అంతా ఆన్‌లైన్ | Everything is online | Sakshi
Sakshi News home page

అంతా ఆన్‌లైన్

Published Mon, Nov 10 2014 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:09 PM

అంతా ఆన్‌లైన్

అంతా ఆన్‌లైన్

  •  10 అంశాలపై  వివరాలు సేకరిస్తున్న మున్సిపాలిటీలు
  •  జన్మభూమిలో వచ్చిన వినతులూ నమోదు
  •  ఏ శాఖకు ఆ శాఖే క్రోడీకరణ
  • అబద్వేలు :  మున్సిపాలిటీలకు సంబంధించి ఏ సమాచారమైనా ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే లభించనుంది. సూక్ష్మ ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల సమాచారాన్ని వార్డుల వారీగా సేకరించేందుకు అధికారులు శ్రీకారం చుట్టారు. పది అంశాలతో కూడిన సంక్షిప్త సమాచారాన్ని అన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఈ సమాచారంపై నివేదిక అందజేయాలని ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది.

    మున్సిపాలిటీలోని ఏ శాఖకు సంబంధించి వివరాలు ఆ శాఖే సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. జన్మభూమిలో ఈ వివరాలను సేకరించేందుకు నమూనాలను కూడా ప్రభుత్వం ఇప్పటికే అందజేసింది. అన్ని శాఖల అధికారులు సేకరించిన సమాచారాన్ని క్రోడీకరించి వాటిని అన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. భవిష్యత్తులో ఆయా శాఖలు చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించి సూక్ష్మ ప్రణాళిక తయారు చేసేందుకు ఈ సమాచారం కీలకంగా మారనుందని అధికారులు చెబుతున్నారు.
     
    నమోదు చేస్తున్న అంశాలివే
    పురపాలక సంఘాల్లో నిర్వహించిన జన్మభూమి సభల్లో ప్రజలు నుంచి వచ్చిన వినతులు, రేషన్‌కార్డులు, వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు, పింఛన్ల విన్నపాలు తదితర వివరాలు.
     
    మెప్మా ప్రాజెక్టు కింద ఉండే స్వయం సహాయక సంఘాలు, సంఘాల్లోని మహిళలు నిర్వహించే వ్యాపారాలు, కార్యకలాపాలు, మా ఇంటి మహలక్ష్మి లబ్ధిదారులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ రుణాలు, వాటి  వినియోగం.
     
    నీటి కుళాయిలు, నీటి సరఫరా, పైపులైన్ లీకేజీలు, సిమెంట్ రోడ్లు, కాలువలు, కల్వర్టులు, వీధి దీపాలు తదితర వివరాలు.
     
    మురుగునీటి పారుదల వ్యవస్థ, వీధులు, కాలువల పరిశుభ్రత, పారిశుద్ధ్య మెరుగునకు తీసుకుంటున్న చర్యలు.
     
     పట్టణ ప్రణాళిక విభాగం కింద మున్సిపాలిటీ పరిధిలోని వృక్షాల వివరాలు, ఇటీవల నాటిన మొక్కల వివరాలు, వాటి రక్షణ చర్యలు.
     
     వార్డుల్లోని పాఠశాలలు, వాటిలో ఉండే వసతులు, విద్యార్థుల సంఖ్య, బడి బయట ఉన్న పిల్లల వివరాలు, పట్టణంలోని విద్యావంతులు, ఐఐటీ, డిప్లమో చేసిన వారి సంఖ్య, వృత్తి విద్యా నిపుణులు, ఇతర దేశాల్లో ఉంటున్న వారు, ఉద్యోగులు, నిరుద్యోగులు వారి నివాసం వివరాలు.
     
      అంగన్‌వాడీ కేంద్రాలు, వాటిల్లోని పిల్లల వివరాలు, గర్భిణులు, వారి ఆరోగ్య  స్థితిగతులు..  బలహీనంగా ఉన్న చిన్నారుల సంఖ్య, ఇతర జబ్బులతో బాధ పడుతున్న వారి సంఖ్య .
     
     పశుసంవర్ధక శాఖ పరిధికి సంబంధించి మున్సిపాలిటీ పరిధిలోని ఆవులు, గేదెలు, గొర్రెలు, పొట్టేళ్లు, కోళ్ల వివరాలు. రోజు జరిగే పాల ఉత్పత్తి, వాటిని ఏయే పాలకేంద్రాలకు తరలిస్తున్నారనే వివరాలను సేకరిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement