- యథేచ్ఛగా తెలుగు తమ్ముళ్ల ఇసుక దందా
- అధికారులు అడ్డుకుంటే బదిలీ వేటు హెచ్చరికలు
- ప్రభుత్వ లక్ష్యం 16.20 లక్షల క్యూబిక్ మీటర్ల అమ్మకం
- అమ్మింది 2.7లక్షల క్యూబిక్ మీటర్లే
- మిగిలిందంతా తమ్ముళ్ల జేబుల్లోకి
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో తెలుగు తమ్ముళ్ల ఇసుక స్మగ్లింగ్‌తో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. పేరుకు ఇసుక రీచ్‌ల బాధ్యతను మహిళా సంఘాలకు ఇచ్చామని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతోంది. మహిళాసంఘాలు అమ్మినట్లు చూపిస్తున్న ఇసుక పదిహేను శాతానికి మించిలేదు. పచ్చచొక్కాల నేతలే 85 శాతం ఇసుకను అమ్మేసుకుంటూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. అయినా అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికారులు సాహసించడంలేదు. కాదు కూడదని మాట్లాడితే సెలవుపెట్టి వెళ్లిపోమంటూ బెదిరిస్తున్నారు. ‘తమ్ముళ్లు’ ఇచ్చిన కాకిలెక్కలనే అధికారులు ‘ఇసుక అమ్మకాల లెక్కలు..’ అంటూ చూపిస్తూ చేతులు దులుపుకుంటున్నారు.
సాక్షి, చిత్తూరు: జిల్లావ్యాప్తంగా 31 మం డలాల పరిధిలో 58 ఇసుక రీచ్‌లను గుర్తించారు. వీటి ద్వారా 16,19,878 క్యూబిక్ మీటర్ల ఇసుక అమ్మాలన్నది లక్ష్యం. ఇప్పటివరకూ కేవలం 2,70,271 క్యూబిక్ మీటర్ల ఇసుక మా త్రమే అమ్మారు. ప్రభుత్వానికి వచ్చిన రాబడి .*8.44 కోట్లు మాత్రమే. గణాం కాల ప్రకారం ప్రభుత్వంపరంగా 15 శాతం మాత్రమే ఇసుక అమ్మకాలు జరి గినట్లు తెలుస్తోంది. మిగిలిన ఐదు రెట్ల ఇసుకను అధికారపార్టీ నేతలు అమ్మేసుకుని కోట్లు దండుకున్నారు. నేతలకు భయపడి అధికారులు ఇసుక అధికంగా,అందుబాటులో ఉన్న పలు రీచ్‌లలో ప్రభుత్వ అమ్మకాలను దాదాపు నిలిపి వేశారు. ఏర్పేడు మండలం ముసలిపేడు రీచ్‌లో లక్షా ఒక్కవేయి క్యూబిక్ మీటర్ల ఇసుకను అమ్మాల్సి ఉండగా, 11 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే ప్రభుత్వం అమ్మింది.
కేవీపల్లె మండలం జిల్లేళ్లమంద రీచ్‌లో లక్షా 71 వేల క్యూబి క్ మీటర్లకు గాను, 16వేలు, పెద్దతిప్ప సముద్రం రాపూరివాండ్లపల్లె రీచ్‌లో లక్షా 39 వేల క్యూబిక్ మీటర్లకు గానూ, 738, కలికిరి పరపట్లలో 56,444కు గానూ, 4 వేలు, అడ్డంవారిపల్లె రీచ్‌లో 55,044కుగానూ 15 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను మాత్రమే అమ్మినట్లు గణాంకాలు చూపిస్తున్నాయి. ఇక తమ్ము ళ్ల దెబ్బ తాళలేక ఇసుక అధికంగా ఉన్న తొట్టంబేడు మండలం పెద్దకనపర్తి, విరూపాక్షపురం, నగరి సత్రవాడ, చిత్తూరు అనగల్లు, ముత్తుకూరు, జీడీ నెల్లూరులోని నందనూరు,పెద్దపంజాణి మండలంలోని శంకరరాయలుపేట ఇసుక రీచ్‌లను సైతం ఏకంగా వారికే వదిలేశారు.
ఈ రీచ్‌లలో దేశం నేతలే ఇసుక అమ్మకాలు సాగిస్తున్నారు. నాగలాపురం మండలం సురుటపల్లి, శ్రీకాళహస్తి మండలంలోని రామలింగాపురం, పూతలపట్టు మండలం ముత్తిరేవులు, నిమ్మనపల్లెలో మాత్రం నూరు శాతం అమ్మకాలు పూర్తిచేసి రీచ్ లను నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నా, మరోవైపు అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. డీఆర్‌డీఏ, మైనింగ్, రవాణా, రెవెన్యూ, పోలీసు, విజిలెన్స్ తదితర విభాగాలకు అక్రమ రవాణా నియంత్రణ బాధ్యతలు అప్పగించినా ‘తమ్ముళ్ల’ బెదిరింపులతో మౌనంగా ఉంటున్నారు. కాదూ కూడదని ఎవరైనా అడ్డుకుంటే బదిలీ చేసుకుని వెళ్లండి అంటూ తమ్ముళ్లు హెచ్చరికలు చేస్తున్నారు.
తెలుగుతమ్ముళ్లు.. ఇసుకాసురులు
Published Mon, May 11 2015 4:03 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
Advertisement