సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీరింగ్ పట్టభద్రులను కాంట్రాక్టర్లుగా మార్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సొంతంగా కాంట్రాక్టు పనులు చేపట్టేలా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్) ఆధ్వర్యంలో శిక్షణ ప్రారంభించింది. కనీసం 200 మందిని కాంట్రాక్టర్లుగా మార్చే ఈ కార్య క్రమంలో భాగంగా 80 మందికి తొలి విడత శిక్షణను అంబేడ్కర్ జయంతి రోజైన శుక్రవారం పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మూడు నెలల పాటు శిక్షణ పూర్తయ్యే లోపు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పరంగా ఒక్కో పనికి వర్క్ ఆర్డర్ ఇప్పిచ్చేలా ఏర్పా ట్లు చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అయితే అభ్యర్థులు ప్రభు త్వ పనుల కోసమే ఎదురుచూ డకుండా నిర్మాణరంగానికి సంబం ధించిన ప్రైవేటు పనులు కూడా పొందాలని సూచించారు.
80 మందితో తొలిబ్యాచ్..
ఈ శిక్షణ కోసం దాదాపు 220 మంది దరఖాస్తు చేసుకున్నారు. అందులో 180 మందిని ఇంటర్వూ్య చేసి 80 మందిని తీసుకున్నారు. న్యాక్ ప్రాంగణంలో రెండు నెలల శిక్షణ అనంతరం 15 రోజుల పాటు క్షేత్రస్థాయిలో పనుల పరిశీలన, మరో 15 రోజులు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగాల్లో కాంట్రాక్టు పనులపై తర్ఫీదు ఇస్తారు. కార్యక్రమంలో ఎంపీలు విశ్వేశ్వర్‌రెడ్డి, బాల్క సుమన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ బాలమల్లు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌కే జోషి, జయేశ్‌రంజన్, డిక్కి ప్రతినిధులు రవికుమార్, రాహుల్, టీఐఐ ప్రతినిధి రాజన్న, న్యాక్ డైరెక్టర్ జనరల్ భిక్షపతి, న్యాక్ ప్లేస్‌మెంట్ డైరెక్టర్ శాంతిశ్రీ తదితరులు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్లుగా ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఇంజనీర్స్
Published Sat, Apr 15 2017 3:22 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
Advertisement
Advertisement