మిషన్ కాకతీయ తొలివిడతలో చాలా చోట్ల పనులు పూర్తి కాలేదని, దీనికి అధికారులే సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ మొదటి విడతలో చెరువుల మరమ్మతు కాంట్రాక్టు దక్కించుకుని పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్ లకు రెండోవిడత పనులను అప్పగించొద్దని, వారి పేర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు.
దౌల్తాబాద్ మండలం గాజులపల్లి కనకచెర్వు, టెంకంపేట అల్లీ చెర్వు, ముబారస్‌పూర్, బేగంపేట పనులను నాసిరకంగా చేశారని ఆరోపణలున్నాయని తెలిపారు. మొదటి విడత పనుల్లో జరిగిన లోటుపాట్లను గ్రహించి అధికారులు రెండోవిడత పనుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు.