చిత్తూరు(సిటీ): జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం నుంచి అక్టోబర్ 20 వతేదీ వరకు నిర్వహించనున్న జన్మభూమి కార్యక్రమంలో వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ రవికుమార్ స్పష్టం చేశారు. జన్మభూమి కార్యక్రమ నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సిన అంశాలపై వ్యవసాయశాఖాధికారులతో బుధవారం జేడీ తన కార్యాలయంలో సమీక్షించా రు.
గ్రామ, మండల స్థాయిల్లో రెండు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి, వారి ద్వారా క్షేత్రస్థాయికి వెళ్లి పంటలను పరిశీలించి రైతులకు సూచనలు అందజేయాలని సూచించారు. ము ఖ్యంగా మట్టినమూనాలు, ఎరువులను మిశ్ర మం తయారీ, వాడే పద్ధతులను వివరించాలన్నారు. మధ్యాహ్నం వరకు క్షేత్రస్థాయిలో పం టల పరిశీలన, మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రైతులకు వివరణ కార్యక్రమాలను తప్పకుండా చేపట్టాలన్నారు. డీడీలు నిర్మల్ నిత్యానందం, యుగంధర్, ఏడీలు మనోహర్, భాస్కరయ్య, ఆత్మ డీడీ అనంతరావు, ఏడీఏలు, ఏవోలు పాల్గొన్నారు.
పలు దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేయండి - హౌసింగ్ పీడీ
జిల్లాలో వివిధ దశల్లో ఉన్న ఇళ్ల వివరాలను సిద్ధం చేసి ఉంచుకోవాలని జిల్లా గృహనిర్మాణ శాఖ పీడీ వెంకటరెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన జిల్లా సమాఖ్య భవనంలో జన్మభూమి కార్యక్రమంలో గృహనిర్మాణశాఖ పాత్రపై అధికారులకు అవగాహన కల్పించారు. నిర్ధారిత అధికారులు రెండు టీములుగా విడిపోయి ఆయా గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న, అసంపూర్తిగా ఉన్న ఇళ్లు, ఆలస్యానికి గల కారణాలను లబ్ధిదారులకు వివరించాలన్నారు. అలాగే లబ్ధిదారులు ఇచ్చే ఫిర్యాదులను స్వీకరించడం, ఆధార్ సీడింగ్ ఆవశ్యకతను తెలియజేయాలన్నారు. ప్రతి ఇంటిని స్వయంగా పరిశీలించిన తరువాతనే వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఈఈలు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై అవగాహన కల్పించండి
జన్మభూమి కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యశాలల సమస్వయకర్త(డీసీహెచ్‌ఎస్) డాక్టర్ సరళమ్మ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో చేపట్టాల్సిన అంశాలపై మెడికల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించారు. మున్సిపల్, మండల స్థాయిల్లో రెండు టీములను సిద్ధం చేసి, ఎన్టీఆర్ ఆరోగ్యసేవ, మాతా శిశుమరణాల తగ్గింపు, గ్రహణమొర్రి తదితర అంశాలపై తెలియజేయాలన్నారు. వైద్య శిబిరానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఆయా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కార్యకర్తల సహకారం తీసుకుని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.
నివేదికలను సిద్ధం చేసుకోండి
-డ్వామా పీడీ
జిల్లాలో గురువారం నుంచి 20 వ తేదీ వరకు నిర్వహించే జన్మభూమి కార్యక్రమానికి సంబంధించి అన్ని నివేదికలను సిద్ధం చేసుకోవాలని జిల్లా నీటియాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్ గోపీచంద్ ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంలో తీసుకోవాల్సిన అంశాలపై పీడీ బుధవారం తన కార్యాలయంలో ఏపీడీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాఖ ద్వారా గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఇందిర జలప్రభ, వాటర్‌షెడ్డు పథకాలకు సంబంధించి అన్ని రికార్డులను సిద్ధం చేసుకుని హాజరు కావాలని ఆదేశించారు. అనంతరం పలు రికార్డులను తనిఖీ చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు.
వ్యవసాయ ప్రదర్శనలు ఏర్పాటు చేయండి
Published Thu, Oct 2 2014 3:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement