rama linga reddy
-
‘కాంట్రాక్టర్ల పనులకు అధికారులే బాధ్యులు’
మిషన్ కాకతీయ తొలివిడతలో చాలా చోట్ల పనులు పూర్తి కాలేదని, దీనికి అధికారులే సమాధానం చెప్పాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హెచ్చరించారు. గురువారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ మొదటి విడతలో చెరువుల మరమ్మతు కాంట్రాక్టు దక్కించుకుని పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్ లకు రెండోవిడత పనులను అప్పగించొద్దని, వారి పేర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. దౌల్తాబాద్ మండలం గాజులపల్లి కనకచెర్వు, టెంకంపేట అల్లీ చెర్వు, ముబారస్పూర్, బేగంపేట పనులను నాసిరకంగా చేశారని ఆరోపణలున్నాయని తెలిపారు. మొదటి విడత పనుల్లో జరిగిన లోటుపాట్లను గ్రహించి అధికారులు రెండోవిడత పనుల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవన్నారు. -
కొనుగోలు కేంద్రాల్లో ప్రత్యేకాధికారులను నియమించాలి
మిరుదొడ్డి, న్యూస్‌లైన్ : దుబ్బాక నియోజక వర్గంలోని అన్ని గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి మండలానికో స్పెషల్ అధికారిని నియమించాలని దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన సోలిపేట రామలింగారెడ్డి తొలిసారిగా మంగళవారం మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ పథకాల అమలుకోసం స్పెషల్ అధికారులను నియమించినట్లుగానే కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా అధికారులను నియమించడానికి జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతుకు మద్దతు ధర కల్పించేలా ప్రోత్సాహించాలని కోరారు. సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించాలి ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాక ముందే రైతులకు సరిపడా ఎరువులు, విత్తనాలను సరఫరా చేయాలని ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అధికారులను కోరారు. నియోజకవర్గంలోని సాగు విస్తీర్ణతను బట్టి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ముందు జాగ్రత్త వహించాలని సూచించారు.కార్యక్రమంలో ఆయన వెంట పంజాల శ్రీనివాస్‌గౌడ్, లింగాల బాల్‌రెడ్డి, అందె సర్పంచ్ బుర్ర లింగంగౌడ్, గంగాధర్ గౌడ్, నంట బాపురెడ్డి, ఏవీ రవీందర్ తదితరులు ఉన్నారు. -
ప్రమాదాలలో భార త్ మొదటి స్థానం
బెంగళూరు, న్యూస్‌లైన్ : ప్రమాదాలు సృష్టించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలవడం చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... గత ఏడాది దేశంలో 34,93,803 ప్రమాదలు జరిగాయని, అందులో 1,38,250 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అదే విధంగా అదే ఏడాది కర్ణాటకలో 36,395 ప్రమాదాలు జరిగాయని 8,051 మంది మరణించాని అన్నారు. బెంగళూరు నగరంలో 5,217 ప్రమాదాలు జరిగితే అందులో 767 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి ఎక్కువ వాహనాలు ఉన్న దేశాలలో భారత్ 12వ స్థానంలో ఉందని అన్నారు. అయితే ప్రమాదాలు సృష్టించడంలో కూడా ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు. దేశంలో, రాష్ట్రంలో ప్రవ ూదాలు తగ్గించడానికి అనేక జాగృతి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామలింగారెడ్డి చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే వాహనాలలో నియమాలు ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. ఇటీవల నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని అన్నారు. వోల్వో బస్సుల లోపాల వలన ప్రమాదాలు జరిగాయా, డ్రైవర్ల నిర్లక్షం కారణంగా ప్రమాదాలు జరిగాయా అని దర్యాప్తు జరుగుతోందన్నారు. వోల్వో బస్సులలో డీజిల్ ట్యాంక్‌లు, ఏసీ మిషన్లు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెలుగు చూశాయని చెప్పారు. వోల్వో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చెయ్యాలని వోల్వో బస్సు కంపెనీ ప్రతినిధులకు సూచించామని అన్నారు. నియమాలు ఉల్లంఘించి బస్సులు తయారు చేస్తే వాటిని రోడ్డు మీద తిరగడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఇప్పటికే వాహన యజమానులకు 13 షరతులు విధించామని చెప్పారు. షరతులు ఉల్లంఘంచిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ డోర్లలో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చెయ్యడం పూర్తిగా నిషేధించామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు రావాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.