Contractors
-
కాలం చెల్లిన సరుకులు...కుళ్లిన గుడ్లు
సాక్షి, హైదరాబాద్: పురుగులు పట్టిన బియ్యం, కుళ్లిన గుడ్లు, పాడైపోయిన కూరగాయలు, గడువు తీరిపోయిన (ఎక్స్పైర్ అయిన) నిత్యావసరాలు, అపరిశుభ్ర పరిస్థితుల్లో వాటి నిల్వ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, హాస్టళ్లలో ఎక్కడ చూసినా ఇదే దుస్థితి. ఇదేమిటని అధికారులు ప్రశి్నస్తే... కాంట్రాక్టర్ల నుంచి నాణ్యతలేని సరుకులు వస్తున్నాయని, ఇదేమిటంటే రాజకీయ నేతల పేర్లు చెప్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామనే సమాధానాలు వస్తున్నాయి. అదే సమయంలో విద్యా సంస్థల్లో అపరిశుభ్ర పరిసరాలు, నిర్లక్ష్యం కూడా అధికారుల తనిఖీలలో స్పష్టంగా బయటపడుతోంది.కలుషిత ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న ఘటనలతో స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం... క్షేత్రస్థాయిలో తనిఖీలకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మండల స్థాయి అధికారులు మొదలుకొని కలెక్టర్ల వరకూ తనిఖీలు ప్రారంభించారు. అటు రాష్ట్రస్థాయి విద్యాశాఖ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, విద్యా కమిషన్ చైర్మన్, సభ్యులు కూడా పరిశీలన చేపట్టారు. ఈ క్రమంలో విద్యా సంస్థలు, హాస్టళ్లలో దారుణమైన పరిస్థితులు వెలుగులోకి వస్తున్నాయి.కాంట్రాక్టర్లు కారణమంటూ.. ⇒ నాణ్యత లోపించిన ఆహారం కనిపించినా, కలుషితమైన ఆహారంతో విద్యార్థులు అస్వస్థతకు గురైనా... సంబంధిత స్కూల్ ప్రధానోపాధ్యాయులు (హెచ్ఎంలు), ఇతర క్షేత్రస్థాయి విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవడం పరిపాటి అయిపోయిందన్న విమర్శలు వస్తున్నాయి. నాణ్యతలేని సరుకులు సరఫరా చేసే కాంట్రాక్టర్లను వదిలిపెట్టి తమను వెంటాడితే ఫలితం ఏమిటని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గురుకులాలకు పాలు, పండ్లు, అల్లం, వెల్లుల్లి, కూరగాయలు, గుడ్లు, చికెన్ ఇతర నిత్యావసరాలను టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో జీసీసీ ద్వారా హాస్టళ్లకు కూడా కాంట్రాక్టర్లే సరుకులు ఇస్తున్నారు.గడువు తీరిన నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారని హెచ్ఎంలు, ఉపాధ్యాయులు చెబుతున్నారు. కాంట్రాక్టర్లు పల్లీపట్టీలు, మసాలా దినుసులు ఎక్కడ కొనుగోలు చేసి, తెస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని.. అరటిపండ్లను దూర ప్రాంతాల నుంచి తీసుకొస్తుండటంతో విద్యా సంస్థలకు చేరేలోగా కుళ్లిపోతున్నాయని అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వాటిని గుర్తించి, తిరస్కరిస్తే కాంట్రాక్టర్లు ఎదురుదాడికి దిగుతున్నారని చెబుతున్నారు. ప్రతి కాంట్రాక్టర్ ఏదో ఒక రాజకీయ నాయకుడికి అనుచరుడు కావడం, ఆ నేతల పేర్లు చెప్పి బెదిరిస్తుండటంతో ఏమీ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. వాస్తవ పరిస్థితి తెలుసుకోకుండా తమను బలి చేస్తే ఆహార నాణ్యత ఎలా పెరుగుతుందని ప్రశి్నస్తున్నారు. విద్యాసంస్థలకు పౌర సరఫరాల శాఖ సరఫరా చేస్తున్న బియ్యంలోనూ పురుగులు ఉంటున్నాయని చెబుతున్నారు.పరిశీలనలో వెలుగు చూసిన వాస్తవాలెన్నో ⇒ ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పంగిడి మాదర వసతి గృహంలో చిన్నారులకు చెంచాలతో పాలు పోస్తున్న తీరు తనిఖీల్లో బయటపడింది. ఇక్కడ పాలలో రాగిమాల్ట్, బెల్లం వంటివేవీ కలిపి ఇవ్వడం లేదు. ⇒ కెరమెరి మండలం గిరిజన ఆశ్రమ పాఠశాలలో గడువు తీరిన ఉప్పు ప్యాకెట్‌ను కలెక్టర్ గుర్తించారు. అలాగే గడువు తీరిన ఉప్పు ప్యాకెట్లు ఆసిఫాబాద్ జీసీసీ గోదాంలో 12 క్వింటాళ్లు, చిక్కీలు 12 క్వింటాళ్లు ఉన్నట్టు తేలింది. ⇒ విద్యార్థులకు వారంలో నాలుగుసార్లు గుడ్డు ఇవ్వాలి. అది కనీసం 50 గ్రాముల కన్నా ఎక్కువ బరువు ఉండాలి. కానీ 40 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న గుడ్లు ఇస్తున్నారని, అందులోనూ పలుచోట్ల కుళ్లిపోయిన గుడ్లు వస్తున్నాయని అధికారుల పరిశీలనలో తేలింది. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. కాంట్రాక్టర్లను నోటిమాటగానే హెచ్చరిస్తున్నారని, ఎలాంటి చర్య తీసుకోవడం లేదని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు. ⇒ మహబూబ్‌నగర్ జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం అమలును అధికారులు తనిఖీ చేశారు. చాలా చోట్ల 3, 4 రోజులకోసారి కూరగాయలు తీసుకొస్తున్నారు. వండే సమయానికి అవి చెడిపోతున్నాయని, పురుగులు, దోమలు వాలుతున్నట్టు అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ⇒ ధన్వాడలోని కేజీబీవీని నారాయణపేట కలెక్టర్ రాత్రివేళ తనిఖీ చేశారు. అక్కడ నిల్వ ఉంచిన వంకాయలు మెత్తబడిపోయి ఉన్నట్టు గుర్తించారు. మరికల్ తహసీల్దార్ సాంఘిక సంక్షేమ గురుకులాన్ని సందర్శించారు. నేలపై కూరగాయలు కుప్పలుగా పోసి నిల్వచేసి ఉన్నాయి. దీనితో కలుషి తమై, అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని సిబ్బందిపై తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ మెదక్ జిల్లా చేగుంట మండలం చిన్న శివనూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో వంట చేసే ఆవరణ అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు. విద్యార్థులు చేతులు, కంచాలు కడిగే చోట దుర్వాసన వస్తోంది. వెల్దుర్తి మండలం కుకునూరు ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో.. భోజనం సమయంలో కుక్కలు, పందులు వస్తున్నాయి. -
కాంట్రాక్టర్లకు మళ్లీ మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు
సాక్షి, అమరావతి: కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇచ్చే విధానాన్ని మళ్లీ పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విధానాన్ని తిరిగి తీసుకొస్తేనే పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకొస్తారనే అభిప్రాయం వ్యక్తమవడంతో దాన్ని మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిసింది. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆ నిర్ణయాలను ప్రభుత్వం బయటకు వెల్లడించే అవకాశంలేకపోవడంతో వాటిని అధికారికంగా విడుదల చేయలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి..» రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో వాటిని తగ్గించేందుకు పీడీ చట్టాన్ని పటిష్టం చేసేలా చట్టాన్ని సవరించాలని తీర్మానించారు. » లోకాయుక్త చట్టాన్ని సవరించే నిర్ణయానికి ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. లోకాయుక్తను నియమించే సమయంలో ప్రతిపక్ష నేత ఉండాల్సి ఉన్నందున.. ప్రస్తుతం ప్రతిపక్ష నేత లేని పరిస్థితిలో ఏం చేయాలనే దానిపై మంత్రులు చర్చించారు. పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్షం లేకుండానే ఇలాంటి వ్యవహారాల్లో ఎలా వ్యవహరించారో ఇక్కడ కూడా అలాగే వ్యవహరించాలని నిర్ణయించారు. » ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు) సమావేశంలో రూ.85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి వచ్చిన ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. » దేవాలయ కమిటీల్లో అదనంగా ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టాన్ని సవరించాలన్న నిర్ణయానికి అంగీకారం తెలిపారు. » కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ఆమోదం.. » యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపి దానికి ఈగల్ అని పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయించింది. » ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయడానికి ఆమోదం తెలిపారు. » అమరావతిలో నిర్మాణ పనులకు మళ్లీ కొత్తగా టెండర్లు పిలవడానికి ఆమోదం తెలిపింది. ఇందుకోసం సాంకేతిక కమిటీ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. » నూతన క్రీడలు, పర్యాటక విధానాలకు ఆమోదం తెలిపారు. అధికారులు చెప్పింది చెప్పినట్లుగా బయటకు చెప్పొద్దు..ఇక మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత చంద్రబాబు రాజకీయ అంశాలపై చర్చించినట్లు తెలిసింది. పర్యాటక, స్పోర్ట్స్ పాలసీల్లో స్థానికంగా ప్రతిభ చూపించే విద్యార్థులను ప్రోత్సహించాలని ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సూచించారు. పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే క్రమంలో అది సురక్షితంగా ఉండేలా చూడాలని, లేకపోతే ఇబ్బందులు వస్తాయనే అంశంపై చర్చ జరిగింది. రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించాలని పవన్ అభిప్రాయపడ్డారు. మంత్రులు సీరియస్‌గా ఉండాలని అధికారులు చెప్పే విషయాలను సరిచూసుకోవాలని వారు చెప్పింది చెప్పినట్లు బయటకు చెప్పకూడదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మంత్రులకు చెప్పినట్లు తెలిసింది. -
పనులన్నీ వదిలేసి వెళ్లిపోండి!
‘మీరు చేస్తున్న పనులు ఉన్నది ఉన్నట్టుగా వదిలేసి వెళ్లిపొండి..! లేదంటే కేసులు ఎదుర్కోవడానికి సిద్ధపడండి..! మీ కంపెనీ తరఫున మేం పనులు చేస్తాం.. బిల్లులు కూడా మేమే తీసుకుంటాం..!’ – తస్మదీయ కాంట్రాక్టర్లకు టీడీపీ ముఖ్యనేతల అల్టిమేటం.‘అలాగైతే.. మీరు చేసే అక్రమాలకు మేం బాధ్యత వహించాల్సి వస్తుంది..! మాకు ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేసి.. ఏపీడీఎస్‌ఎస్ (ఆంధ్రప్రదేశ్ డీటెయిల్డ్ స్టాండర్డ్ స్ఫెసిఫికేషన్స్) 60 సీ నిబంధన కింద కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేయండి! కావాలంటే ఈ వ్యవహారంపై మేం కోర్టులో సవాల్ చేయబోమని హామీ కూడా ఇస్తాం!’ – కాంట్రాక్టర్ల ప్రతిపాదన.సాక్షి, అమరావతి: గతంలో అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన మాదిరిగానే 2014–19 తరహాలోనే 60 సీ నిబంధన కింద పనుల ఒప్పందాలను రద్దు చేసి.. మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచేసి.. అస్మదీయులకు కట్టబెట్టి కమీషన్లు వసూలు చేసుకునేందుకు టీడీపీ ముఖ్యనేతలు సిద్ధపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల వరకు వివిధ శాఖల పరి«ధిలో చేపట్టిన నిర్మాణ పనులపై కన్నేసి అస్మదీయ కాంట్రాక్టర్లను పనులు చేసుకునేందుకు అనుమతిస్తున్న టీడీపీ నేతలు.. తస్మదీయ కాంట్రాక్టర్లను మాత్రం అడ్డుకుంటున్నారు.ఉన్నఫళంగా పనులు వదిలేసి వెళ్లిపోవాలంటూ హుంకరిస్తున్నారు. తమకే పనులు అప్పగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. మీ కంపెనీ తరఫున పనులు చేస్తాం.. బిల్లులు మేం తీసుకుంటామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు కాంట్రాక్టు సంస్థలు ఒప్పుకోవడం లేదు. చేసిన పనుల్లో ఏవైనా లోపాలు తలెత్తితే వాటికి తాము బాధ్యత వహించాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం నుంచి తనకు రూ.2 వేల కోట్ల మేర బిల్లులు రావాలని.. వాటిని ఇప్పించి, తాను చేస్తున్న పనుల కాంట్రాక్టు ఒప్పందాలన్నీ రద్దు చేసుకోవాలని ఓ బడా కాంట్రాక్టు సంస్థ అధినేత టీడీపీ ముఖ్యనేతలకు సూచించారు. పాత విధానంలో దూకుడుగాకాంట్రాక్టర్లు తమ ఒత్తిళ్లకు లొంగకపోవడంతో 2014–19లో అమలు చేసిన విధానానికే టీడీపీ నేతలు మరింత పదును పెట్టారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి రహదారుల పనుల వరకూ తస్మదీయ కాంట్రాక్టు సంస్థలు చేస్తున్న పనులను 60 సీ కింద రద్దు చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఆ తర్వాత మిగిలిన పనులకు 2024–25 ఎస్ఎస్ఆర్(స్టాండర్డ్ షెడ్యూల్డ్ రేట్స్) ప్రకారం అంచనాలను రూపొందించి.. ఎక్కువ కమీషన్ ఇచ్చే కాంట్రాక్టర్లకు వాటిని కట్టబెట్టడానికి సిద్ధమయ్యారు. -
ఉరవకొండలో పచ్చమూకల ఉరుములు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఉరవకొండలో అరాచకాలకు హద్దులేకుండా పోతోంది. కాంట్రాక్టర్లు మొదలుకుని అధికారుల వరకూ అందరినీ టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. తమకు తలవంచకపోతే ఇక్కడ పనిచేసుకోలేరని నేరుగా హెచ్చరిస్తున్నారు. ఇలా కూటమి సర్కారు కొలువుదీరిన నాటినుంచి ఉరవకొండలో చోటామోటా నాయకులు, మండల స్థాయి లీడర్లు చెలరేగిపోతున్నారు. మాట వినకపోతే దౌర్జన్యాలకూ తెగబడుతున్నారు. తాజాగా.. ఓ సెక్యూరిటీ ఏజెన్సీకి వస్తున్న బెదిరింపులు ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతోంది. సెక్యూరిటీ ఏజెన్సీకి బెదిరింపులు గతంలో ఉరవకొండ నియోజకవర్గంలో అత్యధికంగా గాలిమరలు (విండ్‌మిల్స్) ఏర్పాటుచేశారు. వీటి భద్రతను ఎస్ఐఎస్ సెక్యూరిటీ ఏజెన్సీ 100 మంది సిబ్బందితో పర్యవేక్షిస్తోంది. కానీ, ఈ సెక్యూరిటీ సిబ్బందిని తొలగించి తమ మనుషులను పెట్టుకోవాలని.. మాట వినకపోతే ఇక్కడ ఉండలేరంటూ ఉరవకొండకే చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మనుషులు ఏజెన్సీని బెదిరిస్తున్నారు. కొన్నిచోట్ల వీరు బరితెగించి సెక్యూరిటీ సిబ్బందిని బలవంతంగా బయటకు లాగి యూనిఫాం వేసుకుని విధుల్లో చేరారు. వీరి ఆగడాలు చూసి ఏమీచేయలేక అక్కడున్న కంపెనీ ఇంజనీర్లు నోరెత్తడంలేదు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు టీడీపీ నేతలు ఉరవకొండకు సమీపంలోని నింబగల్లు విండ్మిల్ సబ్‌స్టేషన్‌లో గొడవకు దిగి కార్యాలయానికి తాళాలు వేసినట్లు తెలిసింది. ఆ తర్వాత వివాదం సద్దుమణగడంతో మళ్లీ తెరిచారు. ప్రస్తుతానికి అక్కడున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులను తొలగించి కొత్తవారిని పెట్టారు. మరోవైపు.. ఎస్ఐఎస్ సంస్థకు 2026 వరకూ కాంట్రాక్టు ఉంది. కానీ, తక్షణమే కాంట్రాక్టు వదిలివెళ్లాలని పచ్చమూకలు బెదిరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి ఫిర్యాదు.. ఈ దౌర్జన్యాలు, బెదిరింపులపై సెక్యూరిటీ సంస్థ యాజమాన్యం ముఖ్యమంత్రి కార్యాలయానికి, విద్యాశాఖా మంత్రి లోకేశ్‌కూ ఫిర్యాదు చేసింది. తమ విధులకు ఆటంకాలు కల్పిస్తూ స్థానిక నాయకులు బెదిరిస్తున్నారని.. నిజానికి.. తాము స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించామని, అయినా సరే వెళ్లిపోవాలని తమను ఒత్తిడి చేస్తున్నట్లు అందులో పేర్కొంది. కానీ, వీరి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా టీడీపీ నేతల బెదిరింపులూ కొనసాగుతున్నాయి. మంత్రి ఇలాకాలో తమ్ముళ్ల ఆగడాలు..» విడపనకల్లు మండలం గాజుల మల్లాపురం గ్రామంలో నాగరాజు అనే వ్యక్తి ఎనిమిదెకరాలు మొక్కజొన్న పంట వేయగా టీడీపీ నేతలు ఆ భూమి మాదంటూ పంటను ధ్వంసం చేశారు.» ఇదే మండలం చీకలగురికి గ్రామంలో ఓబులేసు, చౌడమ్మ దంపతులు రెండున్నర ఎకరాల్లో కందిపంట వేశారు. ఈ భూమి కూడా తమదేనంటూ పంటను ధ్వంసం చేసి భూమిని ఆక్రమించుకున్నారు.»మంత్రి పయ్యావుల కేశవ్ స్వగ్రామం కౌకుంట్లకు సమీపంలో టీడీపీ మండల స్థాయి లీడర్ జూదం నిర్వహిస్తున్నా పోలీసులు చూసీచూడకుండా వదిలేశారు.» ఉరవకొండలో చౌకబియ్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా జరుగుతోంది. డీలర్ల సహకారంతో టీడీపీ లీడర్లు దందా సాగిస్తున్నారు. -
‘కాళేశ్వరం’లో 50 మందికిపైగా సబ్ కాంట్రాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో 50 మందికి పైగా సబ్‌కాంట్రాక్టర్లు పాలుపంచుకున్నారని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ గుర్తించింది. బరాజ్‌ల నిర్మాణంలో సాంకేతి క లోపాలపై విచారణ తుది అంకానికి చేరుకుంది. దీంతో ఆర్థికపరమైన అవకతవకలపై కమిషన్ దృష్టి సారించింది. బ రాజ్‌ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు జస్టిస్ పినా కి చంద్రఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బరాజ్‌ల పనులు దక్కించుకున్న నిర్మా ణ సంస్థలు చాలా పనులను నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు అప్పగించినట్టు కమిషన్ నిర్థారణకు వచ్చింది. గత ప్రభుత్వంలోని ఓ ముఖ్యనేత సమీప బంధువులకు చెందిన కంపెనీలు సైతం సబ్ కాంట్రాక్టులు పొందాయని గుర్తించినట్టు తెలిసింది. తొలుత జారీచేసిన పరిపాలనాపర అను మతుల ప్రకారం బరాజ్‌ల నిర్మాణానికి అంచనా వ్యయం ఎంత? ఆ తర్వాత ఎన్నిసార్లు పెంచారు? ఎంత పెంచారు? గడువులోగానే పనులు పూర్తి చేసినప్పుడు అంచనా వ్యయం పెంచాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? సబ్ కాంట్రాక్టర్లకు ఏ పనులు కట్టబెట్టారు? వారికి ఎంత చెల్లించారు? ఈ వ్యవహారంలో అవకతవకలు ఏమైన జరిగాయా? వంటి అంశాలపై ఆరా తీస్తోంది. బరాజ్‌ల ఆర్థిక వ్యవహారాలపై మరింత లోతుగా విచారణ నిర్వహించడానికి ఒక చార్టర్డ్ అకౌంటెంట్‌ను కమిషన్ కార్యాలయంలో నియమించాలని ప్రభుత్వా న్ని కోరింది. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌లో కమిషన్‌కు సహకరించడానికి తెలంగాణ(కాళేశ్వరం ప్రాజెక్టు), పశ్చిమబెంగాల్(జస్టిస్ ఘోష్ సొంత రాష్ట్రం)తో సంబంధం లేని సీనియర్ న్యాయవాదిని సైతం నియమించాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 పంప్‌హౌజ్‌ల పనులను నిర్వహించిన ఓ నిర్మాణ సంస్థకు సంబంధించిన వైస్‌ప్రెసిడెంట్‌తో సహా మరో ఇద్దరు ఉన్నత అధికారులను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ గురువారం తన కార్యాలయంలో విచారించింది.పంప్‌హౌజ్‌ల నిర్మాణ స్థలం ఎంపిక, డిజైన్లు తదితర అంశాలపై కమిషన్ వారిని ప్రశ్నించగా, ప్రభుత్వం ఎంపిక చేసిన స్థలం, అందించిన డిజైన్ల ప్రకారమే వాటిని నిర్మించినట్టు ఆ కంపె నీ ప్రతినిధులు బదులిచ్చినట్టు తెలిసింది. ప్రాజెక్టుకు సంబంధించిన బిల్లుల జారీతో సంబంధం ఉన్న వర్క్ అండ్ అకౌంట్స్ విభాగం డైరెక్టర్ ఫణిభూషణ్ శర్మను సైతం కమిషన్ విచారించింది. విద్యుత్‌రంగ నిపుణుడు కె.రఘు ఈ నెల 15న, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి మాజీ సలహాదారుడు వెదిరె శ్రీరాం ఈ నెల 16న కమిషన్ ముందు హాజరై కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి తమ వద్ద ఉన్న సమాచారాన్ని అందించనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి వీరు అనుమతి కోరగా, కమిషన్ అందుకు ఏర్పాట్లు చేస్తోంది. నేడు కమిషన్ ఎదుట రహస్య సాక్షి బరాజ్‌ల నిర్మాణంలో లోపాలను వ్యతిరేకిస్తూ తన ఉద్యోగాన్ని వదులుకున్న ఓ నిర్మాణ సంస్థలోని కీలక ఉద్యోగి శుక్రవారం కమిషన్ ముందు హాజరై తన వాదనలు వినిపించనున్నారు. తన వద్ద ఉన్న సమాచారాన్ని కమిషన్‌కు అందించనున్నారు. ఆయన వివరాలను కమిషన్‌వర్గాలు గోప్యంగా ఉంచాయి. -
బరాజ్‌లు కట్టిన సబ్ కాంట్రాక్టర్లు ఎవరు?
