అవినీతి కొండ..వెలిగొండ
అవినీతి కొండ..వెలిగొండ
Published Mon, Jul 18 2016 2:59 PM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
– ప్రభుత్వ పెద్దలు, కాంట్రాక్టర్లు కుమ్మక్కు
– రూ.2,634 కోట్లకు పెరిగిన అంచనాలు
– పనులు చేయకుండానే బిల్లులు
– నత్తనడన అరకొర పనులు
– పూర్తికాని భూసేకరణ
– పునరావాసం గాలికి
వెలిగొండ ప్రాజెక్టు..మూడు జిల్లాల రైతాంగం కడగండ్లు తీర్చే వరప్రదాయిని. ఇప్పుడు అదే ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు, ప్రభుత్వ పెద్దలకు కల్పతరువుగా మారింది. ప్రాజెక్టు అంచనాలను ఉన్నపళంగా వేల కోట్లు పెంచేసి భారీ దోపిడీకి తెరలేపారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. కోట్ల రూపాయలు కరిగిపోతున్నా..ప్రాజెక్టు నిర్మాణం, పునరావాస పనులు నత్తకు నడకలు నేర్పుతున్నాయి.
వెలిగొండలో పెంచుకున్న అంచనాలు ఇవీ..
పనులు గతంలో అంచనాలు తాజా పెరిగింది
కోట్ల రూపాయల్లో
పా్యకేజీ 1లోని (టన్నెల్–1) రూ.624 రూ.934 రూ.306.39
పా్యకేజీ 2లో ఫీడర్ కెనాల్, తీగలేరు కెనాల్ రూ.254.50 రూ.688 రూ.434
పా్యకేజీ 3లో గొట్టిపడియ రూ.380 రూ.480 రూ.100
పా్యకేజీ 4లో కాకర్ల డ్యామ్ రూ.206 రూ.855 రూ.649
టన్నెల్–2లో ప్యాకేజీ నెం.5 రూ.735 రూ.1,031 రూ.296
పా్యకేజీ నెం.6లో తూర్పుప్రధాన కాలువ రూ.1135 రూ.1348 రూ.213
పా్యకేజీ నెం.7లో పశ్చిమ ఉపకాలువ రూ.757 రూ.975 రూ.218
మెుత్తం మీద పెరిగిన వ్యయం రూ.2,634
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
ప్రభుత్వ అధినేత, కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యారు. కోట్లు కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇబ్బడిముబ్బడిగా అంచనాలు పెంచి కోట్లు దోచుకుంటున్నారు. పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. మూడు జిల్లాల రైతాంగం ఎదురుచూస్తున్న వెలిగొండ ప్రాజెక్టు తాజా పరిస్థితి ఇది.
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు ముగుస్తోంది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ ఏడాది నుంచి బాబు మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. అంచనాలను మాత్రం భారీగా పెంచుకున్నారు. తొలుత నిన్న, మొన్నటి వరకు రూ.5,150 కోట్ల అంచనాలతో ఉన్న వెలిగొండ ప్రాజెక్టు వ్యయం తాజాగా రూ.7,784 కోట్లకు చేరింది. ఈ లెక్కన రూ.2,634 కోట్లు పెంచుకున్నారు. బాబు సర్కారు పెంచిన వెలిగొండ అంచనాలను చూసి సీనియర్ ఇంజినీరింగ్ ప్రముఖులే నివ్వెరపోతున్నారు. ఇదేం దోపిడీ అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.
నత్తనడకన భూసేకరణ
ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాలో విస్తరించిన ఉన్న వెలిగొండ ప్రాజెక్టు కింద డ్యామ్‌లు, రహదారులు, కాలువలు పరిధిలో మొత్తం 41,480 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసం గతంలో ప్రభుత్వం కేవలం రూ.508 కోట్లు మాత్రమే కేటాయింపులు చేయగా, చంద్రబాబు సర్కారు దీనిని రూ.970 కోట్లకు పెంచింది. గతంతో పోలిస్తే అదనంగా రూ.462 కోట్లు పెంచుకున్నారు. పోనీ భూసేకరణ అయినా వేగవంతంగా చేస్తున్నారంటే అది లేదు. బాబు రెండేళ్ల పాలనలో పట్టుమని 100 ఎకరాలు కూడా సేకరించలేదు.
పునరావాసం దోపిడీ
వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియ, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపునకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Advertisement