తమ సమస్యల పరిష్యారం కోసం మరమగ్గాల కార్మికులు పక్షం రోజులుగా చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని...
- కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం డిమాండ్
- సంఘాల మధ్య ప్రభుత్వం చీలికలు తెస్తోందని ఆరోపణ
- సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని హితవు
- సవరించిన వేతనాలు చెల్లించేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వెల్లడి
షోలాపూర్: తమ సమస్యల పరిష్యారం కోసం మరమగ్గాల కార్మికులు పక్షం రోజులుగా చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం ఆరోపించారు. సమస్య పరిష్యారం కోసం దృష్టి సారించాల్సిన పాలకులు కార్మిక సంఘాలను చీల్చి ఉద్యమాన్ని నీరు గార్చే ప్రయత్న చేస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. శుక్రవారం ఎం.ఐ.డి.సి.లో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఆయన.. ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా కనీస వేతనాలు అమలు జరిగే వరకు ఆందోళనలు విరమించేది లేదని తేల్చి చెప్పారు. కార్మికులతో పాటే ఉంటానని, కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.
మరమగ్గాల కార్మికులకు సవరించిన వేతనాలు వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తూ మే 1వ తేది నుంచి కార్మికులు సమ్మె చేస్తున్నారు. దీంతో పట్టణంలో, ఎం.ఐ.డి.సి., గాంధీ నగర్, చించోలి ప్రాంతాల్లోని సంచాల చప్పుడు మూగబోయింది. మరమగ్గాల కార్మికుల కోసం ఎం.ఎన్.ఎస్, సి.ఐ.టి.యు., ఎం.ఐ.ఎం, కామగార్ సేన వంటి 8 సంఘటనలు పనిచేస్తున్నాయి. సంఘటనలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి కార్మిక నాయకుడు నర్సయ్య ఆడం, విష్ణు కారంపూరి కార్మిక సంయుక్త కృతి సమితి స్థాపించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఎం.ఎన్.ఎస్ సంఘటన ద్వారా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆరు రోజుల పాటు నిరాహార దీక్ష నిర్వహించారు. అయితే కార్మిక మంత్రి విజయ్ దేశ్‌ముఖ్ వేతనాలు కొంత పెంచి ఇస్తామనటంతో ఎం.ఎన్.ఎస్. కార్మిక సంఘటన సమ్మె నుంచి నిష్ర్కమించింది. దీనిపై తీవ్రంగా మండిపడిన నర్సయ్య.. సమస్య పరిష్కరించడం పోయి కార్మిక సంఘటనల్లో మంత్రి చీలికలు తెస్తున్నారని ఆరోపించారు.
గాంధీనగర్ శాంతియుంతంగా ఆందోళన చేస్తున్న కార్మికులపై పోలీసులతో లాఠీ చార్జీ చేయించడం అమానుషమన్నారు. 20వ తేదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మరమగ్గాల కార్మికులతో ముంబైలో నిర్వహించే ఆందోళనకు ప్రభుత్వం దిగి రావల్సిందేనన్నారు. పోలీసుల చర్యలపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. కార్మికులను పోలీసులు వేధిస్తున్నారని ఇది కూడా సదరు మంత్రి పనే అయి ఉంటుందని ఆరోపించారు. ఆందోళనలకు అడ్డుతగిలితే మం త్రిని పట్టణంలో సంచరివ్వబోమని హెచ్చరిం చారు. కార్యక్రమంలో పాల్గొన్న కృతి సమితి పదాధికారులు, కార్మికులు.. సవరించిన కనీస వేతనాలు చెల్లించేంతవరకుఆందోళన విరమించేది లేదని ప్రతిజ్ఞ చేశారు.