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కాంట్రాక్టులు దక్కించుకున్న నిర్మాణ సంస్థలే నిర్మించాయా? లేక కాంట్రాక్టు నిబంధనలను విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాయా? అనే అంశంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ ఆరా తీస్తోంది. మూడు బరాజ్‌ల నిర్మాణ పనుల్లో కనీసం 15 మంది సబ్ కాంట్రాక్టర్లు పాల్గొన్నట్టు కమిషన్‌కు కొందరు ఆధారాలు సమర్పించినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉన్న ఓ నేత దగ్గరి బంధువుకి సంబంధించిన ఓ కంపెనీ సైతం బరాజ్‌ల పనులను సబ్ కాంట్రాక్టుగా తీసుకుని నిర్వహించినట్టు తెలిసింది. దీంతో సబ్ కాంట్రాక్టర్ల వివరాలను సమర్పించాలని బ్యారేజీల నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించింది. సబ్ కాంట్రాక్టర్ల వివరాలను నిర్మాణ సంస్థలు సమర్పించకుంటే.. గత పదేళ్ల ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సమర్పించాలని నిర్మాణ సంస్థలను కమిషన్ ఆదేశించనుంది. నిర్మాణ సంస్థలు అనుమానిత సబ్ కాంట్రాక్టర్లకు డబ్బులను చెల్లించినట్టు ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లలో ఉండే అవకాశముంది. ఫైనాన్షియల్ స్టేట్మెంట్లను సైతం నిర్మాణ సంస్థలు సమర్పించని పక్షంలో కేంద్ర పరిశ్రమల శాఖ నుంచి ఆ వివరాలను తెప్పించుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. మేడిగడ్డ నిర్ణయం కేసీఆర్‌దే..తుమ్మిడిహెట్టికి బదులు మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించాలనే నిర్ణయం నాటి సీఎం కేసీఆర్‌దేనని జస్టిస్ చంద్రఘో‹Ùకి రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ తెలిపింది. గోదావరిపై నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులపై అధ్యయనం కోసం రిటైర్డ్ సీఈలు బి.అనంతరాములు, వెంకటరామారావు, ఎస్.చంద్రమౌళి, రిటైర్డ్ ఎస్ఈలు జి.దామోదర్ రెడ్డి, ఎం.శ్యామ్‌ప్రసాద్ రెడ్డితో 2015లో నాటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిటీని శనివారం జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో విచారించింది. శ్యామ్‌ప్రసాద్ రెడ్డి మినహా మిగిలిన ఇంజనీర్లు కమిషన్ ముందు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తాము నివేదిక సమర్పించగా.. దానిని నాటి సీఎం కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తిరస్కరించారని, వాటిపై సంతకాలు సైతం చేయలేదని వివరించారు. కేసీఆర్ సూచనల మేరకే మేడిగడ్డ వద్ద బరాజ్ నిర్మించినట్టు తెలిపారు. మహారాష్ట్రను ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద 150–151 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించాలని సిఫారసు చేస్తూ అప్పట్లో సమర్పించిన ఈ నివేదిక ప్రతిని కమిషన్‌కు అందజేశారు. 27 తర్వాత కేసీఆర్, హరీశ్‌ను పిలిచే అవకాశం బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలపై జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ నిర్వహిస్తున్న విచారణ తుది అంకానికి చేరింది. బరాజ్‌ల నిర్మాణంతో సంబంధం ఉన్న ఈఎన్సీ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయి వరకు అధికారులందరినీ ఆయన పిలిపించి ప్రశ్నించారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇతర రిటైర్డ్ ఇంజనీర్లను సైతం ప్రశ్నించారు. విచారణలో పేర్కొన్న అంశాలను ఈ నెల 27లోగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని వారందరినీ ఆదేశించారు. అఫిడవిట్ల పరిశీలన పూర్తైన తర్వాత తదుపరిగా ఎవరెవరెని విచారించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావుతో పాటు బ్యారేజీల డీపీఆర్‌లను ఆమోదించిన కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ఇంజనీర్లు, ఇతర అధికారులను సైతం పిలిపించి విచారించే అవకాశముంది. తదుపరి దశలో బహిరంగ విచారణ నిర్వహించి.. అఫిడవిట్లలో వివిధ వ్యక్తులు సమర్పించిన సమాచారం ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించేందుకు కమిషన్ సిద్ధమవుతోంది. -
హైవేల నిర్వహణ పదేళ్లు కాంట్రాక్టర్లదే
సాక్షి, అమరావతి: దేశంలో రోడ్డు ప్రమాదాల నివారణకు కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ(ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ రహదారుల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి కాంట్రాక్టర్ల బాధ్యత కాలాన్ని రెట్టింపు చేసింది. అందుకోసం జాతీయ రహదారుల డ్యామేజీ లయబిలిటీని ఐదేళ్ల నుంచి పదేళ్లకు పెంచింది. ఈమేరకు కాంట్రాక్టర్లకు విధి విధానాలను నిర్దేశించింది. దేశంలో భారీగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు జాతీయ రహదారుల నిర్వహణ లోపం కూడా ఓ ప్రధాన కారణమని నిపుణుల కమిటీ ఇటీవల నివేదించింది. 2022లో దేశంలో సంభవించిన 4.61 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.68 లక్షల మంది దుర్మరణం చెందారు. వాటిలో అత్యధికంగా 33 శాతం ప్రమాదాలు జాతీయ రహదారులపైన జరిగినవే. మొత్తం ప్రమాద మృతులు 1.68 లక్షల మందిలో జాతీయ రహదారులపై ప్రమాదాల్లోనే 24 శాతం మంది అంటే 41 వేల మంది దుర్మరణం చెందారు. 2021లో కంటే 2022లో జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు 12 శాతం పెరిగాయి. మృతుల సంఖ్య 9శాతం పెరిగింది. జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత లోపాలు, నిర్వహణ లోపం రోడ్డు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. దీంతో హైవేల నిర్వహణ విధానాన్ని మరింత పకడ్బందీగా రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జాతీయ రహదారులను నిర్మిస్తున్న కాంట్రాక్టు సంస్థలు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ చేపడుతున్నాయి. ఆ ఐదేళ్లలో రోడ్ల నిర్వహణ, గుంతలు పూడ్చడం, ఇతరత్రా మరమ్మతులు చేస్తాయి. ఆ తర్వాత ఆ బాధ్యతను ఎన్హెచ్ఏఐకి అప్పగిస్తున్నాయి. కానీ పలు కాంట్రాక్టు సంస్థలు కేవలం ఐదేళ్లే నాణ్యతతో ఉండేలా హైవేలను నిర్మిస్తున్నాయని ఎన్హెచ్ఏఐ ఆడిటింగ్ నివేదిక వెల్లడించింది. ఐదేళ్ల తర్వాత ఆ రోడ్లు దెబ్బతింటున్నాయి. వాటి నిర్వహణ భారం ఎన్హెచ్ఏఐపై పడుతోంది. దీనికి పరిష్కారంగానే నిర్వహణ బాధ్యతను పదేళ్లకు పెంచాలని ఎన్హెచ్ఏఐ నిర్ణయించింది. ఈపీసీ, యాన్యుటీ, బీవోటీ పద్దతుల్లో నిర్మించే జాతీయ రహదారులకు ఈ నిబంధన వర్తిస్తుంది. తక్షణం అమలులోకి ఎన్హెచ్ఏఐ నూతన విధానాన్ని తక్షణం అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఆమోదించిన జాతీయ రహదారుల నిర్మాణాలకు కొత్త విధానాన్ని వర్తింపజేసింది. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ చేపట్టినవాటికి, త్వరలో చేపట్టబోయే వాటికి కూడా ఈ విధానం వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా రూ.7.81 లక్షల కోట్లతో 25,713 కిలోమీటర్ల హైవేల నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ ఆమోదించింది. వాటిలో ఈపీసీ విధానంలో 56 శాతం, 42శాతం యాన్యుటీ విధానంలో, 2 శాతం బీవోటీ విధానంలో నిర్మించనుంది. వీటి నిర్మాణాన్ని చేపట్టే కాంట్రాక్టు సంస్థలు పదేళ్లపాటు వాటి నిర్వహణ, మరమ్మతుల బాధ్యతను చేపట్టాలి. తాజా నిర్ణయం వల్ల జాతీయ రహదారుల నిర్మాణంలో నాణ్యత పెరుగుతుందని, నిర్వహణ కూడా సక్రమంగా ఉంటుందని ఎన్హెచ్ఏఐ అధికారవర్గాలు తెలిపాయి. -
రూ. లక్ష పెంచితేనే ‘డబుల్ బెడ్రూం’ ఇళ్ల పనులు!
సాక్షి, హైదరాబాద్: నిర్వహణ లోపాలతో ఇప్పటికే అస్తవ్యస్తంగా మారిన రెండు పడక గదుల ఇళ్ల విషయంలో కొత్త సమస్య తలెత్తింది. ప్రాజెక్టు యూనిట్ కాస్ట్‌ను భారీగా పెంచాలని కాంట్రాక్టర్లు గృహనిర్మాణ సంస్థకు తేల్చి చెప్పారు. ఒక్కో ఇంటిపై రూ.లక్ష చొప్పున యూనిట్ కాస్ట్‌ను సవరించాలని, లేని పక్షంలో పనులు కొనసాగించలేమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పుడు అధికారులు ఇదే విషయాన్ని కొత్త ప్రభుత్వం ముందు ప్రతిపాదించనున్నారు. అసలే ఖజానాకు తీవ్ర భారంగా మారిన ఈ ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం పక్కన పెట్టి గృహలక్ష్మి పేరుతో కొత్త పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పనులు ప్రారంభించిన ఇళ్లను మాత్రం పూర్తి చేసి, టెండర్లు పిలవాల్సిన వాటిని ప్రారంభించకపోవటమే మంచిదన్న అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. ఇప్పుడు కాంట్రాక్టర్ల కొత్త డిమాండ్‌తో, అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేయటం కొత్త సవాల్‌గా మారబోతోంది. ఎందుకు పెంచుతున్నారంటే.. ఇల్లు లేని పేదలకు ఏకంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఉచితంగా అందించాలని అప్పట్లో బీఆర్ఎస్ సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కావటంతో ఒక్కో ఇంటికి ప్రాంతాల వారీగా రూ.5.10 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ, ఆ మొత్తం కూడా సరిపోదని, యూనిట్ కాస్ట్‌ను పెంచాలని పథకాన్ని ప్రారంభించిన కొత్తలోనే కాంట్రాక్టర్లు కోరారు. దీంతో చాలా ప్రాంతాల్లో టెండర్లకు స్పందన కూడా లేకుండా పోయింది. కాంట్రాక్టర్లతో పలువురు మంత్రులు స్వయంగా భేటీ అవుతూ, ఇతర ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొనటంతో కొన్ని ప్రాంతాల్లో టెండర్లకు స్పందన వచ్చింది. ఆ క్రమంలో పనులు మొదలైనా, ఆ యూనిట్ కాస్ట్‌తో ప్రాజెక్టులు పూర్తి చేయటం కష్టమంటూ చాలా మంది పనులను నెమ్మదిగా చేస్తూ వచ్చారు. తాజాగా ఇప్పుడు యూనిట్ కాస్ట్‌ను పెంచకుంటే పనులు చేయలేమని, ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని, రూ.లక్ష మేర పెంచాలంటూ ఇటీవల వారు ప్రతిపాదించినట్టు తెలిసింది. ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం రాష్ట్రవ్యాప్తంగా 2.93 లక్షల ఇళ్లను నిర్మించేందుకు పరిపాలన అనుమతులు ఇవ్వగా, 2.29 లక్షల ఇళ్లకు టెండర్లు పూర్తయ్యాయి. వీటిల్లో ఇప్పటి వరకు 1.55 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. ఇంకా 74 వేల ఇళ్లు పూర్తి చేయాల్సి ఉంది. వీటిల్లో 45 వేలు తుది దశలో ఉన్నాయి. వీటిని కచ్చితంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కాంట్రాక్టర్లు ముందుకు రాని పక్షంలో యూనిట్ కాస్ట్ పెంచాల్సిందే. ఈ మేరకు ఈ ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.4500 కోట్లు అవసరం. కాగా, లబ్ధిదారుల జాబితా రూపొందించకుండానే పనులు జరుపుతున్న తీరును తప్పుపడుతూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాసయోజన నిధులు ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో నిధుల కోసం తీవ్ర ఇబ్బందులు ఉన్న తరుణంలో, అదనంగా భారం పడటం పథకానికి శరాఘాతంగా మారనుంది. -
పోలవరంపై బాబువి కాకి లెక్కలు
బి.కొత్తకోట : గత టీడీపీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు కాకిలెక్కలు చెబుతున్నారని జలవనరులశాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) సీ నారాయణరెడ్డి విమర్శించారు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పై శనివారం ఆయన హంద్రీనీవా ప్రాజెక్టు రెండో దశ పనులపై మదనపల్లె ఎస్ఈ సీఆర్ రాజగోపాల్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులపై మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. గత ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల పోలవరం ప్రాజెక్టుకు రూ.2వేల కోట్ల నష్టం వాటిల్లింది. అప్పట్లో కాంట్రాక్టర్లు లాభదాయకమైన పనులు మాత్రమే చేసి సొమ్ము చేసుకున్నారు. నిజానికి.. పోలవరం పనుల పరిశీలనకు వచ్చిన చంద్రబాబు అక్కడ ఆరు కిలోమీటర్ల మేర గోదావరి ప్రవాహాన్ని మళ్లించి చేపట్టిన పనులను చూసి ఆశ్చర్యపోవడమే కాక ఏమి మాట్లాడలేకపోయారు. అలాగే.. కుప్పంకు అక్టోబర్‌లో శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తాం. కుప్పం ఉపకాలువ పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేయిస్తున్నాం. ఇక్కడ రూ.535 కోట్లతో రెండు రిజర్వాయర్లు ప్రతిపాదించాం. అవుకు రెండో సొరంగం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఇక్కడినుంచి ఒక టీఎంసీ నీటిని గండికోట ప్రాజెక్టుకు తరలిస్తాం. గత ప్రభుత్వం ఈ పనులను వదిలేసింది. డోన్, పత్తికొండ నియోజకవర్గాల్లోని 68 చెరువులకు హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను తరలించి నింపుతాం. ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా ప్రారంభమవుతుంది. గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు గురించి తప్పుదోవ పట్టిస్తున్న చంద్రబాబు తన ప్రభుత్వంలో నిర్వహణకు కేవలం రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఇందులో రూ.కోటిన్నర పార్కు కోసం ఖర్చుచేసి.. మిగతా రూ.3.5 కోట్లను భోంచేశారు. వెలిగొండ మొదటి సొరంగం పనులు పూర్తిచేశాం. రెండో సొరంగం పనులు అక్టోబర్‌లోగా పూర్తికి చర్యలు తీసుకుంటున్నాం. ఇక కర్ణాటక చేపట్టిన అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో కేసు వేశాం. ఆ పనులు ముందుకు సాగే పరిస్థితుల్లేవు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం జలాలు ఏపీ వాటాకు వస్తాయి. ఇరు రాష్ట్రాల నీటి పంపకాలు జరగలేదని తెలంగాణ వాదించడం సరికాదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశాం. ఉత్తరాంధ్రకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను రూ.2వేల కోట్ల వ్యయంతో పూర్తిచేయనున్నాం. రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదటి దశ ఒక టీఎంసీ సామర్థ్యంతో తాగునీటి సంబంధిత పనులు ప్రారంభమయ్యాయి. -
దాల్ మే కుచ్ కాలా హై!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్ పిలవాలని యోచిస్తోంది. 54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు. ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్ పిలవగా 8 మంది పాల్గొన్నారు. అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్ ప్రక్రియలో కాంట్రాక్టర్ కోట్ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్ ప్రక్రియను రద్దు చేశారు. భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... టెండర్లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు. అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్’(గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్) నేషనల్ పోర్టల్ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్
న్యూఢిల్లీ: మౌలిక రంగానికి నిధుల లభ్యతను పెంచే క్రమంలో దేశీయంగా తొలిసారి ష్యూరిటీ బాండ్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. డిసెంబర్ 19న దీన్ని ఆవిష్కరించనున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఈ పథకంతో కాంట్రాక్టర్లకు భారీగా ఊరట లభించగలదన్నారు. ప్రాజెక్టు కాంట్రాక్టు ఇచ్చిన సంస్థకు .. కాంట్రాక్టరు తరఫున బీమా కంపెనీ ఈ ష్యూరిటీ బాండును జారీ చేస్తుంది. ఇదీ చదవండి: సరికొత్త అవతార్‌లో, టాటా నానో ఈవీ వచ్చేస్తోంది..? ప్రాజెక్టు పనితీరుకు లేదా సకాలంలో పూర్తి చేయడానికి సంబంధించి ఇది హామీగా పని చేస్తుంది. ఒకవేళ కాంట్రాక్టరు గానీ హామీ నిలబెట్టుకోలేకపోతే ప్రాజెక్టు ఇచ్చిన సంస్థ ఈ బాండు ద్వారా పరిహారాన్ని రాబట్టుకోవడానికి వీలవుతుంది. ఫైనాన్షియల్ గ్యారంటీలో ఆర్థికపరమైన అంశాలు ఇమిడి ఉండగా.. ష్యూరిటీ బాండ్లలో పనితీరు సంబంధిత అంశాలు ఉంటాయి. ప్రస్తుతం కాంట్రాక్టర్లు భారీ మొత్తాలను ఫైనాన్షియల్ గ్యారంటీ చూపించేందుకు కేటాయించాల్సి వస్తోందని, ష్యూరిటీ బాండ్లను ప్రవేశపెడితే వారికి ఆయా నిధులు అందుబాటులోకి రాగలవని గడ్కరీ చెప్పారు. ఈ నిధులను వారు వ్యాపార వృద్ధికి ఉపయోగించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తద్వారా మౌలిక రంగంలో నిధుల లభ్యతను పెంచుకునేందుకు కూడా ఇవి ఉపయోగపడగలవని మంత్రి చెప్పారు. (రోడ్ కాంట్రాక్టర్లకు భారీ ఊరట! కేంద్ర మంత్రి గడ్కరీ ఆఫర్) ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్స్)లో పెట్టుబడి పెట్టడం ద్వారా దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో రిటైల్ ఇన్వెస్టర్లు పాలుపంచుకో వచ్చని గడ్కరీ తెలిపారు. ఇన్విట్స్ ద్వారా దాదాపు ఎనిమిది శాతం రాబడులు కూడా అందుకోవచ్చన్నారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పూర్తి స్వదేశీ, చౌక నిర్మాణ విధానాలను ఆవిష్కరించాల్సిన అవసరం ఉందని మంత్రి చెప్పారు. (రూపాయిల్లో వాణిజ్యంపై బ్యాంకుల అవగాహన కార్యక్రమాలు) -
బిల్లుల చెల్లింపుల్లో జాప్యానికి వడ్డీ ఎలా కోరతారు?
సాక్షి, అమరావతి: ఆయా ప్రభుత్వ శాఖల పనులు చేసినందుకు చెల్లించాల్సిన బిల్లుల చెల్లింపుల్లో ప్రభుత్వ జాప్యానికి వడ్డీ చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతుండటంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. కాంట్రాక్టు ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన ఉంటే తప్ప, బిల్లుల చెల్లింపుల్లో జరిగిన జాప్యానికి వడ్డీ కోరలేరని కాంట్రాక్టర్లకు తేల్చిచెప్పింది. ఒప్పందంలో ఎలాంటి నిబంధన లేనప్పుడు, అధికరణ 226 కింద వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టును కోరడానికి వీల్లేదంది. ఈ విషయంలో తగిన ఉత్తర్వులినిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. వడ్డీ చెల్లింపు ఆదేశాలపై అప్పీళ్లు.. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట పరిధిలో వై.బాబూరావు అనే కాంట్రాక్టర్ వ్యవసాయ శాఖ పనులు చేశారు. తనకు చెల్లించాల్సిన రూ.23.21 లక్షల బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ పిటిషనర్‌కు చెల్లించాల్సిన రూ.23.21 లక్షలను 12 శాతం వార్షిక వడ్డీతో కలిపి నాలుగు వారాల్లో చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీంతో ప్రభుత్వం బాబూరావుకు రూ.23.21 లక్షలు చెల్లించింది. అయితే వడ్డీ చెల్లించాలన్న సింగిల్ జడ్జి ఆదేశాలతోపాటు ఇలాంటివే మరికొన్నింటిపైనా ధర్మాసనం ముందు ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. ఈ అప్పీళ్లన్నింటిపై సీజే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత ప్రభుత్వ పాపాలకు మేం మూల్యం చెల్లించుకుంటున్నాం.. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ.. ‘రోజుకు 320 నుంచి 350 వరకు హైకోర్టులో పిటిషన్లు దాఖలవుతుంటే, అందులో 220–250 వరకు రిట్ పిటిషన్లే ఉంటున్నాయి. ఇందులో 200 కేసుల వరకు పంచాయతీరాజ్, నీటిపారుదల శాఖ బిల్లుల చెల్లింపుల కోసం దాఖలవుతున్నవే ఉన్నాయి. ఆ బిల్లులు చెల్లించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలవుతున్న కోర్టు ధిక్కార వ్యాజ్యాలు ఈ సంఖ్యకు అదనం. ఇవన్నీ కూడా కోర్టుపై అదనపు భారాన్ని పెంచుతున్నాయి. ఈ సంఖ్యను తగ్గించాల్సిన అవసరం ఉంది’ అని స్పష్టం చేసింది. ప్రభుత్వ న్యాయవాది (ఆర్ అండ్ బీ) కోనపల్లి నర్సిరెడ్డి స్పందిస్తూ.. తాము సింగిల్ జడ్జి ఇచ్చిన వడ్డీ చెల్లింపు ఉత్తర్వులను మాత్రమే సవాల్ చేశామన్నారు. అనంతరం అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ జోక్యం చేసుకుంటూ.. ఈ బిల్లుల వ్యవహారమంతా గత ప్రభుత్వ పాపమేనన్నారు. ఆ పాపాలకు తమ ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. ప్రాధాన్యత క్రమంలో రూ.2,800 కోట్ల మేర చెల్లింపులు చేశామన్నారు. గత ప్రభుత్వ హయాంలో చాలా పనులు చేయకుండానే బిల్లులు సమర్పించారని, దీనిపై పరిశీలన కూడా చేస్తున్నామని తెలిపారు. అందువల్లే బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందన్నారు. వడ్డీ చెల్లింపు ఆదేశాలు ఇవ్వడానికి మాది సివిల్ కోర్టు కాదు.. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. వడ్డీ చెల్లించాలని కాంట్రాక్ట్ ఒప్పందంలో ఉందా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఒప్పందంలో వడ్డీ చెల్లింపు నిబంధన లేనప్పుడు వడ్డీ చెల్లించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కుదరదని స్పష్టం చేసింది. వడ్డీ కావాలనుకుంటే అందుకు సివిల్ కోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది. వడ్డీ చెల్లింపునకు ఆదేశాలు ఇవ్వడానికి తమది సివిల్ కోర్టు కాదని స్పష్టం చేసింది. వడ్డీ చెల్లిం పు విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను తమ ముందుంచాలని అటు ప్రభుత్వ న్యాయవాది నర్సిరెడ్డికి, ఇటు పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రీకాంత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. -
GHMC సమావేశంలో బీజేపీ నిరసనలు
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే.. కాంట్రాక్టర్ల జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు. ఇదీ చదవండి: కేసీఆర్‌కు అంబేడ్కర్‌తో పోలికా? -
రెండేళ్లుగా అడ్డగోలు చెత్త బంధం..!!
సాక్షి, విశాఖపట్నం: దాసుడి తప్పు దండంతోనే సరి.. అన్నట్టుగా అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడిన అసలు సూత్రధారులను దర్జాగా వదిలేసి.. పాత్రధారులపై కొరడా ఝుళిపించారు జీవీఎంసీ ఉన్నతాధికారులు. నిబంధనలు మీరి రైల్వే స్టేషన్లలో చెత్త తరలింపునకు కార్పొరేషన్ వాహనాలు వినియోగించిన వైనం బట్టబయలైంది. అయితే దొరికేంత వరకూ దొరలే అన్నచందంగా.. కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే జరిగిందన్నట్లుగా.. అధికారుల కళ్లుగప్పేశారు. కానీ.. ఈ ‘చెత్త’ బంధం సుమారు రెండేళ్ల నుంచి సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీవీఎంసీ ఖజానాకు కన్నం పెట్టి.. రైల్వే కాంట్రాక్టర్ కాసులకు కక్కుర్తిపడిన పెద్ద చేపల్ని వదిలేసి.. కేవలం ఒక డ్రైవర్ సస్పెన్షన్తోనే మమా అనిపించెయ్యడం గమనార్హం. మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో పరిధిలో పోగవుతున్న చెత్తను తీసేందుకు తీరిక లేని పారిశుధ్య కాంట్రాక్టర్లకు.. తమ పరిధి కాని ప్రాంతాల్లో మాత్రం శ్రద్ధగా పనులు కానిచ్చేస్తున్నారు. ఇటీవల రైల్వే స్టేషన్లో జరిగిన అక్రమ చెత్త నిర్వహణ అంశం బయటపడిన విషయం విదితమే. అసలేం జరిగిందంటే... రైల్వేస్టేషన్ పరిధిలో ఉన్న చెత్త నిర్వహణ బాధ్యతను రైల్వే శాఖ ప్రత్యేకంగా మూడేళ్ల కాలపరిమితితో కాంట్రాక్టర్లకు అప్పగించింది. ఆ పరిధిలో జీవీఎంసీ పారిశుధ్య కార్మికులకు గానీ, వాహనాలకు గానీ పని లేదు. కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు.. ఏ పబ్లిక్ సెక్టార్ పరిధిలోనైనా చెత్త నిర్వహణ బాధ్యత ఆయా సంస్థలు మాత్రమే నిర్వహించుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో జీవీఎంసీ కమిషనర్‌కు లేఖ రాసి.. ఆయన అనుమతితోనే ఇక్కడ సిబ్బందిని చెత్త నిర్వహణ పనులకు వినియోగించుకుంటారు. కానీ రైల్వే స్టేషన్లో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా పారిశుధ్య పనులకు జీవీఎంసీ వాహనాలను వినియోగిస్తున్న విషయం బట్టబయలైంది. కొందరు స్థానికులు జీవీఎంసీ ఉన్నతాధికారులకు ఇక్కడ జరుగుతున్న తీరుపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అవాక్కయ్యారు. రెండేళ్లుగా.. జీవీఎంసీ జోన్–4లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది, కాంట్రాక్టర్ తో కలిసి అక్రమార్జన కోసం రైల్వే కాంట్రాక్టర్‌తో అడ్డగోలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీ పరిధిలో పారిశుధ్య నిర్వహణ పనులు చేస్తున్నట్లుగా చెప్పి ఒక టిప్పర్, బాబ్ కార్ట్ ని రైల్వే స్టేషన్ ఆవరణలో పారిశుధ్య నిర్వహణ పనులు గుట్టుగా కానిచ్చేస్తున్నారు. దీనికి అవసరమైన ఇంధనాన్ని కూడా జీవీఎంసీకి చెందినదే కావడం గమనార్హం. ఈ అక్రమ వ్యవహారం బట్టబయలవ్వడంతో.. ఆ ఒక్క రోజు మాత్రమే ఇలా జరిగిందంటూ అధికారులకు తప్పుడు సమాచారం అందించారు. ఇలా రైల్వే స్టేషన్లో చెత్త సేకరణకు సుమారు రెండేళ్ల కాలం నుంచి వాహనాల్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజూ చెత్త సేకరణ సమయం పూర్తయిన వెంటనే రైల్వే స్టేషన్‌కు వెళ్లి.. అక్కడి చెత్తని తాటిచెట్లపాలెంలోని మినీ సూయిజ్ ఫాం(ఎంఎస్ఎఫ్)కు తరలించినట్లు సమాచారం. రైల్వే కాంట్రాక్టర్‌తో జీవీఎంసీ జోన్–5 పరిధిలో ఉన్న ఒక కాంట్రాక్టర్, ముఖ్య అధికారి చేతులు కలిపి ఈ పనులకు వాహనాల్ని పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం జీవీఎంసీకి చెందిన రూ.లక్షలాది రూపాయిల ఇంధనాన్నే వినియోగించినట్లు తెలుస్తోంది. అసలువారిని వదిలేసి.. ఈ అక్రమ నిర్వహణ వ్యవహారం వెలుగులోకి రావడంతో జోన్–5 అధికారులు, సిబ్బంది, ఎంఎస్ఎఫ్ కాంట్రాక్టర్ ఉలిక్కిపడ్డారు. తప్పు తమవైపు రాకుండా ఉండేందుకు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక అందించినట్లు సమాచారం. ఖాళీగా ఉన్న సమయంలో ఎంఎస్‌ఎఫ్‌కు వస్తున్నప్పుడు అక్కడి రైల్వే కాంట్రాక్టర్ రూ.1000 ఇస్తే.. ఆ ఒక్క రోజు మాత్రమే చెత్తని తీసేందుకు వెళ్లారని అధికారులకు చెప్పారు. ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ కమిషనర్ అధికారులను ఆదేశించగా.. జోన్–5 అధికారులు టిప్పర్ డ్రైవర్‌ను బలిపశువులా సస్పెండ్ చేశారు. కాంట్రాక్టర్ పరిధిలో ఉన్న బాబ్‌కార్డ్ అవుట్సోర్సింగ్ డ్రైవర్ని మరో చోటికి పంపించేసి చేతులు దులిపేసుకున్నారు. కానీ జీవీఎంసీకి నష్టం తీసుకొచ్చిన కాంట్రాక్టర్‌పైనా, అధికారులపైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విడ్డూరం. అధికారుల ఒత్తిడి లేకుండా దిగువస్థాయి సాధారణ సిబ్బంది ఈ తరహా పనులకు వెళ్లే అవకాశం లేదు. దీనిపై కమిషనర్ లక్ష్మీశను వివరణ కోరగా.. సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలిపారు. (చదవండి: ఏపీ సర్కార్‌ని చూస్తే అసూయగా ఉంది) -
కాబోయే భర్తనే అరెస్టు చేసిన లేడీ సింగంపై అవినీతి మరక
గౌహతి: అస్సాంలోని నాగావ్ జిల్లాలో సబ్-ఇన్స్పెక్టర్ రభాను అవినీతి ఆరోపణలతో అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె మజులీ జిల్లాలోని కోర్టు ఆమెను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. రభా గత నెలలో తన కాబోయే భర్తను అరెస్టు చేసి లేడీ సింగంగా పేరుతెచ్చుకున్న ఆమె ఇప్పుడు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇద్దరు కాంట్రాక్టర్లు రభా తన కాబోయే భర్త రాణా పోగాగ్‌తో కలిసి ఓఎన్‌జీలో ఉద్యోగాలు, కాంట్రాక్టులు ఇప్పిస్తానంటూ ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని మోసం చేశారంటూ పిర్యాదు చేశారని పోలీసుల తెలిపారు. ఆమె కాబోయే భర్త పోగాగ్ రభా తరుపున డబ్బులు వసూలు చేసేరనే ఆరోపణలు కూడా రావడంతో ఆమెను విచారణకు ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గతేడాది అక్టోబర్‌లో ఆమెకు పోగాగ్‌తో నిశ్చితార్థం కాగా ఈ ఏడాది నవంబర్‌లో వివాహం జరగాల్సి ఉంది. ఐతే ఈ ఏడాది జనవరిలో బిహ్పురియా ఎమ్మెల్యే అమియా కుమార్ భుయాన్‌తో ఆమె జరిపిన ఫోన్ సంభాషణ లీక్ కావడంతో రభా ఈ వివాదంలో చిక్కుకుంది. లీక్ అయిన ఆ ఆడియో టేప్ తీవ్ర దుమారానికి తెరలేపింది. పైగా ఆయన తన నియోజక వర్గ ప్రజలను వేధింపులకు గురి చేస్తున్నారంటూ రభా పై ఆరోపణలు గుప్పించారు. (చదవండి: చిచ్చురేపిన భూ వివాదం...దంపతులపై ట్రాక్టర్ ఎక్కించి..) -
బ్లాక్ లిస్టులో పెట్టినా.. బాద్షాలా!
టెండర్లు దక్కించుకొని.. పనులు పూర్తి చేయడంలో జాప్యం వహించడం.. అడ్డగోలుగా వ్యవహరించడం వంటి కార్యకలాపాలకు పాల్పడిన కాంట్రాక్టర్లను జీవీఎంసీ బ్లాక్ లిస్టులో పెట్టింది. అంటే కార్పొరేషన్ పరిధిలో ఏ పనులకు సంబంధించిన టెండర్లలో అయినా వారు పాల్గొనే అవకాశం ఉండదు. కానీ కొందరు ఇంజినీరింగ్ సిబ్బంది మాత్రం నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తున్నారు. కొత్త టెండర్లలో వారికి చోటు కల్పించి పనులు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, విశాఖపట్నం: వివిధ కారణాలతో గ్రేటర్ విశాఖ పరిధిలో పనులు నిర్వహిస్తున్న 26 మంది కాంట్రాక్టర్లను అప్పటి జీవీఎంసీ కమిషనర్ బ్లాక్ లిస్టులో పెట్టారు. చిన్నచిన్న తప్పులు చేసిన 21 కాంట్రాక్టు సంస్థల్ని ఏడాది పాటు.. విభిన్న రకాల వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడిన ఐదుగురు కాంట్రాక్టర్లపై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. ఏడాది నిషేధం ఉన్న కాంట్రాక్టర్లలో చాలా మంది వరకూ ఈ ఏడాది జూలై వరకూ, ఐదేళ్ల నిషేధం ఉన్న కాంట్రాక్టర్లు 2025 డిసెంబర్ వరకూ ఏ విధమైన టెండర్లలో పాల్గొన కూడదు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. కొందరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లు మాత్రం నిషేధంతో తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. జీవీఎంసీ పిలుస్తున్న టెండర్లలో తమ అర్హతకు సరిపోయే పనుల్ని దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఇంజినీర్ల సహకారంతోనే.. బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్ ఏదైనా ఈ–టెండర్లో పాల్గొనేందుకు ప్రయత్నించిన వెంటనే రిజెక్ట్ లిస్టులో చేరే వ్యవస్థ జీవీఎంసీలో ఉంది. సదరు కాంట్రాక్టర్ ఫర్మ్ పేరు మార్చి పాన్ కార్డు, లేదా ఆధార్, జీఎస్టీ నంబర్.. ఇలా ఏదైనా ఎంటర్ చేసినా టెండర్ తిరస్కరించాలి. అదే విధంగా ఈఎండీ(ఎర్నెస్ట్ మనీ డిపాజిట్)ని తిరిగి సదరు బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన అవసరం లేదు. పదేపదే రిజెక్ట్ చేసినా టెండర్లలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే సదరు కాంట్రాక్టర్ నిషేధాన్ని మరికొద్ది రోజులు పొడిగించే అధికారాలు జీవీఎంసీ అధికారులకు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెట్టేసి నిషేధిత కాంట్రాక్టర్లకు కొమ్ముకాసే పనిలో ఇంజినీరింగ్ సిబ్బంది తలమునకలవుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బ్లాక్ లిస్టులో ఉన్నా వారికి ఎలాగైనా కాంట్రాక్టు దక్కించుకునేలా కుయుక్తులు పన్నుతున్నారు. ఉదాహరణకు ఇటీవలే యూపీహెచ్సీ టెండర్ల వ్యవహారంలోనూ ఇదే పద్ధతి అవలంబించారు. రూ.కోట్ల విలువ చేసే పనులని దక్కించుకునేందుకు ఐదేళ్ల బ్లాక్ లిస్టులో ఉన్న ఓ కాంట్రాక్టర్ ఆ టెండర్లలో పాల్గొన్నారు. దాదాపు అన్ని టెండర్లలోనూ టెక్నికల్ బిడ్ వరకూ ఆ కాంట్రాక్టర్‌ను ఇంజినీరింగ్ సిబ్బంది తీసుకెళ్లిపోయారు. వాస్తవానికి ఆ కాంట్రాక్టర్‌ను టెండర్ ప్రారంభ దశలోనే రిజెక్ట్ చేయాల్సి ఉంది. కానీ.. కొందరు ఇంజినీరింగ్ అధికారులు సిబ్బంది కలిసి.. చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. టెండర్లు ఫైనలైజ్ చేసే సమయంలో ఉన్నతాధికారులు విషయాన్ని గుర్తించి.. నిషేధిత కాంట్రాక్టర్‌ను పక్కన పెట్టారు. పదే పదే.. అదే శైలి.. ఈ ఒక్క కాంట్రాక్టర్ మాత్రమే కాదు బ్లాక్ లిస్టులో ఉన్న కొందరు కాంట్రాక్టర్లు తమ ఫర్మ్ పేరు మార్చి.. పాత పాన్, ఆధార్ నంబర్‌తో టెండర్లలో పాల్గొంటున్నారు. ఈ విషయం ఇంజినీరింగ్ సిబ్బందికి తెలిసినా.. ఏమీ తెలీనట్లుగా వారికి టెండర్లు అప్పగించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు కూడా తమకేం పట్టనట్లుగా ఉంటున్నారు. ఇప్పటికైనా బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లపై నిశిత దృష్టితో వ్యవహరించకపోతే జీవీఎంసీ పనుల వ్యవహారంలో మళ్లీ అవకతవకలు జరిగే ప్రమాదం ఉందని కార్పొరేషన్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. (చదవండి: కరాటే క్వీన్స్: చదువులో సరస్వతీ పుత్రిక.. కరాటేలో వండర్ కిడ్) -
వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ
కర్నూలు: ఎదుటి వ్యక్తుల అవసరాలే ఈ మోసగాడికి పెట్టుబడి. మాయ మాటలతో బురిడీ కొట్టిస్తాడు. ఇల్లు, ఇళ్ల స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సంక్షేమ పథకాలు ఇలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరార్థులను చేర దీసి రూ.లక్షల్లో గుంజేశాడు. ఇలా పలువురిని మోసగించి పోలీసులకు చిక్కి జైలుకెళ్లొచ్చాడు. అయినా తీరు మార్చుకోక కలెక్టర్ పీఏనంటూ కొంతమంది కాంట్రాక్టర్లను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎట్టకేలకు మళ్లీ పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. అతని నేర చరిత్రను కర్నూలు డీఎస్పీ కెవి.మహేష్, మూడవ పట్టణ సీఐ తబ్రేజ్‌తో కలిసి ఆదివారం తన కార్యాలయంలో వివరించారు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. బండి ఆత్మకూరు మండలం చిన్నదేవళాపురం గ్రామానికి చెందిన తాటికొండ పెద్దమౌలాలి చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. అనతి కాలంలోనే డబ్బు సంపాదించాలన్న ఆశతో వక్రమార్గం పట్టాడు. ప్రభుత్వం నుంచి బిల్లులు పాసైన కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లు సేకరించి వారికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనంటూ పరిచయం చేసుకునేవాడు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు పాస్ చేయమని ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చాయని, అవి క్లియర్ చేయడానికి ఐదు శాతం కమీషన్ ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఇదే తరహాలోనే ఈ నెల 12వ తేదీన తుగ్గలి ప్రాంతానికి చెందిన ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ నవీన్‌కుమార్‌రెడ్డికి ఫోన్ చేసి తాను కలెక్టర్ పీఏనని పరిచయం చేసుకున్నాడు. పెండింగ్ బిల్లులను పాస్ చేయడానికి రూ.లక్ష తన అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశాడు. కాంట్రాక్టర్ స్పందించకపోవడంతో పదేపదే ఫోన్ చేసి బెదిరించడంతో అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు. కలెక్టర్ కార్యాలయం సిబ్బందితో పాటు మరికొంతమంది కాంట్రాక్టర్లు కూడా 3వ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో భాగంగా శనివారం రాత్రి కర్నూలు శివారులో నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు డీఎస్పీ మహేష్ వెల్లడించారు. నిందితుడి నేరాల చిట్ట.. ►నంద్యాల ప్రాంతానికి చెందిన పేదలకు ఇళ్లు ఇప్పిస్తానని రూ. 22 లక్షలు వసూలు చేశాడు. మున్సిపాలిటీకి సంబంధించి నకిలీ రసీదులు ఫోర్జరీ సంతకా లతో పట్టాలిచ్చి మోసం చేశాడు. ఈ మేరకు నంద్యాల తాలూకా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయగా అతనిపై కేసు నమోదు చేసి రిమాండుకు పంపారు. ►గడివేముల ప్రాంతానికి చెందిన కొంతమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు రూ. 6 లక్షలు వసూలు చేసి మోసం చేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అతనిపై చీటింగ్ కేసు నమోదు చేసి కటకటాలకు పంపారు. ►ఆత్మకూరు ప్రాంతంలో కొంతమంది రైతుల వద్ద డబ్బులు వసూలు చేసుకుని తహసీల్దార్, ఆర్డీఓ, సబ్–రిజి్రస్టార్ సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసుపుస్తకాలు తయారుచేసిచ్చాడన్న ఫిర్యాదు మేరకు 2018లో బండిఆత్మకూరు పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. ►తుగ్గలి మండలం రాతన గ్రామానికి చెందిన ఉమా మహేశ్వరరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఈయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. -
టీడీపీ నేత దేవినేనిని నమ్మి మోసపోయాం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ మాటలు నమ్మి మోసపోయామని ట్రాన్స్ట్రాయ్ కంపెనీ కింద సబ్ కాంట్రాక్టులు చేసిన కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పటి బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. ఈ మేరకు సబ్ కాంట్రాక్టర్లు తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి మంగళవారం వినతిపత్రం అందజేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.20 కోట్లుపైనే ఖర్చు చేసినా ఇంతవరకు బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తమను మోసం చేశారని తెలిపారు. తమ సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. -
ఐటీ దాడుల్లో రూ.750 కోట్ల అక్రమాస్తులు బహిర్గతం
సాక్షి, బనశంకరి: బెంగళూరులో నాలుగురోజుల కిందట కాంట్రాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్, తదితరుల ఇళ్లపై జరిగిన సోదాల వివరాలను ఐటీ అధికారులు మీడియాకు వెల్లడించారు. ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లు, 40 మంది సబ్ కాంట్రాక్టర్ల పేర్లతో నీటి ప్రాజెక్టుల పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సోదాల్లో రూ.750 కోట్ల విలువైన అక్రమాస్తుల వివరాలు వెల్లడయ్యాయి. ఈ మొత్తంలో రూ.487 కోట్లకు సరైన ఆధారాలు లేవని తేల్చారు. పలువురి ఇళ్లలో రూ.8.67 కోట్ల విలువైన బంగారం, రూ.29.83 కోట్ల విలువైన వెండిని సీజ్‌చేశారు. దాడి సమయంలో మొత్తం రూ.4.69 కోట్ల నగదు సీజ్ చేశారు. -
