ప్రమాదాలలో భార త్ మొదటి స్థానం | india first place in road accidents | Sakshi
Sakshi News home page

ప్రమాదాలలో భారత్ మొదటి స్థానం

Published Wed, Jan 22 2014 1:47 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

india first place in road accidents

 బెంగళూరు, న్యూస్‌లైన్ :  ప్రమాదాలు సృష్టించడంలో ప్రపంచంలోనే భారత్ మొదటి స్థానంలో నిలవడం చాలా బాధాకరంగా ఉందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి అన్నారు. మంగళవారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో జరిగిన జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ... గత ఏడాది దేశంలో 34,93,803 ప్రమాదలు జరిగాయని, అందులో 1,38,250 మంది మృత్యువాత పడ్డారని గుర్తు చేశారు. అదే విధంగా అదే ఏడాది కర్ణాటకలో 36,395 ప్రమాదాలు జరిగాయని 8,051 మంది మరణించాని అన్నారు. బెంగళూరు నగరంలో 5,217 ప్రమాదాలు జరిగితే అందులో 767 మంది మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అతి ఎక్కువ వాహనాలు ఉన్న దేశాలలో భారత్ 12వ స్థానంలో ఉందని అన్నారు. అయితే ప్రమాదాలు సృష్టించడంలో కూడా ప్రపంచ దేశాలలో భారత్ మొదటి స్థానంలో ఉందని విచారం వ్యక్తం చేశారు.
 
  దేశంలో, రాష్ట్రంలో ప్రవ ూదాలు తగ్గించడానికి అనేక జాగృతి కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని రామలింగారెడ్డి చెప్పారు. స్కూల్ పిల్లలను తీసుకు వెళ్లే వాహనాలలో నియమాలు ఉల్లంఘించే వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని రావాణ శాఖ మంత్రి రామలింగారెడ్డి హెచ్చరించారు. ఇటీవల నాలుగు వోల్వో బస్సు ప్రమాదాలు జరిగాయని అన్నారు. వోల్వో బస్సుల లోపాల వలన ప్రమాదాలు జరిగాయా, డ్రైవర్ల నిర్లక్షం కారణంగా ప్రమాదాలు జరిగాయా అని దర్యాప్తు జరుగుతోందన్నారు.  వోల్వో బస్సులలో డీజిల్ ట్యాంక్‌లు, ఏసీ మిషన్‌లు నాసిరకంగా ఉన్నాయని విచారణలో వెలుగు చూశాయని చెప్పారు.
 
 వోల్వో బస్సులలో ఎమర్జెన్సీ డోర్లు, వాటర్ ట్యాంక్‌లు ఏర్పాటు చెయ్యాలని వోల్వో బస్సు కంపెనీ ప్రతినిధులకు సూచించామని అన్నారు. నియమాలు ఉల్లంఘించి బస్సులు తయారు చేస్తే వాటిని రోడ్డు మీద తిరగడానికి అనుమతి ఇవ్వమని స్పష్టం చేశారు. ప్రయాణికులను సురక్షితంగా తరలించడానికి ఇప్పటికే వాహన యజమానులకు 13 షరతులు విధించామని చెప్పారు. షరతులు ఉల్లంఘంచిన వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీ డోర్లలో ప్రకటనల బోర్డులు ఏర్పాటు చెయ్యడం పూర్తిగా నిషేధించామని మంత్రి రామలింగారెడ్డి తెలిపారు. సమావేశంలో రాష్ట్ర రోడ్డు రావాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement