు. వయో వృద్ధులు. ఇన్ని కార్యాలయాల చుట్టూ తిరిగి రుణ మాఫీ పత్రాలని సక్రమంగా సేకరించి, సమర్పించడం అనేది వాళ్లవల్ల అయ్యే పనికాదు. ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లో వ్యవ సాయ భూములు ఉండి, ఇతర రాష్ట్రాల్లో ఆధార్ కార్డులు ఉన్న రైతులు రుణమాఫీ పొందడానికి అనర్హులని ప్రణాళి కా సంఘం ప్రకటించింది. ఆరు నెలల క్రితం విడిపోయిన తెలంగాణ రాష్ర్టంలోనే కాదు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఆంధ్రా రైతులు పెద్ద సంఖ్యలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణు డు హైదరాబాద్‌లోని ఆంధ్రా రైతు లకు రుణమాఫీ అం శాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు. వారి ప్రకటన వచ్చిన గంటలోపే ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ కుటుంబరావు ప్రతిస్పందిస్తూ అది అసాధ్యమని తేల్చేశా రు. ఇప్పటికీ హైదరాబాద్‌లోనే నివాసం ఉంటూ, అక్కడే ఆధార్ కార్డు ఓటరు ఐడి కలిగి ఉన్న చంద్రబాబు గారికి పొరుగు రాష్ర్టంలో ఎమ్మెల్యేగా పోటీచేసి, ముఖ్యమంత్రి కావడానికి కూడా సహకరించిన నిబంధనలు, రైతుల దగ్గ రికి రాగానే అడ్డుకట్టగా ఎలా మారిపోతున్నా యో మరి. రైతుల్ని ఎన్ని విధా లా రుణభారం నుండి తప్పించవచ్చు అని కాక, రైతుల్ని ఎన్ని విధాలా రుణమాఫీ పథకం నుం డి తప్పించవచ్చు అని చంద్రబాబు ప్రభుత్వం ఆలోచిస్తు న్నది. ఇది విషాదం! (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు సామాజిక విశ్లేషకులు, మొబైల్ నంబర్ : 90107 57776) -
చలో హైదరాబాద్‌పై ఉక్కుపాదం
ఏలూరు (టూ టౌన్): గత 18 నెలలుగా జీతాలు లేక ఆకలితో అలమటిస్తున్న ఇందిరాక్రాంతిపథం యానిమేటర్లు ఆదివారం చేపట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పోలీసులు పక్కా ప్రణాళికతో భగ్నం చేశారు. జిల్లాలోని సుమారు 200 మంది ఐకేపీ యానిమేటర్లను అదుపులోని తీసుకుని హెచ్చరించారు. అంతేకాకుండా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కనుక అక్కడికి వెళ్లి ఆందోళన చేస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తారంటూ బెదిరించారు. జిల్లాలోని ప్రతి మండలంలోని ఐకేపీ యానిమేటర్ల ఫోన్ నెంబర్లు, అడ్రస్‌లు సేకరించిన పోలీసులు నేరుగా ఇళ్లకు వెళ్లి బయటకు వస్తే అరెస్ట్‌లు చేస్తామంటూ బెదిరించారు. కొందరు యానిమేటర్లు ధైర్యం చేసి ఇంటి నుంచి బయటకు వచ్చేసరికి అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జిల్లాలోని పలు మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం తొమ్మిది గంటలకే అదుపులోకి తీసుకుని సాయంత్రం ఐదుగంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై పంపించారు. మమ్మల్ని కాదని మీరు బస్టాండ్‌కు వెళ్లినా, రైల్వేస్టేషన్‌కు వెళ్లినా అరెస్ట్ చేసి తీరతామంటూ హెచ్చరించారు. కాగా నరసాపురం రూరల్ పోలీసుస్టేషన్లో అదుపులోకి తీసుకున్న యానిమేటర్లకు మద్దతుగా మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ నాయకుడు కొత్తపల్లి సుబ్బారాయుడు కుమారుడు నాని పోలీస్‌స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. కాళ్ల మండలంలోని దొడ్డనపూడికి చెందిన కుమారి అనే యానిమేటర్ కాళ్ల పోలీస్‌స్టేషన్‌లో స్పృహతప్పి పడిపోయూరు. గర్భిణులను కూడా స్టేషన్ తరలించటంతో పోలీసులు పలు విమర్శలు ఎదుర్కొన్నారు. ఐకేపీ యానిమేటర్లు 96 రోజులుగా తమ జీతాల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ వారికి న్యాయం చేయకపోగా అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయటంపై సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎన్‌వీడీ ప్రసాద్ విమర్శించారు. ఏలూరులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. నిడదవోలు మండలంలో నలుగురిని, పెరవలి మండలంలో ఐదుగురిని, ఉండ్రాజవరం మండలంలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భీమవరంలో 18 మందిని, ఉండిలో 13 మందిని, కాళ్లలో ఏడుగురిని, పాలకోడేరులో 10 మందిని, ఆకివీడులో ఐదుగురిని, దేవరపల్లిలో 27 మందిని, ద్వారకాతిరుమలలో ఐదుగురిని, ఆచంటలో ఎనిమిది మందిని, పెనుగొండలో 18 మందిని, పెనుమంట్రలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చింతలపూడిలో 10 మందిని జంగారెడ్డిగూడెంలో 12 మందిని, లింగపాలెంలో ముగ్గురిని, కామవరపుకోట మండలంలో తొమ్మిది మందిని, నరసాపురం మండలంలో 31 మందిని, పోడూరులో 11 మందిని, యలమంచిలిలో 10 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తణుకు, అత్తిలి మండలాల్లో ఐకేపీ యానిమేటర్లను ఉదయం నుంచీ బెదిరించారు. తాడేపల్లిగూడెంలో ప్రత్యేక నిఘా పెట్టి రైల్వేస్టేషన్, బస్టాండ్ వద్ద పోలీసులు రాత్రి వరకు పహారా కాశారు. జిల్లా నుంచి హైదరాబాద్ వెళ్లే గోదావరి, గౌతమి, నరసాపుర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే స్టేషన్ల వద్ద పోలీసులు నిఘా పెట్టారు. స్టేషన్‌కు వచ్చేవారిని వచ్చినట్టు అదుపులోకి తీసుకునేలా అధికారులు డీఎస్పీ, సీఐ, ఎస్సైలకు అదేశాలు జారీచేశారు. బస్టాండ్ల వద్ద కూడా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. -
ఉద్యమంపై ఉక్కుపాదం
* వెలుగు యానిమేటర్లకు పోలీసుల నిర్బంధం * ‘చలో హైదరాబాద్’కు వెళ్లకుండా నిరోధం కాకినాడ క్రైం : ఇందిరా క్రాంతి పథం (వెలుగు) యానిమేటర్ల ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. యానిమేటర్లు తమ సమస్యల పరిష్కారానికి సోమవారం ‘చలో హైదరాబాద్’ కార్యక్రమం తలపెట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి యానిమేటర్లు, నాయకులు ఆదివారం రాత్రి హైదరాబాద్ వెళ్లబోగా యఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. కొందరు నాయకులను వారి గృహాల్లో నిర్బంధించారు. వెలుగు యానిమేటర్లు తమ 15 నెలల వేతన బకాయిలు వెంటనే విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో మూడు నెలలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. తమ సమస్యలు పరిష్కరించాలని పలుమార్లు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో కలెక్టరేట్ల వద్ద ఆందోళనకు దిగారు. వారి సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. దీంతో తమ గళం అసెంబ్లీ ఎదుట వినిపించాలని యానిమేటర్ల నాయకులు తీర్మానించారు. సోమవారం అసెంబ్లీముట్టడికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో యానిమేటర్లు హైదరాబాద్ తరలి రాకుండా నిరోధించాలని ప్రభుత్వం పోలీసుల్ని ఆదేశించింది. ఉద్యమాన్ని అణిచి వేయాలని సూచించింది. దీంతో పోలీసులు జిల్లాలో పలువురు నాయకులను నిర్బంధించారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో నిఘా ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక గస్తీ నిర్వహించి, యానిమేటర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. జిల్లాలో సుమారు 500 మంది యానిమేటర్లను వివిధ ప్రాంతాల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలులో యానిమేటర్లను వారి గృహాల్లో నిర్బంధించారు. అమలాపురంలో బస్టాండుకు వెళ్లిన వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆత్రేయపురంలో యూనియన్ నాయకురాలు మణిని అదుపులోకి తీసుకున్నారు. రాజమండ్రి రైల్వే స్టేషన్లో 20 మందిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బొమ్మూరులో ఇళ్ల వద్ద ఉన్న యానిమేటర్లను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదు : ఎస్పీ ఇందిరా క్రాంతి పథం యానిమేటర్లు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ పేర్కొన్నారు. వారి దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో నిర్వహించతలపెట్టిన కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఆ రెండు రోజుల్లో యానిమేటర్లు, నాయకులు హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నిస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అరెస్టులకు ఖండన కాకినాడ సిటీ : సమ్మె చేస్తున్న యానిమేటర్లు సమస్యలు పరిష్కరించకుండా చలో హైదరాబాద్‌కు వెళ్ళేవారిని పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఐటీయూ ఖండించింది. కార్పొరే ట్ వర్గాలకు తొత్తుగా పనిచేస్తున్న ప్రభుత్వం సమస్యల పరిష్కారం కోరుతున్న కార్మికుల అరెస్టులకు, అణచివేతలకు పూనుకోవడం దారుణమని ఆ సంఘం నాయకులు జి.బేబిరాణి, డి.శేషబాబ్జి ఆందోళన వ్యక్తం చేశారు. యానిమేటర్ల చలో హైదరాబాద్ నేపథ్యంలో పోలీసులను ఇళ్ళకు పంపి భయానక పరిస్థితిని సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
హిందూజాకు తలొగ్గిన సర్కారు!
ట్రాన్స్‌కో అభ్యంతరాలు బుట్టదాఖలు ప్రజలపై విద్యుత్ భారం ఖాయం సాక్షి, హైదరాబాద్: పవర్ రేసులో పరుగెత్తడమే లక్ష్యంగా ప్రభుత్వం హిందూజా సంస్థ గొంతెమ్మ కోర్కెలకు సర్కారు తలూపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వమే హుకుం జారీ చేయడంతో ఏపీ ట్రాన్స్‌కో ఈ నెల 30వ తేదీకల్లా ఆ సంస్థతో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సిద్ధమైంది. దీనివల్ల రాష్ట్ర ప్రజలపై మోయలేని విద్యుత్ భారం తప్పనిసరి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. హిందూజా డిమాండ్లను ఏపీ ట్రాన్స్‌కో మొదటినుంచి వ్యతిరేకిస్తోంది. దీంతో యాజమాన్యం నేరుగా ప్రభుత్వం పెద్దలను ఆశ్రయించి వారిని సంతృప్తి పరచడంతో హిందూజా కోరినట్టు పీపీఏలు చేసుకోవాలని ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది.1040 మెగావాట్ల హిందూజా తాజాగా ఒక యూనిట్‌ను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేసింది. పాత పీపీఏలను పక్కనబెట్టి, కొత్త డిమాండ్లను తెరమీదకు తెచ్చింది. స్థిర వ్యయం రూ. 1.75 వరకూ ఇవ్వాలని ప్రతిపాదించింది. 75 శాతం విద్యుత్‌ను బయట అమ్ముకోవడానికి అనుమతి కోరింది.దీనికి అధికారులు ససేమిరా అనడంతో 100 శాతం విద్యుత్ రాష్ట్రానికే ఇవ్వడానికి ఒప్పుకుంది. సంస్థ కోరిన యూనిట్ కాస్ట్ ఇవ్వాలనే డిమాండ్ పెట్టింది. దీనివల్ల రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరుగుతాయని ట్రాన్స్‌కో అడ్డుపడింది. దీంతె ప్రభుత్వాన్ని ఆశ్రయించి ట్రాన్స్కోపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం యూనిట్ రూ. 1.50లకు విద్యుత్ కొనుగోలుకు స్థిర ఛార్జీ నిర్ణయించే వీలుంది. స్థిర, చర వ్యయాన్ని లెక్కిస్తే యూనిట్ రూ. 15 రూపాయలకు వెళ్ళినా ఆశ్చర్యం లేదని విద్యుత్ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై న్యాయ నిపుణుల సలహా తీసుకుంటున్నామని ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్ తెలిపారు. -
ఖాతాల్లో సర్కారు గోల్మాల్
అసలు ఖాతాల వివరాలను వెల్లడించకుండా తొక్కిపెడుతున్న సర్కారు సాక్షి, హైదరాబాద్: రైతుల రుణాలను మాఫీ చేస్తున్నట్టు చెప్పుకోవడానికి చంద్రబాబునాయుడు ప్రభుత్వం అసలు నిజాలను కప్పిపుచ్చుతోంది. వ్యవసాయదారుల రుణ ఖాతాల సంఖ్యను గోల్మాల్ చేసింది. ఖాతాల సంఖ్యను, వాటిపై తీసుకున్న రుణాలను తగ్గించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. అధికారంలోకి వస్తే వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు గడచిన ఆరు నెలలుగా రైతులెవరు, వారి ఖాతాలేంటి పేరుతో రకరకాల కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరకు ఖాతాలు, రుణాల మొత్తాన్ని కప్పిపెట్టి తక్కువ మొత్తాన్ని చూపిస్తున్నారు. చంద్రబాబు వేసిన కోటయ్య కమిటీ పలు దఫాలుగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) ప్రతినిధులతో సమావేశమై వ్యవసాయ రుణాలకు సంబంధించి మొత్తం ఖాతాలు, వాటిపై తీసుకున్న మొత్తం రుణాల వివరాలను సేకరించింది. ఆ కమిటీకి సమర్పించిన లెక్కల మేరకు రాష్ట్రంలో వ్యవసాయ రుణాలు తీసుకున్న ఖాతాలు 1,29,30,864 ఉన్నాయి. తేదీల వారీగా ఖాతాల వివరాలు, వాటిపై తీసుకున్న రుణాల వివరాలను అందజేశారు. ఇందులో లక్షన్నర లోపు రుణాలు తీసుకున్న వారి ఖాతాలు 1,22,04,456 ఉన్నాయి. రైతులు తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాలు 88,841.1 కోట్ల రూపాయలుగా ఎస్ఎల్బీసీ లెక్కతేల్చింది. అసలు లెక్కలు ఈ రకంగా ఉంటే.. సర్కారు ఆరు నెలలుగా కమిటీల పేరుతో రకరకాల ఎత్తుగడలతో ఖాతాలు, రుణాల సంఖ్యను తగ్గిస్తూ వస్తోంది. రూ. 50 వేలు దానికన్నా లోపు ఉన్న రైతుల రుణాలన్నీ మాఫీ చేయడానికి సంబంధించి ముఖ్యమంత్రి గురువారం ప్రకటన చేస్తారని మంత్రులు చెప్తుండగా.. అందులో పెద్ద గోల్మాల్ దాగి ఉందని.. రూ. 50 వేల లోపు రుణాలున్న రైతుల సంఖ్యను భారీగా తగ్గించి చూపుతున్నట్టు అర్థమవుతోంది. నిజానికి కోటయ్య కమిటీకి ఎస్ఎల్బీసీ సమర్పించిన గణాంకాలను ప్రభుత్వం బహిర్గతపరచకుండా మరుగున పరిచింది. ఎస్ఎల్బీసీ అందజేసిన నివేదిక మేరకు.. రూ. 50 వేలు అంతకన్నా తక్కువగా రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలు 66,91,132 ఉన్నాయి. అంటే వ్యవసాయ రుణాలు తీసుకున్న మొత్తం ఖాతాల్లో దాదాపు సగభాగం 50 వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న ఖాతాలే ఉన్నాయి. ఈ రూ. 50 వేల లోపు ఖాతాలపై రైతులు తీసుకున్న రుణాలు 19,495.72 కోట్ల రూపాయలు. అంటే రూ. 50 వేలు, అంతకంటే తక్కువ రుణాలు తీసుకున్న రైతుల రుణాలన్నీ ఒక్కసారిగా మాఫీ కావాలంటే 19.49 వేల కోట్ల రూపాయలు కావాలి. కానీ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది కేవలం 5 వేల కోట్ల రూపాయలు మాత్రమే. ఐదు వేల కోట్ల రూపాయలతో మొత్తం రుణాలను మాఫీ చేయబోతున్నామంటూ జిమ్మిక్కు చేయబోతున్నట్టు అధికార పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. కనీసం రూ. 50 వేల లోపు రుణాలన్నింటినీ మాఫీ చేయాలన్నా 19.45 వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని, బడ్జెట్లో పెట్టిన 5 వేల కోట్ల రూపాయలు ఏ మూలకు సరిపోతాయని, ఇదంతా మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని అధికారవర్గాలు చెప్తున్నాయి. -
సోంపేటకు.. మళ్లీ షాకు!
‘పచ్చ’ ప్రభుత్వం పవర్ దగారక్తమోడిన చోటే మళ్లీ థర్మల్ విద్యుత్ కేంద్రంరగులుతున్న శ్రీకాకుళం.. ఉద్యమ బాట పడుతున్న జనం సాక్షి, హైదరాబాద్: కలత నిద్రలో ఉన్న సోంపేటను చావు దెబ్బ తీసేందుకు సర్కారు సిద్ధమైంది. రక్తపు మరకలు మాయకముందే మరో రణాన్ని పురికొల్పే తెరచాటు వ్యూహాన్ని రచించింది. వారం పది రోజుల్లోనే గతంలో ప్రతిపాదించిన థర్మల్ ప్రాజెక్టు జీవోను రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, జపాన్‌లో గుట్టుచప్పుడు కాకుండా అంతకంటే భారీ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో 2,500 మెగావాట్ల ప్రాజెక్టు ప్రతిపాదనకే అక్కడ రక్తపాతం చోటు చేసుకుంది. తాజాగా చంద్రబాబు సర్కారు 4 వేల మెగావాట్ల ప్రాజెక్టు స్థాపనకు రహస్యంగా ఒప్పందాలు చేసుకుంది. జపా న్ పర్యటనలో ఉన్న సీఎం సోంపేట మండలం బారువాలో అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. జైకా, నెడో, జపాన్ ఆర్థిక సహకార బ్యాంకులు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ మేరకు అక్కడి సంస్థ ‘సుమితొమొ’తో ఒప్పందం జరిగిందన్న వార్తతో శ్రీకాకుళం జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేరు, ఊరు మార్చి చంద్రబాబు జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. యుద్ధానికి సిద్ధమంటూ ప్రకటించారు. నమ్మక ద్రోహం శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బీలా గ్రామంలో 2008లో 2,500 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని ప్రతిపాదించారు. నాగార్జున కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ముందుకు రావడంతో అప్పట్లో ప్రభుత్వం 973 ఎకరాలను సోంపేట బీలా ప్రాంతంలో కేటాయించింది. మరో 1500 ఎకరాలను రైతుల నుంచి సేకరించుకునేందుకు అనుమతిస్తూ 1107 జీవోను విడుదల చేసింది. దీన్ని గ్రామస్తులు వ్యతిరేకించారు. ఇదే అదనుగా ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆందోళనలు చేసింది. 2010లో సోంపేటలో జరిగిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు చనిపోయారు. దీంతో నాగార్జున సంస్థ వెనక్కు తగ్గింది. దీన్ని టీడీపీ రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. కాల్పుల సందర్భంగా ఆ ప్రాంతానికొచ్చిన చంద్రబాబు 1107 జీవోను రద్దు చేసే వరకూ పోరాడాలని స్థానికులను పురమాయించారు. ఎన్నికల సందర్భంగా అధికారంలోకి వస్తే జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా సర్కారు ఇదే మాట చెప్పింది. ఇప్పుడు అదే ప్రాంతంలో అంతకన్నా మరింత ఎక్కువ సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. సుమితొమొకే సర్వాధికారాలు.. ప్రభుత్వం తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టు ఆర్థిక పెట్టుబడి మొత్తాన్ని జపాన్ సంస్థలే భరిస్తాయి. అంటే ఆ దేశానికి చెందిన సుమితొమొ సంస్థకే ప్రాజెక్టు నిర్వహణను అప్పగిస్తారు. ఆ స్థలం కాదు: ఏపీ జెన్కో సీఎండీ సుమితొమొ ఏర్పాటు చేసే థర్మల్ కేంద్రం కోసం మందస-బారువా మధ్య జాతీయ రహదారికి సమీపంలో స్థలాన్ని ఎంపిక చేశామని ఏపీ జెన్కో సీఎండీ విజయానంద్ తెలిపారు. సోంపేటకు దీనికి సంబంధం లేదన్నారు. దారుణం: మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ థర్మల్ విద్యుత్ కేంద్ర ప్రతిపాదననే రద్దు చేస్తామన్న ప్రభుత్వం అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు కోసం ఒప్పందాలు చేసుకోవడం దారుణం. ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తాం. ప్రాణాలకు తెగించి పోరాతాం. -
రైతు వ్యధ పట్టని బాబు
రుణాలు రద్దు చేసే సత్తా లేనప్పుడు సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధినేత హామీ ఎందుకు ఇచ్చినట్టు..ఏరుదాటి తెప్ప తగలేసేందుకా..దేశానికి పట్టెడన్నం పెట్టే రైతులను అవమానించేందుకా..వ్యవసాయాన్ని ఎగతాళి చేసేందుకా.. సీఎం గా చంద్రబాబు తొలి సంతకం చేసిన నాటి నుంచి రుణమాఫీ కోసం ఎదురు చూడని రైతూ లేడు..ఎదురు చూడని కుటుంబం లేదు.. పాలనా పగ్గాలు చేపట్టి 150 రోజులు గడిచినా హామీ ఇచ్చిన రూ.1.50 లక్షల రుణం మాఫీ అమలు కాకపోగా సవాలక్ష సందేహాలు రైతుల బుర్రలు తొలుస్తున్నాయి. సత్తెనపల్లి: జిల్లాలో రైతు రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఎవరి రుణాలు మాఫీ చేస్తారు, ఎవరి పేర్లు తొలగిస్తారు అనే విషయాలు రైతులకు బోధపడడం లేదు. రెండు రోజుల కిందట ప్రభుత్వం రుణమాఫీ అర్హుల జాబితా విడుదల చేసినా క్షేత్ర స్థాయిలో వివరాలు తెలియడం లేదు. శనివారం గ్రామ రెవెన్యూ అధికారుల వద్దకు జాబితాలు వచ్చాయి. ఆ జాబితాల్లో ఉన్న రైతులు రుణమాఫీకి అర్హులా, అనర్హులా పరిశీలించి పంపాలని ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఆ మేరకు వీఆర్వోలు గ్రామాల్లో పరిశీలన చేస్తున్నారు. రైతుల నుంచి రేషన్, ఆధార్ కార్డు కాపీలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తమపేర్లు జాబితాలో ఉన్నాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న అందరి రైతుల పేర్లు ఈ జాబితాల్లో ఉన్నాయా, బ్యాంకుల్లో సరైన ఆధారాలు అందించనివారివా మాత్రమే ఉన్నాయా అనేది స్పష్టత లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. వివరాల కోసం రైతులు బ్యాంకుల వద్దకు వెళితే జాబితాలు తహశీల్దారుల వద్దకు వచ్చాయని చెబుతూ, గ్రామాలకు రెవెన్యూ అధికారులు వస్తున్నారని చెబుతున్నారు. ఒకవేళ జాబితాలో పేర్లు లేనివారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించగా, ఇటు రెవెన్యూ అధికారులు, అటు బ్యాంకర్లు చెప్పలేకపోతున్నారు. రుణమాఫీ కటాఫ్ తేదీ ప్రకటించకపోవడంతో రైతుల్లో అనేక అనుమానాలు చోటుచేసుకుంటున్నాయి. 2013 డిసెంబరు 31వ తేదీనా, లేక 2014 మార్చి 31వ తేదీనా అనేది జాబితా పరిశీలనకు వచ్చిన అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. రెండు రోజుల నుంచి రైతులు పనులు మానుకుని తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతు న్నారు. సరైన పత్రాలు లేకపోతే అక్కడే అందించేందుకు పత్రాలు చేతపట్టుకుని వెళుతున్నారు. ఇప్పటికైనా రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. -
ప్రజల పక్షాన ప్రభుత్వం ఉండాలి: కోదండరాం
నిర్మల్: తెలంగాణ రాష్ర్టం ఏర్పాటైన తరువాత వచ్చిన ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండేలా పోరాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని టీవీవీ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్‌లోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన టీవీవీ నాలుగో జిల్లా మహాసభకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజలు సమస్యలతో ఉన్నప్పుడు మౌనం వహించడం నేరమని అన్నారు. సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఎవరూ సంతోషంగా ఉండలేరని చెప్పారు. నష్టం జరిగినప్పుడు సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని అన్నారు. ప్రజాసమస్యలపై జేఏసీ, టీవీవీ, కలిసి సంఘటితంగా పోరాడదామని పిలుపునిచ్చారు. కేటాయింపులతో సరిపోదు: మల్లెపల్లి లక్ష్మయ్య బడ్జెట్ కేటాయింపులతో సరిపోదని, అవి ప్రజలకు పూర్తిస్థాయిలో చేరాలని టీవీవీ రాష్ర్ట అధ్యక్షుడు మల్లెపల్లి లక్ష్మయ్య అన్నారు. ప్రజలు పైసల్లో భాగం, పాలనలో భాగం అయినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఆర్థిక, రాజకీయ ప్రజాస్వామ్యం కోసం టీవీవీ పోరాడుతుందన్నారు. రాజకీయాలు వ్యాపారంగా మారాయని ఆరోపించారు. ప్రజల పక్షాన లేని ఎమ్మెల్యేలను నిలదీయాలని పిలుపునిచ్చారు. -
‘కల్వకుర్తి’ మూడోదశ పూర్తయ్యేదెప్పుడు?
ఆరు నెలలుగా ఆగిన పనులు పనుల గడువును ఏడాది పొడిగించినా మారని కాంట్రాక్టు సంస్థ తీరు వచ్చే జూన్‌లోగా ప్రాజెక్టు పూర్తికావడం అనుమానమే సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ప్రాధాన్యం ఇస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటైన మహబూబ్‌నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పనులు ఒక్క అడుగు కూడా ముందుకు కదలడం లేదు. జిల్లాలోని పదిహేను మండలాల పరిధిలో 3.4 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టును వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేసి సాగునీరందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించడం లేదు. వివిధ కారణాలను చూపుతూ కాంట్రాక్టు సంస్థ ఆరు నెలలకు పైగా పనులను పూర్తిగా నిలిపివేసి చోద్యం చూస్తోంది. పనులు పూర్తి చేసేందుకు గతంలో విధించిన గడువు ఈ ఏడాది జూన్‌తోనే ముగిసినా, పనుల చివరి దశలో ఇతర కాంట్రాక్టు సంస్థకు ఇవ్వటం ఇష్టం లేక ప్రభుత్వం పాత సంస్థకే మరో ఏడాది గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మూడు దశలుగా ప్రాజెక్టు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 3.40లక్షల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించగా, ప్రాజెక్టు మొత్తాన్ని మూడు దశలుగా విడగొట్టారు. ఇందులో కొల్లాపూర్ ఒకటో దశ కింద 13వేల ఎకరాలు, జొన్నలబొగడ రెండో దశ కింద 47వేల ఎకరాలు, మూడో దశ గుడిపల్లెగట్టు కింద 2.80లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. ఇందులో మూడో దశ కింద 42.80 కిలోమీటర్ల మేర నీటిని తరలించేందుకు పంప్‌హౌస్, రిజర్వాయర్లను నిర్మించేందుకు 2005-06లో గ్యామన్ ఇండియా అనే కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించారు. 13 మెగావాట్ల సామర్థ్యంగల ఐదు పంపులు 800ల క్యూసెక్కుల నీటిని 117 మీటర్ల ఎత్తుకి పంప్ చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. ఈ పనులను పూర్తి చేసేందుకు ముందుకు వచ్చిన గ్యామన్ ఇండియా 2010లోగా పనులు పూర్తి చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ప్రాజెక్టు పనుల్లో జరిగిన జాప్యం దృష్ట్యా ప్రభుత్వం ఇప్పటికి రెండుసార్లు గడువును పొడిగించింది. ఈ ఏడాది మే వరకు ఆ సంస్థ 82 శాతం పనులను పూర్తి చేసింది. అయితే జూన్ మొదటివారం నుంచి పనులను పూర్తిగా నిలిపివేసింది. ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం కావడంతో పెరిగిన నిర్మాణ వ్యయం దృష్ట్యానే కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసినట్లుగా అధికారులు చెబుతున్నారు. గడువు పొడిగించినా కదలని పనులు.. కాగా ప్రాజెక్టు పనులకు సంబంధించి ఈ ఏడాది జూన్‌తో గడువు ముగియగా సెప్టెంబర్‌లో ప్రభుత్వం మరోమారు గడువును ఏడాది పాటు పొడిగించింది. ఈ లెక్కన వచ్చే జూన్ నాటికి మధ్యలో నిలిచిపోయిన సుమారు రూ.110కోట్ల పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వచ్చే ఖరీఫ్ నాటికి పనులు పూర్తి చేసి ప్రాజెక్టు కింద ఆయకట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీరందించాలని ఆదేశించింది. అయితే గడువు పొడిగించి రెండు నెలలు గడుస్తున్నా అడుగు ముందుకు కదల్లేదు. దీనిపై స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు, ఉన్నతాధికారులు, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులను పిలిచి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. దీంతో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నదానిపై ఆసక్తి నెలకొంది. -
అంతా ఆన్లైన్
10 అంశాలపై వివరాలు సేకరిస్తున్న మున్సిపాలిటీలు జన్మభూమిలో వచ్చిన వినతులూ నమోదు ఏ శాఖకు ఆ శాఖే క్రోడీకరణ అబద్వేలు : మున్సిపాలిటీలకు సంబంధించి ఏ సమాచారమైనా ఇక నుంచి ఆన్లైన్లోనే లభించనుంది. సూక్ష్మ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల సమాచారాన్ని వార్డుల వారీగా సేకరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పది అంశాలతో కూడిన సంక్షిప్త సమాచారాన్ని అన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపాలిటీలోని ఏ శాఖకు సంబంధించి వివరాలు ఆ శాఖే సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలి. జన్మభూమిలో ఈ వివరాలను సేకరించేందుకు నమూనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. అన్ని శాఖల అధికారులు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి వాటిని అన్లైన్లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయా శాఖలు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి సూక్ష్మ ప్రణాళిక తయారు చేసేందుకు ఈ సమాచారం కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు. నమోదు చేస్తున్న అంశాలివే పురపాలక సంఘాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు నుంచి వచ్చిన వినతులు, రేషన్‌కార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు, పింఛన్ల విన్నపాలు తదితర వివరాలు. మెప్మా ప్రాజెక్టు కింద ఉండే స్వయం సహాయక సంఘాలు, సంఘాల్లోని మహిళలు నిర్వహించే వ్యాపారాలు, కార్యకలాపాలు, మా ఇంటి మహలక్ష్మి లబ్ధిదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు, వాటి వినియోగం. నీటి కుళాయిలు, నీటి సరఫరా, పైపులైన్ లీకేజీలు, సిమెంట్ రోడ్లు, కాలువలు, కల్వర్టులు, వీధి దీపాలు తదితర వివరాలు. మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధులు, కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య మెరుగునకు తీసుకుంటున్న చర్యలు. పట్టణ ప్రణాళిక విభాగం కింద మున్సిపాలిటీ పరిధిలోని వృక్షాల వివరాలు, ఇటీవల నాటిన మొక్కల వివరాలు, వాటి రక్షణ చర్యలు. వార్డుల్లోని పాఠశాలలు, వాటిలో ఉండే వసతులు, విద్యార్థుల సంఖ్య, బడి బయట ఉన్న పిల్లల వివరాలు, పట్టణంలోని విద్యావంతులు, ఐఐటీ, డిప్లమో చేసిన వారి సంఖ్య, వృత్తి విద్యా నిపుణులు, ఇతర దేశాల్లో ఉంటున్న వారు, ఉద్యోగులు, నిరుద్యోగులు వారి నివాసం వివరాలు. అంగన్వాడీ కేంద్రాలు, వాటిల్లోని పిల్లల వివరాలు, గర్భిణులు, వారి ఆరోగ్య స్థితిగతులు.. బలహీనంగా ఉన్న చిన్నారుల సంఖ్య, ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారి సంఖ్య . పశుసంవర్ధక శాఖ పరిధికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్ల వివరాలు. రోజు జరిగే పాల ఉత్పత్తి, వాటిని ఏయే పాలకేంద్రాలకు తరలిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు. -
రుణం..రాం రాం!
