Fatherland
-
మళ్లీ ఎందుకొచ్చారు?
జన్మభూమిలో నిలదీస్తున్న జనం మొక్కుబడిగా నిర్వహిస్తున్న అధికార గణం విశాఖపట్నం: ’గత మూడు జన్మ భూమి సభల్లో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం లేదు.. జన్మభూమి సభలు పెట్టినప్పుడల్లా కొత్తగా రేషన్ కార్డులిస్తాం, పెన్షన్లు మంజూరు చేస్తాం.. ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తాం.. అంటూ ఆశలు రేపారు. రెండున్నరేళ్ల నుంచి ఇదే పరిస్థితి. మొక్కుబడిగా ఎందుకు జన్మభూమి కార్యక్ర మాన్ని నిర్వహిస్తారు? ఎన్నాళ్లిలా మోసం చేస్తారు?’ అంటూ రెండో రోజు జన్మభూమి కార్యక్రమంలో పలుచోట్ల ప్రజ లు అధికారులను, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను నిలదీశారు. వీరికి సమాధానం చెప్పలేక వారు సతమతమయ్యారు. రెండో రోజు జన్మభూమి కార్యక్రమాన్ని మంగళవారం జిల్లావ్యాప్తంగా పలుచోట్ల నిర్వహించారు. అడ్డగింత.. నిలదీత జిల్లాలోని ఎస్.రాయవరం మండలంలో పెన్షన్లు, ఇళ్ల స్థలాలు ఎందుకు ఇవ్వలేదని అధికారులను నిలదీశారు. పెదబయలులో జన్మభూమి సభ రసాభాస అయింది. గత జన్మభూమిలో దరఖాస్తులకు మోక్షం కల్పించకుండా ఇప్పుడెందుకొచ్చారని నిలదీశారు. ప్రసంగాలే తప్ప పనులు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముంచంగిపుట్టులో జరిగిన సభలో గిరిజనులు అధికారులను సమస్యలపై నిలదీయడంలో మధ్యలోనే జన్మభూమి సభను ముగించుకుని వెళ్లిపోయారు. బుచ్చెయ్యపేట మండలం గంటికొర్లాం జన్మభూమి సభను జనం అడ్డుకున్నారు. ఏ సమస్యలూ పరిష్కరించలేదని, మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులను, అధికార పార్టీని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నించడంతో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు ఇరువర్గాలను శాంతింపచేశారు. చీడికాడ మండలం చుక్కపల్లి, కొత్తపల్లిల్లో ఇళ్లు మంజూరు చేయలేదని, మాకు ప్రయోజనం చేకూర్చనప్పుడు ఈ సభలెందుకని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరిగిన సభకు జనం పలుచగా హాజరయ్యారు. హుకుంపేట మండలం మఠం, కొత్తూరు గ్రామాల మహిళలు మంగళవారం జన్మభూమి సదస్సును అడ్డుకున్నారు. ఐటీడీఏ పీవోకు స్వయంగా రెండుసార్లు వినతులు ఇచ్చిన తాగునీటి సమస్య పరిష్కారం కాలేదంటూ ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో శాంతించారు. -
తూతూమంత్రం
తొలిరోజు హడావుడిగా జన్మభూమి సభలు ఒక్కో నియోజకవర్గంలో పదికి పైగా నిర్వహణ పట్టుమని 10 నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోతున్న ఎమ్మెల్యేలు సమస్యలు చెబితే చీదరింపులు, భౌతికదాడులు టీడీపీ మినహా ఇతర ప్రజాప్రతినిధుల సిఫారసులు బేఖాతర్ టీడీపీ కార్యక్రమంలా సాగుతోన్న జన్మభూమి ‘‘నాకు సమయం లేదు. అవతల బోలెడు పెళ్లిళ్లు ఉన్నాయి. పెళ్లికుమారుడు, పెళ్లికుమారై సిద్ధంగా ఉంటే 'మాంగల్యం తంతునానేనా?' అని రెండుమంత్రాలు చదవి వెళ్లిపోతా. అర్థమైందా!’’ –ఇవీ ‘అందరివాడు’ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగులు. అచ్చం ఇలాగే ఉంది జన్మభూమి సభల నిర్వహణ తీరు. '11 చోట్ల సభలు నిర్వహించాలి. త్వరగా కానివ్వండి. మేం ప్రసంగించి వెళ్లిపోతాం. సమస్యలుంటే కాగితంపైన రాయండి. పింఛన్, ఇళ్లు ఇతరత్రా దరఖాస్తులుంటే వీఆర్ఏ 24గంటలూ మీ ఊరిలోనే ఉంటారు. వారికి ఇవ్వండి. వారు మా వద్దకు తెస్తారు’ అంటూ ఎమ్మెల్యేతో పాటు అధికారులు హడావుడిగా నాలుగు మాటలు మాట్లాడి పది నిమిషాల్లోనే సభను ముగించి వెళ్లిపోతున్నారు. దీనికి కారణం ఓ ప్రణాళిక లేకుండా, రోజూ పదికంటే ఎక్కువగా సభలను నిర్వహించడమే. ఏదో సభ నిర్వహించామని చెప్పుకునేందుకు మినహా ప్రజాప్రతినిధులు, అధికారులు సామాన్యుల మొర ఆలకించడం లేదు. ఒక సభలో ఎమ్మెల్యే, మండలాధ్యక్షుడు, జెడ్పీటీసీ ప్రసంగాలతో పాటు ఒక్కోశాఖ నుంచి ఒక్కో అధికారి మాట్లాడినా కనీసం గంటన్నర పడుతుంది. గ్రామస్తుల సమస్యలు విని, అర్జీలు తీసుకునేందుకు మరో గంటన్నర. ఈ లెక్కన ఓ సభ మామూలుగా జరిగినా 3గంటలు అవసరం. కానీ తొలిరోజు శింగనమలలో 13, ధర్మవరంలో 11 చోట్ల సభలు నిర్వహించారు. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ సభలు నిర్వహిస్తున్నారు. ప్రయాణ సమయం, మధ్యాహ్న భోజన సమయం తీసేస్తే ప్రతి గ్రామంలో 20–30నిమిషాలకు మించి సభ జరగడం లేదు. చాలా గ్రామాలకు నోడల్ ఆఫీసర్ మినహా ఎమ్మెల్యే, ఎంపీడీవో, తహశీల్దార్‌తో పాటు చాలామంది గైర్హాజరవుతున్నారు. అర్జీదారులపై దౌర్జన్యాలు, దాడులు అనంతపురంలోని 33వ డివిజన్లో ప్రకాశ్‌గౌడ్ అనే మానసిక వికలాంగుడు గతేడాది జన్మభూమిలో దరఖాస్తు చేసుకున్నారు. పింఛన్ రాలేదు. ఈ ఏడాది దరఖాస్తు తీసుకుని స్థానిక విద్యుత్‌నగర్ సర్కిల్లో ‘నాకు పింఛన్ ఇప్పించండి’ అంటూ ఫ్లకార్డు పట్టుకుని కమిషనర్ వాహనానికి అడ్డుగా వెళ్లాడు. సమస్యను సావధానంగా వినాల్సిన ప్రజాప్రతినిధులు మానసిక వికలాంగుడని చూడకుండా రెచ్చిపోయారు. మొదట కమిషనర్ డ్రైవర్, ఆపై సులోచన అనే టీడీపీ కార్యకర్త చేయిచేసుకున్నారు. ఆపై కార్పొరేటర్లు సరిపూటి రమణ, నటేశ్ చౌదరి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇది చూసిన స్థానికులు టీడీపీ నేతల శైలిపై దుమ్మెత్తిపోశారు. జన్మభూమి సభల్లో చాలాచోట్ల విపక్ష పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న సర్పంచ్‌లు, వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నట్లు తెలుస్తోంది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కంబదూరు మండలం నూతిమడుగులో టీడీపీకి చెందిన దళిత సర్పంచ్ నరసింహులు తనను అగౌరవ పరుస్తూ, ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారనే ఆవేదనతో ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. సభలోని ప్రజలు అడ్డుకున్నారు. మూడేళ్లుగా అవమానాలకు గురవుతున్నానని, ఎవరూ తనను సర్పంచ్‌గా గుర్తించడం లేదని, స్థానిక ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరికి తెలిపినా పట్టించుకోలేదని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం నేమకల్లులో తాగునీటి కోసం హెచ్చెల్సీ నుంచి వస్తున్న పైపులైన్‌ను దారి మళ్లించి క్రషర్లకు తరలించారని, చాలాసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ‘మా ఇంటికి మహాలక్ష్మి’ ప్రోత్సాహక నగదును ఇంతవరకూ బ్యాంకులో జమ చేయలేదని కురవళ్లిలో వీరేశ్ అనే వ్యక్తి నిలదీశాడు. శింగనమల నియోజకవర్గంలోని యల్లనూరు మండలం దంతపల్లిలో గంగయ్య అనే వృద్ధుడు ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా పింఛన్ మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి మండలం తల్లిమడుగులో జన్మభూమి సభకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు. పొలాలకు వెళ్లే రహదారి వివాదంపై నిలదీశారు. ఆత్మకూరు మండలం. పి.యాలేరులో ఇన్‌పుట్‌సబ్సిడీ జాబితాలో టీడీపీ సానుభూతి పనుల పేర్లు మినహా ఇతరుల పేర్లు చేర్చడం లేదని రైతులు ఆందోళనకు దిగారు. జాబితా పూర్తికాలేదని, అర్హులందరికీ న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఇలా జిల్లా వ్యాప్తంగా ప్రతి జన్మభూమి సభలోనూ తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు నిలదీశారు. -
జన్మభూమితో ఒరిగిందేమిటి?
నాల్గో రోజు అవే సెగలు బాక్సైట్ జీవో రద్దుకు తీర్మానాలు చేయించిన గిరిజనులు అధికారులను రోడ్డుపై నిలిపేసిన మన్యం ప్రజలు విశాఖపట్నం: జిల్లా వ్యాప్తంగా నాల్గో రోజు జరిగిన ‘జన్మభూమి- మా ఊరు’ సభల్లో సేమ్ సీన్ రిపీటైంది. చైతన్యవంతులైన జనం సమస్యలపై ఎక్కడిక్కడే అధికారులను నిలదీశారు. మొక్కుబడిగా జరుపుతున్న సభలు మాకు అక్కర్లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన దరఖాస్తులకు మోక్షం, సమస్యలకు పరిష్కారం లేనప్పుడు ఇప్పుడొచ్చి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పటిలాగే ఆయా సభల్లో పెత్తనం చెలాయిస్తూ దరఖాస్తుదారుల ఆగ్రహానికి గురయ్యారు. విశాఖ నగరం విశాలాక్షినగర్‌లో సమస్యలను ప్రస్తావిస్తున్న విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులను టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. శ్మశానవాటిక సమస్యపై ప్లకార్డులు ప్రదర్శిస్తున్న వీరిని నిలువరించారు. దీంతో విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు ఎదురు తిరిగారు. పోలీసుల జోక్యం చేసుకుని సభను నిర్వహించారు. భీమిలి మండలం చిట్టివలసలో మూతపడ్డ జ్యూట్‌మిల్లును తెరిపించడానికి ప్రజాప్రతినిధులు కృషి చేయడం లేదంటూ సీపీఐ, వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనకు దిగారు.దేవరాపల్లి మండలం తారువాలో బయోమెట్రిక్ పనిచేయక అర్హులైన పేదలకు పింఛన్లు, రేషన్‌కార్డులు అందకుండా పోతున్నాయని మాడుగుల ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఏజెన్సీలోని హుకుంపేట మండలం గన్నేరుపుట్టు, చీకుమద్దిల పంచాయతీల్లో జన్మభూమి సభలను జరగకుండా అక్కడ గిరిజనులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించకుండా ఎందుకొచ్చారంటూ ఐదు గంటలకుపైగానే అధికారులను రోడ్డుపైనే నిలిపి వేసి నిరసన తెలిపారు. అరకు మండలం గన్నెల పంచాయతీలో గిరిజనులు జన్మభూమి సభలను అడ్డుకున్నారు. చివరకు బాక్సైట్ తవ్వకాల జీవోను రద్దు చేయాలంటూ తీర్మానం చేయడంతో సభకు అనుమతించారు. ఇదే మండలం పద్మాపురం, డుంబ్రిగుడ మండలంలోని మరికొన్ని గ్రామాల్లోనూ బాక్సైట్ జీవో రద్దు చేయాలంటూ గిరిజనులు తీర్మానాలు చేయించారు. నర్సీపట్నం 8వ వార్డులో జన్మభూమి సభకు జనం హాజరు కాకపోవడంతో.. అధికారులే కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహించి వెళ్లిపోయారు.పాయకరావుపేట మండలం పెంటకోటలో జెడ్పీ ఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు డ్వాక్రా మహిళలకు పొదుపు సొమ్ము ఇస్తామని మోసం చేశారంటూ అధికారులను అడ్డుకున్నారు. కోటవురట్లలో సీఎం సందేశాన్ని చదవకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు నేతృత్వంలో పలువురు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు.ఇదే మండలం కైలాసపట్నంలో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. జన్మభూమి కమిటీ సభ్యుడినంటూ వచ్చిన ఆ పార్టీ కార్యకర్తను సాటి కార్యకర్తలు గెంటివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
జన్మభూమి రసాభాస
‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమం చివరి రోజు రసాభాసగా మారడం.... సభలో టీడీపీ నాయకులు,కార్యకర్తలు రెచ్చిపోయి వ్యవహరించడం....హాజరైన ప్రజలు భయబ్రాంతులకు గురైన నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, ప్రొటోకాల్ వివాదం చినికి చినికి గాలివానలా మారడం...వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ సభను బహిష్కరించడం... ఇవన్నీ సత్తెనపల్లి 25వ వార్డు సభలో మంగళవారం చోటుచేసుకున్న సంఘటనలు.. సత్తెనపల్లి:పట్టణంలోని 25వ వార్డు ‘జన్మభూమి-మా ఊరు’ సభ స్థానిక కౌన్సిలర్ చల్లంచర్ల సాంబశివరావు అధ్యక్షతన మంగళవారం జరిగింది. మున్సిపల్ చైర్మన్ యెల్లినేడి రామస్వామి, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల సత్యబాబును తొలుత సాంబశివరావు వేదికపైకి ఆహ్వానించారు. వారితోపాటు వైస్ చైర్మన్ ఆతుకూరి నాగేశ్వరరావు, 24వ వార్డు టీడీపీ కౌన్సిలర్ చౌటా శ్రీనివాసరావులు వేదికపై ఆశీనులయ్యారు. వారు వేదికపై కూర్చోవటాన్ని కౌన్సిలర్ సాంబశివరావు ఆక్షేపించారు. ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ సమావేశంగా మార్చారు. వార్డుకు సంబంధం లేని వ్యక్తులను వేదికపై నుంచి పంపాలని నిర్వహణ కమిటీ కన్వీనర్ అయిన కమిషనర్ సత్యబాబును సాంబశివరావు కోరారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ఇది అంతా కలసి పాల్గొనవలసిన ప్రభుత్వ కార్యక్రమమని, సామరస్యంగా వెళదామన్నారు. తిరిగి కౌన్సిలర్ సాంబశివరావు మాట్లాడుతూ మున్సిపల్ చైర్మన్ టీడీపీ నుంచి గెలిచినప్పటికీ ఆయన్ను సమావేశానికి చైర్మన్‌గా స్వాగతిస్తున్నామని, ప్రొటోకాల్‌కు భిన్నంగా చేయదలచుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వారిని కూడా వేదికపైకి పిలుస్తామన్నారు. దీనికి కమిషనర్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ వారిని కూడా ఆహ్వానిస్తానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. దాంతో వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లను వేదికపైకి ఆహ్వానిస్తుండగా, కేవలం కౌన్సిలర్లను మాత్రమే పిలవాలని మాజీ కౌన్సిలర్ గుజ్జర్లపూడి నాగేశ్వరరావు ,13వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సరికొండ వెంకటేశ్వరరాజు పెద్దగా కేకలు వేశారు. దీనిపై కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని సాంబశివరావు అన్నారు. ఆ సమయంలో నచ్చకపోతే వెళ్లిపోవచ్చని మున్సిపల్ చైర్మన్ అనడంతో కౌన్సిలర్ సాంబశివరావు వెళుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంలో టీడీపీకి చెందిన వ్యక్తి అసభ్యంగా మాట్లాడడంతో ఒక్కసారిగా వివాదం రేగింది. ఒకానొక దశలో టీడీపీ, వైఎస్సార్ సీపీ నాయకులు గొడవపడేందుకు సిద్ధం కాగా, పోలీసులు సమన్వయపరిచి పంపారు. సభలో మాట్లాడే అవకాశం కోసం వైస్ చైర్మన్ నాగేశ్వరరావు బతిమిలాడినా అధికారులు అవకాశం ఇవ్వలేదు. అనంతరం మున్సిపల్ చైర్మన్ రామస్వామి మాట్లాడుతూ సమస్యలను సామ రస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప, అధికారులను ఇబ్బంది పెట్టకూడదన్నారు. అనంతరం టీడీపీ నాయకులు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసి, గర్భిణులకు సీమంతం చేశారు. బాలామృతం పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ డీఈ జె.ప్రభాకర్‌రెడ్డి, పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ డాక్టర్ మంగు శ్రీనివాసరావు, వైద్య అధికారి డాక్టర్ రమాదేవి, ఏరియా వైద్యశాల సూపర్వైజర్ చంద్రశేఖర్, మలేరియా అధికారి ప్రసాద్, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. భారీ బందోబస్తు.. జన్మభూమి సభకు సీఐ, ఎస్సై, సుమారు 15 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు నిర్వహించారు. గొడవ సందర్భంలో ఇరు పార్టీల నేతలకు సీఐ యు.శోభన్‌బాబు సర్ది చెప్పారు. -
జన్మభూమిలో జగడం
