ఇసుక తోడేళ్లు
అక్రమార్కులకు కాసుల వర్షంకురిపిస్తున్న
ఇసుకసంఘాల ముసుగులో రూ.కోట్లు దండుకుంటున్న వైనం
ఇప్పటికే రూ.182.5 కోట్లఅక్రమార్జనజిల్లాలో ఇసుక రీచ్‌లన్నీ ఖాళీ
ధర్మవరం: జిల్లాలో ఇసుక రీచ్‌లు సగానికి పైగా ఖాళీ అయిపోయాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పచ్చతమ్ముళ్లు సహజ సంపదను కొల్లగొట్టారు. తద్వారా కోట్లాది రూపాయలు తమ జేబుల్లోకి వేసుకున్నారు. జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లలో 16.87 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక లభ్యమవుతుందని భూగర్భ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఇసుకను విక్రయించేందుకు అక్టోబర్, 2014 లో ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు అనుమతి ఇచ్చింది. అప్పటి నుంచి 2016 జనవరి ఆఖరు నాటికి 35 రీచ్‌ల పరిధిలో 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను డ్వాక్రా సంఘాల ద్వారా విక్రయించారు. రూ.19.98 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేకూరింది.
తెర వెనుక ఇలా..
ప్రతి రోజూ జిల్లాలోని 35 ఇసుక రీచ్‌లనుంచి నుంచి సగటున 100 నుంచి 120 లారీల ఇసుక ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం. పేరు డ్వాక్రా సంఘాలదే అయినా పెత్తనం మొత్తం అధికార పార్టీనేతల చేతిలో ఉండటంతో వారు అందినకాటికి అమ్మేసి రూ. కోట్లు వెనకేసుకున్నారు. ఇసుక రీచ్‌లలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఇసుకను తవ్వాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోతానే అనధికాధికారులు ఇసుక రీచ్‌లలోకి వెళ్లి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు ఇసుకను యధేచ్చగా తరలించేవారు. ఈ ఇసుకరీచ్‌లపై ఎటువంటి నిఘా లేకపోవడం, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వ తాత్సారం వెరసి జిల్లాలోని రీచ్‌లన్నింటినీ అక్రమార్కులు కొల్లకొట్టేశారు. ప్రతి రోజు జిల్లా నుంచి 100 నుంచి 120 దాకా లారీల ఇసుక జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు తరలుతోంది. ఒక్కో లారీకి 10 క్యూబిక్ మీటర్ల ఇసుకను నింపితే 100 లారీలకు 1200 క్యూబిక్ మీటర్ల ఇసుక బయటి ప్రాంతాలకు తరలిపోయింది. ఈ ప్రకారం ఒక్క ఏడాదిలోనే 4.38 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుకను అక్రమార్కులు జిల్లా దాటించి సొమ్ముచేసుకున్నారు. అనధికారికంగా జిల్లా దాటిపోయిన ఇసుకను బెంగళూరు, చిక్‌బళాపూర్, బళ్లారి, తదితర ప్రాంతాల్లో విక్రయించగా అక్రమార్కులకు చే కూరిన ఆదాయం చూస్తే కళ్లు బైర్లు కమ్మకపోవు.
సీపీరేవు రీచ్‌నుంచే వందలాది లారీల ఇసుక అక్రమ రవాణా
ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రోజుకు 30 నుంచి 40 దాకా ఇసుక లారీలు రాష్ట్ర సరిహద్దులు దాటించారు. తాడిమర్రి మండలం చిన్నచిగుళ్ల రేవు ఇసుక రీచ్ వద్దనుంచే ఈ ఏడాది వ్యవధిలో 12,000 లారీల ఇసుక అక్రమంగా తరలిపోయింది. ఆ ఇసుకను విక్రయించగా వారికి దాదాపు 60కోట్లు లాభం చేకూరింది. ఇసుక విక్రయాలు ఆపేసిన తరువాత ఈ అక్రమ తరలింపు రోజుకు 50నుంచి 60 లారీల మేర జరిగినట్లు సమాచారం. కేవలం 20 రోజుల వ్యవధిలోనే 1,000 లారీల ఇసుకను తరలించినట్లు రీచ్‌కు సమీపంలోని గ్రామస్థులు అవేదన వ్యక్తం చేశారు.
అధికారులపై ఆరోపణలు
అధికారుల అండతోనే ఇసుక వ్యాపారం మూడు డంపులు.. ఆరు లారీలుగా కొనసాగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుకాసురుల కనుసన్నల్లో పోలీసులు, రెవిన్యూ అధికారులు పనిచేస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. బహిరంగంగానే ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు చూడనట్లు వ్యవహరించడం వల్లనే ప్రజాదనం అక్రమార్కుల పాలైందని పలువు నేతలు వ్యాఖ్యానిస్తున్నార