అవినీతి టెండర్లే
ఇస్కా రోడ్ల పనులపై నిజమైన ‘సాక్షి’ కథనం
రింగై పనులు పంచుకున్న కాంట్రాక్టర్లు
వ్యూహాత్మకంగా ఎక్సెస్ టెండర్లు దాఖలు చేసిన వైనం
కాంట్రాక్టర్లతో కుమ్మకై ్కన ఆర్ అండ్ బీ అధికారి
పనుల పంపకాల్లో ఈయనే కీలకం
రోడ్ల టెండర్లలో అవినీతి ఏరులై పారింది. ప్రజాధనాన్ని ఆరగించేందుకు కాంట్రాక్టర్లు, అధికారులు సిద్ధమయ్యారు. దీనిపై ‘సాక్షి’ ప్రచురించిన కథనం నిజమని స్పష్టమైంది. రోడ్ల పనులకు దాఖలైన బిడ్లు తెరవక ముందే తమకు అనుకూలురైన కాంట్రాక్టర్లకు పంపకాలు చేశారు. ఇందులోకీలకంగా ఉన్న ఆర్‌అండ్ బీ అధికారి కనుసన్నల్లోనే లక్షల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల మేర ప్రజాధనం దుర్వినియోగమయ్యే పరిస్థితులు నెలకొన్నారుు.
తిరుపతి : ఎస్వీ యూనివర్సిటీలో జనవరి 3 నుంచి ఇండియన్ సైన్‌స కాంగ్రెస్ సభలు జరగనున్నారుు. రోడ్లు, భవనాల రిపేర్లు, మంచినీరు, విద్యుత్ సదుపాయాలతో పాటు ఇతరత్రా అవసరాల కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు రూ.100 కోట్లు కేటారుుంచారుు. దేశ విదేశాల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యే వీలున్నందున నగరంలోని పలు కీలక రోడ్లను బాగు చేరుుంచాలని ప్రభుత్వం నిర్ణరుుంచింది. రూ.9 కోట్ల అంచనా వ్యయంతో 5 కీలక రోడ్లకు రిపేర్లు చేరుుంచాలని ఆర్ అండ్ బీ అధికారులు ప్రతిపాదనలు తయారు చేశారు. అక్టోబరు 14న ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు కూడా పిలిచారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీగా అక్టోబరు 27ను నిర్ణరుుంచారు. అరుుతే అధికార పార్టీకి దగ్గరగా ఉండే కొందరు కాంట్రాక్టర్లు ముందుగానే పనుల కోసం పథకం పన్నారు. తిరుపతి ఆర్ అండ్ బీలోని ఓ కీలక అధికారి వీరికి సహకరించారు.
పనుల పంపకాల్లో ప్రధాన భూమిక పోషించారు. ఎవరెవరికి ఏఏ పనులు ఇవ్వాలో ముందే తేల్చేశారు. టెండర్లు తెరవక ముందే ఈ తంతు ముగిసింది. ఎస్వీ యూనివర్సిటీలో రూ.3.74 కోట్లతో పూర్తి చేయాల్సిన అంతర్గత రోడ్ల పనుల టెండరును దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ టెండర్లు ఓపెన్ కాక ముందే పనులు మొదలు పెట్టారు, కాంట్రాక్టర్ల సిండికేట్ వ్యవహారాలతో పాటు పనులు పంచుకున్న వైనాన్ని ఎండగడుతూ అక్టోబరు 27న ’అవినీతి దారులివి’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. తమ పన్నాగం బయట పడిందని భావించిన ఆర్ అండ్ బీ అధికారులు టెండర్లు తెరవడంలో కొంత జాప్యం చేశారు. ఆ తరువాత అగ్రిమెంట్‌లోనూ ఆలస్యం జరిగింది. వారం కిందటనే టెండర్లను ఖరారు చేసి పనులు అప్పగించారు. ముందుగానే అనుకున్నట్లు ఎవరెవరికి ఏఏ పనులు అప్పగించాలో ఆ పనులను వారికే దక్కేలా చేశారు. దీంతో టెండర్ల ప్రక్రియ అపహాస్యం పాలైంది.
అన్నీ ఎక్సెస్ టెండర్లే...
దాఖలైన టెండర్లన్నీ ఎక్సెస్‌వే. అంచనా వ్యయంపై 4.5 శాతం అధికంగా కోట్ చేశారు. ముందుగానే అవగాహనకు వచ్చిన కారణంగా లెస్ టెండర్లు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బీ చేపట్టే పనులు చాలా చోట్ల 10 నుంచి 20 శాతం లెస్‌కు దాఖలవుతుంటారుు. అరుుతే ఇక్కడ మాత్రం అన్నీ ఎక్సెస్ టెండర్లే కావడం విశేషం.