► అక్రమ ఇసుక రవాణాలో వారిదే కీలకం
► పట్టుకున్న పదినిమిషాల్లోనే పర్మిషన్ వచ్చింది
► నివ్వెరబోయిన పోలీసులు
మెదక్‌రూరల్: మండలంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణా హైడ్రామా ఎవరికి అంతుకు చిక్కడం లేదు. బొల్లారం హల్దివాగు నుంచి ఇసుకను తీయవద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ అధికారులు అనుమతి ఇవ్వడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మిషన్ భగీరథ పేరుతో ఇసుకను తోడేస్తున్నారు. గురువారం బొల్లారం మత్తడి నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు మెదక్‌రూరల్ పోలీసులు అక్కడికి చేరుకొని రెండు ట్రాక్టర్లను మెదక్ రూరల్ స్టేషన్‌కు తరలించడానికి యత్నించారు.
మార్గ మధ్యలోకి రాగానే, అప్పటి వరకు లేని పర్మిషన్లు మధ్యలోనే పుట్టుకొచ్చాయి. ట్రాక్టర్లను వదిలేయాలంటూ మండలానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు రంగ ప్రవేశం చేశారు. కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతూ, తమవద్ద అనుమతులున్నాయని, ఎలా ట్రాక్టర్‌లను స్టేషన్‌కు తరలిస్తారని ప్రశ్నించినట్లు సమాచారం. వర్‌లు అనుమతులు లేవంటూ చెప్పడంతో ట్రాక్టర్లను స్టేషన్‌కు తరలించామని ఎస్‌ఐ లింబాద్రి తెలిపారు. అనుమతి తీసుకుంటే మాకేందుకు సమాచారం ఇవ్వలేదని ఆయన వారిని ప్రశ్నించారు. ఇసుక రవాణా కోసం తహశీల్దార్ కార్యాలయంలో అనుమతి పొందిన పత్రాన్ని ముందుగా పోలీసు స్టేషన్‌లో ఇవ్వాల్సి ఉండగా, పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఇసుక రావాణా కొనసాగిస్తున్నారు. దీంతో ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుంటే అనుమతించామంటూ అధికారులు వారికి వత్తాసు పలకడంతో ఇసుక అక్రమ రవాణా యధేచ్చగా కొనసాగుతుంది.
అధికారులు, ప్రజాప్రతినిధుల హైడ్రామా
Published Fri, Jul 7 2017 8:16 AM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
Advertisement
Advertisement