కడప కార్పొరేషన్: కడప నగరంలో సోమవారం నిర్వహించిన ఁజన్మభూమి* కార్యక్రమం రసాభాసగా సాగింది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... కడప నగరం 27వ డివిజన్లోని గౌస్ నగర్ మున్సిపల్ ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన ఁజన్మభూమి- మాఊరు* కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకొన్నాయి. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా మాట్లాడుతుండగా టీడీపీ నగర అధ్యక్షుడు బాలక్రిష్ణయాదవ్ మైక్ లాక్కోవడంతో గొడవ మొదలైంది. ఇరుపార్టీల నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకుంది. టీడీపీ నాయకులు వారి పార్టీ నాయకులకు ఫోన్లు చేసి మరీ పిలుపించుకున్నారు. మరోవైపు వైఎస్ఆర్ సీపీ కార్పొరేటర్లు, నాయకులు కూడా అదే స్థాయిలో గుమికూడారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అధికారం మాది..ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాల్సిందేనంటూ బాలక్రిష్ణయాదవ్ పట్టుబట్టి రెండవసారి మాట్లాడారు. ఆ తర్వాత మేయర్, ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కూడా గొడవ చేశారు. అయినా మేయర్, ఎమ్మెల్యేలు సంయమనం పాటించారు. స్థానిక కార్పొరేటర్ షేక్ షహనాజ్, వైఎస్ఆర్సీపీ నాయకులు మాసీమ బాబు, జహీర్, ఎస్ఎండీ షఫీ, అజ్మతుల్లా, శివకేశవ, కార్పొరేటర్లు హరూన్‌బాబు, చైతన్య, చల్లా రాజశేఖర్, జమ్మిరెడ్డి, టీడీపీ నాయకులు అమీర్‌బాబు, జయకుమార్, నూర్ తదితరులు పాల్గొన్నారు. ఇది ప్రజాస్వామ్యమేనా! మనం ప్రజా స్వామ్యంలో ఉన్నామో...నియంతపాలనలో ఉన్నామో అర్థం కాలేదని ఎమ్మెల్యే ఎస్బీ అంజద్‌బాషా ఆవేదన వ్యక్తం చేశారు. బాలక్రిష్ణయాదవ్ 45 నిముషాలపాటు మాట్లాడితే తాము ఓపికగా విన్నామన్నారు. తమకు అవకాశం వచ్చాక మాట్లాడుతుంటే మైక్ లాక్కోని దౌర్జన్యం చేయడం సరికాదని చెప్పారు. తనను ప్రజలు 45వేల మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించారని, వారి సమస్యలపై ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మాట్లాడుతుంటే మైక్ లాక్కుంటారా... అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌస్ నగర్లో గతంలో 350 పింఛన్లు ఇస్తుండగా, ప్రస్తుతం 180 మందికే ఇస్తున్నారని, వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేశారనే అక్కసుతోనే ఆ పింఛన్లన్నీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు వేదిక కాదు రాజకీయాలకు ఇది వేదిక కాదని మేయర్ కె. సురేష్‌బాబు టీడీపీ నాయకులకు సూచించారు. ప్రభుత్వ కార్యక్రమమైనందునే జన్మభూమి- మాఊరుకు హాజరయ్యామన్నారు. పార్టీలున్నది ప్రజలకు సేవ చేయడానికే అని, అర్హులందరికీ న్యాయం చేయడానికి అందరం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా పింఛన్ కోల్పోయిన పలువురు వృద్ధులు, వితంతువులను వారు మీడియాకు చూపారు. -
మీకు ఓటేసినందుకు...చెప్పుతో కొట్టుకోవాలి
టీడీపీకి ఓటేసినందుకు జన్మభూమి సభలో చెప్పుతో కొట్టుకున్న వృద్ధుడు అన్యాయంగా పింఛను తొలగించారని ఆవేదన పింఛను రాలేదన్న మనస్తాపంతో కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి చీరాల/గుడివాడ: ‘మీ కుటుంబానికి పెద్ద కొడుకునవుతా.. రూ.200 ఉన్న పెన్షన్‌ను రూ.వెయ్యి చేసి మీ బతుక్కు భరోసా ఇస్తానన్న ఏపీ సీఎం చంద్రబాబు .. భరోసా సంగతి ఏమోగానీ మా నోటి దగ్గర బువ్వ లాగేశారంటూ’ పలువురు వృద్ధులు ఆవేదన చెందుతున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీరాల 33వ వార్డుకు చెందిన యాకోబు(70) కూలి పనులు చేసేవాడు. ఐదేళ్లుగా వృద్ధాప్య పింఛను తీసుకుంటున్న ఆయ న శరీరం సహకరించక కొంతకాలంగా పనికి వెళ్లలేక ఇంటివద్దే ఉంటున్నాడు. అయితే ఇటీవల జరిగిన పింఛన్ల పునఃపరిశీలనలో ఆయనకు పింఛను తీసుకునేందుకు నిర్ధారిత వయసు సరిపోలేదంటూ తొలగించారు. దీంతో మనోవేదనకు గురైన యాకోబు తమ వార్డులో శనివారం నిర్వహించిన జన్మభూమి గ్రామసభలో అధికారులను ప్రశ్నించేందుకు వచ్చాడు. మున్సిపల్ కమిషనర్, జన్మభూమి కమిటీ సభ్యుల ఎదుట గోడు వెళ్లబోసుకున్న అనంతరం ఆవేదనతో... ‘చంద్రబాబుకు ఓటేసినందుకు మా చెప్పుతో మేం కొట్టుకోవాలి’ అంటూ తనను తాను చెప్పుతో కొట్టుకున్నాడు. దీంతో పోలీసులు అతడ్ని సభా ప్రాంగణం నుంచి బయటకు పంపారు. కృష్ణా జిల్లాలో వృద్ధుడి మృతి కృష్ణాజిల్లా గుడివాడలోని బేతవోలుకు చెందిన జొన్నలగడ్డ సూర్యనారాయణ(70)కు ఎనిమిది నెలల క్రితం పింఛను తొల గించారు. అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. జన్మభూమి కార్యక్రమంలోనైనా పింఛను ఇస్తారేమోనని ఆశపడ్డాడు. రెండు రోజుల క్రితం బేతవోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి వెళ్లి పింఛను గురించి అధికారులను అడగ్గా.. రాలేదని సమాధానం ఇచ్చారు. దీంతో మనస్తాపానికి గురైన సూర్యనారాయణ... గుండెపోటుతో మరణించినట్లు బంధువులు తెలిపారు. -
విత్తన గుట్టు రట్టు
గూడూరు: సబ్సిడీ విత్తనాలను అధిక ధరకు విక్రరుుంచిన విషయం మండల పరిధిలోని ఆర్. ఖానాపురంలో గ్రామసభలో దుమారం రేపింది. విషయంపై సభ సాక్షిగా ఎంపీపీ, ఏఓ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా శనివారం మండల పరిధిలోని ఆర్.ఖానాపురంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఈశ్వరమ్మ, మండల వ్యవసాయాధికారిణి ఎ.మాధురి మధ్య తీవ్ర గొడవ జరగడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఇద్దరూ పరస్పరం ఆరోపణలు చేసుకోవడంతో సభలో ఏమి జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాకుండాపోరుుంది. ఎంపీపీ సభలో ప్రసంగిస్తూ శనగ విత్తనాలను ఏ రేటుకు కొనుగోలు చేశారని రైతులను ప్రశ్నించగా పక్కనే ఉన్న ఏఓ ఒకసారిగా లేచి ఎంపీపీతో వాదనకు దిగారు. ఓ దశలో ఇద్దరూ తిట్ల పురాణం అందుకున్నారు. నోడల్ అధికారి మధుసూదన్ ఇరువురికి సర్ధిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇదీ జరిగింది.. మండలానికి నెల క్రితం 187 క్వింటాళ్ల సబ్సిడీ శనగ విత్తనాలు మంజూరయ్యూరుు. అరుుతే వ్యవసాయశాఖాధికారులు విత్తనాలను రైతులకు నేరుగా ఇవ్వకుండా ఎంపీపీ భర్త మహేశ్వరరెడ్డికి అనధికారికంగా కేటాయించారు. వీటిని గుడిపాడు, గూడూరు, మునుగాల గ్రామాల్లో ఆదర్శ రైతుల ఆధ్వర్యంలో డంప్ చేశారు. మహేశ్వరరెడ్డి సూచించిన రైతులకు మాత్రమే వ్యవసాయశాఖ సిబ్బంది చిత్తు కాగితాలపై చీటీలు రాసిస్తూ విత్తనాలు అందించారు. క్వింటా రూ. 1720 ప్రకారం విక్రయించాల్సి ఉండగా రూ. 2600 చొప్పున వసూలు చేశారు. విషయంపై మహేశ్వరెడ్డి వారం రోజులుగా ఏఓతో వాదనకు దిగుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో ఏఓ శుక్రవారం మాజీ మంత్రి కేఈ ప్రభాకర్‌ను కలిసి మహేశ్వర్‌రెడ్డిపై పంచారుుతీ పెట్టించారు. మరోవైపు ఎంపీపీ వర్గీయులు కూడా ఏఓ తీరును జేడీఏ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. దీనిపై జేడీఏ విచారణకు నిర్ణరుుంచినట్లు సమాచారం. ఈ క్రమంలో శనివారం గ్రామసభలో ఎంపీపీ, ఏఓ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. -
‘జన్మభూమి’లో ఉద్రిక్తత
ప్రొటోకాల్ పాటించని అధికారులు పింఛన్ల పంపిణీకి ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వని వైనం ఎమ్మెల్యే ఈశ్వరితో ఎంపీ గీత వాగ్వాదం పాడేరు రూరల్: మండలలోని సలుగు, మోదాపల్లి పంచాయతీల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. ఈ రెండు చోట్లా నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాల్లో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితోపాటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత హాజరయ్యారు. సలుగు గ్రామం లో పింఛన్ల పంపిణీ సమయంలో వీరిద్దరూ తీవ్ర వాగ్వాదానికి దిగారు. ప్రొటోకాల్ ప్రకా రం ఎమ్మెల్యే చేత కూడా పింఛన్లు ఇప్పించాల్సి ఉన్నప్పటికి అధికారులు కేవలం ఎంపీ గీత, టీడీపీ నాయకుల చేత మాత్రమే పింఛన్లు పం పిణీ చేయించడంతో ఎమ్మెల్యే ఈశ్వరి ఇదేమి పద్ధతని అధికారులను నిలదీశారు. నియోజకవర్గ పరిధిలో ఎమ్మెల్యే, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులచేత కూడా పింఛన్లు పంపిణీ చేయించాలన్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన నాయకులమని, అన్ని చోట్ల తాము పింఛన్లను అందించేందుకు అర్హులమని తెగేసి చెప్పి ఎమ్మెల్యే, ఇతర వైఎస్సార్ నాయకులపై కొందరు గొడవకు దిగారు. దీంతో అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలకు సర్ది చెప్పారు. మోదాపల్లిలో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమంలో పాడేరు ఎంపీపీ వి.ముత్యాలమ్మ మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు పింఛన్లలో కోత పెట్టడం సరైన పద్ధతి కాదని అనడంతో అక్కడ ఉన్న ఎంపీ కొత్తపల్లి గీత, ఇతర టీడీపీ నాయకులు ఆమెకు సమాధారం ఇవ్వకుండా వాగ్వాదానికి దిగారు. కొత్తపల్లి గీతతో ఉన్న టీడీపీ నాయకులు ఎంపీపీ, ఆమె వర్గీయులతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ కూడా పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని చక్క దిద్దారు. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల హవాపై ఆయా గ్రామాల గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పి.నూకరత్నం, మాజీ ఎంపీపీ రమణమూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు వి.పిన్నయ్యదొర, బూరెడ్డి నాగేశ్వరరావు, తాజుద్దీన్, కె.చంద్రమోహన్‌కుమార్, త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు. -
నిరసనలకు శ్రీకారం
పింఛన్లు..పరిహారం కోసం ఆగ్రహం ఎంపీ, ఎమ్మెల్యేలకు తప్పని నిరసన ప్రోటోకాల్ ఉల్లంఘించిన అరకు ఎంపీ జన్మభూమిలో గళమెత్తిన ప్రజలు సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు పునఃప్రారంభించిన తొలిరోజే జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు సొం తనియోజకవర్గంలోనే చుక్కెదురైంది. 1వ వార్డు ఆరిలోవ ప్రాంతంలో జరిగిన గ్రామసభలో తుఫాన్ బాధితులు ఎమ్మెల్యేను నిలదీశారు. తుఫాన్ తర్వాత మీరు కానీ..మీ అధికారులు కానీ మావైపు కన్నెత్తయినా చూడలేదు. సాయం పంపిణీలో వివక్ష చూపారు. 2వ వార్డులో పంపిణిచేసేరే తప్ప ఆరిలోవలో ఒక్క కిలో బియ్యం ఇవ్వలేదంటూ మండిపడ్డారు. దీనిపై సమాధానం చెప్పలేక ఇబ్బందిపడిన ఎమ్మెల్యే మీరు చెప్పింది నిజమే..సాయం పంపిణీసరిగా జరగలేదు.. మీకు పరిహారం విషయంలో న్యాయంచేస్తానని హామీ ఇచ్చారు. నక్కపల్లిలో మంత్రి గంటా శ్రీనివాస రావు కాన్వాయ్‌ను గత 45 రోజులుగా ఆందోళన చేస్తున్న యానిమేటర్లు అడ్డుకుని బైటాయించారు. తమతో ప్రభుత్వం కనీసం చర్చలు కూడాజరపలేదని..ఆకలితో అలమటిస్తున్నామంటూ ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వం దృష్టికితీసుకెళ్తాననంటూ వారికి సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయారు. మంత్రి గంటా పాయక రావుపేటలో పింఛన్‌దారుల నుంచి తీవ్ర నిరసన ఎదుర్కొక తప్పలేదు. పింఛన్లలో కోత పెట్టారని.. తాము ఏ విధంగా అనర్హులమో చెప్పాలని మంత్రిని నిలదీయగా,న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు. భీమిలి మండలం మాలకుద్దులో పింఛన్ల కోతపై బాధితులు ఎంపీపీ, జెడ్పీటీసీలను నిలదీశారు. తమకు వెంటనే పింఛన్లు పునరుద్దరించాలని వారిని చుట్టుముట్టి నినాదాలు చేసారు. ఇదే మండలంలోని తాటితూరులో తుపాన్ బాధితులు అధికారులపై విరుచుకుపడ్డారు. వీరికి మద్దతుగా వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ దుంపల నాగమణి, పార్టీ నాయకులు ఎస్వి రమణారెడ్డి, ఈశ్వరరావులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. ఈ దశలో టీడీపీ నాయకులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. అధికారులు సర్వేలో తప్పులు చేసారని చక్కదిద్దుతామని టీడీపీ నాయకులు ప్రజలకు సర్దిచెప్పి అక్కడ నుంచి వెళ్లాల్సి వచ్చింది. చోడవరం మండలం గోవాడ సభలో స్థానికులు గత జన్మభూమిలో ఇచ్చిన హామీలే అమలు చేయలేదు..మళ్లీ ఎందుకొచ్చారంటూ అధికారులపై మండిపడ్డారు. పారిశుద్ద్యంపై ఫిర్యాదు చేస్తే 24 గంటల్లో చక్కదిద్దుతామనిచెప్పి నెలరోజులు గడుస్తున్నా పట్టించుకోలేదంటూ ఆరోపించారు. ఇదే మండలం నర్సాపురంలో పాస్పుస్తకాలజారీలో జరుగుతున్న జాప్యంపైరైతులు నిలదీయగా, జొన్నవరంలో పింఛన్ల కోతపై బాధితులు మండిపడ్డారు. పాడేరు మండలం పలుగు గ్రామసభలో అరకు ఎంపీ కొత్తపల్లి గీత ప్రొటోకాల్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. పింఛన్లను పంపిణీకి స్థానిక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సిద్దపడగా గీత అడ్డుకుని ఇది మా ప్రభుత్వం మీరెవరూ పంపిణీ చేయడానికని ప్రశ్నించడంతో ఏ పార్టీలో ఉన్నావో తెలుసా అంటూ ఎమ్మెల్యే వర్గీయులు నిలదీశారు. దీంతో ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో గందరగోళ పరిస్థితులు ఏర్పడి ఎవరేం మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొనడంతో పోలీసులుజోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఇదే మండలం మొదపల్లి పంచాయితీలో జరిగిన సభకు హాజరైన ఎంపీ కొత్తపల్లి గీతను స్థానిక వైఎస్సార్సీపీ ఎంపీపీ ముత్యాలమ్మ నిలదీశారు. ఏపార్టీ తరపున ఇక్కడ పాల్గొంటున్నావో..ఏ విధంగా హామీలు అమలు చేస్తావో చెప్పాలని డిమాండ్ చేయడంతో ఎంపీ వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇక్కడ కూడా పోలీసులు, అధికారులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. నక్కపల్లిమండలం రమణయ్య పేట, చినదొడ్డుగల్లు, సీహెచ్వి అగ్రహరంల్లో కూడా పింఛన్‌దారులు అధికారులకు ముచ్చెమటలు పోయించారు. ‘పచ్చ’పాతమే.. జన్మభూమి కార్యక్రమంలో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైపోతోందని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఆరోపించారు. ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులను కాదని టీడీపీ నాయకుల చేత కార్యక్రమాలు నిర్వహించడం సరికాదన్నారు. చూస్తుంటే ఇది ప్రభుత్వ కార్యక్రమమా? లేదా ‘పచ్చ’పార్టీ కార్యక్రమమా అనే అనుమానం ప్రజల్లో వ్యక్తమవుతోందన్నారు. పాడేరు మండలం సలుగు, మోదాపల్లి గ్రామాల్లో శనివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమాలే ఇందుకు నిదర్శనమన్నారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత, టీడీపీ నాయకుల వ్యవహార శైలి సక్రమంగా లేదన్నారు. తుఫాన్ సహాయక చర్యల్లోనూ తెలుగు తమ్ముళ్లదే హవా కనిపిస్తోందన్నారు. నిజమైన బాధితులకు పరిహారం దక్కడం లేదన్నారు. టీడీపీ అనుచరులకే సాయం అందుతోందన్నారు. మారుమూల గిరిజనులు ఇప్పటికీ నిత్యావసరాలకు నోచుకోలేదన్నారు. బాధితులకు పూర్తి సాయం కోసం వైఎస్సార్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. -గిడ్డి ఈశ్వరి, ఎమ్మెల్యే, పాడేరు -
వెళ్లేదెలా..