పీఎంఆర్‌వై.. పీఎంఈజీపీగా మార్పు పేరు మారినా.. తీరు మారలే నిరుద్యోగ యువతకుఅందని రుణం మూడేళ్లుగా పైసా విదిల్చని వైనం భరోసా ఇవ్వని జిల్లా పరిశ్రమలశాఖ పాలమూరు: నిరుద్యోగ యువత పరిశ్రమల స్థాపన, వ్యాపార కేం ద్రాలను ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రుణాలకు అతీగతిలేదు. దీం తో దరఖాస్తుదారులు అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. రెండు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై)పథకం ద్వారా ఎంతోమంది నిరుద్యోగులకు సబ్సిడీ రుణాలు అందించారు. జిల్లా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పథకం ద్వారా లబ్ధిపొంది ఉన్నతస్థాయికి చేరిన యువకులు చాలామంది ఉన్నారు. గత 15 ఏళ్లలో పరిశ్రమల స్థాపనకోసం జిల్లావ్యాప్తంగా దాదాపు 20వేల మం ది నిరుద్యోగులకు రుణ అవకాశం కల్పించారు. ప్రధానమంత్రి రోజ్‌గార్ యోజన (పీఎంఆర్‌వై), ఖాదీబోర్డు/ ఖాదీ కమిషన్‌కు చెందిన గ్రామీణ ఉ పాధికల్పన పథకం(ఆర్ఈజీపీ)లను మిళితం చేసి పీఎంఈజీపీగా పేరుమార్చారు. ఒకప్పుడు వేలమందికి అందే సబ్సిడీ రుణాలు ఇప్పుడు పదుల సం ఖ్యలోనే అందుతున్నాయి. పథకాన్ని పూర్తిస్థాయిలో మార్పుచేయడంతో ని రుపేద వర్గాలకు ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది. మార్పుచేసిన ఈ పథకం ద్వారా ధనికవర్గాలకు చెందిన వారికే పరిశ్రమలశాఖ నుంచి సబ్సిడీ రుణం అందుతోంది. దీంతో ఆర్థికంగా స్థోమతలేని నిరుద్యోగులకు అన్యాయం జరుగుతోంది. యువత ఆశలపై నీళ్లు! పీఎంఈజీపీ ప్రవేశపెట్టిన తర్వాత గత మూడేళ్లుగా స్వయం ఉపాధి రుణాలు పేదలకు అందడం లేదు. దీనికితోడు 2011-12 ఆర్థిక సంవత్సరం నుంచి 2013-14 ఆర్థిక సంవత్సరం వరకు ఈ పథకానికి సంబంధించి సబ్సిడీ నిధులను ప్రభుత్వం మంజూరు చేయలేదు. ప్రభుత్వం నిధులిస్తుందో.. లేదోనన్న సందేహంతో పరిశ్రమల స్థాపనకోసం యువకులు ముందుకు రావడం లేదు. గతమెంతో వైభవంగా కొనసాగిన పీఎంఆర్‌వై పథకం (ప్రస్తుత పీఎం ఈజీపీ పథకం)ఇప్పుడు ఉనికి లేకుండా పోతోంది. ఉపాధి కల్పన కోసం నిధులు వినియోగించడంలో ప్రభుత్వశాఖల వైఫల్యం కారణంగానే మూడేళ్లుగా పరిశ్రమల స్థాపనకు రుణాలు మంజూరుకావడం లేదని విమర్శలు ఉన్నాయి. రెండేళ్లుగా కొం దరు దరఖాస్తుదారులకు ఇంటర్వ్యూ లు నిర్వహించినప్పటికీ రుణాలు మం జూరు చేయలేదు. కాగా, ఈ ఏడాది దరఖాస్తు చేసుకున్న వారికి కనీసం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించలేదని, దీంతో తాము మరోపనిపై దృష్టి సారించలేకపోతున్నామని దరఖాస్తుదారులు చెబుతున్నారు. కాగా, జిల్లా పరిశ్రమల శాఖకు సంబంధించి జనరల్ మేనేజర్ పోస్టు ఖాళీగా ఉండటం తో ఆ శాఖకు సంబంధించిన డిప్యూటీ డెరైక్టర్ హైదరాబాద్‌లో ఉంటూనే జిల్లా పరిశ్రమలశాఖ ఇన్చార్జి జీఎంగా వ్యవహరిస్తున్నారు. దీంతో విధుల నిర్వహణ సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇకనైనా రుణాలు మంజూరు చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఆర్నెళ్లక్రితం దరఖాస్తు చేసుకున్నా.. సొంతంగా రైస్‌మిల్లు నెలకొల్పాలని రూ.50 లక్షల అంచనా వ్యయంతో జిల్లా పరిశ్రమలశాఖ ద్వారా రుణం ఇప్పించాలని ఆరు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాను. దరఖాస్తుల పరిశీలన పూర్తయినప్పటికీ రుణాల మంజూరు కోసం ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. రుణం మంజూరవుతుందనే నమ్మకంతో మరో పనిపై దృష్టిపెట్టలేకపోతున్నా.. - శంకర్, మక్తల్ రుణం కోసం ఎదురుచూస్తున్నా.. నాలుగు నెలల క్రితం డికార్డ్గేట్ మిషన్ (వేరుశనగను వలిచే యంత్రం)నెలకొల్పేందుకు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్నాను. ఇంటర్వ్యూలను త్వరలో నిర్వహిస్తామని చెప్పడంతో యూనిట్‌కు సంబంధించిన స్థలం, ఇతర వసతులను సిద్ధం చేసుకున్నాం. పరిశ్రమల శాఖ ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. రుణం కోసం ఎదురుచూస్తున్నా.. - పద్మావతి, మహబూబ్‌నగర్ ఎంపిక ఎప్పటికో.. పేపర్‌ప్లేట్ల యంత్రాన్ని నెలకొల్పేందుకు పరిశ్రమల శాఖకు దరఖాస్తు చేసుకున్నా.. ప్రభుత్వపరంగా సబ్సిడీ రుణం మంజూరైతే తద్వారా పేపర్ ప్లేట్ల తయారీ పరిశ్రమను నడుపుదామని భావించాను. ఖాదీబోర్డు ద్వారా సబ్సిడీ రుణం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పరిశ్రమల శాఖ అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులను ఎంపికచేయడం లేదు. - భాస్కర్‌రెడ్డి, వనపర్తి -
వైద్య సేవల్లో అంతరాయం
వెనక్కుతగ్గని వైద్యులు, ప్రభుత్వం నేడు సామూహిక రాజీనామా చేయనున్న డాక్టర్లు తక్షణమే ఆ రాజీనామాలను ఆమోదిస్తామంటున్న సర్కార్ బ్లాక్‌మెయిల్‌కు భయపడే ప్రసక్తే లేదని స్పష్టీకరణ సాక్షి,బెంగళూరు : అటు ప్రభుత్వం... ఇటు వైద్యుల సంఘం పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తుండటంతో సోమవారం నుంచి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరి స్థితి ఏర్పడింది. రాష్ట్రం లోని ప్రభుత్వ వైద్యులందరూ సామూహిక రాజీనామాలకు సిద్ధపడుతున్నా ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడే సూచనలు కనిపిస్తున్నాయి. డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘంలోని 4,500 మంది ప్రభుత్వ వైద్యులు నేడు సామూహిక రాజీనామాలు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మాత్రం ఇలాంటి బ్లాక్‌మెయిల్‌కు భయపడేది లేదని చెబుతోంది. అంతేకాకుం డా రాజీనామాలు చేసిన తక్షణం వాటిని ఆమోదిస్తామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేస్తున్నారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు వీరభద్రయ్య మాట్లాడుతూ ‘సామూహిక రాజీనామాలకు పాల్పడినా ప్రజలకు ఇబ్బందులు కలగకూడదని మరో నెల రోజులు విధులకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వం మాత్రం వెంటనే మా రాజీనామాలను ఆమోదిస్తామని బెదిరింపు ధోరణితో మాట్లాడుతోంది. అదే గనుక జరిగితే మంగళవారం నుంచే విధులకు హాజరుకాము. తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు. ‘ప్రైవేట్’ సాయం తీసుకుంటాం ప్రభుత్వ వైద్యులు రాజీనామా చేస్తే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి ప్రైవేటు వైద్యుల సహాయం తీసుకుంటామని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి శివశైలం స్పష్టం చేశారు. బెంగళూరులో మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు. వైద్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి తమ శాఖ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అయితే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం నాయకులు పట్టువిడుపులు లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తాము బెదరబోమని స్పష్టం చేశారు. సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వైద్యుల సహాయం తీసుకుంటామని శివశైలం పేర్కొన్నారు. -
గోదా‘వర్రీ’
గొంతు తడపని గోదావరి నత్తనడకన నీటి పథకం పనులు 18 గ్రామాల ప్రజలకు నిరాశే.. {పజాప్రతినిధుల మౌనం.. పట్టించుకోని అధికార గణం జైపూర్ : తలాపునే గోదావరి నది పారుతున్నా తాగేందుకు నీరు దొరకని పరిస్థితి జైపూర్ మండల ప్రజలది. మండల ప్రజలు తమకు గోదావరి తాగునీరు అందించాలని కొన్నేళ్లుగా ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు దివంగత ముఖ్యమంతి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వం హయాంలో జైపూర్ మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు గోదావరి తాగునీరు అందించే పథకాన్ని మంజూరు చేశారు. ఈ పథకం ద్వారా మండలంలోని 18 గ్రామాలకు గోదావరి తాగునీరు అందించేందుకు 2009లో రూ.5.50 కోట్ల నిధులు మంజూరు విడలయ్యాయి. దీంతో 50 శాతం మండల ప్రజలకు గోదావరి నీరు అందించేందుకు అధికారులు పథకాన్ని రూపొందించారు. ఈ మేరకు అప్పటి కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ 2009 ఫిబ్రవరి 26న ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. అదే ఏడాది పనులు చేపట్టారు. సంవత్సరంలోపు నిర్మాణాన్ని పూర్తి చేయాల్సి ఉంది. అయితే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఆలసత్వంతో ఐదేళ్లుగా నీటి పథకం అసంపూర్తిగానే మిగిలింది. ఇప్పటిదాకా గోదావరి నది ఒడ్డున పంపౌజ్, షెట్పల్లి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మించారు. షెట్పల్లి నుంచి గంగిపల్లి, పెగడపల్లి, జైపూర్ గ్రామాల మీదుగా భీమారం, పోలంపల్లి, వరకు పైపులైన్ కూడా చేశారు. అవసరమున్న చోట సంపులు కూడా నిర్మించారు. అయినా నిర్మాణం పూర్తి చేయలేదు. ప్రస్తుతం నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పనులు నిలిచిపోయాయి. ప్రజాప్రతినిధుల మౌనం ఎందుకో? మండలంలో 50 శాతం మంది ప్రజలకు గోదావరి తాగునీరు అందించే నీటి పథకం ఐదేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నా స్థానిక ప్రజా ప్రతి నిధులు మాత్రం మాట్లాడడం లేదు. ప్రజాప్రతినిధుల ఈ తాగు నీటి పథకంపై మౌనం ఉండడంతో ప్రజల్లో ఆనుమానం వ్యక్తం అవుతోంది. అధికారుల నిర్లక్ష్యానికి తోడు నాయకులూ పట్టింపు చేయకపోవడంతో ఏటా తాగునీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. -
అప్పుల ఊబిలో టమాట రైతు
మూడేళ్లుగా తీవ్రంగా నష్టపోయినా కనికరించని ప్రభుత్వం నాలుగేళ్లలో జిల్లాలో 1,55,275 ఎకరాల్లో పంటసాగు రుణమాఫీలో చోటు దక్కక దిగాలు జిల్లాలో రూ.1,500 కోట్ల అప్పుల్లో రైతాంగం బి.కొత్తకోట: టమాట రైతులు గడచిన నాలుగేళ్లలో 1,55,275 ఎకరాల్లో పంట సాగుచేశారు. 2010-11లో 15,320 హెక్టార్లు.. 2011-12లో 17,581 హెక్టార్లు.. 2012-13లో 16,224 హెక్టార్లు.. 2013-14లో 12,985 హెక్టార్లలో సాగుచేశారు. ఇందులో అత్యధికంగా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో తర్వాత పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగైంది. మిగతా ప్రాంతాల్లో నామమాత్రంగా సాగుచేశారు. ఖరీఫ్, రబీతోపాటు వ్యవసాయ బోర్ల కింద పంట సాగైంది. ఈ సంవత్సరాల్లో రైతులు అత్యధిక ధరలను పొందిందిలేదు. అప్పుడప్పుడు మంచి ధర పలికినా నిలకడగా లేవు. చాలాకాలం తర్వాత ఈ ఏడాదిలో రెండు నెలలు మాత్రమే అత్యధిక ధర పలికింది. రుణాలు వందల కోట్లలో.. చెరుకు రైతులకు మాత్రమే బ్యాంకులు ఎకరాకు రూ.40 నుంచి రూ.50వేల రుణం ఇస్తాయి. ఆ తర్వా త టమాట రైతుకు రూ.25 వేల నుంచి రూ.30వేలు ఇస్తాయి. వేరుశెనగకు తక్కువ రుణం వస్తుంది. దీంతో టమాట సాగుచేసిన రైతులు టమాటపైనే రుణం తీసుకున్నారు. 2009-10లో టమాట సాగుకు ఎకరాకు రూ.20వేలు, 2009-10లో రూ.25వేలు, 2012-13లో రూ.30వేలు, 2013-14లో రూ.30వేల రుణంగా బ్యాంకులు నిర్ణయించి ఆమేరకు పాసుపుస్తకాలు, బంగారం తాకట్టుపై అప్పులిచ్చాయి. ఇలా అప్పులు తీసుకొన్న రైతులు జిల్లాలో వేలసంఖ్యలో ఉన్నారు. ఒక్క తంబళ్లపల్లె నియోజకవర్గంలోనే 2008-09నుంచి 2013 డిసెంబరు నాటికీ 37,251 మంది రైతులు రూ.162.9కోట్ల రుణం తీసుకున్నా రు. వీరుకాక జిల్లాలో మొత్తం రూ.1,500కోట్ల మేర కు అప్పులను టమాట రైతులు చెల్లించాల్సి ఉన్నట్టు అంచనా. బ్యాంకులిచ్చే రూ.30వేల రుణంతో కనీసం సగం మంది రైతులు ఈ నాలుగేళ్లలో రూ.2,500కోట్ల దాకా అప్పులు పొందడం, తిరిగి చెల్లిస్తూ, కొత్త రుణాలు తీసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం అప్పులు చెల్లించలేక నిస్సహాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వం ఊరట కలిగిస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోతోంది. మాఫీకి సాకులు రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వం కుంటిసాకులు వెదుకుతోంది. టమాట పంట ఉద్యానవనశాఖ పరిధిలో ఉందన్న సాకుతో రైతులపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. వేరుశెనగకు ప్రయత్యామ్నాయంగా సాగుచేస్తున్న టమాటకు సరైన ప్రోత్సాహం ఇవ్వని ప్రభుత్వం కనీసం రుణ మాఫీనైనా వర్తింపజేయకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోంది. కోట్ల పెట్టుబడిని కళ్లముందునే నష్టపోతున్న టమాట రైతులను ఆదుకునేందుకు రుణమాఫీని వర్తింపజేయాలని రైతాంగం కోరుతోంది. రుణం మాఫీ కాదు.. కొత్త అప్పులు పుట్టవు మూడేళ్ల క్రితం సొసైటీ బ్యాంకులో రూ.50 వేల పంట రుణం తీసుకున్నా. రెండు ఎకరాల్లో టమాట పంట సాగు చేశా. రూ.90 వేలు ఖర్చు అయింది. బ్యాంకులో తెచ్చిన రుణం చాలక ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తెచ్చి పంటపై ధారపోశా. 30 వేల నష్టం వచ్చింది. ఈ ఏడాది బంగారు నగలను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంకులో రూ.50 వేల రుణం తీసుకున్నా. ఇటీవల రెండు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో ధరలు పడిపోయాయి. బ్యాంకులో చూస్తే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యమంత్రి చూస్తే రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇంతవరకు మాఫీ చేయక పూటకో మాట మాట్లాడుతావుండాడు. బ్యాంకోళ్ళు కొత్తగా పంట రుణాలు ఇవ్వలేదు. పాసు బుక్కులు, బంగారు నగలు బ్యాంకులో ఉంటే ఏం జూసి మాకు ప్రైవేటు వ్యక్తులు కూడా అప్పులు ఇస్తారు. -సిద్దారెడ్డి, రైతు, పెద్దతిప్పసముద్రం మండలం ఆవులకు వదిలేశాం రెండెకరాల్లో టమాట సాగు చేశాం. రూ.లక్ష దాకా ఖర్చయ్యింది. ఇప్పటివరకు రూ.20 వేలు మాత్రమే వచ్చింది. తొలి నుంచి రేటు లేదు. ఇప్పట్లో వచ్చే అవకాశాలు కన్పించ డం లేదు. దీంతో సగం పంటలో ఆవులను తోలేశాం. రేటు ఉన్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. రేటు లేనప్పుడు మాత్రం చేతులెత్తేసింది. రైతుకు అడుగడుగునా అన్యాయం జరుగుతున్నా ఆదుకునే వారు లేరు. -బి.కృష్ణారెడ్డి, సర్కారుతోపు, కురబలకోట మండలం బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామానికి చెందిన రైతు బయ్యారెడ్డి ఏళ్ల తరబడి టమాట పండిస్తున్నాడు. 2011లో బి.కొత్తకోట గ్రామీణ బ్యాంకులో రూ.50వేలు, ఇండియన్ బ్యాంకులో 1.5లక్షల అఫ్పు తీసుకున్నాడు. పంటనష్టం వాటిల్లినా రూ.1.5లక్షల రుణం చెల్లించాడు. మళ్లీ పంటకోసం 2012లో ఇండియన్ బ్యాంకులో తీసుకున్న రూ.2లక్షలు రుణాన్ని 2013లో కట్టేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో రూ.లక్ష అప్పుచేశాడు. రుణాలపై ఆధారపడి పంటలు సాగుచేస్తున్న బయ్యారెడ్డి రుణ మాఫీపై ఆశపెట్టుకున్నాడు. మాఫీ ఇస్తే చెల్లించిన సొమ్ము తిరిగి దక్కుతుందనుకున్నాడు. అయితే టమాట రైతుకు మాఫీ అయ్యే పరిస్థితులు లేవని తేలిపోవడంతో నిరాశవ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికీ గ్రామీణ బ్యాంకులోని రూ.50వేల రుణం చెల్లించలేదు. అదైనా మాఫీ అవుతుందో లేదోనని ఎదురుచూస్తున్నాడు. -
ప్రచారార్భాటమే!
‘ఉచితం’ మూడింటికే పరిమితం బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి హుళక్కి సరఫరా లేదని చేతులెత్తేస్తున్న డీలర్లు పాడేరు: ఉచితంగా నిత్యావసర సరకుల పంపిణీపై ప్రభుత్వం ప్రచారార్భాటమే తప్ప వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉంది. తుఫాన్ బాధితులందరికీ 25 కిలోల బియ్యం, ఐదు లీటర్ల కిరోసిన్, కిలో పంచదార, లీటరు పామాయిల్, రెండు కిలోల కందిపప్పు, అరకిలో కారంపొడి, కిలో ఉప్పు, రెండు కిలోల బంగాళా దుంపలు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఊదరగొట్టేస్తున్నారు. అయితే వాస్తవంగా బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మరే వస్తువూ ఏజెన్సీలో పంపిణీ చేయడం లేదు. డిపోలకు మిగిలిన వస్తువులు చేరక పోవడంతో డీలర్లు చేతులెత్తేస్తున్నారు. పౌరసఫరాల శాఖ నుంచి వస్తువులు సరఫరా చేయడంలోనే తీవ్రజాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ. బియ్యం, పంచదార, కిరోసిన్ పొందేందుకే మూడు రోజుల నుంచీ డిపోల చుట్టూ తిరుగుతున్న గిరిజనులు మిగిలిన వాటి కోసం ఇంకా ఎన్నాళ్లు తిరగాలో అని వాపోతున్నారు. అసలు ఇస్తారో, ఇవ్వారో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్డు దారులతోపాటు లేని వారికి కూడా వస్తువులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా అన్నీ ఒకేసారి ఇస్తేనే మేలు జరుగుతుందని ప్రజలు చెబుతున్నారు. పంపిణీ వేగవంతం చేయాలి బియ్యం, కిరోసిన్, పంచదారకే పరిమితం చేయకూడదు. అన్ని వస్తువు లు సత్వరం పంపిణీ చేయాలి. ఒక్కో వస్తువు కోసం ఒక్కో రోజు తిరగడం గిరిజనులకు అసాధ్యంగా ఉంది. పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలరు. ఇప్పటికైనా డీఆర్ డిపోలో ఒకే రోజు అన్ని వస్తువులు అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో జీసీసీ అధికారులు చొరవ చూపాలి. పౌరసరఫరాల విభాగం కూడా ఉచిత నిత్యావసర వస్తువులను ఏజెన్సీకి త్వరితగతిన తరలించే ఏర్పాట్లు చేయాలి. - గిడ్డి ఈశ్వరి, పాడేరు ఎమ్మెల్యే మూడు వస్తువులే ఇచ్చారు ప్రభుత్వం పప్పు, బియ్యం, ఉప్పు, నూనె తదితర వస్తువులను ఇస్తామన్నా మాకు మూడే ఇచ్చారు. బియ్యం, కిరోసిన్, పంచదార తప్ప మిగిలినవి రాలేదంటున్నారు. ఈ వస్తువుల కోసం పనులు మానుకుని ఎన్నిరోజులు తిరగగలం. - కె.చిన్నమ్మి, రాయిగెడ్డ, ఇరడాపల్లి పంచాయతీ -
ప్రాథమిక విద్యలో మార్పులకు శ్రీకారం
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతులకు శాపం కరువుకు తట్టుకోని కే-6 రకం ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు ఈ రకాన్నే పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగేది కాదు పలమనేరు: ప్రభుత్వం ఈ దఫా రైతులకు పంపిణీ చేసిన సబ్సిడీ వేరుశెనగ విత్తన కాయలు నట్టేట ముం చేశాయి. కరువుకు తట్టుకోలేని, నాణ్యత లేని కే-6 విత్తనాలను పంపిణీ చేసింది. వర్షాభావ పరిస్థితులను ఈ రకం తట్టుకోలేక పంట పూర్తిగా దెబ్బతింది. ఇదే సీజన్లో ఆత్మ వారి సౌజన్యంతో ధరణి అనే రకాన్ని కొందరు రైతులకు పంపిణీ చేశారు. కే-6 రకం ఎకరా కు ఓ బస్తా దిగుబడిని ఇవ్వగా, ధరణి రకం పది బస్తా ల దిగుబడినిచ్చింది. ఇదే విత్తనాలను రైతులకు పంపిణీ చేసుంటే ఇంత నష్టం జరిగి ఉండేది కాదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో వేరుశెనగ రైతులు నష్టాలపాలయ్యారు. పలమనేరు వ్యవసాయశాఖ సబ్ డివిజ న్కు సంబంధించి ఖరీఫ్ సీజన్లో 16 వేల హెక్టార్లలో వేరుశెనగ సాగు చేయగా 11,540 హెక్టార్లలో ప్రభుత్వం అందజేసిన విత్తనాలనే వేశారు. మిగిలిన విస్తీర్ణంలో రైతులు వారి సొంత విత్తనాలనే వేసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోలేదు.. ఈ దఫా జిల్లాకు ఏపీ ఆయిల్ ఫెడ్ నుంచి కదిరి-6 అనే రకం విత్తనాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. ప్రొద్దుటూరు, కర్నూలు జిల్లాల నుంచి వీటిని తెప్పించింది. మామూలుగా 100 గ్రాముల విత్తన కాయలను వొలిస్తే గింజలు 70 గ్రాముల బరువు వస్తేనే అవి నాణ్యంగా ఉన్నట్టు లెక్క. సీడ్ జర్మినేషన్ 70 శాతంగా ఉండాలని నిబంధనలున్నాయి. చిత్తూరులోని సీడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీలో మొలక శాతం, విత్తనాల నాణ్యతను పరీక్షిం చాల్సి ఉంది. ఈ దఫా ఇది జరగలేదు. ఈ ప్రాంతానికి కే-6 పనికిరాదు.. వర్షాభావానికి తట్టుకోని కే-6 ఈ ప్రాంతానికి సరిపోదు. గతంలోనూ ఈ సమస్య కారణంగానే ఈ రకాన్ని పంపిణీ చేయలేదు. తక్కువ ధరకే ఇవి దొరుకుతుండడంతో ప్రభుత్వం రెండేళ్లుగా వీటిని రైతులకు అంటగడుతోంది. గతేడాది సైతం ఈ రకం విత్తనాలు వేసిన రైతులకు సగం పంట కూడా చేతికందలేదు. ఫలితంగా ఈ దఫా ఎకరాకు బస్తా (40 కేజీలు) కూడా దిగుబడి రాలేదు. ధరణి రకంతో ఎకరాకు పది బస్తాలు.. కుప్పం ఆత్మ విభాగం తరఫున అక్కడి అధికారులు కొందరు రైతులకు ధరణి రకం వేరుశెనగ విత్తనాలను ప్రయోగాత్మకంగా పంపిణీ చేశారు. కుప్పం మండలంలోని పీబీ నత్తంలో శ్రీరాములు పొలంలో ప్రయోగాలను చేపట్టారు. కరువు పరిస్థితుల మధ్య ఎకరాకు పది బస్తాల దిగుబడి వచ్చింది. దీన్ని చూసి వ్యవసాయ శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇదే రకాన్ని జిల్లాలోని అందరు రైతులకూ పంపిణీ చేసి ఉంటే ఇంత నష్టం వచ్చేది కాదని అధికారులే అభిప్రాయపడుతున్నారు. -
నీటిపారుదల నిర్లక్ష్యం
చిన్న నీటి వనరుల పునరుద్ధరణకు రూ.90 కోట్ల మంజూరు ఇప్పటికి రూ.32.50 కోట్ల పనులు మాత్రమే పూర్తి నిధుల వినియోగం గడువును మరో రెండేళ్లకు పెంచిన ప్రపంచ బ్యాంకు అప్పటికైనా పూర్తయ్యేనో..లేదో..? చేపా చేపా ఎందుకు ఎండలేదంటే.. ఆవు గడ్డిమేయలేదంట.. ఇది అందరికీ తెల్సిందే. జిల్లాలోని నీటిపారుదల శాఖ అధికారులూ ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. గండి పడ్డ చెరువులు.. దుస్థితికి చేరిన కట్టలకు మరమ్మతులు చేసేందుకు పుష్కలంగా నిధులు మంజూరైనా ఖర్చుచేయలేక చేతులెత్తేశారు. కారణం.. సిబ్బంది కొరత..ఎస్టిమేషన్లలో జాప్యం.. వెరసి వచ్చిన నిధులు వెనక్కెళ్లే ప్రమాదం నెలకొంది. ఎలాగోలా ప్రపంచబ్యాంకు మరో రెండేళ్లు గడువు ఇచ్చింది. ఇప్పటికైనా మేల్కొంటారో.. వదిలేస్తారో వేచిచూడాల్సిందే..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లాలో 8,058 చెరువులు, కుంటల కింద 30,370 ఎకరాల ఆయకట్టు విస్తరిం చి ఉంది. రాష్ట్రంలో చెరువులు, కుంటల కింద అత్యధిక ఆయకట్టు ఉన్న జిల్లా చిత్తూరే కావడం గమనా ర్హం. శతాబ్దాల క్రితం నిర్మించిన చెరువులు, కుంటలు ఆలనాపాలనా లేకపోవడం వల్ల అధిక శాతం వనరులు నిరర్థకంగా మారాయి. చెరువులు, కుంటల గండ్లు పూడ్చడం.. కట్టలను పటిష్టం చేయడం.. తూములను మరమ్మతు చేయడం.. ఫీడర్, సప్లయ్ చానళ్లను అభివృద్ధి చేయడం ద్వారా చిన్న నీటి వనరులను పునరుద్ధరించాలని 2005లో అప్పటి సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి భావించారు. ఈ క్రమంలోనే చిన్న నీటివనరుల పునరుద్ధరణకు సహకరించాలని ప్రపంచ బ్యాంకును కోరారు. వైఎస్ ప్రతిపాదన మేరకు మన జిల్లాలో చెరువులు, కుంటల పునరుద్ధరణకు ట్రిఫుల్ ఆర్(రిపేర్స్ రీకన్స్ట్రక్షన్ రినోవేషన్) పథకం కింద రూ.90 కోట్లను 2007లో ప్రపంచ బ్యాంకు మంజూరు చేసింది. ఈ నిధులను 2010 లోగా ఖర్చు చేయాలని సూచించింది. కానీ.. ఆ నిధులను ఖర్చు చేయడంలో చిన్న నీటిపారుదలశాఖ అధికారులు విఫలమయ్యారు. గడువు ముగియడంతో నిధులను వెనక్కి తీసుకుంటున్నట్లు 2010లో ప్రభుత్వానికి ప్రపంచ బ్యాంకు స్పష్టీకరించింది. సిబ్బంది కొరత, ఎస్టిమేట్లలో జాప్యం వల్ల పనులు చేపట్టలేకపోయామని.. మరో నాలుగేళ్లు గడువు ఇవ్వాలని ప్రపంచ బ్యాంను 2010లో ప్రభుత్వం కోరింది. ఇందుకు ప్రపంచ బ్యాంకు సమ్మతించింది. కానీ.. పొడిగించిన గడువు ముగిసే నాటికి కూడా అధికారులు పనులను పూర్తిచేయలేకపోయారు. జిల్లాలో కేవలం 310 చెరువులను రూ.32.50 కోట్లతో అభివృద్ధి చేయగలిగారు. తక్కిన 57.50 కోట్లను ఇప్పటిదాకా ఖర్చుచేయలేపోయారు. నెలాఖరుతో నిధుల వినియోగానికి గడువు ముగియనుండడంతో ట్రిపుల్ ఆర్ పథకం ప్రగతిని ప్రపంచ బ్యాంకు ఇటీవల ఆరా తీసింది. రూ.57.50 కోట్లను ఖర్చు చేయలేదని పసిగట్టిన ప్రపంచ బ్యాంకు.. ఆ నిధులను వెనక్కి ఇవ్వాలని ప్రభుత్వాన్ని మరోసారి కోరింది. ఇందుకు స్పందించిన ప్రభుత్వం.. మరో రెండేళ్లు గడువు ఇస్తే పనులను పూర్తిచేస్తామని ప్రపంచ బ్యాంకుకు హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు నిధుల వినియోగానికి అక్టోబర్ 2016 వరకూ గడువు ఇచ్చింది. కానీ.. అప్పటికైనా నిధులను వినియోగించుకుని చిన్న నీటివనరులను అభివృద్ధి చేస్తారా అన్న ప్రశ్నకు అధికారవర్గాల నుంచి సరైన సమాధానం లభించకపోవడం గమనార్హం. -
రేషన్ కోత
సాక్షి, గుంటూరు: పేదల నోటికాడి ముద్దను ప్రభుత్వం లాగేసుకోంటోంది. రేషన్ కార్డులకు ఆధార్ అనుసంధానం పేరుతో రేషన్‌కార్డుల్లో భారీగా కోత పెడుతోంది. కుంటి సాకులు చూపుతూ పేద ప్రజల కడుపుకొడుతోంది. ఆధార్ కార్డులు అందించిన వారికి సైతం కొందరికి రేషన్ నిలిపి వేసింది. దీంతో భారీ సంఖ్యలో కార్డుదారులు రేషన్, ఆధార్ కార్డులు చేత పట్టుకొని రెవెన్యూ కార్యాలయాల చుట్టు తిరుగుతున్నారు. మళ్లీ ఆధార్ కార్డు ఇస్తే సీడింగ్ చేస్తామని అధికారులు చెబుతుండటంతో కార్యాలయాల్లో బారులు తీరుతున్నారు. కావాలనే కార్డుల్లో కోత విధించిందని పాలకులను శాపనార్థాలు పెడుతున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితి గుంటూరు నగరంతోపాటు, మున్సిపాలిటీల్లో ఎక్కువగా ఉంది. జిల్లాలో 1,81,036 రేషన్‌కార్డులు, 9,83,663 వ్యక్తిగత యూనిట్లలకు ఈనెలలో రేషన్ బియ్యాన్ని నిలిపి వేశారు. దీంతో పేద ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేషన్ కేటాయింపులు ఇలా... జిల్లాలో గతంలో మొత్తం 13,88,348 రేషన్ కార్డులు, 43,21,408 వ్యక్తిగత యూనిట్లకు 19,248.96 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసేవారు. ప్రస్తుతం ఆధార్ కార్డుల అనుసంధానం అనంతం ఈ నెల కోటాకు సంబంధించి 12,07,312 కార్డులు, 33,37,745 వ్యక్తిగత యూనిట్లకు 15217.591 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మాత్రమే కేటాయించారు. అంటే దాదాపు 1,81,036 కార్డులు, 9,83,663 యూనిట్లకు 4031.369 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కోత విధించారు. దీంతో పేద ప్రజలకు రేషన్ బియ్యం అందక తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. పేదలం బతికేదెలా?.. స్వర్ణభారతినగర్‌లోని 244 నంబరు రేషన్ షాపు ద్వారా రేషన్ తీసుకుంటాను. ఆధార్ నిర్ణీత సమయానికి ముందే రేషన్ షాపులో ఇచ్చాను. ఈ రోజు ఉదయం రేషన్ షాపుకు వెళ్తే నీ కార్డుకు రేషన్ కేటాయించలేదు అని షాపు నిర్వాహకుడు చెప్పడంతో కంగుతిన్నాను. గుమస్తాగా పని చేసి కుటుంబాన్ని పోషించుకునే నాలాంటి పేదలకు ఇలా చేప్తే ఎలా అని ప్రశ్నించాను. రేషన్ ఎందుకు ఆపారో అర్ధం కావడంలేదనిమా డీలర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. పేదలంటే అధికారులకు ఇంత అలుసా? పని మానుకొని అధికారుల చుట్టూ తిరగాలంటే బతికేదెలా? - నరసింహారావు, స్వర్ణభారతినగర్, గుంటూరు పస్తులుండాల్సిందేనా..?.. గత నెల కూడా 142 షాపు ద్వారా రేషన్ తీసుకున్నాను. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ గత నెలలోనే ఇచ్చాను. అయినా ఈనెల రేషన్ ఆపారు. గతంలో కంది పప్పు, నూనె కూడా ఇచ్చేవారు. ఇప్పుడు బియ్యం కూడా ఆపేశారు. అసలే నిరు పేదలం. బియ్యం కూడా ఇవ్వకపోతే పస్తులు ఉండాలా ? - గట్టు వెంకటరమణ, నల్లచెరువు, గుంటూరు ఇదేమి న్యాయం.. నాకు 97 నంబరు షాపులో రేషన్ ఇస్తున్నారు. ఆధార్ అన్నీ ఇచ్చాను. ఈ రోజు రేషన్ షాపుకు వెళితే కార్డులో అమ్మాయి పేరు తీసేశారని చెప్పారు. కార్డులోని నలుగురిలో ఒకరి పేరు తీసేసి రేషన్ తగ్గించడం ఏమి న్యాయం? నిరుపేదలం మాకు రేషన్ బియ్యమే ఆధారం ఇక్కడికి రావటం వలన కూలీ డబ్బులు పోయాయి. - ఎస్.కె ఖైరు, పాత గుంటూరు కోతకు ముందూ.. తర్వాత కార్డు రకం కార్డుల సంఖ్య వ్యక్తిగత యూనిట్లు గతంలో {పస్తుతం గతంలో ప్రస్తుతం తెల్లకార్డులు 12,49,644 10,93,838 39,24,405 30,46,022 అంత్యోదయ 82,640 73,219 2,33,982 1,75,242 అన్నపూర్ణ 1,374 939 1721 1,119 ఎన్టీఆర్ పింఛను 54,690 39,316 1,61,300 1,17,362 కూపన్లు మొత్తం 13,88,348 12,07,312 43,21,408 33,37,745 -
జన్మభూమిలో కమిటీలకు ప్రాతినిథ్యం
పలమనేరు: ఇన్నాళ్లు పింఛన్ల కమిటి, ఇప్పుడేమో జన్మభూమి కమిటి ఇది అధికార పార్టీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు. జిల్లా స్థాయిలో జన్మభూమిలో ప్రాతినిథ్యం ఉండే లా ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలందా యి. జిల్లా కమిటీలతో పాటు మున్సిపల్, మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రణాళికా విభాగం నుంచి జీవో నెంబర్ 22 పేరిట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి సంబంధించి సూక్ష్మప్రణాళికల తయా రీ, స్వర్ణ గ్రామ పంచసూత్రాలు (ఎస్జీపీఎస్), పట్టణ స్థాయిలో స్వర్ణ పురపాలక పంచసూత్రాలు (ఎస్పిపిఎస్) తదితర కార్యక్రమాల రూపకల్పనకు కమిటీలు దోహదం చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గానూ, కలెక్టర్, సీఈవో జెడ్పీ, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, డీపీవో, మెప్మా పీడీ, సీఈవో, డీఎంఅండ్‌హెచ్‌వో, అనిమల్ హస్బెండరీ జేడీతో పాటు స్పెషల్ ఇన్వైటీలుగా కలెక్టర్ సూచించిన వ్యక్తులతో ఈ కమిటీని రూపొందించనున్నారు. జీపీ, మండలం, మున్సిపాలిటీల్లోనూ.. గ్రామ పంచాయతీ కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా, ఎంపీటీసీ, ఇద్దరు గ్రూపు సభ్యులు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు మెంబర్లుగా ఉంటారు. మున్సిపాలిటీ వార్డు లో కౌన్సిలర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్లలో కార్పొరేటర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షులుగా జెడ్పిటీసీతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఓ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు సభ్యులుగా ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ అధ్యక్షులుగా, ఓ కౌన్సిలర్, ముగ్గురు సోషియల్ యాక్టవిస్ట్లు సభ్యులుగా, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. మరింత అధికార జోక్యం.. ఇప్పటికే పింఛన్ల కమిటీల కారణంగా జన్మభూమి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరిట సోషియల్ యాక్టివిస్ట్‌ల నెపంతో అధికార టీడీపీ నాయకులు అడ్డదారిన అధికారాన్ని చెలాయిం చేందుకు మార్గం సుగమమైనట్టే. ఫలితంగా అధికారుల ప్రమేయం తగ్గి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే జన్మభూమి పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మారడం ఖాయమని తెలుస్తోంది. -
కరెంట్ కోతలపై కర్షకుల ఆందోళన
బచ్చన్నపేట : విద్యుత్ కోతలతో పంటలు ఎండుతున్నాయని, ప్రభుత్వం స్పందించి వ్యసాయూని కి సక్రమంగా కరెంట్ సరఫరా చేయూలంటూ పలు ప్రాంతాల్లో రైతులు శనివారం రాస్తారోకోలు నిర్వహించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఎదుట టీడీపీ మండల అధ్యక్షుడు ఎలికట్టె మహేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలు రైతులతో కలిసి బైఠాయిం చారు. వ్యవసాయానికి ఏడు గంటలపాటు నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయూలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇలాగే మొండివైఖరి అవలంబిస్తే... ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఏఈ రాంబాబుకు వారు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో చల్లా సుధాకర్‌రెడ్డి, సత్తిరెడ్డి, దశరథ, అంబదాస్, మట్టిరవి, చంద్రారెడ్డి, పాకా ల మహేందర్, పాకాల లింగం, ఇంద్రయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. కురవిలో.. రైతాంగానికి కనీసం ఏడు గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కురవిలోని మానుకోట-ఖమ్మం ప్రధా న రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రహదారిపై బైఠారుుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నల్లు సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్ కోతలతో చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఏడు గంటల పాటు విద్యుత్ సరఫ రా చేసి, రైతు ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. సీపీఐ మండల కార్యదర్శి ఎన్.సురేందర్‌కుమార్, నాయకులు పోగుల శ్రీనివాస్, నెల్లూరి నాగేశ్వర్రావు, తురక రమే ష్, అప్పాల వెంకన్న, నిలిగొండ నాగేశ్వర్‌రా వు, బుడమ వెంకన్న, దూదికట్ల సారయ్య, బస్వశ్రీను, రాంమూర్తి, సైదులు, ప్రవీణ్, వీరన్న, కొమురయ్య, ఉప్పలయ్య, బుర్రి సమ్మయ్య, గుర్వయ్య, రాములు పాల్గొన్నారు. పంటలు ఎండుతున్నా పట్టించుకోరా..? జనగామ రూరల్ : ‘పంటలు ఎండుతున్నా పట్టించుకోరా.?, అప్పు తెచ్చి సాగు చేస్తే కరెంట్ కోతలతో పంటలకు నీరందక ఎండిపోతున్నాయి.’ అంటూ తెలంగాణ రైతు సంఘం జనగామ డివిజన్ కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంట్ కోతలకు నిరసనగా నెహ్రూ పార్కు వద్ద జనగామ- సిద్దిపేట రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యుడు మోకు కనకారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయానికి నిరంతరం ఏడు గంటల విద్యుత్‌తో పాటు రుణాలు సకాలంలో మాఫీ చే సి రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఆర్. మీట్యానాయక్, నాయకులు ఎం.బీరయ్య, జీఎల్ఎన్ రెడ్డి, పీ.ఉపేందర్, ఎ.సత్యనారాయణ, ఎస్.దుర్గాప్రసాద్, బీ.శ్రీరాములు, జే.మల్లేశం, పీ.సుదర్శన్, ఎం.మల్లయ్య, టీ.ఆనందం, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎన్పీడీసీఎల్ కార్యాలయం ఎదుట ధర్నా ఎన్జీవోస్ కాలనీ : వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా అధ్యక్షుడు పూనెం ప్రభాకర్, కార్యదర్శి కొత్తపల్లి రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ హన్మకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడు గంటలు విద్యుత్ అందిస్తున్నామని చెబుతున్న అధికారులు కనీసం మూడు గంటలు కూడా సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతాంగానికి మెరుగైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. ధర్నాలో నాయకులు ఎన్.ప్రసాద్, ఆలకుంట్ల సాయి లు, ముంజంపల్లి వీరన్న, సిద్దబోయిన జీవన్, గొంది సమ్మయ్య, జగత్‌రెడ్డి, చిర్ర సూరి, పైండ్ల యాకయ్య, బొమ్మగాని వెంకన్న, చింత నవీన్, చిర్ర భద్రయ్య, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక ‘ఆహార భద్రత’
ముకరంపుర : అధికారం చేపట్టినప్పటినుంచి ప్రజాపంపిణీ వ్యవస్థను వేలెత్తి చూపుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయి ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రేషన్‌కార్డుల స్థానంలో ఆహారభద్రత కార్డులను అందించాలని నిర్ణయించింది. తొలివిడతగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ నెల 10 నుంచి 15 వరకు దరఖాస్తుల స్వీకరణకు నడుం బిగించింది. పట్టణాలు, నగరాల్లో ఈ కార్డుల జారీపై ప్రణాళిక ఖరారు కాలేదు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య తన క్యాంపు కార్యాలయంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆహార భద్రత కార్డుల జారీ ప్రణాళికపై చర్చించారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఐకేపీ ఏపీఏంలతో గురువారం ఉదయం 9కి సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దీనికి పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి హాజరవుతారని తెలిపారు. పూర్తిస్థాయిలో ప్రణాళిక, విధివిధానాలపై నేడు మండలస్థాయి అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఇప్పటికే లక్ష దరఖాస్తులు.. జిల్లాలో కుటుంబాల లెక్కు మించి రేషన్కార్డులుండటం, పీడీఎఫ్ బియ్యం పక్కదారి పట్టడం వంటి వాటిని సర్కారు సీరియస్‌గా పరిగణించింది. బోగస్ రేషన్‌కార్డుల తొలగింపునకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 10,01,047 రేషన్ కార్డులున్నాయి. రేషన్ అనుసంధానం, బోగస్ ఏరివేతలో భాగంగా 85వేల కార్డులను తొలగించారు. ఫలితంగా 20వేల క్వింటాళ్ల బియ్యం ఆదా అయ్యాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 9.70 జిల్లాలో లక్షల కుటుంబాలు ఉండేవి. ఇటీవల నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో కుటుంబాల సంఖ్య 12,66,320కు చేరింది. అంటే కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో కొత్తగా రేషన్‌కార్డుల కోసం ప్రజావాణిలో అర్జీల రూపంలో లక్షదాకా దరఖాస్తులు వచ్చాయి. తాజాగా దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఐదెకరాలకు పైగా భూమి ఉన్నవారు, ప్ర భుత్వ ఉద్యోగులు, వ్యాపారవేత్తలను మినహా యించి మిగిలిన వారికి ఆహార భద్రత కా ర్డులు జారీ చేస్తారు. ఈ కార్డు కింద ఒక్కొక్కరికి 5కిలోల బియ్యం ఇవ్వాలని సూత్రప్రాయంగా సర్కారు నిర్ణయించింది. రేషన్ కార్డు స్థానంలో వస్తున్న ఆహార భద్రత కార్డు కేవలం ప్రజాపంపిణీ సరుకుల కోసం మాత్రమేనని, దేనికీ లింకు ఉండబోదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమగ్ర కుటుంబ సర్వే, గతంలో జారీ చేసిన తెల్లరేషన్ కార్డు లిస్టు, ఓటరు లిస్టు, ఐకేపీ రూపొందించిన నిరుపేదల జాబితా ఆధారంగా దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను రూపొందిస్తామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. గ్రామాలలో ఈ నెల 10 నుంచి 15 వరకు పేదలకు ఆహార భద్రత కార్డుల జారీకి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. ఈ నెల 16 నుంచి 25 వరకు దరఖాస్తుదారుల అర్హతల పరిశీలన, 26 నుంచి 29 వరకు అర్హుల జాబితాను రూపొందించి 30న ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. అర్హులైన పేదలందరూ ఆహార భద్రత కార్డులకు తెల్లకాగితం మీద తమ వివరాలను రాసి సంబంధిత అధికారులకు అందజేయాలని కలెక్టర్ కోరారు. పట్టణాలలో కార్డుల జారీకి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. మొదటి విడత గ్రామీణ ప్రాంతాల వారికి కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామానికి ఒక మండల స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. అతనికి సహాయకుడిగా వీఆర్వో లేద గ్రామ కార్యదర్శిని నియమిస్తామని తెలిపారు. ఆహార భద్రత కార్డుల జారీలో మండల స్థాయిలో తహసీల్దార్ బాధ్యత వహిస్తారని తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్వో టి.వీరబ్రహ్మయ్య, డీఆర్డీఏ పీడీ విజయ్‌గోపాల్, ఏవో రాజాగౌడ్, డీఎస్వో చంద్రప్రకాశ్ పాల్గొన్నారు. -
కన్నీటి వీడ్కోలు
మచిలీపట్నం చేరిన ఎనిమిది మృతదేహాలు అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు చిలకలపూడిలో విషాదం కన్నీరుమున్నీరైన బంధువులు షోలాపూర్‌లోనే చికిత్స పొందుతున్న ఐదుగురు మచిలీపట్నం :తీర్థయాత్ర విషాదయాత్రగా ముగిసింది. ఆనందంగా వెళ్లిన వారు అనంతలోకాలకు చేరారు. మధురజ్ఞాపకాలతో వస్తారనుకున్న ఆత్మీయులు విగత జీవులుగా రావడం చూసి కన్నీరు కట్టలు తెగింది. బందరు కన్నీటి సంద్రమైంది. మహారాష్ట్రలోని షోలాపూర్ జిల్లా పండరీపురం సమీపంలో కవిటిగావ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో బందరుకు చెందిన ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలను ఐదు అంబులెన్స్‌లలో బుధవారం ఉదయం ఇక్కడికి తీసుకువచ్చారు. పట్టణంలో తీవ్ర విషాదం నెలకొంది. అంతటా రోదనలు, వేదనలు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చలమలశెట్టి రంగనాథరావు(61), నూకల జగన్మోహనరావు(55), ఆయన భార్య కృష్ణకుమారి(50), బీరం శేషుమణి(45), జొన్నలగడ్డ వెంకటేశ్వరమ్మ అలియాస్ పాల లక్ష్మి(55), గోళ్ల వెంకటేశ్వరమ్మ(45), గోళ్ల రేష్మ(20), గేదెల వెంకటేశ్వరమ్మ (45) మృతదేహాలను అంబులెన్స్‌లలో తీసుకువచ్చారు. మృతదేహాలను గుర్తించి తీసుకువెళ్లాలని మృతుల బంధువులకు అధికారులు సూచించారు. పోస్టుమార్టం చేసిన మృతదేహాలను కప్పి ఉంచిన వస్త్రాలను తొలగించి తమ బంధువులను గుర్తించిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. ‘మాకెవరు దిక్కు..’ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఈ హృదయ విదారక ఘటన చూసిన స్థానికులు కూడా కంటతడి పెట్టారు. రంగనాథరావు, జగన్మోహనరావు, కృష్ణకుమారిల మృతదేహాలను చిలకలపూడి సెంటరులో బంధువులకు అప్పగించారు. సర్కారుతోటకు చెందిన జొన్నలగడ్డ వెంకటేశ్వరమ్మ మృతదేహాన్ని ఆమె గృహం వద్ద అప్పగించారు. గేదెల వెంకటేశ్వరమ్మ, గోళ్ల వెంకటేశ్వరమ్మ, గోళ్ల రేష్మ మృతదేహాలను సుకర్లాబాద్‌లోని గేదెల వెంకటేశ్వరమ్మ గృహం వద్ద దించారు. ఆ సమయంలో వారి గృహాల వద్ద బంధువుల రోదనలు మిన్నంటాయి. రాత్రంతా పడిగాపులే.. మృతులంతా చిలకలపూడి పరిసర ప్రాంతాలకు చెందిన వారు కావటంతో మంగళవారం రాత్రంతా బంధువులు స్థానిక సెంటరులోనే పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం అంబులెన్స్‌లు వచ్చే వరకు మూడు స్తంభాల సెంటరు వద్ద మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు, ఎస్పీ జి.విజయకుమార్, మాజీ మంత్రి నడకుదుటి నరసింహారావు, మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య తదితరులు కూడా వేచి ఉన్నారు. అనంతరం మృతదేహాలను చిలకలపూడి సెంటరుకు తరలించారు. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించి వారిని ఓదార్చారు. మృతదేహాలను ఇళ్లకు చేర్చిన అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య(నాని), ఆ పార్టీ పెడన నియోజకవర్గ సమన్వయకర్త బూరగడ్డ వేదవ్యాస్, సలార్‌దాదా తదితరులు మృతుల ఇళ్లకు వెళ్లి నివాళులర్పించారు. మృతదేహాలపై పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మృతుల అంత్యక్రియలను బంధువులు అశ్రునయనాల నడుమ నిర్వహించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది బందరు ఎంపీ కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ తీర్థయాత్రలకు వెళ్లిన బందరు వాసులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవటం దురదృష్టకరమన్నారు. మృతదేహాలను త్వరగా వారి బంధువులకు అప్పగించేందుకు ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకుందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా, వారి మృతదేహాలను, స్వల్పంగా గాయపడిన వారిని మచిలీపట్నం తీసుకువచ్చామని చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఐదుగురు షోలాపూర్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారికి సహాయకులుగా మరో ఆరుగురు ఉన్నారని పేర్కొన్నారు. గాయపడిన వారికి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వివరించారు. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించినట్లు తెలిపారు. -
పెన్షన్ కుట్ర
తనిఖీల్లో అనర్హులు.. 20,220 మంది జాబితా అప్లోడ్ చేశాక నిలిపివేసినవి 26,788 ఆన్లైన్లోఅప్లోడ్ కానివి 1448 పరిశీలనకు ఆపేసిన వితంతు పెన్షన్లు 9,397 పెన్షన్ల భారాన్ని తగ్గించుకోడానికి ప్రభుత్వం అనేక ఎత్తుగడలు వేస్తోంది. లబ్ధిదారుల సంఖ్యను కుదించడానికి ఉన్న దారులన్నింటినీ అన్వేషిస్తోంది. జిల్లాలో 25 నుంచి 30 శాతం రద్దు చేయాలని నిర్దేశించినట్టు తెలుస్తోంది. పెన్షన్ కమిటీలు సైతం అనేక సందేహాలు వ్యక్తం చేస్తూ వేలాది మందికి చెల్లింపులు కాకుండా నిలిపివేశారు. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామంటూనే.. అందులో సగం మందిని అనర్హులుగా గుర్తించిన వారి వివరాలను అప్లోడ్ చేసే అవకాశం లేకుండా ఆన్లైన్ వ్యవస్థను స్తంభింప చేస్తున్నారు. అన్ని రకాలుగా పెన్షన్ల సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం అనేక కుట్రలు పన్నుతోంది. విశాఖ రూరల్ : జిల్లాలో సెప్టెంబర్ నెల వరకు అన్ని రకాల పెన్షన్లు కలిపి 3,21,226 ఉన్నాయి. వీటి సంఖ్యను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనర్హులు పేరుతో 20 నుంచి 30 శాతం మంది లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడానికి కమిటీలు వేయాలని అధికారులను ఆదేశించింది. ఈ ప్రకారం జిల్లా అధికారులు కమిటీలు ఏర్పాటు చేసి నాలుగు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఇందులో 20,220 మందిని అనర్హులుగా గుర్తించి తొలగించారు. తక్కువ వయసు పేరుతో 2413, వితంతువులు కాదంటూ 746, వికలాంగులు కాదని 350, చేనేత కార్మికులు కాదని 36, కల్లుగీత కార్మికులు కాదని 16, బీపీఎల్ కాదంటూ 2400, వేరొక పింఛను పొందుతున్నారంటూ 2390, చనిపోయారంటూ 7307, పింఛనుదారులు పంచాయతీలో లేరంటూ 4562 ఇలా మొత్తంగా 20,220 మందిని తొలగించారు. దీంతో జిల్లాలో 3,01,006 మంది లబ్ధిదారుల్లో 1448 మంది వివరాలను ప్రభుత్వం అప్లోడ్ చేసే అవకాశం కల్పించలేదు. దీంతో 2,94,627 మందికి మాత్రమే పెన్షన్లు వస్తాయని భావించారు. కానీ ప్రభుత్వం అందులో కూడా వేలాది మంది విషయంలో సందేహాలు వ్యక్తం చేస్తూ మరోసారి పరిశీలించాలంటూ వాటిని నిలిపివేసింది. అప్లోడ్ చేశాక నిలిచిపోయినవి : జిల్లాలో కమిటీల తనిఖీల్లో కేవలం 6 శాతం మాత్రమే అనర్హులుగా నిర్ధారించారు. కానీ ఈ సంఖ్యను మరింత పెంచాలని నిర్ణయించిన ప్రభుత్వం మరోసారి పరిశీలించాలంటూ 26,788 మంది పెన్షన్లు ఆపేసింది. వీటిలో 4466 మంది వితంతుల పెన్షన్లు కూడా రద్దు చేసింది. వారి భర్తల మరణ ధ్రువపత్రాలు, వయసు, ఇతర కారణాల పేరుతో వారిని జాబితాల నుంచి తొలగించింది. అలాగే లబ్ధిదారులకు 5 ఎకరాలు భూమి ఉందంటూ, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డుల్లో వివరాలు సక్రమంగా లేవంటూ మరికొంత మందికి పింఛన్లు మంజూరు చేయలేదు. వాస్తవానికి కమిటీలు ప్రతీ ఇంటికి వెళ్లి తనిఖీలు చేసి తుది జాబితాను సిద్ధం చేస్తే దానిని అధికారులు అప్లోడ్ చేశారు. కానీ ప్రభుత్వం కేవలం ఆన్లైన్ ఉన్న వివరాలను ఆధారంగా ఏ విధంగా కమిటీల తనిఖీల్లో లోటుపాట్లు గుర్తించిందో ఎవరికీ అర్థం కాని ప్రశ్న. అలాగే సమయం మించిపోయిందంటూ ఆన్లైన్ వ్యవస్థను స్తంభింపచేసింది. దీంతో మరో 1448 మంది వివరాలు అప్లోడ్ చేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం జిల్లాలో పెన్షనర్లు 2,63,373 మంది మాత్రమే ఉన్నట్లు తేల్చారు. వీరికి మాత్రమే అక్టోబర్ నెలకు సంబంధించి ప్రభుత్వం రూ.26.93 కోట్లు మంజూరు చేసింది. నా పింఛన్ తొలగించారు నాది కశింకోటలోని ఉప్పునీటి దిబ్బ ప్రాంతం. నా రెండు చేతులు వంకర తిరిగి పోయాయి. కాళ్లతో నడవలేను. తల్లి సాయం లేకుండా ఎక్కడికీ వెళ్లలేను. మాటలు కూడా సరిగ్గా రావు. తల్లి రమణమ్మే ఆలనా పాలనా చూస్తోంది. అర్హత ఉన్నా నా పింఛన్ తొలగించారు. మా అమ్మ వితంతు పింఛన్ కూడా తీసేశారు. అధికారులు పట్టించుకోవాలి. - యలమంచిలి వాణి, వికలాంగురాలు కొత్తవి డౌటే పెన్షన్ తనిఖీల్లో పాత వాటితో పాటు కొత్తవాటి కోసం కూడా కమిటీలు దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో 44 వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు. పరిశీలించిన అధికారులు 24,045 మందిని అర్హులుగా గుర్తించారు. వీరి వివరాలు ఆన్లైన్లో అప్లోడ్ చేయగా ప్రభుత్వం కేవలం 11,664 మందిని మాత్రమే అర్హులుగా నిర్ధారించింది. కమిటీలు, అధికారులు గుర్తించినప్పటికీ ప్రభుత్వం తిరస్కరణతో కొత్తగా 12,381 మంది పెన్షన్‌కు నోచుకోలేని దుస్థితి ఏర్పడింది. -
ఉపాధి.. పకడ్బందీ
పంచాయతీరాజ్ చేతికి పథకం సత్తెనపల్లి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పంచాయతీరాజ్ శాఖ ఆధీనంలోకి వెళ్లింది. ఇప్పటి వరకూ ఇది గ్రామీణాభివృద్ధి పథకం కింద అమలు జరిగింది. జిల్లాలో డ్వామా ప్రాజెక్టు డెరైక్టర్, డివిజన్లలో ఏపీడీల ఆధ్వర్యంలో, మండలాల్లో ఏపీవోల పర్యవేక్షణలో ఇప్పటి వరకూ కార్యకలాపాలు సాగాయి. దీంతో సిబ్బందిపై సరైన అజమాయిషి ఉండేది కాదు. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం తాజాగా పథకం అధికారులు, సిబ్బంది పంచాయతీ రాజ్ శాఖ ఆధీనంలో పనిచేయాలని నిర్దేశిస్తూ జీవో 139 జారీ చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 27న స్పెషల్ చీఫ్ సెక్రటరీ ప్లానింగ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్పీ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో ప్రకారం ఉపాధి హామీ పథకం పనులు మండల స్థాయిలో మండల పరిషత్, గ్రామ స్థాయిలో పంచాయతీ ఆధ్వర్యంలో జరగనున్నాయి. గతంలో ప్రోగ్రాం ఆఫీసర్లుగా పనిచేసి అనంతరం బాధ్యతల నుంచి తప్పుకొన్న ఎంపీడీవోలకు తిరిగి అవే బాధ్యతలు అప్పగించారు. పనుల తయారీ, క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, సిబ్బంది పనితీరును ఈవోపీఆర్డీ పర్యవేక్షిస్తారు. ఎంపీడీవో ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ ఏఈ ఉపాధి పనులను పరిశీలిస్తారు. మండల పరిషత్ సూపరింటెండెంట్‌కు, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకూ బాధ్యతలు అప్పగించారు. సూపరింటెండెంట్ పేమెంట్ రిజస్టర్, అకౌంట్లు పరిశీలిస్తాడు. ఎఫ్ఏ, జేఏలు కంప్యూటర్ ఆపరేటర్ల సహకారంతో రికార్డు పర్యవేక్షకులుగా పనిచేస్తారు. గ్రామ స్థాయిలో.. గ్రామ స్థాయిలో పథకాన్ని అమలు చేసే పూర్తి బాధ్యత పంచాయతీ కార్యదర్శికి అప్పగించారు. గ్రామ సభల నిర్వహణ, నూతన పనుల ప్రతిపాదన, నూతన జాబ్‌కార్డుల ప్రతిపాదన వంటి వాటికి దరఖాస్తుల స్వీకరణ, పనుల కేటాయింపు వంటివి ఇకపై పంచాయతీ కార్యదర్శి చూసుకోవాలి. ఉపాధి టెక్నికల్ అసిస్టెంట్ పూర్తిగా పంచాయతీ కార్యదర్శి అజమాయిషిలో పనిచేయాలి. ప్రస్తుతం మండల స్థాయిలో ఉపాధి ఏపీవోలకు వర్క్ ఆర్డర్లు ఇచ్చే అధికారాలు కొనసాగుతాయి. ఎంపీడీవోకు సహాయకారిగా ఏపీవో పనిచేయాల్సి ఉంటుంది. అలవెన్సులు ఎంపీడీవోలకే.. నూతన విధానంలో పంచాయతీరాజ్ శాఖ అధికారులకు, సిబ్బందికి పెత్తనం, పర్యవేక్షణ కల్పించినా ఆ శాఖలో ఎంపీడీవోలకు తప్ప ఇతరులకు ఏ విధమైన ప్రయోజనం కల్పించలేదు. ఎంపీడీవోలకు కారు, ఇతర అలవెన్సులుంటాయి. తమకు అదనపు బరువు, బాధ్యతలు తప్ప, అదనపు అలెవెన్సులు లేవని పంచాయతీరాజ్ సిబ్బంది పెదవి విరుస్తున్నారు. -
బెజవాడ ఎక్స్‌ప్రెస్!
అన్ని జిల్లాల నుంచి నూతన రాజధాని విజయవాడకు రైలు, బస్సు మార్గాలు ఉండేలా చూస్తామంటున్న ప్రభుత్వం మన జిల్లా గురించి ఏమాత్రం ఆలోచించడం లేదు. ఇక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్లేందుకు ఒక్కటంటే ఒక్క రైలు సౌకర్యం కూడా లేదు. జిల్లాలో దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న మూడు రైలు మార్గాలను పూర్తి చేయడం తప్ప మరో మార్గం లేదు. ఆ దిశగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాజంపేట: రాష్ట్ర నూతన రాజధాని విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి రాజధాని నగరానికి వెళ్లేందుకు రైలు మార్గం ఎటు అనే అంశంపైనే ఉంది. రాజధాని కేంద్రాన్ని కలిపేందుకు ప్రతి జిల్లా నుంచి రైలు, రోడ్డు మార్గాలు ఉండాలనే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. కానీ వైఎస్సార్ జిల్లా గురించి మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఇంతవరకు హైదరాబాద్ రాజధానిగా ఉండటంతో జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా రైలు, బస్సు సౌకర్యాలు ఉండేవి. కానీ ప్రస్తుతం కొత్త రాజధాని విజయవాడవైపు రైలులో వెళ్లాలంటే రేణిగుంట జంక్షన్‌కు వెళ్లాల్సి వస్తోంది. ఇది తప్ప మరో మార్గం లేదు. సర్వే దశలోనే ఆ మూడు రైలు మార్గాలు జిల్లా నుంచి మూడు రైలు మార్గాలు కొత్తగా ఏర్పడబోయే రాజధానికి అనుకూలంగా ఉన్నాయి. అవి కంభం-ప్రొద్దుటూరు, భాకరాపేట-గిద్దలూరు, ఓబులవారిపల్లె - కృష్ణపట్నం రైలుమార్గాలు. వీటిలో రెండులైన్లు మాత్రం సర్వేకే పరిమితమయ్యాయి. ఈ లైన్ల మార్గం ఏర్పాటు దశాబ్దాల కాలం నుంచి కలగానే మిగిలిపోయింది. ఈ లైన్లు పూర్తయితే ప్రకాశం, వైఎస్సార్ జిల్లాలను అనుసంధానం చేసినట్లవుతుంది. అక్కడి నుంచి విజయవాడకు మరో రైలులో వెళ్లాల్సి ఉంటుంది. 2010-2011 రైల్వేబడ్జెట్‌లో కూడా కొత్త రైల్వే లైన్‌గా కంభం-ప్రొద్దుటూరును ప్రకటించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013-2014 బడ్జెట్లో ఈ లైన్‌కు రూ.10లక్షలు కేటాయించారు. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వేశాఖ మంత్రి సదానందగౌడ్ ప్రవేశపెట్టిన రైల్వేబడ్జెట్ 2014లో కంభం-ప్రొద్దుటూరు రైల్వేలైన్‌కు రూ.10లక్షలు విదిల్చారు. ఇలాంటి పరిస్థితిలో ఈ రైల్వే మార్గం పూర్తయ్యేదెప్పుడు విజయవాడ వైపు రైళ్లు తిరిగేదెప్పుడు అనే చర్చ జరుగుతోంది. మార్గం తీరు ఇలా.. కంభం-ప్రొద్దుటూరు మధ్య కొత్త రైల్వేలైన్ 142 కిలోమీటర్ల మేర ఉండేటట్లు రూట్‌ను ఖరారు చేశారు. దాదాపు రూ.829 కోట్ల వ్యయాన్ని ఈరైల్వేలైన్కు అంచనా వేశారు. కంభం-ప్రొద్దుటూరు రైల్వేలైన్ సర్వేను ప్రతి బడ్జెట్లో ప్రస్తావిస్తూ వచ్చారు. ఆరేళ్ల క్రితం ఈ లైనుకు ప్రాథమికంగా సర్వేలు చేసి వదిలిపెట్టారు. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు, బద్వేలు, గిద్దలూరు లైనుకు కలిపే విధంగా మార్గం రూట్‌కు ఒక దశలో రూపకల్పన చేసినట్లు రైల్వే వర్గాల సమాచారం. ఫైనల్ సర్వే చేసిన తర్వాతే లైను మార్గం ఒక రూపానికి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే గత యూపీఏ ప్రభుత్వంలో భాకరాపేట-గిద్దలూరు రైల్వేమార్గం ఏర్పాటుకు సర్వేకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. భాకరాపేట, సిద్ధవటం, బద్వేలు, పోరుమామిళ్ల, గిద్దలూరు వరకు లైన్ వేసే విధంగా సర్వే కొనసాగింది. ఈ రెండు మార్గాలు కూడా ఒకే దిశలో ఉండటంతో ఏ మార్గంలో రైల్వేలైను తీసుకెళతారనేది ఇప్పుడు రైల్వేవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజధానికైతే .. కృష్ణపట్నం రైల్వేలైన్ కొత్త రాజధానికైతే ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైల్వేలైన్ ఒకటే అందుబాటులో ఉంది. అది కూడా పూర్తయ్యేందుకు మరో రెండేళ్లు పడుతుందో..ఇంకెన్నాళ్లు పడుతుందో తెలియని పరిస్థితి. ఈ మార్గంలో వెలుగొండల టన్నెల్ పనులు ఇంకా ప్రారంభంకాలేదు. ఇప్పట్లో ఈ పనులు ప్రారంభమవుతాయన్న నమ్మకం రైల్వేవర్గాల్లో లేదు. ఈ రైల్వేలైన్ తిరుపతి-విజయవాడ లైనుకు అనుసంధానమవుతుంది. దీని వల్ల రాజధానికి ఈ మార్గం మీదుగా రైళ్లు చేరుకునే అవకాశం ఉంది. కానీ మార్గం పూర్తి కావడమే ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి వైఎస్సార్ జిల్లా నుంచి విజయవాడకు రైలు మార్గంలో చేరుకునే అవకాశం ఇప్పట్లో లేనట్లేనని చెప్పవచ్చు. జిల్లా కు చెందిన ప్రజాప్రతినిధులు కొత్త రైల్వే లైన్లకు నిధులు కేటాయించి పనులు జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. -
కమ్ముకుంటున్న కరువు మేఘాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఓవైపు పంటలు ఎండుతున్నాయి..మరోవైపు పశుగ్రాసం కొరత వేధిస్తోంది.. వరుణదేవుడు మాత్రం కరుణించడం లేదు. వెరసి అన్నదాత పరిస్థితి దయనీయంగా మారింది. స్పందించాల్సిన ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో దిక్కుతోచని అన్నదాతలు కరుణించు వరుణుడా అంటూ ఆకాశం వైపు చూస్తున్నారు.. తొమ్మిదేళ్ల పాలనలో వ్యవసాయాన్ని దండగా మార్చిన చంద్రబాబు నేడు తమది రైతు ప్రభుత్వంగా ప్రచారం చేసుకుంటున్నారు. కమ్ముకున్న కరువు మేఘాలను మాత్రం చూడటం లేదు. జూన్‌తో మొదలైన ఖరీఫ్ ఈ నెలతో అంటే మరో మూడు రోజుల్లో పూర్తి కానుంది. ఖరీఫ్ ఆరంభం నుంచి జిల్లాను వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఆలస్యంగా ఆగస్టు 22న మొదలైన వర్షాలు సెప్టెంబర్ మొదటి వారం వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అయితే, ఈ వాన కొన్ని ప్రాంతాలకే పరిమితం కావడం.. సెప్టెంబర్ 2వ వారం నుంచి మళ్లీ వర్షాలు బెట్టు చేయడం.. ఎండల తీవ్రత పెరగడంతో పంటలు ఎండుముఖం పట్టాయి. కోడుమూరు, ప్యాపిలి, సి.బెళగల్, పత్తికొండ, తుగ్గలి, గోనెగండ్ల తదితర మండలాల్లో అంతంత మాత్రంగా వర్షాలు పడ్డాయి. ఇక్కడ ఉన్న కొద్దిపాటి తేమ కూడా ప్రస్తుత ఎండతీవ్రతకు ఆవిరవుతోంది. దీంతో పత్తి, మొక్కజొన్న, ఆముదం, కొర్ర వంటి పంటలు అడుగు మేర వరకే పెరుగుదల ఉంది. జిల్లాలో సాధారణ సాగు 5.85 లక్షల హెక్టార్లు ఉండగా, ఆరు లక్షల హెక్టార్లకు పైగా పంటలు సాగయ్యాయి. జిల్లా మొత్తం మీద జూన్ నుంచి సెప్టెంబర్ 27 వరకు 438.9 మి.మీ., సాధారణ వర్షపాతం కాగా 311.8 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదయింది. అంటే 29 శాతం తక్కువగా నమోదయింది. కేవలం రెండు మండలాల్లో మాత్రమే అధిక వర్షాలు పడగా, 11 మండలాల్లో సాధారణ వర్షపాతం మేరకు వర్షాలు కురిశాయి. అంటే 41 మండలాల్లో కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం కరువు గురించి ఇంతవరకు మాట మాత్రంగా కూడా స్పందించకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. భారంగా మారనున్న పశుపోషణ మామూలుగా అయితే ఆగస్టు నుంచి కొండల్లో, బీడు భూముల్లో పచ్చిక అభివృద్ధి చెందుతుంది. ఎద్దులు పశువులను మేపడానికి బయటికి తరలిస్తారు. ఖరీఫ్ ముగుస్తున్న అనేక మండలాల్లోని కొండలు, బీడు భూముల్లో పచ్చిక మొలవలేదంటే కరువు పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ఇప్పటికి పశువులకు ఎండగడ్డినే వినియోగిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో వానలు పడినా చుక్కనీరు చేరని చెరువులు అనేకం ఉన్నాయి. కల్లూరు మండలం ఉల్లిందకొండ చెరువుకు ఇప్పటికీ చుక్కనీరు రాలేదు. ప్యాపిలి మండలంలోని చెరువులు, కుంటలన్నీ వెలవెలపోతున్నాయి. పశువులకు తాగడానికి కూడా నీరు కరువై రైతులకు పశుపోషణ పెనుభారంగా మారనుంది. -
ప్రా(ప్రొ)జెక్ట్ మేనేజ్మెంట్
ఎన్నో నిర్మాణాలు.. మరెన్నో ఉత్పత్తులు.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.. అయినప్పటికీ సకాలంలో ఆశించిన లక్ష్యాలు చేరుకోని సందర్భాలు అనేకం. మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఉత్పాదక లక్ష్యాల పరంగా ఎన్నో కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న భారత్‌లో.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యకు పరిష్కారంగా ఆవిష్కృతమైన విభాగం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక నిర్దిష్ట లక్ష్యం చేరుకునే క్రమంలో.. ప్రతిపాదన దశ నుంచి ఆచరణలోకి తీసుకువచ్చే వరకు ఎంతో ముఖ్యమైన భూమిక పోషించే విభాగం ఇది. దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ.. యువతకు కెరీర్ అవకాశాలు కల్పిస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్వరూపం వ్యాపారం, విధులు, విభిన్న అవసరాలు.. వీటన్నిటికీ ఒక లక్ష్యం ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళిక, నిర్వహణ, సంరక్షణ, నేతృత్వం, వనరుల సమర్థ వినియోగం వంటి విధులు నిర్వర్తించడమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆయా నిపుణులు తమ నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాస్తవ రూపంలో అనువర్తించే విభాగం ఇదే. ఇటీవల కాలంలో దేశంలో చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌ల దృష్ట్యా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ నిర్వహణ, కార్యాచరణకు సంబంధించిన లోపాలతో పలు ప్రాజెక్ట్‌లు మధ్యలోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఆలస్యమై వ్యయ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ సమాధానం నిపుణులైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. అన్ని విభాగాల్లోనూ అవసరం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. కేవలం నిర్మాణ రంగం లేదా మౌలిక సదుపాయాల కల్పన వంటి విభాగాలకే పరిమితం కాదు. కార్పొరేట్ హౌస్‌లలో, బహుళ అంతస్తుల భవనాల్లో కార్యకలాపాలు సాగించే ఐటీ సంస్థల నుంచి ఆర్కిటెక్చర్ వరకు అన్ని రంగాల్లోనూ ఆయా సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులు కావాలి. ఉదాహరణకు ఐటీని దృష్టిలో పెట్టుకుంటే.. ఒక ఐటీ కంపెనీ క్లయింట్ అవసరాల మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో క్లయింట్ వాస్తవ అవసరాలు, వ్యయ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటూ.. సదరు ప్రొడక్ట్‌ను రూపొందించేందుకు ఒక బృందం విధులు నిర్వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ప్రాజెక్టును నిపుణులు సమర్థంగా అమలు చేయడం ద్వారానే క్లయింట్ తో జరిగిన అవగాహన మేరకు నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దేశించిన వ్యయంలో ప్రొడక్ట్‌ను రూపొందించడం సాధ్యమవుతుంది. ఇదే విధంగా టెలికం, ఆటోమొబైల్, ఫైనాన్స్ తదితర రంగాల్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఏర్పడింది. 4 లక్షల మంది కావాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఎర్నెస్ట్ యంగ్ ఇండియా విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. దీని ప్రకారం.. 2020 వరకు ప్రతి ఏటా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం 4 లక్షల మేర ఉండనుంది. ఔత్సాహికులు ఈ రంగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేది ఈ రంగంలో నిపుణుల సూచన. అవకాశాలకు వేదికలివే కెరీర్ పరంగానూ ఢోకాలేని విభాగం.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. పలు సంస్థలు ఆయా రంగాల్లోని ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఖర్చులు నియంత్రించుకుంటున్న సందర్భాల్లోనూ కొత్తగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులను నియమించుకోవడమే.. కెరీర్ పరంగా ఈ విభాగంలో లభించే భరోసాకు నిదర్శనం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఐటీ, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అర్బన్ డెవలప్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎంట్రీ లెవల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ హోదాతో ఉద్యోగం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ప్రాజెక్ట్ షెడ్యూలర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి కీలక హోదాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రారంభంలో కనీసం నెలకు రూ. 20 వేల జీతం గ్యారంటీ. అవసరమైన లక్షణాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునే అభ్యర్థులకు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్లానింగ్, టీం బిల్డింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు అవసరం. కోర్సులూ అందుబాటులోకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో కెరీర్ కోరుకునే వారికి ఇప్పుడు అకడమిక్‌గా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ స్థాయిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అకడమిక్ నైపుణ్యాలు అందించడంలో దేశంలోనే ప్రత్యేకత పొందిన సంస్థ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పలు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. కోర్సుల వివరాలు పైన చిత్రంలో చూడొచ్చు. సర్టిఫైడ్ అసోసియేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణనందించే ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు. దీంతోపాటు 1500 గంటల ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నాలుగేళ్లు, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో ఏడేళ్ల అనుభవం గడించిన అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో నాలుగేళ్లు చొప్పున అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్లో ఏడేళ్ల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్లో నాలుగేళ్ల పని అనుభవం ఉంటే ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంఐ ఏజిల్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ ఇప్పటికే ఈ రంగంలో అనుభవం గడించిన వారికి మరింత నైపుణ్యాలు అందించే లక్ష్యంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. పీఎంఐ ప్రొఫెషనల్ ఇన్ బిజినెస్ అనాలిసిస్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, బిజినెస్ అనాలిస్ విభాగంలో అయిదేళ్ల అనుభవం లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. అద్భుతమైన భవంతిని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలి.. ఒక రహదారి నిర్మాణాన్ని నిర్ణీత వ్యయ పరిమితితో పూర్తి చేయాలి.. ఓ కొత్త ఉత్పత్తిని తక్షణమే మార్కెట్లోకి తేవాలి.. అంటే.. ముందుగానే నిర్ణయించిన వ్యయ అంచనాలు- కాల పరిమితులు సిద్ధం. వీటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయా ప్రమాణాల పరిధిలోనే లక్ష్యాలు పూర్తిచేయాలి. అందుకోసం అనుసరించాల్సిన, అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించిన విభాగమే.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్!! దరఖాస్తు విధానం ఔత్సాహిక అభ్యర్థులు తమకు సరిపడేకోర్సును గుర్తించాలి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో మెంబర్‌గా నమోదు చేసుకోవడం ద్వారా సదరు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆయా ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన వ్యవధి పూర్తయ్యాక నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేషన్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా నాలుగు చాప్టర్ల ద్వారా శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. పలు సంస్థలతో ఒప్పందాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా.. ఆయా సర్టిఫికేషన్లు, బోధనపరంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అభ్యర్థులకు శిక్షణ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాకుండా అకడమిక్ స్థాయిలోనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విధంగా ఆయా కోర్సుల కరిక్యులంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అందుకోసం బీటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశపెట్టదగిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ శిక్షణ అంశాలను రూపొందించింది. పీఎంఐ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్లో 4,500 గంటల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 300 గంటల పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పీఎంఐ షెడ్యూలింగ్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్‌లో అయిదు వేల గంటల పని అనుభవం లేదా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు 3,500 గంటల పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.pmi.org.in దేశంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్-ముంబై; కోర్సు- ప్రొఫెషనల్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ భారతీయ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ - పుణె; కోర్సు- పీజీ డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై; కోర్సు- పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - హైదరాబాద్; కోర్సు - పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ - నోయిడా; కోర్సు - ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ - పుణె; కోర్సు- ఎంబీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. అత్యంత ఆవశ్యకం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమైన అంశంగా మారింది. అన్ని రంగాల్లోనూ ఈ విభాగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడింది. ఉత్పత్తి పరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక లక్ష్యం నెరవేరాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించి శిక్షణ ఇచ్చే కోర్సు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అందుకే అకడమిక్ స్థాయి నుంచే దీన్ని ఒక కోర్సుగా బోధించాలి. ఈ విషయంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా కూడా చొరవ తీసుకుంటోంది. ప్రతి కోర్సులో కనీసం ఒక ఎలక్టివ్గానైనా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పీఎంఐ - హైదరాబాద్ చాప్టర్ గతేడాది నుంచి నిట్-వరంగల్‌లో ఒక ఎలక్టివ్‌గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టింది. కెరీర్ పరంగానూ అవకాశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు అకడమిక్స్‌లో లేకున్నప్పటికీ.. పీఎంఐలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కోర్ సర్టిఫికేషన్స్‌కు మార్గం ఏర్పరచుకోవచ్చు. లీడర్షిప్ స్కిల్స్, టీం కల్చర్ ఉంటే కెరీర్లో మరింత మెరుగ్గా రాణించేందుకు వీలవుతుంది. - కె.శ్రీనివాస్, ప్రెసిడెంట్, పీఎంఐ-పెర్ల్ సిటీ హైదరాబాద్ చాప్టర్ అకడమిక్ నైపుణ్యంతో.. అద్భుత భవిష్యత్తు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డొమైన్ నాలెడ్జ్ ఉంటే అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూట్లు ఈ విభాగాన్ని ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నప్పటికీ.. వాస్తవ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయి నైపుణ్యాలు పొందే అవకాశం తక్కువగా ఉంది. కారణం.. విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్లపై ప్రధానంగా దృష్టి సారించడం. ఈ విభాగంలో పూర్తి స్థాయి కోర్సుల ఆవశ్యకత నెలకొంది. ఇది ఔత్సాహిక విద్యార్థులకు చక్కటి మార్గం కూడా. అందుకే ఈ నైపుణ్యాలు అందించే విధంగా పీఎంఐ-ఇండియాతో ఒప్పందం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాం. -ప్రొఫెసర్ ప్రకాశ్ వాక్నిస్,హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ -
‘రుణమాఫీ' విడుదల
రుణమాఫీ విడుదలతొలివిడతగా రూ.414.25 కోట్లు కరీంనగర్ : రుణమాఫీపై ప్రభుత్వం తొలి అడుగువేసి అన్నదాతల ఆశలకు ఊపిరిపోసింది. మాఫీ కోసం కొద్ది రోజులుగా నిరీక్షిస్తున్న రైతులకు ప్రభుత్వం తొలివిడతగా 25 శాతం నిధులను శనివారం నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 3,73,876 మంది రైతులకు 31 బ్యాంకుల్లో కలిపి రూ.1,656 కోట్లు రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపించింది. మొదటి దఫాగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,250 కోట్లు మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22న సంతకం చేశారు. ఇందులోంచి మన జిల్లాకు రూ.414.25 కోట్లు రాగా, వాటిని 116 జీవో ప్రకారం శనివారం విడుదల చేశారు. ఈ డబ్బులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. మిగతా మొత్తం రుణం ఎప్పుడు మాఫీ అవుతుందోననే ఉత్కంఠ రైతుల్లో నెలకొంది. -
‘ఆదర్శానికి' మంగళం...
కరీంనగర్‌అగ్రికల్చర్ : క్షేత్రస్థాయిలో రైతులకు అన్ని విధాలా అండగా ఉండి అవసరమైన సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఆదర్శ రైతుల వ్యవస్థను రద్దు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికారిక ఉత్తర్వులు రావడమే తరువాయి.. జిల్లాలో 1892 మంది ఆదర్శ రైతులకు ఉద్వాసన కలగనుంది. వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా మల్టీపుల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్(ఎంపీఈవో)ల నియామకానికి మొగ్గు చూపుతోంది. విభజన అనంతరం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సరా ్కర్ ఆదర్శ రైతు వ్యవస్థకు మంగళం పాడి ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ సర్కార్ సైతం ఈ అం శంపై అన్నివిధాలా ఆలోచించి చివరకు రద్దు చేసేం దుకే మొగ్గు చూపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా.. అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వ్యవసాయశాఖకు, రైతులకు మధ్య వారధిగా పనిచేసే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్ 2007లో ఆదర్శ రైతు వ్యవస్థను ప్రవేశపెట్టారు. మొ దట్లో బాగానే ఉన్నా ఆయన మరణానంతరం పక్కదోవ పట్టింది. వీరికి నెలకు రూ.వేయి గౌరవ వేతనంగా నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో 2500 మంది ఆదర్శరైతుల నియామకం జరిగింది. ఆ త ర్వాత విధుల్లో నుంచి తొలగించడం, వివిధ కారణాలతో ఆ సంఖ్య 1,892కు చేరింది. సంస్కరణలో భా గంగా ఆదర్శ రైతులతో ప్రయోజనం లేదని భా విస్తూ ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రస్తుత స ర్కార్ ప్రణాళిక రూపొందించుకుంది. ఈ మేరకు జి ల్లాలో 1892 మంది రైతులకు నెలకు గౌరవవేతనం గా ఇస్తున్న రూ.18.92 లక్షలను ఆదా చేయనుంది. ఎంపీఈవోల వ్యవస్థ... రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చి పరిష్కరించాలని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఆదర్శ వ్యవస్థ స్థానంలో గతంలో అమలులో ఉన్న మల్టీఫుల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ల నియామకం చేపట్టే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తోంది. 2004కు ముందు గ్రామాల్లో రైతుమిత్ర గ్రూపులు ఏర్పాటుచేసి వాటిని సమీకరించి గ్రామైఖ్య సంఘాలను ప్రతి నెలా సమావేశాలు నిర్వహించేందుకు ఎంపీఈవోలను నియమించారు. చిన్న మండలాల్లో ముగ్గురు, పెద్ద మండలాల్లో ఐదుగురి చొప్పున నియమించి ఈ సంఘాల నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. ప్రస్తుతం ఈ వ్యవస్థను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రైతు కుటుంబాలను బట్టి జిల్లాలో 2,500 మంది ఆదర్శ రైతులను నియమించినప్పటికీ క్రమంగా వివిధ కారణాలతో పలువురిని తొలగించగా 1896 మంది పనిచేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో గ్రామంలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది ఆదర్శ రైతులున్నారు. వీరి స్థానంలో ఎంఈవోలను నియమించి రెండు మూడు గ్రామాలకొకరిని నియమించుకుంటే ఆదర్శ రైతులకు ఇస్తున్న గౌరవ వేతనం సరిపోతుందని ఆలోచిస్తున్నట్లు తెలిసింది. -
మొక్కజొన్న రైతుకు ఊరట
మహబూబ్‌నగర్ వ్యవసాయం: మొక్కజొన్నకు గిట్టుబాటు ధర లభించక ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించనుంది. ఈ ఏడాది వర్షాభావా పరిస్థితుల కారణంగా దిగుబడి సరిగా రాకపోవడంతో రైతులు ఇప్పటికే డీలా పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈకేంద్రాలు అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి రానున్నారుు. దీంతో రైతులు నేరుగా ధాన్యాన్ని విక్రరుుంచి గిట్టుబాటు ధర పొందేందుకు అవకాశం ఏర్పడింది. జిల్లాలో 10 కౌంటర్లు ఏర్పాటు కానున్నట్లు సమాచారం. ఇందుకు సంబందించి రెండు మూడు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్లు అధికారులు పేరొకన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు బాదేపల్లి, వనపర్తిటౌన్,నాగర్‌కర్నూల్, అచ్చంపేట, షాద్‌నగర్, కల్వకుర్తి, నవాబ్‌పేట్, అలంపూర్, మహబూబ్‌నగర్ మార్కెట్‌యాల్లో కేంద్రాలను ఏర్పాటు చేయూలని ప్రతిపాదనలు పంపారు. దీనికితోడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు మార్క్‌ఫెడ్, పీఏసిఏస్, హాకా ఏజెన్సీలు మందుకు వచ్చాయి. కొనుగోలు సాఫీగా సాగేనా? గత ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో 1.61లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేయగా, ఈ ఏడాది 1.53లక్షల హెక్టార్లలో సాగరుు్యంది. దీనికితోడు అకాల వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. కాగా గత ఏడాది జిల్లాలో ప్రభుత్వం 7 కేంద్రాలను ఏర్పాటు చేస్తూ మార్క్‌ఫెడ్‌కు కొనుగోలు బాధ్యత అప్పగించింది. అరుుతే మార్క్‌ఫెడ్ వద్ద సిబ్బంది లేక పోవడంతో వారు పీఏసిఎస్‌లకు బాధ్యతలను అప్పగించారు. దీంతో నిర్వహణ లోపాల కారణంగా గోదాములు, గన్నీ బ్యాగులను సకాలంలో సిద్ధం చేసుకోలేకపోయూరు. ఈ కారణంగా ్రపైవేటు ఏజెన్సీలు 16.21లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా మార్క్‌ఫెడ్ 5.73లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసింది. వ్యాపారులు అత్యధికంగా రైతులకు క్వింటాకు రూ.1100 నుంచి 1250 వరకు మాత్రమే చెల్లించడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కొన్ని చోట ప్రైవేటు ఏజెన్సీలు కొనుగోలు చేసిన పంటను ప్రభుత్వ కొనుగోలు సెంటర్ల అమ్మినట్లు ఆరోపణలు వెలువెత్తాయి. ఈ సారైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కొనుగోలు సాఫీగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు. రైతులు నాణ్యమైన సరుకు తెవాలి - మార్కెటింగ్‌శాఖ ఏడీ బాలమణి జిల్లాలో 10 మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు అవసరం ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వానికి నివేదిక పంపాం. 10 కేంద్రాల్లో కొనుగోలు జరిగే అవకాశం ఉంది. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతుధర(రూ.1310/క్విటా)ను పొందాలి. రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని మాత్రమే మార్కెట్లకు తీసుకురావాలి. -
సోలార్ పార్కు హుళక్కేనా ?
సాక్షి, గుంటూరు రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాలో వివిధ ప్రాజెక్టులను నెలకొల్పేలా చేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం విఫలమవుతోంది. అత్యంత వెనకబడిన పల్నాడు ప్రాంతంలో సోలార్ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపినా, ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు. = తొలి దశలో జిల్లాలో 800 మెగా వాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. = పల్నాడు ప్రాంతంలో పదివేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములన్నాయి. సోలార్ పార్కు నెలకోల్పేందుకు ఈ భూముల వివరాలను ప్రభుత్వానికి పంపకుండా ఎక్కువ భాగం అటవీ భూములు గుర్తించి నివేదించారు. = దీంతో 300 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు ముందుకు వచ్చిన ఎన్టీపీసీ వెనకడుగు వేసినట్టు సమాచారం. మరోవైపు తొలుత ఆసక్తి చూపిన పారిశ్రామిక వేత్తలు కూడా ముఖం చాటేస్తున్నట్లు తెలిసింది. = అటవీ అనుమతులు రావాలంటే ఏళ్లు పడుతుందని, ఈ నేవథ్యంలో ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేమని పలు కంపెనీలు చేతులేత్తేశాయి. వాటికి బదులు వేరే భూములు కేటాయిస్తే అప్పుడు పరిశీలిస్తామని మెలిక పెడుతున్నట్లు సమాచారం. = ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి అటవీ భూములు కాకుండా ప్రభుత్వ భూముల వివరాలు పంపేలా చర్యలు తీసుకోవాలని పల్నాడు ప్రజలు కోరుతున్నారు. ఏర్పాటు ఇలా... = ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు ఐదెకరాల స్థలం కావాలి. రూ.7.5 కోట్లు ఖర్చు అవుతుంది. రోజుకు 4,000 యూనిట్ల చొప్పున సంవత్సరానికి 15 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. = ఒక యూనిట్‌ను రూ.6.49 పైసల వంతున కొనుగోలు చేస్తారు. ధర్మల్ విద్యుత్ కొంత చౌక కావడంతో దీనిని కొనేందుకు పరిశ్రమల యజమానులు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. = కేంద్ర ప్రభుత్వం సైతం ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తే రూ.20 లక్షల ప్రోత్సాహాన్ని ప్రకటించింది. జిల్లాలో గుర్తించిన భూములు ఇవే... = గురజాల మండలం దైద గ్రామంలో 207 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,193 ఎకరాల అటవీ భూమి. = దుర్గి మండలం పోలేపల్లెలో 947 ఎకరాల ప్రభుత్వ భూమి, అడిగొప్పల గ్రామంలో 667 ఎకరాలు అటవీ భూమి. = ఇలా మొత్తం 4,163 ఎకరాల భూమిని సోలార్ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటుకు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు. = నాగార్జున సాగర్ కుడికాలువ కాలువ సమీపంలో 1,720 ఎకరాల నీటిపారుదల శాఖ స్థలం ఉంది. ఇందులో కొంత భాగంలో పట్టాలు ఇచ్చారు. మెగా టూరిజం అభివృద్ధికి కొంత స్థలం పోగా మిగిలిన స్థలంలో సోలార్ విద్యుత్ కేంద్రాలు నెలకోల్పేందుకు అనువైనదిగా గుర్తించారు. -
అప్పుల తిప్పలు
రుణమాఫీకి ని‘బంధనాలు’ సాక్షి, కర్నూలు: జిల్లాలో దాదాపు 6.50 లక్షల మంది రైతులకు సంబంధించి రూ. 2,211 కోట్ల బకాయి మాఫీ కావాల్సి ఉంది. ప్రభుత్వం అండగా నిలుస్తుందనే భరోసా రోజురోజుకు సన్నగిల్లుతోంది. రీషెడ్యూల్‌పై చేతులెత్తేయగా.. కొత్త రుణాల ఊసే కరువైంది. ఖరీఫ్‌లో దాదాపు 1.50 లక్షల మంది మాత్రమే కొత్త రుణాలు అందుకోగా.. ఈ మొత్తం రూ.700 కోట్లకే పరిమితమైంది. వాస్తవానికి రూ.2,880 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం కాగా.. ఇందులో సగం కూడా అందుకోలేకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. విధిలేని పరిస్థితుల్లో రైతులంతా ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు.. మైక్రో ఫైనాన్స్ సంస్థలను ఆశ్రయించి అధిక వడ్డీతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నారు. ‘వ్యవసాయ రుణాలు కట్టకండి. నేను అధికారంలోకి రాగానే అన్నింటినీ మాఫీ చేస్తా’నని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చిన తర్వాత నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తుండటం మొదటికే మోసం తీసుకొస్తోంది. ఇటీవల కాలంలో అధిక వర్షాల కారణంగా పంటలు చాలా వరకు దెబ్బతినడంతో అప్పు తీర్చే దారి లేక రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిబంధనల పేరిట రుణ మాఫీ జాబితా నుంచి రైతులను తగ్గించుకుంటూ పోతుండటం గందరగోళానికి తావిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం రుణాలను మాఫీ చేసినా.. అప్పటికి అర్హులయ్యే వారి సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టవచ్చనే చర్చ జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ చేస్తానని ప్రకటించిన బాబు.. వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నా ఇప్పటికీ స్పష్టతనివ్వకపోవడం గమనార్హం. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం మొదట కొందరికి.. ఆ తర్వాత మరికొందరికి విడతల వారీగా రుణ మాఫీ వర్తింపజేస్తామని ప్రకటించడమే తప్పిస్తే ఎప్పుటిలోగా అనే విషయాన్ని వెల్లడించని పరిస్థితి. ఎప్పటిలానే ఆశల సాగులో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్నదాత చివరి ప్రయత్నంగా భార్యల మెడల్లోని తాళిబొట్లను సైతం కుదవ పెట్టాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. రైతులు హాయిగా ఉన్నారట.. రుణమాఫీ విషయంలో ప్రభుత్వంపై నమ్మకం ఉండబట్టే రైతులు ఆందోళన చెందడం లేదని వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించడం పట్ల ఆగ్రహం వ్యక్తమవుతోంది. భవిష్యత్ అగమ్యగోచరంగా మారిన పరిస్థితుల్లో.. రైతులంతా హాయిగా ఉన్నట్లు చెప్పుకోవడం విడ్డూరమని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. మునుపెన్నడూ లేనివిధంగా రైతులు వడ్డీ వ్యాపారుల చేతుల్లో విలవిల్లాడుతున్నారు. అతి కష్టం మీద పంటలు సాగు చేస్తున్నా.. చేతికందే వరకు నమ్మకం లేని పరిస్థితి. ప్రభుత్వం చేయూతనివ్వకపోవడంతో.. అన్నదాత పూర్తిగా ప్రకృతిపైనే భారం వేయాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. -
వేరుశెనగ పంట బీమాగోవిందా!
ఇన్సూరెన్స్ పొడిగింపు గడువును పట్టించుకోని ఏఐసీ నాన్ లోనీలకు ఇన్సూరెన్స్ వర్తించదట జిల్లాలోని 3వేల మంది రైతుల నోట్లో దుమ్మే రూ.3.45 కోట్ల నష్టపరిహారం హుష్‌కాకీ ఎక్కువగా నష్టపోయేది కుప్పం ప్రాంత రైతులే పలమనేరు: ఈ ప్రభుత్వం ఏ ముహుర్తానా అధికారంలోకొచ్చిందో గానీ రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఈ దఫా వేరుశెనగ పంట బీమా గడువును ప్రభుత్వం పొడిగించింది. పొడిగించిన గడువులో కట్టించుకున్న ప్రీమియంలతో తమకు సంబంధం లేదంటూ ఏఐసీ (అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) తెగేసి చెప్పింది. పైగా లోనీలకు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని మెలిక పెట్టింది. ఈ కారణంగా జిల్లాలో 3 వేల మందికి పైగా రైతులకు నష్టపరిహారం అందని పరిస్థితి ఏర్పడింది. అసలేం జరిగిందంటే.. ఈ సీజన్లో వేరుశెనగ పంటకు సంబంధించి ప్రభుత్వం పంటల బీమాకు నోటిఫికేషన్ విడుదల చేసింది. జీవో నం బర్ 422 ప్రకారం ఆగస్ట్ 2వ తేదీలోపు వేరుశెనగ రైతులు ప్రీమియం చెల్లించాలని అధికారులు సూచించారు. ఎకరాకు రూ.550 చొప్పున డీడీలు తీసి సంబంధిత ఏవోలకు అంది వ్వమని చెప్పారు. గతంలో ఇన్సూరెన్స్ అందని కారణంగా పదిశాతం రైతులు మాత్రమే పంటల బీమాకు ముందుకొచ్చారు. దీంతో ప్రభుత్వం 452 జీవోను విడుదల చేసి బీమా గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. లోనీ (బ్యాంకులో రుణం పొందిన రైతులు), నాన్ లోనీ (రుణం పొందని రైతులు) ఎవరైనా బీమాకు అర్హులేనని తెలిపింది. మదనపల్లె, తంబళ్లపల్లె, పలమనేరు తదితర ప్రాంతాల్లో వెయ్యి ఎకరాలకు సంబంధించి 1000 మంది రైతులు రూ.5.5 లక్షలు వేరుశెనగ పంటకు బీమా కోసం డీడీలు చెల్లించారు. ముఖ్యంగా కుప్పం నియోజకవర్గంలోనే 1000 మంది దాకా రైతులు రూ.5.5 లక్షల ప్రీమియంను చెల్లించారు. మొత్తం మీద జిల్లాలో మూడు వేల మంది రైతులు 3వేల ఎకరాలకు రూ.16.5 లక్షల ప్రీమియం కట్టారు. గడువు పెంపు ప్రీమియంను నిరాకరించిన ఏఐసీ రైతుల నుంచి గడువు పెంపుతో కట్టించుకున్న ప్రీమియంను సంబంధిత ఏడీలు హైదరాబాదులోని ఏఐసీకి మూడు రోజుల క్రితం పంపగా వాటిని వెనక్కి పంపారు. గడువు పెంచిన ప్రీమియంలు తాము తీసుకోమని, నాన్ లోనీల ప్రీమియంలు కూడా చెల్లుబాటు కావని ఓ ఆదేశాల కాపీని ఏఐసీ చీఫ్ రీజనల్ మేనేజర్ రాజేశ్వరి సింగ్ వ్యవసాయ శాఖ కమిషనర్ మధుసూదన్‌రావుకు పంపారు. ఇదే ఆదేశాలు కమిషనర్ నుంచి సంబంధిత ఏడీ కార్యాలయాలకు అందాయి. రైతులకు ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక అధికారులు ఆందోళన చెందుతున్నారు. రూ.3.45 కోట్ల నష్ట పరిహారం హుష్‌కాకీ.. ఈ ఆదేశాల మేరకు జిల్లాలోని 3 వేల మందికి పైగా రైతులకు ఎకరాకు రూ.11.500 చొప్పున అందాల్సిన పంట బీమా మొత్తం రూ.3.45 కోట్లు అందనట్టే. ఇంత మాత్రానికి గడువు పెంచి మరీ తమవద్ద ప్రీమియంలు ఎందుకు కట్టించుకున్నట్టని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా కుప్పం ప్రాంత వేరుశెనగ రైతులకు ఈ ఆదేశాలతో తీరని నష్టం జరగడం ఖాయం. విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులు ముఖ్యమంత్రినే కలసి తమ గోడు వెళ్లబోసుకునేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఈ విషయమై పలమనేరు ఏడీ రమేష్‌ను వివరణ కోరగా తమ శాఖ కమిషనర్ నుంచి ఈ ఆదేశాలు అందిన మాట వాస్తవమేనన్నారు. -
శేషాచలంలోనే ‘ఎర్ర’దొంగల పాగా
భారీగా పెరుగుతున్న చొరబాట్లు పట్టపగలే టన్నుల కొద్దీ ఎర్రచందనం అక్రమ రవాణా ఎర్రచందనాన్ని వేలం వేసే ప్రభుత్వం ఇక్కడి సంపదను కాపాడడం లేదు సాక్షి,తిరుమల: ఎర్రచందనం దుంగలను అక్రమంగా రవాణా చేసే వం దలాది మంది ‘ఎర్ర’ దొంగలు శేషాచలంలో పాగా వేశారు. శేషాచల అటవీప్రాంతానికే తలమానికమైన ఎర్రచందనం పట్టపగలే అక్రమ మా ర్గాల్లో తరలుతున్నా దీని నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. అప్పుడప్పుడు పట్టుబడిన ఎర్రచందనం దుంగలను వేలం వేసేందుకు ఉత్సాహం చూపుతున్న ప్రభుత్వం, శేషాచలంలో ఎర్రదొంగల చొరబాట్లను ఆ పడంలో తగిన చర్యలు తీసుకోవడం లేదు. తూర్పు, పడమరలో చొరబాట్లు శ్రీవేంకటేశ్వర అభయారణ్యం పరిధి లో తిరుమల శేషాచల అటవీ ప్రాం తం ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతోపాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం వృక్ష సంపద ఉంది. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. తిరుమలకు పశ్చిమదిశలోని ఛామల రేంజ్ తలకోన నుంచి తిరుపతి వరకు విస్తరించింది. తూర్పుదిశలోని మామండూరు నుంచి వైఎస్ఆర్ జిల్లా రాజంపేట మీదుగా కర్నూలు జిల్లాలోని నల్లమల అటవీ మార్గం వరకు ఈ శేషాచల అటవీ ప్రాంతం విస్తరించింది. ఇక్కడ విలువైన ఎర్రచందనం వృక్షాలు అపారంగా ఉన్నా యి. పశ్చిమ దిశలో తలకోన, భాకరాపేట, రంగంపేట మార్గాల నుంచి దుండగులు నిత్యం శేషాచలంలోకి చొరబడుతున్నారు. ఇక తూర్పున మంగళం, కరకంబాడి, మామాం డూరు, రాజంపేట, సమీప అటవీ గ్రామాల నుంచి ఎర్రదొంగలు అడవిలోకి రాకపోకలు సాగిస్తున్నారు. గత 15 రోజులుగా పట్టపగలే అక్రమంగా రవాణా అవుతున్న వందల టన్నుల ఎర్రచందనం పోలీసులకు పట్టుబడింది. ఇందులో ఒకటి రెండు కేసుల్లో మినహా స్మగ్లర్లు కాని, కూ లీలు కాని పట్టుబడకపోవడం గమనార్హం. భక్తుల ముసుగులో.. తిరుమల నుంచి నాలుగు వైపులా అడవిలోకి వెళ్లే మార్గాలున్నాయి. ఇ ది ‘ఎర్ర’దొంగలకు కలసి వస్తోంది. ప్రధానంగా శ్రీవారిమెట్టు మార్గం నుంచి పశ్చిమదిశలో చాలా సులువు గా అడవిలోకి వెళ్లేందుకు వీలుంది. అలాగే, అలిపిరి కాలిబాట నుంచి కూడా భక్తుల ముసుగులో దుండగు లు అడవిలోకి చొరబడుతున్నారు. వీరిలో తమిళనాడుకు చెందిన తంబీ లే ఎక్కువగా ఉంటున్నారు. గతంలో ఇద్దరు ఫారెస్ట్ అధికారులను ఎర్రదొంగలు హత్య చేసిన తర్వాత ఫారె స్ట్ విభాగం, ఎస్టీఎఫ్ బలగాలతో నిత్యం కూంబింగ్ చేశారు. ఆరు నె లల కాలంలో వేర్వేరు ఘటనల్లో న లుగురు ఎర్రకూలీలు ఎన్కౌంటర్ లో మృతి చెందారు. అయినప్పటికీ ఎర్రకూలీల చొరబాట్లు మాత్రం ఆ గ టం లేదు. ఇటీవల కాలంలో ఎస్టీఎఫ్ బలగాలతోపాటు ఫారెస్ట్ అధికారుల కూంబింగ్, గాలింపు చర్యలు తగ్గిననట్టు కనిపిస్తోంది. అందువల్లే గడిచిన 15 రోజులుగా ఎర్రచంద నం అక్రమ రవాణా ఎక్కువగా సా గుతోంది. దీనిని బట్టి చూస్తే శేషాచలంలో వందల సంఖ్యలో ఎర్రదొంగలు తిష్టవేసినట్టు తెలుస్తోంది. సీఎంగారు .. శేషాచలంలో ఇంకా దొంగలున్నారు ? సీఎంగా ప్రమాణ స్వీకారం చేశా క తిరుమల పర్యటనలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఎర్రదొం గలు ఇంకా ఉన్నారా? ఉంటే ఏరిపారేస్తాం’ అన్నారు. అయినప్పటికీ ఇక్కడి శేషాచలంలో మా త్రం ఎలాంటి మార్పు కనిపిం చడం లేదు. శేషాచల అడవుల్లో ఎర్రదొంగలు వందల సంఖ్యలో తిష్టవేసినట్టు నిత్యం పట్టుబడుతున్న దుంగలే తెలుపుతున్నా యి. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగలను వేలం వేసి వేలకోట్ల రూపాయలు సంపాదించాలని రాష్ర్ట ప్రభుత్వం భా విస్తోంది. అయితే, తిరుమలేశుని క్షేత్రంలో అరుదైన వృక్షసంపద ను కాపాడేందుకు ప్రభుత్వ పె ద్దలు ఏ మాత్రం చొరవ చూపకపోవడంపై విమర్శలు వినిపిస్తు న్నాయి. -
ఎందుకిలా?
బంగారం పండే ఎర్రనేల ‘సోలార్'కు ధారాదత్తం భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఓ వైపు చర్యలు తీసుకుంటూనే.. వెలిగల్లు, పెడబల్లి జలాశయాల మధ్య ఉన్న భూములను సోలార్ ప్రాజెక్టు కోసం కేటాయించడం పట్ల పర్యావరణ, వ్యవసాయ, సామాజిక రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కాస్త చొరవ చూపితే త్వరితగతిన సస్యశ్యామలమయ్యే ఈ ప్రాంతాన్ని సోలార్ పవర్ ఉత్పత్తి కంపెనీలకు కట్టబెట్టనుండటం చారిత్రక తప్పిదమంటున్నారు. (సాక్షి ప్రతినిధి, అనంతపురం) అభివృద్ధి పేరుతో జరుగుతున్న విధ్వంసానికి నంబులపూలకుంట (ఎన్పీ కుంట) సమీపంలో ఏర్పాటు కానున్న సోలార్ ప్రాజెక్టు నిలువెత్తు నిదర్శనంగా నిలవనుంది. అసలే కరువు జిల్లా. వర్షాలు కురవడం లేదు. వెయ్యి అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ కానరావడం లేదు. పదేళ్లకొకసారి కానీ వేరుశనగ పంట పూర్తిగా దక్కదు. ఇదీ స్థూలంగా జిల్లా ముఖచిత్రం. ఇంతటి కరువు పరిస్థితుల్లోనూ వ్యవసాయానికి సరిపడా భూగర్భ జలాలున్న ప్రాంతాలు అక్కడక్కడా ఉన్నాయి. సరిగ్గా అలాంటి ప్రాంతాన్నే జిల్లా యంత్రాంగం ‘సోలార్ ప్రాజెక్టు’కు కట్టబెట్టేందుకు చకచకా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే ఐదువేల ఎకరాలకు పైగా భూసేకరణకు సంబంధించిన ఫైళ్లు రాజధానికి చేరుకున్నాయి. రేపోమాపో ఈ భూమిని ‘సంప్రదాయేతర ఇంధన వనరుల అభివృద్ధి కార్పొరేషన్’ (నెడ్‌క్యాప్)కు కట్టబెట్టనున్నారు. అందుకు అవసరమైన పంచాయతీ తీర్మానాన్ని కూడా జిల్లా అధికారులు గుట్టుచప్పుడు కాకుండా చేయించేశారు. కదిరి నియోజకవర్గంలోని నంబులపూలకుంట, పెడబల్లి కొత్తపల్లి పంచాయతీల పరిధిలో ఉన్న 7,655 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. పెడబల్లి కొత్తపల్లిలో 539, 541 నుంచి 727 వరకు సర్వే నంబర్ల కింద ఉన్న 5,674.15 ఎకరాలను, నంబులపూలకుంట సర్వే నంబర్ 679-3, 728లో గల మొత్తం 1,981 ఎకరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ మొత్తం భూమిలో 2011 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం భూ పంపిణీ కార్యక్రమం కింద ఏడు విడతల్లో 1,200 మంది పేద రైతులకు పట్టాలు ఇచ్చింది. చాలా కొద్ది మొత్తంలోనే పట్టా భూ ములు ఉన్నాయి. మరో వెయ్యి ఎకరాల్లో రైతులు ఎలాంటి పట్టా కాగితాలు లేకుండా సాగు చేసుకుంటున్నారు. సాగు సౌకర్యాలపై నిర్లక్ష్యం పెడబల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపు ప్రతిపాదనలు ఉన్న కారణంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమికి సంబంధించి చాలా కాలం వరకు పేదలకు పట్టాలు ఇవ్వలేదు. దివంగత నేత వైఎస్ అధికారంలోకి వచ్చాక పలు విడతల్లో జరిగిన భూ పంపిణీలో భాగంగా పలువురికి పట్టాలిచ్చారు. ఇక్కడి రైతుల ప్రధాన సమస్య విద్యుత్. చాలా మేరకు విద్యుత్ సదుపాయం లేదు. ఉన్న చోట కూడా లోఓల్టేజీ సమస్య. ఇరువైపులా రిజర్వాయర్ల కారణంగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నా.. కేవలం కరెంటు సమస్యతో వ్యవసాయాభివృద్ధి చెందలేదు. ఈ కారణంగానే సోలార్ ప్లాంట్ ప్రతిపాదనలపై రైతుల్లో పెద్దగా వ్యతిరేకత రాలేదు. ఇదే అదనుగా జిల్లా యంత్రాంగం ఈ భూములను ‘నెడ్‌క్యాప్’కు అప్పగించే పనులను చకచకా కొనసాగిస్తోంది. వామపక్ష పార్టీలు కూడా రైతులకిచ్చే నష్టపరిహారం పెంపుదల గురించే మాట్లాడుతున్నాయి కానీ.. సాగుకు పనికివచ్చే భూములను సోలార్ ప్రాజెక్టుకు కేటాయించడంపై వ్యతిరేకత వ్యక్తపరచడం లేదు. సోలార్ స్థాపనకు ఎన్నో ప్రత్యామ్నాయాలు కరువు జిల్లాలో తప్పనిసరిగా పారిశ్రామికాభివృద్ధి జరగాల్సిందే. సోలార్ విద్యుత్ ఉత్పత్తిలో జిల్లా రికార్డులు సాధించాల్సిందే. అయితే.. ఇందుకు ఎన్నో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. జిల్లాలో వందల కిలోమీటర్ల మేర విస్తరించిన హెచ్ఎల్సీ, హంద్రీ-నీవా కాలువలపై ఒక్క ఎకరా భూసేకరణ చేయాల్సిన అవసరం లేకుండా సోలార్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయవచ్చు. గుజరాత్లో ఈ ప్రయోగం సఫలమయ్యింది. ఇక భూగర్భ జలాల జాడే లేని, సాగుకు పనికి రాని భూములకు జిల్లాలో కొదువ లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఓడీసీ, అమడగూరు ప్రాంతాల్లో ‘సైన్స్ సిటీ’ కోసం సేకరించిన వేల ఎకరాలు ఖాళీగానే ఉన్నాయి. భూ సేకరణకు ఒక్క రూపాయి వెచ్చించాల్సిన అవసరం లేకుండా అక్కడ సోలార్ ప్రాజెక్టు స్థాపించవచ్చు. వీటిని విస్మరించి చుట్టూ నీటి వనరులుండి, భూగర్భ జలాల లభ్యత పుష్కలంగా ఉన్న చోట నీటి అవసరం ఏమాత్రమూ లేని సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తుండడంలో హేతుబద్ధతను మేథావులు ప్రశ్నిస్తున్నారు. ఉపాధికి గొడ్డలి పెట్టు విలువైన భూమిని సోలార్కు కేటాయించడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయా అంటే అదీ లేదు. సోలార్ యూనిట్ నిర్మాణ సమయంలో కొంత మందికి ఉపాధి దొరకవచ్చు కానీ.. అది పూర్తయ్యి విద్యుత్ ఉత్పత్తి మొదలైతే ఓ పది మంది సాంకేతిక నిపుణులు, సెక్యూరిటీ గార్డులకు తప్ప ఉపాధి అవకాశాలేవీ ఉండవు. అదే ఈ భూముల్లో వ్యవసాయ అవసరాల కోసం ఓ చిన్న సబ్‌స్టేషన్ ఏర్పాటు చేసి.. నాణ్యమైన విద్యుత్ అందజేస్తే ఇక్కడి రైతులు అద్భుతాలు సృష్టించగలరు. అర్థ గణాంక శాఖ లెక్కల ప్రకారం నమ్మకమైన నీటి వనరులుండి ఏడాది పొడవునా కూరగాయ పంటలు పండిస్తే ఒక్కో ఎకరం భూమి 200 ప నిదినాలను సృష్టించగలదు. ఐదువేల ఎ కరాల్లో ఏడాదికి పది లక్షల పనిదినాలను సృష్టించే అవకాశమున్న చోట పట్టుమని పది మందికి కూడా పని కల్పించలేని సోలార్ ప్రాజెక్టు నెలకొల్పడం ఏ రకంగా చూసినా సరికాదన్న అభిప్రాయాన్ని మేథావులు వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం పట్టించుకుంటుందా అన్నది ప్రశ్నార్థకమే. -
రైతులంటే చులకనా..?
సింహాద్రిపురం : వాతావరణ బీమా ప్రీమియం, ఇన్పుట్ సబ్సిడీ చెల్లింపు గడువు విషయంలో ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు. ఈనెల 15వ తేదీవరకు గడువు ఉందని చెప్పి.. ఇప్పుడు శనివారంతో గడువు ముగిసిందని చెప్పడం ఎంతవరకు సబబు అని రైతులు ధ్వజమెత్తారు. సింహాద్రిపురం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అధికారులు శుక్రవారం మండలంలోని బ్యాంకు పరిధిలోని రైతులకు సెల్ ద్వారా రుణాలు రెన్యువల్ చేసుకోమంటూ మెసేజ్‌లు పంపారు. శుక్రవారం కొందరు రైతులు మాత్రమే వచ్చారు. శనివారం వందల సంఖ్యలో రైతులు బ్యాంకుకు తరలి వచ్చారు. దీంతో బ్యాంకు అధికారులు తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏటా ప్రకృతి వైపరీత్యాలవల్ల పంట పండకపోయినా బీమా ఉంటుందన్న దీమాతో వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్నామన్నారు. ఇప్పుడు ఆ బీమా లేకుండా చేస్తే తామెలా బతకాలి.. రైతులంటే ఎందుకంత చులకన అని ప్రశ్నించారు. దీంతో ఎస్ఐ రాజేశ్వరరెడ్డి ఫోన్ ద్వారా ఆర్ఎంతో చర్చించారు. శనివారం బ్యాంకుకుకు వచ్చిన రైతులందరికి రాత్రి పొద్దుపోయేవరకు రుణాలు రెన్యువల్ పూర్తి చేసేలా ఒప్పించారు. దీంతో రైతులు శాంతించారు. -
కీలు బొమ్మలు
చెప్పుచేతల్లో ఉండేవారికే కీలక కుర్చీలు ఇప్పటికే డ్వామా పీడీ బదిలీ ఆయన స్థానంలో టీడీపీ ఎమ్మెల్యే భార్య అధికారుల బదిలీలకు టీడీపీ నేతల కసరత్తు విజయవాడ : సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ విధంగా ఆదేశించడంతో దాన్ని ఇక్కడ ‘తమ్ముళ్లు’ పాటిస్తున్నారు. భవిష్యత్తులో తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను కీలక కుర్చీల్లో కూర్చోబెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ కార్యదర్శి నుంచి జిల్లాస్థాయి అధికారి వరకు తాము చెప్పినట్టు వినే వారినే నియమించేలా పావులు కదుపుతున్నారు. మాట వినని అధికారులకు బదిలీలను బహుమానంగా ఇచ్చేందుకు వెనుకాడడం లేదు. ఈ క్రమంలోనే కొద్దిరోజుల క్రితం డ్వామా పీడీ అనిల్‌కుమార్‌ను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసింది. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో బీసీ సంక్షేమ శాఖ డెప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యే సతీమణిని నియమించేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఉపాధి’ కోసమేనా..! సార్వత్రిక ఎన్నికల ముందు డ్వామా పీడీగా అనిల్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కోట్లాది రూపాయలతో నిర్వహించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం డ్వామా ఆధ్వర్యంలోనే కొనసాగుతోంది. కాబట్టి డ్వామా పీడీ తమకు అనుకూలంగా ఉంటే సులభంగా ‘ఉపాధి’ లభిస్తుందని తమ్ముళ్లు భావించి అనిల్‌కుమార్‌ను బలవంతంగా బదిలీ చేయించినట్లు సమాచారం. ఆయన స్థానంలో గుంటూరు జిల్లా తాడికొండ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ సతీమణి మాధవీలతను నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ పోస్టు కోసం కొందరు రాజకీయంగా పైరవీలు చేసినా, మాధవీ లతను నియమించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. నందిగామ ఉపఎన్నిక వల్ల కోడ్ అమల్లో ఉండటంతో ఉత్తర్వులు జారీ చేయలేదని సమాచారం. కోడ్ ముగిసిన వెంటనే ఆమెను నియమిస్తారని సమాచారం. మాధవీలత గతంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణిగా పనిచేశారు. డీపీవో పోస్టుపై కూడా పైరవీలు ఖాళీగా ఉన్న జిల్లా పంచాయతీ అధికారి పోస్టు కోసం కూడా పైరవీలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఇన్చార్జి డీపీవోగా డీఆర్డీఏ ఏపీడీ చంద్రశేఖర్ వ్యవహరిస్తున్నారు. డీపీవో పోస్టు కోసం కృష్ణా, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన నలుగురు అధికారులు పోటీ పడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు డీఎల్పీవోలు కూడా ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా మరో ఇద్దరు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ జిల్లా నేతలు మాత్రం తమకు అనుకూలమైనవారిని ఈ సీటులో నియమించేందుకు కసరత్తు చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్ పీడీ పోస్టుపై బేరసారాలు సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డెరైక్టర్ పోస్టు కోసం బేరసారాలు సాగుతున్నాయి. ఖాళీగా ఉన్న ఈ పోస్టు కోసం కూడా నలుగురు అధికారులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్చార్జి పీడీగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ పుష్పమణి వ్యవహరిస్తున్నారు. ఈ కుర్చీపై కన్నేసిన కొందరు లక్షలాది రూపాయలు లంచం ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం. మరికొందరు అధి కార పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ నేతలు మాత్రం జిల్లా స్థాయి అధికారులతోపాటు మండల కేంద్రాల్లో పనిచేసే తహశీల్దార్లు, ఎంపీడీవోలు కూడా తమ చెప్పుచేతల్లో ఉండేవారిని నియమించేలా జాబితాలు సిద్ధం చేసినట్లు తెలిసింది. -
ఇందిరమ్మకు చంద్ర గ్రహణం!
30లోగా సిమెంట్ గోడౌన్లను మూసి వేయండి ఖర్చు తగ్గించుకునే నెపంతో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం గడ్డ కట్టిన సిమెంటుపై చర్యలకు నివేదించాలని ఆదేశం ఇందిరమ్మ పథకానికి చంద్ర గ్రహణం పడుతోంది. కొత్త పథకాలు చేపట్టని ప్రభుత్వం ఉన్న పథకాలకు మంగళం పాడే దిశగా ముందుకు సాగుతోంది. పేదలకు గూడు కల్పించాలన్న లక్ష్యంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఇందిరమ్మ పథకాన్ని అమలుచేస్తే..ఆయన మరణానంతరం గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఈ పథకంపై కక్ష కట్టాయి. బి.కొత్తకోట: ఇప్పుడు ఏకంగా ఇంటి నిర్మాణానికి కీలకమైన రాయితీ సిమెంట్ సరఫరా లేదన్న సంకేతాలిచ్చేందుకు ఇందిరమ్మ సిమెంట్ గోడౌన్లను మూసి వేయాలని ఈ నెల 2వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గృహనిర్మాణశాఖ ఈఈ, డీఈ, ఏఈలకు ఉత్తర్వులు అందాయి. దీంతో జిల్లాలోని 28 గోడౌన్లు మూతపడనున్నాయి. ఇందుకు ప్రభుత్వం పేర్కొం టున్న కారణాలు విచిత్రంగా ఉన్నాయి. ఆరు నెలలుగా గోడౌన్లల్లోని సిమెంట్ పంపిణీ కాలేదని, అలాగే జిల్లాలకు సిమెంట్ సరఫరా నిలిచిపోయిందని ఉత్తర్వుల్లో చెబుతోంది. పథకం అమలుపై చిత్తశుద్ధి చూపకపోవడంతోనే ఈ పరిస్థితులు నెలకొన్నాయన్న విషయం ప్రభుత్వానికే తెలిసినా ఇలాంటి నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతమున్న సిమెంట్ నిల్వల్లో గడ్డ కట్టిన సిమెంట్కూ అధికారులను బాధ్యులను చేయూలని నిర్ణయించింది. సిమెంట్ కోసం కళ్లుకాయలు కాచేలా లబ్ధిదారులు ఎదురుచూసినా సిమెంట్ పంపిణీ చేయలేదు. అయితే ఇప్పుడు గోడౌన్లల్లో గడ్డకట్టి, పనికిరాకుండాపోయిన సిమెంట్‌ను గుర్తించి..ఇలా జరిగేందుకు ఎవరు బాధ్యులో, వారిపై చర్యలు తీసుకునేందుకు నివేదికలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో 2,500 టన్నుల సిమెంట్ నిల్వలు ఉన్నట్టు సమాచారం. ఈ సిమెంట్‌ను ఈ నెలాఖరులోగా నిర్మితకేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు పంపిణీ చేసి గోడౌన్లు అన్ని మూసేయాలని, తద్వారా ప్రభుత్వంపై ఖర్చుల భారం తగ్గించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. సిమెంట్ పంపిణీ అనుమానమే? గోడౌలు ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్న నేపథ్యంలో ఒకపై ఇందిరమ్మ లబ్ధిదారులకు రాయితీ సిమెంట్ పంపిణీ లేనట్టేనని స్పష్టమవుతోంది. ఇళ్ల నిర్మాణం పేదలకు భారం కాకుండా దివంగత సీఎం వైఎస్సార్ రాయితీ సిమెంట్‌ను అందించారు. కంపెనీల నుంచి బస్తాను రూ.153.50తో కొనుగోలు చేసి రవాణా ఖర్చులతో రూ.158కు పంపిణీ చేసేవారు. కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విచ్చలవిడిగా ధరను పెంచే శారు. 2011లో బస్తాకు రూ.20 అదనంగా పెంచి రూ.180 చేశారు. 2012లో బస్తాపై రూ.3.70 పైసలు పెంచి రూ.183.50 చేశారు. ఇదే ఏడాది మరోసారి రూ.5 పెంచి బస్తాను రూ.188.50 చేశారు. ఈ పరిస్థితుల్లో 2013 అక్టోబర్‌లో అనూహ్యంగా ధర పెంచి బస్తాను రూ.235గా నిర్ణయించారు. ప్రస్తుతం లబ్ధిదారులు ఈ ధరతోనే సిమెంట్‌ను కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గోడౌన్ల మూసివేత నిర్ణయంతో భవిష్యత్తులో లబ్ధిదారులకు సిమెంటు పంపిణీ లేనట్టేనన్న సంకేతాలు ఇస్తోంది. ఇది లబ్ధిదారులపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
‘ఎన్టీఆర్ సుజల’కు సహకరించండి
విజయవాడ : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ సుజల పథకం నిర్వహణకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తమవంతు సహకారం అందించాలని కలెక్టర్ రఘునందనరావు పిలుపునిచ్చారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువరం ఎన్టీఆర్ సుజల తాగునీటి పథకంపై జిల్లా అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒకటి చొప్పున అక్టోబర్ 2న ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముఖ్యమంత్రి ప్రజల తాగునీటి సమస్యపై దృష్టి సారించి ప్రతి ఇంటికి రూ.2 లకే 20 లీటర్ల మంచినీటిని అందించాలని నిశ్చయించారన్నారు. ఈ పథకంలో భాగంగా ఆగస్టు 30వ తేదీన విధి విధానాలతో కూడిన ప్రభుత్వ ఉత్తర్వులను చేస్తామని తెలిపారు. ఫేజ్-1లో ఐదు వేల గ్రామాల్లో ఈ పథకం ప్రారంభించాలని నిర్ణయించగా, జిల్లాలో 513 గ్రామాలను మొదటి దశకు ఎంపిక చేశామన్నారు. జిల్లాలో 221 ఆర్వో ప్లాంట్స్, ఒక ఇడియఫ్ ప్లాంట్స్, 291 అల్ట్రా ఫిల్ట్రేషన్ గ్రావిటి ఫిల్టర్ ప్లాంట్ల ఆవశ్యకత ఉన్నట్లు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అమరేశ్వరరావు తెలిపారు. కలెక్టర్ పిలుపునకు స్పందన .... సమావేశంలో ఈ పథకాన్ని ప్రారంభించి రాష్ట్రానికే ఆదర్శ జిల్లాగా నిలపాలని ఇచ్చిన కలెక్టర్ పిలుపునకు నూజివీడు, తిరువూరు, గన్నవరం, జగ్గయ్యపేట, కైకలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ, ఇబ్రహీంపట్నం తదితర నియోజకవర్గాల పరిధిలో ప్లాంట్ల నిర్వాహణకు సంబంధించి ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థల తరఫున హాజరైన ప్రతినిధుల ద్వారా ప్రకటించారు. జెడ్పీ సీఈవో డి.సుదర్శనం, జిల్లా పంచాయితీ అధికారి కె.చంద్రశేఖర్, జిల్లా ఇండస్ట్రీస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
పాస్బుక్ల సవరణలో ఫెయిల్
పట్టాదారు పాస్ పుస్తకాల్లో మార్పులకు తీవ్ర జాప్యం నెలలు తరబడి కొనసాగుతున్న రెవెన్యూ నిర్లక్ష్యం 757 దరఖాస్తులలో ఇప్పటికి రెండింటికే మోక్షం విశాఖ రూరల్ : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల సవరణ ప్రక్రియ నత్తను మరిపిస్తోంది. దరఖాస్తులు చేసి నెలలు గడుస్తున్నా.. సవరణలకు నోచుకోక పట్టాదారులు ఇబ్బందులు పడుతున్నారు. పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను పౌర సేవల పత్రం ప్రకారం 15 రోజుల్లో సరిచేయాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇందుకు సవరణకు నోచుకున్న గణాంకాలే నిదర్శనం. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పుల కారణంగా భూ యజమానులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాస్‌పుస్తకాల్లో తప్పులను సరిదిద్దడంతో పాటు మార్పులు, చేర్పులకు ఏడాది క్రితం ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. దీని ద్వారా పాస్‌పుస్తకాల్లో సవరణలతో పాటు, పట్టా సబ్ డివిజన్, ఫసలీలో అనుభవదారుని పేరు మార్పునకు వెసులుబాటు కలిగింది. 757 దరఖాస్తులు.. : పట్టాదారు పాస్‌పుస్తకాల్లో సవరణల కోసం ఇప్పటి వరకు 757 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 16 దరఖాస్తులను తిరస్కరించగా, కేవలం రెండింటిలో మాత్రమే సవరణలు చేయడం గమనార్హం. కొత్త సాఫ్ట్‌వేర్‌లో మూడు కేటగిరీలుగా ఈ ప్రక్రియను చేపడుతున్నారు. కొత్త పట్టాదారుపాస్పుస్తకాల మంజూరు, పాస్‌బుక్ రీ ప్లేస్మెంట్, డూప్లికేట్ పాస్‌బుక్ కింద ఈ సేవలను అందిస్తున్నారు. కొత్త పాస్‌పుస్తకాల కోసం 539 మంది దరఖాస్తు చేసుకోగా ఏడింటిని తిరస్కరించగా, ఒక పాస్‌బుక్ మాత్రమే మంజూరు చేశారు. పాస్‌బుక్ రీప్లేస్‌మెంట్‌కు 152 దరఖాస్తులు రాగా ఏడింటిని తిరస్కరించగా ఒక్క పాస్‌పుస్తకాన్ని కూడా ఇవ్వలేదు. డూప్లికేట్ పాస్‌పుస్తకం కోసం 55 మంది దరఖాస్తు చేయగా రెండింటిని తిరస్కరించారు. కేవలం ఒకరికి మాత్రమే డూప్లికేట్ పాస్‌బుక్ ఇచ్చారు. 60 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉండగా.. పట్టాదారు పాస్‌పుస్తకంలో పట్టాదారుని పేరు గాని, అతని తండ్రి పేరు గాని, లేదా ఇతర వివరాలు తప్పుగా వస్తే మార్పు చేసుకోడానికి మీ-సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భూక్రయవిక్రయాల ద్వారా ఒకరి పేరున ఉన్న పాస్‌పుస్తకాన్ని మరొకరి పేరున మార్పు చేసుకొనే అవకాశాన్ని కల్పించారు. తప్పుల సవరణకు రూ.35, కొత్త పట్టాదారుపాస్ పుస్తకానికి రూ.135, డూప్లికేట్ పాస్‌పుస్తకానికి రూ.235, పాస్‌పుస్తకంలో పేరు మార్పునకు రూ.135 మీ-సేవా కేంద్రాల్లో చెల్లించాలి. తప్పుల సవరణకు 15 రోజులు పడుతుంది. పేరు మార్చడానికి(మ్యుటేషన్) 60 రోజులు పడుతుంది. పట్టాదారుడు దరఖాస్తు అందిన వెంటనే రెవెన్యూ అధికారులు రికార్డులు పరిశీలించి పట్టామార్పునకు సంబంధించిన నోటీసులు గ్రామ చావడిలో పెడతారు. అభ్యంతరాలు రానిపక్షంలో కొత్త వారి పేరుమీద పాస్‌పుస్తకం ఇవ్వాలి. కానీ నెలలు గడుస్తున్నా దరఖాస్తుదారులకు పరిష్కారం లభించడం లేదు. మ్యుటేషన్ తరువాత కొత్త పాస్‌పుస్తకం మంజూరుకు ప్రస్తుతం అవకాశం లేదు. సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదని అధికారులు చెబుతున్నారు. గతంలో సమ్మెలు, ఎన్నికల కారణంగా జాప్యం జరిగిందంటున్నారు. సవరణలకు అవకాశం ఉన్నా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, సాఫ్ట్‌వేర్‌లో ఇబ్బందుల కారణంగా వందలాది దరఖాస్తులు పెండింగ్‌లో ఉండిపోతున్నాయి. -
ముహూర్తం ఖరారు!
భద్రాచలం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించిన ఏడు మండలాలను విలీనం చేసుకునే ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేను ముంపు మండలాల్లో నిలిపివేయటమే కాక, ముఖ్యమంత్రి కేసీఆర్ ముంపు కథ ముగిసినట్లేనని స్వ యంగా ప్రకటించటంతో దీనిపై స్పష్టత వచ్చినట్లయింది. ముంపు మండలాల్లో త మ పాలన సాగించేందుకు ఏపీ ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్ర పునర్విభజన బిల్లు ప్రకారం ఈ ఏడాది జూన్ 2 నుంచి ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్‌కు బదలాయిం చిన విషయం విదితమే. ఈ క్రమంలో ఆం ధ్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉభయ గో దావరి జిల్లాల అధికారులు విలీన వ్యవహా రానికి సంబంధించిన ఒక్కో ప్రక్రియను వ రుసగా చేస్తున్నారు. ఇప్పటికే ముంపు మం డలాల్లో ఉభయ గోదావరి జిల్లా పరిషత్ అధికారుల ఆదేశానుసారమే మండల పరిషత్ ఎన్నికలు జరిగాయి. మద్యం దుకాణాలు కూడా ఏపీ ఎక్సైజ్ శాఖ కిందనే నడుస్తున్నాయి. విలీన ప్రక్రియలో భాగంగా ముంపు మండలాల ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామసభలను నిర్వహించాలని ఉభయ గోదావరి జిల్లా కలెక్టర్లు గెజిట్ కూడా జారీ చేశారు. దీని ప్రకారం ఈ నెల 30 లోపు ప్రజాభిప్రాయాన్ని చెప్పా ల్సి ఉంటుంది. గ్రామసభలు జరుగకపోయినా పునర్విభజన చట్టం ప్రకారం పాలన పగ్గాలు చేపట్టే క్రమంలోనే గెజిట్ జారీ చేసి, వీటిని స్వాధీనం చేసుకునే దిశగా అక్కడి అధికారులు చకా చకా ఏర్పాట్లు చే సు కుపోతున్నారు. భద్రాచలం డివిజన్లోని నాలుగు మండలాల్లో 277 రెవెన్యూ గ్రామాలకు చెందిన 1,31,528 మంది జనాభా తూర్పుగోదావరి జిల్లాలో కలువనున్నారు. ఇక పాల్వంచ డివిజన్లోని బూ ర్గంపాడు మండలంలోని 6, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 41 రెవెన్యూ గ్రామాలకు చెందిన 58,776 మంది పశ్చిమ గోదావరి జిల్లాలో కలువనున్నారు. అక్టోబర్ 2 నుంచి పాలన.. ముంపు మండలాల్లో అక్టోబర్ 2 నుంచి పాలన చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ఉభయ గోదావరి జిల్లాలకు ఆదేశాలు అందినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వ చ్చిన నేపథ్యంలో ఈ లోగానే అప్పగింతల తంతు ముగించేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన అధికారులు కూడా సిద్ధమవుతున్నారు. భద్రాచలం డివిజన్లో చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం( భద్రాచలం రెవెన్యూ గ్రామం తెలంగాణాలోనే ఉంటుంది), పాల్వంచ డివిజన్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాలతో పాటు బూర్గంపాడు మండలంలోని 6 రెవెన్యూ గ్రామాలను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించనున్నారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని అక్టోబర్ 2 నుంచి ఉభయ గోదావరి జిల్లాల అధికారులే ఆయా మండలాల్లో పూర్తి స్థాయిలో పాలన వ్యవహారాలు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముంపులో ఖాళీలు అక్కడి వారితోనే భర్తీ.. ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన మండలాల్లో ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉన్న ఖాళీలను ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికారులు, ఉద్యోగులతోనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని ఓ డివిజన్ స్థాయి అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఉన్న నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఉద్యోగులెవైరె నా ముంపు మండలాలకు వెళ్తామని కోరుకుంటే వారితోనే భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. ముంపులో పనిచేసేందుకు ముందుకొచ్చే ఉద్యోగులు, అధికారులకు ప్రోత్సాహకాలు కూడా ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ముందుగా పోలీసు సిబ్బంది నియామకంపై ఉన్నతాధికారులు దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఇక ముంపు మండలాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం పరిధిలోకే వస్తారు. అయితే 80 శాతం మంది వరకు తెలంగాణలోకే వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఆయా మండలాలకు చెందిన సుమారు 20 శాతం మంది ఉద్యోగులు ఆప్షన్లు తీసుకొని అక్కడే ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఉద్యోగుల విభజన పూర్తిస్థాయిలో జరిగే వరకూ పాలన వ్యవహారాలకు ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న ఖాళీలనే ప్రాతిపదికగా తీసుకొని భర్తీ చేసేందుకు ఉభయ గోదావరి జిల్లాల అధికారులు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిసింది. ముంపులో ఉంటారా... బయటకు వస్తారా..? ముంపు మండలాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చి వారు కోరుకున్న రాష్ట్రంలో పనిచేసేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాల సీఎస్‌లు ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముంపులో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను తెలుసుకునేందకు జిల్లా అధికారులు సిద్ధమయ్యారు. ఆంధ్రరాష్ట్రంలోకి వెళ్లిన ముంపులో పనిచేస్తారా..? తెలంగాణ రాష్ట్రానికి వస్తారా..? అనే అంశాలతో కూడిన ఒక నమూనాను రూపొందించి ముంపు మండల అధికారులకు పంపించారు. ఉద్యోగి కేడర్, వారి నెలసరి వేతనం, ఏ రాష్ట్రంలో పనిచేస్తారనే దానిపై వారి అభిప్రాయం తెలుసుకునే క్రమంలోనే ఖమ్మం జిల్లా అధికారులు ఈ ఏర్పాట్లు చేశారు. మొత్తంగా చూస్తే సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ అప్పగింతల ప్రక్రియ పూర్తి కావచ్చని తెలుస్తోంది. -
డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయాలి
కుప్పం: ప్రభుత్వం ప్రకటించిన మేరకు పూర్తిగా డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. అధికారం కోసం హామీ ఇచ్చి ప్రస్తుతం సీఎం కుర్చీ అందగానే మాట మార్చడం సరికాదని మండిపడ్డారు. బ్యాంకులకు వేలకు వేలు వడ్డీలు ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొన్న వానగుట్టపల్లి, నిన్న శెట్టిపల్లివాసులు ఆందోళనలు చేపట్టగా శనివారం కుప్పం పట్టణం పాతపేటలో డ్వాక్రా సంఘాల వుహిళలు జాతీయు రహదారిపై బైఠాయించారు. వారు వూట్లాడుతూ తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ప్రతినెలా చెల్లిస్తూ వచ్చావున్నారు. ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి రుణాలు మాఫీ చేస్తామని చెప్పడంతో ఆపేశామని తెలిపారు. ప్రస్తుతం ఒక్కో సంఘానికి కేవలం రూ.లక్ష వూత్రమే వూఫీ చేస్తావుని చెబితే మిగతా అప్పులకు తాము వడ్డీ ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని ప్రశ్నించారు. కొన్ని బ్యాంకుల్లో వీవో లీడర్లను సంప్రదించకుండానే బ్యాంకర్లు పొదుపు ఖాతాల్లోంచి నగదును రుణాలకు జవు చేసుకుంటున్నారని, ఇది భావ్యం కాదని అన్నారు. కరువు పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం సరికాదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేసే వరకు దశలవారీగా ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. రుణాలు మొత్తం వూఫీ చేయూల్సిందే ఎన్నికల సవుయుంలో ప్రకటించిన విధంగా డ్వాక్రా రుణాలు పూర్తిగా వూఫీ చేయూల్సిందే. ఐదు నెలలకు సంబంధించి అసలు, వడ్డీ ఒకేసారి కట్టవుంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి. వుహిళలు పొదుపు కడితే ఆ డబ్బును కూడా అప్పులకు జవు చేసుకోవడం దారుణం. రుణాలు తోసేస్తావుని చెప్పి మాట మార్చడం సరికాదు. -వుహేశ్వరి, డ్వాక్రా వుహిళ, కుప్పం రుణాలడిగితే తిప్పికొట్టవున్నారు.. వుహిళల రుణాలన్నీ వూఫీ చేస్తావున్నారు. ఎవరైనా రుణాలు కట్టవుని అడిగితే తిప్పికొట్టవున్నారు. పేపర్లలో కూడా ఈ విషయుం వచ్చింది. ఇప్పుడేమో కేవలం రూ.లక్ష వూఫీ అంటున్నారు. కూలి పనులు చేసుకునే వుహిళలు ఎక్కడి నుంచి తెచ్చి డబ్బు కట్టాలి. ఈ వడ్డీలకు బయుట కూడా రుణాలు తీసుకోవచ్చు. ఇకపై పొదుపు కూడా కట్టేది లేదు. -నిర్మల, డ్వాక్రా వుహిళ, కుప్పం వేలకు వేలు ఎక్కడి నుంచి తేవాలి వడ్డీలేని రుణాలు ఇచ్చి ఇప్పుడేమో ఐదు నెలలకు కలిపి వడ్డీ, అసలు కట్టవుంటున్నారు. ఇది చాలా దారుణం. వేలకు వేలు డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చేది. వూ పొదుపుల్లో ఉన్న డబ్బును కూడా అప్పుకు జవు చేసుకుంటున్నారు. డ్వాక్రా వుహిళలకు ఇదివరకు చెప్పిన విధంగానే రుణాలు మొత్తం వూఫీ చేసి తీరాలి. -కృష్ణవేణి, డ్వాక్రా వుహిళ, కుప్పం -
కొమ్ములు తిరిగిన కొట్లాట
రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి... కత్తులతో మనుషుల్ని మనుషులు చంపుకునే వికృత క్రీడ ఎప్పుడో కనుమరుగైంది. కానీ అనాదిగా స్పెయిన్‌లో బుల్‌ఫైట్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. చావే భయపడేలా అత్యంత క్రూరంగా చంపుతుంటే.. అది చూసి చప్పట్లు చరిచి, ఈలలు వేసే సంస్కృతి వందల ఏళ్లుగా వదలడం లేదు. క్రీడగా చెప్పుకునే బుల్ఫైట్పై ఈ వారం మైదానం ప్రత్యేకం. - శ్యామ్ తిరుక్కోవళ్లూరు ఐదారు వందల కిలోల బరువున్న ఎద్దును ఎదుర్కోవడం ఒక మనిషికి సాధ్యం కాదు.. కానీ అదే ఎద్దును శారీరకంగా, మానసికంగా వేధించి.. రెండు రోజులు కడుపు మాడ్చి.. వీపుపై కత్తుల్లాంటి వాటితో పోట్లు పొడిచి.. రక్తం కారేలా చేసి.. ఇరవై నిమిషాల్లో చంపే వికృత క్రీడ బుల్ ఫైట్.. స్పెయిన్, మెక్సికో లాంటి కొన్ని దేశాల్లో ఈ బ్లడ్ ఫైట్ మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందాన సాగుతోంది. వందల ఏళ్లుగా... ఎద్దులతో కొట్లాట అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది స్పెయిన్ బుల్‌ఫైట్. అక్కడ బుల్ ఫైటింగ్ కొన్ని వందల ఏళ్లుగా సాగుతోంది. పురాతన రోమ్ కాలంలో బుల్ ఫైటింగ్‌కు ప్రజాదరణ చాలా ఎక్కువ. ఏళ్లుగా ఇది స్పెయిన్ సంస్కృతిలో భాగమైంది. అయితే స్పెయిన్‌లో ప్రస్తుత తరహాలో జరుగుతున్న బుల్ ఫైటింగ్ 300 ఏళ్లుగా సాగుతోంది. పోటీలకు ప్రత్యేక ఎద్దులు... స్పెయిన్‌లో బుల్ ఫైటింగ్‌కు ఉపయోగించే ఎద్దులు ప్రత్యేక బ్రీడ్‌కు చెందినవి. పశువుల్లో ఉపజాతి అయిన బాస్ టారస్ ఇబెరికస్ ఎద్దును బుల్ఫైటింగ్లో ఉపయోగిస్తారు. వీటిని టోరో బ్రావో, ఇబెరియన్ బుల్ అని పిలుస్తారు. వీటిని దక్షిణ స్పెయిన్‌తో పాటు పోర్చుగల్, లాటిన్ అమెరికా దేశాల్లో పెంచుతారు. ఇవి ఎక్కువగా నల్లగా, ముదురు గోధుమ రంగులో ఉంటాయి. వీటిలో అసాధారణ స్థాయిలో జన్యువులు, డీఎన్ఏ ఉండటం వల్ల దూకుడుతనం, శక్తి, బలం, సత్తువ అధికంగా ఉంటుంది. వీటినే పోటీల్లో బరిలోకి దించుతారు. మూడు నుంచి నాలుగేళ్ల వయసున్న వీటి బరువు 500 నుంచి 700 కేజీల మధ్య ఉంటుంది. వీళ్లే బుల్ ఫైటర్లు... బుల్ ఫైటింగ్లో ప్రధాన పాత్ర పోషించేది ప్రధాన మెటడారే. ఇతనికి స్టార్ హోదా ఉంటుంది. స్టార్ మెటడార్ కోసమే కొందరు ప్రత్యేకంగా బుల్ ఫైటింగ్ చూస్తారు. బుల్ ఫైటింగ్లో మెటడార్కు మరో ఇద్దరు సహాయకులుగా వ్యవహరిస్తారు. ముగ్గురు బాండెరిల్లేరోస్, ఇద్దరు పికెడార్లు తమ వంతు సాయం చేస్తారు. ఇక ఎద్దును చంపే క్రమంలో వీరందరి పాత్ర ఉన్నా.. చివరికి హీరో మాత్రం ప్రధాన మెటడారే. అప్పుడప్పుడు మనుషుల ప్రాణాలూ... బుల్ ఫైటింగ్ ఉద్దేశం ఎద్దులను చంపడం. అయితే ఈ పోటీల్లో అప్పుడప్పుడు బుల్‌ఫైటర్లు చనిపోతారు. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రెచ్చగొట్టే క్రమంలో కానీ.. లేదంటే వాటి వీపులో పికాను లేదంటే బ్యాండెరిల్లాస్ను పొడిచే క్రమంలో బుల్ఫైటర్లను ఎద్దులు కుమ్మేస్తాయి. ఎద్దుల కుమ్ముడికి బుల్‌ఫైటర్లు చనిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 1700వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 500లకు పైగా బుల్ ఫైటర్లు చనిపోయినట్లు విశ్లేషకుల అంచనా. ఫైటర్లు.. శిక్షణ.. బుల్ ఫైటింగ్లో ఎద్దును చంపడమంటే మాటలు కాదు.. కుమ్మేయాలన్న కసితో ఉన్న ఎద్దును రింగ్‌లో చంపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. బుల్ ఫైటర్ల కోసం బుల్ ఫైటింగ్‌ను ప్రోత్సహించే దేశాల్లో ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చే స్కూళ్లు కూడా ఉంటాయి. చాలా మంది శిక్షణ పొందేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఐదేళ్ల వయసు నుంచి బుల్ఫైటింగ్లో ట్రైనింగ్ ఇస్తారు. ఇక స్పెయిన్‌లో బుల్ఫైటర్ రింగ్‌లోకి అడుగుపెట్టాలంటే ముందుగా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. జంతు ప్రేమికుల సమరం... బుల్‌ఫైట్ చూసే వారికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రతీయేటా ప్రపంచ వ్యాప్తంగా ఈ పోటీల కారణంగా 2.5 లక్షల ఎద్దులు చనిపోతున్నాయి. అయితే వీటిని అత్యంత పాశవికంగా చంపడాన్ని నిరసిస్తూ కొన్నేళ్లుగా జంతు ప్రేమికులు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం బుల్ ఫైటింగ్ స్పెయిన్, ఫ్రాన్స్, పోర్చుగల్, మెక్సికో, కొలంబియా, వెనిజులా, పెరు, ఈక్వెడార్‌లో జరుగుతున్నాయి. అయితే జంతు ప్రేమికుల పోరాటం కారణంగా అర్జెంటీనా, కెనడా, క్యూబా, డెన్మార్క్, ఇటలీ, ఇంగ్లండ్ లాంటి దేశాల్లో బుల్ ఫైటింగ్‌పై నిషేధం విధించారు. క్రీడనా? కళనా? వందల ఏళ్లుగా జరుగుతున్న బుల్ ఫైటింగ్ క్రీడ అని కొందరు వాదిస్తుంటే.. కాదు కాదు.. ఇదో కళ అని మరికొందరు వాదిస్తున్నారు. అయితే కొన్ని దేశాల్లో జరుగుతుండటంతో బుల్ఫైటింగ్పై పెద్దగా దృష్టి సారించడం లేదు. అయితే క్రీడా విశ్లేషకులు మాత్రం ఎద్దులను చంపడమూ ఓ క్రీడేనా? అని సన్నాయి నొక్కులు నొక్కిన సందర్భాలు చాలా ఉన్నాయి. బుల్‌ఫైట్ సాగేదిలా... కేవలం 20 నిమిషాల్లో ముగిసే బుల్‌ఫైట్ మూడు దశల్లో సాగుతుంది. ఎద్దును భయపెట్టేలా శబ్దం చేయడంతో పోటీ ప్రారంభమవుతుంది. తొలి దశలో పికెడార్లు గుర్రంపై స్వారీ చేస్తూ ఎద్దును కవ్విస్తారు. అలిసిపోయేలా చేయడమే వారి పని. అదే క్రమంలో వాళ్లు తమ దగ్గరున్న 6 నుంచి 8 అంగళాల పొడవు, 2 అంగుళాల మందం ఉన్న ‘పికా’ అనే ఆయుధంతో వీపు భాగంలో పొడిచి మెడ నరాలు తెగేలా చేస్తారు. దీంతో ఎద్దు శరీరంలోంచి రక్తం కారడం మొదలవుతుంది. ఎద్దు మరణానికి ఇక్కడే కౌంట్‌డౌన్ మొదలవుతుంది. రెండో దశలో సహాయ మెటడార్లు(వీరిని బాండెరిల్లేరోస్ అని కూడా పిలుస్తారు) బ్యాండెరిల్లాస్(ఈటె లాంటి పదునైన కత్తి)తో రంగంలోకి దిగుతారు. ఐదు, ఆరు బ్యాండెరిల్లాస్లను ఎద్దు వీపుభాగంలో లోనికి గుచ్చుతారు. దీంతో అది అలిసిపోతుంది. మూడోది, అంతిమ దశలో ప్రధాన మెటడార్ రింగ్‌లోకి వచ్చి ఎద్దు ప్రాణాలను తీస్తాడు. ఎరుపు బట్టతో ఎద్దును ఆటూ ఇటూ ఆడిస్తూ అది పూర్తిగా కింద పడిపోయేలా చేస్తాడు. ఇదంతా ముగియడానికి 6 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ప్రధాన మెటడార్ ప్రాణాలు తీయడంలో ఇబ్బంది పడితే అతనికి సహాయకుడిగా మరొకరు రింగ్‌లోకి వస్తారు. చివరికది రక్తం కక్కుకుని ప్రాణాలు విడుస్తుంది. పలు దేశాల్లో... బుల్ ఫైటింగ్లో ఎద్దును అత్యంత క్రూరంగా చంపడాన్ని చూశాం... అయితే కొన్ని దేశాల్లో బుల్ ఫైట్‌ను అటు ఎద్దుకు, ఇటు బుల్ ఫైటర్‌కు హాని జరగకుండా పోటీలు నిర్వహిస్తారు. మరికొన్ని దేశాల్లో రెండు ఎద్దుల మధ్య పోటీలను కూడా నిర్వహిస్తారు. పెర్షియన్ గల్ఫ్(ఒమన్, యూఏఈ)లో రెండు ఎద్దుల మధ్య బుల్ ఫైట్ పోటీలు జరుగుతాయి. అమెరికాలో బుల్ ఫైటర్ (రొడియో క్లౌన్) పేరుతో పోటీలు జరుపుతారు. టర్కీ, టాంజానియా, జపాన్లలో ఎద్దుల మధ్య పోటీలు నిర్వహిస్తారు. జల్లికట్టుపై సుప్రీం నిషేధం... భారత్‌లో అత్యంత వివాదాస్పదమైన క్రీడ ‘జల్లికట్టు’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ ఏడాది మేలో నిషేధం విధించింది. ప్రతీయేటా తమిళనాడులో జరిగే ఈ జల్లికట్టు పోటీలు జరిగిన ప్రతీసారి వివాదాస్పదమే. స్పెయిన్ బుల్ఫైటింగ్లా ఎద్దును ఈ పోటీల్లో చంపరు. అయితే ఇందులో పాల్గొనే వాళ్లు ఎద్దును లొంగదీసుకుంటారు. ఈ ప్రయత్నంలో చాలామంది చనిపోయారు. గత రెండు దశాబ్దాల్లో రెండు వందల మంది చనిపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆ రెండు రోజులూ... బుల్ ఫైట్‌లో రింగ్‌లోకి వచ్చిన ఎద్దు రంకెలేస్తూ కనిపించిన వారిని కనిపించినట్లుగా కొమ్ములతో కుమ్మేయాలన్న కసితో అటూ, ఇటూ పరుగెత్తుతుంది. అయితే సాధారణంగా ఎద్దులు ఎవరికీ హాని చేయవు. కానీ రింగ్‌లోకి వచ్చిన తర్వాత అది పిచ్చెక్కినట్లుగా వ్యవహరిస్తుంది. అలా చేయడానికి కారణం ఉంది. బుల్‌ఫైట్‌కు సిద్ధం చేయడంలో భాగంగా రెండు రోజుల పాటు దానికి నరకం చూపిస్తారు. శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తారు. నీళ్లలో తడిపిన న్యూస్ పేపర్లను దున్నపోతు రెండు చెవుల్లోకి దూరుస్తారు. దీంతో వాటికి ఏమీ వినిపించదు. దూదిని ముక్కు రంధ్రాల్లోకి దూర్చడం ద్వారా శ్వాసక్రియకు ఆటంకం కలిగేలా చేస్తారు. ఫలితంగా అది శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. వాజిలిన్‌ను రెండు కళ్లకు రుద్దుతారు. దీంతో వాటికి చూపు మందగిస్తుంది. కాళ్లు కాలిపోతున్నాయనిపించేలా గాఢత ఎక్కువగా ఉన్న ద్రావణాన్ని పూస్తారు. దీనివల్ల ఎద్దు పట్టుతప్పిపోతుంది. ఒకరకంగా అది కింద పడిపోయేలా చేస్తుంది. జననాంగాల్లోకి సూదిని గుచ్చుతారు. బలమైన లాక్సెటీవ్స్ అనే డ్రగ్స్‌ను ఆహారంతో కలిపి పెడతారు. అది తిన్న ఎద్దు విరేచనాలకు లోనవుతుంది. ఫలితంగా నీరసంగా తయారవుతుంది. ఎద్దు బలహీనంగా తయారయ్యేలా (కొన్నిసార్లు బలంగా తయారయ్యేలా) డ్రగ్స్ తినిపిస్తారు. రింగ్‌లోకి పంపే కంటే రెండు రోజుల ముందు ఎద్దును చీకటిగా ఉన్న బాక్స్‌లో ఉంచుతారు. దీంతో అది దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోతుంది. రెండు రోజుల తర్వాత ఒక్కసారిగా రింగ్‌లోకి వదులుతారు. బాక్స్‌లోంచి బయటకు వచ్చిన ఎద్దు తనకు ఎట్టకేలకు విముక్తి కలిగిందన్న భావనతో రింగులో కలియ తిరుగుతుంది. అదే సమయంలో తనను చిత్రహింసలకు గురి చేసిన వారిని కొమ్ములతో చంపేయాలన్న కసి దానిలో కనిపిస్తుంది. అందుకే రింగ్‌లో కనిపించిన వారిని కనిపించినట్లుగా కుమ్మేసేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తుంది. -
ఆశలన్నీ ఆవిరి
అతివృష్టి.. అనావృష్టితో పంటకు నష్టం వాటిల్లితే వాతావరణ, పంటల బీమా పథకం కింద నష్టపరిహారం మంజూరవుతుందన్న ధీమా ఈ ఏడాది రైతులకు లేకుండా పోయింది. పంట రుణాల మాఫీ, రుణాల రీషెడ్యూలులో చంద్రబాబు ప్రభుత్వం వేసిన పిల్లిమొగ్గలు బీమాపై రైతుల ఆశలను ఆవిరి చేశాయి. చంద్రబాబు ప్రభుత్వం రుణాల మాఫీపై ఎటూ తేల్చకపోవడంతో కొత్తగా పంట రుణాలను బ్యాంకర్లు మంజూరు చేయలేదు. రుణం ఇవ్వకపోవడంతో రైతులు ప్రీమియం చెల్లించలేదు. గురువారంతో ప్రీమియం చెల్లింపు గడువు పూర్తవనుండడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి: దుర్భిక్ష జిల్లాలో పంట సాగు చేసిన రైతుకు అతివృష్టి వల్లో అనావృష్టివల్లో నష్టపోయే పరిస్థితి రాకూడదని ప్రభుత్వం భావించింది. ఆ క్రమంలోనే ప్రధాన పంటలైన వేరుశెనగ, కంది, వరి వంటి వాటికి బీమా పథకాన్ని వర్తింపజేసింది. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 ఖరీఫ్‌లో మండలం యూనిట్‌గా ఉన్న పంటల బీమా పథకాన్ని గ్రామం యూనిట్‌గా వేరుశెనగ పం టకు వర్తింపజేశారు. పంటల బీమా స్థానంలో వాతావరణ బీమా పథకాన్ని 2010 ఖరీఫ్ నుంచి వేరుశెనగ పంటకు వర్తింపజేస్తున్నారు. వరి, కందికి సైతం పంటల బీమా పథకాన్ని అమ లు చేస్తున్నారు. వర్షాధారంగా జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు 1.35 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగుచేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. వరుణుడు కరుణించకపోయినా అరకొర పదునులోనే 1.06 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశెనగ సాగుచేశారు. వర్షాభావం వల్ల వేరుశెనగ పంట అప్పుడే ఎండిపోతోంది. ఎండిపోతున్న పంటను చూసి రైతు ఆందోళన చెందుతున్నాడు. వాతావరణ బీమా పథకం కింద ప్రీమియం చెల్లించి ఉంటే.. నష్టపరిహారమైనా వచ్చేదన్న భావన రైతుల్లో నెలకొంది. తీవ్ర కరవు పరిస్థితుల వల్ల అప్పుల పాలైన రైతు ప్రీమియం చెల్లించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈనెల 21న ఒక్కో కుటుంబానికి రూ.1.5 లక్షల వంతున పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కొత్త రుణాలు కూడా ఇప్పిస్తామని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లు కొత్తగా రుణాలు మంజూరు చేస్తే.. బీమా ప్రీమియం చెల్లించవచ్చునని రైతులు భావించారు. కానీ.. పంట రుణాల మాఫీపైన.. రుణాల రీషెడ్యూలుపైనా చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. దీంతో బ్యాంకర్లు 2013-14లో కరవు ప్రభావిత 33 మండలాల్లో 1.69 లక్షల మంది రైతులకు సంబంధించిన రూ.1,438 కోట్ల రుణాలను రీషెడ్యూలు చేయలేదు. ఇక తక్కిన 7.5 లక్షల మంది రైతులు పంట రుణాల రూపంలో తీసుకున్న రూ.9,642.25 కోట్లను చంద్రబాబు ప్రభుత్వం ధన రూపంలో అందిస్తే ఆ రుణాలను మాఫీ చేస్తామని బ్యాంకర్లు స్పష్టీకరిస్తున్నారు. రుణాలు చెల్లించాలంటూ రైతులకు నోటీసులు సైతం జారీచేస్తున్నారు. కొత్త రుణాలు పంపిణీ చేయాల్సింది పోయి.. పాత రుణాలు చెల్లించాల్సిందేనని బ్యాంకర్లు నోటీసులు జారీచేస్తోండటంతో రైతులు నిర్ఘాంతపోతున్నారు. ఈ ఏడాది రూ.2,793 కోట్లను పంట రుణాలుగా పంపిణీ చేయాలని బ్యాంకర్లు నిర్ణయించగా ఇప్పటికి ఒక్క రైతుకు కూడా కొత్తగా పంట రుణం ఇవ్వలేదు. బీమా ప్రీమియం చెల్లింపునకు జాతీయ వ్యవసాయ బీమా సంస్థ ఈనెల 31ని గడువుగా విధించింది. బ్యాంకర్లు పం ట రుణం ఇచ్చే సమయంలోనే రైతుల నుంచి బీమా ప్రీమియం కట్టించుకోవడం రివాజు. ఈ ఏడాది పంట రుణాలు మంజూరు చేయకపోవడంతో ఏ ఒక్క రైతు బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. దీంతో వాతావరణ బీ మా పథకం రైతులకు అందకుండా పోయింది. కరవు ఉరుముతుండటంతో పంట నష్ట పరిహారం చెల్లించేదెవరని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
రిజిస్ట్రేషన్స్ బాదుడుకుపచ్చజెండా!
రేపటి నుంచి అమలుకు సిద్ధం! జేసీతో రిజిస్ట్రేషన్ అధికారుల భేటీ విజయవాడ : రిజిస్ట్రేషన్స్ బాదుడుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆగస్టు ఒకటో తేదీ నుంచి పొలాలు, స్థలాల విలువలు పెంచేందుకు రిజి స్ట్రేషన్స్, రెవెన్యూ అధికారులు కసరత్తు పూర్తిచేశారు. ప్రభుత్వం నుంచి తుది ఉత్తర్వులు అందగానే శుక్రవారం నుంచి కొత్త రేట్ల ప్రకారం మార్కెట్ విలువలు పెంచేందుకు తుది ప్రతిపాదనలను తయారుచేశారు. బుధవారం రాత్రి జాయింట్ కలెక్టర్ జె.మురళి ఆధ్వర్యంలో మార్కెట్ విలువలు నిర్ధారించే కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్లు తయారుచేసిన ప్రతిపాదనలను కమిటీ చైర్మన్, జాయింట్ కలె క్టర్ పరిశీలించినట్లు సమచారం. మొత్తం మీద గతంలో ఉన్న రేట్ల కంటే 30 నుంచి 70 శాతం పెంచాలని ఆ కమిటీ తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. దీనిపై ప్రభుత్వం నుంచి గురువారంలోపు వచ్చే ఆదేశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. జిల్లాలోని 28 మంది సబ్-రిజిస్ట్రార్లు తమతమ ఏరియాల్లో బహిరంగ మార్కెట్ విలువలకు, ప్రభుత్వ మార్కెట్ విలువలకు ప్రతిపాదనలు తయారుచేశారు. గ్రామాల్లో పెరగనున్న విలువలు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే తక్కువగా ఉన్న భూములు, స్థలాల విలువలు భారీగా పెంచేందుకు అధికారులు ఆమోదం తెలిపారు. కృష్ణాజిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్న గన్నవరం, ఉయ్యూరు, నూజివీడు, తిరువూరు, జగ్గయ్యపేట, నందిగామ, మచిలీపట్నం, తదితర ప్రాంతాల్లో బయట మార్కెట్ విలువలతో చూసుకుని ప్రభుత్వ విలువలను భారీగా పెంచారు. ఆయా ప్రాంతాల్లో గతంలో ఉన్న విలువల క ంటే 70 శాతం ప్రభుత్వ విలువలు పెరగనున్నట్లు తెలిసింది. విజయవాడలో 30 శాతం... విజయవాడ నగరంలో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువలకంటే 30 శాతం పెంచినట్లు తెలిసింది. గాంధీనగర్ , గుణదల, పటమట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 30 శాతం విలువ పెరిగినట్లు సమాచారం. అదేవిధంగా జిల్లాలో అన్నిమున్సిపల్ కేంద్రాలలో కూడా మార్కెట్ విలువలు భారీగా పెరగనున్నాయి. -
తీరని ‘టెన్’షన్
పదో తరగతి పరీక్షలపై స్పష్టతలేని సర్కారు చోడవరం రూరల్: ప్రభుత్వం పదో తరగతి విద్యార్థులతో చెలగాటమాడుతోందనే చెప్పాలి. ఈ ఏడాది సిలబస్ మార్చారు. సీబీఎస్ఈ తరహాలో పాఠ్య పుస్తకాలు సరఫరా చేశారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఈ నూతన విధానం అమల్లోకి వచ్చింది. సీసీఈ (నిరంతర సమగ్ర మూల్యాంకనం) పద్ధతి అంటూ పుస్తకాలలో సమాచారం ఇచ్చారు. విద్యార్థులు సాధించాల్సిన ప్రమాణాలను కూడా ఆయా సబ్జెక్టుల వారీగా పుస్తకాలలోనే పొందుపరిచారు. ఉపాధ్యాయులకు సీసీఈపై అవగాహన కల్పించే తరగతులు కూడా నిర్వహించారు. గడచిన రెండేళ్లలో 6, 7 తరగతులకు ఒకసారి, 8, 9 తరగతులకు గత ఏడాది నూతన్ సిలబస్ రూపొందించారు. ఈ ఏడాది 10వ తరగతి సిలబస్ మార్చారు. రెండేళ్ల నాటి ఎల్ఈపీ స్థానంలో సీసీఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. బట్టీ చదువులు కాకుండా విద్యార్థుల్లో స్వీయ రచన, ఆలోచన, బహిరంగ పర్చడం, చర్చించడం, ప్రాజెక్టు పని వంటి ప్రామాణిక అంశాల్లో నైపుణ్యం వచ్చేలా పుస్తకాలలో అంశాలు పొందుపరిచారు. ఈ పద్ధతిలోనే వార్షిక పరీక్షలు జరుగుతాయని గతంలో ప్రకటించారు. దీనికి అనుగుణంగా రెండు నెలలుగా ఈ విధానంలోనే బోధన, విద్యార్థులకు ప్రాజెక్టు పనులు పాఠశాలలో చేయిస్తున్నారు. సిలబస్ కూడా పాత పరీక్ష విధానంతో ఏ మాత్రం పోలిక లేదు. ఈ పరిస్థితుల్లో పాత విధానంలోనే పరీక్షలన్న వార్తలు తల్లిదండ్రులు, విద్యార్థల్లో ఆందోళనకు కారణమవుతున్నాయి. ఏమి చదవాలో, ఏ విధంగా చదవాలో అర్థంకాని సందిగ్ధ పరిస్థితి విద్యార్థుల్లో నెలకొంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగిస్తున్న అంశమే. వాస్తవానికి పాతపద్ధతిలో పరీక్షలు నిర్వహించడమంటే గతంలో మాదిరి 11 పేపర్లు నిర్వహించడంతోబాటు, పాత నమూనాలోనే 100 మార్కులకు పేపర్ ఉండాలి. ఇలాగే ఉంటుందా లేక నూతన సిలబస్ ఆధారంగా నమూనా మారుతుందా అన్న విషయం స్పష్టం కాలేదు. ప్రస్తుత సిలబస్ పాత నమూనాకు అనుగుణంగా లేదు. నూతన సిలబస్‌లో ప్రశ్నలకు విద్యార్థి ఆలోచనలకు తగ్గట్టుగా సమాధానాలు రాసే విధంగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఏ పద్ధతిలో పరీక్షలు సిద్ధం కావాలన్నదే పెద్ద పరీక్షగా మారింది. ప్రభుత్వం ఇకనైనా పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో స్పష్టంగా ప్రకటన చేయడం, నమూనా పరీక్ష పేపర్ విడుదల చేయడం ద్వారా విద్యార్థుల్లో నెలకొన్న గందరగోళానికి తెరదించాలి. పాతపద్ధతిలోనే పరీక్షలు పదో తరగతి పరీక్షలు పాత పద్ధతిలో 11 పేపర్లు ఉంటాయి. పాత విధానాన్ని ఈ విద్యా సంవత్సరానికి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మోడల్ పేపర్ విషయంలో నెట్ ద్వారా ఉపాధ్యాయుల నుంచి సూచనలు నేరుగా ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. ఈ సమాచారం ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. పేపర్ విధానం ఎలా ఉంటుందన్నది ప్రభుత్వమే విడుదల చేయాల్సి ఉంది. - కృష్ణారెడ్డి, డీఈఓ -
బిల్లుల షాక్!
రూ. వేలల్లో రావడంతో వినియోగదారుల ఆందోళన ‘ప్రజావాణి’లో అధికారులకు ఫిర్యాదు పి.లక్ష్మి... ఇంటి విద్యుత్తు సర్వీసు మీటరు నంబరు 442. సాధారణంగా ప్రతి నెల రూ.135 నుంచి రూ.150 వరకు బిల్లు వచ్చేది. ఈనెల బిల్లు మాత్రం ఒక్కసారిగా రూ. 6,772 వచ్చింది. కె.రాజేశ్వరి... ఇంటి మీటరు నంబరు 304. ఇప్పటివరకు నెలకు రూ. 116 నుంచి రూ. 130 మధ్యే బిల్లు వచ్చేది. ఈసారి ఏకంగా రూ. 1,035 వచ్చింది. సర్వాలక్ష్మి... ఇంటి విద్యుత్తు మీటరు నంబరు 423. ప్రతి నెల బిల్లు రూ. 142 నుంచి రూ. 160 వరకు మాత్రమే వచ్చేది. ఈనెల మాత్రం వెయ్యి రూపాయలకు పైగా బిల్లును విద్యుత్తు సిబ్బంది ఆమె చేతికి ఇచ్చారు. ఎం.మంగ... ఇంటి మీటరు నంబరు 465. ఈ సర్వీసుకు ఇప్పటివరకు రూ. 149 మించి ఏ నెలా బిల్లు రాలేదు. ఈసారి మాత్రం రూ. 939 చెల్లించాలని బిల్లు వచ్చింది. బైపా పెంటయ్యమ్మ... ఇంటి సర్వీసు నంబరు 555. గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా ఇవ్వడంతో ఆమె ఐదు నెలల క్రితమే కుల ధ్రువీకరణపత్రం అధికారులకు ఇచ్చారు. దీంతో ఇప్పటివరకు బిల్లు రాలేదు. ఈనెల మాత్రం రూ. 850 చెల్లించాలంటూ ఆమెకు బిల్లు వచ్చింది. ఈ విద్యుత్తు బిల్లుల బాధితులంతా జిల్లాలోని నాతవరం మండలంలో చమ్మచింత గ్రామానికి చెందినవారు. వారికే కాదు ఈ మండలంలో పలువురు వినియోగదారులకు ఇలాగే అధిక బిల్లులు రావడంతో నిర్ఘాంతపోయారు. పెద్దగా విద్యుత్తు వినియోగించని తమ ఇళ్లకు అదీ సరఫరాలో అధిక కోతలు విధిస్తున్న సమయంలో రూ. వేలల్లో బిల్లులు రావడమేమిటని ఆందోళన చెందుతున్నారు. దీంతో కొంతమంది సోమవారం విద్యుత్తు సబ్‌స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. బిల్లులను సరి చేయించాలంటూ ఏఈ వెంకట్రావుకు విన్నవించారు. - నాతవరం -
కాంగ్రెస్ బాటలోనే మోడీ పాలన
కీసర: కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు సయ్యద్ అజీజ్ పాషా దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రస్థాయి జనసేవాదళ్ శిక్షణ శిబిరాన్ని ఆదివారం కీసరలోని కేబీఆర్ గార్డెన్లో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అజీజ్ పాషా మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల అండతో అధికారంలోకి వచ్చిన మోడీ.. ఆ సంస్థల అభివృద్దికి కృషి చేస్తున్నారని ఆరోపించారు. రైల్వే చార్జీలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచుతూ ఎన్డీఏ ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపనుందన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తానని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారన్నారు. ప్రస్తుతం ధరలను పెంచి ఏ విధంగా మంచి పాలన అందిస్తారో దేశ ప్రజలకు ఆయన వివరించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఈసారి వామపక్షాలను దెబ్బతియాలని కార్పొరేట్ సంస్థలు స్థానిక పార్టీలు తమతో పొత్తు పెట్టుకోకుండా ఒత్తిడి తీసుకువచ్చాయని ఆయన ఆరోపించారు. ఫలితంగా ఈసారి వామపక్షాలకు దేశంలో కొన్ని పార్లమెంట్ సీట్లు మాత్రమే దక్కాయన్నారు. తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... కేసీఆర్ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చని పక్షంలో సీపీఐ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ధర్నాలు, ఉద్యమాలు చేస్తామన్నారు. ఆ పార్టీ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కమ్యూనిస్టు పార్టీకి జనసేవాదళ్ వెన్నెముకగా నిలుస్తుందన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ ప్రశించే విధంగా జనసేవాదళ్ సభ్యులు ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి బాలమల్లేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ నేతలు డాక్టర్ సుధాకర్, రాములు యాదవ్, కుమారస్వామి, స్టాలిన్, శివరామకృష్ణ, ఛాయాదేవి, జ్యోతి, వెంకటాచారి, రమణ , నర్సింగ్‌రావు, నిమ్మల నర్సింహ, కృష్ణమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏదీ జలకళ?
ముంచుకొస్తున్న కరువు తాత్కాలిక ప్రణాళికతో సర్కారు సిద్ధం దీర్ఘకాలిక పంటల సాగు వద్దు : మంత్రి కృష్ణ బైరేగౌడ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో నైరుతి రుతు పవనాల జాడ లేకపోవడం, జూన్ ముగియనున్న తరుణంలో కూడా వేసవిని తలపిస్తుండడంతో జలాశయాలన్నీ ఖాళీ అవుతున్నాయి. కృష్ణా నదిపై బీజాపుర జిల్లాలో నిర్మించిన ఆల్మట్టి జలాశయంలో నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఈ దశలో ప్రభుత్వం అప్రమత్తమైంది. రుతు పవనాలు విఫలమైతే రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం తాత్కాలిక ప్రణాళికతో సిద్ధంగా ఉందని వ్యవసాయ శాఖ మంత్రి కృష్ణ బైరేగౌడ గురువారం శాసన సభలో ప్రకటించారు. జులై తొలి వారం వరకు వేచి చూసి, తదనంతరం ఇదే పరిస్థితి కొనసాగితే ఆ ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. రుతు పవనాలు ఒక్కో సారి జులైలో కూడా చురుకుగా కదిలిన అనుభవాలున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారని వెల్లడించారు. అప్పటికీ నైరుతి జాడ లేకపోతే ప్రణాళికను అమలు చేస్తామని తెలిపారు. ఈ ప్రణాళిక కింద ప్రతి రైతుకు రూ.3 వేల విలువైన కిట్లను అందజేస్తామని చెప్పారు. ఇందులో స్వల్ప, మధ్య కాలిక పంటలను పండించడానికి విత్తనాలు, ఎరువులు ఉంటాయని వివరించారు. తాత్కాలిక ప్రణాళిక కింద దీర్ఘకాలిక పంటలు వేయవద్దని రైతులకు సూచిస్తామని తెలిపారు. ఒక వేళ కరువు లాంటి పరిస్థితి ఏర్పడినా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. రాష్ర్టంలోని 176కు గాను 21 తాలూకాల్లో అధిక, 72 తాలూకాల్లో సాధారణ, 73 తాలూకాల్లో తక్కువ వర్షపాతం నమోదైందని వివరించారు. పది తాలూకాల్లో చెదురు మదురు వర్షాలు పడ్డాయన్నారు. గత ఏడాది ఇదే కాలానికి 81 తాలూకాల్లో అధిక, 66 తాలూకాల్లో సాధారణ, 29 తాలూకాల్లో తక్కువ వర్షపాతనం నమోదైందని వెల్లడించారు. రూ.146 కోట్లతో రైతులకు వ్యవసాయ పనిముట్లు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.146 కోట్ల వ్యయంతో వ్యవసాయ యాంత్రిక పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. తద్వారా ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ ఉపకరణాలు, పనిముట్లను రైతులు అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చని చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో రెండేళ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేస్తామన్నారు. -
జూలై2న ముంబైకి రవాణాశాఖ బృందం
ట్రాఫిక్ వ్యవస్థ అధ్యయనం మంత్రి మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పరిశీలన అక్కడి మెరుగైన విధానాలు గుర్తించి హైదరాబాద్‌లో అమలు సాక్షి, హైదరాబాద్: గందరగోళంగా మారిన హైదరాబాద్ ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించటంతో ఓ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ముంబైలో పరిస్థితుల అధ్యయనానికి వెళ్తోంది. జూలై 2న రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి నేతృత్వంలో బృందం అక్కడికి వెళ్తోంది. ఇందులో సిటీ ట్రాఫిక్ పోలీసు విభాగం, ఆర్టీసీ, జీహెచ్ఎంసీల నుంచి ఉన్నతాధికారులు ఉంటారు. ఈమేరకు బధవారం సాయంత్రం రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావు, రవాణాశాక ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రాలతో భేటీ అయ్యారు. ఆయా విభాగాల నుంచి ఎవరెవరు వస్తారో ఎంపిక చేసి తనకు తెలపాలని ఆదేశించారు. ‘నగరంలో ట్రాఫిక్ గందరగోళంగా మారింది. ఇక్కడి కంటే వాహనాలు, జనాభా అధికంగా ఉన్న ముంబైలో ప రిస్థితులు మెరుగ్గా ఉన్నాయి. అక్కడి యంత్రాంగం అం దుకు తీసుకుంటున్న చర్యలేంటో పరిశీలిస్తాం. సిటీ బస్సు ల నిర్వహణ, అవి బస్టాప్‌లలో నిలిచేతీరు, ప్రయానికులు క్యూ పద్ధతిని అనుసరించటం, ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ, జీబ్రా క్రాసింగ్స్, ప్రజలు నిబంధనలు పాటించటంలో అ ధికారులు చేస్తున్న కృషి... తదితర అంశాలను పరిశీలి స్తాం. వాటిని హైదరాబాద్‌లో ఎంతవరకు అమలు చేయ చ్చో గుర్తించి ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తాం’ అని రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ‘నెంబర్ ప్లేట్ల’పై త్వరలో ఉత్తర్వులు... తెలంగాణకు టీఎస్ రిజిస్ట్రేషన్ సీరీస్ కేటాయించిన నేపథ్యంలో ఏపీ సీరీస్‌తో ఉన్న పాత వాహనాల నెంబర్ ప్లేట్లను కూడా కొత్త సీరీస్‌లోకి మార్చాల్సిందేనని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. దీనికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నామని, అవి పూర్తి కాగానే ముఖ్యమంత్రితో చర్చించి ఆమోదం తీసుకుని ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. -
హామీలన్నీ ‘మాఫీ’!
ప్రభుత్వ తీరుపై డ్వాక్రా మహిళల ఆగ్రహం రుణ చెల్లింపులకు పెరుగుతున్న ఒత్తిళ్లు బ్యాంకర్ల ఒత్తిడికి సాయంగా ఐకేపీ సిబ్బంది వాయిదా మొత్తాన్ని పొదుపు ఖాతాలో వేయాలని మెలిక చోడవరం: ముందు నుయ్యి...వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది డ్వాక్రా మహిళల పరిస్థితి. రుణాలు మాఫీ చేస్తామంటూ ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తుంటే... తీసుకున్న రుణ వాయిదాలు వెంటనే చెల్లించాలంటూ ఐకేపీ అధికారులు మహిళా సంఘాలపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చంద్రబాబు హామీల సంగతేంటని మహిళలు నేతలను నిలదీస్తున్నారు... డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామని సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ప్రకటించింది. దీంతో ఐదు నెలలుగా డ్వాక్రా మహిళలు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలకు సంబంధించిన నెలవారీ వాయిదాలను చెల్లించకుండా వదిలేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఈ రుణ మాఫీపై ఇప్పుడు మీనమీషాలు లెక్కిస్తోంది. ఇదిగో చేస్తాం... అదిగో ఇస్తామంటూ అధికారం చేపట్టి పదిరోజులైనా నేటికీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. దీనివల్ల బ్యాంకర్ల నుంచి ఐకెపి అధికారులకు కొంత ఒత్తిడి వస్తుండడంతో వారు మహిళా సంఘాలను రుణాలు చెల్లించాలంటూ సతాయిస్తున్నారు. జిల్లాలో సుమారు 42 వేల డ్వాక్రా సంఘాలు ఉండగా ఈ ఏడాది మార్చి 31వ తేదీ వరకు సుమారు రూ.1200 కోట్ల రుణాలు వివిధ బ్యాంకుల ద్వారా డ్వాక్రా మహిళలు తీసుకున్నాయి. వీటిలో కొంత మేర చెల్లించినప్పటికీ మిగతా రుణమంతా మాఫీకి వర్తిస్తుందని ఎదురుచూస్తున్నారు. అయితే వాయిదాలు మీరుతున్నా మాఫీపై ప్రభుత్వం ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో డ్వాక్రా మహిళలపై ఒత్తిడి ప్రారంభమైంది. రుణ వసూలుకు కొత్త మెలిక : నేరుగా అప్పు చెల్లించమనకుండా ఆ వాయిదా మొత్తాన్ని డ్వాక్రా సంఘాల పొదుపు ఖాతాల్లో వేయాలని ఐకేపీ సిబ్బంది సంఘ సభ్యులకు చెబుతున్నారు. మాఫీ అయ్యే అవకాశం ఉన్నందున రుణాలు చెల్లించకూడదని ఇప్పటికే జిల్లాలో ఉన్న 43 మండల సమైక్యసంఘాలు, 1150 గ్రామైఖ్య సంఘాలు నిర్ణయించుకున్నాయి. అయినా ఐకేపీ సిబ్బంది ఒత్తిడి తీసుకొస్తుండడంతో వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదో సంఘ సభ్యత్వం రద్దు కాకుండా తమ పొదుపు ఖాతాలో నెలవారీ ఒక్కొక్క సభ్యురాలు రూ.50 నుంచి రూ.100 వరకు వేసుకుంటున్నారు. అలాంటిది ఒకేసారి రుణం తాలూకా వాయిదా సొమ్మును ఆ ఖాతాల్లో వేయమని చెప్పడం వెనుక ఆంతర్యమేమిటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఒక వేళ ప్రభుత్వం మాఫీ చేయకపోతే సంఘాల పొదుపుఖాతాల్లో వేసిన రుణ వాయిదాల మొత్తాన్ని ఆన్లైన్లో బ్యాంక్ జమ చేసుకునే అవకాశం లేకపోలేదని కొందరు మహిళలు అంటున్నారు. ఇదిలావుంటే రుణమాఫీ జరిగితే పొదుపు ఖాతాలో వేసిన వాయిదాల సొమ్ము సంఘానికే ఉండి పోతుందని ఏదో విధంగా మహిళలను ఒప్పించే పనిలో ఐకేపీ సిబ్బంది పడ్డారు. ఇప్పటికే చోడవరం, మాడుగుల, ల క్ష్మీపురం, రావికమతం, బుచ్చెయ్యపేట, రోలుగుంట, దేవరాపల్లి, కె.కోటపాడు, చీడికాడ మండలాల్లో ఇందిరా క్రాంతి పథకం సిబ్బంది డ్వాక్రా మహిళలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీనిని డ్వాక్రా మహిళలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. -
నిన్న అండ.. నేడు గుదిబండ
నక్కపల్లి : పాయకరావుపేట నియోజకవర్గంలో 2012లో చంద్రబాబు నిర్వహించిన మీ కోసం యాత్రలో పెట్రోకెమికల్ అండ్ పెట్రో ఇన్వెస్ట్మెంట్ రీజీయన్(పీసీపీఐఆర్)కు వ్యతిరేకంగా పోరాడతానన్నా రు. భూముల కోసం వచ్చే అధికారులను చెట్లకు కట్టాలని పిలుపు నిచ్చారు. ఇప్పుడేమో మాటమారుస్తున్నారు. పీసీపీఐర్ మాస్టర్‌ప్లాన్, ముసాయిదాను ఏడాది క్రితమే ప్రభుత్వం విడుదలచేసింది. విశాఖ,తూర్పుగోదావరిజిల్లాలో 10 మండలాల్లో 97గ్రామాలను ఇం దులో చేరుస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిం ది. జిల్లాలో పెదగంట్యాడ,పరవాడ,అచ్చుతాపురం, రాంబిల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, నక్కపల్లిమండలాలు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో యు.కొత్తపల్లి,తొండంగి, కాకినాడరూరల్ మండలాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో 40 శాతం ప్రాసెసింగ్ జోన్ గా పారిశ్రామిక అవసరాలకోసం విని యోగిస్తారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుమారు రూ.3.3లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం భావి స్తోంది. ఇప్పటికే జీఎమ్మార్ కన్సార్టియం నుంచి రూ.33వేల కోట్ల పెట్టుబడులు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. పీసీపీఐఆర్‌లో క్లస్టర్‌గా ఉన్ననక్కపల్లి మండలంలోతీరప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదలచేసింది. నాలుగేళ్ల నుంచి ఆయా గ్రామాల్లో భూము ల క్రయవిక్రయాలను ఆపేశారు.అమ్ముకునేందుకు, కుదువపెట్టుకునేందుకు రైతులకు అధికారం లేకుండా పోయింది. పీసీపీఐఆర్‌పై అభిప్రాయ సేకరణను రైతులంతా వ్యతిరేకించారు. భూములు వదిలేప్రసక్తి లేదని తేల్చిచెప్పారు. రైతులకు అండగా వైఎస్సార్సీపీ, తెలుగుదేశంనేతలు కూడా అప్పట్లో నిలిచారు. ప్రజాసంఘాలు, ఉభయకమ్యూనిష్టుపార్టీలు,చేతి,కులవృత్తిసంఘాలు ఇప్పటికీ దీనిని తీవ్రం గా వ్యతిరేకిస్తున్నాయి. పీసీపీఐఆర్ ఏర్పాటుతో కోనసీమను తలపించే ఈ ప్రాంతమంతా పెట్రోరసాయనపరిశ్రమలతో విషతుల్యమవుతుందని జనం ఆందోళన చెందుతున్నారు. వాయు కాలుష్యం వల్ల జనం అనేక రుగ్మతలకు గురికావడంతో పాటు, జీవనోపాధి కోల్పోతారన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. బాబు ప్రకటనతో రైతులకు కంటిమీద కునుకులేకుండాపోతోంది. మాటమార్చడం తగదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రైతులకు అండగా నిలుస్తానని వాగ్దానం చేసి ఇప్పుడు మాటమార్చడం తగదు. 2012లో మీకోసం యాత్రలో పీసీపీఐఆర్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించి ఇప్పుడు అత్యుత్తమ పెట్రోసీమ ఏర్పాటు చేస్తామని ప్రకటించడం సిగ్గుచేటు. ఎన్ని ఇబ్బందులెదురైనా పీసీపిఐఆర్ ఏర్పాటును వ్యతిరేకిస్తాం. రైతులకు అండగా నిలుస్తాం. - అప్పలరాజు, సిపిఎం నాయకులు బాబుది రెండు నాల్కల ధోరణి చంద్రబాబు రెండునాల్కలధోరణి అవలంబించడం తగదు. మీకోసం యాత్రలో భూములను సేకరించేందుకు వచ్చిన అధికారులను చెట్లకు కట్టాలని రైతులను రెచ్చేగొట్టేవిధంగా ప్రకటనలు చేశారు. ఇప్పుడు అదే అధికారులతో భూములు ఎలా సేకరిస్తారో చూస్తాం. రెతులకు వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా పోరాటానికి సిద్ధం. - వీసంరామకృష్ణ, వైఎస్సార్‌సిిపి నాయకుడు రైతులంతా కూలీలవుతారు ఏళ్లతరబడి ఇవే భూములపై ఆధారపడిజీవిస్తున్నాం. భూములు లాక్కొని పరిశ్రమలు ఏర్పాటుచేస్తే రైతులంతా కూలీలుగా మారతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పీసీపీఐర్ ఏర్పాటును అంగీకరించే ప్రసక్తిలేదు. అవసర మైతే ఆందోళన చేపడతాం. - లొడగల చంద్రరావు, రైతు -
గనుల శాఖలో ‘ఈ- పర్మిట్’
తాండూరు, న్యూస్‌లైన్: గనుల శాఖలో కొత్తగా ఈ -పర్మిట్ విధానం అమల్లోకి రానున్నది. ఈ విధానం ద్వారా లీజుదారులు ఇకపై గనుల నుంచి ముడిసరుకు తరలించేందుకు మైన్స్ కార్యాలయాలకు రావాల్సిన అవసరంలేదు. ఏడాది క్రితం గనుల లీజుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం చుట్టిన అధికారులు ఇప్పుడు పర్మిట్ల జారీకి కూడా ఆన్లైన్ విధానాన్ని అమలోకి తేనున్నారు. ప్రస్తుతం గనుల శాఖ లీజుదారులకు మ్యానువల్ పద్ధతిలో పర్మిట్లు జారీ చేస్తున్నది. ఈ పద్ధతిలో రవాణా చేయాలనుకున్న ముడిసరుకు పరిమాణం ప్రకారం లీజుదారులు స్థానిక ట్రెజరీలో చలానా చెల్లించి, గనుల శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ కార్యాలయంలో అందజేస్తారు. అనంతరం ముడిసరుకు రవాణాకు పర్మిట్లను జారీ చేస్తారు. అయితే తరచూ అధికారులు కార్యాలయంలో లేకపోవడం, పర్మిట్లను ఓకే చేసేందుకు సిబ్బంది సతాయిస్తుండడం తదితర కారణాల వల్ల లీజుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. తద్వారా ముడిసరుకు రవాణా ఆలస్యమవుతోంది. ఇలాంటి ఇబ్బందుల నుంచి లీజుదారులకు విముక్తి కల్పిస్తూ పర్మిట్ల కోసం వారు మైన్స్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఈ -పర్మిట్ విధానం అమలుకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈనెల 9వ తేదీ నుంచి ఈ కొత్త విధానం పది జిల్లాల్లో అమల్లోకి తీసుకువచ్చేందుకు గనుల శాఖ సంచాలకులు ఇప్పటికే మైన్స్ ఏడీ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ -పర్మిట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లాలో గత ఏడాది మార్చిలోనే అమలు చేయగా విజయవంతమైంది. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని పది జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఈ విధానం అమలుకు కొత్త ప్రభుత్వం సన్నద్ధమైంది. గ్రానైట్, సుద్ధ, కంకర, షేల్తోపాటు తదితర చిన్నాపెద్ద తరహా ఖనిజాల రవాణాకు ఇక నుంచి ఈ -పర్మిట్ విధానం ద్వారా ఆన్లైన్లో పర్మిట్లు జారీ చేస్తారు. ఈ విధానం అమలుకు గనుల శాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేస్తున్నది. లీజుదారులకు గనుల శాఖ ఎస్బీహెచ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ తదితర పది బ్యాంకుల్లో నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కూడా కల్పించనున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు ముడిసరుకు రవాణాకు పర్మిట్ కోసం డబ్బులను గనుల శాఖ ప్రధాన పద్దులో జమ చేస్తారు. అయితే లీజుదారులకు గనుల శాఖ ప్రత్యేకంగా ఐడీ నంబరును కేటాయిస్తున్నది. నెట్‌బ్యాంకింగ్ ద్వారా లీజుదారులు పర్మిట్ డబ్బులు జమ చేయగానే మైన్స్ ఏడీ సెల్ఫోన్లో ఇందుకు సంబంధించిన సమాచారం వస్తుంది. ప్రత్యేకంగా కేటాయించిన ఐడీ ద్వారా లీజుదారుడు ఎవరు, గని సర్వేనంబర్ తదితరాలతోపాటు లీజు కాలం వంటి వివరాలూ తెలుస్తాయి. అనంతరం ఏడీలు తమ డిజిటల్ సంతకంతో కూడిన పర్మిట్లను ఆన్లైన్లో లీజుదారునికి పంపిస్తారు. ఆన్లైన్లో వచ్చిన పర్మిట్లను లీజుదారులు ప్రింట్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని, ముడిసరుకును రవాణా చేసుకుంటారు. సిమెంట్ కర్మాగారాలు ఉన్నప్రాంతాల్లో సిమెంట్ గ్రేడ్ లైమ్‌స్టోన్‌కు మాత్రమే ఈనెల 9 నుంచి ఈ -పర్మిట్ విధానం అమలు చేయడానికి గనుల శాఖ సన్నాహాలు చేస్తున్నది. ఇతర చిన్నాపెద్ద తరహా ఖనిజాల ముడిసరుకు రవాణాకు ఈ విధానం సాధ్యమైనంత తొందరగా అమల్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు జరుగుతున్నాయని మైన్స్ వర్గాలు చెబుతున్నాయి. -
పద్మానగర్‌లో వైద్యశిబిరం
భివండీ, న్యూస్‌లైన్: పట్టణంలో అత్యధికంగా తెలుగు వారు నివసించే పద్మానగర్ ప్రాంతంలోని అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయం ఎదురుగా వడ్లకొండ నివాస్‌లో రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య యోజన కార్డు శిబిరాన్ని సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియే షన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబడిన రాజీవ్ గాంధీ జీవందాయి ఆరోగ్య బీమా యోజన ప్రస్తుతం ప్రజల చెంతకు చేరడంతో పట్టణంలోని తెలుగు ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. 32 మంది సభ్యుల బృందంతో ఎన్జీవో నడుపుతున్న సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియోషన్ (షేవ-ఏఉగిఅ) ఆధ్వర్యంలో శిబిరాన్ని ఎర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందజేస్తున్నందుకు స్థానికులు అభినందనలు తెలిపారు. భివండీ పట్టణం పవర్లూమ్ పరిశ్రమలతో కూడి ఉండటం వలన ఇక్కడి కార్మికులు తరచూ అనారోగ్యానికి గురౌవుతుంటారు. కార్పొరేషన్ పరిధిలో నడుస్తున్న ఇంధిరాగాంధీ ప్రభుత్వ ఆసుపత్రికి రెండేళ్ల క్రితం డిప్యూటి సివిల్ ఆసుపత్రి హోదా లభించినా ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు లేక ప్రజలు అప్పులు చేసి ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారి బాధలను అర్థం చేసుకున్న బృందం తమ వంతు సహకారాలు అం దిస్తోంది. పట్టణంలో ఉన్న పేద ప్రజలతో పాటు దినపత్రికలలో ఆర్థిక సహాయం కావాలని వచ్చిన కథనాలకు కూడా సేవలు అందించామని ఎన్జీవోలోని మార్కెటింగ్ డెరైక్టర్ కొండి మల్లేశం తెలిపారు. ఈ మధ్య కాలంలో సోషల్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్జీవోను ప్రారంభించి ఈ నెల 1న ఉదయం 10 నుంచి 5 గంటల వరకు 262 మంది గుర్తింపు పత్రాలను, వారి మోబైల్ నంబర్లను సేకరించామన్నారు. తిరిగి శనివారం ఉదయం 10 నుంచి ప్రారంభమైన ఈ శిబిరలంలో 777 మంది పత్రాలను సేకరించినట్లు చెప్పారు. ఆదివారం కూడా ఈ శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల వినోద్, వడ్లకొండ నితిన్, దూస నరేష్, బల్లూరి చంద్రశేఖర్, ఇప్పలపెల్లి దిగంబర్ కుస్మ ప్రవీన్, సుధామణి, నవీన్, కోడం గణేశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నాళ్లీ వెట్టిచాకిరీ..!
గుడిహత్నూర్, న్యూస్‌లైన్ : మహిళల సర్వతోముఖాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్న ఇందిరాకాంత్రి పథం ఉద్యోగులకు ఏళ్లు గడిచినా వెట్టిచాకిరీ మాత్రం తప్పడం లేదు. కనీస వేతన చట్టం వీరికి అమలు చేయకపోవడంతో చాలీచాలని జీతంతో కుటుంబాల్ని పోషించుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. పథకం రూపురేఖలు మారినా... 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక వెలుగు పథకం రూపురేఖలు మారిపోయాయి. వెలుగు పథకం కాస్త ఇందిరాక్రాంతి పథంగా మారిపోయింది. పథకంలో గతంలో పనిచేసిన ఎగువ స్థాయి సిబ్బంది అయిన డీపీఎం, ఏపీఎం, మండల సమన్వయ కర్తలకు హెచ్ఆర్ పాలసీ వర్తింపజేశారు. కానీ దిగువ స్థాయి సిబ్బంది అయిన కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు, అకౌంటెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, గుమాస్తాలు నేటికి హెచ్ఆర్ పాలసీకి నోచుకోలేదు. మండల సమాఖ్య ఆధీనంలో పనిచేస్తున్న వీరికి అరకొర జీతభత్యాలు ఇస్తూ పని చేయించుకుంటున్నారు. ఏళ్ల తరబడి పని చేస్తున్నందున రేపోమాపో ఉద్యోగ భద్రత కల్పిస్తారేమో అని ఆశతో ఉద్యోగులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి విధులు నిర్వహిస్తున్నారు. పని భారం గ్రామ స్థాయిలో మహిళల వారం మీటింగుల సమాచారాన్ని సేకరించి ఒక్కో స్వయం సహాయక సంఘాల లెక్కల వివరాలు, సభ్యుల వివరాలు, ఆమ్ ఆద్మీ బీమా, అభయహస్తం తదితర పథకాల లబ్ధిదారుల వివరాలు కంప్యూటర్లో పొందు పరుస్తూ అధికారులు కోరిన విధంగా వారికి రిపోర్టులు ఇవ్వడంతో పాటు వివిధ శాఖల ప్రభుత్వ కార్యక్రమాల విధులు నిర్వహిస్తున్నారు. దీపం పథకం, స్త్రీనిధి, అమృతహస్తం, పావలా వడ్డీ, అభయహస్తం, ఆమ్ ఆద్మీ బీమా యోజన, ఇందిరమ్మ పచ్చతోరణం తదితర ప్రభుత్వ ముఖ్య పథకాలను పేదల దరికి చేర్చడానికి వీరు నిరంతర కృషి చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా.. జిల్లాలో మొత్తం 647 మంది తాత్కాలిక ఉద్యోగులు మండల సమాఖ్యల పరిధిలో వారి సేవలందిస్తున్నారు. వీరిలో 567 మంది కమ్యూనిటీ యాక్టివిస్ట్‌లు వివిధ రకాల పని చేస్తుండగా వీరికి రూ.1200 నుంచి 2వేల వరకు జీతం అందిస్తున్నారు. కాగా మండల సమాఖ్య అకౌంటెంట్లు 18 మందికి రూ.3,500, 21 మంది కంప్యూటర్ ఆపరేటర్లకు రూ.2,500 నుంచి రూ.4 వేల వరకు చెల్లిస్తున్నారు. అటెండర్లు 18 మందికి రూ.2,500 చెల్లిస్తున్నారు. 12 మంది బ్యాంకు మిత్ర, నలుగురు బీమా మిత్రలకు బ్యాంకు లింకేజీ, క్లెయిముల ఆధారంగా వేతనం చెల్లిస్తున్నారు. క్లస్టరు యాక్టివిస్టులుగా, జాబ్ రిసోర్స్‌పర్సన్‌గా, డిజెబిలిటీ వర్కర్లుగా, మాస్టర్ బుక్ కీపర్లుగా ఏడుగురు పనిచేస్తుండగా వీరికి కొంత ముట్టజెప్పి పనులు చేయించుకుంటున్నారు. వారికిచ్చే ఆ కొంత కూడా నెలకు అందకపోవడంతో వారు ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నారు. ఎప్పుడెప్పుడు ఉద్యోగ భద్రత కల్పిస్తారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
మావోకు దీటుగా నోవా!
నమో నాస్తికా చైనాకు నాస్తికదేశం అని పేరు. అంటే అక్కడ ఆస్తికులు ఉండరని కాదు. ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ‘బహుశా చైనా నాస్తిక దేశమేమో’ అనే అనుమానం కలిగించేలా ఉంటాయి. తాజాగా ఆ దేశం హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రోవ్ నటించిన ‘నోవా’ చిత్రాన్ని నిషేధించడంతో ఇలాంటి అనుమానమే కలుగుతోంది. ‘నోవా’ అనేది బైబిల్ కథ ఆధారంగా తీసిన సినిమా. ఈ ఏడాది మార్చిలో అమెరికాలో, మరికొన్ని దేశాల్లో విడుదలయింది. బ్లాక్బస్టర్లా ఆడుతోంది. చైనాలో కూడా ఆడింది కానీ, కొద్దిరోజుల్లోనే చైనా ప్రభుత్వం ‘నోవా’ను నిషేధించింది. కారణమేమిటో అక్కడి సెన్సార్ అధికారులు చెప్పకున్నా, ముస్లిం దేశాలు ఈ చిత్రాన్ని నిషేధించాయి కనుక వారికి సంఘీభావంగా చైనా కూడా నిషేధించినట్లు కనిపిస్తోంది. అంతేకాదు, చైనా విప్లవనేత మావో జెడాంగ్ కొటేషన్ల కన్నా కూడా బైబిల్ వాక్యాలు ఎక్కువ ఆదరణ పొందుతుండడాన్ని ఆ దేశం జీర్ణించుకోలేకపోతోందని విశ్లేషకులు అంటున్నారు. ‘నోవా’ చిత్రాన్ని తీసిన ‘పారామౌంట్ పిక్చర్స్’ సంస్థ... ‘అబ్బే ఇది మతసంబంధమైన చిత్రం కాదు, ఇందులో పర్యావరణ సందేశాన్ని ఇచ్చాం. కనుక నిషేధం ఎత్తివేయండి’’ అని అడుగుతున్నప్పటికీ చైనా ససేమిరా అంటోంది. ‘నోవా’ విడుదలైన తొలినాళ్లలో ఆ చిత్రాన్ని 3డి లో, ఐమాక్స్ 3డి లో చూసి తన ప్రజలు సంభ్రమాశ్చర్యాలకు గురికావడం చైనాకు మింగుడుపడలేదనీ, ఆ చిత్రం చైనా నాస్తిక వారసత్వ వైభవాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందనీ భావించి వెంటనే నిషేధించిందని హాలీవుడ్ సినిమా పత్రికలు కొన్ని రాశాయి. ‘‘పాపభూయిష్టమైన ఈ లోకాన్ని ప్రళయంలో ముంచేయబోతున్నాను కనుక, ఒక పెద్ద ఓడను నిర్మించుకుని అందులో నువ్వు, నీ కుటుంబ సభ్యులు, ఇంకా జంతుజాలం ఒక్కో జత (ఒక ఆడ, ఒక మగ) చొప్పున ఉండండి. ప్రళయానంతరం ఓడలోని జీవరాశులతో మళ్లీ ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మిస్తాను’’ అని దేవుడు ‘నోవా’ అనే ప్రవక్తకు చెప్పిన బైబిల్ కథే... ఇప్పుడు చైనా నిషేధించిన ‘నోవా’ చిత్ర కథాంశం. -
కేంద్రం సహకరించాలి
సీఎం సిద్ధరామయ్య మోడీకి పూర్తిగా సహకరిస్తాం ‘అక్రమ-సక్రమ’నియమావళి సిద్ధం త్వరలో అమలు చేస్తాం రాష్ర్ట రాబడి 13 శాతం పెరిగింది విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదు త్వరలో పలు ఉద్యోగాల భర్తీ సాక్షి ప్రతినిధి, బెంగళూరు : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పడినా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందివ్వాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. మనం ఫెడరల్ వ్యవస్థలో ఉన్నందున రాజ్యాంగ బద్ధంగా కేంద్రం రాష్ట్రాలకు సహకరించి తీరాలని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని విధాన సౌధలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ‘సాధన బాటలో ఏడాది-చెప్పినట్లే నడుచుకున్నాం’ పేరిట వివిధ శాఖల సాధనలతో కూడిన 108 పుటల పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఓ పార్టీ, కేంద్రంలో మరో పార్టీ అధికారంలో ఉండడం కాకతాళీయమని, అయితే అభివృద్ధికి, దీనికి సంబంధం ఉండబోదని అన్నారు. కాబోయే ప్రధాని నరేంద్ర మోడీని అభినందిస్తున్నానని చెబుతూ, ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారు. అదే విధంగా తమకూ సహకారం లభిస్తుందని ఎదురు చూస్తున్నామని చెప్పారు. అక్రమ-సక్రమకు నియమావళి బెంగళూరులో అక్రమ కట్టడాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన అక్రమ-సక్రమ పథకానికి నియమావళిని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే అక్రమ-సక్రమను అమలు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తమ ప్రభుత్వ ఏడాది సాధనలను వివరించారు. పన్ను రాబడి తగ్గిందన్న విపక్షాల విమర్శల్లో వాస్తవం లేదంటూ, 13 శాతం పెరిగిందని తెలిపారు. శాసన సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను దశలవారీ నెరవేరుస్తామని చెప్పారు. దేశంలో అభివృద్ధి సాధించిన తొలి ఐదు రాష్ట్రాల జాబితాలో కర్ణాటకకు చోటుండాలనేది తమ లక్ష్యమన్నారు. గుడిసె రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని తెలిపారు. పోస్టుల భర్తీ రాష్ట్రంలో 11 వేల ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు. ఇంకా 8,500 మంది పోలీసు సిబ్బంది, 816 మంది ఎస్ఐలను నియమిస్తామన్నారు. కాగా బెంగళూరు మెట్రో రైలు తొలి దశ పనులు వచ్చే ఏడాది సెప్టెంబరు నాటికి పూర్తవుతుందన్నారు. రెండో దశకు కేంద్రం రూ.26,405 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. -
‘ఉపాధి’పై భరోసా ఇచ్చేనా?
ఏలూరు, న్యూస్‌లైన్: నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా ప్రభుత్వం ఏటా మంజూరు చేస్తున్న ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాల మంజూరు అనుమానంగా మారింది. 2013-14 ఏడాదికి సంబంధించి ఉపాధి యూనిట్ల స్థాపనకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జనవరిలో జారీ చేసింది. అనంతరం నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను స్వీకరించి లబ్ధిదారులకు యూనిట్ల మంజూరుపై బ్యాంకులకు మార్గదర్శకాలు కూడా సర్కారు జారీ చేసింది. అయితే మార్చి 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ నెల 26తో ఎన్నికల కోడ్ ముగియనుంది. అయితే రాష్ట్ర విభజన సందర్భంగా జూన్ రెండున కొత్త ప్రభుత్వాలు కొలువు తీరనున్నాయి. ఆ తర్వాతే ఉపాధి యూనిట్ల స్థాపనపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్టు సమాచారం. టీడీపీ సర్కారు అంగీకరిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్ధిదారులకు యూనిట్లు మంజూరు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం అంగీకరిస్తుందా అనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. దీనిపై అధికారులు తర్జనభర్జనలు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఇదే జరిగితే నిరుద్యోగులకు ఉపాధి యూనిట్ల స్థాపనకు రుణాలు ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్నికల్లో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా సబ్సిడీ మొత్తాలను పెంచేసింది. ఉపాధి యూనిట్ల స్థాపనకు సంబంధించి ఏటా సెప్టెంబర్ నాటికే గైడ్‌లైన్స్‌ను ప్రభుత్వం జారీ చేసేది. ఎన్నికల దృష్ట్యా ఈ ఏడాది జనవరిలో మార్గదర్శకాలు ఇవ్వడంతో పాటు సబ్సిడీని 30 శాతం నుంచి 60 శాతం వరకు పెంచింది. వీటి ఎంపికలో సవాలక్ష నిబంధనలు పెట్టడంతో బ్యాంకర్లు ఒక్కరికి కూడా రుణాలు మంజూరు చేయలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి యూనిట్లకు 21 నుంచి 40 ఏళ్ల లోపు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 21-45 సంవత్సరాల లోపు వయోపరిమితికి కుదించారు. దీంతో అప్పటి వరకు అర్హులైన చాలా మంది అనర్హులుగా మారారు. 8,418 మంది లబ్ధిదారుల ఎంపిక జిల్లాలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల నుంచి రూ.65 కోట్ల వ్యయంతో 8,418 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి వ్యక్తిగత యూనిట్లు మంజూరు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికలను రూపొందించారు. బీసీ కార్పొరేషన్ పరిధిలో రూ.26 కోట్లతో 4,518 యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించగా 938 మందికి మాత్రమే రూ. 2.86 కోట్ల సబ్సిడినీ మంజూరు చేస్తూ అధికారులు ఆదేశాల జారీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 3,914 మందికి రూ.39.01కోట్లతో యూనిట్ల స్థాపన లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. అయితే ఇందులో 1456 మందికి రూ.5.96 కోట్లు సబ్సిడీని ఇవ్వాలని ప్రభుత్వానికి ఎస్పీ కార్పొరేషన్ అధికారులు సిఫార్సు చేశారు. వీటిపై కొత్త ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. -
ఖరీఫ్‌పై నిర్లక్ష్యం...!
పంపిణీకి నోచుకోని పచ్చిరొట్ట విత్తనాలు 15 రోజుల్లో రానున్న రుతుపవనాలు అయోమయంలో రైతన్నలు నర్సీపట్నం, న్యూస్‌లైన్ : ఖరీఫ్ సాగు విషయంలో సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఎన్నికల నిర్వహణలో తలమునకలైన ప్రభుత్వంతో పాటు అధికారులు ఉండటం వల్ల ప్రణాళిక రూపొందించడంలో ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో రైతులు ఖరీఫ్ సాగు ఎలా చేయాలనే దానిపై ఆందోళన చెందుతున్నారు. నర్సీపట్నం డివిజన్లో వరితోబాటు అపరాలు, ఇతర పంటలు చేస్తారు. రుతువపనాలు ప్రారంభమైన నాటి నుంచే రైతులు పొలం పనుల్లో నిమగ్నమవుతారు. దీంతో బాటు ప్రధానంగా తాండవ ఆయకట్టు పరిధిలో సుమారుగా 25వేల ఎకరాల్లో రైతులు వరి వేస్తారు. అదేవిధంగా రబీ అనంతరం వరి సాగుచేసిన భూముల్లో సారం పెంచేందుకని పచ్చిరొట్ట సాగు చేపడుతుంటారు. సాధారణంగా అయితే ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయాధికారులు ఏటా సీజనుకు ముందుగానే విత్తనాలు సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచేవారు. గత మూడు నెలలుగా అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారు. దీంతో పాటు రాష్ట్ర విభజన జరగడం, విత్తనాలు అమ్మకాలు మీసేవల్లో చేప్టటాలని గత ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ విధంగా ప్రణాళికలు చేయాలనే దానిపై ఇంకా అధికారులు ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో ఈ ఏడాది రబీ సాగు అనంతరం చేపట్టే పచ్చిరొట్ట సాగుకు రాయితీపై ప్రభుత్వం విత్తనాలు విక్రయించలేదు. దీంతో రైతులంతా విత్తనాల కోసం బయట వ్యాపారులను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా ఈ నెలాఖరు నుంచి రుతువపనాలు రానున్నాయి. దీంతో పాటు ఇటీవల కాలంలో అడపా, దడపా వర్షాలు కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో రైతులు దుక్కులు చేసి ఖరీఫ్ సాగునకు సన్నద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో ఈ విధమైన పరిస్థితులున్నా వ్యవసాయశాఖ మాత్రం విత్తనాలుపై ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. -
గ్రేటర్ ఎన్నికలకు సన్నాహాలు
సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రతిపాదనలు భీమిలి, అనకాపల్లికి మినహాయింపు సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాధారణ ఎన్నికల తర్వాత వీటిని నిర్వహించాలని ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే భీమిలి-జీవీఎంసీ మధ్యనున్న పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. దీంతో భీమిలి విలీనంపై నీలినీడలు అలముకున్నాయి. మరోవైపు అనకాపల్లిని కూడా మినహాయించి, 72 వార్డులతోకూడిన జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. భీమిలి విలీనం వెనక్కి? తొలిసారిగా 2008-09లో అనకాపల్లి, భీమిలి విలీన ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలత వ్యక్తం చేస్తూ 2010లో జీవీఎంసీ పాలక మండలి అనుమతి కోరింది. అదే సమయంలో జన గణన జరుగుతోంది. దీంతో అనకాపల్లి ఎంపీ సబ్బం హరితోపాటు టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన మెజార్టీ సభ్యులు విలీనాన్ని వ్యతిరేకించారు. పాలకవర్గం పదవీకాలం ముగిశాక బి.రామాంజనేయులు జీవీఎంసీ కమిషనర్‌గా ఉన్నప్పుడు మళ్లీ ఈ ప్రతిపాదనలు జోరందుకున్నాయి. జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు దీనికి ఆయనకు వత్తాసుగా నిలవడంతో మూడు స్థానిక సంస్థల నుంచి అంగీకార లేఖల్ని ప్రభుత్వానికి నివేదించారు. వీటన్నింటి ఆధారంగా గతేడాది జూలైలో భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీలతోపాటు, ఇరు ప్రాంతాలకు జీవీఎంసీని అనుసంధానిస్తూ.. ఉన్న చెరో ఐదు ప్రంచాయతీలను కూడా విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికులు కోర్టునాశ్రయించడంతో భీమిలిని ఆనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయతీల విలీనాన్ని రద్దు చేస్తూ వాటికి ఎన్నికలు నిర్వహించారు. దీంతో భీమిలికి, జీవీఎంసీకి మధ్య లింకు తెగింది. ఈ నేపథ్యంలో భీమిలి విలీనాన్ని కూడా ఉపసంహరించుకునే దిశగా పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ(ఎంఏయూడీ) ఫైల్ సిద్ధం చేసింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో దీనిపై నిర్ణయం వాయిదా పడింది. అనకాపల్లిదీ అదే దారి! భీమిలి విలీన ఉపసంహరణపై ఓ నిర్ణయానికి వచ్చేశారన్న వార్తలతో అనకాపల్లి, దాన్ని ఆనుకుని ఉన్న ఐదు పంచాయతీలపైనా సందిగ్ధం నెలకొంది. దీన్ని కొనసాగిస్తే వార్డుల పునర్విభజన చేపట్టాలి. జన గణన చేయాలి. సామాజిక వర్గాల వారీ జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేయాలి. వీటన్నింటికీ కనీసం ఆరు మాసాల నుంచి ఏడాది సమయం పడుతుందని అధికారులు చెప్తున్నారు. గరిష్టంగా నాలుగు వార్డులకు మించి పెరగని దానికోసం అంత సమయం వృథా చేయడం ఎందుకని అధికారులు ఆలోచిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే జీవీఎంసీ పాలక మండలి లేక రెండేళ్లు దాటిపోయింది. ఈ విషయాన్ని ఇప్పటికే జీవీఎంసీ యంత్రాంగం ఎంఏయూడీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దీంతో భీమిలి, అనకాపల్లి లేకుండానే జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సాధారణ ఎన్నికలు ముగిశాక, కొత్త ప్రభుత్వ హయాంలో వీలైనంత వేగంగా ఈ ప్రక్రియ ముగించడానికి ఎంఏయూడీ ఏర్పాట్లు చేస్తోంది. -
కాంగ్రెస్‌పై మరో మచ్చ
చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రత్యేక ఈలంను కోరుతున్న అక్కడి తమిళులను శ్రీలంక ప్రభుత్వం ఊచకోత కోసింది. వేలాది మంది ప్రాణాలు హరించిపోగా, స్త్రీలు ధన, మాన ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై భారత్‌లో శరణార్థులుగా తలదాచుకుంటున్నారు. శ్రీలంక మారణకాండ సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం తగినరీతిలో స్పందించలేదు. ఆ తరువాత వచ్చిన ఎన్నికల్లో ఘోరపరాజయం కావడం ద్వారా డీఎంకే భారీ మూల్యమే చెల్లించుకుంది. శ్రీలంక దేశాధ్యక్షుడు రాజపక్సేను యుద్ధనేరస్తుడిగా ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ ముందు నిలబెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా తమిళులు భారతదేశాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అంతేగాక శ్రీలంక దేశానికి చెందిన ఎవరినీ దేశంలో కాలుమోపనీయకుండా నిరసనలు చేపడుతున్నారు. తమిళనాడుకు వచ్చిన వారిని తరిమి కొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఐరాస మానవహక్కుల కౌన్సిల్లో శ్రీలంక వైఖరిని నిరసిస్తూ అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానికి 23 దేశాలు మద్దతు పలకగా, 12 దేశాలు వ్యతిరేకించాయి, 11 దేశాలు అభిప్రాయాన్ని తెలపకుండా పరోక్షంగా ఆమెరికా తీర్మానాన్ని తిరస్కరించాయి. ఈ 11 దేశాల్లో భారత్ కూడా ఉండడం తమిళుల ఆగ్రహానికి కారణమైంది. భారత్ మద్దతు తెలపాల్సింది : పి చిదంబరం శ్రీలంకకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన తీర్మానాన్ని కేంద్రం బలపరిచి ఉండాల్సిందని కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం వ్యాఖ్యానించారు. చెన్నై మీనంబాకం విమానాశ్రయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్మానం విషయంలో అన్నాడీఎంకే అమెరికాకు వ్యతిరేకంగానూ, డీఎంకే అనుకూలంగా వ్యవహరించడం వల్లనే కేంద్రం తటస్థంగా ఉండిపోయిందని అన్నారు. శ్రీలంక తీరును నిలదీసేందుకు ఐరాస మాత్రమే కాదు ఇంకా అనేక అంతర్జాతీయ వేదికలు ఉన్నాయని, అపుడు ఒత్తిడితేవచ్చన్నారు. అయినా ఈ విషయం విదేశాంగ మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తుందని తప్పించుకున్నారు. తమిళుల ఆవేదన : కరుణానిధి శ్రీలంకపై భారత్ ఉదాసీన వైఖరిని అవలంభించడం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు ఆవేదన చెందారని డీఎంకే అధినేత కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. భారత ప్రభుత్వమే దేశంలోని తమిళుల మనోభావాలను కాలరాసిందని అన్నారు. తమిళుల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నా రాష్ట్రంలోని ఆ పార్టీ నేతలు అంగీకరించరని విమర్శించారు. దేశవ్యాప్త సమస్యలను పక్కనపెడితే రాష్ట్ర స్థాయిలో జఠిలంగా మారిన సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కేంద్ర బిందువుగా మారింది. శ్రీలంక యుద్ధం, తమిళ జాలర్లకు ఆ దేశం వల్ల వేధింపులు, రాజీవ్ హంతకులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన క్షమాభిక్షను అడ్డుకోవడం కాంగ్రెస్‌కు శాపాలుగా మారాయి. వీటికి అదనంగా అమెరికా తీర్మానం మచ్చ పడింది. -
చిక్కిన సంచి
అమ్మహస్తం సరుకుల్లో కోత తగ్గుతున్న నిత్యావసరాల కేటాయింపు సకాలంలో సరఫరా కాని వస్తువులు ఇబ్బందులు పడుతున్న కార్డుదారులు సరకుల సంచి చిక్కిపోతోంది. నెలకో వస్తువు మాయమైపోతోంది. నిత్యావసర వస్తువుల కేటాయింపుల్లోనూ కోతపడుతోంది. ప్రస్తుతం సంచిలోని తొమ్మిది సరుకులు ఐదుకు కుదించుకు పోయాయి. మొత్తంగా అమ్మహస్తం పథకం అస్తవ్యస్తంగా మారింది. నిత్యావసర సరకులు ఎప్పుడు వస్తాయో.. చౌక దుకాణాల ద్వారా ఎప్పుడు సరఫరా చేస్తారో తెలియని దుస్థితి. కొన్ని సరకులు నాణ్యంగా లేకపోవడం.. మరికొన్ని సక్రమంగా ఇవ్వకపోవడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. విశాఖ రూరల్, న్యూస్‌లైన్: రేషన్ దుకాణాల ద్వారా తెల్లరేషన్‌కార్డుదారులకు రూ. 185కే 9 నిత్యావసర సరకులు అమ్మహస్తం పథకంలో అందిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గతే ఏడాది ఏప్రిల్‌లో ఆర్భాటంగా ప్రారంభించింది. ఎన్నికల ప్రచారాస్త్రంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రభుత్వం కనీసం ఏడాది కూడా సక్రమంగా నడపలేక చేతులెత్తేసింది. ప్రారంభం నాటి నుంచి ఒక్క నెల కూడా సరకులను సక్రమంగా స కాలంలో జిల్లాకు కేటాయించలేదు. ప్రతీ నెలా ఏదో ఒక వస్తువు ఆలస్యంగానో లేదా తక్కువగానో కేటాయిస్తూ వచ్చింది. తాజాగా ఆ సరుకుల్లో కూడా కోత పెట్టింది. కారం, పసుపు,ఉప్పు,చింతపండు కేటాయింపులను పూర్తిగా నిలిపివేసింది. నాణ్యత లేక అయిష్టత : అమ్మహస్తం పథకంలో కొన్ని సరకులపై కార్డుదారులు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. కొన్నింటిని అసలు చౌక దుకాణాల నుంచి విడిపించడం లేదు. ప్రధానంగా ఉప్పు, గోదుమపిండి అధ్వానంగా ఉంటున్నాయి. వీటిపై కార్డుదారులు ఆసక్తి చూపడం లేదు. ఒక్కోసారి కందిపప్పు కూడా బాగుండడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా జిల్లాకు నెలా నెలా కేటాయింపులు తగ్గిపోతూ వచ్చాయి. డిమాండ్‌ను బట్టి అధికారులు సరకుల ఇండెంట్‌ను పెడుతున్నారు. అయినప్పటికీ ప్రతీ నెలా సరకులు మిగిలిపోతూనే ఉన్నాయి. ఈ సరకులు డీలర్లకు కూడా నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండు నెలల క్రితం వరకు అవసరం మేరకు మాత్రమే పసుపు, కారం, చింతపండులను కేటాయిస్తూ వచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తిగా వాటిని ఇవ్వడం మానేసింది. వీటి నిలుపుదలకు సంబంధించి అధికారుల వద్ద కూడా ఎటువంటి సమాచారం లేదు. సకాలంలో సరఫరా కాని సరకులు : మిగిలిన సరకులు కూడా సక్రమంగా సరఫరా కావడం లేదు. ప్రతీ నెలా పంచదార, కందిపప్పు,పామాయిల్ కేటాయింపుల్లో కోత పడుతూనే ఉంది. అది కూడా ఒకేసారి జిల్లాకు రాకపోవడంతో కార్డుదారులు వాటి కోసం రేషన్‌దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. -
మోగిన మునిసిపల్ నగారా
ఎన్నికల నోటిఫికేషన్ జారీ వరంగల్ కార్పొరేషన్లో వాయిదా జనగామ, మానుకోట మునిసిపాలిటీలు... నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగర పంచాయతీలకు ఎన్నికలు మార్చి 30న పోలింగ్.. ఏప్రిల్ 2న ఫలితాలు జిల్లావ్యాప్తంగా అమల్లోకి వచ్చిన ‘కోడ్’ నెల రోజుల్లో కొలువుదీరనున్న కొత్త చైర్మన్లు సాక్షి, హన్మకొండ: మరో నెలరోజుల్లో జిల్లాలోని మునిసిపాలిటీలు, నగర పంచాయతీల్లో కొత్త చైర్మన్లు కొలువుదీరనున్నారు. మూడేళ్లకుపైగా అధికారుల పాలనలో ఉన్న ఈ పురపాలికలు ప్రజాపాలనలోకి రానున్నాయి. ఈ నెల 30న ఎన్నికలు జరగనుండగా... ఏప్రిల్ రెండో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్లో మాత్రం మరికొద్ది కాలం ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది. మునిసిపాలిటీ ఎన్నికల నోటిఫికేషన్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. జిల్లాలో వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌తో పాటు జనగామ, మహబూబాబాద్ మునిసిపాలిటీలు, నర్సంపేట, పరకాల, భూపాలపల్లి నగరపంచాయతీలు ఉన్నాయి. వీటిలో వరంగల్ కార్పొరేషన్‌ను మినహాయిస్తే... మిగిలిన వాటికి ఎన్నికలు జరగనున్నాయి. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్‌కు సంబంధించి విలీన గ్రామాలపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. కానీ.. వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని కోర్టు స్పష్టం చేయడంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. మిగిలిన మునిసిపాలిటీలు, నగరపంచాయతీలకు ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ నెల పది నుంచి నుంచి 14వ తేదీ వరకు పోటీలో ఉండే అభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు స్వీకరించనున్నారు. 15న స్క్రూట్నీ నిర్వహించడంతోపాటు అదేరోజు మునిసిపాలిటీల వారీగా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. నామినేషన్లను ఉపసంహరణ ఘట్టం 18వ తేదీ వరకు కాగా... అనంతరం కీలక ప్రక్రియ పోలింగ్ 30వ తేదీన ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే ఏప్రిల్ ఒకటో తేదీన రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మరుసటి రోజు అంటే... ఏప్రిల్ రెండో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. -
పొరుగు రాష్ట్రాలకు విద్యుత్
విక్రయానికి సిద్ధమవుతున్న చక్కెర కర్మాగారాల యాజమాన్యాలు పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇక్కట్లే సాక్షి, బెంగళూరు : చెరకు మద్దతు ధర విషయమై చెరకు కర్మాగారాల యాజమాన్యానికి తలొగ్గిన ప్రభుత్వం ఇప్పుడు ఆయా చక్కెర పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ అమ్మకం విషయంలోనూ ఉదాసీన వైఖరి అవలంభిస్తున్నట్లు వివ ుర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 9,221 మెగావాట్లకు చేరుకుంది. అయితే రాష్ట్రంలో వివిధ రూపాల్లో విద్యుత్ లభ్యత 8,600 మెగావాట్లకు మించడం లేదు. దీంతో రాష్ట్రంలో చాలా చోట్ల అప్రకటిత విద్యుత్ కోతలు ఉంటున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల్లో ఉన్న కో-జనరేషన్ ప్లాంట్ల వల్ల 450 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ విద్యుత్ కొనుగోలు కోసం కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (కేపీటీసీఎల్) సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం యూనిట్‌కు రూ.5.50 చెల్లించడానికి కూడా అంగీకరించింది. అయితే యూనిట్ విద్యుత్‌కు రూ.6.50 చెల్లించాలని చక్కెర కర్మాగారాల యాజమాన్యం పట్టుబడుతోంది. ప్రస్తుతం కేపీటీసీఎల్ వివిధ రూపాల్లో కొనుగోలు చేస్తున్న విద్యుత్‌కు కనిష్టంగా రూ.4.50 గరిష్టంగా రూ.5.50 చెల్లిస్తోంది. అందువ ల్ల చక్కెర మిల్లుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌కు కూడా అంతే చెల్లించగలమని కర్ణాటక పవర్ ట్రాన్స్మిషన్ కార్పోరేషన్ లిమిటెడ్ అధికారులు చెబుతున్నారు. అయితే తక్కువ ధరకు తాము విక్రయించలేమని చెబుతూ చక్కెర కర్మాగారాల యాజమాన్యం పొరుగు రాష్ట్రాలకే విద్యుత్ అమ్మడానికి నిర్ణయించుకున్నాయి. విద్యుత్ డిమాండ్ ఎక్కువగా ఉన్న ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న విద్యుత్ కూడా పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లి పోతే ఇక్కడి ప్రజలు చీకట్లలోనే మగ్గిపోవాల్సి వస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిస్సహాయస్థితి యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మాలని చెబుతూ రాష్ట్ర విద్యుత్ చట్టంలో మార్పు తీసుకువచ్చారు. అయితే గత ఏడాది చక్కెర కర్మాగారం యజమానులు హైకోర్టుకు వెళ్లి తాము ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను బయటి రాష్ట్రాలకు కూడా అమ్ముకోవడానికి అనుమతి తీసుకువచ్చారు. దీంతో ప్రభుత్వం కూడా ఈ విషయంలో పట్టన ట్టు వ్యవహరించి బయటి రాష్ట్రాలకు విద్యుత్ అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయంపై ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి మాట్లాడుతూ... పరిశ్రమల స్థాపనకు, నిర్వహణకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు తీసుకుంటున్న యాజమాన్యం కేవలం సొమ్ము ఎక్కువ వస్తుందన్న కారణంతో రాష్ట్ర ప్రజలను ఇక్కట్లపాలు చేయడం సరికాదు. ఇక రాష్ట్రంలోని చక్కెర కర్మాగారాల్లో చాలావరకూ అధికార పార్టీ నాయకులవే. అందువల్ల ప్రభుత్వం కూడా ఏమి చేయలేకపోతోంది.’ అని పేర్కొన్నారు. -
టెన్త్ డ్రాపౌట్లకు స్వయం ఉపాధిలో శిక్షణ
జిల్లాలో నాలుగు కళాశాలల ఎంపిక డ్రాపౌట్లను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే పలమనేరు, న్యూస్‌లైన్: పదో తరగతి పాస్ లేదా ఫెయిలై డ్రాపౌట్స్‌గా మారిన విద్యార్థులను గుర్తించి వారికి స్వయం ఉపాధిలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే ఎంఈఎస్ (మాడ్యులర్ ఎంప్లాయబుల్ స్కిల్స్) కార్యక్రమానికి జిల్లా వృత్తి విద్యాశాఖ నడుం బిగించింది. ఆ మేరకు జిల్లాలోని పలమనేరు, చంద్రగిరి, చిత్తూరు, కుప్పం ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఈ ప్రత్యేక శిక్షణకు పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ఇప్పటికే ఈ కళాశాలల వద్ద శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలను డీవీఈవో సుజనమల్లిక పర్యవేక్షించారు. సంబంధిత మండలాల్లో పదో తరగతి విద్యార్థుల వివరాల సేకరణ పూర్తయింది. వీరందరూ ఉన్నత చదువులకు వెళ్లారా లేక చదువు మానేశారా అనే విషయమై సర్వే నిర్వహించా రు. సుమారు 30 శాతం మంది విద్యార్థులు ఖాళీగానే ఉన్నట్టు తేలింది. వీరికి పలు వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ ఇవ్వాలనే తలంపుతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఇందులో భాగంగా ఎంపికైన మండలాల్లో ఎంఈవో, కళాశాల ప్రిన్సిపాల్, ప్రధానోపాధ్యాయులతో మండల లెవల్ కమిటీని ఏర్పాటు చేశారు. వీరు డ్రాపౌట్స్ వివరాల ప్రకారం వారి ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడి శిక్షణ కేంద్రాలకు విద్యార్థులు వచ్చేలా చొరవ తీసుకుంటారు. అనంతరం విద్యార్థులకు పలు విభాగాల్లో శిక్షణ ఇచ్చి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తారు. ప్రస్తుతం ఎనిమిది నుంచి పదో తరగతి చదువుతూ ఆసక్తి ఉన్న విద్యార్థులకు సైతం ఇదే కోర్సుల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. -
కాకతీయ శకటానికి నోచాన్స్
వరంగల్, న్యూస్‌లైన్ : కాకతీయుల చరిత్రను చాటిచెప్పే సువర్ణావకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్‌లో కాకతీయ శకట ప్రదర్శనకు అవకాశం రాలేదు. అసలు రాష్ట్రం నుంచే ఏ శకట ప్రదర్శనకు నోచుకోకపోవడం గమనార్హం. గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో ‘కాకతీయ శకటాన్ని’ ప్రదర్శించాలని ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు చాలా రోజుల క్రితమే పంపించారు. ఇందుకు రక్షణ శాఖ చివరి నిమిషంలో నో చెప్పిం ది. ఈ చర్య ఓరుగల్లు వాసులను తీవ్రంగా నిరాశ పరిచింది. రాష్ట్రానికి 2009 నుంచి రిపబ్లిక్ డే పరేడ్‌లో శకటాన్ని ప్రదర్శించేందుకు అవకాశం లభించక పోవడం గమనార్హం. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులే ఇందుకు కారణంగా భావిస్తున్నారు. -
అది మావోడికే..
రూ.147 కోట్ల పనికి అధికార పార్టీ నేత పట్టు ఎన్‌హెచ్-365 విస్తరణ పనులకు ‘టెండర్’ తాను చెప్పిన వారికే కట్టబెట్టాలని బెట్టు ఎన్నికల ‘నిధి’ సేకరణకు యత్నాలు పూర్తిగా సహకరిస్తున్న కేంద్ర మంత్రి సాక్షి ప్రతినిధి, వరంగల్ : రాజకీయ పయనంలో కీలకమైనది ఎన్నికల పోరు. ఇందులో ముందుండేందుకు ప్రధాన వనరు అరుున నిధుల విషయంలో అధికార పార్టీ నేతలు ఇప్పటినుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూక్తిని చక్కగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులతో చేపట్టిన పనులను సొంత వ్యక్తులకు కట్టబెట్టి... ఎన్నికల ఖర్చును సమీకరించుకునే పనిలో వేగం పెంచారు. ఇందులో భాగంగా అర్హత ఉన్న ఇతర కాంట్రాక్టర్లను పక్కనబెట్టే పనిలో పడ్డారు. మంచిగా చెప్పి ఒప్పించడం... వినకుంటే వారిని బెదిరించడం చేస్తున్నారు. కొత్తగా మంజూరైన జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించి రూ.147 కోట్ల ప్యాకేజీ పనుల కాంట్రాక్ట్‌ను కట్టబెట్టే వ్యవహారం ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత కనుసన్నల్లోనే జరుగుతోంది. తన నియోజకవర్గంలో జరిగే ఈ పనుల కాంట్రాక్ట్‌ను తాను చెప్పిన వారికి ఇస్తే సరిపోతుందని... ఎన్నికల ఖర్చు కోసం ఏమీ ఇవ్వకున్నా ఫర్వాలేదని ఆ ముఖ్య నేత స్పష్టం చేయడంతో కేంద్ర మంత్రి సైతం ఇందుకు తలాడించినట్లు సమాచారం. మహారాష్ట్రలోని సిరొంచ నుంచి చిత్తూరు జిల్లా రేణిగుంట వరకు 643 కిలోమీటర్ల మేర చేపట్టిన జాతీయ రహదారి (ఎన్‌హెచ్-365) మన జిల్లాలో ములుగు, నర్సంపేట, గూడూరు, మహబూబాబాద్, మరిపెడ ప్రాంతాలను కలుపుతూ తానంచర్ల మీదుగా నల్లగొండ జిల్లాకు వెళ్తుంది. మన జిల్లాలో 115 కిలోమీటర్లు ఉన్న ఈ రహదారి పనులను రెండు ప్యాకేజీలుగా చేపట్టారు. మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్లు, రెండో ప్యాకేజీలో రూ.127 కోట్లు కేటాయించారు. ప్రొక్యూర్మెంట్ పద్ధతిలో ప్రస్తుతం టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. రూ.147 కోట్లతో చేపట్టే ప్యాకేజీ పనులను జిల్లాలోని కాంగ్రెస్ ముఖ్యనేత ఒకరు హైదరాబాద్‌కు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు ఇప్పించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ టెండర్‌ను 7 శాతం పెంచి రూ.157 కోట్లకు ఇప్పిస్తే... మొత్తం ప్యాకేజీలో 10 శాతం కమీషన్ ఇచ్చేలా కాంట్రాక్టర్, అధికార పార్టీ ముఖ్యనేతకు మధ్య ఒప్పందం జరిగినట్లు తెలిసింది. అరుుతే అంచనా మొత్తాన్ని పెంచాలంటే... ఒకే టెండరు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఎవరూ టెండర్ వేయకుండా కాంగ్రెస్‌కు చెందిన సదరు ముఖ్యనేత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలు పనులను ఇదే తరహాలో తాను అనుకున్న కాంట్రాక్టర్‌కు ఇప్పించిన అనుభవం ఉన్న ఆ నేత... ఇప్పుడు అన్ని పార్టీల వారిని దీనికోసం సంప్రదిస్తున్నారు. ముందుగా నిర్ణయించిన రూ.147 కోట్ల కంటే అంచనాలను పెంచి అనుకున్న కాంట్రాక్టర్‌కు టెండర్ ఇప్పించేందుకు కేంద్ర మంత్రి సహకారం కూడా తీసుకుంటున్నట్లు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. మొదటి ప్యాకేజీలో రూ.147 కోట్ల పనులకు టెండర్లు వేయవద్దని, ఈపీసీ పద్ధతిన టెండర్లు వేస్తే... గతంలో చేసిన పనుల నాణ్యతపై చర్యలు తీసుకునేలా చేస్తానని కేంద్ర మంత్రి స్థాయిలో బెదిరింపులు వస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు. ఎన్నికల తరుణంలో ఈ ఒక్కసారి తమ మాట వినాలని లేకుంటే... బ్లాక్ లిస్ట్‌లో పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నట్లు సమాచారం. -
భూ సర్వే కోసం రూ. 900 కోట్లు రిజర్వు
= 1800 మంది సర్వేయర్ల నియామకం = రాష్ట్ర రెవెన్యూ మంత్రి శ్రీనివాసప్రసాద్ కోలారు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో భూ సర్వే చేయడానికి రూ. 900 కోట్లు రిజర్వు చేశామని, ఇందులో రూ. 90 కోట్లు ఇప్పటికే విడుదల చేశామని రాష్ట్ర రెవెన్యూ మంత్రి వి శ్రీనివాసప్రసాద్ అన్నారు. బుధవారం శ్రీనివాసపురం పట్టణంలోని బాలికల జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన వివిధ పథకాలకు సంబంధించిన లబ్దిదారులకు ప్రమాణ పత్రాలు అందజేసి మాట్లాడారు. రెవెన్యూలో పలు సమస్యలు ఉన్నాయని, సర్వేయర్ల కొరత వల్ల సమస్యలు ఎక్కువ అవుతున్నాయని, ఈ నేపథ్యంలో సీఅండ్‌ఆర్ (క్యాడర్ అండ్ రిక్రూట్మెంట్ రూల్స్) ద్వారా 1800 మంది సర్వేయర్ల నియమించి శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని రాష్ట్ర భూ ప్రదేశాన్ని సర్వే చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దీనికి సర్వేయర్ల కొరత ఏర్పడితే లెసైన్సు కలిగిన ప్రైవేటు సర్వేయర్లను ఎంపిక చేసుకుని సర్వే పనులకు వినియోగించుకుంటామన్నారు. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ అదాలత్‌లను నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు పింఛన్ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా శ్రీనివాసపురం పట్టణంలో మిని విధానసౌధ నిర్మాణానికి రూ. 5 కోట్లు విడుదల చేశామన్నారు. కేంద్రమంత్రి కేహెచ్ మునియప్ప మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే పలు సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు. బయలు సీమ జిల్లాలో ఏర్పడిన నీటి సమస్య నివారణకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య సిద్దరామయ్య చొరవ చూపాలన్నారు. శ్రీనివాసపురంలో త్వరలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ప్రారంభమవుతందని, దీనికి రూ. 1500 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు అనిల్‌కుమార్, జెడ్పీ అధ్యక్షుడు తూపల్లి నారాయణస్వామి, కలెక్టర్ డీకే రవి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే రమేష్‌కుమార్ ఆక్రోశం ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ స్పీకర్, ఎమ్మెల్యే రమేశ్ కుమార్ తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. మంత్రలందరూ గౌరవనీయులంటే తాను ఒప్పుకొనేది లేదన్నారు. నేటి రాజకీయాలు కలుషితమవుతున్నాయని, పైరవీలు చేసే వాళ్లు, ధనవంతులకే అవకా శాలు వస్తున్నాయన్నారు. ఇదిలా ఉంటే తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతోనే రమేశ్ కుమార్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. -
ప్రభుత్వం రైతులను మోసగిస్తోంది
సాక్షి, బెంగళూరు : రైతు సంక్షేమం పేరుతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా మోసం చేస్తోందని మా ముఖ్యమంత్రి, శాసన మండలి విపక్ష నాయకుడు సదానందగౌడ ఆరోపించారు. విధానసౌధలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన సోమవారం మాట్లాడారు. వక్క వల్ల ఎటువంటి హాని లేదని అందువల్ల ఆ పంట నిషేధం ఆలోచనలేదని చెబుతున్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సుప్రీం కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో మాత్రం వక్కలో హానికరమైన రసాయనాలు ఉన్నాయని ఎందుకు పేర్కొన్నారో రైతులకు చెప్పాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కురిసిన అధిక వర్షాల వల్ల రూ.625 కోట్ల విలువైన వ్యవసాయ పంటలు నీటిలో మునిగిపోయాయన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రభుత్వానికి అందించిన నివేదికలో పేర్కొందన్నారు. అయితే ప్రభుత్వం రూ.25 కోట్లు మాత్రం విడుదల చేసి రైతులను అన్నివిధాలుగా ఆదుకున్నామని జబ్బలు చరుచుకుంటోందన్నారు. ఈ విధంగా ద్వంద్వ విధానాలతో రైతులను మభ్యపెడుతున్న సీఎం సిద్ధరామయ్యకు ఆ పదవిలో కూర్చొనే నైతికత లేదన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు రోషన్‌బేగ్, డీకే శివకుమార్‌లకు మంత్రిపదవులు ఎలా కేటాయిస్తారని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. సిద్ధరామయ్య మాటపై నిలబడే మనిషి కాదన్నారు. ఇలాంటి వారు ముఖ్యమంత్రి వంటి ఉన్నత పదవిలో ఎలా కొనసాగుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు దివాళా తీస్తోందన్నారు. అదే విధంగా రోడ్ల మరమ్మతుల విషయంలో, సీఈటీ సమస్య పరిష్కారంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సదానందగౌడ దుయ్యబట్టారు. -
విధి విషాదమిది!
=పేద కుటుంబంపై పగబట్టిన దురదృష్టం =ఏడాదిలో తల్లిదండ్రులు మృత్యువాత =తాజాగా అనారోగ్యంతో కుమారుడి మృతి =ఒంటరిగా మిగిలిన కుమార్తె =బామ్మే తోడూనీడా రావికమతం, న్యూస్‌లైన్: ‘విధి ఒక విషవలయం’ అన్న కవి వాక్కు ఆ కుటుంబం విషయంలో అక్షర సత్యమేమో! కొన్ని బతుకులకు దురదృష్టం వెంటాడి మరీ వేధించి వినోదిస్తుందనడానికి ఆ పేద జీవితాలు ప్రత్యక్ష సాక్ష్యమేమో.. అందుకే మృత్యువు పగబట్టి మరీ ఆ నిస్సహాయులను వెంటాడింది. ఒకరి వెంట ఒకరిగా ముగ్గురిని బలి తీసుకుని చోద్యం చూసింది. ముందు తల్లిని, తర్వాత తండ్రిని కబళించిన మృత్యువు ఇప్పుడు కుమారుడినీ మింగేసింది. ఒంటరిగా మిగిలిన బాలిక వేదనతో విలవిలలాడుతూ ఉంటే వినోదిస్తోంది. రావికమతానికి చెందిన శానాపతి అప్పారావు, అతని భార్య రాజు ఈ ఏడాది నెలల వ్యవధిలో మృతి చెందారు. దీంతో టెన్త్ పాసైన కుమారుడు మణికంఠ (16), ఎనిమిదో తరగతి చదువుతున్న కుమార్తె అంజలి అనాథలయ్యారు. పింఛనుతో కాలం వెళ్లదీస్తున్న వారి నాయనమ్మ సోములమ్మపై ఆధారపడ్డారు. బతుకు బండి నడవక పోవడంతో పుట్టెడు దుఃఖంలోనూ మణికంఠ చదువు మాని కిరాణా దుకాణంలో పనికి చేరాడు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ‘విధి వంచితులు’ శీర్షికన ఈ నెల 16న సాక్షి మానవీయ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. అయితే విధికి ఆ కుటుంబంపై ఇంకా పగ చల్లారినట్టు లేదు. తల్లిదండ్రులను కోల్పోయి, మానసికంగా ఆందోళనకు గురైన మణికంఠ తీవ్ర అనారోగ్యంతో మంగళవారం ఆకస్మికంగా మృతి చెందాడు. దీంతో ఆ చెల్లెలు ఒంటరిదైంది. నాయనమ్మతో పాటు అంజలి కన్నీరుమున్నీరవుతోంది. ఆమె విషాదాన్ని చూసి చుట్టాలు, బంధువులే కాదు... గ్రామస్తులూ కంటతడి పెడుతున్నారు. ఇలాంటి కష్టం మరెవ్వరికీ రాకూడదంటూ నిట్టూరుస్తున్నారు. అయిన వారిని కోల్పోయిన అంజలిని ఆదుకోవాలని అంతా కోరుతున్నారు.