ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్‌ | TRS leaders fires on Ravanth reddy | Sakshi
Sakshi News home page

ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్‌

Published Mon, Mar 6 2017 1:09 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్‌ - Sakshi

ఈటల నిప్పు.. ముట్టుకుంటే కాలిపోతావ్‌

రేవంత్‌పై టీఆర్‌ఎస్‌ నేతల ఫైర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ నిప్పులాంటి మనిషి, ముట్టుకుంటే కాలిపోతారని టీఆర్‌ఎస్‌ నేతలు టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుంచి ఈటల రాజకీయాల్లో ఉన్నారని, ఇప్పుడు ఆర్థికమంత్రిగా సమర్థంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హాస్టల్‌లో చదువుకున్న ఈటల కోరిక మేరకే తెలంగాణలోని హాస్టళ్లకు సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని, ఆ విజిలెన్స్‌ నివేదికను పట్టుకుని మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని రేవంత్‌ కలలు కంటున్నారని, కనీసం పోటీ చేసే అవకాశం కూడా వారికి ఉండదని వినోద్‌కుమార్‌ అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీనేత రేవంత్‌లు ఉన్మాదులుగా మారుతున్నారని కర్నె ప్రభాకర్‌ విమర్శించారు. అవినీతికి పాల్పడిన వాళ్లే మంత్రులపై ఆరోపణలు చేయడం.. ‘దొంగే దొంగా దొంగా’ అని అరిచినట్లు ఉందన్నారు. నోటికొచ్చింది వాగడం తప్ప రేవంత్‌ దగ్గర విషయమేం లేదని శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రాలు విడిపోయాక కూడా టీడీపీ నేతల కుట్రలు ఆగట్లేదని, తెలంగాణను అవమానించేలా మాట్లాడటం తగదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement