పలమనేరు: ఇన్నాళ్లు పింఛన్ల కమిటి, ఇప్పుడేమో జన్మభూమి కమిటి ఇది అధికార పార్టీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు. జిల్లా స్థాయిలో జన్మభూమిలో ప్రాతినిథ్యం ఉండే లా ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలందా యి. జిల్లా కమిటీలతో పాటు మున్సిపల్, మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రణాళికా విభాగం నుంచి జీవో నెంబర్ 22 పేరిట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ నెల 20వ తేదీ వరకు జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి సంబంధించి సూక్ష్మప్రణాళికల తయా రీ, స్వర్ణ గ్రామ పంచసూత్రాలు (ఎస్‌జీపీఎస్), పట్టణ స్థాయిలో స్వర్ణ పురపాలక పంచసూత్రాలు (ఎస్‌పిపిఎస్) తదితర కార్యక్రమాల రూపకల్పనకు కమిటీలు దోహదం చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గానూ, కలెక్టర్, సీఈవో జెడ్పీ, డీఆర్‌డీఏ పీడీ, డ్వామా పీడీ, డీపీవో, మెప్మా పీడీ, సీఈవో, డీఎంఅండ్‌హెచ్‌వో, అనిమల్ హస్బెండరీ జేడీతో పాటు స్పెషల్ ఇన్వైటీలుగా కలెక్టర్ సూచించిన వ్యక్తులతో ఈ కమిటీని రూపొందించనున్నారు.
జీపీ, మండలం, మున్సిపాలిటీల్లోనూ..
గ్రామ పంచాయతీ కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా, ఎంపీటీసీ, ఇద్దరు గ్రూపు సభ్యులు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు మెంబర్లుగా ఉంటారు. మున్సిపాలిటీ వార్డు లో కౌన్సిలర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్లలో కార్పొరేటర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు.
మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షులుగా జెడ్పిటీసీతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఓ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు సభ్యులుగా ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలో చైర్‌పర్సన్ అధ్యక్షులుగా, ఓ కౌన్సిలర్, ముగ్గురు సోషియల్ యాక్టవిస్ట్‌లు సభ్యులుగా, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు.
మరింత అధికార జోక్యం..
ఇప్పటికే పింఛన్ల కమిటీల కారణంగా జన్మభూమి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరిట సోషియల్ యాక్టివిస్ట్‌ల నెపంతో అధికార టీడీపీ నాయకులు అడ్డదారిన అధికారాన్ని చెలాయిం చేందుకు మార్గం సుగమమైనట్టే. ఫలితంగా అధికారుల ప్రమేయం తగ్గి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే జన్మభూమి పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మారడం ఖాయమని తెలుస్తోంది.
జన్మభూమిలో కమిటీలకు ప్రాతినిథ్యం
Published Sun, Oct 12 2014 3:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM
Advertisement