- దర్జాగా ఇసుక తరలింపు
- ప్రభుత్వ పనుల పేరిట అనుమతి
- ప్రరువేటు పనులకు సరఫరా
- ఇసుక మాఫియా కొత్త దారి
- అధికారుల తీరు ‘మామూలే’
బాన్సువాడ : ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నా, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడంలో విఫలమవుతోంది. మంజీరా తీర ప్రాంతాల నుంచి రోజూ పదుల సంఖ్య లో లారీలు, టిప్పర్లలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూనే ఉన్నారు. మూడు నెలల క్రితం వరకు పట్టాభూముల నుంచి ఇసుక రవాణా సాగింది. ఈ విషయమై దుమారం రేగడంతో ఇసుక తరలింపును నిలిపివేసిన విషయం విదితమే. దీంతో ఇసుక తరలింపునకు కాంట్రాక్టర్లు కొత్త వ్యూహం పన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువల ఆధునీకరణ కు ఇసుక కావాలని అనుమతి తీసుకుని హైదరాబాద్‌కుతరలిస్తున్నట్లు తెలుస్తోంది.
భారీ వాహనాలు,టిప్పర్లపై ‘ఆన్ గవర్నమెంట్ డ్యూటీ’ అనే ఫ్లె క్సీ లు, కరపత్రాలు పెట్టుకొని ఇసుకను తరలి స్తున్నారు. బీర్కూర్ మండలం కిష్టాపూర్ సమీపంలో ఉన్న మంజీరా నదీ తీరం నుంచి ఇసుకను జేసీబీల ద్వారా తోడుతున్నారు. నిజానికి నిజాంసాగర్ ప్రాజెక్టు ఆధునీకరణకు దశలవారీగా ఇసుకను తరలిస్తున్నారు. గతంలో వెయ్యి లారీల ఇసుకను తరలించిన కాంట్రాక్టర్, ప్రస్తు తం వారంలో మూడుసార్లు తహశీల్దార్ ద్వారా వేబిల్లు పొంది, యథేచ్ఛగా ప్రరుువేటు పనుల కు తరలిస్తున్నారు. ఆయూ గ్రామాలలో వీఆర్‌ఓ లు ఇసుక ట్రిప్పులను నమోదు చేయాల్సి ఉండగా, వారు అమ్యామ్యాలకు లొంగి, కాందార్ల ను క్వారీ పాయింట్ల వద్ద ఉంచి, వారి చేత లారీల నంబర్లను నమోదు చేరుుస్తున్నారనే ఆ రోపణలు వినిపిస్తున్నారుు. వారు కొన్ని లారీల నంబర్లు నమోదు చేసి, మరి కొన్నింటిని వదిలేస్తున్నారని తెలుస్తోంది. ఇలాంటి లారీలను బా న్సువాడ శివారు వరకు తీసుకెళ్లి, లారీకు ఉన్న ఫ్లెక్సీని తొలగించి నేరుగా హైదరాబాద్‌కు పం పుతున్నట్టు సమాచారం. కొన్ని రహస్య ప్రాం తాలలోనూ ఇసుకను డంప్ చేసి, టిప్పర్ల ద్వారా భవన నిర్మాణదారులకు విచ్చలవిడిగా విక్రయించుకొంటున్నారు.
కొత్త విధానంతోనూ ప్రయోజనం శూన్యం
అక్రమార్కులపై కేసులు పెట్టినా, జరిమానాలు విధిస్తున్నా అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. ఇసుక రవాణాలో నెల రోజుల క్రితం ప్రవేశపెట్టిన కొత్త విధానం ద్వారా సైతం ఎ లాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మంజీరా తీర ప్రాంతాలైన బాన్సువాడ మండలం చింతల్‌నాగారం, బీర్కూర్ మండలం దామరంచ, కిష్టా పూర్, బీర్కూర్, బరంగేడ్గి, కోటగిరి మం డలం హంగర్గ, పొతంగల్, బిచ్కుంద మం డలం బండరెంజల్, గుండెనెమ్లి, వాజీద్‌నగర్, పుల్కల్, హస్గుల్, ఖద్‌గాం, శెట్లూర్, పిట్లం మండలం మద్దెల్ చెరువు గ్రామాలకు ఆనుకొని ఉన్న మంజీరా నుంచి రోజూ వందల సంఖ్యలో ట్రాక్టర్లలకు ఇసుకను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క కోటగిరి మండలం పొతంగల్ నుంచే కొందరు అక్రమార్కులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు, టిప్పర్లలో ఇసుకను తరలిస్తూ, వర్నీలో డంప్ చేస్తున్నారు. అక్కడి నుంచి నిజామాబాద్, బోధన్, కామారెడ్డి ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్‌కు రూ. 2500, టిప్పర్‌కు రూ. 8వేల వరకు వసూలు చేస్తున్నా రు. ప్రభుత్వ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. మండల స్థాయి అధికారులకు నెలనెలా మామూళ్లు ముట్టజెప్పుతూ అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. కొన్నిచోట్ల అధికారుల అండదండలతోనే ఈ అక్రమ రవాణా సాగుతోంది.