రూ.2,346 కోట్ల అదనపు చెల్లింపులు
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్టర్లకు గత టీడీపీ ప్రభుత్వం రూ.2,346 కోట్ల మేర అదనంగా చెల్లించినట్లు జల శక్తి శాఖ సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా వెల్లడించారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా జవాబిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. అదనపు చెల్లింపుల వ్యవహారంపై నియమించిన నిపుణుల సంఘం దీనిపై విచారణ జరిపి ఈ ఏడాది జూలైలో నివేదికను కేంద్ర జల సంఘానికి తెలిపినట్లు చెప్పారు. ‘ఈ నివేదిక ప్రకారం 2015–16లో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివిధ పనుల నిమిత్తం కాంట్రాక్టర్లతో కుదిరిన ఒప్పందాల పునఃపరిశీలన జరిపి కాంట్రాక్టర్లకు అదనంగా రూ.1,331 కోట్లు చెల్లించింది. మొబిలైజేషన్ అడ్వాన్స్‌లపై వడ్డీ కింద రూ.84.43 కోట్లు, అడ్వాన్స్ కింద రూ.144.22 కోట్లు, జల విద్యుత్ కేంద్రం ప్రాజెక్ట్ పనులు అప్పగించడానికి ముందుగానే సంబంధిత కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ కింద రూ.787 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది..’ అని మంత్రి తెలిపారు. అయితే అదనపు చెల్లింపులపై నిపుణుల సంఘం వ్యక్తం చేసిన అభిప్రాయాలు ప్రాథమికమైనవని నవంబర్ 13న రాష్ట్ర ప్రభుత్వం ఒక లేఖలో స్పష్టం చేసినట్లు చెప్పారు. పైన తెలిపిన నిర్ణయాల్లో ప్రక్రియాపరమైన అతిక్రమణలు లేవని, అధీకృత ఆమోదం పొందిన తర్వాతే అదనపు చెల్లింపులు జరిగినట్లుగా లేఖలో పేర్కొన్నట్లు మంత్రి తెలిపారు. ఈ అదనపు చెల్లింపులపై రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం విచారణ నివేదిక అందిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. బ్లూ ఫ్లాగ్ బీచ్‌ల జాబితాలో రిషికొండ దేశంలో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ఎంపిక చేసిన 13 పైలట్ బీచ్‌ల జాబితాలో విశాఖలోని రిషికొండ కూడా ఉన్నట్లు పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిచ్చారు. అంతర్జాతీయ ఏజెన్సీ ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ అత్యంత కఠినమైన అంశాల ప్రాతిపదికన బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్‌ను జారీ చేస్తుందని చెప్పారు. బీచ్‌లో స్నానానికి వినియోగించే నీళ్ల నాణ్యత, బీచ్‌లో పర్యావరణ యాజమాన్యం, రక్షణ కోసం చేపట్టే చర్యల వంటివి ప్రధానమైన అంశాలని చెప్పారు. మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలి ఈ–సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు, మద్యం, జూదం వంటి మానవాళిని పీడిస్తున్న అన్నింటినీ నిషేధించాలన్నదే తమ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఆలోచన అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ నాయకులు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ–సిగరెట్ల నిషేధ బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. నికోటిన్ గుండెజబ్బు, క్యాన్సర్సహా అనేక వ్యాధులకు కారణమవుతున్నందున ఈ–సిగరెట్లను నిషేధించడం పూర్తి సమర్థనీయమని పేర్కొన్నారు. ఏపీలో 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం భారత్ మాల ప్రాజెక్టు కింద ఏపీలో రూ.12,766 కోట్ల వ్యయమయ్యే 13 రోడ్డు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా 506 కి.మీ. పొడవునా రహదారులు నిర్మించనున్నట్టు తెలిపారు. కడప స్టీల్‌కు ఐరన్‌ఓర్ సరఫరాకు అంగీకారమే వైఎస్సార్ జిల్లాలో స్టీల్ ప్లాంటుకు నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరా చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. సోమవారం ఆయన లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో బాలశౌరి మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం వైఎస్సార్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సాయంతో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ స్టీలు ప్లాంటుకు అతి దగ్గరలోనే బళ్లారి ఐరన్ ఓర్ లభ్యత ఉంది. అలాగే కృష్ణపట్నం పోర్టు, ఎన్నోర్ పోర్ట్‌ల ద్వారా ముడిసరుకు లామ్ కోక్‌ను దిగుమతి చేసుకోవచ్చు. దీనిని కేంద్ర మంత్రి పరిశీలిస్తారా?’ అని ప్రశ్నించారు. ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ ‘‘నేను ఇటీవల ఏపీకి వెళ్లినప్పుడు మిత్రుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ అంశాన్ని నా దృష్టికి తెచ్చారు. అంతకుముందు ఈ అంశాన్ని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వారికి దీర్ఘకాలంపాటు ఎన్ఎండీసీ నుంచి ఐరన్ ఓర్ సరఫరా కావాలి. ఈ ప్రతిపాదనకు కేంద్రం వంద శాతం అంగీకరిస్తోంది. మేం నిరంతరాయంగా సరఫరా చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కడపలో భారీ స్టీల్ ప్లాంటు నిర్మాణానికి తగిన పెట్టుబడిదారుడిని వెతుకుతుంది. అలాగే మేం కూడా వైజాగ్ ఆర్ఐఎన్ఎల్ ద్వారా ఒక కొత్త స్టీల్ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నాం..’అని మంత్రి పేర్కొన్నారు. ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయించాలి ట్యాక్సేషన్ (సవరణ) బిల్లుకు వైఎస్సార్సీపీ తరఫున మద్దతు పలుకుతున్నట్టు ఆ పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘కొత్తగా ఏర్పాటు చేయబోయే కంపెనీలకు 15 శాతం మాత్రమే ఆదాయ పన్ను వర్తింపజేస్తున్న ఈ బిల్లును మా ముఖ్యమంత్రి కూడా స్వాగతించారు. దీని వల్ల కొత్త కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. రూ.400 కోట్ల టర్నోవర్ పైబడి ఉన్న కంపెనీలకు కూడా.. ముఖ్యంగా భాగస్వామ్య కంపెనీలు, ఎంఎస్ఎంఈ కంపెనీలను కూడా తక్కువ పన్ను రేటు ఉండేలా చూడాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నా..’ అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వడంలో జాప్యం చోటు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత ఆదాయ పన్ను రూ.20 లక్షల వరకు మినహాయింపు ఇవ్వాలని కోరారు. ఆర్థికవృద్ధి నెమ్మదిస్తున్న ఈ తరుణంలో వ్యక్తిగత ఆదాయ పన్ను కూడా మినహాయించాలని కోరారు. -
అడ్డగోలు తవ్వకాలు
సాక్షి, ప్రకాశం : అక్రమార్కుల ఆగడాలకు ఏ ఒక్కటీ మినహాయింపు కాదు అన్నట్లు తయారైంది. కాంట్రాక్టర్లు అనుమతులకు మించి మట్టి తవ్వకాలు సాగిస్తూ ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీకి గండికొడుతున్నారు. నాగులుప్పలపాడు మండల పరిధిలో 3వ రైల్వే లైన్ నిర్మాణ పనుల అంచనాల్లో మట్టి, ఇసుక, ఎర్ర గ్రావెల్ తరలించేందుకు మైనింగ్ శాఖకు రాయల్టీ చెల్లించి సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే అనుమతి గోరంత, తవ్వుకునేది కొండంత అన్నట్లు ఉంది కాంట్రాక్టర్ల వాలకం. మైనింగ్ శాఖ నుంచి అమ్మనబ్రోలు రెవెన్యూ పరిధిలో అనుమతులు తీసుకొన్న కాంట్రాక్టర్ రాపర్ల రెవెన్యూ పరిధిలోని చవటపాలెం, రాపర్ల గ్రామాల్లో చాలా మేరకు అనధికారికంగా ఈ తవ్వకాలు చేపట్టారు. రైల్వే పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ గుట్టు చప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో పొక్లెయిన్ల సాయంతో మట్టి, ఎర్ర గ్రావెల్‌ను అక్రమంగా తరలిస్తూ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొడుతున్నాడు. ఈ తంతు కొన్ని రోజులుగా జరుగుతున్నా అధికారులెవ్వరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. అక్రమ తవ్వకాల విషయం కలెక్టర్ దృష్టికి రావడంతో సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికీ ఎవ్వరూ స్పందించకపోవడం, అధికారులు మామూళ్లు పుచ్చుకొనే ఆ వైపు వెళ్లడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. ఇదీ వాస్తవం.. గ్రామ సరిహద్దులోని ప్రాంతాల్లో అయితే 3 క్యూబిక్ మీటర్ల లోతుకి మించి తవ్వకాలు చేపట్టడానికి వీలులేదు. అయితే అనుకున్నదే తడవుగా సదరు కాంట్రాక్టర్ సుమారు 8 క్యూబిక్ మీటర్ల లోతున తవ్వకాలు చేపట్టారు. దీంతో మట్టి తీసిన చెరువులో భూగర్భ జలాలు కూడా బయట పడ్డాయి. భవిష్యత్‌లో ఈ కుంటల వలన చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. దీంతో పాటు మట్టి తవ్వకం చేపట్టిన పొలాలకు దగ్గర్లోని రైతులు తమ పొలాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాసుల కోసమే కక్కుర్తి.. గుంటూరు నుంచి నెల్లూరు జిల్లా వరకు రైల్వే 3వ లైన్ పనులు జిల్లాలో వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులకు కొంత మేరకు అనుమతులు తీసుకొని రాపర్ల రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 112, 114 లో కూడా ప్రభుత్వానికి సీనరేజి చెల్లించకుండా కాంట్రాక్టర్ రాత్రి సమయంలో గ్రావెల్, మట్టిని తరలిస్తున్నారు. మండలంలోని అమ్మనబ్రోలు, చవటపాలెం గ్రామాల్లో అక్రమ తవ్వకాలు జరుపుతుండటంతో అక్కడ నివశిస్తున్న గృహ యజమానులు, పశు పోషకులు ఆందోళన చెందుతున్నారు. అధికారికంగా తవ్వకాలు జరిపితే మైనింగ్ శాఖకు చెల్లించే రాయల్టీలో కొంత గ్రామ పంచాయతీకి జమ చేస్తారు. ఈ అక్రమ తవ్వకాలకు అనుమతులు లేకుండా జరుగుతుంటే ఆ ప్రాంత ప్రజా ప్రతిని«ధులు, అధికారులు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ఈ విషయంపై మైనింగ్ అధికారులను వివరణ కోరగా రైల్వే కాంట్రాక్టర్ కొద్ది మేర అనుమతులు తీసుకొని స్థాయి దాటి తవ్వకాలు చేస్తుంటే విజిలెన్స్ అధికారులతో విచారణ చేసి గట్టి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. -
ఆపిల్ నుంచి ఆ కాంట్రాక్టర్ల తొలగింపు
శాన్ఫ్రాన్సిస్కొ: ప్రముఖ మొబైల్ తయారీదారు ఆపిల్‌కు ‘సిరి’ కాంట్రాక్టర్లు కొత్త తలనొప్పులు తీసుకొచ్చారు. దీంతో ఆపిల్ కంపెనీ ఐర్లాండ్‌లోని తమ సంస్థలో పని చేస్తున్న దాదాపు 300 కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. తమ వినియోగదారులకు చెందిన సున్నితమైన విషయాలను 'సిరి' పోగ్రామ్ కాంట్రాక్టర్లు రహస్యంగా విని, ఆపిల్ సేవలను దుర్వినియోగ పరచిన కారణంగా వారిని తొలగించడంతో యూరప్ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశయైంది. ఆపిల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న కాంట్రాక్టర్లు, వినియోగదారులు - సిరితో చేసిన సంభాషణలు విని అది ఇచ్చే రెస్పాన్స్‌లో అవసరమైన మార్పులు చేయాలి. కానీ వారు వినియోగదారులు మాట్లాడుకునే వ్యక్తిగత శృంగార సంభాషణలు, డ్రగ్స్, బిజినేస్ డీల్స్‌ను కాంట్రాక్టర్లు పదేపదే విన్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దుమారం రేగడంతో ఆపిల్ కంపెనీ వెంటనే సిరి గ్రేడింగ్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసి కాంట్రాక్టర్లపై కొరడా ఝళిపించింది. తమ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో తీసుకొచ్చిన ‘సిరి’ సేవలను కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేశారని, వాటిలో రికార్డైన సంభాషణలను రహస్యంగా వింటున్నారని ఓ ప్రజావేగు(విజిల్ బ్లోయర్) గార్డియన్ పత్రిక ద్వారా తెలపడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు. దీనిపై ఆపిల్ వివరణ ఇస్తూ ‘తమ కంపెనీ ప్రధానంగా వినియోగదారుని భద్రతకి ప్రాధాన్యం ఇస్తుందని, ఈ ఘటనపై వినియోగదారులను క్షమాపణలు కోరుతున్నామని’ తెలిపింది. అంతేకాక సదరు కాంట్రాక్టర్లతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నామని వివరణ ఇచ్చింది. -
ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్లు
సాక్షి, ఆదిలాబాద్ : ఐటీడీఏలో ఉద్యోగులే కాంట్రాక్టర్ల అవతారమెత్తుతున్నారు. ఇష్టార్యాజంగా వ్యవహరిస్తూ అదే శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, గెస్ట్ హౌజ్‌ల పనులు టెండర్లు పిలవకుండానే పనులు చేపడుతున్నారని విమర్శలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఐటీడీఏ శాఖలోని ఉద్యోగులతో పనులు చేయించి బిల్లులు తీసుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. టెండర్లు లేవు.. ఆ శాఖ పరిధిలోని కార్యాలయాలు, స్కూళ్లు, ఇతర భవనాలు శిథిలావస్థకు చేరితే వాటిని మరమ్మతు చేయించడం మంచి పనే. కానీ దానికి ఓ పద్ధతి ఉంటుంది. ఆయా పనులకు ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ పనులను తక్కువ ధరకు చేయించేలా రూపకల్పన చేస్తారు. దాని ప్రకారం టెండర్లను ఆహ్వానిస్తారు. టెండర్లకు హాజరైన కాంట్రాక్టర్లలో ఎవరు తక్కువ ధరకు పనులు చేస్తారో వారికి పనులు అప్పగిస్తారు. పైగా పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఐటీడీఏ పరిధిలో పని చేసే ఇంజనీర్లు పర్యవేక్షిస్తారు. పద్ధతి ప్రకారం వారు రికార్డు చేస్తేనే కాంట్రాక్టర్‌కు బిల్లులు వస్తాయి. కానీ ఐటీడీఏ పరిధిలో జరుగుతున్న కొన్ని పనులకు టెండర్లు పిలువకుండానే వివిధ పనులను చేపట్టారని తెలుస్తోంది. ఉద్యోగులకు పనులు.. సర్వ సాధారణంగా ఏవైనా పనులు చేపట్టాలంటే సంబంధిత శాఖకు చెందని వారికి అప్పజెప్పాల్సి ఉంటుంది. కానీ ఐటీడీఏలో మాత్రం అలా జరగడం లేదని ఆరోపణలు లేకపోలేదు. సంబంధిత శాఖ ఉద్యోగులే కాం ట్రాక్టర్ల అవతారం ఎత్తినట్లు తెలుస్తోంది. లక్షల విలువైన పనులన్ని ఉద్యోగుల పేరిటే జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ఐటీడీఏ క్యాంపు కార్యాలయంతో పాటు గెస్ట్ హౌజ్, మరమ్మతులకు లక్షల రూపాయల ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అంతే కా కుండా వివిధ ఆశ్రమ పాఠశాలల్లో వైరింగ్, పే యింటింగ్, తదితర పనుల పేరిట అదే శాఖలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులకు పనులు అ ప్పజెప్పినట్లు తెలుస్తోంది. అయితే వీరికి ఓ అ« దికారి అండదండలు ఉన్నట్లు గుసగుసలు వి నిపిస్తున్నాయి. ఎన్నికల కంటే ముందు.. ఎన్నికల కోడ్ కంటే ముందు వివిధ సంఘాల నాయకులు ఐటీడీఏ గెస్ట్ హౌజ్‌కు మరమ్మతులు చేయాలని పలుమార్లు విన్నవించినా ఆ శా ఖ అధికారులు పట్టించుకోలేదని విమర్శలు న్నాయి. ఎన్నికల అధికారుల కోసం విశ్రాంతి భవనాలకు మరమ్మతులు చేస్తున్నామని అ ధి కారులు చెప్తున్నారు. ఎన్నికల కోడ్ అ మల్లోకి రాకముందు పట్టించుకోని అధికారులు కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత పనులు చేపట్టడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
రాజధానిలో రాబందులు
రాజధానిలో అర్ధరాత్రి వేళ రాబందులు తిరుగుతున్నాయి. ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుకుని తరలించుకుపోతున్నాయి. అడ్డుకట్ట వేయాల్సిన అధికారుల కళ్లను మామూళ్లు కమ్మేశాయి. రయ్యిమంటూ దూసుకుపోతున్న లారీలు, ట్రాక్టర్ల దెబ్బకు స్థానికుల గుండెలు అదురుతున్నాయి. కాంట్రాక్టర్లే ఇసుక మాఫియాతో కుమ్మక్కవడంతో ఈ అవినీతి కార్యకలాపాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బయటకు తరలుతున్న ఇసుక లారీలు ఒక్కొక్కటి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు పలుకుతున్నాయి. మొత్తంగా రాజధాని ప్రాంతంలో ఇసుక, మట్టి దోపిడీ వ్యవహారాలు చిమ్మచీకట్లో కలిసిపోతున్నాయి. తాడేపల్లిరూరల్: రాజధాని ప్రాంతంలో అర్థరాత్రి ఇసుక రాబందులు తిరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను, మట్టిని బయటకు పంపించి, ప్రతిరోజూ లక్షల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం కాంట్రాక్టర్లే మాఫియాతో చేతులు కలిపి ఇలాంటి దోపిడీకి పాల్పడుతున్నారని రాజధానిలో నివాసం ఉండే పలువురు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కృష్ణాయపాలెంలో కొండవీటివాగు పూడికతీత పనులు నిర్వహిస్తున్నారు. ఈ మట్టిని వాస్తవంగా వాగుకు ఇరువైపులా కట్ట ఏర్పాటుచేసి, దానిని పటిష్ఠ పరచాల్సి ఉంది. అలా చేయకుండా ఇష్టారాజ్యంగా రాత్రి సమయాల్లో వేలాది ట్రాక్టర్ల మట్టిని అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. వివిధ ప్రాంతాల్లో నిర్మాణం చేపట్టిన పనుల నిమిత్తం గతంలోనే ఇసుక తోలుకుని డంపింగ్ చేసుకున్నారు. సదరు కాంట్రాక్టర్లు, మాఫియా కుమ్మక్కై ఒక్కొక్క లారీ ఇసుక రూ.10 వేల నుంచి రూ.15వేల వరకు అమ్ముతూ రాజధాని ప్రాంతంలో రాత్రిపూట రయ్... రయ్...మని లారీలు నడుపుతూ ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు. మందడం, కృష్ణాయపాలెం మధ్య కేఎంఆర్ ప్రాజెక్ట్ వారు కాలువ తవ్వకాలను నిర్వహిస్తున్నారు. ఏకంగా వీరు కాలువ తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి, మట్టి కింద భాగంలో ఉండే ఇసుకను తోడుతూ పర్యావరణానికి సైతం హాని కలిగిస్తున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా నియంత్రించే అధికారే ఇక్కడ లేకపోవడం గమనార్హం. సోమవారం తెల్లవారుజామున ఇదే ప్రాంతంలో ఓ లారీ ఇసుక లోడు చేసుకుంటుండగా స్థానికులు అక్కడి నిర్వాహకుల్ని ప్రశ్నించారు. వారు తాము కేఎంఆర్ ప్రాజెక్ట్ స్టాక్‌యార్డ్‌కు ఇసుక తరలిస్తున్నామని చెప్పారు. స్టాక్‌యార్డ్ ఎక్కడ ఉందని ప్రశ్నించగా, మందడంలో ఉందని సమాధానమిచ్చారు. కానీ అక్కడ లోడ్ అవుతున్న లారీతో పాటు అప్పటికే లోడై ఉన్న మరో లారీ రెండూ కలిసి మంగళగిరి వైపు వెళ్లాయి. మంగళగిరి మండలం యర్రబాలెం వద్ద స్థానికులు ఆపి ప్రశ్నించగా కాజ దగ్గర కేఎంఆర్ ప్రాజెక్ట్ డంపింగ్‌యార్డ్ ఉందని, అక్కడకు వెళ్తున్నామని చెప్పారు. దీనిపై మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి రెండు లారీలను సీజ్ చేశారు. రాజధానిలో కనిపించని నిఘా... రాజధానిలో వివిధ పనులను నిర్వహించేందుకు వందలాది కంపెనీలు టెండర్ల ద్వారా పనులు దక్కించుకొని కాంట్రాక్ట్ వర్క్స్‌ను నిర్వహిస్తున్నారు. పనులు నిర్వహించే దగ్గర ఎటువంటి సెక్యూరిటీని నియమించలేదు. దాంతో సూపర్వైజర్గా వ్యవహరించేవారు అక్రమాలకు పాల్పడుతూ రాజధానిలోని సంపదను దోపిడీ చేస్తూ జేబులు నింపుకొంటున్నారు. ఉదాహరణకు కొండవీటి వాగు మట్టి తవ్వకాల్లో వచ్చిన మట్టిని రాజధాని ప్రయోజనాల కోసం వినియోగించకుండా వివిధ ప్రాంతాలకు ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సీఆర్డీఏ వారు కానీ, రెవెన్యూ శాఖ కానీ, గ్రామంలో ఉన్న మిగతా సిబ్బంది కానీ పట్టించుకోకుండా వారిచ్చిన పావలా, బేడా జేబులో వేసుకుంటూ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు రాజధాని ప్రాంతంలో నిర్వహించే పనుల్లో కాంట్రాక్టర్లు నిబంధనలకు నీళ్లొదిలి, తమ లాభార్జన కోసం పనిచేస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు. దీనికి నిదర్శనం మందడం నుంచి కృష్ణాయపాలెం మీదుగా కృష్ణానదిలో కలిసే వాగు పూడికతీత పనులే. నిబంధనలకు విరుద్ధంగా తవ్వాల్సిన దానికన్నా ఎక్కువ తవ్వి భూమిలోపల ఉన్న ఇసుకను బయటకు తీసి అమ్ముకుంటూ జేబులు నింపుకొంటున్నారు. ఇలాంటి పనులు నిర్వహించేటప్పుడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా కాలువలు తవ్వడం వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. -
బోధన్‌లో మున్సిపల్ కాంట్రాక్టర్ల ఆందోళన