గద్వాల: కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వాల పట్టింపులేనితనం.. వెరసి ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్‌స్కీం) చివరి ఆయకట్టు రైతాంగానికి ఏటా అన్యాయమే జరుగుతోంది. ఆరేళ్లుగా చక్కనీరు విడుదల కాకపోవడంతో సిరులు పండించే చివరి ఆయకట్టు భూముల్లో ఏటా రబీలో క్రాప్‌హాలిడే ప్రకటిస్తున్నారు. అదేదారిలో ఈ ఏడాది కూడా చివరి భూములకు సాగునీరు సాధ్యం కాదని, ఆరుతడి పంటలే వేసుకోవాలని జిల్లా సాగునీటి సలహా కమిటీ ప్రకటించింది.
జూరాల కుడి ప్రధానకాల్వ లింక్ ద్వారా ఆర్డీఎస్ చివరి ఆయకట్టు భూములు 20వేల ఎకరాలు ఉండగా, కేవలం ఎనిమిదివేల ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇవ్వనున్నట్లు బుధవారం జరి గిన ఐడీబీ సమావేశంలో జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. ఈ పరంపరలో 2008 నుంచి రెండోపంటకు దూరమైన ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు ఈ ఏడాది రబీ పంటకు నీళ్లందని పరిస్థితి కొనసాగింపుగా మారింది. ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు పూర్తిచేయకపోవడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆధునికీకరణలో భాగమైన ఒకటో ప్యాకేజీ పనులు మిగిలి ఉన్నాయి. గత జూన్ నెలలో పనులు ప్రారంభించగా కర్నూలు జిల్లా రైతులు అడ్డుకున్నారు. నదికి వరద రావడంతో ప్రభుత్వం అధికారులు ఆ సమస్య పరిష్కారాన్ని పక్కనపెట్టేశారు. మళ్లీ నదిలో నీళ్లు తగిన ఏప్రిల్ నెలలో పనులు చేసేందుకు యత్నిస్తే మళ్లీ అడ్డంకులు ఎదురయ్యాయి. ఇలా పనులు పూర్తికాకపోవడంతో ఎన్నేళ్లు ఆర్డీఎస్ రైతు లు రెండోపంటను కోల్పోవాలో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.
ఇవే చివరి భూములు
జూరాల కుడి ప్రధాన కాల్వ ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు నీళ్లు అందించేలా మానవపాడు మండలం జల్లాపురం స్టేజీ సమీపంలో జూరాల లింకును కలిపారు. జూరాల కుడి కాల్వ ద్వారా వచ్చే నీటిని ఈ లింకు కాల్వద్వారా 25వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉంది. జూరాల రిజర్వాయర్‌లోనూ నీటిమట్టం ఆయకట్టుకు పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆర్డీఎస్ లింకు ద్వారా కేవలం ఎనిమిదివేల ఎకరాల్లో రబీసాగులో అరుతడి పంటకు నీటిని అందించాలని నిర్ణయించారు. జల్లాపురం, బొరవెల్లి, మానవపాడు గ్రామాల పరిధిలోని ఆర్డీఎస్ చివరి ఆయకట్టుకు సాగునీరు అందనుంది.
నిధులిచ్చినా నిర్లక్ష్యమే..!
నిధులున్నా పట్టించుకోకపోవడం, కాం ట్రాక్టర్ల ఇష్టానికే వదలేయడం, సమీక్షలు నిర్వహించే శ్రద్ధ చూపకపోవడం, కర్ణాటకతో మన ప్రభుత్వం సంప్రదించకపోవడం.. ఇలా రోశయ్య, కిరణ్ సర్కారుల నిర్లక్ష్యంతో ఆర్డీఎస్ ఆయకట్టులో ఆరేళ్లుగా రైతులు రెండోపంటను కోల్పోతున్నారు. ఈ ఏడాది కూడా పనులు పూర్తవుతాయనే నమ్మకం లేదు. ఆర్డీఎస్ సమస్యపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయకట్టు పూర్తిగా కుదించికుపోయింది.
రెండు ప్రాంతాల రైతుల మధ్య ఘర్షణకు కారణమైంది. ఇదిలాఉండగా, ఆర్డీఎస్ సమస్యకు శాశ్వతపరిష్కారం చూపేందుకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో అధికారంలోకి రాగానే నిపుణుల కమిటీని నియమించా రు. ఆధునికీకరణ కోసం రూ.92కోట్లు మంజూరు చేశారు. పనులు నిర్వహించేం దుకు నిర్వహించేందుకు కర్ణాటకలో నాలుగు ప్యాకేజీలు, మన రాష్ట్రంలో నాలుగు ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. ఈ పరంపరలో కర్ణాటకలోని 1,2 ప్యాకేజీల్లో పనులను ప్రారంభించి వదిలేశారు. ఇలా పనులు ఏటా వాయిదా పడుతుండడంతో ఆర్డీఎస్ రైతులు రెండోపంటను కోల్పోతున్నారు.
వేసవిలో
పనులు పూర్తిచేస్తాం
ఆర్డీఎస్‌లో ప్రస్తుతం ఉన్న స్టాడింగ్ పంటలకు ఫిబ్రవరి వరకు నీటిని విడుదల చేస్తాం. అనంతరం ఆర్డీఎస్‌లో మిగిలిఉన్న ఆధునికీకరణ పనుల పూర్తికి ప్రాధాన్యమిస్తాం. జూరాల కుడి ప్రధానకాల్వ ద్వారా లింక్ నుంచి వచ్చేనీటిని రబీ సీజ న్‌లో ఆర్డీఎస్ చివరి భూముల్లో ఎని మిది వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం.
- ఖగేందర్, ఎస్‌ఈ
రబీలో క్రాప్‌హాలిడే
Published Fri, Dec 12 2014 1:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement
Advertisement