నేటి నుంచి జన్మభూమి-మా ఊరు పల్లెల్లో ప్రతిఘటన ఎదురవుతుందని అధికారుల్లో భయం హుదూద్ దెబ్బతో జిల్లాలో మారిన పరిస్థితులు అంధకారంలో పల్లెలు..గందరగోళంగా నష్టం అంచనాలు గిట్టుబాటు ధర దక్కక మండిపడుతున్న రైతులు జన్మభూమి-మావూరు మళ్లీ మొదలవుతోంది. గత నెల 2న ప్రారంభించి ఏడురోజులకే అర్ధంతరంగా వాయిదాపడిన ఈ కార్యక్రమాన్ని శనివారం నుంచి జిల్లాలో మళ్లీ చేపడుతున్నారు. పదిరోజుల పాటు గ్రామసభల అనంతరం పదకొండో రోజున ర్యాలీలు..మానవ హారాలతో అధికారులు ముగింపు పలకనున్నారు. పునర్నిర్మాణపనులు విశాఖలో జరిగినంతవే గంగా గ్రామీణంలో కానరాకపోవడంతో ప్రజల నుంచి ఎలాంటి ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే భయం అధికారులు, ప్రజాప్రతినిధులను వెంటాడుతోంది. పల్లెలకు వెళ్లేందుకు వెనుకడుగు వేస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: జన్మభూమి-మావూరు కార్యక్రమాన్ని టీడీపీ సర్కార్ అక్టోబర్-2న చేపట్టింది. ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని యోచించింది. హుదూద్ కారణంగా అర్ధంతంగా 9వ తేదీనే ఆగిపోయింది. తుఫాన్ విధ్వంసంతో జిల్లా కకావికలమైంది. విద్యుత్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలు కుప్ప కూలిపోయాయి. విశాఖతో పాటు పల్లెలన్నీ అంధకారంలో చిక్కుకుపోయాయి. తాగునీటికి లక్షలాది మంది అల్లాడిపోయారు. రోజులు , వారాలు గడుస్తున్నా జిల్లాలో విద్యుత్‌ను పూర్తిస్థాయిలో పునరుద్ధరించలేకపోయారు. విశాఖ నగరానికి వెలుగులొచ్చినా.. కోతలతో శివారు ప్రాంత ప్రజలు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ నేటికి గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగడంలేదు. అధికారికలెక్కల ప్రకారమే 4వేలకు పైగా పల్లెలు ఇంకా అంధకారంలోనే మగ్గుతున్నాయి. వందలాది గ్రామాల్లో మంచి నీటి సరఫరా ఏ మాత్రం మెరుగుపడలేదు. అంటువ్యాధులు విజృంభిస్తున్నాయి. పునరావాస చర్యలతో పాటు తక్షణ సహాయం కింద ఉచితంగా పంపిణీ చేసిన బియ్యం, ఇతర నిత్యావసరాలు తెలుగుతమ్ముళ్లు టన్నుల కొద్ది పక్కదారిపట్టించారు. ఇక నష్టం అంచనాల్లో జన్మభూమి కమిటీలకే ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు తమకు నచ్చినవారికి ఒకలా.. నచ్చని వారికి మరోలా ఎన్యుమరేషన్ చేయిస్తూ అర్హుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నష్టం అంచనాల తయారీ దాదాపు పూర్తికావచ్చింది. ఈ జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించనున్నారు. ఒక పక్క విద్యుత్ సరఫరా పూర్తి స్థాయిలో పునరుద్ధరించక పోవడం..మరో పక్క టీడీపీ నేతల కనుసన్నల్లో తయారయిన జాబితాలపై గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్టీఆర్ భరోసా పేరిట పెంచిన పింఛన్లు అందుకోవాలన్న గంపెడాశతో మొన్నటి జన్మభూమి సభలకు వచ్చి నిరాశతో వెనుదిరిగిన లక్షలాదిమంది నిర్భాగ్యులు రెండు నెలల పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటు పింఛన్ అర్హతకోల్పోయిన వేలాదిమంది కూడా ఈసభల్లో అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే రుణమాఫీ పుణ్యమాని బీమాకునోచుకోని లక్షలాది మంది రైతులు ఆశలను తుఫాన్ చిదిమేసింది. కనీసం ఇన్పుట్ సబ్సిడీ, పరిహారమైనా దక్కకపోతుందా అన్నఆశగా వారు ఎదురు చూస్తున్నారు. వీరంతా గ్రామసభల్లో తమ ఆవేదనను వెలిబుచ్చే అవకాశాలున్నాయి. మరొక పక్క ప్రధాన ప్రతిపక్షమైనవైఎస్సార్సీపీకూడా తుఫాన్ బాధితులు, రైతుల తరపున జన్మభూమి సభలను వేదికగా చేసుకుని అధికారులను నిలదీసే అవకాశాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో జరిగే సభల్లో పాల్గొనేందుకు అధికారులు విముఖత ప్రదర్శిస్తున్నారు. -
బెడిసి కొట్టిన టీడీపీ వ్యూహం
కౌన్సిల్లో రచ్చకు విఫలయత్నం తిప్పికొట్టిన వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ :గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ చేయాలనే టీడీపీ కౌన్సిల్ సభ్యుల వ్యూహం బెడిసి కొట్టింది. అత్యవసర సమావేశాన్ని వాయిదా వేయించేందుకు పట్టుబట్టి సమావేశం ఆదినుంచి చివరి వరకు ఆందోళనలు నిర్వహించి అభాసుపాలయ్యారు. వైఎస్సార్సీపీ సభ్యుల సమయస్ఫూర్తితో సమావేశం ఎజెండాలోని 64 అంశాలకు గానూ 61 అంశాలకు ఆమోదం అభించింది. శుక్రవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత లింగం ప్రసాద్ లేచి మాట్లాడుతూ తాము సమాచార హక్కు చట్టం ద్వారా మున్సిపల్ కమిషనర్‌ను సమాచారం అడిగామని ఇంతవరకు ఇవ్వలేదని చైర్మన్ యలవర్తిని ఇరకాటంలో పెట్టాలనే వ్యూహంతో ప్రశ్నించారు. దీనిపై అధికార వైఎస్సార్సీపీ కౌన్సిల్ సభ్యులు లేచి ఎజెండాలో లేని అంశంపై ఎలా సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అయితే టీడీపీ సభ్యులు ముందుగా రచించుకున్న వ్యూహం ప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. నవంబర్ 1నుంచి జన్మభూమి సభలు ఉన్నందున తప్పనిసరి పరిస్థితిలో అత్యవసర సమావేశం జరుపుతున్నామని యలవర్తి శ్రీనివాసరావు అన్నారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు వినకుండా ఆందోళనకు దిగడంతో సమావే శాన్ని 15నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ యలవర్తి ప్రకటించారు. ఆ సమయంలో అధికార, ప్రతిపక్ష నాయకులు వ్యూహ ప్రతివ్యూహాలు రచించారు. ఎమ్మెల్యే కొడాలి నాని ఆధ్వర్యంలో అధికార వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు అంతా సమావేశం ఎలా నిర్వహించాలో వ్యూహ రచన చేశారు. టీడీపీ పక్ష నాయకుడు లింగం ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం వాయిదా వేసే వరకు ఆందోళన చేపట్టాలనే ప్రతివ్యూహంతో ముందుకొచ్చారు. సమావేశం తిరిగి ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్లు యథాప్రకారం చైర్మన్ పోడియం ఎదుట ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులు అల్లర్లు, ఆందోళనలు జరుగుతుండగానే వైస్‌చైర్మన్ అడపా బాబ్జీ, కౌన్సిలర్లు చోరగుడి రవికాంత్, కిలిమి వెంకటరెడ్డి ప్రతిగా ఆందోళనకు దిగారు. చివరకు సమావేశాన్ని కొనసాగించి ఎజెండాలోని 64 అంశాలకు గానూ61 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు గణపతి లక్ష్మణరావు, కాటి విశాలి, వెంపల హైమావతి, అల్లం సూర్యప్రభ, జ్యోతుల సత్యవేణి, వసంతవాడ దుర్గారావు, బొమ్మారెడ్డి ధనలక్ష్మీ, గొర్లశ్రీను, టీడీపీ కౌన్సిలర్లు బొడ్డు శివశ్రీ, అడుసుమిల్లి శ్రీనివాసరావు, పసలాది ఏసుబాబు పాల్గొన్నారు. -
నేటినుంచి మళ్లీ జన్మభూమి
విజయవాడ : జిల్లాలో శనివారం నుంచి నిర్వహించనున్న జన్మభూమి-మా ఊరు కార్యక్రమం విజయవంతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కోరారు. జన్మభూమి కార్యక్రమంపై శుక్రవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కి స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జన్మభూమినిర్వహణపై సీఎం పలు సూచనలు చేశామని చెప్పారు. రేషన్, ఆధార్ కార్డులో వయస్సు తక్కువగా నమోదై పింఛన్లకు అర్హత కోల్పోయిన వారి వివరాలను సేకరించి గ్రామ, మండల, జిల్లా కమిటీల ద్వారా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో నగర మేయర్ కోనేరు శ్రీధర్, డిప్యూటీ మేయర్ గోగుల వెంకట రమణారావు, సబ్-కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు పాల్గొన్నారు. -
పింఛన్లకు పీటముడి
నగరంలో 23,201 మందికి అందని వైనం కాళ్లరిగేలా తిరుగుతున్న పేదలు తలలు పట్టుకుంటున్న ప్రజాప్రతినిధులు జన్మభూమి జరిగితేనే లబ్ధి 8 వెంకటేశ్వరమ్మది 48వ డివిజన్. వృద్ధాప్య పింఛన్ వస్తే కానీ మందులు కొనుక్కోలేని పరిస్థితి. పింఛన్ రావాలంటే జన్మభూమి జరగాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికి పదిసార్లు పింఛన్ కేంద్రాలకు వెళ్లి వచ్చింది. పింఛన్ ఇప్పించడమ్మా అని డివిజన్ కార్పొరేటర్‌ను పదేపదే అడుగుతోంది. 8 రంగారావుకు డెబ్భై ఏళ్లు. రూ.200 పింఛన్ రూ.1000కి పెంచారని సంబరపడ్డాడు. 59వ డివిజన్లో జన్మభూమి జరగకపోవడంతో పింఛన్ చేతికి అందలేదు. 25వ తేదీ నుంచి మొదలవుతోందనుకున్న జన్మభూమి కార్యక్రమం నవంబర్ ఒకటికి వాయిదా పడడంతో నీరుగారిపోయాడు. విజయవాడ సెంట్రల్ : కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా పింఛన్ల వ్యవహారం తయారైంది. ఎన్టీఆర్ భరోసా పేరుతో పింఛన్ సొమ్ము పెంచామని ప్రచారం చేసుకున్న టీడీపీ సర్కార్ సకాలంలో పింఛన్లను అందించడంలో చతికిలపడింది. పింఛన్ సొమ్ము కోసం పేదలు ప్రజాప్రతినిధుల ఇళ్ల చుట్టూ కాళ్లరిగేలా ప్రదక్షిణలు చేస్తున్నారు. జన్మభూమి జరిగినప్పుడే పింఛన్ ఇస్తారన్న సమాధానం ఎదురవడంతో లబ్ధిదారులు ఉసూరుమంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల రెండో తేదీన నగరంలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఎన్టీఆర్ భరోసా ద్వారా వృద్ధాప్య, వితంతు, చేనేత పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1,000కి, వికలాంగ పింఛన్లను రూ. 500 నుంచి రూ. 