
సాక్షి, హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ్టి(మంగళవారం) సమావేశంలో.. బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు.
సుమారు 43 మంది బీజేపీ కార్పొరేటర్లు నల్లబ్యాడ్జీలతో సమావేశానికి వచ్చారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను విడుదల చేయాలంటూ.. ప్లకార్డులతో కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు వాళ్లంతా. ఇదిలా ఉంటే..
కాంట్రాక్టర్ల జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. రూ. 800 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని వాళ్లంతా నిరసనలకు దిగారు. ఈ క్రమంలో.. పోలీసులకు, కాంట్రాక్టర్లకు మధ్య తీవ్రవాగ్వాదం నెలకొనగా, ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మరోవైపు కాంట్రాక్టర్లకు మద్దతుగా బీజేపీ కార్పొరేటర్లు నిరసనకు దిగారు.
ఇదీ చదవండి: కేసీఆర్‌కు అంబేడ్కర్‌తో పోలికా?
Comments
Please login to add a commentAdd a comment