ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రహదారుల నిర్మాణ పనుల్లో నాణ్యతపై నిర్లక్ష్యం ప్రదర్శించే కాంట్రాక్టర్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడమే గాక వారి పేర్లను బ్లాక్‌లిస్టులో చేరుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు.
రోడ్డు పనులపై మంగళవారం ఆయన ఉన్నతస్థాయి సమీక్ష జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.10,800 కోట్లతో చేపడుతున్న మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు, రెండు లేన్లుగా సింగిల్ రోడ్ల విస్తరణ తదితర పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎర్రమంజిల్‌లో నిర్మిస్తున్న ఆర్ అండ్ బీ కొత్త భవనాన్ని అనంతరం మంత్రి సందర్శించారు.
‘ఆ కాంట్రాక్టర్లు’ బ్లాక్‌లిస్టులో: తుమ్మల
Published Wed, Apr 1 2015 3:19 AM | Last Updated on Thu, Aug 30 2018 5:57 PM
Advertisement
Advertisement