1,500కి పెంచినట్లు ప్రకటించారు. బసవపున్నయ్య స్టేడియంలో కొద్దిమంది లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. దీంతో వారంతా తమ దశ తిరిగినట్లేనని భావించారు. వాయిదాల పర్వం.. జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని ఈ నెల నాలుగో తేదీ నుంచి నగరంలో ప్రారంభించారు. పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 21 డివిజన్లలో గ్రామసభలు నిర్వహించారు. ఆయా డివిజన్లలోని 9,373 మందికి గాను 7,566 మందికి పింఛన్లు అందించారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) రికార్డుల ప్రకారం 59 డివిజన్లలో 30,767 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో 7,566 మందిని మినహాయిస్తే 23,201 మందికి పింఛన్లు అందాల్సిఉంది. హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ నెల 13న జన్మభూమిని వాయిదా వేశారు. 17 నుంచి ప్రారంభమవుతుందని చెప్పినప్పటికీ అమలు కాలేదు. 25 నుంచి 31 వరకు గ్రామసభలకు షెడ్యూల్ రూపొందించారు. చివరి నిమిషంలో సర్కార్ మళ్లీ నవంబర్ ఒకటో తేదీకి జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం గ్రామసభలు జరిగితే అక్టోబర్ పింఛన్ నవంబర్ 11లోపు లబ్ధిదారులకు అందే అవకాశం ఉంది. మరి నవంబర్ నెల పింఛన్ ఎప్పుడిస్తారని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేటర్లపై ఒత్తిడి పింఛన్ కోసం కార్పొరేటర్లపై ఒత్తిడి పెరుగుతోంది. 38 డివిజన్లలో గ్రామసభలు జరగాల్సి ఉంది. ఆయా డివిజన్ల లబ్ధిదారులు కార్పొరేటర్ల ఇళ్లకు వెళ్లి బాధల్ని ఏకరువు పెడుతున్నారు. అధికారులతో మాట్లాడి పింఛన్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని, మందుల ఖర్చుకు పైసలు వెతుకులాడాల్సివస్తోందని బాధల చిట్టా విప్పుతున్నారు. ఏం చేయాలో పాలుపోక ప్రజాప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. ఇటీవల యూసీడీ అధికారులతో సమావేశమైన మేయర్ కోనేరు శ్రీధర్ పింఛన్లు ఇచ్చేయొచ్చు కదా అని అడిగారు. జన్మభూమి సభల్లోనే పింఛన్లు ఇవ్వాలన్న ఆదేశాలు ఉన్నాయని అధికారులు చెప్పడంతో..అలా అయితే ఓకే అన్నారు. జన్మభూమితో మెలిక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతి నెలా ఒకటో తేదీన లబ్ధిదారులకు ఠంచన్‌గా పింఛన్ అందేది. ఆయన మరణానంతరం 15 తేదీ లోపు ఇచ్చారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో జన్మభూమి ఎప్పుడు జరిగితే అప్పుడు పింఛన్లు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2004కు ముందు టీడీపీ ప్రభుత్వం హయాంలో కూడా ఇదే విధానం కొనసాగడంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పాతకథే పునరావృతం అవుతోంది. స్పందించని డీఆర్డీఏ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్న దృష్ట్యా జన్మభూమితో సంబంధం లేకుండా పింఛన్ల పంపిణీకి అనుమతి ఇవ్వాల్సిందిగా యూసీడీ పీవో ఎం.శకుంతల డీఆర్డీఏ పీడీకి లేఖ రాశారు. డీఆర్డీఏ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆమె మిన్నకుండిపోయారు. జన్మభూమి అక్టోబర్ పింఛన్లకు గండికొట్టిందని లబ్ధిదారులు నిట్టూరుస్తున్నారు. -
బదిలీలపై సందిగ్ధం
నవంబర్ 11 నుంచి బదిలీలపై నిషేధం ఇప్పటి వరకు ప్రారంభం కాని కసరత్తు తుపాను సహాయక చర్యల్లో అధికారులు బిజీ స్థానచలనాలు కలిగిస్తే నష్టం అంచనాలకు ఆటంకం ప్రభుత్వం గడువు పొడిగించే అవకాశం! విశాఖ రూరల్: ఉద్యోగుల బదిలీలపై సందిగ్ధత నెలకొంది. హుదూద్ తుపాను నేపథ్యంలో బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. నవంబర్ 11వ తేదీ నుంచి బదిలీలపై నిషేధం అమలులోకి వస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బదిలీలకు సంబంధించి ఎటువంటి కసరత్తు జరగడం లేదు. పునరావాస, సహాయక కార్యక్రమాలు జరుగుతున్న ఈ తరుణంలో స్థానచలనాలు ఉండే అవకాశం లేదని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం బదిలీలకు గడువు పెంచుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా స్థాయి అధికారి నుంచి గ్రామస్థాయి కార్యదర్శి వరకు ప్రతి ఒక్కరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం భావించింది. జన్మభూమి కా ర్యక్రమానికి ముందే ఈ ప్రక్రియను చేపట్టాలని నిర్ణయిస్తూ సెప్టెంబర్‌లోనే బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అక్టోబర్ 20వ తేదీలోగా బదిలీలు పూర్తి చేయాలని అందులో పేర్కొంది. దీంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ నెలాఖరులోనే బదిలీలు చేపట్టాలని భావించి తహశీల్దార్ల పోస్టింగ్‌లకు సంబంధించి జాబితాపై కసరత్తు కూడా చేశారు. ఇంతలో ముఖ్యమంత్రి జిల్లా పర్యటన కారణంగా జాబితాను ప్రకటించలేదు. ఈ సమయంలో ప్రభుత్వం ఈ నెల 2వ తేదీ నుంచి 20వ వరకు జన్మభూమి - మా ఊరు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఆదేశించింది. ఇటువంటి పరిస్థితుల్లో స్థానచలనాలు కలిగిస్తే కొత్తగా మండలాలకు వెళ్లిన అధికారులకు ఆయా ప్రాంతాల్లో సమస్యలపై అవగాహన ఉండే అవకాశముండదని, జన్మభూమి కార్యక్రమం విజయవంతం కాదని భావించి కొత్త జీవో జారీచేసింది. జన్మభూమి తరువాత బదిలీలు చేపట్టాలని ఈ నెల 20వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఇంతలో ఈ నెల 12న హుదూద్ తుపాను విశాఖతో పాటు విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లో తీవ్ర నష్టాన్ని కలిగింది. ఇప్పటికీ పునరావాస, సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మిగిలిన జిల్లాల కంటే విశాఖలో పరిస్థితులు దారుణంగా ఉన్న నేపథ్యంలో జిల్లాలో ఇప్పట్లో బదిలీలు చేపట్టే అవకాశం ఉండదని ఉద్యోగవర్గాలు భావిస్తున్నాయి. ఇటువంటి సమయంలో బదిలీలు చేస్తే సహాయ కార్యక్రమాలలో జాప్యం జరుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం ఇక్కడ బదిలీలకు గడువు పొడిగించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ బదిలీలపై మరో మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత రావచ్చని భావిస్తున్నారు. -
జన్మభూమిలో కమిటీలకు ప్రాతినిథ్యం
పలమనేరు: ఇన్నాళ్లు పింఛన్ల కమిటి, ఇప్పుడేమో జన్మభూమి కమిటి ఇది అధికార పార్టీ చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు. జిల్లా స్థాయిలో జన్మభూమిలో ప్రాతినిథ్యం ఉండే లా ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలందా యి. జిల్లా కమిటీలతో పాటు మున్సిపల్, మండలాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీరు జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేలా రాష్ట్ర ప్రణాళికా విభాగం నుంచి జీవో నెంబర్ 22 పేరిట ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 20వ తేదీ వరకు జరిగే జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి సంబంధించి సూక్ష్మప్రణాళికల తయా రీ, స్వర్ణ గ్రామ పంచసూత్రాలు (ఎస్జీపీఎస్), పట్టణ స్థాయిలో స్వర్ణ పురపాలక పంచసూత్రాలు (ఎస్పిపిఎస్) తదితర కార్యక్రమాల రూపకల్పనకు కమిటీలు దోహదం చేయాలని అందులో పేర్కొన్నారు. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా మంత్రి చైర్‌పర్సన్‌గానూ, కలెక్టర్, సీఈవో జెడ్పీ, డీఆర్డీఏ పీడీ, డ్వామా పీడీ, డీపీవో, మెప్మా పీడీ, సీఈవో, డీఎంఅండ్‌హెచ్‌వో, అనిమల్ హస్బెండరీ జేడీతో పాటు స్పెషల్ ఇన్వైటీలుగా కలెక్టర్ సూచించిన వ్యక్తులతో ఈ కమిటీని రూపొందించనున్నారు. జీపీ, మండలం, మున్సిపాలిటీల్లోనూ.. గ్రామ పంచాయతీ కమిటీలో సర్పంచ్ అధ్యక్షులుగా, ఎంపీటీసీ, ఇద్దరు గ్రూపు సభ్యులు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు మెంబర్లుగా ఉంటారు. మున్సిపాలిటీ వార్డు లో కౌన్సిలర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ మెంబర్లుగా వ్యవహరిస్తారు. కార్పొరేషన్లలో కార్పొరేటర్ అధ్యక్షులుగా, ఇద్దరు ఎస్‌హెచ్‌జీ సభ్యులు, ముగ్గురు సోషియల్ యాక్టివిస్ట్‌లు, ఓ బిల్ కలెక్టర్ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయిలో ఎంపీపీ అధ్యక్షులుగా జెడ్పిటీసీతో పాటు ఇద్దరు ఎంపీటీసీలు, ఇద్దరు సర్పంచ్‌లు, ఓ ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు, ఇద్దరు సోషియల్ యాక్టివిస్ట్‌లు సభ్యులుగా ఎంపీడీవో కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీలో చైర్పర్సన్ అధ్యక్షులుగా, ఓ కౌన్సిలర్, ముగ్గురు సోషియల్ యాక్టవిస్ట్లు సభ్యులుగా, మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. మరింత అధికార జోక్యం.. ఇప్పటికే పింఛన్ల కమిటీల కారణంగా జన్మభూమి అభాసుపాలైన విషయం తెలిసిందే. ఇక జన్మభూమి కమిటీల పేరిట సోషియల్ యాక్టివిస్ట్‌ల నెపంతో అధికార టీడీపీ నాయకులు అడ్డదారిన అధికారాన్ని చెలాయిం చేందుకు మార్గం సుగమమైనట్టే. ఫలితంగా అధికారుల ప్రమేయం తగ్గి అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్లతోనే జన్మభూమి పూర్తిగా రాజకీయ కార్యక్రమంగా మారడం ఖాయమని తెలుస్తోంది. -
ప్రజాప్రతినిధులకు ఏదీ గౌరవం?
జన్మభూమిలో టీడీపీ ఇన్‌చార్జ్‌ల పెత్తనం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు దక్కని గౌరవం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా టీడీపీ నేతల చేతుల మీదుగా అధికారిక కార్యక్రమాలు చోద్యం చేస్తున్న అధికార యంత్రాంగం పార్టీ ఏదైనా.. హోదా ఏదైనా.. ఆ ప్రాంతంలో ప్రజలు ఎన్నుకున్న వారికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఇది వార్డు సభ్యుడి నుంచి ప్రధానమంత్రి వరకు రాజ్యాంగం కల్పించిన హక్కు. అయితే జిల్లా అధికారులు ప్రస్తుతం ప్రొటోకాల్ మరిచి అధికార పార్టీ నాయకులకు పెత్తనం కట్టబెడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమం ‘జన్మభూమి-మాఊరు’లో ప్రజాప్రతినిధులు కాని వారు వేదికపై ఆసీనులవుతున్నారు. అధికారులు కూడా పింఛన్లు ఇతరత్రా పత్రాలను వారి హస్తాలతోనే అందజేస్తున్నారు. సాక్షి, చిత్తూరు: ‘జన్మభూమి-మా ఊరు’ ఈ నెల 2న ప్రారంభమైంది. 4వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పల్లెసీమల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే, మండలాధ్యక్షులు చదవాలి. లేదా జెడ్పీటీసీ సభ్యులు చదవాలి. ఆపై గ్రామాల్లోని ప్రజల సమస్యలు ఆలకించి, వాటికి పరిష్కారమార్గాన్ని చూపాలి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఏవైనా ప్రజలకు చేరాల్సి ఉంటే వాటిని ప్రజాప్రతినిధుల చేతులమీద అందించాలి. కానీ జిల్లాలో మాత్రం ‘ప్రజాప్రతినిధి’అనే మాటతో పనిలేకుండా టీడీపీ నేతల ఆధ్వర్యంలో అధికారులు జన్మభూమిని నడిపిస్తున్నారు. టీడీపీ అధికారంలో ఉంది కాబట్టి... టీడీపీ కార్యకర్తలు, నాయకులంతా ప్రజాప్రతినిధులే అనే భ్రమలో అధికారులు ఉన్నారేమో జిల్లా వ్యాప్తంగా వారి ఆధ్వర్యంలో సభలు నడుస్తున్నాయి. ఇవిగో ఉదాహరణలు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి జన్మభూమిలో ఆయన పాల్గొనాలి. అధికారిక కార్యక్రమాలు ఆయనతో పాటు ఆయా మండల ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ఎంపీటీసీ ఆధ్వర్యంలో జరగాలి. కానీ టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కుతూహలమ్మ జన్మభూమి వేదికపై ఆశీసునులై ఆమె ప్రజా సమస్యలు ఆలకిస్తున్నారు. ఆమె చేతులమీదుగా కొత్త పింఛన్లు ఇతర పథకాల పత్రాలు అందజేస్తున్నారు అక్కడి అధికారులు. పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలంలో ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌కు బదులుగా టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే లలితకుమారి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక్కడ సునీల్ కంటే ఆమెకే పెద్దపీట వేయడం గమనార్హం చిత్తూరులో ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్కఠారి అనురాధ పాల్గొంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో టీడీపీ నేతలు దొరబాబు, కఠారి మోహన్, వైవీ రాజేశ్వరి, మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ కూడా పాల్గొంటున్నారు. వీరి చేతుల మీదుగా పింఛన్ల పత్రాలు పంపిణీ చేస్తున్నారు. నగరి నియోజకవర్గంలో నగరి టీడీపీ ఇన్చార్జి ముద్దుకృష్ణమనాయుడు జన్మభూమిలో అధికారికంగా పాల్గొంటున్నారు. పలమనేరులో అమరనాథరెడ్డి ఎమ్మెల్యే అనే విషయం కూడా మరిచిపోయి, జన్మభూమి కార్యక్రమానికి ఆహ్వానించకుండా అధికారులు కార్యక్రమాన్ని నడుపుతున్నారు. దీనికి నిరసనగా ఎమ్మెల్యే మంగళవారం జవ్వునిపల్లెలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ నియోజకవర్గంలో బోస్ అధికారికంగా పాల్గొంటున్నారు. ఇలా దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ జన్మభూమి టీడీపీ నేతల చేతులమీదుగానే కొనసాగుతోంది. ఇది పూర్తిగా ప్రజాప్రతినిధులను అగౌరవపరచడమేనని ప్రతిపక్షపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలను అధికారులు ప్రోత్సహించి, వేదికపైకి తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించడం మరీ దారుణమని మండిపడుతున్నారు. జన్మభూమికి ముందు ప్రతీ మండలానికి ప్రత్యేకాధికారులను నియమించారు. జిల్లాకు కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్‌తో పాటు ప్రత్యేకాధికారి జేసీ శర్మ పర్యవేక్షిస్తున్నారు. రోజూ ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సభలు నడుస్తుంటే వీరి పర్యవేక్షణ ఎలా ఉందో...రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవిస్తున్నారో ఇట్టే తెలుస్తోంది. -
రోశమ్మ పింఛనూ తీసేశారు..!
లేని భూమిని ఆమె పేరిట ఉన్నట్టుగా చెప్పిన అధికారులు ఐదెకరాలు దాటిందంటూ వృద్ధాప్య, వితంతు పింఛన్ నిలిపివేత గడచిన నెల రోజుల్లో రాష్ట్రంలో 9.16 లక్షల పింఛన్లకు కత్తెర రకరకాల కారణాలతో అనర్హులుగా వేటు వేసిన ప్రభుత్వం ఆ కారణాలు తప్పంటూ జన్మభూమి సభల్లో నిలదీస్తున్న జనం ఎక్కడికక్కడ నిలదీస్తుండటంతో తలపట్టుకుంటున్న అధికారులు అనర్హుల జాబితాపై పునఃపరిశీలనకు సర్కారు ఆదేశాలు సాక్షి, హైదరాబాద్, కలిగిరి (నెల్లూరు): రోశమ్మ ఎవరో తెలుసా? బహుశా! దూ బగుంట రోశమ్మంటే తెలుస్తుందేమో!? ఎందుకంటే సారా వ్యతిరేక ఉద్యోమానికి అంకురార్పణ జరిగింది దూబగుంటలోనే. మొదలెట్టింది రోశమ్మే. ప్రస్తుతం 80 ఏళ్లు నిండిన రోశమ్మకు ఎన్టీయార్ సీఎంగా ఉన్నప్పుడు పింఛను మం జూరైంది. ఇన్నాళ్లూ నిరాటంకంగా వచ్చింది. కానీ ఇపుడు నిలిచిపోయింది. కారణం... ఆమెకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉందట!! తనకు ఐదెకరాలు లేనేలేదని, ఉంటే అదెక్కడుందో చూపిస్తే చాలు పెన్షన్ ఇవ్వకపోయినా పర్వాలేదని రోశమ్మ మొత్తుకుంటున్నా వినేవారు లేరు. అదే విషయం స్థానిక ఎంపీడీవోనడిగితే... దానిపై విచారణ జరిపాక తేలుస్తామన్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తూర్పు దూబగుంటలో బుధవారం జరిగిన జన్మభూమి లో ఈ ఘటన చోటుచేసుకుంది. అక్కడ ప్రకటిం చిన పింఛనర్ల జాబితాలో 80 ఏళ్లు నిండిన వితంతువు రోశమ్మ పేరు విత్‌హెల్డ్‌లో ఉంచారు. ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. ఐదెకరాలకు పైగా భూమి ఉందని అధి కారులు పింఛన్ ఆపేశారు. గతంలో వృద్ధాప్య పింఛన్ వచ్చేది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’ అనేది రోశమ్మ ఆవేదన. ఇదొక్క రోశమ్మ వ్యవహారమే కాదు. విజ యనగరం జిల్లా సాలూరు మండలం ఖరాసు వలస గ్రామ సభలో కళ్లెదుట కనిపిస్తున్న వృద్ధురాలు చిన్నమ్మిని ఏకంగా నువ్వు మహిళవే కాదంటూ వెనక్కి పంపేశారు. గుంటూరు జిల్లా లో సొంతిల్లు కూడా లేక పూరింట్లో అద్దెకుం టున్న షేక్ గాలిబ్ సాహెబ్‌కు నీకు ఐదెకరాల కన్నా ఎక్కువ భూమి ఉంది కనక పింఛను రాదు పొమ్మన్నారు. అదే జిల్లాలో పండు ముసలి షేక్ మౌలాబీని నీ వయసు 55 ఏళ్లే కనక అనర్హురాలివన్నారు. ఇవన్నీ జరగటానికి కారణం ఒక్కటే! పింఛన్ల భారాన్ని తగ్గించుకోవటానికి, బడ్జెట్లో కేటాయించిన అరకొర మొత్తాన్నే పింఛను దార్లందరికీ సర్దడానికి ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. వీలైనన్ని పింఛన్లకు కోత పెడుతోంది. ప్రభుత్వం పెట్టిన కొత్త నిబంధనలు, తనిఖీల కారణంగా గడిచిన 15 రోజుల్లో దాదాపు 9.16 లక్షల మంది పెన్షనర్లు అనర్హులైపోయారు. ఎందుకంటే గత నెలలో రాష్ట్రంలో దాదాపు 43.12 లక్షల మంది పింఛను తీసుకోగా ఈ నెలలో 33.96 లక్షల మందికే ప్రభుత్వం పింఛను మంజూరు చేసింది. అన్ని ధ్రువపత్రా లూ ఇచ్చామని, వేలి ముద్రలు కూడా తీసుకున్నారని, అయినా గ్రామ సభల్లో అందరి ఎదుటా ఇచ్చే పింఛన్లలో అనర్హులు ఎందుకుంటారని లబ్ధిదారులు అడుగుతున్నా వినేవారు లేరు. కొందరి వయసు తగ్గించి, మరికొందరికి భూమి ఉందని చెప్పి... ఇలా రకరకాల కారణాలతో కోతలు వేసేస్తున్నారు. వీటిపై గ్రామ స్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాల్లో పింఛనుదారుల ప్రశ్నలకు జవాబు చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడులో ఐదెకరాల భూమి ఉందంటూ తొలగించినడంతో ఆగ్రహించిన పిం ఛనుదారు ‘‘నాకు పింఛనొద్దు. ఆ భూమి ఎక్క డుందో చూపించండి చాలు’’ అని అధికారుల్ని నిలదీశారు. ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. దిద్దుబాటులో ప్రభుత్వం పింఛన్ల కత్తిరింపుపై నిరసనలు వెల్లువెత్తడంతో అధికారులు అప్రమత్తమయింది. తొలగించిన 9,16,310 పింఛను దార్లలో 3,34,569 మందిని ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ, మున్సిపల్ వార్డు కమిటీలు అనర్హులుగా నిర్ధారించాయి. ఈ కమిటీలు అర్హులుగా పేర్కొన్నప్పటికీ 4.70 లక్ష లమందిని ప్రభుత్వమే అనర్హులంటూ కోతపెట్టింది. మరో 1.11 ల క్షల మంది గ్రామ సభలకు అందుబాటులో లేకపోవటంతో వారూ అనర్హులయ్యారు. ప్రభుత్వం తొలగించిన 4.70 లక్షల మందిలో 90శాతం మంది అర్హులేనని పునః పరి శీలనలో తేలటంతో మొత్తం అనర్హుల జాబితాను మరోసారి పరిశీలించాలని జిల్లా అధికారులకు సూచించినట్లు తెలిసింది. కాగా పింఛను, రేషన్ కార్డు, ఆధార్లను అనుసంధానం చేయటంతో వాటిలోని తప్పుల వల్లే భారీ సంఖ్యలో అనర్హులు తేలినట్లు అధికారులు చెబుతున్నారు. జన్మభూమి సభల్లోనే పింఛన్ల పంపిణీ పదేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పింఛన్ల పంపిణీ జరిగే పద్ధతి ఇపుడు పునరావృత్తమైంది. పదేళ్లుగా ప్రతి నెలా 1వ తేదీ నుంచి 5లోగా గ్రామ, మున్సిపల్ వార్డులో పింఛన్ల పం పిణీ పూర్తయ్యేది. 15వ తేదీ కల్లా జిల్లాలో పంపీ ణీ చేసిన మొత్తం పింఛన్ల వివరాలు జిల్లా అధికారులకు చేరేవి. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ కాలంలో నెలవారీ పింఛన్ల పంపిణీ బదులు జన్మభూమి కార్యక్రమం సందర్భంగా మూడు నుంచి ఆరు నెలల పింఛన్ల డబ్బు ఒకేసారి ఇచ్చేవారు. ఈ ఏడాది అక్టోబరు నెల పింఛన్‌ను కూడా జన్మభూమి సభల్లోనే పంపిణీ చేస్తున్నారు. ‘‘నాకు 3.60 ఎకరాల మెట్ట, 45 సెంట్ల మాగాణి ఉంది. మొత్తం 4.05 ఎకరాలు. కానీ పెన్షన్ ఎందుకు ఆపేశారని అడిగినపుడు ఐదెకరాలకు పైగా భూమి ఉండటం వల్లనని అధికారులు చెప్పారు. ఎన్టీరామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్య పింఛన్ వస్తోంది. ఇప్పుడు వితంతు పింఛన్‌కూ నేను అర్హురాలినే. కిడ్నీలు పాడయి, నడవలేని స్థితిలో ఉన్న నాకు... పెన్షన్ ఎపుడిస్తారో తెలియటం లేదు’’ - రోశమ్మ కేటాయింపులనాడే తేలిన కోతలు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ కొన్ని అంశాలు మీడియా దృష్టికి తెచ్చారు. ‘‘గ్రామీణాభివృద్ధి శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రం లో 43.11 లక్షల మంది పెన్షనర్లున్నారు. వీరికి నెలకు చెల్లిస్తున్నది రూ.130 కోట్లు. అక్టోబరు 1నుంచి కనీస పింఛను రూ.1000 చేస్తున్నారు కాబట్టి అప్పటిదాకా ఐదు నెలల పాటు అంటే నెలకు రూ.130 కోట్ల చొప్పున రూ.650 కోట్లవుతాయి. పెండింగ్‌లో ఉన్న 15 లక్షల కొత్త పింఛను దరఖాస్తుల్ని లెక్కలోకి తీసుకోకుండానే ఇవే 43.11 లక్షల పిం ఛన్లకు నెలకు రూ.1000 చొప్పున లెక్కిస్తే కావాల్సింది 431 కోట్లు. రూ.1500 చెల్లించాల్సిన వికలాంగ పెన్షనర్లను పరిగణనలోకి తీసుకుంటే మరో 10 కోట్లు కావాలి. మొత్తం మీద నెలకు కావాల్సింది రూ.440 కోట్లు. 7 నెలలకు రూ.3080 కోట్లవుతాయి. దీనికి 650 కోట్లు కలిపితే బడ్జెట్లో కేటాయించాల్సింది రూ.3730 కోట్లు. కేటాయించింది 1338 కోట్లు. దీనర్థం ఉన్న పింఛన్లను ఊడబెరుకుతామనే కదా?’’ అంటూ ప్రభుత్వం వేయబోతున్న కత్తిరింపుల్ని ముందే మీడియాతో పంచుకున్నారు. ప్రస్తుత కోతలు అదే తీరులో ఉండటం ప్రస్తావనార్హం. - జగన్ -
రోశమ్మ పింఛనూ తీసేశారు..!
-
అనర్హులకు పైసా ఇచ్చే ప్రసక్తే లేదు
నగరి : అనర్హులుగా తేలిన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో కౌన్సిలర్ మునికృష్ణయ్య అధ్యక్షతన ఇన్చార్జి కమిషనర్ ప్రసాద్ నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైర్పర్సన్ శాంతికుమార్ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పింఛన్లు తొలగించేశారని పలువురు విమర్శిస్తున్నారని అర్హులకు ఎవరికీ తొలగించలేదన్నారు. అనర్హులైన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అర్హులైన వారికి తొలగిపోయివుంటే వారికి తప్పక ఇప్పిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని సమస్యలు తెలుసుకోవడానికే నిర్వహిస్తున్నామన్నారు. లక్షన్నరదాకా రుణమాఫీ తప్పకచేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా తప్పక న్యాయం చేస్తామన్నారు. మరో అతిథి మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడం కారణంగా తీవ్రమైన ఆదాయపు లోటు ఏర్పడిందన్నారు. ఈ దశలోను ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చైర్పర్సన్ శాంతికుమార్ స్మగ్లర్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమావేశ ప్రాంగణంలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పెంచలకిషోర్, డీఎస్పీ కృష్ణకిషోర్ రెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, వైస్‌చైర్మన్ పీజీ నీలమేఘం, మాజీ చైర్మన్ కేజేకుమార్, జడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం, ఎంపీపీ మీరా, మాజీ సర్పంచ్ శ్రీహరినాయుడు, సహకార బ్యాంకు చైర్మన్ బాలసురేష్, వైద్యాధికారి సుభాషిణి, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయ అధికారి రమేష్‌రాజు, పశువైద్య, ఐకేపీ, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు. -
వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయండి
చిత్తూరు(సిటీ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి అక్టోబర్ 20 వతేదీ వరకు నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై వ్యవసాయశాఖాధికారులతో బుధవారం జేడీ తన కార్యాలయంలో సమీక్షించా రు. గ్రామ, మండల స్థాయిల్లో రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి, వారి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు అందజేయాలని సూచించారు. ము ఖ్యంగా మట్టినమూనాలు, ఎరువులను మిశ్ర మం తయారీ, వాడే పద్ధతులను వివరించాలన్నారు. మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పం టల పరిశీలన, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైతులకు వివరణ కార్యక్రమాలను తప్పకుండా చేపట్టాలన్నారు. డీడీలు నిర్మల్ నిత్యానందం, యుగంధర్, ఏడీలు మనోహర్, భాస్కరయ్య, ఆత్మ డీడీ అనంతరావు, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు. పలు దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేయండి - హౌసింగ్ పీడీ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ వెంకటరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా సమాఖ్య భవనంలో జన్మభూమి కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ పాత్రపై అధికారులకు అవగాహన కల్పించారు. నిర్ధారిత అధికారులు రెండు టీములుగా విడిపోయి ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ఆలస్యానికి గల కారణాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు. అలాగే లబ్ధిదారులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, ఆధార్ సీడింగ్ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించిన తరువాతనే వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించండి జన్మభూమి కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యశాలల సమస్వయకర్త(డీసీహెచ్ఎస్) డాక్టర్ సరళమ్మ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలపై మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. మున్సిపల్, మండల స్థాయిల్లో రెండు టీములను సిద్ధం చేసి, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ, మాతా శిశుమరణాల తగ్గింపు, గ్రహణమొర్రి తదితర అంశాలపై తెలియజేయాలన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. నివేదికలను సిద్ధం చేసుకోండి -డ్వామా పీడీ జిల్లాలో గురువారం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ గోపీచంద్ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై పీడీ బుధవారం తన కార్యాలయంలో ఏపీడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ ద్వారా గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిర జలప్రభ, వాటర్‌షెడ్డు పథకాలకు సంబంధించి అన్ని రికార్డులను సిద్ధం చేసుకుని హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు.