దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని..
- ఇప్పుడైనా అందరి బతుకులు బాగుపడాలి
- అందుకోసం ప్రభుత్వం కృషి చేయాలి
- వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
- రంగథాంపల్లి వద్ద అమరవీరుల స్తూపానికి నివాళి
- ఘన స్వాగతం పలికిన పార్టీ శ్రేణులు
సిద్దిపేట జోన్: దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలు, అమరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వెళ్తూ మార్గమధ్యలో సిద్దిపేట మ ండలం రంగథాంపల్లి వద్ద ఆగి తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడు తూ... ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ బతుకులు బాగుపడతాయని తెలంగాణలోని ప్రతి బిడ్డా ఎదురు చూశారన్నారు. వారి బంగారు భవిష్యత్తు ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్‌రావు, జిల్లా అధ్యక్షుడు ప్ర భుగౌడ్, నాయకులు కొండా రాఘవరెడ్డి, శివకుమార్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్మ రవీందర్, కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నర్రా భిక్షపతి, నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు పట్లోల్ల సిద్ధార్థ్‌రెడ్డి, పార్టీ క్రమ శిక్షణ సంఘం అధ్యక్షుడు వీఎల్‌ఎన్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్‌గౌడ్, బాలన్న గౌడ్, పర్శరాంరెడ్డి, తడక జగదీశ్వర్, క్రీస్తు దాస్, సంజీవరావు, రాం రాజు, శ్రీశాంక్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
పొంగులేటికి ఘన స్వాగతం..
కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్తున్న పొంగులేటికి సిద్దిపేట మండలం రంగథాంపల్లి వద్ద పార్టీ శ్రేణులు ఆదివారం ఘన స్వాగతం పలికాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుగౌడ్, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి తడక జగదీశ్వర్ నేతృత్వంలో పార్టీ నేతలు పూలమాలలు వేసి, బొకేలు అందజేశారు. సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించారు